Sunday, May 21, 2017

" నా ఊరు- నేదునూరు " ఎల్బీ శ్రీరాం..


(శ్రీమతి అనసూయ,
అభినవాపస్థంబ బ్రహ్మశ్రీ
లంక వేంకటరామశాస్త్రి సోమయాజులు)--
నే పెరిగిన ఊరికి హారం మా 'అగ్రహారం'--
నే తిరిగిన వీధులు--
నే నెరిగిన మనుషులు--
నే నెక్కిన చెట్లూ-- ఇళ్ళ మెట్లూ--
దిగిన కాలవ గట్లూ--
ఆడిన అల్లిచెరువు గట్లూ--
పరుగులెత్తిన, పడిలేచిన పొలం గట్లూ--
నా నేల దున్నిన ఎడ్లూ, నే తిన్న వడ్లూ--
నే తొక్కిన నల్లరేగడి మట్టీ--
నే మెక్కిన తెల్లమీగడ బొండం--
నా చెవులలో రింగురింగు ఖంగుఖంగుల
మా బడి, గుడి గంటల, వేదఘోషల
మలయ మారుతాలూ--
మా గురువులు, మా చదువుల బరువులూ-----
మొ-త్తం నా బాల్యం సాక్షిగా----------
" నా ఊరు- నేదునూరు "
అని చెప్పడానికి-----
నా రొమ్ము విరుస్తాను!!
నా తల వంచుతాను!!
ఎల్బీ శ్రీరాం..

No comments:

Post a Comment

Total Pageviews