Saturday, May 27, 2017

తురాయిచెట్టు _ 'కంచువృషభముల అగ్నిశ్వాసం కక్కే గ్రీష్మం కదలాడీ..' -శ్రీ శ్రీ (మహాప్రస్థానం: శైశవగీతి) నాలుగుకొండలమధ్యా భగభగమండుతున్న కొలిమి లోయలో బుసలు కొడుతున్నగాలితిత్తులు. కమ్మరి చక్రం తిప్పుతున్నాడు, ఇత్తడి, రాగి, కాచం, సీసం జీవితమూలధాతువులన్నీ కట్టగట్టి కరిగించారు, ఆగీ ఆగీ మంటమీద ఆశాబాష్పాలు చిలకరించారు. లోకమంతా ఎదురు చూసింది, కొలిమిలో కరిగించి పోతపోసేదేమిటని? ఉక్కుమెరుపులతో, తేనెమరకలతో, జ్వాలామథనం నుంచి ఉచ్చైశ్రవంలాగా బయటకొచ్చింది ఖడ్గంకాదు, కాంస్యశిల్పంకాదు. నిప్పుతునకలు నెత్తిన ధరించి తురాయిచెట్టు. (Srinivasa Nyayapati ఈ కవిత, ఈ బొమ్మ, శ్రీశ్రీ వాక్యం అన్నీ మీకే) Image may contain: plant, flower and outdoor

తురాయిచెట్టు
____________
'కంచువృషభముల అగ్నిశ్వాసం కక్కే గ్రీష్మం కదలాడీ..'
-శ్రీ శ్రీ (మహాప్రస్థానం: శైశవగీతి)
నాలుగుకొండలమధ్యా భగభగమండుతున్న కొలిమి
లోయలో బుసలు కొడుతున్నగాలితిత్తులు.
కమ్మరి చక్రం తిప్పుతున్నాడు,
ఇత్తడి, రాగి, కాచం, సీసం
జీవితమూలధాతువులన్నీ
కట్టగట్టి కరిగించారు,
ఆగీ ఆగీ మంటమీద
ఆశాబాష్పాలు చిలకరించారు.
లోకమంతా ఎదురు చూసింది,
కొలిమిలో కరిగించి పోతపోసేదేమిటని?
ఉక్కుమెరుపులతో, తేనెమరకలతో,
జ్వాలామథనం నుంచి
ఉచ్చైశ్రవంలాగా బయటకొచ్చింది
ఖడ్గంకాదు, కాంస్యశిల్పంకాదు.
నిప్పుతునకలు నెత్తిన ధరించి
తురాయిచెట్టు.
(Srinivasa Nyayapati ఈ కవిత, ఈ బొమ్మ, శ్రీశ్రీ వాక్యం అన్నీ మీకే)

No comments:

Post a Comment

Total Pageviews