Wednesday, December 7, 2016

ఓ మార్గశిరమాసంలో మంచు కురిసేవేళలో ..నా మనోభావనంలో విరిసిన ఈ చిరుకవనం .


శీతాకాలంలో, హేమంత ఋతువులో వచ్చే మొదటి నెల మార్గశిర మాసంలోకి అందరికీ స్వాగతం. 
మార్గశిర, పుష్య, మాఘం, ఫాల్గుణం మాసాల... శీతా కాలంలో 
మార్గశిర, పుష్య మాసాల... హేమంత ఋతువులో 
ఆధ్యాత్మికతని, ప్రకృతి సౌందర్యాన్ని, శాంతిని అందించే 
ఈ మార్గశిరమాస మంచు కురిసే శుభవేళలో 
మా భవన వనంలో 
గడిపిన మధురక్షణంలో 
నా మనోభావనంలో విరిసిన 
ఈ చిరుకవనం! మీ ఆనందం కోసం మీ ఆహ్లాదంకోసం!! 
తుషార బిందువుల చల్లని పన్నీరు చల్లుతూ 
హేమంతం విచ్చేసింది
భూదేవికి సీమంతం చెయ్యడానికి 
వస్తూ వస్తూ చేమంతులను 
బంతి పూబంతులను విరబూయించేసింది!
ఎందుకో ఓ కవి "మంచుకురిసే వేళలో మల్లె విరిసేదెందుకో" అన్నా
కాలం మాత్రం తన మానాన 
తన గమనంలో చిత్రంగా రంగులను మోసుకొస్తుంది! 
మన జీవితాలను 
వర్ణమయం రసమయం చెయ్యడానికి 
అందుకే యండమూరి "స్పందించే హృదయం ఉంటే కొలను గట్లమీద 
నిద్ర గన్నేరు పువ్వు చాలు చూస్తూ ఆనందించడానికి" అన్నారు
బ్రతుకుతెరువు పోరులో 
కాలంతో పాటే పరిగెడుతున్న మనమూ 
కాస్త ఆగి 
కాలం మనకి అందించే కళల, 
కలల లోకాన్ని ఆస్వాదిద్దాం!
గతంలో మా ఊరిలో మా ఇంటి తోటలో
బంతి పూబంతులలో అనుభూతించిన కొన్ని క్షణాలు 
మా మధుర జ్ఞాపకాలు 
మరో మారు నెమరేసుకునేవేళలో 
ఈ చిరుకవనం మెరిసే వేళలో 
నన్ను చిత్రంగా చిత్రించిన చిత్రాలు
శీతాకాలంలో, హేమంత ఋతువులో వచ్చే మొదటి నెల మార్గశిర మాసంలోకి అందరికీ స్వాగతం. సౌరమాన ప్రకారం ధనుర్మాసమని, చంద్రమానం ప్రకారం మార్గశిర మాసమని అంటారు. "మాసానాం మార్గశీర్షోహం" అని శ్రీకృష్ణపరమాత్మ 'భగవద్గీత' విభూతియోగంలో చెప్పాడు. శ్రీ మహా విష్ణువు కి ప్రీతికరమైన ఈ మాసం లో విష్ణు సహస్రనామ పఠనం అనంతకోటి పుణ్య ఫలితాలనందిస్తుంది. ఇక ధనుర్మాసంలో గోదాదేవి శ్రీరంగనాధునిపై పాశురాలు రూపంలో ఆరాధన తిరుప్పావై ధనుర్మాస ఉషోదయాలకు మేలుకొలుపు అవుతుంది. ఈ మంచుకురిసే వేళలో మీకోసం సత్యసాయి విస్సా ఫౌండేషన్.


















No comments:

Post a Comment

Total Pageviews