Monday, May 22, 2017

సందేశాత్మక పద్యం.

ఏరులెన్నియున్న ఏకమౌసంద్రాన
భావమంత యొకటె భాషలందు
మతములెన్నియున్న మార్గదర్శనమదే!
విద్య​ ​నేర్చు​ ​బాల! వినయశీల!
భావం: 
విద్యతో పాటు వినయము​ ​నేర్చు బాలుడా! ఒక మాట వినుము.
ఈ అఖండ విశ్వంలో ​ చిన్న పెద్ద నదులు​ ఎన్నెన్నో ​,​ కానీ ​అన్నీ కలిసేది ​ఆ ​సముద్రంలోనే. ​ అదే విధంగా భాష​లెన్ని ఉన్నా భావ ప్రకటనకు ఒక మాధ్యమము గా మాత్రమే ఉపయోగపడుతాయి. అలాగే, మతాలు ఎన్ని ఉన్ననూ అవి చూపే మార్గదర్శనమొకటే.

No comments:

Post a Comment

Total Pageviews