Wednesday, May 31, 2017

మానవ సేవే మాధవ సేవ

భక్తి అంటే ఏమిటి ?
"భక్తి అంటే ఏమిటి?"అని అడిగారొక రాజుగారు.
"భక్తీ అంటే మనం భగవంతుడి వద్దకు వెళ్ళడం కాదు, భగవంతుడినే మన వద్దకు రప్పించుకోవడం..." చెప్పారు ఒక మహర్షి.
"అవునా, నిజంగా దైవం మన వద్దకు వస్తారా? అసలు దైవానికి కావలసింది ఏమిటి?"
నాయనా! నిజానికి దైవం ఎవరి నుంచీ ఆశించేది ఏమీ లేదు. మానవ జన్మ ముక్తికి ఒక అవకాశం. భగవంతుడిని పూజించడం, స్మరించడం అనేవి నిన్ను నువ్వు తరింప చేసుకునేందుకు కాని, నువ్వు దేవుడికి ఏదో గొప్ప ఉపకారం, సేవ చేసావని భావించేందుకు కాదు. నిజానికి డాబు కోసం చేసే దానధర్మాలు వ్యర్ధం. అందుకే గొప్ప గొప్ప ఆలయాలు కట్టినా, దానాలు చేసినా సంతోషించని దైవం... నిష్కల్మషమైన మనసుతో చేసే ప్రార్ధనకు కరిగిపోతారు. అలాగని కేవలం పూజలు చేస్తూ ఉంటే దైవం మెచ్చరు. ప్రార్ధించే పెదవుల కన్నా, సేవ చేసే చేతులే మిన్న. ఉన్నంతలో దానం చేస్తూ, ఆ దైవం మెచ్చే పని నీవు చేసినప్పుడు , ఆయన తప్పక నిన్ను వెతుక్కుంటూ వస్తారు. ఇది సత్యం!
" అందుకు చాలా సహనం, ఓర్పు ఉండాలి కదా!"
అవును, సహజంగా మనలోని భక్తి ఎలా ఉంటుందంటే... ఒకరు వంద బిందెలతో శివుడికి అభిషేకం చేస్తే , శివుడు ప్రత్యక్షం అవుతాడు, అని చెప్పరే అనుకోండి, 98 బిందెలు మోసుకొచ్చి, అత్యంత ఓర్పుతో అభిషేకం చేస్తాం. 99 వ బిందె దైవం ఇంకా రాలేదే అన్న విసుగుతో, ఆయన నెత్తినే పడేసి వస్తాం. ఓర్పుకు ఓటమి లేదు. నమ్మకం, ఓర్పు, సేవ ఇవే దైవాన్ని చేరే మార్గాలు.
అలా ముని నుంచీ ఉపదేశం పొందిన రాజు గారు అనేక దానాలు చేసారు. భూ దానం, గో దానం, సువర్ణ దానం, కన్యా దానం. దైవ సాక్షాత్కారం కోసం వేచి ఉన్నారు. మారువేషంలో రాత్రులు తిరుగుతూ, ప్రజల అవసరాలు కనిపెట్టి అనేక గుప్త దానాలు చేసారు. అయినా దైవం ప్రత్యక్షం కాలేదు. రాజుగారు దైవానుగ్రహం కోసం ప్రార్ధిస్తూ, ఓర్పుగా సేవ చెయ్యసాగారు.
ఒక రోజు రాజుగారు రాత్రివేళ మారువేషంలో తిరుగుతుండగా, ఒక ఇంటి నుంచీ పిల్లవాడి ఏడుపు వినిపించింది. ఒక పేద బాలుడు తనకు ఆట బొమ్మలు కావాలని తల్లి దగ్గర మారాం చేస్తున్నాడు. విధవరాలయిన ఆమెకు సరయిన బట్టలే లేవు, బొమ్మలు ఎలా కొంటుంది? దిక్కుతోచక కొడుకును సముదాయిస్తోంది. కాని, పిల్లవాడు మొండికేసి ఏడుస్తున్నాడు. రాజు హృదయం ద్రవించిపోయింది. మర్నాడు మంచి మంచి బొమ్మలు, తినుబండారాలు ఆ పిల్లవాడికి పంపాడు. వెంటనే రాజు ముందు దైవం ప్రత్యక్షం అయ్యారు. రాజు ఆశ్చర్యపోయాడు.
"స్వామి! నేను ఎన్నో గొప్ప దానధర్మాలు చేసినా, ఆలయాలు, సత్రాలు, చెరువులూ త్రవ్వించినా నీవు రాలేదు. మరి ఈ నాడు నాపై నీ దయ కలిగేందుకు కారణం ఏమిటి?"
"రాజా! పూర్ణ మనస్సుతో ఏ చేసే చిన్న పనయినా నాకు ఎంతో తృప్తిని కలిగిస్తుంది. పిల్లవాడి మీద దయతో మనసు కరిగి, నీవు చేసిన దానం వల్ల నేను ప్రసన్నుడిని అయ్యాను. నీవు చేసే దానధర్మాలను ఇలాగే కొనసాగించి, తుదకు నా సన్నిధి చేరతావు," అని దీవించి అదృశ్యం అయ్యారు.
ప్రతీ క్షణం మనం మరణానికి చేరువ అవుతుంటాం. అది గుర్తెరగాలి. దానం చేసేందుకు మరొకరిపై ఆధార పడకండి.ఉన్నంతలో క్రొత్తవి, లేదా పాత బట్టలు, దుప్పట్లు, ఆహారం, కాస్త డబ్బు ఏదైనా ఇవ్వండి. రోజుకొక మంచి పని చెయ్యడం లక్ష్యంగా పెట్టుకుందాం. ఉన్నంతలో, నలుగురికీ సహాయపడదాం. మానవ సేవే మాధవ సేవ

"అంతా భగవత్ లీల"

"అంతా భగవత్ లీల" చిన్న కధ.
ఒక ఊళ్ళో గుడి ఎదురుగా కూర్చుని ఓ గుడ్డి వాడు అడుక్కుంటూ ఉండేవాడు.
చెట్టు నీడనే విశ్రాంతి పొందుతూ కాలక్షేపం చేసేవాడు.
రోజూ ఓ భక్తుడు గుడిని సందర్శించి, తిరిగి వెళ్ళే సమయంలో ఈ బిచ్చగాడి పాత్రలో ఓ నాణెం వేసేవాడు.
ఆ భక్తుడి నడక చప్పుడు, అతడు నాణాన్ని వేసినప్పుడు అయ్యే శబ్దం బిచ్చగాడికి స్పష్టంగా ఎరుకే.
ఈ భక్తుడికి, ఆ భిక్షగాడికి మధ్య ఏదో తెలియని అనుబంధం ఏర్పడింది.
బిచ్చగాడు బాగా ముసలివాడై పోయాడు.
చివరి క్షణాలు సమీపించాయని అతడికి అనిపించింది.
తను అభిమానం పెంచుకున్న ఆ భక్తునితో తన మనసులోని ఆఖరి కోరికను విన్నవించాడు.
తను దేహం చాలించిన తర్వాత, తను నివాసమున్న స్థలం లోనే ఆ దేహాన్ని సమాధి చేయాలని కోరాడు.
భక్తుడు సరేనన్నాడు.
ఆ ఘడియ రానే వచ్చింది.
బిచ్చగాడు తుది శ్వాస విడిచాడు.
భక్తుడు అతడడిగిన స్థలంలోనే గొయ్యి తవ్వసాగాడు.
ఆశ్చర్యం ……!
దాని నుండి నిధి బయటపడింది.
వెండి, బంగారు నాణాలు దానిలో ఉన్నాయి.
అవన్నీ అతడి సొంతమయ్యాయి.
మృతి చెందిన బిచ్చగాడు స్వర్గానికి చేరుకున్నాడు.
అక్కడ అతడికి ఈ సంగతి తెలిసింది.
జరిగిన దానికి సంతోషపడ్డాడు.
కానీ, ఒక సందేహం అతడిని పీడించింది.
నిధి మీదే కూర్చున్నాను కానీ జీవితమంతా అడుక్కుంటూ బిచ్చగాడి గానే ఉండిపోయాను.
దారిన పోయే దానయ్య కోటీశ్వరుడు అయ్యాడు.
ఏమిటయ్యా ఇది! అని ఇంద్రుణ్ణి ప్రశ్నించాడు.
అతడికి ఇంద్రుడు సమాధానం చెబుతూ,
నీ జీవితమంతా భగవంతుని సన్నిధిలోనే కూర్చుని, భగవన్నామాన్నే ఉచ్చరిస్తూ గడిపావు.
అందుకు నీకు స్వర్గప్రాప్తి కలిగింది.
అతడు రోజూ భగవత్సేవ చేస్తూ, నీకు యదా శక్తిగా తనకు చేతనైనంత దానం చేశాడు.
నీ కోరికను తీర్చేందుకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు.
అందుకే అతనికి సిరిసంపదలు లభించాయి
అన్నాడు ఇంద్రుడు.
వ్యక్తి తనలో నిక్షిప్తమైన ఉన్న అనంత చైతన్య శక్తిని గుర్తించలేక దానిని విస్మరించి,గుడ్డి వాడిలా బయటే ఏదో ఉందని పరిభ్రమించడం సరియైనదికాదు.ప్రతి ఒక్కరు తప్పక అంతరంగ ప్రయాణం చేయాలి.

Monday, May 29, 2017

మహాభారతం ఆర్ష విజ్ఞాన సర్వస్వం.

మహాభారతం ఆర్ష విజ్ఞాన సర్వస్వం.
ఇది:-
ధర్మతత్వజ్ఞుల దృష్టిలో  ఒక ధర్మ శాస్త్రం.
ఆధ్యాత్మిక వేత్తల దృష్టిలో ఒక వేదాంత శాస్త్రం .
సత్ కవీశ్వరుల దృష్టిలో సమస్త సాహితీ భాండాగారం.
ఇతిహాసికుల దృష్టిలో ఇతి శాస్త్రం.
నీతికోవిదుల దృష్టిలో నీతిశాస్త్రం.

Sunday, May 28, 2017

శివుడు అభిషేక ప్రియుడు అంటారు ఎందుకు?

శివుడు అభిషేక ప్రియుడు అంటారు ఎందుకు?
విష్ణువు అలంకారప్రియుడైనట్లే శివుడు అభిషేక ప్రియుడయ్యాడు. శివుడు అభిషేకాన్ని చాలా ప్రియంగా భావిస్తాడు. కాబట్టి అభిషేకప్రియుడనబడుతున్నాడు. ఎడతెగని జలధారతో శివలింగాన్ని అభిషేకిస్తారు. శివుడు గంగాధరుడు.ఆయన శిరస్సు పై గంగ వుంటుంది. అందువల్ల శివార్చనలో అభిషేకం ముఖ్యమైనది. గంగ జలరూపమైనది. జలం పంచభూతాలలోను, శివుని అష్టమూర్తులలోను ఒకటి. " అప ఏవ ససర్జాదౌ " అన్న ప్రమాణాన్ని బట్టి బ్రహ్మ మొదట జలాగ్నే సృష్టించాడు. ప్రాణులన్నింటికీ ప్రాణాధారం నీరే.
మంత్రంపుష్పంలోని " యోపా మాయతనంవేద " ఇత్యాది మంత్రాలలో నీటి ప్రాముఖ్యం విశదీకరించబడివున్నది. అందుచేత శివపూజలలో జలాభిషేకానికి ఎంతో ప్రాముఖ్యం ఏర్పడింది. భగవంతున్ని 16 ఉపచారాలతో పూజిస్తారు. అందులో ఇతర ఉపచారాలకంటే జలాభిషేక రూపమైన స్నానమనే ఉపచారమే ప్రధానమైనది.
"ప్రజపాన్ శతరుద్రీయం అభిషేకం సమాచరేత్" అన్న ప్రమాణాన్ని అనుసరించి శతరుద్రీయం పటిస్తూ అభిషేకం చేయాలి." పూజాయా అభికోహోమో హోమాత్తర్పణ ముత్తమం తర్పణాచ్చ జపః శ్రేష్టో హ్యభిహేకః పరో జపాత్ " పూజకంటే హోమము, హోమము కంటే తర్పణము, తర్పణం కంటే జపమూ, జపం కంటే అభిషేకము ఉత్తరోత్తరం, శ్రేష్టాలని పేర్కొనబడ్డాయి అని పెద్దలు చెపుతారు.

చక్కని ఎద్దు... కధ..

చక్కని ఎద్దు... కధ..
‘‘‘‘‘‘‘‘’‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘’‘‘‘‘‘’’’’’‘’’’’’’’’’’’’’‘’’’’’’’’’
అనగనగా గోపయ్య అనే రైతు దగ్గర ఒక గొప్ప ఎద్దు ఉండేది... అది చాలా బలంగా ఉండేది. అయినా అది చాలా శాంతంగా ఉండేది. గోపయ్య ఏ పని చెబితే దాన్ని, చాలా ఇష్టంగా చేసి పెట్టేది.
గోపయ్య కూడా ఆ ఎద్దును చాలా ప్రేమగా, జాగ్రత్తగా చూసుకునేవాడు. దాన్ని అస్సలు కొట్టేవాడు కాదు. దాని మీద ఈగను కూడా వాలనిచ్చేవాడు కాదు. ఆ ఎద్దు గురించి అందరితోనూ గొప్పగా చెప్పేవాడు.
ఒకసారి గోపయ్య ఊళ్ళో పెద్ద మనుషులతో మాట్లాడుతూ "నా ఎద్దు నూరు బండ్లను ఒకేసారి లాగేస్తుంది- కావాలంటే వెయ్యి నాణేలు పందెం" అనేశాడు. కొందరు ఆ మాటను వినీ విననట్టు ఊరుకున్నారు కానీ, గోపన్న అంటే సరిపోనివాళ్ళు కొందరు జట్టు కట్టి, "పందెం అంటే పందెం" అన్నారు.
పందెం రోజు రానే వచ్చింది. ఊళ్ళో వాళ్ళు నూరు బండ్లనూ వరుసగా ఒకదాని వెనుక ఒకటి కట్టి ఉంచారు. గోపయ్య ఎద్దును తెచ్చి మొదటి బండికి కట్టాడు. ఎద్దుకు ఇదంతా కొత్తగా ఉంది. అయినా యజమాని తెచ్చి నిలబెట్టాడు గనక, అట్లా ఊరికే నిలబడిందది. అందరూ 'లాగు లాగు' అన్నారు. కానీ ఎద్దు మాత్రం కదల్లేదు. గోపయ్య ఏం చెబుతాడోనని ఎదురు చూస్తూ అది అట్లానే నిలబడి ఉన్నది.
గోపయ్యకు తల తీసేసినట్లయింది. 'ఎద్దు బళ్ళను ఎందుకు లాగట్లేదు?' అని చికాకు మొదలైంది- ఆ చికాకులో 'తను దానికి లాగమని చెప్పనేలేదు' అని అతనికి గుర్తుకే రాలేదు. పైపెచ్చు, అది 'నా పరువు తీస్తోంది' అని చటుక్కున కోపం కూడా వచ్చేసింది: "వెయ్యి నాణేలు... పోగొట్టకు! వెయ్యి నాణేలు!! ఎప్పుడైనా చూశావా? అంత తిండి తినేది ఎందుకట, ఈ మాత్రం లాగలేవా?!" అని తిడుతూ, అందరు రైతుల లాగానే తనూ దాన్ని మొరటుగా చర్నాకోలతో కొట్టటం మొదలు పెట్టాడు అతను.
గోపయ్య అంతకు ముందు ఎన్నడూ దానితో కోపంగా మాట్లాడలేదు. ఏనాడూ దాన్ని తిట్టలేదు; ఒక్క దెబ్బకూడా వెయ్యలేదు! మరి ఇప్పుడు అతను అంత కోపంగా అరవటం, పైపెచ్చు చర్నాకోలతో కొట్టటం ఎద్దుకు ఏమాత్రం నచ్చలేదు. దాంతో అది పూర్తిగా మొండికేసింది- ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. దాన్ని కొట్టీ కొట్టీ అలసిపోయిన గోపయ్య పదిమందిలోనూ ఓటమిని అంగీకరించాల్సి వచ్చింది. డబ్బుతోబాటు పరువునూ పోగొట్టుకొని, తలవంచుకొని ఇల్లు చేరుకున్నాడతను.
"గతంలో అవసరం ఉన్నప్పుడు చాలా సార్లు ఈ ఎద్దే వంద బండ్లను అలవోకగా లాగేసింది గదా, మరి ఇవాళ్ల ఎందుకు లాగలేదు?!" అన్న ఆలోచన రాలేదు, కోపంతో రగిలిపోతున్న గోపయ్యకు. అయితే ఆరోజు సాయంత్రం చూసేసరికి, ఎద్దు మేత మేయకుండా- స్తబ్దుగా నిలబడి ఉన్నది. దాని ఒంటినిండా చర్నాకోల వాతలు- ఆ గాయాల చుట్టూ ఈగలు ముసురుతుంటే అది విసురుకోవటం కూడా లేదు. గోపయ్య వంకే చూస్తూ కన్నీరు కారుస్తున్నది!
దాన్ని చూసే సరికి గోపయ్య హృదయం ద్రవించింది. దాని గాయాలకు మలాం రాస్తూ అతను తన తప్పును గ్రహించాడు: 'ఈ మూగ జంతువుకూ హృదయం ఉంది. తన మాట నెగ్గాలన్న తొందరలో తను దాన్ని అనవసరంగా, కౄరంగా శిక్షించాడు. సున్నితమైన దాని మనసుకు గాయం కలిగించాడు!'
గోపయ్య కళ్ల నీళ్ళతో దానికి క్షమాపణ చెప్పుకొని, నిమిరి, ముద్దుచేసి, దగ్గర చేసుకున్నాడు. అతని మనసును గ్రహించిన ఎద్దు కూడా కొంత కుదుటపడ్డది.
తెలివి తెచ్చుకున్న గోపయ్య తర్వాతి రోజున మళ్ళీ గ్రామస్తులతో పందెం కాశాడు. 'ఈసారి పందెం రెండు వేల నాణేలు' అన్నారు గ్రామస్తులు. ఈసారి గోపయ్య ఎద్దుని కొట్టలేదు సరికదా, కనీసం అదిలించను కూడా లేదు. ప్రేమగా వీపు నిమిరి, 'లాగురా!' అనేసరికి, ఎద్దు వంద బండ్లనూ లాక్కొని ముందుకు ఉరికింది!
గోపయ్య పందెం నెగ్గటమే కాదు; జీవితాంతం‌ ఉపకరించే పాఠం ఒకటి నేర్చుకున్నాడు- 'ఎంత తొందర, ఎంత చికాకు ఉన్నా సరే, మనసుల్ని మటుకు గాయపరచకూడదు' అని.
చక్కని ఈ కథని మళ్ళీ ఓసారి చదవగలరని కోరుతూ...
జాగ్రత్తగా చూస్తే, పసి పిల్లలలో కూడా అనంతమైన శక్తి దాగి ఉన్నది.
ప్రేమ, ఆప్యాయతలు వాళ్ళు తమ ఈ శక్తిని వాస్తవీకరించుకునేందుకు సహాయపడతాయి. మంచి ఉపాధ్యాయులు అందరూ పిల్లల హృదయాల్ని అర్థం చేసుకొని సున్నితమైన మనసులతోటి సున్నితంగానే ప్రవర్తించాలి.
ప్రతి ఒక్కరూ షేర్ చెయ్యండి.. సమాజంలో మార్పుకోసం కృషి చేయండి..🙏🙏🙏

శుభోదయం!!!


ఉమ్మడి కుటుంబం -- ఎల్ బి శ్రీ రామ్ షా(హా)ర్ట్ ఫిలిమ్స్



కళ్ళ కొనల్లో చిరు చినుకు తాలూకు మెరుపు గుండె కోనల్లో చిన్న కుదుపుల మాటవిరుపు మనసున మల్లెల మాలలూగు మైమరపు కన్నుల వెన్నెల డోలలూగి ఎంతో హాయి గుండె నిండు కొమ్మల గువ్వలు గుసగుస రెమ్మల గాలులు ఊసులా అలలు కొలనులో గలగలలా దవ్వుల వేణువు సవ్వడిలా కొండంత తెలుగు సంస్కృతికి లంకంత భద్రాద్రి శ్రీరాముడి లఘు చిత్రాలు గోరంత ఉడతాభక్తి ఎంత హృదయంగమం వందనం అభినందనం



యు ట్యూబ్ లో తిలకించి పులకించండి ఎల్ బి శ్రీ రామ్ షా(హా)ర్ట్ ఫిలిమ్స్


ఈ సాంకేతిక యుగంలో

దూరాలు దగ్గరైనాయి 
దగ్గరితనం మాత్రం దూరమై 
యాంత్రికమైపోయింది 
చిత్రంగా గోరంత చిత్రంలో
కొండంత పరమార్ధాన్ని 
 లంకంత భద్రాద్రి శ్రీరాముడి 
ఈ చిట్టి చిత్రం విచిత్రం చూడండి 
సత్యసాయి విస్సా ఫౌండేషన్
https://www.youtube.com/watch?v=xpbSA-ZQa4Q

Saturday, May 27, 2017

తురాయిచెట్టు _ 'కంచువృషభముల అగ్నిశ్వాసం కక్కే గ్రీష్మం కదలాడీ..' -శ్రీ శ్రీ (మహాప్రస్థానం: శైశవగీతి) నాలుగుకొండలమధ్యా భగభగమండుతున్న కొలిమి లోయలో బుసలు కొడుతున్నగాలితిత్తులు. కమ్మరి చక్రం తిప్పుతున్నాడు, ఇత్తడి, రాగి, కాచం, సీసం జీవితమూలధాతువులన్నీ కట్టగట్టి కరిగించారు, ఆగీ ఆగీ మంటమీద ఆశాబాష్పాలు చిలకరించారు. లోకమంతా ఎదురు చూసింది, కొలిమిలో కరిగించి పోతపోసేదేమిటని? ఉక్కుమెరుపులతో, తేనెమరకలతో, జ్వాలామథనం నుంచి ఉచ్చైశ్రవంలాగా బయటకొచ్చింది ఖడ్గంకాదు, కాంస్యశిల్పంకాదు. నిప్పుతునకలు నెత్తిన ధరించి తురాయిచెట్టు. (Srinivasa Nyayapati ఈ కవిత, ఈ బొమ్మ, శ్రీశ్రీ వాక్యం అన్నీ మీకే) Image may contain: plant, flower and outdoor

తురాయిచెట్టు
____________
'కంచువృషభముల అగ్నిశ్వాసం కక్కే గ్రీష్మం కదలాడీ..'
-శ్రీ శ్రీ (మహాప్రస్థానం: శైశవగీతి)
నాలుగుకొండలమధ్యా భగభగమండుతున్న కొలిమి
లోయలో బుసలు కొడుతున్నగాలితిత్తులు.
కమ్మరి చక్రం తిప్పుతున్నాడు,
ఇత్తడి, రాగి, కాచం, సీసం
జీవితమూలధాతువులన్నీ
కట్టగట్టి కరిగించారు,
ఆగీ ఆగీ మంటమీద
ఆశాబాష్పాలు చిలకరించారు.
లోకమంతా ఎదురు చూసింది,
కొలిమిలో కరిగించి పోతపోసేదేమిటని?
ఉక్కుమెరుపులతో, తేనెమరకలతో,
జ్వాలామథనం నుంచి
ఉచ్చైశ్రవంలాగా బయటకొచ్చింది
ఖడ్గంకాదు, కాంస్యశిల్పంకాదు.
నిప్పుతునకలు నెత్తిన ధరించి
తురాయిచెట్టు.
(Srinivasa Nyayapati ఈ కవిత, ఈ బొమ్మ, శ్రీశ్రీ వాక్యం అన్నీ మీకే)

Friday, May 26, 2017

అమరవీరుని ఉత్తరం.

అమరవీరుని ఉత్తరం.
మనిద్దరమూ 18 వ ఏటే ఇంట్లోంచి బయటకు వచ్చాం...
నువ్వు నీ JEE క్లియర్ చేశావ్...
నేను ARMY కి సెలక్ట్ అయ్యాను...
నువ్వు ఐఐటి లో చేరావ్...
నేను training centre లో చేరాను...
నువు డిగ్రీకోసం రేయింబవళ్ళూ కష్టించావ్...
నేను ప్రపంచంలోనే అత్యంత కఠిన పరిస్తితుల మద్య
ట్రైన్ అయ్యాను...
నువ్వు బి.టెక్ పూర్తి చేశావ్...
నేను the best soldier అయ్యాను...
నీకు రోజూ ఉదయం 7 తో మొదలయ్యి
సాయంత్రం 6 తో ముగుస్తుంది ....
నాకు ఉదయం 4 తో మొదలయ్యి
రాత్రుళ్ళు కూడా శిక్షణ పొందాల్సి ఉంటుంది...
నీకు కాలేజీ లో స్నాతకోత్సవం ఉంటుంది ...
నాకు పాసింగ్ ఔట్ పెరేడ్ ఉంటుంది..
నువ్వు బెస్ట్ కంపెనీలో బెస్ట్ ప్యాకేజీతో చేరతావ్...
నేను నా ప్లటూన్ లో చేరతాను..
నీకు ఉద్యోగం వచ్చింది....
నాకు జీవన పరమార్ధం దొరికింది...
ప్రతి సందర్భంలోనూ నువ్వు నీ నీకుటుంబాన్ని కలుస్తావు... నేను నా తల్లితండ్రులను చూసే సమయం కోసం ఎదురుచూస్తాను ..
నువ్వు పండగలన్నీ
ఆనందోత్సాహలతో జరుపుకుంటావ్...
నేను నా సహచరులతో బంకర్లలో జరుపుకుంటాను..
మనిద్దరికీ పెళ్లయింది.....
నీ భార్య నిన్ను రోజూ చూస్తుంది....
నా భార్య నన్ను ఈరోజు ప్రాణాలతో చూస్తే చాలనుకుంటుంది..
నువ్వు బిజినెస్ ట్రిప్ కోసం విదేశాలు వెళ్తావ్...
నేను దేశ రక్షణ కోసం సరిహద్దుకు వెళ్తాను..
మనిద్దరమూ తిరిగొస్తాము...
చాలా రోజుల తర్వాత చూసిన
 నీ భార్య కన్నీళ్ళు నువ్వు తుడుస్తావు..
నేను తుడవలేను...
తనకు ఆత్మీయ కౌగిలి ఇస్తావ్..
నేను ఇవ్వలేను...
ఎందుకంటే ....
నేను శవపేటికలో ఉన్నాను...
నా చాతీ మీద మెడల్స్ ఉన్నాయ్..
వాటి బరువుకు నేను లేవలేను..
నా మహాప్రస్థానానికి అమర్చిన శవపేటిక మీద
నా జీవన సాఫల్యమైన '' భారత త్రివర్ణ పతాకంతో ''
అందంగా చుట్టబడి ఉంది...
ఆ గర్వించే క్షణాలు వదులుకొని
నేను శవపేటిక లోనుంచీ బయటకు రాలేను....
మాతృభూమి రక్షణలో నా జీవితం సార్ధకమైంది ...
మళ్ళీ సైనికుడిగా నే పుడతాను ...
నా జీవితం ఇంతటితో సమాప్తం
ఎందుకంటే నేను సైనికుణ్ణి ...... అమరుడ్ని ..
నీ జీవితం ముందుకే వెళ్ళాలని ఆశిస్తూ .....
''నీ మితృడైన ఒక సైనికుడు '' ....
భారత్ మాతాకి ... జై... జై హింద్...

శుభోదయం

ఓం నమో వేంకటేశాయ..ఓం నమో నారాయణాయ.. ఓం నమో భగవతే 
వాసు దేవాయ ..

అందముకెల్ల మూలమయి,ఆభరణంబులకన్న మిన్నయై 
విందును గూర్చెడిన్ కురుల వేడుకనిత్తురు మ్రొక్కుగానాటన్
పొందుగభక్తి తత్పరత పూరుషులన్ మగువల్ వినమృలై
అందునపుణ్యమేమొగద అర్పణచేయగ కుంతలమ్ములన్!!

Thursday, May 25, 2017

వసంత ఋతువు అయిపోవచ్చింది..Vadrevu Ch Veerabhadrudu

వసంత ఋతువు అయిపోవచ్చింది. ఆకులు కూడా కనబడనంత నిండుగా పూసిన పూలు రాలిపోయి, ఆకుపచ్చ మాత్రమే మిగిలిన చెట్లు.
ఈ దృశ్యంలో ఏదో చెప్పలేని దిగులు, కాని ఇది ఏదో పోగొట్టుకున్న దిగులు కాదు. ఒక సంతోషానుభవం ముగిసిపోయినప్పటి మన:స్థితి. పెళ్ళి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కల్యాణమంటపంలాగా.
వసంతం ఒక్కసారిగా తరలిపోదు, నెమ్మదిగా నెమ్మదిగా సాగిపోతూ ఉంటుంది, అది కూడా వెళ్ళడానికి కాళ్ళు రానట్టే వెళుతూంటుంది. ఆ క్షణాన్ని పట్టుకోవాలంటే నువ్వు బూసన్ లాంటి కవివి కావాలి.
యోసా బూసన్ (1716-1783) సుప్రసిద్ధ జపనీయ హైకూ కవులు నలుగురిలోనూ ఒకడు, బషో తర్వాతి వాడు. బషో చేతుల్లో ప్రాణం పోసుకున్న హైకూ ప్రక్రియని ఒక ఉద్యమంగా మార్చినవాడు. ప్రాచీన చీనా మహాకవుల్లో ఒకడైన వాంగ్ వీ లాగా, కవీ, చిత్రకారుడూ కూడా. కాబట్టే, వసంతం తరలిపోతున్న దృశ్యాన్ని ఇట్లా చిత్రించగలిగేడు:
వెళ్ళిపోతున్న వసంతం-
ఇంకా తచ్చాడుతూనే ఉంది
ఆలస్యంగా పూసిన పూల గుత్తుల్లో
ఒకప్పుడు మోహన ప్రసాద్ ఇస్మాయిల్ గారిని కలుసుకోడానికి కాకినాడ వెళ్ళాడు. రోజంతా గడిపారు ఆ కవులిద్దరూ. రాత్రి పదింటికో, పదకొండింటికో ఇస్మాయిల్ ఆ కవిని బస్ స్టాండ్ కి తీసుకువెళ్ళి బస్ ఎక్కించారు. బస్ కదలడానికి ఇంకా ఆలస్యమయ్యేటట్టుందని ఇస్మాయిల్ గారు మిత్రుడి దగ్గర సెలవు తీసుకుని ఇంటికి వెళ్ళిపోయారు. పొద్దున్నే ఆయన లేచి వీథి తలుపు తెరిచి చూస్తే, ఆ ఇంటి వరండాలో అరుగు మీద నిద్రపోతూ మోహన ప్రసాద్!
వెళ్ళిపోతున్న వసంతం ఇంకా తచ్చాడుతూనే ఉంది పూలగుత్తుల్లో అంటే అర్థమది.
వెళ్ళిపోయే వసంతం దిగులు పుట్టిస్తుంది కాని అది లేమి లోంచి పుట్టే వేదన కాదు, సంతృప్తి అంచులదాకా పయనించి తిరిగివచ్చేటప్పటి తీయని వేదన.
ఆ మెత్తని బాధ బహుశా బూసన్ కి తెలిసినట్టుగా మరెవరికీ తెలీదు. రాలిపోయిన పియొనీ పూలని చూస్తూ అతడిట్లా అంటున్నాడు:
పువ్వుల్లారా, మీరు రాలిపోయినా
మీ రూపమింకా
నా కళ్ళముందు నిలిచే ఉంది
పూలు రాలిపోయినా వసంతకాలవృక్షాలు శిశిరకాలవృక్షాల్లాగా బోసిపోవు. వాటి పచ్చదనం మరింత పచ్చబడుతుంది, వాటి నీడలు మరింత చిక్కబడతాయి. వేసవిలో చెట్ల నీడలు శరీరాన్ని మాత్రమే కాదు, మనసుని కూడ సేదదీరుస్తాయి.
పువ్వులన్నీ రాలిపోయి
ఈ గుడి మళ్ళా
ఆకుపచ్చవన్నె తిరిగింది
ఆ గుడి గుడి మాత్రమేనా? లోకమంతానూ. జీవితంలోని క్షణభంగురత్వాన్ని రాలుతున్న పూలు స్ఫురింపచేసినంతగా మరే దృశ్యమూ స్ఫురింపచెయ్యలేదనుకుంటాను. కాని చిత్రమేమింటంటే, ఈ దృశ్యం వైరాగ్యాన్ని మేల్కొల్పదు. అంతకన్నా కూడా జీవితం పట్ల మరింత ఇష్టాన్నే పెంచుతుంది.
ఇప్పుడంటే జీవితంలో అదృశ్యమైపోయేయిగానీ, ఒకప్పుడు రైల్వే స్టేషన్లలో, నీ స్నేహితులో, ప్రేమికులో,బంధువులో వెళ్ళిపోయేటప్పుడు ఆ చివరి వీడ్కోలు క్షణాలెట్లా ఉండేవి. కొంతసేపు వాళ్ళతో పాటే కంపార్ట్ మెంటులో కూచుండేవాళ్ళం. ఆ కంపార్ట్మెంట్ లో ఎక్కడానికొచ్చినవాళ్ళు, సామాన్లు సర్దుకోడానికో, సెటిల్ కాడానికో అవస్థ పడుతున్నా పట్టించుకోకుండా అక్కడే ఇంకా చెప్పడానికేదో విలువైనవేవో మిగిలిపోయినట్టూ, అవి చెప్పకపోతే చాలా నష్టపోతామన్నట్టూ ఏదేదే చెప్పుకునేవాళ్ళం. గార్డు విజిల్ ఊదేవాడు. నెమ్మదిగా లేచి పెట్టె దిగి మళ్ళా కిటికీ పక్కకొచ్చి నిలబడేవాళ్ళం. వాళ్ళ చేతిని ఆ కిటికీలోంచే మన చేతుల్లోకి తీసుకునే కొంతసేపు మౌనంగా ఉండిపోయేవాళ్ళం. రైలు కదిలేది. అక్కడే నిలబడేవాళ్ళం. వాళ్ళు ఆ కిటికీలోంచో, లేదా ఆ తలుపు దగ్గరనుంచో మనకేసే చూస్తూండేవారు. రైలు ఇంకా ముందుకు కదిలి ప్లాట్ ఫాం విడిచిపెట్టి మొదటి మలుపు తిరిగినదాకా, చివరి పెట్టె కూడా తరలిపోయిందాకా అట్లానే నిల్చుండేపోయేవాళ్ళం.
కాని వసంతం వెళ్ళిపోవడంలోని నిజమైన విషాదం వీటిలో లేదు. అదెట్లాంటిదో మళ్ళా బూసన్ నే చెప్పాలి. మరవలేని ఒక హైకూలో అతడిట్లా అంటున్నాడు:
వసంతం ముగిసిపోయింది
కవి ధ్యాస ఇప్పుడు
సంపాదకుల మీద.
ఒకప్పుడు జపాన్ లో ఋతువులు ముగిసిపోయేకనో, సంవత్సరం గడిచిపోయేకనో ఆ కాలమంతా వచ్చిన హైకూల్లోంచి కొన్ని హైకూలు ఏరి పుస్తకంగా తెచ్చేవారు. తన కవిత సంకలనంలో చోటుచేసుకోవడం కన్నా, ఏ హైకూ కవికైనా, కోరుకోవలసింది మరేమీ ఉండేది కాదు . అట్లాంటి సందర్భంలో, వసంతం ముగిసిపోయాక, కవి రాబోయే సంకలనాల్లో తన కవిత చేరుతుందా లేదా అన్న ధ్యాసలో పడిపోతాడంటాడు బూసన్.
ఈ కవితలో లోతైన ఒక అర్థముంది. అదేమంటే, వసంతం జీవిత అశాశ్వతత్వాన్ని స్ఫురింపచేసినందుకు, కవి సత్యం లోకి మరింత మేల్కోవలసింది పోయి, తన జీవితాన్ని ఒక స్మారకంగా మార్చుకోవడమెట్లా అని ఆలోచిస్తున్నాడన్నమాట! అది కూడా ఎట్లా! తన కవిత సంకలనానికి ఎక్కడం ద్వారా!
కాని ఋతుపరిభ్రమణం ముందు మనం చెయ్య వలసిందేమిటి? ఏమీ చెయ్యకూడదు. చూస్తూ ఉండాలంతే. బూసన్ చెప్పేదదే. చేసిందదే.
పూలు బాగా పూసినప్పుడు:
పొలంలో ఒక చాప పరుచుకు మరీ
కూర్చున్నాను, తదేకంగా చూసాను
పూలు పూసే దృశ్యాన్ని.
ఇంతలోనే పూలు రాలిపోవడం మొదలయ్యింది. అప్పుడు:
రాలుతున్న పూలు-
రెండు, మూడు రేకలు,
ఒకదానిమీద మరొకటి.
38 comments
Comments
Apv Prasad బూ సన్ లాంటి కవి, చిత్రకారుడి గురించి చెప్పాలంటే మీ లాంటి కవీ చిత్రకారుడుకే సాధ్యం 🙏
LikeShow More Reactions
Reply
6
14 hrsEdited
Apv Prasad మో, ఇస్మాయిల్ గార్ల ప్రస్తావన చాలా బాగుంది సర్
LikeShow More Reactions
Reply
6
14 hrs
Mallesham Muppa పొద్దున్నే రైల్వే స్టేషన్కు తీసుకెళ్లి మిత్రులకు వీడ్కోలిచ్చే దృశ్యాన్ని తలపించారు.వసంతం వెళ్ళిపోవడాన్ని అద్భుతమైన రీతిలో చప్పారు.శుభోదయం, ధన్యవాదాలు సార్.
LikeShow More Reactions
Reply
3
13 hrs
Gorantla Sahebpeera Sai వీడ్కోలు
వసంతం
ఇస్మాయిల్ గారి స్మృతి....కవి హృదయానికి ఆత్మీయ పలకరింపు మీ ఈ రచన సర్..
...See more
LikeShow More Reactions
Reply
2
13 hrs
Mani Vadlamani Yepati lage mee matalu chala bavunnayi. oka santrpti bhavana kaligindi.
LikeShow More Reactions
Reply
2
13 hrsEdited
Ssb Gera "వెళ్లి పోయే వసంతం వేదన పుట్టిస్తుంది కనీ, అది లేమి లోంచి పుట్టే వేదన కాదు, సంతృప్తి అంచుల దాకా పయనించి తిరిగి వచ్చేటప్పటి తీయని వేదన"- మొత్తం వ్యాసాన్ని ఆకాశపు అంచుల దాకా తీసి కెళ్ళిన అద్భుత వాక్యం. అందించిన మీకు కృతఙ్ఞతలు.
LikeShow More Reactions
Reply
3
13 hrs
Ashok Yanamadala అద్భుతమైన వర్ణణ
LikeShow More Reactions
Reply
2
13 hrs
Krishna Kishore Akkenapragada Adbutamaina varnana
LikeShow More Reactions
Reply
2
13 hrs
Vijay Chandra అద్భుతం అపూర్వం గుండె నరాల్లో ధమనుల్లో అనుభూతిని ప్రవహింపజేసే వాక్యాలు
LikeShow More Reactions
Reply
2
13 hrs
Volga Kutungar I am happy with cool summer shadows, Mangoes and Jasmines may also leave in a short while, but I am waiting for the early showers of rain knowing that life is an eternal journey of waitings and farewells. How beautiful is the life. Thank you for making me very contented this morning.
LikeShow More Reactions
Reply
7
13 hrs
Mallikarjuna Adusumalli అద్భుతమైన హైకూలు..రమ్యమైన మీ వివరణ మీ చిత్రాల్లాగే మదిలో నిలిచిపోతాయి. ఈమధ్య టవర్ అఫ్ లండన్ అండర్ గ్రౌండ్ రైల్వే స్టేషన్ దగ్గర చిత్రాలను చూస్తుంటే మీరే౩ గుర్తు వచ్చారు.మీ చిత్రాలే గుర్తు వచ్చాయి.ఆశ్చర్యం కదూ...
LikeShow More Reactions
Reply
2
12 hrs
Vishwanatham Kamtala సాహితీమూర్తికి వందనం.
మనోహరమైన చిత్రకారులు మీరు.ప్రకృతి అందాలను ఇంకా అందంగా చిత్రించగలరు.చెప్పాల్సిన విషయాన్ని హృదయంలో శాశ్వతంగా ముద్రించగలరు ఏనాటి కీ చెదిరిపోకుండా.
వసంతం వచ్చిపోవనుంది
...See more
LikeShow More Reactions
Reply
4
3 hrsEdited
Gnana Prasuna Mamanduru కదంబ మాలలా హాయి గొలిపాయి మీ మాటలు.....
LikeShow More Reactions
Reply
3
12 hrs
Rameshbabu Vasireddy అవునండీ గతాన్ని మా కళ్ళముందుంచారు.తీపి జ్ఞాపకాలు.
బెల్గాంలో ఊరుని ప్రాణ స్నేహితులను వదిలి వచ్చే సమయం.రైల్వేస్టేషన్. మనసంతా గుబులు. మిత్రుల కళ్ళలో దోబూచులాడుతున్న నీటి పొరలు.అందరిని గుండెలకు హత్తుకొని వీడలేక వీడిన వైనం మరల కళ్ళ ముందు.
కంపార్ట్మెంటు నుంచి ప్లాట్ఫారం దాటుతుండగా ఆఖరు హగ్ ఇచ్చి దూకిన మిత్రులు.
...See more
LikeShow More Reactions
Reply
4
12 hrs
LikeShow More Reactions
Reply
2
11 hrs
Guru Ram Prasad Peddada అద్భుతం గా,ఆర్ద్రం గా ఉంది మాష్టారూ.కళ్ళు చెమర్చాయి..Parting is such a sweet sorrow అన్న విషయాన్ని చక్కగా articulate చేసిన విధం అందరి మనసులకి దగ్గరగా ఉంది..మీ జీవితాన్ని already స్మారకంగా మార్చేసుకున్నారు..మీ సంగతెలా ఉన్నా,మేమందరమూ blessed మీ స్నేహం ద్వారా...
LikeShow More Reactions
Reply
2
11 hrs
Udaya Reddivari Rani అవును-- వెనక్కి తిరిగి చూస్తే వెళ్ళిపొయిన వసంతపు తాలుకు సౌందర్యము-- వాడి రాలిన పూల పరిమళము-- నన్ను జ్ఞాపకాల తాలుకు తియ్యని వేదనలో-మళ్ళీ--మళ్ళీ---- బ్రతికిస్తున్నయి-- అవును వసంతాలు --వెళ్ళిపోతాయి--- విరబూసిన పూలు వాడిపొతాయి-- కాని వాటి జ్ఞాపకల మధురిమలు మాత్రము మనస్సుపొరల్లో పదిలంగనే వుంటాయి--
LikeShow More Reactions
Reply
5
11 hrs
Rajaram Thumucharla ఎంత అందంగా చెప్పారు బూసన్ కవి గురించి..మో , ఇస్మాయిల్ ల్లాంటి గొప్ప కవుల ఉదంతాన్ని ఉటంకించి ఈ రచనకు ఒక పరిమళం అద్దారు. ఆత్మీయుల ప్రయాణపు వీడ్కోలు గురించి మీరన్న మాటలు కొప్పర్తి కవి కవితనొకదాన్ని గుర్తుకు తెచ్చింది.ధన్యవాదాలు
LikeShow More Reactions
Reply
2
11 hrs
Swathi SY పువ్వులన్నీ రాలిపోయి
ఈ గుడి మళ్ళా
ఆకుపచ్చవన్నె తిరిగింది 
...See more
LikeShow More Reactions
Reply
2
11 hrs
Udaya Reddivari Rani ఇలాగే వుంటుంది నన్ను కన్న నా ఊరు-- మళ్ళీ పరుగెత్తి --ప్రతిగోడను తడమాలని-- ప్రతి దారిలో నా పసితనపు జాడలు వెతకాలని ఎంత గా అనిపిస్తుందో-- థాంక్యు చెప్పటము తప్ప ----
LikeShow More Reactions
Reply
2
11 hrs
Maggi Honey Super GA varnincharu sir
LikeShow More Reactions
Reply
1
10 hrs
Paresh Doshi A touchh of zen. Beautiful
LikeShow More Reactions
Reply
2
10 hrs
Siva Sankar Nice sir
LikeShow More Reactions
Reply
1
10 hrs
నరసింహ శర్మ మంత్రాల బూసన్ కన్నా మంచి కవి సైనిక్ పురిలో ఉన్నాడు. వసంతం మీద కొన్ని కవితలు రాసాడు. వాటిల్లో ఈ క్రింది రెండూ చదివి చెప్పండి బాగున్నాయని.

వాకిట్లోకి వసంతం !!
...See more
LikeShow More Reactions
Reply
6
10 hrs
అలక జయ oka mo oka ismail oka vasantam
LikeShow More Reactions
Reply
1
10 hrs
Vavilala Krishna Murthy ప్రకృతి మారినట్లు మనం కూడ మారాలి.
LikeShow More Reactions
Reply
2
9 hrs
Suraparaju Radhakrishnamoorthy వదిలేసి వెళ్ళిపోయిన వసంతాలలోకి వలస పోతావా?
రాలినపూలపై పండిన ఆకులా వాలిపోతావా?
వచ్చే వసంతాలకై వాకిలి తలుపు తెరిచి వుంచు
...See more
LikeShow More Reactions
Reply
4
9 hrs
Sarojini Devi Bulusu అమ్మ ని కళ్ళ ముందు నిలబెట్టారు. ఆత్మీయులేవరోచ్చినా.. వాళ్ళువెళ్తున్నాప్పుడు గేటుదాకా వెళ్లి వీధి మలుపు తిరిగేదాకా ఆగి లోపలికి వచ్చేది. ఈ మధ్య మా మరదలు . ఎందుకో తెలుసా ?నాకు తెలుసు అంది.
ఒకసారి అడిగాను. ఎంత పని ఉన్నా వాళ్ళు వెళ్ళేవరకు మీరెందుకు అలా చూస్
...See more
LikeShow More Reactions
Reply
2
7 hrs
Gnanadev Akula వామ్మో , ఈ వసంత రుతువే గ్రీష్మం తాత లా ఉంటే , ఇక గ్రీష్మం ఎలావుండబోతోంది ? కొంపదీసి వర్షరుతువుతో కలిసిపోతుందా ?
LikeShow More Reactions
Reply
1
6 hrs
Malleswara Rao Akula Ippudu malls lo dorukutunna videsi pallu laaga unnai mee quotes. Raalipadina pools raatri kanna kalala to
LikeShow More Reactions
Reply
1
5 hrs
Malleswara Rao Akula Jaadaga tostundinaaku
LikeShow More Reactions
Reply
1
5 hrs
Padmaja Suraparaju మీ ఇంతక్రితం post ఒకదానికి ఒక f.b friend ,పూవు రాలిక్రిందపడేప్పుడు మీరు చూశారా,ఎంత ప్రత్యేక అనుభూతి అన్నారు.ఎంత అందంగా ప్రత్యేకమో ,ఎన్ని రకాలుగానో, అసలెందుకు ప్రత్యేకమో ఇంత poetic గా రాశారుమీరు. మీ కవి బూసన్ వెళ్ళిపోయిన వసంతం కోసం తన కళ్ళు రాల్చిన దుఃఖ...See more
LikeShow More Reactions
Reply
3
5 hrs
Rammohan Rao Thummuri వసంతాంతమా అప్పుడే
మళ్లీ పది అమావాస్యల్ని మింగాలి
వలరాజు విహారం చూడాలంటే
LikeShow More Reactions
Reply
2
3 hrs
Srisudha Modugu beautiful feel & excellent write up andi .
LikeShow More Reactions
Reply
1
3 hrs
Ganteda Gowrunaidu వెనుదిరిగెను పూలు పరచి
నవ్వుల నవ వసంతం
నా అన్వేషణ ఫలితం
...See more
LikeShow More Reactions
Reply
1
2 hrs
Venu Gopal Rao Jammi Mana sunna manushulunu kalam adi
LikeShow More Reactions
Reply
1
40 mins
Mani Ramesh Kolapalli నమస్తే సర్.
సాయానుకూలంగా విషయాన్ని
ఎంపిక చేస్కోడంలోనూ, వింత సోయగాల శైలి లోను
...See more
LikeShow More Reactions
Reply15 mins
Ram Bhaskar Raju E a rare kind of metaphysical nothingness....with all its loveliness.....

Total Pageviews