Sunday, December 4, 2016

పాత సామెత .... కొత్త సామెత :!!!

పాత సామెత: ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగమన్నాడట
కొత్త సామెత : ఎటిఎం లో డబ్బుల్లేవు, బ్యాంకు లో డబ్బుల్లేవు.. విత్ డ్రా లిమిట్ వారానికి ఇరవై నాలుగు వేలు చేసానన్నాడట

పాత సామెత: తోచీతోచనమ్మ తోటికోడలి పుట్టింటికి వెళ్ళిందట
కొత్త సామెత: తోచీతోచనమ్మ ఎస్బీఐ కార్డట్టుకుని ఐసిఐసిఐ బ్యాంకుకి వెళ్ళిందట

పాత సామెత : అత్త లేని కోడలుత్తమురాలు.. కోడల్లేని అత్త గుణవంతురాలు
కొత్త సామెత : వందనోటున్నోడుత్తముడోయి.. వెయ్యి నోటులేనోడు గుణవంతుడోయి

పాత సామెత : అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు
కొత్త సామెత : ఎటిఎం నిండా డబ్బులున్నా ఊరంతా పవర్ కట్టన్నట్టు

పాత సామెత : అవ్వా కావాలి బువ్వా కావాలి
కొత్త సామెత : వందా కావాలి.. రెండు వేలూ కావాలి

పాత సామెత : అరిచే కుక్క కరవదు
కొత్త సామెత : ఖాళీగా ఉన్న ఎటిఎం లో నోట్లుండవు

పాత సామెత : చదివేస్తే ఉన్న మతి పోయినట్టు
కొత్త సామెత : బ్యాంకు లో దాస్తే ఉన్న డబ్బు లేనట్టు

పాత సామెత : చక్కనమ్మ చిక్కినా అందమే
కొత్త సామెత : రెండు వేల నోటు చిక్కినా అందమే(ఆనందమే)

పాత సామెత : పరిగెత్తి పాలు తాగే కన్నా నిలబడి నీళ్లు తాగడం మేలు
కొత్త సామెత : పరిగెత్తి బ్యాంకుకి పోయే కన్నా నిలబడి అడుక్కోవడం మేలు

పాత సామెత : పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణ సంకటం
కొత్త సామెత : బ్యాంకు కు చెలగాటం.. కస్టమర్స్ కి ప్రాణ సంకటం

No comments:

Post a Comment

Total Pageviews