Friday, May 19, 2017

"నా పేరు వేసవి"

"నా పేరు వేసవి"
ఉక్కపోత,కరెంటుకోత ......వామ్మో భరించలేము తల్లో..........అని భయపడుతుంటారు కదా......అదే నేను.....ఇంకెవరు మీ వేసవిని......ఎందుకండీ అలా ఆడిపోసుకుంటారు.......సంత్సరానికి ఒక్కసారైనా నన్ను భరించలేరా చెప్పండి........నా పని నే చేసుకొనిపోవాలిగా........నాతోపాటు ఎన్ని రకాలు నావెంట వస్తాయో.........తీయని మావిడిపళ్ళు, చల్లని తాటిముంజెలు, ఘుమ ఘుమలాడుతూ మల్లెపూలు కూజాలో నీళ్లు......యివి ఎప్పుడైనా దొరుకుతాయా........నే వచ్చినప్పుడే వస్తాయి.....నా వెంటే ఉంటాయి. శుభకార్యాలన్నీ వరసపెట్టి.....పెళ్లిళ్లు, పేరంటాళ్ళు..... లొట్టలేసుకు తినడానికి ఆవకాయలు, మామిడి పళ్లు.......అలాగే వేసవి శిక్షణా శిబిరాలని ఉంటాయి గాని.......శీతాకాల శిక్షణాశిబిరాలని ఉన్నాయా.......గంతులేసుకుంటూ పిల్లలు ఆటలు, పాటలు అని నేర్చుకోవడానికి వస్తూంటే యెంత ముచ్చటేస్తుందీ....... అది గుర్తుంచ్చుకోరేం.......నేనే నాలుగు రోజులపాటు రాకపోతే యెంత యాతన పడిపోతారు.......బట్టలారకా, బయటకెళ్లలేక, జలుబులు, దగ్గులు, జ్వరాలు నరకయాతనలా ఉంటుంది.........ఇల్లంతా కంపు కొట్టిపోతుంది.......వానాకాలంలో బీచుకి వెళ్తారా చెప్పండి.......ఎంచక్కా నే వొచ్చినప్పుడే వెళ్తారు.....ఆ త్రిల్లే వేరు.......అప్పుడప్పుడు ఒంటికి చెమట పడితేనే ఆరోగ్యం కూడాను........ఒంటిలోవున్న మలినమంతా పోవాలంటే నే ఉండాల్సిందే.........మీ వూళ్ళో బాబోయ్ చెమట.......మా వూళ్ళో ఐతే అస్సలు చెమట పట్టదు.....అనీ......ఊరించడం పెద్ద గొప్పా ఏం........అదేదో అవార్డు పొందినట్టు.......వినలేక చస్తున్నా........ఏం ఫోజులమ్మా......నాన్సెన్స్ ఈ చెమటపొక్కులేంటీ, ఈ చెమటలేంటి అనీ విసుగా..... యిరవైనాలుగుగంటలు ఆ ఏ.సి లు బిగించుకొని మగ్గిపోతున్నారుకదా రూముల్లో చాలదూ.........కాకపొతే కరెంట్ బిల్లు పేలిపోతుందని భయం తప్పా.........పూర్వం ఐతే యిలాగే ఉండేదా.......ఎంచక్కా ఆరుబయట మంచాలేసుకొని పడుకునేవారు........నే వస్తానంటే యెంత ఆనంద పడేవారో ...... తాటి, వెదురు విసనకర్రలు తెచ్చుకొని విసురుకొనేవారు........పాపం ఫేనైనా ఉండేదా........రామ రామ........ఒక్కనాడైనా విసుక్కొనేవారుకాదు........తిరిగి నాకు ప్రశంసలు.......ఆహ వేసివి.....మావిడిపళ్ళెంటి, తాటిముంజెలేంటీ, మల్లెపూలెంటి అనీ.......మీరు వున్నారు.....ఎందుకూ........ఎంజాయ్ చెయ్యడమంటే........సినిమాలు షికార్లు కాదు..........ఇదికూడా ఎంజాయ్ చేయగలగాలి........యెవరూ...తెలియకడుగుతాను......మీరుచేసుకున్నదే........లేకపోతె మరేంటీ......ఎక్కడ చెట్లు కనిపించిన నరికేస్తారా........చెట్లు పెంచే ప్రసక్తి లేదంటారా.......పెద్ద పెద్ద భవనాలు కట్టేస్తారా.........పూర్వం వాళ్ళు ఇలానే చేసారా.......అందుకే అనుభవించండి........చేసుకున్న వాళ్లకి చేసుకున్నంత మహాదేవ అనీ..... ఎవరి ఖర్మకు ఎవరు కర్తలు......పర్యావరణాన్ని కాపాడండి అనీ.........ప్రభుత్వం అరుస్తున్న వినిపించుకోరా.......యిప్పటికైనా కళ్ళు తెరవండి.......బాధపడితేనే గాని బోధపడదని......తెలిసిందిగా......మీరు చెట్లని పెంచీ......వున్న చెట్లని నరికివేయకుండా......చూసుకున్న నాడు నేను కూడా మిమ్మల్ని యిబ్బంది పెట్టను.........అవునూ నేను ఉంటేనే కదా వర్షాలు పడేది...... నేను ఉంటనే కదా పంటలు పండేది..........నేనే లేకపోతె కుళ్లిపోయి నాశనమైపోవు........ఎందుకుపనికొస్తారు......ఏకాలానికి ఆ కాలం ఉంటేనే మజా......... నే చెప్పినట్టు చెయ్యకపోయారో......అప్పుడుంది అసలు కథ.........యింకా రాబోయే రోజుల్లో చుక్కలు చూపిస్తా తస్మాత్ జాగ్రత్త....గుర్తుంచుకోండేం.........నన్నుమాత్రం ఎప్పుడు తిట్టకండి...... ప్లీజ్. యిట్లు ముప్పుతిప్పలు మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్న ……..........
"మీ వేసవి."

No comments:

Post a Comment

Total Pageviews