Tuesday, December 29, 2020

తెలుగు భాష ను మన ఇళ్ల లోనే వాడటం మానేశామా ?

 తెలుగు భాష ను మన ఇళ్ల లోనే వాడటం మానేశామా ?


డోర్ లాక్ చెయ్యకండి, నేను వెళ్తున్నా డోర్ లాక్ చేస్కో’, ‘నా కార్ కీస్ ఎక్కడ  ? ’ఇందులో ‘కీస్’ కు అచ్చ తెలుగు పదం వాడొచ్చు. కానీ మనం వాడం.


ఎందుకు ? 


ఓ ఇరవై యేళ్ళు వెనక్కి వెళితే, 

తలుపు తాళం వేసుకో, గడియ పెట్టుకో అనే వాళ్ళం. ఇవేకాదు, చిన్నతనంలో విన్న, వాడిన తెలుగు మాటలు మనమే మర్చిపోతున్నాం. నిన్న మొన్నటి వరకు మనం మాట్లాడిన మాటలు మన పిల్లల కు నేర్పించాల్సింది పోయి, మనమిలా ఎందుకు మారిపోయాం ?


మన తెలుగులో మాటలు లేవా ? 

ఎందుకు లేవు, భేషుగ్గా ఉన్నాయి !

కానీ మనం పలకం. 


వంటింటిని......కిచెన్ చేసాం. 

వసారా.....వరండాగా మారింది. 

ఇలా చావడి, పంౘ, ముంగిలి, నట్టిల్లు, తలవాకిలి, నడవ, పెరడు, ఇవన్నీ మరచిపోయాం.


మన ఇళ్ళ కు చుట్టాలు, బంధువులు రావడం మానేసారు. గెస్ట్‌ లే వస్తారు. 

ఆ వచ్చిన వాళ్ళు మనింట్లో అన్నం తినరు. ఏ లంచో, డిన్నరో చేస్తారు. 

భోజనానికి కూర్చున్నాక కంచాలు పెట్టటం మానేసి ప్లేట్లు పెడుతున్నాం. 

అందులో వడ్డించే వన్నీ.......

రైస్, కర్రీ, గ్రేవీ, ఫ్రై వగైరాలే.

అన్నం, కూర, ఇగురు, పులుసు, వేపుడు, తినండి అంటే, ఇంకేమన్నా ఉందా,  వాళ్ళేమనుకుంటారో అని భయం. అంగడి (కొట్టు) కి వెళ్ళేటప్పుడు సంచి తీసుకెళ్ళం. 

బ్యాగ్ పట్టుకుని షాప్‍ కు వెళ్తున్నాము. అందులో వెజిటబుల్స్, ఫ్రూట్స్ వేసుకుంటాము. కూరగాయలు, పళ్ళు కుళ్ళిపోయున్నాయి గదా మరి.


ఏమండీ మీ మనవరాలికి కానుపు అయ్యిందా అని ఆ మధ్య ఓ పెద్దావిడను అడిగా. ఏంటమ్మా డెలివరీ అయిందా అనకుండా నువ్వింకా కానుపు అంటావేంటి ? అని ఎదురు ప్రశ్న వేసింది. బిత్తరపోవడం నావంతయింది. 


టీ.వీ లో వచ్చే ఆరోగ్య కార్యక్రమాలు, 

వంటా - వార్పు కార్యక్రమాలు రోజూ చూసే వాళ్ళ కు అలవోకగా ఆంగ్ల పదాలు పట్టుబడతాయి మరి. 

అందుకే ఆవిడ అలా అని ఉండొచ్చు. 


టీ.వీ వంటల కార్యక్రమం లో ఒకావిడ మన కు వంటకం ఎలా చెయ్యాలో చెబుతుంది. 

అది ఏ భాషో మీరే చెప్పండి. 

‘కొంచెం సాల్ట్, మిర్చీపౌడర్, ధనియాపౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్‍చేసి ఫైవ్ మినిట్స్ కుక్ చెయ్యలి, స్టౌవ్ ఆఫ్‍ చేసి మసాలా పౌడర్ యాడ్ చేసి బాగా మిక్స్ చెయ్యాలి.’ ఇలాసాగుతుంది. 

మరి మన కూరల కు అల్లం, వెల్లుల్లి, ఉప్పూ, కారాల రుచులు ఎలా తగుల్తాయి?


నిన్న మా పక్కింటాయన వచ్చి 

‘మా సిస్టర్స్ సన్ ది మేరేజ్ ఉందండి, ఊరికి వెళ్తున్నాం, ఇల్లు కాస్త చూస్తుండండి’ అని చెప్పి వెళ్ళాడు. 

మేనల్లుడి పెళ్ళి అనడంలో ఎంత దగ్గరితనం ఉంటుంది ? ఎందుకిలా ముచ్చటైన పదాల్ని వాడటానికి కూడ మనం వెనుకాడుతున్నాం ?

అమ్మ, నాన్న అని పిలవడం ఎప్పుడో మానేసాం. అత్త, మామ, బాబాయ్, పిన్ని, పెద్దమ్మ, పెదనాన్న 

అందరూ పోయి ఆంటీ అంకుల్ మిగిలారు. ఇప్పుడు అక్క, అన్నా, బావ, మరిది, వదిన, మరదలు వగైరాలంతా దూరమై కజిన్స్ అయిపోయారు.


పిల్లల్ని బడికి పంపడం కూడ మానేసాం. స్కూల్‍ కు పంపిస్తాం. 

సరే బడికి వెళ్ళాక వాళ్ళకు ఎలాగూ ఇంగ్లీషు లో మాట్లాడక తప్పదు. 

ఇంటి దగ్గరన్నా తెలుగు మాటలు మాట్లాడాలని అనుకోము. 


మనం ఎందుకు నిన్నటి వరకు వాడిన తెలుగు మాటలను వదిలేస్తున్నాం ? ఎక్కువ ఇంగ్లీషు పదాలు వాడితే మనకు సమాజంలో గౌరవం లభిస్తుంది అనుకుంటున్నామా ? తెలుగు మాటలు మనకు మొరటుగా ఎందుకనిపిస్తున్నాయి ? ఇది పరభాషా వ్యామోహం మాత్రమే కాదు, నాకూ ఇంగ్లీషు ముక్కలు వచ్చు, నేనేం తక్కువ కాదు అని మనకి మనం చెప్పుకోవడం, 

ఇతరులు అనుకోవాలన్న భావన.


ఇలా ఆలోచిస్తాం కాబట్టే మన తెలుగు భాషకు దిక్కులు లేకుండా పోయాయి. ఇప్పుడు మాత్రం పల్లెలు పట్టణాలు అనే తేడా లేకుండా అందరికీ ఇంగ్లీష్ మాటలు బాగా వంటపట్టాయి.


అలాగని వాడుకలో ఉన్నమాటలను వదిలేసి పరభాషా పదాలు వాడటం వల్ల భాష క్షీణించి పోతుంది. బయటకెళితే ఎలాగు తప్పదు అనుకున్నా, కనీసం ఇంటి గోడల నడుమైనా ఆపని చేద్దాం. అవసరం లేని ఆంగ్ల పదాలకు డోర్ లాక్ చేసి, అచ్చ తెలుగు మాటలకు తలుపులు తెరుద్దాం.

Monday, December 28, 2020

సమయం గడిచిపోయింది, ఎలా గడిచిందో తెలియదు, ఇవన్నీ..జరిగిపోయాయి.. కానీ కాలం ఎలా గడిచిందో..తెలియనేలేదు. It's truth of life.

 సమయం  గడిచిపోయింది, 

 ఎలా  గడిచిందో తెలియదు, 

జీవితమనే..పెనుగులాటలో..... వయసు  గడిచిపోయింది  తెలియకుండానే.


భుజాలపైకి..ఎక్కే పిల్లలు  భుజాలదాక వచ్చేశారు.

   తెలియనేలేదు..

 

అద్దె ఇంటి నుండి  చిన్న గా మొదలైన  జీవితం. 

ఎప్పుడు  మన ఇంట్లో కి వచ్చామో తెలియదు


ఆయాసంతో   సైకిల్  పెడల్ కొడుతూ..కొడుతూ..

కారు లో తిరిగే స్ధాయి కి ఎప్పుడొచ్చామో తెలియదు


ఒకప్పుడు  తల్లిదండ్రుల బాధ్యత  మాది.

కానీ 

ఇప్పుడు  నాపిల్లలకు  నేను బాధ్యత గా మారాను 

ఇది కూడా  ఎలా  జరిగిందో  తెలియదు. .


ఒకప్పుడు   పగలు  కూడా  హాయిగా  నిద్ర పోయే వారం..

కానీ..

ఇప్పుడు  నిద్ర రాని  రాత్రులు  ఎన్నో..

ఇది కూడా ఎలా జరిగిందో తెలియదు. 


ఒకప్పుడు  నల్లని కురులనుచూసుకొని  గర్వంగా  వగలు పోయే వాళ్ళం..

అవన్నీ  ఎప్పుడు  తెల్లగా  మారాయో తెలియదు. 


  ఉద్యోగం  కోసం  తిరిగి  తిరిగి  ..

    ఎప్పుడు  రిటైర్  అయ్యామో..

తెలియనేలేదు.


పిల్లల కోసం  ప్రతిదీ  అని ఎంత తాపత్రయం  పడ్డామో..

వాళ్ళు  ఎప్పుడు  దూరంగా  వెళ్లి పోయారో తెలియదు. 


రొమ్ము విరుచుకొని అన్నదమ్ముల,అక్కచెల్లెండ్ల  మధ్య  గర్వంగా  నడిచే వాడిని  ఎప్పుడు  అందరూ...దూరమయ్యారో తెలియదు. 


ఇప్పుడే   ఆలోచిస్తున్నాను..నా కోసం..నా శరీరం  కోసం   ఏమైనా  చేసుకోవాలని..

కానీ..

శరీరం  సహకరించడం లేదు. 


    ఇవన్నీ..జరిగిపోయాయి..

కానీ  కాలం  ఎలా  గడిచిందో..తెలియనేలేదు. 


It's  truth  of life.

Sunday, December 27, 2020

చిన్నారి కీర్తన! చిరంజీవ! సుఖీభవ!! దీర్ఘాయుష్మాన్‌ భవ!!!

 పిల్లలు దేవుడు చల్లనివారే..కల్లకపటమెరుగని కరుణామయులే...

చిన్నారి కీర్తన! చిరంజీవ! సుఖీభవ!! దీర్ఘాయుష్మాన్‌ భవ!!!

తేట తేట తెలుగులా తెల్లవారి వెలుగులా 

తేరులా సెలయేరులా కలకలా గలగలా కదలి వచ్చింది ఓ చిన్ని అప్సర

ఈ సాయంత్రం వచ్చి నిలిచింది మా కనుల ముందర

నిదురించే తోటలోకి ఓ పాటలా వచ్చింది ఈ చిన్నారి కీర్తన  

ఉన్న కాసేపూ రమ్యంగా మా కుటీరాన రంగవల్లులల్లింది 

కమ్మటి కల బహుమతిగా ఇచ్చింది

శూన్యమైన వేణువులో ఒక స్వరం కలిపి నిలిపింది 

తెలుగువారి ఆడపడుచు ఎంకిలా 

ఎంకి కొప్పులోని ముద్దబంతి పువ్వులా 

ఉన్న ఆ కాసేపు చిరునవ్వులతో అలరించింది 

గోదారి కెరటాల గీతాలు నాలో పలికించింది 

చల్లగా చిరుజల్లుగా జలజలా గలగలా కదలి వచ్చింది ఈ చిన్నిఅప్సర

ఊహలన్ని రెక్కలొచ్చి ఎగిరి ఎక్కడెక్కడి అక్షరాలనో ఇలా ఏరుకొచ్చాయి   

లోలోన నాలోన ఎన్నెన్నో రూపాలు వెతికి వెలికి తీసాయి 

వీణలా నెరజాణలా కలకల గలగలా కదలి నవ్వింది ఈ చిన్ని అప్సర

తటపర్తి రాజగోపాలన్ గారి ఓ గజల్‌నూ గుర్తుచేసింది 

ఉందో లేదో స్వర్గం నా పుణ్యం నాకిచ్చేయ్‌ 

సర్వస్వం నీకిస్తా నాబాల్యం నాకిచ్చెయ్

అమ్మ గుండెలోదూరి ఆనందంతో తుళ్ళి

ఆదమరచి నిదరోయే ఆ సౌఖ్యం నాకిచ్చెయ్

కేరింతలతో కుదిపి బుల్లి బొంతలు తడిపి

ఊయల కొలువులు ఏలే ఆ రాజ్యం నాకిచ్చెయ్

చెత్తను వేసెబుట్ట ఆట సామను పుట్ట

విరిగినవన్నీ నావే నా మాన్యం నాకిచ్చెయ్

అమ్మ లాలనకు ముందు బ్రహ్మ వేదాలు బందు

ముక్తి కేలనే మనసా బాల్యం కోసం తపస్సు చెయ్

చూచిన వన్నీ కోరుతూ ఏడుస్తుంటే రాజా

అమ్మ పెట్టిన తాయిలం ఆ భాగ్యం నాకిచ్చెయ్

"నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లలు" అన్న తిలక్‌ 

పలుకులు మననం చేసుకుందాం! చిన్నారుల బాల్యాన్ని టి.వి, కంప్యూటర్‌, సెల్ల్‌ల్లో బందీ చెయ్యకుండా 

అందంగా, ఆనందంగా ఎదగనిద్దాం!
















యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా: 

అన్న వేదవాక్యాన్ని నిత్యం మననం చేసుకుంటూ స్త్రీమూర్తులను గౌరవిద్దాం!

ఉన్న కాసేపు నాలో ఎన్నెన్నో భావాల అలజడులు లేపిన

                                     చిన్నారి చిట్టితల్లి కీర్తనా చిరంజీవ! సుఖీభవ!! దీర్ఘాయుష్మాన్‌ భవ!!!                                 ఇలా అమాయకపు చిరునవ్వులు చిందిస్తూ నిండు నూరేళ్ళు సుఖంగా ఆనందంగా వర్ధిల్లు చిట్టితల్లీ అని అశీర్వదించండి!!

Friday, December 25, 2020

ప్రణీత్‌ పరిణత ప్రావీణ్యత నిపుణ నరేంద్ర కుమారా! జయోస్తు! విజయోస్తు!! దిగ్విజయోస్తు!!

ప్రణీత్‌ పరిణత ప్రావీణ్యత నిపుణ నరేంద్ర కుమారా    

జయోస్తు! విజయోస్తు!! దిగ్విజయోస్తు!!

ఇల్లలుకుతూ పేరు మర్చిన ఈగలా 

సొంతిల్లు కోసం చెప్పులరిగేలా తిరిగిన ముళ్ళబాట 

తిరగేస్తే పూలబాటగా చరిత్ర తిరగరాస్తే 

ప్రణీత్‌ పరిణత ప్రావీణ్యత నాణ్యత 

వందలాది ఎకరాల్లో సదనాలు

ఎన్నోనందనవన నిలయాలు

అందుబాటులో ఆనంద ఆలయాలు 

నమ్మకానికి ఆనవాళ్ళు ఆ తెలుగు లోగిళ్ళు వాకిళ్ళు 

ఎక్కడ కడప జిల్లాలోని చాపాడు గ్రామం

ఆరుగురి సంతానంలో చిన్నవాడు 

చిన్ననాటి నుంచి కష్టాలను ఇష్టంగా మలుచుకున్నవాడు  

చదువు కోసం పెద్దన్న ప్రోద్బలం, ప్రోత్సాహం అంది పుచ్చుకున్నవాడు 

భాగ్యనగర జీవనం చదువుల్లో రాణించి  

అద్దె ఇంటి బాధలు తీరి సొంతింటి కలలు తీరే క్రమంలో 

ఎన్నో ఉద్యోగాలు వరించినా ఎందరికో సొంతిటి కలలు తీర్చు కలల రాకుమారా 

అనుభవం పెట్టుబడిగా 

అందుబాటు ధరల్లో నాణ్యమైన సదనాలు కట్టే దిట్టగా 

పెద్దపేరు పేరు తెచ్చుకున్న నరేంద్ర కుమారా  

ఉన్నత ఆలోచన ఉత్తమ ఆచరణ 

బంధుమిత్ర ప్రేమ సామ్రాజ్య  

కామరాజ రాకుమారా  

ఐంతింతై ఎదిగిన త్రివిక్రమా  

ఎదిగిన కొద్దీ ఒదిగే పరాక్రమా 

ఇంకా ఎదగాలి మరెంతో ఎదగాలి 

ఎందరి ఆశలో ఇంధనంగా 

నింగే సరిహద్దుగా మీ ఆశయాల సాధనలో 

ప్రణీత్‌ పరిణత ప్రావీణ్యత నిపుణ నరేంద్ర కుమారా   

జయోస్తు! విజయోస్తు!! దిగ్విజయోస్తు!!

పంచ్ ..పంచ్ మీద పంచ్ (1) అబ్బాయ్ శాస్త్రిగారి ఇల్లు ఎక్కడవుంది బాబు (ఎక్కడా అంటే ఆయన యిల్లుమీద ఎక్కడండి అంటాడేమొననని ముందుజాగ్రత్తగా)

 పంచ్ ..పంచ్ మీద పంచ్

(1) అబ్బాయ్ శాస్త్రిగారి ఇల్లు ఎక్కడవుంది బాబు (ఎక్కడా అంటే ఆయన యిల్లుమీద  ఎక్కడండి అంటాడేమొననని ముందుజాగ్రత్తగా) 

మాయింటి పక్కనేనండి

అలాగా మరిమీయిల్లు ఎక్కడవుంది

శాస్త్రిగారి యింటిపక్కనే

(2) రైలు వేగంతగ్గింది. పైబెర్తుమీద పడుకున్న ప్రయాణీకుడికి గబుక్కున మెలుకువ వచ్చి, కిందికూర్చున్న కుర్రాణ్ణి అడిగాడు

ఒరే అబ్బాయ్ వచ్చేది ఏమిటి?

స్టేషనండి

తెలుసులేరా. ఏంస్టేషను ?

రైల్వేస్టేషను

(3) భార్య ఏమండీ పనసాయకూర ఎలావుంది 

నామొహంలావుంది

అయ్యో అంత అసహ్యంగావుందా

(భర్తకు వళ్ళుడింది మరొకసారి భర్త రివర్సు పంచ్ ఇద్దామని వేచియుండగా)

భార్య:  ఏమండీ మీకు యిష్టమని ములక్కాడ, ఉల్లిపాయ, బంగాళాదుంపలు MTR మషాలాపొడి వేసి సాంబారు చేసా. ఎలావుందో రుచిచూసి చెప్పండి

భర్త(ఆ దొరికావులే అనుకొని) నీమొహంలావుంది.

భార్య: పోనిలెండి  ఇప్పటికైనా మెచ్చుకున్నారు

(ఒక మనవి ఇవి నేను విన్నవే. ఎక్కడ, ఎప్పుడు ఆవివరాలు గుర్తులేవుకాని ఈ పంచ్ వాక్యాలు గుర్తున్నాయి.) 

(నవ్వు అరోగ్యానికి మంచిదిట)

వేదములు మరియు ఉపనిషత్తులు ఎవరూ మానవులు రచించినవో లేక వ్రాసినవి కాదు. మానవ సృష్టి మరియు మనుగడకు దేవలోకంలో ఆవిర్భవించినవి.

వేదములు మరియు ఉపనిషత్తులు ఎవరూ మానవులు రచించినవో లేక వ్రాసినవి కాదు.
మానవ సృష్టి మరియు మనుగడకు దేవలోకంలో ఆవిర్భవించినవి.

ఈ క్రింద ఇవ్వబడిన ఆశీర్వాద శాంతి మంత్రములు, మన ఉపనిషత్తులలో చెప్పబడినవి. వీటిని నేటి కాలంలో పూజలు, యజ్ఞాలు, యాగాలు, హోమాలు పూర్తి అయిన తరువాత చదువుతున్నారు. కానీ పూర్వ కాలంలో గురుకుల విద్యాభ్యాసం ఉన్న రోజుల్లో ప్రతిరోజూ గురు శిష్యులు కలిసి విశ్వం శాంతి, శుభం మరియు క్షేమం కొరకు పఠించేవారు. వేదపండితులు మరియు బ్రాహ్మణుల ద్వారా పఠించబడే ఈ ఆశీర్వాద శాంతి మంత్రములు సమాజంలో, శ్రేయస్సును, శాంతిని, శుభాన్ని పెంచడానికి ఖచ్చితంగా దోహదం చేస్తాయి. వీటి అర్ధం తెలుసుకోవడం ప్రతి ఒక్కరికి ఆవశ్యకత వుంది

🌺🌺🌺🌺🌺🌺🌺🌺

👉ఓం సహనావవతు, సహనౌ భునక్తు, సహవీర్యం కరవావహై
తేజస్వినా వధీతమస్తు మావిద్విషావహై
ఓం శాంతి: శాంతి: శాంతి:..!

తాత్పర్యం:
సర్వ జీవులు రక్షింపబడుదురు గాక.! సర్వ జీవులు పోషింపబడుదురు గాక.!
అందరూ కలిసి పని చేయుగాక.!
(అందరూ సమాజ శ్రేయస్సు కోసం)
మన మేధస్సు వృద్ది చెందు గాక.!
మన మధ్య విద్వేషాలు రాకుండుగాక..!
ఆత్మా (వ్యక్తిగత) శాంతి, దైవిక శాంతి, ప్రాకృతిక శాంతి కలుగు గాక.!
*****************************

👉ఓం సర్వేషాం స్వస్తిర్భవతు..!
ఓం సర్వేషాం శాంతిర్భవతు..!
ఓం సర్వేషాం పూర్ణం భవతు..!
ఓం సర్వేషాం మంగళం భవతు..!

తాత్పర్యం:
అందరికి ఆయురారోగ్య సుఖసంతోషములు కలుగుగాక..!
అందరికి శాంతి కలుగు గాక..!
అందరికి పూర్ణ స్థితి కలుగుగాక..! సర్వులకు శుభము కలుగుగాక..!
*****************************

👉ఓం సర్వేత్ర సుఖిన: సంతు,
సర్వే సంతు నిరామయా,
సర్వే భద్రాణి పశ్యన్తు మాకశ్చి: దుఃఖ:మాప్నుయాత్...

తాత్పర్యం:
అందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లు గాక..!
అందరూ ఏ బాధలు లేక ఆరోగ్యంతో ఉండు గాక..!
అందరికీ ఉన్నత స్థితి కలుగు గాక..!
ఎవరికీ ఏ బాధలు లేకుండు గాక..!
*****************************

👉కాలే వర్షతు పర్జన్య: పృథివీ సస్య శాలినీ
దేశోయం క్షోభ రహితో, బ్రహ్మణా సంతు నిర్భయ:

తాత్పర్యం:
మేఘాలు సకాలములో కురియు గాక. భూమి సస్యశ్యామలమై పండు గాక. దేశములో ఎవరికీ ఏ బాధలు లేకుండు గాక. బ్రాహ్మణులూ, వారి సంతతి  నిర్భయులై జీవింతురు గాక. 
*****************************

👉ఓం అసతోమా సద్గమయ..!
తమసోమా జ్యోతిర్గమయ..!మృత్యోర్మా అమృతంగమయ..!
ఓం శాంతి: శాంతి: శాంతి:

తాత్పర్యం:
సర్వవ్యాపి, నిరాకారుడైన భగవంతుడా, మమ్ములను అందరినీ, అన్యాయము, అధర్మం మరియు అసత్యము నుంచి న్యాయం, ధర్మం మరియు సత్యము వైపునకు గొనిపొమ్ము. అజ్ఞానమనే అంధకారము నుండి సజ్ఞానస్వరూపమైన వెలుగునకు దారి చూపుము. మృత్యు భయము నుండి శాశ్వతమైన అమృతత్వము దిశగా మమ్ము నడిపించుము.
*****************************

👉స్వస్తి ప్రజాభ్య: పరిపాలయంతాం, న్యాయేన మార్గేన మహీం మహీశా,
గో బ్రాహ్మణేభ్య: శుభమస్తు నిత్యం, లోకా: సమస్తా సుఖినో భవంతు..!

తాత్పర్యం:
ప్రజలకు శుభము కలుగు గాక..!
ఈ భూమిని పాలించే ప్రభువులందరూ ధర్మం మరియు న్యాయ మార్గంలో పాలింతురు గాక..!
గోవులకు, బ్రాహ్మణులకు సర్వదా క్షేమము, సంతోషము మరియు శుభము ప్రతిరోజూ కలుగునట్లుగా పాలింపబడుదురుగాక..!
జగతి లోని సర్వ జనులందరూ సదా సుఖ సంతోషాలతో వర్దిల్లెదరు గాక..!
*****************************

👉ఓం శం నో మిత్ర: శం నో వరుణ:
ఓం శం నో భవత్వర్యమా:
శం నో ఇంద్రో బృహస్పతి:
శం నో విష్ణు రురుక్రమ:
నమో బ్రాహ్మణః
నమో వాయు:
త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి
త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి
ఋతం వదిష్యామి, సత్యం వదిష్యామి
తన్మామవతు తద్వక్తారమవతు
అవతు మాం, అవతు మక్తారం
ఓం శాంతి: శాంతి: శాంతి:..!

తాత్పర్యం:
సూర్యుడు, వరుణుడు, యముడు, ఇంద్రుడు, బృహస్పతి, విష్ణువు వీరందరూ మన యెడల ప్రసన్నం అగుదురు గాక..!
బ్రాహ్మణులకు వందనం. వాయుదేవునకు వందనం.
నీవే ప్రత్యక్ష బ్రహ్మవు.
నేను బ్రహ్మమునే పలికెదను. సత్యమునే పలికెదను.
సత్యము మరియు బ్రహ్మము నన్ను రక్షించు గాక..!
నా గురువులను, సంరక్షకులను రక్షించు గాక..!
*****************************

👉ఓం ద్యౌ శాంతి:..!
అంతరిక్షం శాంతి:..!
పృథివీ శాంతి:..!
ఆపా శాంతి:..!
ఔషదయ శాంతి:..!
వనస్పతయ: శాంతి:‌..!
విశ్వే దేవా: శాంతి:..!
బ్రహ్మ శాంతి:..!
సర్వం శాంతి:..!
శాంతి రేవా: శాంతి:..!
సామా: శాంతిరేది :..!
ఓం శాంతి: శాంతి: శాంతి:..!

తాత్పర్యం:
స్వర్గము నందు, దేవలోకము నందు, ఆకాశము నందు, అంతరిక్షము నందు, భూమి పైన, జలము నందు, భూమి పై ఉన్న ఓషధులు మరియు వనమూలికలు,
అన్ని లోకము లందలి దేవతలయందు, బ్రహ్మ యందు, సర్వ జనులయందు, శాంతి నెలకొను గాక..!
పంచభూతముల ప్రకృతి వలన కాని,  బ్రహ్మ మొదలగు దేవతల వలన కాని, అపాయములు కలుగకుండును గాక..! శాంతి యందె శాంతి నెలకొను గాక..! నాయందు శాంతి నెలకొను గాక..!

పైన చెప్పిన ఆశీర్వాద శాంతి మంత్రములు అందరూ తప్పక చదివి అర్ధం చేసుకోండి. మన భారతీయ సంస్కృతీ ఎంత గొప్పదో తెలుస్తుంది. మన కోసమే కాక, అందరి క్షేమం కోసం, సర్వ ప్రాణుల సుఖ సంతోషాల కోసం పఠింపబడుతున్నవి.

ధర్మో రక్షతి రక్షితః...!
ధర్మో రక్షతి రక్షితః...!
ధర్మో రక్షతి రక్షితః...!

అనగా, అందరూ వారి వారికి నిర్దేశించిన ధర్మమార్గములో జీవనం కొనసాగిస్తూ వుంటే, ఆ ధర్మమే, ఎలాంటి దుష్టాంతరాలు రాకుండా, మొత్తం ప్రపంచాన్ని అన్ని విధాలా తప్పక కాపాడుతుంది అని..!


* * * సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు * * *

*****************************

🙏భవదీయుడు🙏
ముక్తాపురం వేంకట కృష్ణమోహన్
+91 9704440791
👉 ఇప్పటికి దాదాపు 2490 మంది సభ్యులు వున్న మా గ్రూపులు👇
(శ్రీవైష్ణవం శరణాగతి 1/2/3/4/5/6,
ఆధ్యాత్మికం సనాతనం 1/2/3/4
ఓం శైవం శివోహం 1/2 )

అంతరించిపోతున్న బజ్జీసాంప్రదాయం బాధపడుతున్నవారు: కాలనాధభట్తవీరభద్రశాస్త్రి

అంతరించిపోతున్న బజ్జీసాంప్రదాయం

బాధపడుతున్నవారు: కాలనాధభట్తవీరభద్రశాస్త్రి

**  **  **

ఎంతసేపూ మిరిపకాయబజ్జీలే తప్ప ఇంకేవీ గుర్తుకురావా?

అసలు బజ్జీలకు పితామహ ప్రపితామహులు అరటికాయ బజ్జీలు. బంగాళాదుంప, కాకర, వాము ఆకు, వంకాయ దర్మిలా ఉల్లిపాయకూడా

అవతలహోరున వాన. మండువాలోగిల్లో మధ్యవున్న చతురస్య కుండిలో ధారాపాతంగా పైన పెంకులకప్పునుంచి

వాన నయాగరా జలపాతంలా జాలువారుతూవుంటే చాపమీదకూర్చుని మగరాయుళ్ళు చతుర్ముఖ పారాయణ చేస్తూ మధ్యమధ్య నారీమణుల హస్తపాకచాతుర్య సంభవమైన వేడివేడి బజ్జీలు తింటూవుంటే, మరికొందరు డిటెక్టివ్ నవలో వార పక్షమాసపత్రికలో చదువుతూ పేజీలు తిప్పుతూ ఆసమయంలొ వేడివేడి బజ్జీలు తింటూఆస్వాదిస్తూవుంటే. కన్నెపిల్లలు చింతగింజలతో వామనగుంట ఆడుతూ మధ్య మధ్య వేడివేడి బజ్జీలుతింటూవుంటే, నవదంపతులు గదిలో మంచంమీదకూర్చుని భార్య బజ్జీని భర్తనోట పెట్టి తానొకటి భర్త తననొటపెట్టగా తింటూవుంటే 

చెప్పలేను ఆహాయి ఎంతోగొప్పగవుంటుందోయి

మారోజుల్లో మిరపకాయబజ్జీలు ఎరగం అంటే సత్యదూరంకాదు

పచ్చిమిర్పకాయ నూరిన మెత్తని ఉప్పులో అద్దుకొని పప్పు అన్నం తినడం అలవాటు. 

అంతేగాని పచ్చిమిరపకాయలోని (అహం) కారమ్ నూనేలోవేగితే అబ్బే హుళక్కేకదా!

మరోవిషయం

పులిహారలో చింతపండు రసం ఆరసంతోబాటు వుడికిన ఎండుమిరపకాయలు 

ఎప్పుడన్నా విడిగా ఆఎండుమిరపకాయలు నమిలారా? పుల్లపుల్లగా కారంకారంగా..అబ్బో పులిహారకి అనుపానంకదండీ

అసలు మారోజుల్లొవివాహాలలొ మధ్యాహ్నం స్నాక్సు తీపి బూందీ, వేడివెడి అరటి, బంగాళాదుంపబజ్జీలే. నో ఉల్లిపాయ

ఉదయం ఫలహారం ఉప్మాయే. 

బడా వివాహాలలో ఉదయం పెసరట్టు ఉప్మా

2009 నవంబరు ఒకటవతేదీన అమెరికా హ్యూస్తన్ నగరంలో మాద్వితీయపుత్రుని ప్రధమపుత్రిక వివాహానికి ఉప్మాయే ఉదయం ఫలహారం

దర్మిలా కాలంతోమార్పులువచ్చి ఏవేవో చేస్తున్నారు

వెళ్ళండి   ఏభైసంవత్సరాలు వెనక్కి వెళ్ళి ఆరోజుల్లోని  వంటలు ఆస్వాదించండి

**  **  **

కొసమెరుపు: నాకు మిరపకాయ అంటే మహా చెడ్డభయం. నాశ్రీమతికి మహాయిష్టం. 

కనుక తనని తల్చుకుంటూ ఈ రచన తనకే అంకితం

సువార్తలు

 సువార్తలు ఎప్పుడు తెరిచినా నాకు గొప్ప స్ఫూర్తీ, చెప్పలేనంత సాంత్వనా కలుగుతుంటాయి. అందులోనూ, గొప్ప భాష్యకారులెవరేనా సువార్తలమీద రాసినది చదువుతుంటే తెల్లవారేవేళ ఆకాశమంతా పరుచుకునే తెలివెలుగులాంటిది నా హృదయాన్ని ఆవరించి వెలిగిస్తూండటం నాకు అనుభవం. ఈ మధ్య అట్లాంటి పుస్తకం ఒకటి దాచుకుని దాచుకుని చదివాను.


యూజిని ఎ పీటర్సన్ అమెరికాకి చెందిన బోధకుడు, బైబిల్ వ్యాఖ్యాత, ప్రసంగి. 21 వ శతాబ్దానికి తగినట్టుగా బైబిల్ సందేశాన్ని విడమర్చి చెప్తున్నవాడిగా ఆయన ఇప్పటికే ప్రసిద్ధిచెందాడు. ఆయన రాసిన పుస్తకాల్లో ఒకటి, Tell it Slant: A Conversation on the Language of Jesus in his Stories and Prayers(2008) అనే రచన నా కంటపడింది. ఆ పుస్తకాన్ని అధ్యాత్మిక గ్రంథమనాలో, లేక అత్యున్నత స్థాయి సాహిత్య పఠనం అనాలో నేను తేల్చుకోలేకున్నాను.


ఆ రచన రెండు భాగాలు. మొదటి భాగంలో ఆయన లూకా సువార్త ఆధారంగా క్రీస్తు చెప్పిన కథల్ని మళ్ళా మనకొకసారి వివరిస్తాడు. రెండవ భాగంలో, నాలుగు సువార్తల్లోనూ క్రీస్తు చేసిన ప్రార్థనల్ని ఏరి తెచ్చి, వాటిని మరొక మారు మనకోసం పునఃపఠించి వ్యాఖ్యానిస్తాడు. రెండు భాగాలూ కూడా అత్యంత విలువైన రచనలు. క్రీస్తు ప్రార్థనల్ని ఆయన ప్రతి పదాన్నీ వివరించిన తీరు బ్రహ్మసూత్ర భాష్యంలాంటిది అని చెప్పవచ్చు. కాని, ఇక్కడ మీతో మొదటి భాగం గురించే పంచుకుందామనుకుంటున్నాను.


నాలుగు సువార్తల్లోనూ మార్కు, మత్తయి, లూకా సువార్తల్ని సారూప్య సువార్తలు అంటారు. అవన్నీ ఒక మూల సువార్త ఆధారంగా రాసినవని భావిస్తున్నారు. తిరిగి ఆ మూడింటిలోనూ మార్కు సువార్త మొదటిదనీ, తక్కిన రెండూ ఆయన్ని అనుసరించినవనీ పరిశోధకులు చెప్తున్నారు. ఆ మూడు సువార్తలూ కూడా యేసు జీవితవిశేషాల్ని ఆధారం చేసుకుని ఆయన బోధల్నీ, తన జీవితం ద్వారానూ, మరణం ద్వారానూ, పునరుత్థానం ద్వారానూ ఆయన ఈ లోకానికి తీసుకువచ్చిన దైవసందేశాన్ని వివరించే రచనలు. నాలుగవ సువార్త యోహాను సువార్త పూర్తిగా తాత్త్విక రచన. అక్కడ క్రీస్తు జీవితవిశేషాలకన్నా, ఆయన జీవితంలోని ప్రతి సంఘటననీ, ప్రతి ఒక్క ఉపమానాన్నీ, ప్రతి ఒక్క బోధననీ పూర్తిగా ఆధ్యాత్మిక దృష్టితో వివరించిన రచన. 


సువార్తలతో నాకు చిన్నప్పటినుంచీ పరిచయం ఉన్నప్పటికీ ఆ నాలుగింటిలోనూ నన్ను మొదట ఆకట్టుకున్నది నాలుగవ సువార్తనే. కాని చాలా ఏళ్ళ తరువాత మత్తయిని చదివినప్పుడు చిన్నచిన్న వాక్యాల్లో, సాదాసీదా వివరాల్తో ఆయన ఎంత అనల్పార్థ రచన చేసాడో బోధపడింది. ఇప్పుడు, ఈ రచన ద్వారా లూకా సువార్త నాకు కొత్తగా కనిపిస్తున్నది.


అన్నిటికన్నా ముందు సృష్ట్యాదిలో శబ్దం మాత్రమే ఉందనీ, ఆ శబ్దం (వాక్యం, logos, మన భాషలో చెప్పాలంటే ప్రణవం) వెలుగై ఉండేదనీ, ఆ శబ్దం రక్తమాంసాలు ధరించి భూమ్మీద యేసుగా అవతరించిందనీ సువార్తలు చెప్తాయి. ఆ శబ్దాన్ని వేదం వాక్కు అంది. ఆ వాక్కు ఎంత పవిత్రమైందో, ఆ వాక్కుని విశ్వసించినవాళ్ళు, ఈ లోకాన్ని ఎట్లా తరించగలరో వివరించడమే పీటర్ సన్ రచన తాలూకు ముఖ్య ఉద్దేశం.


మన దర్శనాలు ఆరుప్రమాణాల్ని ఆధారం చేసుకున్నప్పటికీ శబ్దప్రమాణాన్ని అన్నిటికన్నా ముఖ్యంగా భావించాయి. ఈ వ్యాఖ్యాత కూడా సువార్తను ఒక శబ్ద ప్రమాణంగా తీసుకున్నాడు. అందులోని ప్రతి ఒక్క పదం, పదబంధం, వాక్యం, చివరికి విరామచిహ్నాల్ని కూడా అతడు ఎంతో నిష్టతో, శ్రద్ధతో సంభావించి, ఆ శబ్దార్థాన్ని ప్రసన్నం చేసుకోవడానికి పరితపించాడు. ఈ ప్రపంచంలోని తక్కిన శబ్దాలు మనల్ని బంధిస్తాయి. కాని దైవ వాక్యం మనల్ని విడిపిస్తుంది. అసలు ఆ మాటకొస్తే యేసు జీవితం కూడా ఒక శబ్దప్రమాణాన్ని నమ్మి తన జీవితాన్ని అందుకు ఉదాహరణగా తీర్చిదిద్దుకోవడమే కదా. పూర్వనిబంధన ప్రవక్తల్ని, ముఖ్యంగా ఇషయ్యాని యేసు పరిపూర్ణంగా విశ్వసించాడు కాబట్టే క్రీస్తు కాగలిగాడు.


శబ్దానికి మూడు వినియోగాలుంటాయి అంటాడు పీటర్సన్. మొదటిది ప్రవచనం (preaching). ప్రవచనమంటే ప్రకటన. అది భగవంతుడి  గురించిన సమాచారాన్ని అందరూ వినేలా బిగ్గరగా ప్రకటించడం. మార్కు సువార్త అటువంటి ప్రచనంతో మొదలయ్యిందనీ, అది గలిలియలో యేసు సూచకక్రియలు మొదలుపెట్టడంతో మొదలవుతుందనీ అంటాడు పీటర్ సన్. శబ్దానికున్న రెండవ వినియోగం బోధన (teaching).అంటే తరగతిగదుల్లో ఉపాధ్యాయులు పిల్లలకి బోధించడమనే కాదు, అసలు ఎవరేనా సరే, తల్లి, తండ్రి, గురువు, స్నేహితుడు, రచయిత, కవి మనం ఈ లోకంలో ఎట్లా మసలాలో, జీవితాన్ని ఏ విధంగా తీర్చిదిద్దుకోవాలో, ప్రతి ఒక్క విశేషంతోనూ ఓపిగ్గా విడమరిచి చెప్పడం. క్రీస్తు అట్లాంటి బోధకుడని మత్తయి సువార్త చెప్తుందంటాడు పీటర్ సన్. మన జీవితాల్లో విడివిడిగా ఉన్న అనుభవాల్ని ఒకదానికొకటి కలుపుతూ వాటికొక సమగ్రతనీ, సార్థకతనీ సమకూర్చడం బోధన లక్ష్యమనీ, గలిలయలోనూ, యెరుషలేం లోనూ కూడా ఒక బోధకుడిగా క్రీస్తు చేసింది అదేననీ కూడా అంటాడాయన.


ఇక శబ్దవినియోగంలోని మూడవ అంశం, ముఖ్యమైన అంశం, మన రోజువారీ వ్యవహారంలో మనం మాటాడుకునే మాటలు. మామూలు మాటలు. చిన్నవీ, పెద్దవీ మన పనులు, మనచుట్టూ ఉండే మనుషులతో దైనందిన జీవితాన్ని కొనసాగించడానికి మనం చెప్పుకునే మాటలు, ఇచ్చే ఆదేశాలూ, కోరుకునే అభ్యర్థనలూ, ప్రశంసలూ, అభిశంసనలూ అన్నీ. మనం మామూలుగా ఈ శాబ్దిక వ్యవాహారానికి ఏమంత ప్రాధాన్యత నివ్వం. ఇది మన వ్యావహారిక జీవితానికి సంబంధించింది అనీ, మన పారమార్థిక జీవితానికి సంబంధించిన పార్శ్వానికీ, ఈ వ్యావహారిక భాషకీ ఏమీ సంబంధంలేదని భావిస్తాం. కాని క్రీస్తు దృష్టిలో, ఈ రోజువారీ, అల్ప సంఘటనలకి సంబంధించిన చిన్న చిన్న మాటలకీ, ప్రవచనానికీ, బోధనకీ మధ్య ఏమీ తేడా లేదు. పైగా, పీటర్ సన్ చెప్పేదేమంటే, ఇటువంటి రోజువారీ సంభాషణల్లో, ఈ small talk లోనే క్రీస్తు మనకి మరింత చేరువగా కనిపిస్తాడని. లూకా తన సువార్తలో చిత్రించిన యేసు ఇటువంటి రోజువారీ జీవితానికి చెందిన యేసు అని చెప్తాడాయన. ఆ కోణంలో ఆయన సువార్తను చదివిన తీరు, వ్యాఖ్యానించిన పద్ధతి నిజంగా నేనిప్పటిదాకా ఎక్కడా చదవలేదు.


మార్కు చిత్రించిన క్రీస్తు ప్రవచనకారుడు కాగా, మత్తయి చిత్రించిన క్రీస్తు బోధకుడు కాగా లూకా చిత్రించిన క్రీస్తు సంభాషణకారుడు, ముఖ్యంగా కథకుడు అనేది పీటర్ సన్ ప్రతిపాదన. అందులోనూ తక్కిన సువార్తల్లో లేనిదీ, లూకాలోనే ప్రత్యేకంగా ఉన్నదీ, క్రీస్తు గలిలయనుండి సమరయ మీదుగా యెరుషలేం ప్రయాణించినప్పుడు ఆ దారిపొడుగునా చెప్పిన కథలు. దాదాపుగా పది అధ్యాయాల పొడుగునా  (9:51-19:44) లూకా వర్ణించిన ఆ ప్రయాణాన్ని పీటర్ సన్ ఆద్యంతం ఒక అత్యున్నత రూపకాలంకారంగా వివరిస్తాడు. 


యేసు మహిమ మొదటిసారిగా గలిలయలో ప్రకటితమయ్యింది. ఒకవైపు బాపిస్త్మమిచ్చే యోహాను ఉరుములాగా భగవ్సందేశాన్ని, పూర్వ ప్రవక్తల ప్రవచనాల్ని వినిపిస్తుంటే, యేసు నిశ్శబ్దంగా గలిలయ సముద్రపు ఒడ్డున పల్లెల్లో పేదల్నీ, పతితుల్నీ, దీనుల్నీ కలుసుకుంటో, అక్కున చేర్చుకుంటో, వారి అస్వస్థ జీవితాన్ని స్వస్థపరుస్తో ఉన్నాడు. యెరుషలేం లో క్రీస్తు అవతార ప్రయోజనం లోకానికి పూర్తిగా వెల్లడి అయింది. ఆయన చివరి సారి యెరుషలేంలో అడుగుపెట్టిన తరువాత వారం రోజులు కూడా కాకుండానే ఒకదానివెనక ఒకటి సంఘటనలు నాటకీయంగా జరిగాయి. తన శిష్యుడి మోసం వల్ల ఆయన పట్టుబడటం, ముందు మతాధిపతులూ, తర్వాత రాజప్రతినిధులూ ఆయన్ని విచారించడం, శిలువ వెయ్యడం, ఆ తర్వాత ఆయన పునరుత్థానం వెనువెంటనే జరిగిపొయ్యాయి. క్రీస్తు ఒక బోధకుడు మాత్రమే కాదు, లోక రక్షకుడని యెరుషలేంలోనే రుజువయ్యింది.


తన జీవితానికీ, బోధనకీ, జీవనసార్థక్యానికీ అత్యంత అనుకూలమైన గలిలయనుండి యెరుషలేం వెళ్ళడానికి క్రీస్తు సమరియా మార్గాన్ని ఎందుకు ఎంచుకున్నాడు? ముఖ్యంగా సమరయులకీ, యూదులకీ మధ్య జాతివైరం ఉండగా, ఆ మార్గం కఠినమైన దారి మాత్రమే కాదు, సామాజికంగా కూడా అత్యంత ప్రతికూలం అని తెలిసిన తరువాత కూడా క్రీస్తు ఆ దారినే ఎందుకు ఎంచుకున్నాడు? ఈ ప్రశ్నలకి లూకా సువార్త ఆధారంగా పీటర్ సన్ ఇచ్చిన వివరణ మహిమాన్వితంగా ఉంది.


లూకా సువార్తలో అధిక భాగం క్రీస్తు సమరయ గుండా చేసిన ప్రయాణానికి కేటాయించడమే కాకుండా, ఆ దారిపొడుగునా క్రీస్తు చెప్పిన కథల్ని చెప్పడంతో ఆ ప్రయాణమొక travel narrative గా మారిపోయిందంటాడు పీటర్ సన్. గలిలయ, సమరయ, యెరుషలేం వట్టి ప్రాంతాలు మాత్రమే కాక, మెటఫర్లుగా మారిపోయేయంటాడు. మనం మన ఆధ్యాత్మిక జీవితంలో మన ప్రార్థనవేళలూ, పూజా సమయాలూ, ప్రవచన ఘడియలూ గలిలయ, యెరుషలేం వంటివి కాగా, ఆ వేళల మధ్యనుండే మన దైనందిన జీవితం సమరయలాంటిది. ఒక ఆదివారం గలిలయ కాగా మరొక ఆదివారం యెరుషలేం లాంటిది. ప్రభువుని తలుచుకోవడానికి అర్పించుకున్న ఆ రెండు ఆదివారాల మధ్య మనం గడిపే తక్కిన ఆరు రోజుల జీవితం సమరయలో చేసే ప్రయాణం లాంటిది. అది మన దృష్టిలో అత్యంత లౌకికం, ఈశ్వరదూరం, శ్రద్ధావిదూరం. ఆ ఆరురోజుల్నీ మనమెట్లానో గడుపుతాం, మన శారీరిక, ప్రాపంచిక అవసరాల్ని ఏదో ఒక విధంగా తృప్తి పరుచుకుంటో. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ ఆరురోజుల పాటూ మనం భగవంతుడినుంచి ముఖం చాటేసుకుని తిరుగుతాం. కాని యేసు అట్లా కాదు. ఆయన ప్రతి రోజూ భగవత్సాన్నిధ్య సుఖం అనుభవిస్తూనే ఉంటాడు. ప్రవచనాల్లోనూ, బోధనవేళల్లోనూ మాత్రమే కాదు, తన రోజువారీ జీవితంలో తనకి తారసపడ్డ ప్రతి ఒక్కరితోనూ, ప్రతి ఒక్క వ్యవహారంలోనూ కూడా ఆయన పూర్ణమానవుడిగానే ప్రవర్తిస్తాడు. అంతేకాదు, అటువంటి రోజువారీ జీవితంలోని మామూలు మాటల్లోనే, మనతో చెప్పే కథల్లోనే ఆయన ప్రేమైక హృదయం, ఆయన దయ, ఆయన విశ్వాసం మనకి మరింత స్పష్టంగా ద్యోతకమవుతాయి.


గలిలయ నుండి యెరుషలేం దాదాపు డెభ్భై మైళ్ళ కఠిన ప్రయాణం. కాలినడకన మూడు నాలుగు రోజుల ప్రయాణం. ఆ దారిపొడుగునా యేసు తన శిష్యులతో నెమ్మదిగా, ప్రేమగా మాట్లాడుతోనే ఉన్నాడు. ఆ మాటలకి ముందస్తు ప్రణాళిక ఏమీ లేదు. అవి ఎప్పటికప్పుడు తనకి తారసపడుతున్న వాళ్ళని పలకరించడంలోంచో లేదా తనని ఎవరేనా ఏదైన ప్రశ్న అడిగినప్పుడు జవాబివ్వడంలోంచో రూపుదిద్దుకున్న సంభాషణలు. ఆ సంభాషణల్లోంచే ఆయన చెప్పిన అపురూపమైన కథలు. నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్టుగా నీ పొరుగువాణ్ణి కూడా ప్రేమించమని చెప్తే, నా పొరుగువాడెవరు అని అడిగిన ప్రశ్నకి ఒక సమరయుణ్ణి ఉదాహరణగా చూపిస్తూ యేసు చెప్పిన మహిమాన్వితమైన కథతో సమరయ ప్రయాణం మొదలవుతుంది. ఆ ప్రశ్న అడిగినాయన ఒక ధర్మశాస్త్ర పండితుడు. నీ పొరుగువాడు నీవంటి యూదునే అని చెప్పలేదు యేసు ఆయనకి. యూదులు ద్వేషించే సమరయుణ్ణి ఉదాహరణగా చూపించడం క్రీస్తు విజ్ఞతకి మాత్రమే కాదు, ఎల్లల్లేని ఆయన  ప్రేమైక చిత్తానికి కూడా నిరూపణ. మన పొరుగువాడు మన ఇంటిపక్కనుండేవాడో లేదా ఆఫీసులో మన సహోద్యోగినో మాత్రమే కాదు. మనం ఎవరితో కలిసి జీవించక తప్పదో, అలా జీవించవలసి వచ్చినందువల్ల ఎవరిని మనం సదా ద్వేషిస్తూ ఉంటామో అతడు మన పొరుగువాడు. నన్ను నేను ప్రేమించుకున్నట్టు నేనతణ్ణి ప్రేమించడం సాధన చెయ్యమంటున్నాడు యేసు. ఆ సాధన క్రమంలో భాగంగానే ఆయన యెరుషలేం వెళ్ళడానికి సమరయ గుండా పొయ్యే తోవ ఎంచుకున్నాడు.


అట్లా యేసు ఒకటి కాదు, ఆ దారిపొడుగునా మొత్తం పది కథలు చెప్పాడు. అవి వట్టి కథలు కావు, పది ఉపనిషత్తులని అర్థమయ్యింది నాకు పీటర్ సన్  రచన చదువుతుంటే. అవి కూడా ప్రవచనాలుగానో, బోధనలుగానో కాక, కథలుగా చెప్పడం. ఆ కథలు కూడా తన స్వజనం మధ్య, తన స్వదేశంలోకాక, తనకి అత్యంత ప్రతికూలమైన దారిలో చెప్పడం. అందువల్లనే ఆ కథలు వింటున్నప్పుడు మనలో ఏదో జరుగుతుంది. అదేమిటో కూడా పీటర్ సన్ తనే ఇలా చెప్తున్నాడు:


Every time Jesus tells a story, the world of those who listen enlarges, understanding deepens, imaginations are energiged. Without stories, we end up with stereotypes-a flat earth with flar cardboard figures taht have not texture or depth, no interior.



2021 అంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలతో 2021 సంవత్సరంలో తేదీల వారం తెలుసుకునే విస్సా ఫౌండేషన్ మంత్రం!

 2021 సంవత్సరపు విస్సా ఫౌండేషన్‌ మంత్ర సంఖ్య 4 

ఉదా: 01-01-2021 ఏ వారమో తెలుసుకోవాలంటే?  

 1+0+4=5

7 తొ భాగాహరం చెయ్యలేని సంఖ్య కనుక ఆ 5 సంఖ్యనే శేషంగా తీసుకోవచ్చు శుక్రవారం అవుతుంది.

మంత్ర సంఖ్య + నెల విలువ + తేదీలు కలుపగా వచ్చిన మొత్తాన్ని 7 తో భాగహారం చెయ్యగా వచ్చిన శేషం విలువ వారం అవుతుంది. 

జనవరి, అక్టోబర్             -- 0

మే                              -- 1

ఆగస్టు                         -- 2 

ఫిబ్రవరి, మార్చి, నవంబర్ -- 3

జూన్                             --4 

సెప్టెంబర్, డిసెంబర్           --5 

ఏప్రిల్, జూలై                    --6   

ఆది     -- 0 

సొమ   -- 1

మంగళ -- 2 

బుధ    -- 3

గురు    -- 4

శుక్ర     -- 5

శని      -- 6

శ్రీమద్ భగవద్గీతా వైభవం! వ్యక్తిత్వ వికాసం!!

ఓం గం గణపతయేనమః | ఓం శ్రీమాత్రే నమః ||

శ్రీమద్ భగవద్గీతా వైభవం! వ్యక్తిత్వ వికాసం!! రోజు మార్గశిర శుద్ధ ఏకాదశి గీతాజయంతి

శ్రీ మద్‌ భగవత్గీత! పవిత్ర గ్రంధం పుట్టినరోజు. గీత సాక్షాత్తు భగవానునిచేత పలకబడినది కావున పరమ ప్రామాణికమైన మానవజాతికి దివ్యమార్గాన్ని చూపే పవిత్రగ్రంథం. ఇది కేవలం ఒక మతానికి సంభందించిన గ్రంధం కాదు, అంతిమ ఘడియల్లో వినిపించాల్సిన వైరాగ్య గ్రంధం అసలే కాదు. ఈ సమస్యల మయ జీవన వలయంలో వేల ఏళ్లుగా ప్రపంచ వ్యాప్తంగా నిత్య చైతన్య ప్రవాహమై, దారిమరిచిన బాటసారికి కరదీపికై, సమస్త భూమండలాన్ని దివ్యశక్తితో ముందుకు నడిపిస్తున్న ఏకైక గ్రంథం, ఆధ్యాత్మిక ప్రవచనమైనా, వ్యాపార సూక్తులైనా, మేనేజ్మెంట్ కోర్సులైనా, వ్యక్తిత్వ వికాస శిక్షణా తరగతులైనా జీవితంలో ఎక్కడో చోట ఏదో సందర్భంలో గీతను గుర్తు చేసుకోకుండా వుండలేము. మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఎక్కడికి వెళుతున్నాం, ఏం చేస్తున్నాం, ఏం ప్రతిఫలం అందుకుంటున్నాం? అందుకు ప్రతిగా ఏం చేయాలి? గీత చదవడం ద్వారా ఆ సందేహాలు అన్నీ తొలగిపోతాయి. అనాదిగా ఆది శంకరాచార్య, వివేకానంద, మాక్స్ ముల్లర్, ఆబ్ధుల్‌ కలాం ఇలా ఎందరో లోకంలో  భగవద్గీత గొప్పదనాన్ని వేనోళ్లా కీర్తించి చాటినవారే. మనం ఒక రకంగా శాపగ్రస్తులం మన ఔన్నత్యం గురించి మన పవిత్ర గ్రంధాల గురించి విదేశీయులు చెప్తేగాని గుర్తించం ఉదాహరణకు ప్రశ్నలకు సమాధానం కోసం అర్జెంటుగా గూగుల్ లో వెతకుతాం. మన మేథోవారసత్వాన్ని పట్టించుకోం. తెలుసుకోడానికి టెక్నాలజీ మీద ఆధారపడతాం కానీ- వారసత్వ మూలల్లోకి వెళ్లం. మనకున్న గొప్ప గొప్ప గ్రంధాలు చదవం. "కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన | మా కర్మ ఫలహేతుర్భూ: మాతే సంగోఅస్త్వకర్మణి " అంటే, నువ్వు కర్మలు చేయడానికి మాత్రమే. ఆ కర్మఫలాలకు అధికారివి కాదు. ప్రతిఫలాపేక్షతో ఎట్టిపరిస్థితుల్లో కర్మలు చేయకు. అలాగని చేయడం మానకు అని అర్ధం. కానీ నేడు ప్రపంచమంతా ఈ పని చేస్తే నాకేంటి అంటూ ఫలితం కోసం పనిచేస్తొంది. ప్రతిఫలం గురించి ఆశించకుండా చేసే పనిని అనుభూతిస్తూ చెయ్యాలని ఎంత గొప్ప సందేశం అలా అని పూర్తిగా ఆశావాదం లేకుండా పనిచేయమని కాదు. ఆశ పడటం తప్పు కూడా కాదు. కానీ ఎలాంటి చర్యా లేకుండా- గాల్లో దీపం పెట్టే దేవుడా నీవే దిక్కు అంటే మాత్రం కష్టం. చేయాల్సింది చేయాలి. ఫలితం సంగతి తర్వాత. వందల శ్లోకాలు బట్టీ పట్టి కుండా కనీసం మనకు పనికొచ్చే వాటిని అయినా మననం చేసుకుందాం.  ప్రతిరోజూ ఒకటో రెండో శ్లోకాలు మననం చేసుకుందాం!

ప్రధమ అధ్యాయం - అర్జునవిషాద యోగము:

       భగవద్గీత మహాభారతము యొక్క సమగ్ర సారాంశము, భక్తుడైన అర్జునకు ఒనర్చిన ఉపదేశమే గీతా సారాంశము. భారతయుద్దము జరుగరాదని సర్వవిధముల భగవానుడు ప్రయత్నించెను. కానీ, ఆ మహానుభావుని ప్రయత్నములు వ్యర్ధములాయెను. అటుపిమ్మట శ్రీకృష్ణుడు పార్దునకు సారధియై నిలిచెను.  యుద్దరంగమున అర్జునుని కోరిక మేరకు రధమును నిలిపెను. అర్జునుడు ఉభయ సైన్యములలో గల తండ్రులను, గురువులను, మేనమామలను, సోదరులను, మనుమలను, మిత్రులను చూచి హృదయం ద్రవించి.

          శ్లో|| న నకాంక్షే విజయం కృష్ణ న చ రాజ్యం సుఖాని చ |
కిం నో రాజ్యేన గోవిన్ద కిం భోగైర్జీవితేన వా ||1-32||
స్వజనమును చంపుటకు ఇష్టపడక నాకు విజయము వలదు, రాజ్యసుఖము వలదు అని ధనుర్భాణములను క్రింద వైచి దుఃఖితుడైన అర్జునుని చూచి శ్రీకృష్ణ పరమాత్మా

ద్వితీయ అధ్యాయం - సాంఖ్య యోగము

        శ్లో|| అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే|
గతాసూనగతాసూంశ్చ నానుశోచన్తి పణ్డితాః
||2-11||దుఃఖింప తగని వారిని గూర్చి దుఃఖించుట అనుచితము. ఆత్మానాత్మ వివేకులు, అనిత్యములైన శరీరములను గూర్చిగాని, నిత్యములు, శాశ్వతములు అయిన ఆత్మలను గూర్చిగాని దుఃఖింపరు.

      శ్లో|| దేహినోస్మిన్యథా దేహే కౌమారం యౌవనం జరా|
తథా దేహాన్తరప్రాప్తిర్ధీరస్తత్ర న ముహ్యతి
||2-13||జీవునకు దేహమునందు బాల్యము, యౌవనము, ముసలితనము యెట్లో మరొక దేహమును పొందుటకు కూడ అట్లే కనుక ఈ విషయమున ధీరులు మోహము నొందరు.

      శ్లో|| వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి|
తథా శరీరాణి విహాయ జీర్ణా- న్యన్యాని సంయాతి నవాని దేహీ
(2:22)

మనుష్యుడు ఎట్లు చినిగిన వస్త్రములను వదలి నూతన వస్త్రములను ధరించునో అట్లే ఆత్మ(జీవాత్మ) జీర్ణమైన శరీరమును వదలి క్రొత్త శరీరమును ధరించుచున్నది.

          శ్లో||  నైనం ఛిన్దన్తి శస్త్రాణి నైనం దహతి పావకః|
న చైనం క్లేదయన్త్యాపో న శోషయతి మారుతః|| 2-23
||ఆత్మ నాశనము లేనిది, ఆత్మను శస్త్రములు చేదింపజాలవు, అగ్ని దహింపజాలదు, నీరు తడుపజాలదు, వాయువు అర్పివేయును సమర్ధము కాదు. ఆత్మ నాశనము లేనిది.

       శ్లో|| జాతస్య హి ధ్రువో మృత్యుర్ధ్రువం జన్మ మృతస్య చ|
తస్మాదపరిహార్యే
ర్థే న త్వం శోచితుమర్హసి|| 2-27 ||

 పుట్టినవానికి మరణము తప్పదు. మరణించిన వానికి జన్మము తప్పదు. అనివార్యమగు ఈ విషయమును గూర్చి శోకింపతగదు.

          శ్లో|| హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీమ్|
తస్మాదుత్తిష్ఠ కౌన్తేయ యుద్ధాయ కృతనిశ్చయః|| 2-37 ||

యుద్దమున మరణించినచో వీరస్వర్గమును పొందెదవు. జయించినచో రాజ్యమును భోగింతువు. కావున అర్జునా! యుద్దమును చేయు కృతనిశ్చయుడవై లెమ్ము.

          శ్లో|| కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన|
మా కర్మఫలహేతుర్భూర్మా తే సఙ్గో
స్త్వకర్మణి|| 2-47 ||

కర్మలను ఆచరించుట యందే నీకు అధికారము కలదు కాని, వాని ఫలితముపైన లేదు. నీవు కర్మఫలమునకు కారణము కారాదు. అట్లని కర్మలను చేయుట మానరాదు.

          శ్లో|| దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః|
వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే|| 2-56 ||
దుఃఖములు కలిగినప్పుడు దిగులు చెందనివాడును, సుఖములు కలిగినప్పుడు స్పృహ కోల్పోనివాడును, రాగము, భయము, క్రోధము పోయిన వాడును, స్థితప్రజ్ఞుడని చెప్పబడును.

          శ్లో|| ధ్యాయతో విషయాన్పుంసః సఙ్గస్తేషూపజాయతే|
సఙ్గాత్సఞ్జాయతే కామః కామాత్క్రోధో
భిజాయతే|| 2-62 ||

విషయవాంఛలను గూర్చి సదా మననము చేయువానికి, వాని యందను రాగమధికమై, అది కామముగా మారి చివరకు క్రోధమగును. క్రోధమువలన అవివేకము కలుగును. దీనివలన జ్ఞాపకశక్తి నశించి దాని ఫలితముముగా మనుజుడు బుద్ద్దిని కోల్పోయి చివరకు అధోగతి చెందును. (2:62)

          శ్లో|| ఏషా బ్రాహ్మీ స్థితిః పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి|
స్థిత్వాస్యామన్తకాలే
పి బ్రహ్మనిర్వాణమృచ్ఛతి|| 2-72 ||

ఆత్మజ్ఞానపూర్వక కర్మానుస్టారము, బ్రహ్మప్రాప్తిసాధనము కలిగిన జీవుడు సంసారమున బడక, సుఖైక స్వరూపమైన ఆత్మప్రాప్తిని చెందగలడు. (2:72)

        తృతీయ అధ్యాయం - కర్మ యోగము  శ్రీభగవానువాచ
          శ్లో|| లోకేస్మిన్ ద్వివిధా నిష్ఠా పురా ప్రోక్తా మయానఘ|
జ్ఞానయోగేన సాఙ్ఖ్యానాం కర్మయోగేన యోగినామ్|| 3-3 ||
అర్జునా! ఈ లోకములో ఆత్మానాత్మ వివేకముగల సన్యాసుకలు జ్ఞానయోగము చేతను, చిత్తశుద్దిగల యోగీశ్వరులకు కర్మయోగము చేతను, ముక్తి కలుగుచున్నదని సృష్టి ఆదియందు నాచే చెప్పబడియున్నది.

          శ్లో|| అన్నాద్భవన్తి భూతాని పర్జన్యాదన్నసమ్భవః|        
యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞః కర్మసముద్భవః|| 3-14 ||
అన్నము వలన జంతుజాలము పుట్టును. వర్షము వలన అన్నము సమకూరును. యజ్ఞము వలన వర్షము కలుగును. ఆ యజ్ఞము కర్మ వలననే సంభవమగును.

          శ్లో|| ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతీహ యః|
అఘాయురిన్ద్రియారామో మోఘం పార్థ స జీవతి|| 3-16 ||
పార్దా! నాచే నడుపబడు ఈ లోకము అను చక్రమును బట్టి, యెవడు అనుసరింపడో, వాడు ఇంద్రియలోలుడై పాపజీవనుడగుచున్నాడు. అట్టివాడు వ్యర్ధుడు,

జ్ఞానీ కానివాడు సదా కర్మల నాచరించుచునే ఉండవలెను.

          శ్లో|| యద్యదాచరతి శ్రేష్ఠస్తత్తదేవేతరో జనః|

స యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే|| 3-21 ||ఉత్తములైన వారు దేని నాచరింతురో, దానినే ఇతరులును ఆచరింతురు. ఉత్తములు వేనిని ప్రమాణముగా అంగీకరింతురో లోకమంతయు దానినే అనుసరించును.

          శ్లో|| మయి సర్వాణి కర్మాణి సంన్యస్యాధ్యాత్మచేతసా|
నిరాశీర్నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః
||3-30||అర్జునా! నీ వొనర్చు సమస్త కర్మలనూ నా యందు సమర్పించి జ్ఞానముచే నిష్కాముడవై, అహంకారము లేనివాడవై సంతాపమును వదలి యుద్దము చేయుము.

శ్లో|| శ్రేయాన్స్వధర్మో విగుణః పరధర్మాత్స్వనుష్ఠితాత్|
స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః ||3-35||చక్కగా అనుస్టింపబడిన పరధర్మము కన్న, గుణము లేనిదైనను స్వధర్మమే మేలు. అట్టి ధర్మాచరణమున మరణము సంభవించినను మేలే. పరధర్మము భయంకరమైనది. ఆచరణకు అనుచితమైనది.

శ్లో|| ధూమేనావ్రియతే వహ్నిర్యథాదర్శో మలేన చ|
యథోల్బేనావృతో గర్భస్తథా తేనేదమావృతమ్|| 3-38 ||

పొగచేత అగ్ని, మురికిచేత అద్దము, మావిచేత శిశువు యెట్లు

కప్పబడునో, అట్లు కామముచేత జ్ఞానము కప్పబడి యున్నది.

చతుర్ధ అధ్యాయం - జ్ఞాన యోగము

శ్లో|| యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత|
అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్|| 4-7 ||

శ్లో|| పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్|
ధర్మసంస్థాపనార్థాయ సమ్భవామి యుగే యుగే||
4-8 || ఏ కాలమున ధర్మమునకు హాని కలుగునో, అధర్మము వృద్దినొందునో, ఆయా సమయములయందు శిష్టరక్షణ, దుష్టశిక్షణ, ధర్మ సంరక్షణముల కొఱకు ప్రతీయుగమునా అవతారము దాల్చుచున్నాను.

శ్లో|| వీతరాగభయక్రోధా మన్మయా మాముపాశ్రితాః|
బహవో జ్ఞానతపసా పూతా మద్భావమాగతాః|| 4-10 ||
అనురాగము, భయము, క్రోధము వదలి నా యందు మనస్సు లగ్నము చేసి, ఆశ్రయించిన సత్పురుషులు జ్ఞానయోగము చేత పరిశుద్ధులై నా సాన్నిధ్యమును పొందిరి.

            శ్లో|| యే యథా మాం ప్రపద్యన్తే తాంస్తథైవ భజామ్యహమ్|
మమ వర్త్మానువర్తన్తే మనుష్యాః పార్థ సర్వశః|| 4-11 ||

ఎవరెవరు యేయే విధముగా నన్ను తెలియకోరుచున్నారో వారిని ఆయా విధములుగా నేను అనుగ్రహించుచున్నాను కానీ, ఏ ఒక్కనియందు అనురాగాముకాని, ద్వేషముగాని లేవు. (4:11)

            శ్లో|| యస్య సర్వే సమారమ్భాః కామసఙ్కల్పవర్జితాః|
జ్ఞానాగ్నిదగ్ధకర్మాణం తమాహుః పణ్డితం బుధాః||4-19
||ఎవని కర్మాచరణములు కామ సంకల్పములు కావో యెవని కర్మలు జ్ఞానమను నిప్పుచే కాల్పబడినవో, అట్టివానిని పండితులని విద్వాంసులని పల్కుదురు. (4:19)

            శ్లో|| బ్రహ్మార్పణం బ్రహ్మ హవిర్బ్రహ్మాగ్నౌ బ్రహ్మణా హుతమ్|
బ్రహ్మైవ తేన గన్తవ్యం బ్రహ్మకర్మసమాధినా||
4-24 ||యగ్నపాత్రము బ్రహ్మము, హోమద్రవ్యము బ్రహ్మము, అగ్ని బ్రహ్మము, హోమము చేయువాడు బ్రహ్మము, బ్రహ్మకర్మ సమాధి చేత పొందనగు ఫలము గూడ బ్రహ్మమనియే తలంచవలయును.

            శ్లో|| శ్రద్ధావాఁల్లభతే జ్ఞానం తత్పరః సంయతేన్ద్రియః|
జ్ఞానం లబ్ధ్వా పరాం శాన్తిమచిరేణాధిగచ్ఛతి|| 4-39 ||

శ్రద్ధ, ఇంద్రియ నిగ్రహము గలవాడు జ్ఞానమును పొందుటకు సమర్ధుడగును. అట్టి జ్ఞాని ఉత్కృష్టమైన మోక్షమును పొందును.

            పంచమ అధ్యాయం - సన్యాస యోగము శ్రీభగవానువాచ

|శ్లో|| సంన్యాసః కర్మయోగశ్చ నిఃశ్రేయసకరావుభౌ|
తయోస్తు కర్మసంన్యాసాత్కర్మయోగో విశిష్యతే|| 5-2 ||

కర్మ, సన్యాసములు రెండునూ మోక్షసోపాన సాధనములు. అందు కర్మ పరిత్యాగము కన్నా, కర్మానుష్టానమే శ్రేష్ఠమైనది. (5:2)

            శ్లో|| బ్రహ్మణ్యాధాయ కర్మాణి సఙ్గం త్యక్త్వా కరోతి యః|
లిప్యతే న స పాపేన పద్మపత్రమివామ్భసా|| 5-10 ||
ఎవడు ఫలాపేక్ష కాంక్షింపక బ్రహ్మార్పనముగా కర్మల నాచరించునో, అతడు తామరాకుకు నీటిబిందువులు అంటని రీతిగా పాపమున చిక్కుబడడు. (5:10)

            శ్లో|| జ్ఞానేన తు తదజ్ఞానం యేషాం నాశితమాత్మనః|
తేషామాదిత్యవజ్జ్ఞానం ప్రకాశయతి తత్పరమ్|| 5-16 ||

ఎవని అజ్ఞానము జ్ఞానము చేత నశింపబడునో అతనికి జ్ఞానము సూర్యునివలె ప్రకాశించి పరమార్థతత్వమును జూపును. (5:16)

            శ్లో|| విద్యావినయసమ్పన్నే బ్రాహ్మణే గవి హస్తిని|
శుని చైవ శ్వపాకే చ పణ్డితాః సమదర్శినః|| 5-18 ||

విద్యా వినయ సంపన్నుడగు బ్రాహ్మణునియందును శునకము శునక మాంసము వొండుకొని తినువాని యందును పండితులు సమదృష్టి కలిగి వుందురు.

            శ్లో|| శక్నోతీహైవ యః సోఢుం ప్రాక్శరీరవిమోక్షణాత్|
కామక్రోధోద్భవం వేగం స యుక్తః స సుఖీ నరః|| 5-23||

దేహత్యాగమునకు ముందు యెవడు కామక్రోధాది అరిషడ్వర్గములను జయించునో, అట్టివాడు యోగి అనబడును. (5:23)

            శ్లో|| యతేన్ద్రియమనోబుద్ధిర్మునిర్మోక్షపరాయణః|
విగతేచ్ఛాభయక్రోధో యః సదా ముక్త ఏవ సః|| 5-28 ||
ఎవడు ఇంద్రియములను జయించి, దృష్టిని భ్రూమధ్యమున నిలిపి ప్రాణాపాన వాయువులను స్తంబిమపజేసి, మనస్సును, బుద్దిని, స్వాధీన మొనర్చుకొని, మోక్షాసక్తుడై యుండునో అట్టివాడే ముక్తుడనబడును.

            శ్లో|| భోక్తారం యజ్ఞతపసాం సర్వలోకమహేశ్వరమ్|
సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాన్తిమృచ్ఛతి||
5-29 ||

సకల యజ్ఞ తపః ఫలములను పొందువానిగను, సకల ప్రపంచ నియామకునిగను, నన్ను గ్రహించిన మహనీయుడు మోక్షమును పొందుచున్నాడు. (5:29)

ఆరవ అధ్యాయం ఆత్మ సంయమ యోగము

            శ్లో|| యం సంన్యాసమితి ప్రాహుర్యోగం తం విద్ధి పాణ్డవ|
న హ్యసంన్యస్తసఙ్కల్పో యోగీ భవతి కశ్చన|| 6-2 ||

అర్జునా! సన్యాసమని దేనినందురో, దానినే కర్మయోగ మనియు అందురు. అట్టి యెడ సంకల్పత్యాగమొనర్పనివాడు యోగికాజాలడు.

శ్లో|| యుక్తాహారవిహారస్య యుక్తచేష్టస్య కర్మసు|
యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖహా|| 6-17 ||
యుక్తాహార విహారాదులు, కర్మాచరణము గలవానికి ఆత్మసంయమ యోగము లభ్యము.

శ్లో|| యథా దీపో నివాతస్థో నేఙ్గతే సోపమా స్మృతా|
యోగినో యతచిత్తస్య యుఞ్జతో యోగమాత్మనః|| 6-19 ||
గాలిలేనిచోట పెట్టిన దీపము నిశ్చలముగా ప్రకాశించులాగుననే మనోనిగ్రహము కలిగి అత్మయోగమభ్యసించిన వాని చిత్తము నిశ్చలముగా నుండును.

శ్లో|| సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని|
ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః|| 6-29 ||

సకలభూతములయందూ సమదృష్టి కలిగినవాడు, అన్ని భూతములు తనయందును, తనను అన్ని భూతములయందును చూచుచుండును.

శ్రీభగవానువాచ| శ్లో|| అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలమ్|
అభ్యాసేన తు కౌన్తేయ వైరాగ్యేణ చ గృహ్యతే|| 6-35 ||
అర్జునా! ఎట్టివానికైనను, మనస్సును నిశ్చలముగా నిల్చుట దుస్సాధ్యమే. అయినను దానిని అభ్యాసవైరాగ్యములచేత నిరోధింపవచ్చును.

            శ్లో|| యోగినామపి సర్వేషాం మద్గతేనాన్తరాత్మనా|
శ్రద్ధావాన్భజతే యో మాం స మే యుక్తతమో మతః|| 6-47 ||

అర్జునా! పరిపూర్ణమైన విశ్వాసముతో నన్నాశ్రయించి వినయముతో ఎవరు సేవించి, భజింతురో వారు సమస్త యోగులలో ఉత్తములు.

            సప్తమ అధ్యాయం - జ్ఞాన విజ్ఞాన యోగము

శ్లో|| మనుష్యాణాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే|
యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్త్వతః||
7-3 ||వేలకొలది జనులలో ఏ ఒక్కడో జ్ఞానసిద్ది కొరకు ప్రయత్నించును. అట్లు ప్రయత్నించిన వారిలో ఒకానొకడు మాత్రమె నన్ను యదార్ధముగా తెలుసుకోన గలుగుచున్నాడు.

            శ్లో|| భూమిరాపోనలో వాయుః ఖం మనో బుద్ధిరేవ చ|
అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టధా
||7-4||భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము అని నా మాయాశక్తి యెనిమిది విధములైన భేదములతో ఒప్పియున్నదని గ్రహింపుము.

          శ్లో|| మత్తః పరతరం నాన్యత్కిఞ్చిదస్తి ధనఞ్జయ|
మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ|| 7-7 ||
అర్జునా! నా కన్నా గొప్పవాడుగాని, గొప్పవస్తువుగాని, మరేదియును ఈ ప్రపంచమున లేదు. సూత్రమున మణులు గ్రుచ్చబడినట్లు ఈ

జగమంతయు నాయందు నిక్షిప్తమై ఉన్నది. (7:7)

          శ్లో|| పుణ్యో గన్ధః పృథివ్యాం చ తేజశ్చాస్మి విభావసౌ|
జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు|| 7-9 ||

భూమియందు సుగంధము, అగ్నియందు తేజము, యెళ్ళ భూతముల యందు ఆయువు, తపస్సుల యందు తపస్సు నేనుగా ఎరుగుము.

          శ్లో|| దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా|
మామేవ యే ప్రపద్యన్తే మాయామేతాం తరన్తి తే|| 7-14 ||
పార్దా! త్రిగునాత్మకము, దైవసంబందమగు నా మాయ అతిక్రమింపరానిది. కాని నన్ను శరణుజొచ్చిన వారికి ఈ మాయ సులభసాధ్యము. (7:14)

          శ్లో|| చతుర్విధా భజన్తే మాం జనాః సుకృతినోర్జున| ఆర్తో జిజ్ఞాసురర్థార్థీ జ్ఞానీ చ భరతర్షభ||7-16||ఆర్తులు, జిజ్ఞాసులు, అర్ధకాములు, జ్ఞానులు అను నాలుగు విధములైన పుణ్యాత్ములు నన్నాశ్రయించు చున్నారు.)

          శ్లో|| బహూనాం జన్మనామన్తే జ్ఞానవాన్మాం ప్రపద్యతే|
వాసుదేవః సర్వమితి స మహాత్మా సుదుర్లభః|| 7-19 ||

జ్ఞానసంపన్నుడైన మానవుడు అనేక జన్మములెత్తిన పిమ్మట విజ్ఞానియై నన్ను శరణమునొందుచున్నాడు. (7:19)

ఎనిమదవ అధ్యాయం – అక్షరపరబ్రహ్మయోగము

          శ్లో|| అన్తకాలే చ మామేవ స్మరన్ముక్త్వా కలేవరమ్|
యః ప్రయాతి స మద్భావం యాతి నాస్త్యత్ర సంశయః|| 8-5 ||

ఎవడు అంత్య కాలమున నన్ను స్మరించుచు శరీరమును వదలుచున్నాడో, వాడు నన్నే చెందుచున్నాడు. (8:5)

          శ్లో|| అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామినా|
పరమం పురుషం దివ్యం యాతి పార్థానుచిన్తయన్|| 8-8 ||

కవిం పురాణమనుశాసితార- మణోరణీయంసమనుస్మరేద్యః|
సర్వస్య ధాతారమచిన్త్యరూప- మాదిత్యవర్ణం తమసః పరస్తాత్||
8-9 ||

అర్జునా! ఎవడు అభ్యాసయోగముతో, ఏకాగ్రచిత్తమున దివ్యరూపుడైన మహాపురుషుని స్మరించునో, అట్టివాడు ఆ పరమపురుషునే చెందుచున్నాడు. ఆ మహాపురుషుడే సర్వజ్ఞుడు, పురాణపురుషుడు, ప్రపంచమునకు శిక్షకుడు, అణువుకన్నా అణువు, అనూహ్యమైన రూపము కలవాడు, సూర్యకాంతి తేజోమయుడు, అజ్ఞానాంధకారమున కన్నా ఇతరుడు. (8:8,9)

          శ్లో|| అవ్యక్తోక్షర ఇత్యుక్తస్తమాహుః పరమాం గతిమ్|
యం ప్రాప్య న నివర్తన్తే తద్ధామ పరమం మమ|| 8-21 ||

ఇంద్రియగోచరము కాని పరబ్రహ్మపదము శాశ్వతమైనది. పునర్జన్మ రహితమైన ఆ ఉత్తమపదమే పరమపదము. (8:21)

          శ్లో|| శుక్లకృష్ణే గతీ హ్యేతే జగతః శాశ్వతే మతే|
ఏకయా యాత్యనావృత్తిమన్యయావర్తతే పునః|| 8-26 ||

జగత్తునందు శుక్ల,కృష్ణములనెడి రెండు మార్గములు నిత్యములుగా

నున్నవి. అందు మొదటి మార్గము వలన జన్మ రాహిత్యము, రెండవదాని వలన పునర్జన్మము కలుగుచున్నవి.

  శ్లో|| వేదేషు యజ్ఞేషు తపఃసు చైవ దానేషు యత్పుణ్యఫలం ప్రదిష్టమ్|
అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగీ పరం స్థానముపైతి చాద్యమ్
||

యోగియైనవాడు వేదాధ్యయనము వలన, యగ్నతపోదానాదుల వలన కలుగు పుణ్యఫలమును ఆశింపక ఉత్తమమైన బ్రహ్మ పదవిని పొందగలడు.

తొమ్మిదవ అధ్యాయం - రాజవిద్యారాజగుహ్య యోగము

          శ్లో|| సర్వభూతాని కౌన్తేయ ప్రకృతిం యాన్తి మామికామ్|
కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహమ్|| 9-7 ||
పార్దా! ప్రళయకాలమునందు సకల ప్రాణులును, నాయందు లీనమగు చున్నవి, మరల కల్పాదియందు సకల ప్రాణులను నేనే సృష్టించు చున్నాను.

          శ్లో|| అనన్యాశ్చిన్తయన్తో మాం యే జనాః పర్యుపాసతే|
తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్|| 9-22 ||

ఏ మానవుడు సర్వకాల సర్వావస్థలయందును నన్నే ధ్యానించు చుండునో, అట్టివాని యోగక్షేమములు నేనే వహించుచున్నాను.

          శ్లో|| పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్ఛతి|
తదహం భక్త్యుపహృతమశ్నామి ప్రయతాత్మనః|| 9-26 ||
ఎవడు భక్తితో నాకు పత్రమైనాను, పుష్పమైనను, ఫలమైనను, ఉదకమైనను ఫలాపేక్షరహితముగా సమర్పించుచున్నాడో, అట్టి  వానిని నేను ప్రీతితో స్వీకరించుచున్నాను.

          శ్లో|| మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు|
మామేవైష్యసి యుక్త్వైవమాత్మానం మత్పరాయణః|| 9-34 ||

పార్దా! నాయందు మనస్సు లగ్నముచేసి యెల్లకాలము యందు భక్తీ శ్రద్దలతో స్థిరచిత్తుడవై పుజించితినేని నన్నే పొందగలవు. (9:34)

పదవ అధ్యాయం -  విభూతి యోగము

          శ్లో|| మహర్షయః సప్త పూర్వే చత్వారో మనవస్తథా|
మద్భావా మానసా జాతా యేషాం లోక ఇమాః ప్రజాః||
10-6 ||కశ్యాపాది మహర్షి సప్తకము, సనకసనందనాదులు, స్వయంభూవాది మనువులు నావలననే జన్మించిరి. పిమ్మట వారివలన ఎల్లలోక మందలి సమస్త భూతములు జన్మించును.

          శ్లో|| మచ్చిత్తా మద్గతప్రాణా బోధయన్తః పరస్పరమ్|
కథయన్తశ్చ మాం నిత్యం తుష్యన్తి చ రమన్తి చ
||10-9||పండితులు నాయందు చిత్తముగలవారై నాయందే తమ ప్రాణములుంచి నా మహిమానుభావ మెరింగి ఒకరికొకరు ఉపదేశములు గావించు కొనుచు బ్రహ్మానందము నను భవించుచున్నారు.

          శ్లో|| అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థితః|
అహమాదిశ్చ మధ్యం చ భూతానామన్త ఏవ చ|| 10-20 ||

సమస్తభూతముల మనస్సులందున్న పరమాత్మ స్వరూపుడను నేనే. వాని ఉత్పత్తి, పెంపు నాశములకు నేనే కారకుడను. (10:20)

          శ్లో|| వేదానాం సామవేదోస్మి దేవానామస్మి వాసవః|
ఇన్ద్రియాణాం మనశ్చాస్మి భూతానామస్మి చేతనా|| 10-22 ||

వేదములలో సామవేదము, దేవతలలో దేవేంద్రుడు, ఇంద్రియములలో మనస్సు, ప్రాణులందరి బుద్ధి నేనే. (10:22)

          శ్లో|| ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం కాలః కలయతామహమ్|
మృగాణాం చ మృగేన్ద్రో
హం వైనతేయశ్చ పక్షిణామ్||10-30 ||రాక్షసులలో ప్రహ్లాదుడు, గణికులలో కాలము, మృగములలో సింహము, పక్షులలో గరుత్మంతుడు నేనే.

          శ్లో|| యద్యద్విభూతిమత్సత్త్వం శ్రీమదూర్జితమేవ వా|
తత్తదేవావగచ్ఛ త్వం మమ తేజోం
శసమ్భవమ్|| 10-41 ||

లోకమునందు ఐశ్వర్యయుక్తమై, పరాక్రమయుక్తమై, కాంతియుక్తమైన సమస్త వస్తువులు నా తేజోభాగము వలననే సంభవములు. (10:41)

పదకొండవ అధ్యాయం - విశ్వరూప సందర్శన యోగము

శ్రీభగవానువాచ|పశ్య మే పార్థ రూపాణి శతశోథ సహస్రశః|
నానావిధాని దివ్యాని నానావర్ణాకృతీని చ|| 11-5 ||

పార్దా! దివ్యములై, నానావిధములై, అనేక వర్ణములై, అనేక విశేషములు గల నా స్వస్వరూపమును కనులార దర్శింపుము.

అర్జున శ్లో|| పశ్యామి దేవాంస్తవ దేవ దేహే సర్వాంస్తథా భూతవిశేషసఙ్ఘాన్|
బ్రహ్మాణమీశం కమలాసనస్థ- మృషీంశ్చ సర్వానురగాంశ్చ దివ్యాన్
||11.15
అనేకబాహూదరవక్త్రనేత్రం పశ్యామి త్వాం సర్వతోనన్తరూపమ్|
నాన్తం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప
||11-16

ద్యావాపృథివ్యోరిదమన్తరం హి వ్యాప్తం త్వయైకేన దిశశ్చ సర్వాః|
దృష్ట్వాద్భుతం రూపముగ్రం తవేదం లోకత్రయం ప్రవ్యథితం మహాత్మన్
|

ప్రభో కృష్ణా! దేవా! ఎల్లదేవతలు, ఎల్లప్రాణులు, బ్రహ్మాదులు, ఋషీశ్వరులు, వాసుకీ మొదలగుగాగల యెల్ల సర్పములు నీయందు నాకు గోచరమగుచున్నవి. ఈశ్వరా! నీ విశ్వరూపము అనేక బాహువులతో, ఉదరములతో, ముఖములతో ఒప్పియున్నది. అట్లయ్యుయు నీ ఆకారమున ఆద్యంత మధ్యమములను గుర్తింపజాలకున్నాను. కోరలచే భయంకరమై, ప్రళయాగ్ని సమానములైన నీ ముఖములను చూచుటవలన నాకు దిక్కులు తెలియకున్నవి. కాన ప్రభో! నా యందు దయముంచి నాకు ప్రసన్నుడవు కమ్ము కృష్ణా! ప్రసన్నుడవు కమ్ము. (11:15,16,20)

శ్రీభగవాచ| శ్లో|| కాలోస్మి లోకక్షయకృత్ప్రవృద్ధో లోకాన్సమాహర్తుమిహ ప్రవృత్తః|
ఋతే
పి త్వాం న భవిష్యన్తి సర్వే యేవస్థితాః ప్రత్యనీకేషు యోధాః|| 11-32 ||

అర్జునా! ఈ ప్రపంచమునెల్ల నశింపజేయు బలిష్టమైన కాలస్వరూపుడను నేనే. ఈ యుద్దమునకు సిద్దపడినవారిని నీవు చంపకున్నను బ్రతుకగల వారిందెవ్వరును లేరు.

          శ్లో|| ద్రోణం చ భీష్మం చ జయద్రథం చ కర్ణం తథాన్యానపి యోధవీరాన్|
మయా హతాంస్త్వం జహి మా వ్యథిష్ఠా యుధ్యస్వ జేతాసి రణే సపత్నాన్||

ఇప్పటికే ద్రోణ, భీష్మ, జయద్రధ కర్ణాది యోధ వీరులు నాచే 11.34 సంహరింపబడిరి. ఇక మిగిలిన శత్రువీరులను నీవు సంహరింపుము.

     శ్లో|| కిరీటినం గదినం చక్రహస్తం ఇచ్ఛామి త్వాం ద్రష్టుమహం తథైవ|
తేనైవ రూపేణ చతుర్భుజేన సహస్రబాహో భవ విశ్వమూర్తే|| 11-46 ||

అనేక భుజములు గల నీ విశ్వరూపమును ఉపసంహరించి, కిరీటము, గద, చక్రము ధరించిన నీ సహజ సుందరమైన స్వరూపమును దర్శింప గోరుచున్నాను కృష్ణా...

శ్రీభగవానువాచ|  శ్లో||  సుదుర్దర్శమిదం రూపం దృష్టవానసి యన్మమ|
దేవా అప్యస్య రూపస్య నిత్యం దర్శనకాఙ్క్షిణః|| 11-52 ||

అర్జునా! నీవు దర్శించిన ఈ నా స్వరూపమును ఎవ్వరునూ చూడజాలరు. ఈ విశ్వరూపమును దర్శింప దేవతలందరునూ సదా కోరుచుందురు. (11:52)

పన్నెండవ అధ్యాయం - భక్తి యోగము

శ్రీభగవానువాచ|  శ్లో|| మయ్యావేశ్య మనో యే మాం నిత్యయుక్తా ఉపాసతే|
శ్రద్ధయా పరయోపేతాః తే మే యుక్తతమా మతాః|| 12-2 ||

ఎవరు నాయందే మనస్సు లగ్నము చేసి, శ్రద్ధాభక్తులతో నన్ను ధ్యానించుచున్నారో అట్టివారు నాకు ప్రీతిపాత్రులు. వారే ఉత్తమ పురుషులు.

          శ్లో|| అభ్యాసేప్యసమర్థోసి మత్కర్మపరమో భవ|
మదర్థమపి కర్మాణి కుర్వన్సిద్ధిమవాప్స్యసి||12-10||
అభ్యాస యోగము కన్న జ్ఞానము, జ్ఞానము కన్న ధ్యానము, దానికన్న కర్మఫలత్యాగము శ్రేష్టము. అట్టి త్యాగము వల్ల సంసార బంధనము తొలగి, మోక్షప్రాప్తి సంభవించుచున్నది. (12:12)

          శ్లో|| అనపేక్షః శుచిర్దక్ష ఉదాసీనో గతవ్యథః|
సర్వారమ్భపరిత్యాగీ యో మద్భక్తః స మే ప్రియః|| 12-16 ||

ఎవడు కోరికలు లేనివాడై, పవిత్రుడై, పక్షపాతరహితుడై, భయమును వీడి, కర్మఫలత్యాగియై నాకు భక్తుడగునో, అట్టివాడు నాకు మిక్కిలి ప్రీతిపాత్రుడు.

          శ్లో|| సమః శత్రౌ చ మిత్రే చ తథా మానాపమానయోః|
శీతోష్ణసుఖదుఃఖేషు సమః సఙ్గవివర్జితః|| 12-18 ||
          శ్లో|| తుల్యనిన్దాస్తుతిర్మౌనీ సన్తుష్టో యేన కేనచిత్|
అనికేతః స్థిరమతిర్భక్తిమాన్మే ప్రియో నరః||12-19
|| శత్రుమిత్రుల యందును, మానావమానములయందును, శీతోష్ణ సుఖ దుఃఖాదుల యందును సమబుద్ది కలిగి సంగరహితుడై, నిత్యసంతుస్టుడై, చలించని మనస్సు గలవాడై, నా యందు భక్తిప్రవత్తులు చూపు మానవుడు నాకు ప్రీతిపాత్రుడు. (12:18,19)

పదమూడవ అధ్యాయం - క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము

శ్రీభగవానువాచ|          శ్లో|| ఇదం శరీరం కౌన్తేయ క్షేత్రమిత్యభిధీయతే|
ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః|| 13-2
||అర్జునా! దేహము క్షేత్రమనియు, దేహము నెరిగినవాడు క్షేత్రజ్ఞుడనియు పెద్దలు చెప్పుదురు.

          శ్లో|| అధ్యాత్మజ్ఞాననిత్యత్వం తత్త్వజ్ఞానార్థదర్శనమ్|
ఏతజ్జ్ఞానమితి ప్రోక్తమజ్ఞానం యదతో
న్యథా||13-12 ||ఆత్మజ్ఞానమునందు మనస్సు లగ్నము చేయుట, మోక్షప్రాప్తి యందు ద్రుష్టి కలిగియుండుట జ్ఞాన మార్గము లనియు, వానికి ఇతరములైనవి అజ్ఞానము లనియు చెప్పబడును.

          శ్లో|| కార్యకారణకర్తృత్వే హేతుః ప్రకృతిరుచ్యతే|
పురుషః సుఖదుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే
||13-21||ప్రకృతిని ‘మాయ’ యని యందురు. అది శరీర సుఖదుఃఖాదులను తెలియజేయును. క్షేత్రజ్ఞుడు, ఆ సుఖదుఃఖాదులను అనుభవించుచుండెను. (13:21)

          శ్లో|| సమం సర్వేషు భూతేషు తిష్ఠన్తం పరమేశ్వరమ్|
వినశ్యత్స్వవినశ్యన్తం యః పశ్యతి స పశ్యతి|| 13-28 ||

శరీరము నశించినను, తాను నశింపక, ఎవడు సమస్త భూతములందున్న పరమేశ్వరుని చూచునో, వాడే యెరిగినవాడు.

          శ్లో|| అనాదిత్వాన్నిర్గుణత్వాత్పరమాత్మాయమవ్యయః|
శరీరస్థో
పి కౌన్తేయ న కరోతి న లిప్యతే|| 13-32 ||

అర్జునా! గుణనాశరహితుడైనవాడు పరమాత్మ, అట్టి పరమాత్మ దేహాంతర్గుడయ్యెను. కర్మలనాచారించువాడు కాడు. (13:32)

          శ్లో|| యథా ప్రకాశయత్యేకః కృత్స్నం లోకమిమం రవిః|
క్షేత్రం క్షేత్రీ తథా కృత్స్నం ప్రకాశయతి భారత
||13-34||పార్దా! సుర్యుడోక్కడే యెల్ల జగత్తులను ఏ విధముగా ప్రకాశింప జేయు చున్నాడో, ఆ విధముగానే క్షేత్రజ్ఞుడు యెళ్ళ దేహములను ప్రకాశింప జేయుచున్నాడు. (13.34)

పదునాలుగవ అధ్యాయం - గుణ త్రయ విభాగ యోగము

శ్రీభగవానువాచ|శ్లో|| పరం భూయః ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమమ్|
యజ్జ్ఞాత్వా మునయః సర్వే పరాం సిద్ధిమితో గతాః|| 14-1 ||

జ్ఞానార్జనమున మహనీయులైన ఋషీస్వరులు మోక్షమును పొందిరి. అట్టి మహత్తరమైన జ్ఞానమును నీకు ఉపదేశించుచున్నాను. (14:1)

          శ్లో|| సర్వయోనిషు కౌన్తేయ మూర్తయః సమ్భవన్తి యాః|
తాసాం బ్రహ్మ మహద్యోనిరహం బీజప్రదః పితా|| 14-4 ||

అర్జునా! ప్రపంచమున జన్మించు ఎల్ల చరాచర సమూహములకు ప్రకృతి తల్లి వంటిది. నేను(పరమాత్మ) తండ్రి వంటివాడను. (14:4)

          శ్లో|| సత్త్వం రజస్తమ ఇతి గుణాః ప్రకృతిసమ్భవాః|
నిబధ్నన్తి మహాబాహో దేహే దేహినమవ్యయమ్|| 14-5 ||

అర్జునా! త్రిగుణములలో సత్వగుణము నిర్మలమగుటంజేసి, సుఖ జ్ఞానాభిలాషల చేత, ఆత్మను దేహమునందు బందించు చున్నది.

          శ్లో|| రజో రాగాత్మకం విద్ధి తృష్ణాసఙ్గసముద్భవమ్|
తన్నిబధ్నాతి కౌన్తేయ కర్మసఙ్గేన దేహినమ్
||14-7||ఓ కౌంతేయా! రజో గుణము కోరికలయందు అభిమానము, అనురాగము పుట్టించి, ఆత్మను బందించుచున్నది.

          శ్లో|| తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినామ్|
ప్రమాదాలస్యనిద్రాభిస్తన్నిబధ్నాతి భారత|| 14-8 ||
అజ్ఞానము వలన బుట్టునది తమోగుణము, అది సర్వప్రాణులను మొహింపజేయునది. ఆ గుణం, మనుజుని ఆలస్యముతోను, అజాగ్రత్తతోను, నిద్రతోను బద్దునిజేయును.

          శ్లో|| మానాపమానయోస్తుల్యస్తుల్యో మిత్రారిపక్షయోః|
సర్వారమ్భపరిత్యాగీ గుణాతీతః స ఉచ్యతే||
14-25||మానావమాన ములయందు, శత్రుమిత్రులయందు సమమైన మనస్సు గలవానిని త్రిగుణాతీతుడందురు.

పదిహేనవ అధ్యాయం - పురుషోత్తమ ప్రాప్తి యోగము

భగవానువాచ|  శ్లో|| ఊర్ధ్వమూలమధఃశాఖమశ్వత్థం ప్రాహురవ్యయమ్|
ఛన్దాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్|| 15-1 ||

బ్రహ్మమే మూలముగా నికృష్టమైన అహంకారము కొమ్మలుగా గల

అశ్వర్థవృక్షము అనాది అయినది. అట్టి సంసారవృక్షమునకు వేదములు

ఆకులు వంటివి. అట్టిదాని నెరింగినవాడే వేదార్ధసార మెరింగినవాడు.

          శ్లో|| న తద్భాసయతే సూర్యో న శశాఙ్కో న పావకః|
యద్గత్వా న నివర్తన్తే తద్ధామ పరమం మమ||5-
6 ||పునరావృత్తి రహితమైన మోక్షపధము, సుర్యచంద్రాదుల ప్రకాశమున కతీతమై, నా ఉత్తమ పథమై యున్నది.

          శ్లో|| అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః|
ప్రాణాపానసమాయుక్తః పచామ్యన్నం చతుర్విధమ్|| 15-14 ||

దేహులందు జఠరాగ్నిస్వరూపుడనై, వారు భుజించు భక్ష్య, భోజ్య, చోష్య, లేహ్య పదార్థముల జీర్ణము చేయుచున్నాను. (15:14)

పదహారవ అధ్యాయం - దైవాసురసంపద్విభాగ యోగము

          శ్లో|| తేజః క్షమా ధృతిః శౌచమద్రోహో నాతిమానితా|
భవన్తి సమ్పదం దైవీమభిజాతస్య భారత|| 16-3 ||
          శ్లో|| దమ్భో దర్పోభిమానశ్చ క్రోధః పారుష్యమేవ చ|
అజ్ఞానం చాభిజాతస్య పార్థ సమ్పదమాసురీమ్||
16-4 ||పార్దా! సాహసము, ఓర్పు, ధైర్యము, శుద్ధి, ఇతరులను వంచింపకుండుట, కావరము లేకుండుట మొదలుగు గుణములు దైవాంశ సంభూతులకుండును. అట్లే డంబము, గర్వము, అభిమానము, క్రోధము, కఠీనపు మాటలాడుట, అవివేకము, మొదలగు గుణములు రాక్షసాంశమున బుట్టిన వారికుండును.

          శ్లో|| త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః|
కామః క్రోధస్తథా లోభస్తస్మాదేతత్త్రయం త్యజేత్|| 16-21 ||

కామ, క్రోధ, లోభములు ఆత్మను నాశమును చేయును. అవి నరకప్రాప్తికి హేతువులు కావున, వానిని వదలి వేయవలెను. (16:21)

          శ్లో|| యః శాస్త్రవిధిముత్సృజ్య వర్తతే కామకారతః|
న స సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాం గతిమ్|| 16-23 ||

శాస్త్రవిషయముల ననుసరింపక యిచ్చామార్గమున ప్రవర్తించువాడు సుఖసిద్దులను పొందజాలడు. పరమపదమునందజాలడు. (16:23)

పదిహేడవ అధ్యాయం - శ్రద్ధాత్రయ విభాగ యోగము

శ్రీభగవానువాచ|   శ్లో|| త్రివిధా భవతి శ్రద్ధా దేహినాం సా స్వభావజా|
సాత్త్వికీ రాజసీ చైవ తామసీ చేతి తాం శృణు|| 17-2 ||జీవులకు గల శ్రద్ధ, పూర్వజన్మవాసనాబలము వలన లభ్యము. అది రాజసము, సాత్వికము, తామసములని మూడు విధములుగా నున్నవి. (17:2)

          శ్లో|| యజన్తే సాత్త్వికా దేవాన్యక్షరక్షాంసి రాజసాః|
ప్రేతాన్భూతగణాంశ్చాన్యే యజన్తే తామసా జనాః|| 17-4 ||సత్వగుణులు దేవతలను, రాజోగుణులు యక్షరాక్షసులను, తమోగుణులు భూతప్రేతగణంబులను శ్రద్ధాభక్తులతో పూజించుచుందురు. (17:4)

          శ్లో|| అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్|
స్వాధ్యాయాభ్యసనం చైవ వాఙ్మయం తప ఉచ్యతే
||ఇతరుల మనస్సుల నొప్పింపనిదియు, ప్రియము, హితములతో కూడిన సత్యభాషనము, వేదాద్యన మొనర్చుట, వాచకతపస్సని చెప్పబడును. (17:15)

శ్రీభగవానువాచ| శ్లో||  కామ్యానాం కర్మణాం న్యాసం సంన్యాసం కవయో విదుః|
సర్వకర్మఫలత్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణాః||
18-2 ||జ్యోతిష్టోమాది కర్మల నాచరింపకుండుట సన్యాసమనియు, కర్మఫలము, ఈశ్వరార్పణ మొనర్చుట త్యాగమనియు పెద్దలు చెప్పుదురు. (18:2)

          శ్లో|| అనిష్టమిష్టం మిశ్రం చ త్రివిధం కర్మణః ఫలమ్|
భవత్యత్యాగినాం ప్రేత్య న తు సంన్యాసినాం క్వచిత్||
18-12 ||కర్మములు ప్రియములు, అప్రియములు, ప్రియాతి ప్రియములని మూడు విధములు. కర్మఫలము కోరినవారు జన్మాంతరములందు ఆ ఫలములను పొందుచున్నాడు. కోరని వారు ఆ ఫలములను జన్మాంతరమున పొందజాలకున్నారు. (18:12)

          శ్లో|| ప్రవృత్తిం చ నివృత్తిం చ కార్యాకార్యే భయాభయే|
బన్ధం మోక్షం చ యా వేత్తి బుద్ధిః సా పార్థ సాత్త్వికీ|| 18-30 ||అర్జునా! కర్మమోక్షమార్గముల, కర్తవ్య భయాభయముల, బంధమోక్షముల, ఏ జ్ఞానమెరుగుచున్నదో అది సత్వగుణ సముద్భనమని ఎరుగుము.

          శ్లో|| ఈశ్వరః సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్ఠతి|
భ్రామయన్సర్వభూతాని యన్త్రారూఢాని మాయయా||
18-61 ||

ఈశ్వరుడు యెల్ల భూతములకు నియామకుడై, ప్రాణుల హృదయ ముందన్నవాడై, అంత్రగాడు బొమ్మలనాడించు రీతిగా ప్రాణుల భ్రమింపజేయుచున్నాడు. (18:61)     

          శ్లో|| సర్వధర్మాన్పరిత్యజ్య మామేకం శరణం వ్రజ|
అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః|| 18-66 ||

సమస్త కర్మల నాకర్పించి, నన్నే శరణుబొందిన ఎల్ల పాపముల నుండి నిన్ను విముక్తుని గావింతును. నీవు చింతింపకుము. (18:66)                                                                                                                   

          శ్లో|| య ఇదం పరమం గుహ్యం మద్భక్తేష్వభిధాస్యతి|
భక్తిం మయి పరాం కృత్వా మామేవైష్యత్యసంశయః|| 18-68 ||

ఎవడు పరమోత్క్రష్టమైనదియు, పరమరహస్యమైన ఈ గీతాశాస్త్రమును నా భక్తులకుపదేశము చేయుచున్నాడో వాడు మోక్షమున కర్హుడు.

          శ్లో|| కచ్చిదేతచ్ఛ్రుతం పార్థ త్వయైకాగ్రేణ చేతసా|
కచ్చిదజ్ఞానసమ్మోహః ప్రనష్టస్తే ధనఞ్జయ||
18-72 ||ధనంజయా! పరమగోప్యమైన ఈ గీతాశాస్త్రమును చక్కగా వింటివా? నీ అజ్ఞాన జనితమైన అవివేకము నశించినదా?

అర్జున ఉవాచ| శ్లో|| నష్టో మోహః స్మృతిర్లబ్ధా త్వత్ప్రసాదాన్మయాచ్యుత|
స్థితో
స్మి గతసన్దేహః కరిష్యే వచనం తవ|| 18-73 ||కృష్ణా! అచ్యుతా! నా అవివేకము నీ దయవలన తొలగెను. నాకు సుజ్ఞానము లభించినది. నాకు సందేహములన్నియు తొలగినవి. నీ ఆజ్ఞను శిరసావహించెదను.

          శ్లో|| యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః|
తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ||
18-78 ||

యోగీశ్వరుడైన శ్రీకృష్ణుడు, ధనుర్దారియగు అర్జునుడు ,ఎచట నుందురో, అచ్చట సంపద, విజయము, ఐశ్వర్యము, స్థిరమగు నీతి యుండును.

          శ్లో|| గీతాశాస్త్ర మిదం పుణ్యం యః పఠేత్ ప్రయతః పుమాన్. విష్ణోః పదమవాప్నోతి భయశోకాది వర్జితః . 101. గీతాశాస్త్రమును ఎవరు పటింతురో వారు భయశోకాది వర్జితులై విష్ణు సాయుజ్యమును పొందుదురు.


Total Pageviews