Thursday, May 18, 2017

మోదకొండమ్మ జాతర Vadrevu Ch Veerabhadrudu

ప్రతి ఏటా వైశాఖంలో పాడేరు లో జరిగే మోదకొండమ్మ జాతర ని పోయిన ఏడాదినుంచీ ప్రభుత్వం రాష్ట్ర స్థాయి ఉత్సవంగా జరుపుతోంది. పోయినసారి ఆ ఉత్సవానికి వెళ్ళాం. ఈసారి కూడా రమ్మని కబురంపిస్తే, ఆ ఆహ్వానం అమ్మవారినుంచి వచ్చినట్టే అనుకుని పాడేరు వెళ్ళాను.
ఇరవయ్యేళ్ళ కిందట నేను పాడేరులో పనిచేసినప్పటికన్నా, ఈ మధ్యకాలంలో ఆ జాతర ఊహించలేనంత పెద్దజాతరగా మారింది. సమ్మక్క-సారక్క జాతరలానే మోదమ్మ జాతర కూడా గిరిజనేతరుల పండగగా మారిపోతున్నదా అనుకునేవాణ్ణి, కాని డా.శివరామకృష్ణ సంకలనం చేసిన 'మోదకొండమ్మ తుమ్మెదపదం' (2007)
(http://sakti.in/PDF_Files/modakondamma_thumedapadam.pdf)
చదివాక భద్రాచలం రాముడిలాగా, పాడేరు మోదమ్మ కూడా సంస్కృతీసంగమాన్నే కోరుకున్నదని అర్థమయింది.
గిరిజనసంస్కృతి, పల్లపు సంస్కృతి ప్రాయికంగా విరుద్ధ జీవితదృక్పథాలు. పల్లపుమనిషి చేతిలో కొండజాతి మోసపోతూనే ఉంది. అలాగని, ఆ సంస్కృతుల మధ్య కంచె కట్టలేం. కంచెలాంటి పరిరక్షణలతో గిరిజనుడు దోపిడీకి గురికాకుండా కాపాడాలనే రాజ్యాంగం ప్రయత్నిస్తూ వస్తున్నది. కానీ దోపిడీ ఆగకపోగా మరింత వికృతంగానూ, మరింత తీవ్రంగానూ మారడం కూడా మన కళ్ళముందే జరుగుతున్నది.
సంపర్కాన్ని ఆపలేం. అలాగని గిరిజనుడు గిరిజనేతర శక్తుల చేతిలో దోపిడీకి గురవుతుంటేనూ చూడలేం. ఈ శక్తుల్లో ప్రభుత్వం ఒకసారి అటూ, ఒకసారి ఇటూ కనిపిస్తున్నది. ఈ త్రాసులో ఎటుమొగ్గినా గిరిజనుడికే నష్టం వాటిల్లే పరిస్థితి. ఈ సమస్య ఇప్పుడు తీవ్రంగా కనిపిస్తున్నదిగానీ, గిరిజనుడికి కొత్తది కాదనీ, ప్రతి తరంలోనూ ఏదో ఒక రూపంలో గిరిజనసంస్కృతి ఈ ప్రశ్న ఎదట నిలబడుతూనే ఉన్నదని మోదమ్మ కథ చెప్తున్నది. దీన్ని అధిగమించాలని కూడా కోరుకుంటున్నది.
డా.శివరామకృష్ణ మాటల్లో చెప్పాలంటే:
'వర్ణధర్మాల ఉక్కు చట్రం సడలి, పాలకుల ఐశ్వర్యం,-ఆశ్రితుల నైపుణ్యం, బగతల నాయకత్వం, కొండదొరల కష్టజీవితం, మాలల లోకజ్ఞత, కమ్మరుల పనితనం వియ్యమంది ఈ అంతరాలు చెరిగిపోయి, ఎల్లలోకములు ఒక్క ఇల్లు కావలెనని , నిలచిన నింగిదేవతను, తొక్కిన భూదేవతను, ఆ నీడలు తోడులివ్వమంటూ పొలాలు ఊడ్చే పడతులు మాలగంగు,సంజీవరాజుల పెండ్లి పదాలలో కోరుకుంటున్నారు.'
ఆ పదాలు ఎంత అందమైన పదాలు! ఆయన సేకరించిన పాటలో ఈ చరణాలు చూడండి:
‘శరణు శరణు దుర్గాండ్లమ్మలు-మీ చరణాలు తప్పలేను
మీ చరణాలు తప్పినగాని-తుమ్మెదీరో-మీ కరుణాలు తప్పలేను
మీలాంటి కాలము రాగ-తుమ్మెదీరో-మిమ్ము తలచి పాడుతాము
ఓ మరచిన నుడుగులు బాబు-మతియందు గొలువవాలె
తెలియని నుడుగులు బాబు-మాకు తెలియచెప్పవాలె.
తప్పపాడెము తగులపాడెము-తుమ్మెదీరో-కోపచింతలొద్దుబాబు
మామీద దయలుంచుడు-తుమందీరో-మామీద సాయముంచుడు.'
మేం పాడేరు వెళ్ళే ముందురోజు సాయంకాలం విశాఖపట్టణంలో డా.శివరామకృష్ణ మళ్ళా మోదమ్మ కథ అంతా కళ్ళకు కట్టేటట్టు చెప్పుకొచ్చాడు. ఆయన మాటలు మా మీద ఎంత పనిచేసాయంటే, మేం ఆదివారం పొద్దున్న మోదమ్మ గుడినుంచి పాతపాడేరులో గుడికి వెళ్ళకుండా ఉండలేకపోయాం. అక్కడ, ఇప్పటి తరం గిరిజనులు మర్చిపోయిన ఆ స్థలంలో నిలబడగానే అడవి సంపెంగల సువాసన గుప్పున తాకింది. నాకు అమ్మవారి ఉనికి అనుభవంలోకి వచ్చినట్టనిపించింది.
2.
చాలా ఏళ్ళ తరువాత మత్స్యగుండం వెళ్ళాను. ఇప్పుడక్కడ కొత్తగా దేవాలయం, అక్కడ గెడ్డ మీద చిన్న వంతెన, అందమైన వ్యూపాయింట్ కూడా నిర్మించారు. దారిపొడుగునా విరగకాసిన మామిడిచెట్లు, చెట్లమీదనే పండి, కింద నేలంతా రాలినమామిడిపండ్లు. వాటిని చూస్తుంటే, ‘'అనేకవర్ణం పవనావధూతమ్ భూమౌ పతతి ఆమ్రఫలం విపక్వమ్' (రంగురంగుల మామిడిపండ్లు మిగలముగ్గి గాలితాకితే చాలు నేలమీదరాలుతున్నవి) అంటోవాల్మీకి చేసిన గిరివనవర్ణనలే గుర్తొస్తూ ఉన్నాయి.
అక్కడొక గిరిజనుడే శివార్చన చేస్తూ ఉన్నాడు. ఆయన చేతిలో ఒక దొప్ప ఉంది. నాకొక చెంబుడు నీళ్ళిచ్చి ఆ దొప్పలో పొయ్యమన్నాడు. ఆ నీళ్ళతో శివుణ్ణి అభిషేకించాడు. ఒక మారేడు దళాన్ని ఆ నీళ్ళల్లో తడిపి ఆ దళంతో నా నెత్తిన చిలకరించాడు. ఆ చిరుజల్లు తాకగానే నా అలసట మొత్తం తీరిపోయింది.
దారిపొడుగునా విరబూసిన తురాయిలు. నగరంలోనూ, గ్రామాల్లోనూ ఉండే తురాయిపూలలో ఇంత రాగరక్తిమ కనిపించదు. రోజంతా ఆ తురాయికాంతుల్ని కళ్ళతోనే పుణికిపుచ్చుకుంటూ ప్రయాణం చేస్తూ ఉన్నాను.
3
పోయిన ఆగష్టులో అరకులోయ దగ్గర కరాయిగూడ వెళ్ళడం, అక్కడ అలేఖ ధర్మాన్ని అనుసరిస్తున్న గిరిజనుల్ని కలవడం, వారితో మాట్లాడటం మీతో ముచ్చటించింది మీకు గుర్తుండే ఉంటుంది. అప్పుడు ఆ మహిమధర్మసమాజం ప్రతినిధి కొంబుపాణి బొడొభాయి తమ గ్రామానికి ఒక కమ్యూనిటీ హాలు మంజూరు చెయ్యమని గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ గారిని అడిగితే ఆమె అక్కడిక్కడే మంజూరు చేసేసారు. ఇప్పుడు ఆ కమ్యూనిటీ హాలు నిర్మాణం పూర్తయింది, మేం వచ్చి చూస్తే తమకి సంతోషంగా ఉంటుందని ఆ గ్రామస్థులు కబురు చెయ్యడంతో, మధ్యాహ్నం ఆ ఊరికి వెళ్ళాం.
ఆ గిరిజన గ్రామంలో ఆ పెంకుటిళ్ళు, ఆ మట్టి అరుగులు, ఆ పరిశుభ్ర, ప్రశాంత వాతావరణం చూడగానే ఎప్పట్లానే నా మనసు అక్కడే ఉండిపోవాలని కొట్టుకుపోయింది. ఆ అరుగులమీద కూచుని భాగవతమో, బుద్ధుడి సంభాషణలో, స్పినోజా లేఖలో చదువుకోవడం కన్నా జీవితంలో ఐశ్వర్యమేముంటుంది అనిపించింది.
ఆ మధ్యాహ్నం మేమక్కడి దేవాలయం ఆవరణలో కూచుండేటప్పటికే ఆకాశమంతా కృష్ణమేఘసముద్రమైపోయింది. ఆ నల్లనిమేఘాల్లోంచి సూర్యుడి వెలుతురు నీలిరంగుతెరలోంచి జల్లెడపట్టినట్టు అడవిమీద పడుతుంటే, జేగీయమానమైన విద్యుత్కాంతి కనుచూపుమేరంతా పరుచుకుంది. తమకొక సమావేశమందిరం కట్టించి ఇచ్చినందుకు, ఆ గ్రామస్థులు గిరిజనసంక్షేమ శాఖ కమిషనర్ ను దీవిస్తూ ఒక భజనగీతం ఆలపించారు. ఆ శ్రావ్యమంగళ ధ్వని నన్నింకా అంటిపెట్టుకునే ఉంది.
LikeShow More Reactions
Comment
35 comments
Comments
Narisetty Navneethkumar Nice narration.💕
LikeShow More Reactions
Reply
1
5 hrs
Kvrb Subrahmanyam మీ అక్షరాలూ దృశ్యాన్ని కళ్ల ముందు ఉంచుతాయి .పాడేరు అందాలు నేనూ అనుభవించాను
LikeShow More Reactions
Reply
2
5 hrs
Suseela Nagaraja మోదకొండమ్మ జాతరను దర్శించిన అనుభూతి మీరు రాసినది చదువుతూంటే సార్!
LikeShow More Reactions
Reply
2
5 hrs
Suraparaju Radhakrishnamoorthy చక్కగా పాడేరు మోదమ్మ మహిమ,పంచేరు తురాయి రాగరక్తిమ.
LikeShow More Reactions
Reply
1
5 hrs
Narayanacharyulu PV సుప్రశి ద్ధ ఆగమ ఆలయాల కంటే 
ఊరూరా వెలిసిన గ్రామదేవతల ఆలయా
లు జనపదుల ను చైతన్యపరిచాయి. పరిచయంచేస్తున్నాయి.నిరక్షరాశ్యులనుండి పరిశోథనచేయతగ్గ సాహిత్యా
...See more
LikeShow More Reactions
Reply
2
5 hrs
Vishwanatham Kamtala సహృదయ సంస్కారికి,సంస్కారానికి 
వందనం.
"సంపర్కాన్ని ఆపలేం.అలాగని గిరిజనుడు గిరిజనేతర శక్తుల చేతిలో 
...See more
LikeShow More Reactions
Reply
1
5 hrs
Apv Prasad మీ రచన చదివాకా ఆ అనుభూతి చాలా సేపటి దాకా వెంటాడుతూనే ఉంటుంది వీరభద్రుడు గారూ
LikeShow More Reactions
Reply
2
5 hrs
Apv Prasad తురాయి చెట్లు, వాల్మీకి మోదమ్మ అమ్మవారు ఆహ
LikeShow More Reactions
Reply
1
5 hrs
Phani Pavan Bhuvanagiri ఏ విషయాన్నీ కి అయినా తాదాత్మికర్ణం చెందటం ఒక ఎత్తు.. అలా పొందిన అనుభూతిని జనులకు కలిగించడం మరో ఎత్తు.. 
మీ తో పాటుగా మమ్ములను ప్రకృతి మాత ఒడిలో లాలిస్తున్నందుకు.. శత కోటి ప్రాణామాలు.. ధన్యులం.. 
ఒక్క మాట సర్. మేము మా మానవ నేత్రాలతో ఇంత అందం గా చూడలేము, మా చక్షువుల తో ఇంతకన్నా అందమైన వర్ణన వినలేము, అంతే...
LikeShow More Reactions
Reply
1
5 hrsEdited
Somasekhararao Markonda గిరిజనసంస్కృతి, పల్లపు సంస్కృతి ప్రాయికంగా విరుద్ధ జీవితదృక్పథాలు. పల్లపుమనిషి చేతిలో కొండజాతి మోసపోతూనే ఉంది. అలాగని, ఆ సంస్కృతుల మధ్య కంచె కట్టలేం. కంచెలాంటి పరిరక్షణలతో గిరిజనుడు దోపిడీకి గురికాకుండా కాపాడాలనే రాజ్యాంగం ప్రయత్నిస్తూ వస్తున్నది. కానీ...See more
LikeShow More Reactions
Reply
1
4 hrs
Narukurti Sridhar Good to see earthy color to the temple .
LikeShow More Reactions
Reply
1
4 hrs
నరసింహ శర్మ మంత్రాల చోడవరంలో మా నాన్నగారు రెండు కొబ్బరికాయలు కొంటే ఎందుకో అనుకున్నాను. మిణుగురు దాటాక రోడ్డు మధ్యలో చెట్టుకింద రెండు, మూడు త్రికోణపు రాళ్ళున్నాయి వాటిమీద పసుపు, కుంకుమలున్నాయి. రాత్రి పదకొండు గంటల వేళ అక్కడ ఎవరూ లేరు. మా నాన్నగారు కాళ్ళు చేతులు కనుక్కుని...See more
LikeShow More Reactions
Reply
3
4 hrs
Mahesh Kathi చాలా అద్భుతంగా వివరించారు. సొంతంగా అనుభవించిన అనుభూతి.
LikeShow More Reactions
Reply
1
4 hrs
LikeShow More Reactions
Reply
1
4 hrs
Hari Chandan Kumar మంచి వ్యాసం
LikeShow More Reactions
Reply
1
4 hrs
Sasi Thanneeru అమ్మవారి అనుభవం అంటే ఎలా ఉంటుంది మీకు ?
LikeShow More Reactions
Reply
1
4 hrs
Sujatha Velpuri పోయినేడాది ఇండియా వచ్చినపుడు మోద కొండమ్మ గుడిని చూశాను. అసలు ఆ ప్రాంతం వదిలి రావాలనే అనిపించలేదు. చాలా చక్కగా వివరించారు. జాతర చూడ్డానికి ప్లాన్ చేసుకోవాలి

నేను ఫోన్ తీసిన ఫొటోలలో ఒకటి
LikeShow More Reactions
Reply
2
4 hrs
Gorantla Sahebpeera Sai శుభం సర్
చక్కని అనుభూతిని ఆస్వాదించారు..
LikeShow More Reactions
Reply
1
4 hrs
Vishwanatham Kamtala పల్లె పట్టులన్నా, జనపదాలన్నా, మనుషులన్నా, మమతలన్నా, కొండలన్నా,కొండవాగులన్నా,పచ్చని చెట్లన్నా,ప్రకృతి మాత అంద చందాలన్న ప్రత్యక్షరంలోను,ప్రతి వాక్యం లోను ,ప్రతి భావంలోను మీ సంస్కారం ఉట్టిపడుతూ ఉంటె,మమకారం అక్షర రమ్యత కనులముందు కదలాడుతూ ఉంటె మా స్పందనలో ...See more
LikeShow More Reactions
Reply
1
4 hrs
Rajasekhar Rao Goteti ఈ అంతరాలు చెరిగిపోయి, ఎల్లలోకములు ఒక్క ఇల్లు కావలెనని
LikeShow More Reactions
Reply
1
4 hrs
LikeShow More Reactions
Reply
1
4 hrs
Radhakrishna Murty Tatavarty ప్రకృతే ఐశ్వర్యం. ఎంత మంచి మాట.
LikeShow More Reactions
Reply
1
4 hrs
Mallesham Muppa మీరు చెపుతుంటే విన్నట్లే అనుభూతి కలిగింది. ధన్యవాదాలు సార్.
LikeShow More Reactions
Reply
1
4 hrs
Venkateswar Lu G మీరు ఆ అరుగు మీద కూచుని.. మా అందరితో.. మాట్లాడుతున్నట్లు అనిపిస్తోంది సర్
LikeShow More Reactions
Reply
1
3 hrs
Sesha Sai Panangipalli మీ ప్రకటన ప్రకృతి కే అలంకరణ. ప్రకృతిని మించిన అస్థిత్వం లేదని,మీ అవగాహన, చాలా చాలా అరుదు. నా బోటి సామాన్యులను కూడా మమేకం చేయగల అనితర సాధ్యం మీ విద్వత్.
LikeShow More Reactions
Reply
1
3 hrs
Rajaram Thumucharla నేను ఇవన్నీ చూస్తానన్న నమ్మకం లేదు కానీ మీ మాటల్లో చూసినంత అనుభూతి కలుగుతోంది. మీరు చూసిన చేసిన ప్రతి యాత్రనో స్థలాన్నో అద్భుతంగా కళ్ళముందు నిలబెట్టేస్తారు సర్.
LikeShow More Reactions
Reply
1
3 hrs
Ganteda Gowrunaidu ఇది చదువుతుంటే పాడేరు లో ఒకరోజు రాత్రి మీ ఇంట్లో మీరిచ్చిన ఆత్మీయ ఆతిధ్యం..పాడుకున్న పాటలు ..చెప్పుకున్న ఊసులు గుర్తుకొస్తున్నాయి..
LikeShow More Reactions
Reply
1
3 hrs
Vijaya Pratap I went there a few years ago with my crew and shot the entire festival with a view to make it into a full fledged documentary........ meanwhile something came in the form of a beaurocratic hurdle....I still have the rushes. Wondering what to do!?
LikeShow More Reactions
Reply
1
2 hrs
Parvathi Medukonduru ....ఆ చిరుజల్లు తాకగానే అలసట మొత్తం తీరిపోయింది.... పాడేరు కళ్ళకు కట్టినట్టు రాశారు..
LikeShow More Reactions
Reply
1
2 hrs
Anand Yejandla Chaduvutunamtha sepu memu akkadey unnama annatlundi sir...chakkani anuboothi ....thank u sir
LikeShow More Reactions
Reply
1
2 hrs
Vijay Koganti మీరు వెళ్ళి రావడంతో బాటు మమ్మల్నీ అక్కడ వదిలేసి వచ్చారు. అద్భుతం!
LikeShow More Reactions
Reply
1
1 hrEdited
G Subba Rao Comments pette antha knowledge naku ledu.chala kalam kritam india today lo me articles chadivanu.malli fb lo .Meeku mee knowledge ki sathakoti pranamamulu.
LikeShow More Reactions
Reply
1
47 mins
Chaya Pradeepa Pv మీదైన లోకం చుట్టి వచ్చారు..!అడవి సంపెంగి పూల వాసన....తురాయి పూలలోని రాగరక్తిమ ....మాకందరికీ. అందించారు...అభిప్రాయాలు వ్రాస్తున్నవారి వాక్యాలు చెబుతున్నాయి...ఎంతగా తాదాత్మ్యం చెందుతున్నామో...మీ ప్రతి వ్యాసంగంతోనూ...ఎప్పటిలాగే అద్భుతం సర్!ధన్యవాదాలు..!💐💐💐
LikeShow More Reactions
Reply34 mins
Pydiraju Marupilla సార్ మీరు ITDA పాడేరు చేసానట్టు నాకు గుర్తు విశాఖ కూడా చేసారా నాకు ఙ్ఙాపకం రావడంలేదు
LikeShow More Reactions
Reply20 mins
Chaya Pradeepa Pv వీడియో చాలా బాగుంది...సర్! కల్మష మెరుగని గిరిజనుల గొంతులోని ఆర్ద్రతకు ప్రకృతే పులకిస్తోంది...వారి వస్త్రాలను తాకుతూ అలవోకగా పలకరిస్తోంది... మీరు చెప్పినట్టు ఆకాశం కృష్ణమేఘసముద్రమై కృతజ్ఞతల జల్లు కురిపించడానికి సిద్ధంగా ఉంది!! ప్రకృతి కాంతకు వందనాలు..
ఎన్ని సోయగాలను తనలో ఇముడ్చుకుంది....!గిరిజనులు ధన్యజీవులు!!!
LikeShow More Reactions
Reply18 mins

No comments:

Post a Comment

Total Pageviews