Friday, August 31, 2018

అంతర్జాతీయభాష (international language), ప్రపంచ భాష (global language) ల మధ్య తేడా

దాదాపు పదిహేనేళ్ళ కిందట ఇంటర్నెట్లో Spanish as a global language అనే ఒక వ్యాసం చదివాను. ఆ వ్యాసరచయిత ప్రస్తుత ప్రపంచంలో ఇంగ్లీషుతో స్పానిష్ ని పోలుస్తూ, స్పానిష్ కూడా ఒక ప్రపంచ భాషగా మారడం గురించి కొన్ని ఆలోచనలు పంచుకున్నాడు. అతడికి ఆ విషయంలో డేవిడ్ క్రిస్టల్ రాసిన English as a Global Language (1997) అనే రచన స్ఫూర్తినిచ్చింది.
డేవిడ్ క్రిస్టల్ నేడు జీవించి ఉన్న ఇంగ్లీషు భాషాపండితుల్లో ఒక విజ్ఞాన సర్వస్వం వంటివాడు. అతడు ఇంగ్లీషు భాషాపరిణామాన్ని చాలా సునిశితంగా పరిశీలిస్తూ ఇంగ్లీషు గ్లోబల్ భాషగా పరిణమిస్తోందని చెప్తున్నప్పుడు, అంతర్జాతీయభాష (international language), ప్రపంచ భాష (global language) ల మధ్య తేడా ఉందని గుర్తుపట్టాడు.
ఒక భాష మాట్లాడే ప్రజలు వివిధ దేశాల్లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్నప్పుడు ఆ భాష కేవలం అంతర్జాతీయ భాష మాత్రమే అవుతుంది. అలా కాక, వివిధ దేశాల్లో ఉండే వివిధ భాషావ్యవహర్తలు కూడా ఒక భాష మాట్లాడటం మొదలుపెట్టినప్పుడు, ఆ భాష ప్రపంచభాషగా మారుతుంది. బ్రిటిష్ సామ్రాజ్యం ప్రపంచమంతా వ్యాపించి ఉన్న రోజుల్లో ఇంగ్లీషు ఒక అంతర్జాతీయ భాష గా మాత్రమే ఉండింది. కాని 1980 తర్వాతనే ఇంగ్లీషు ఒక గ్లోబల్ భాషగా వికసించడం మొదలుపెట్టింది. చాలా కాలం పాటు ఇంగ్లీషుకి దూరంగా ఉన్న చైనా లాంటి మహాదేశం కూడా ఇప్పుడు ఇంగ్లీషు నేర్చుకోక తప్పని స్థితికి ఇంగ్లీషు చేరుకుంది.
అయితే, ఈ అవకాశం ఇంగ్లీషుకు మాత్రమే స్వంతమా? మరొక భాష ఈ స్థాయికి చేరుకునే అవకాశం లేదా? ఈ ప్రశ్నలతో ఆ స్పానిష్ భాషాభిమాని తన వ్యాసం మొదలుపెడుతూ, ఒక భాష ప్రపంచ భాష గా ఎదగాలంటే ఉండవలసిన ఈ లక్షణాలను స్థూలంగా పేర్కొన్నాడు.
ఒక భాష ప్రపంచభాషగా ఎదగడానికి ఆ భాష ని మాట్లాడే మూలవ్యవహర్తల సంఖ్యతోగాని, ఆ దేశం పరిమాణంతోగాని, ఆ భాషతాలూకు వ్యాకరణ నిర్మాణంతో గాని సంబంధం లేదు.
ఒక భాష ప్రపంచానికి పరిచయం కావడానికి, ఆ భాష మాట్లాడేవాళ్ళ రాజకీయ శక్తి తొలిరోజుల్లో ఉపయోగపడుతుంది. కాని, ఆ తరువాత కేవలం రాజకీయ శక్తి వల్ల ఆ భాష గ్లోబల్ భాషగా మారిపోదు.
ఒక భాష అంతర్జాతీయ స్థాయినుంచి ప్రపంచభాషగా మారే క్రమంలో అన్నిటికన్నా ముందు అవసరమైంది ఆ భాష కుండే చలనశీలత. అంటే వివిధ ప్రపంచ పరిణామాల్ని ఆ భాష ఎంత తొందరగా పట్టుకోగలదు, వ్యక్తం చేయగలదు అన్నది ముఖ్యం.
రెండవది, ఒక భాష ప్రపంచభాష కావాలంటే, ఆ భాష నేర్చుకోవడంలో ఒక ఆర్థిక ప్రయోజనం ఉండాలి. అంటే, ఆ భాష జీవనోపాధి భాషగా కూడా వికసించవలసి ఉంటుంది. ఉదాహరణకి, జపనీస్.
ఒక భాష జీవనోపాధి భాషగా మారాలంటే, ఆ భాష మాట్లాడే ప్రజలు ప్రపంచ వాణిజ్యంలోనూ, వస్తుసేవల ఉత్పత్తిలోనూ ప్రధానపాత్ర పోషించగలగాలి. ప్రపంచంలోని వివిధ దేశాలవారికి ఆ మూలభాషా వ్యవహర్తలతో మాట్లాడే అవసరం ప్రతిరోజూ కలగాలి. ఇందుకు ఉదాహరణ చైనీస్.
ఒక భాష ఆర్థికంగా ముందంజ వేస్తేనే చాలదు, ఆ భాషలో అత్యంత మౌలికమైన వైజ్ఞానిక, సాంకేతిక, తాత్త్విక వాజ్ఞ్మయం కూడా రావలసి ఉంటుంది. ఉదాహరణకి కిర్క్ గార్డ్ ని మూలంలో చదవడానికి ఎందరో డేనిష్ నేర్చుకోడానికి సిద్ధపడుతుంటారు. 500 ఏళ్ళ కిందట మిడిల్ ఇంగ్లీష్ గా ఉన్న ఆంగ్లో సాక్సన్ భాషను ఇంగ్లీషుగా మార్చిన వాళ్ళల్లో షేక్ స్పియర్ తో పాటు ఫ్రాన్సిస్ బేకన్, థామస్ హాబ్స్ కూడా ఉన్నారు. ఒక భాష సుసంపన్నం కావాలంటే గొప్ప సాహిత్యం రావాలి. కాని, అది 18 వ శతాబ్దం దాకానే సత్యం. గత రెండు వందల ఏళ్ళుగా ఏ భాషలో మౌలికమైన వైజ్ఞానిక పరిశోధన, తాత్త్విక చింతన, చర్చ జరుగుతున్నాయో, ఆ భాషలు మాత్రమే ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఉదాహరణకి జర్మన్. ఆధునికభాషల్లో అంత తాత్త్వికభాష మరొకటి లేదు. హిడెగ్గర్ లాంటి తాత్త్వికుణ్ణి ఇంగ్లీషు అనువాదంలో చదువుతున్నప్పుడు, ఇంగ్లీషు ఆ చింతన బరువు మోయలేకపోతున్నదనీ, తక్షణమే మనం జర్మన్ నేర్చుకోకతప్పదనీ గ్రహిస్తాం.
సరే, ఒక భాష బృహద్భాషగా పరిగణించబడాలంటే ఆ భాషలో గొప్ప సాహిత్యం వచ్చి ఉండాలనేది మళ్ళీ చెప్పవలసిన పనిలేదు. కాని, మనం కొత్తగా చెప్పుకోవలసిందేమంటే, ఆ సాహిత్యాన్ని ఆ మూలభాషలో చదవడానికి ఆసక్తి చూపించేవాళ్ళు ప్రపంచవ్యాప్తంగాపెరుగుతూ వస్తేనే ఆ భాష ప్రపంచభాషగా మారుతుందనేది.
అంటే, ఆ మూలభాషలో గొప్ప సాహిత్యం ఉందనీ, ఆ సాహిత్యాన్ని ఆ మూలభాషలో చదవలేకపోతే ప్రపంచం పేదదైపోతుందనే భావన కలిగేటంతగా, ఆ భాషా సాహిత్యం వివిధ ప్రపంచ భాషల్లోకి అనువాదం కావాలి. ఇందుకు చెప్పదగ్గ గొప్ప ఉదాహరణ రష్యన్.
ఒక భాష ప్రపంచభాషగా మారుతున్నదనడానికి క్రిస్టల్ చెప్పిన ఒక కొండ గుర్తు, ఆ భాషని ద్వితీయ భాషగా నేర్చుకోడానికి ఇష్టపడే వారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా ఎంత పెరుగుతోందో చూడమని.
ఆయన ఆ మాట రాసి ఇరవయ్యేళ్ళయ్యింది. ఇప్పుడు నేనేమంటానంటే, ఒక డిజిటల్ పరికరం తయారు చేసినప్పుడు, అందులో డిఫాల్టుగా పొందుపరిచే భాషల్లో ఒకటికాగలినప్పుడే ఆ భాషని ప్రపంచ భాషగా పరిగణించగలమని. ఎన్నో భారతీయభాషలకన్నా ఎంతో చిన్నదైన జపనీస్ ని ఈ సూచిక ప్రకారమే నేను గ్లోబల్ భాషగా పేర్కొంటున్నాను.
ఒక భాష వికసించాలంటే, లిపి, వ్యాకరణం, పదజాలం ముఖ్యమైనవే గాని, మరీ ఏమంత ముఖ్యమైనవి కావు. ఒక భాషలో ఆ భాషా పదజాలం ఉన్నంతమాత్రాన దాన్ని మనం సజీవ భాష అనడానికి లేదు. వేరే భాషల పదజాలాన్ని ఆ భాష ఎంత శీఘ్రంగా, ఎంత విస్తారంగా స్వీకరించగలదో లేదో అన్నదాన్నిబట్టే ఆ భాష సజీవం అవునోకాదో చెప్పగలం. ఉదాహరణకి, ఇప్పటి ఇంగ్లీషులో మూల ఆంగ్లో సాక్సన్ పదజాలం 25 శాతం కన్నా తక్కువే. మూడొంతులు విదేశీ పదజాలంతోనే ఇంగ్లీషు వికసిస్తున్నది. భాషని పదజాలంగా పొరపడకూడదు.
నలుగురూ భాష నేర్చుకోడానికి మనం లిపిని సంస్కరించవలసిన అవసరం లేదు. అత్యంత సంక్లిష్టమైన లిపులు కలిగిన చైనీస్, కొరియన్, జపనీస్ వంటి భాషలు నేర్చుకోడానికి ప్రపంచానికి ఆ భాషల లిపి అడ్డం పడటం లేదు. అసలు ఒక భాషకి లిపి ఏమంత ముఖ్యం కూడా కాదు. భారతదేశంలో అత్యధిక సంఖ్యాకులు మాట్లాడే హిందీకి స్వంత లిపి లేనే లేదు. మలేషియన్ భాష రోమన్ లిపినే వాడుకుంటున్నది.
ఒక భాషని వికసింపచేయడానికి ఆ భాషలో అక్షరాలు తగ్గించనక్కర్లేదు. ఏ భాషకైనా ఏదో ఒక సంక్లిష్ట పార్శ్వం ఉంటుంది. ఇంగ్లీషులో అక్షరాల సంక్లిష్టత తక్కువ, నిజమే, కాని స్పెల్లింగు సంక్లిష్టత చాలా ఎక్కువ. తానే కనుక భాషాదేవత అయి ఉంటే, ఇంగ్లీషు గ్లోబల్ భాష కావడానికి ఎంత మాత్రం ఇష్టపడి ఉండేవాడిని కానని స్వయంగా డేవిడ్ క్రిస్టల్ నే అన్నాడు. అందుకు ఆయన చూపించిన కారణం వికృతమైన ఇంగ్లీషు స్పెల్లింగు వ్యవస్థ. But ని బట్ అని పలుకుతున్నప్పుడు put ని మటుకు పుట్ అనీ ఎందుకు పలకాలో అర్థం కావటం లేదని డేవిడ్ క్రిష్టల్ కన్నా యాభై ఏళ్ళ ముందే 'విష్ణు శర్మ ఇంగ్లీషు చదువు' రచయిత వాపోయాడు. ఒక భాషలోని అక్షరసంపద ఆ భాషలోని ఉచ్చారణసంపదకు కారణమవుతుంది. సంస్కృతమే ఇందుకు ఉదాహరణ.
వ్యాకరణం భాషకి వెన్నెముకనే గాని, స్థిరమైన వ్యాకరణం ఏ భాషకీ లేదని మనం గుర్తుపెట్టుకోవాలి. తాను ఈజిప్టు వెళ్ళినప్పుడు అక్కడివాళ్ళు Welcome to Egypt అనకుండా, Welcome in Egypt అన్నారనీ, ఆ ఇంగ్లీషుని కూడా తాను ఆమోదించక తప్పలేదనీ క్రిష్టల్ ఒకచోట రాసుకున్నాడు.
ఈ నేపథ్యంలో తెలుగు భాష ఎక్కడుంది? ethnologue.com లెక్కల ప్రకారం సుమారు ఎనిమిదికోట్ల మంది మొదటిభాషగానూ, 5 కోట్ల మంది ద్వితీయ భాషగానూ మాట్లాడుతున్న ఈ భాష ప్రపంచ పటంలో ఎక్కడుంది?
గత ఇరవయ్యేళ్ళలో ఈ భాష నేర్చుకోడానికి ప్రపంచవ్యాప్తంగా ఎంత మంది ముందుకొచ్చారు?
గత పదేళ్ళలో ఎన్ని వైజ్ఞానిక, తాత్త్విక గ్రంథాలు తెలుగు భాషలో వెలువడ్డాయి? ఎన్ని అనువదించబడ్డాయి?
ఎన్ని ప్రాచీన తెలుగు కావ్యాలు ఎన్ని ప్రపంచభాషల్లోకి అనువదించబడ్డాయి? ఎన్ని ప్రపంచవ్యాప్త సర్వశ్రేష్ఠ రచనలు తెలుగులోకి అనువదించబడ్డాయి?
తెలుగు భాషలో ఎన్ని వెబ్ సైట్లు నడుస్తున్నాయి? ఎన్ని బ్లాగులు నడుస్తున్నాయి? వాటిని ప్రపంచవ్యాప్తంగా ఎందరు వీక్షించారు?
గత పదేళ్ళలో ప్రపంచ భాషల్లోంచి ఎన్ని కొత్త పదాలు తెలుగులోకి వచ్చాయి? ఎన్ని తెలుగు పదాలు ప్రపంచభాషల్లోకి ప్రవేశించాయి?
ఎన్ని నిఘంటువులు, పారిభాషిక పదకోశాలు తెలుగులో రూపొందాయి? ఎన్ని స్పోకెన్ తెలుగు కోర్సులు కొత్తగా రూపొందాయి?
ఎన్ని డిజిటల్ పుస్తకాలు, ఎన్ని ఆడియో పుస్తకాలు తెలుగులో ప్రచురించబడ్డాయి? ఎన్ని ఆన్ లైన్లో కుదురుకున్నాయి?
మార్కెట్లోకి వస్తున్న కొత్త మొబైల్ ఫోనుల్లో ఎన్నింటిలో తెలుగు ఒక భాషగా by default అమర్చిఉంటున్నది?
మిత్రులారా, ఆలోచించవలసింది వీటి గురించి. అంతే తప్ప, ఒక్క ఇంగ్లీషు మాట కూడా లేకుండా ఎన్ని నిముషాలు మాట్లాడగలం, ఎన్ని ఇంగ్లీషు పదాలకి కృత్రిమ తెలుగు సమానార్థకాలు రూపొందించగలం, 56 అక్షరాల్లోనూ ఎన్ని అక్షరాల్ని నిర్మూలించాం, ఎన్ని సైన్ బోర్డులు తెలుగులో పెట్టామని కాదు.

Wednesday, August 29, 2018

సొంత వాహ‌నాల్లో ప్ర‌యాణించే మిత్రులంద‌రికీ ఒక 4 జాగ్ర‌త్త‌లు

🅾సొంత వాహ‌నాల్లో ప్ర‌యాణించే  మిత్రులంద‌రికీ ఒక 4 జాగ్ర‌త్త‌లు

* బ్రేకులు చ‌క్రాల‌కే గాని కారుకు కాదు. 70-80 కిలోమీట‌ర్ల లోపు అయితే, స‌డెన్ బ్రేకేస్తే కారు ఆగుతుంది. కానీ అంత‌కు మించితే బ్రేకు వ‌ల్ల ఉప‌యోగం లేదు.
  * ప్రమాదాలు ఎవ‌రూ ఆప‌లేరు గాని... మ‌రీ ఇలా ఆగిఉన్న లారీల‌ను ఢీకొట్ట‌డం మాత్రం క‌చ్చితంగా స్వ‌యంకృతాప‌రాధ‌మే.
 డ్రైవింగ్‌లో జాగ్ర‌త్త లేన‌పుడు మాత్ర‌మే ఇది జ‌రుగుతుంది.
 * మీరు హ‌ర్ట‌యినా ప‌ర్లేదు గాని.. మీరేమీ ప్ర‌ధాని కాదు, సీఎం కాదు.. మీరు కొంచెం లేటెల్తే కొంప‌లేం మునిగిపోవు. పైగా మీ కొంప మునిగిపోయే అవ‌కాశాలెక్కువ‌. స్పీడు 160 దాకా కూడా వెళ్లొచ్చు. కానీ స్ట్రెయిట్ హైవేలు కాన‌పుడు 80 కి.మీ. కంటే, రాత్రి ప్ర‌యాణాల్లో 80-100 కంటే ఎక్కువ‌ స్పీడు క‌చ్చితంగా మిమ్మ‌ల్ని చంపేస్తుంది.
 * అయినా రాత్రిపూట సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తూ అర్జెంటుగా మీరు ఉద్ద‌రించాల్సిందేంటో ఆలోచించాలి.

 రిస్కు.... 
వ్యాపార‌ల్లో చేస్తే డ‌బ్బులు పోతాయి.
రోడ్ల మీద చేస్తే ప్రాణాలు పోతాయి

మీరు లేకుంటేమిమ్మల్ని ప్రేమించే వ్యక్తులు పడే బాధను ఊహించి జాగ్రత్త గా డ్రైవ్ చేయండి
జాగ్రత్తగా డ్రైవ్ చేయడం ద్వారా మన ప్రాణాలని నిలుపుకుందాం...
ఎదుట వచ్చే వారి ప్రాణానికి హామీ ఇద్దాం......
వేగం వద్దు....ప్రాణం ముద్దు

నిదానమే ప్రదానం అని ఊరికే అనలేదు భయ్యా, ఆలోచించండి, ఆచరించండి.. ☝☝

80Kmph స్పీడ్ కి 100-120kmph స్పీడ్ కి మధ్య తేడా కేవలం 10 నిమిషాలు మాత్రమే... లేటైతే పోయేది ఏమి లేదు, కానీ తొందర పడితే పోయేది కొన్ని జీవితాలు...

ఇట్లు మీ
శ్రేయోభిలాషి..🅾

Sunday, August 26, 2018

స్వరాల పల్లకి: కలువకు చంద్రుడు ఎంతో దూరం

స్వరాల పల్లకి: కలువకు చంద్రుడు ఎంతో దూరం: చిత్రం: చిల్లర దేవుళ్ళు (1975) సంగీతం: కె.వి. మహదేవన్ గీతరచయిత: ఆచార్య ఆత్రేయ నేపధ్య గానం: బాలు పల్లవి: కలువకు చంద్రుడు ఎంతో దూరం.. కమలానికి...

Tuesday, August 21, 2018

హృదయం ''సాయంకాలపు మంచు రాలుతున్న వేళ

హృదయం
''సాయంకాలపు మంచు రాలుతున్న వేళ
మహా శకుంతం తన రెక్కల మీది నుంచి
సూర్యబింబ సుగంధాన్ని తుడిచేసుకుంటున్న వేళ
మిణుగురు పురుగుల కాంతిలో
ప్రతి పక్షీ గూడు చేరుకున్నది
నదులన్నీ సాగరానికి చేరుకున్నవి
చీకటి చిక్కబడింది...''
దూరంగా రెల్లుగడ్డి అంచుల మీద ఓ చిన్నపిట్ట ఉయ్యాల ఊగడం...! అలా చూస్తూ ఉంటే మనసుకు ఎంత హాయిగా ఉన్నదో...! ఎంత ఆనందాన్ని నింపిందో.. ఆ బుజ్జి పిట్టకు ఎవరు నేర్పారో కదా...! ఆ పిట్ట రెల్లుగడ్డి చివర్న కూచుంటుంది. ఆ చిన్ని పక్షి బరువుకి పాపం ఆ గడ్డిపరక కిందిదాకా వంగి పోతుంది. ఇక ఆ పచ్చని పరక నేలను తాకుతుందనగా ఆ బుల్లిపిట్ట తుర్రుమని ఎగిరిపోతుంది. మళ్లీ ఎంచక్కా ఆ రెల్లుగడ్డి నిటారైపోయి...ఆ పిట్ట ఎగిరిపోయిన దిక్కే చూసి...హుష్‌...! నా తల్లి ఒడి నుంచి నన్నే గుంజుతావా..? బుద్ధి వున్నదా నీకు.. మరీ బండబారెనా నీ హృదయం...? నీ ఉయ్యాల జంపాలకు ఇంతటి నాజూకైన నా నడుమే దొరికినదా...!? చిరుకోపంతో ఆ సన్నని రెల్లుగడ్డి స్పందిస్తుంది...!
ప్రకృతికీ మానవ హృదయానికీ ఉన్న సంబంధం అటువంటిది. అది నిర్వచనాలకు అందనిది. ప్రకృతి ఉన్నంత పరిధిలో మానవ హృదయం పరుచుకుని ఉంటుంది. అప్పుడప్పుడు ప్రకృతి చెవిలో మానవ హృదయం గుసగుసలు పెడుతుంది. కొన్ని సందర్భాల్లో అది రుసరుసలూ పోతుంది. ఈ చేష్టలకు ప్రకృతి తనలో తానే నవ్వుకుంటుంది. అది గమనించిన హృదయం తన ముఖం ముడుచుకుంటుంది. తనకేమో అవుతోందని తలపోస్తూ... తనను ఓదార్చే వారి కోసం తపిస్తూ ఉంటుంది. కానీ, ప్రకృతి మాత్రం హృదయాన్ని ఎలా ప్రసన్నం చేసుకోవాలా.. అని ఆలోచిస్తూ ఉంటుంది. ఎలా బుజ్జగించి తన దారికి తెచ్చుకోవాలా..అని తన మనసును మదిస్తుంది. వెదురుకర్రను చిలికి వెన్నవంటి వేణుగానం వినిపిస్తుంది. నెమలి అడుగుల్లో చేరి నృత్యాన్ని ప్రదర్శిస్తుంది. పరిణామం..? హృదయం వెన్నలా కరిగిపోతుంది. తన కళ్లు తెరిచి, సరోజంలా విప్పారి వికసిస్తుంది. అదిగో ప్రకృతికీ మానవ హృదయానికీ ఉన్న అనుబంధం అంతటి రమణీయం. నిర్వచనానికి అతీతం.
నిర్మలంగా ఉండే వినీలాకాశం ఎప్పుడూ అలాగే ఉంటుందా...? ఊహూ..ఉండదు. ఎందుకనీ..? ఆకాశం మీద మబ్బుతునకలు చిన్న చిన్న మడతలుగా పేరుకుంటాయి. మరికొద్దిసేపట్లోనే ఆ మడతలు విస్తరిస్తాయి. సువిశాల వెండిమబ్బులుగా మారిపోతాయి. క్రమక్రమంగా అవి ఆకాశాన్నే ఆక్రమిస్తాయి. మధ్య మధ్య తళుక్కున మెరుపులు.. ఆ మెరుపులతో ఆకాశమంతా తెల తెల్లని వెలుగులు.. అంతటితో ఆ మేఘాలు ఆగిపోవు. అవి చిటపట చినుకులై.. వర్షధారలుగా మారిపోయి పుడమి నిండుగా కురుస్తాయి. అప్పుడు చెట్లు పులకరించి మనోవికాసాన్ని కలిగిస్తాయి. ఇప్పుడు మబ్బులు మబ్బులుగా వుండవు. జలరూపంలోకి మారిపోయి.. భూమిలో ఇంకిపోయి..చెరువులన్నీ పుష్కలంగా నిండిపోయే... జలపుష్పాలెన్నో వికసించే..
అందుకని సువిశాల ప్రపంచంలో నడిచేది కేవలం మనిషే కాదు సుమీ..ఏరు నడుస్తుంది అలల అడుగులలో.. ఆ అలల మీద నురగలు నడుస్తాయి. ఆ అలలపైనే చేపలు ఎగిరి గంతులేస్తాయి. ఆ తెల్లని నురగలమీద సరాగాలు ఆడాలని బుల్లిబుల్లి నీలిరంగు పక్షుల చిన్ని చిన్ని ఆశ.. చింతలే లేక చిందులేయాలీ..అని ఆశ.. హృదయం మౌనంగా ఉన్నా, తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటుంది. 'హృదయమెక్కడున్నదీ... హృదయమెక్కడున్నదీ...నీ చుట్టూనే తిరుగుతున్నదీ...! అందమైన అబద్ధం ఆడుతున్న మనసే..' అని పాడుకుంటూ ఉంటుంది. చల్లగ వీచే గాలితో చుట్టుపట్టి తిరిగి మెల్ల మెల్లగా ఆ తెమ్మెరలతో నిశ్శబ్దంగా మాటలాడుతూ ఉంటుంది. అప్పుడప్పుడు తగవులాడుతూ ఉంటుంది. అదే ఓ చల్లని సాయంత్రం అనుకోండీ..ఆహా..! ఎంతహాయి..! ఈ సాయంత్రం కానీ, ఎటు వెళ్లిందో యిన్నినాళ్లూ..!!
ఈ నీలిమేఘమాలలూ
గులాబీల గుసగుసలూ
లేలేత చివుళ్ల ముసిముసి నవ్వులూ
పచ్చని ఆకుల కూనిరాగాలూ
నన్నాదరించే ఈ చల్లని వేళ..!
అరెరే...! తోటలోకొచ్చావా...
సీతాకోక చిలుకా...!
మకరందమా...!
మందారమా...!
మలయ మారుతమా...!
హృదయరాగమా...!!
ఏమి కావాలో చెబుదూ...!
తెల తెల్లని మల్లెలమ్మలకు
ఎందుకో అలుక
చెంతకు పోనందుకు కినుకా...
పిల్లతెమ్మెరతో పోయొచ్చానే అందాకా...
ఏమో మరి...?!
ఈ ఆకుల సవ్వడీ...
ఈ విరుల సందడీ...
తెస్తూ తెస్తూ చుట్టేస్తోందీ చిరుగాలీ
ఇంతకు మించి ఇంకేమి కావాలీ..?
ఈ చల్లని సాయంత్రం..!!
ఇలా ప్రతి సాయంత్రం ఎంతో సంతోషం. ప్రతి సూర్యోదయం ఎంతో ఉత్తేజం.. మరెంతో ఉల్లాసం.. ప్రతి హృదయం ఒక కొత్త ప్రభాతంలా వికసిస్తుంది. ప్రకృతి పరిభ్రమిస్తూ ఉంటుంది. బంగరు రంగుల చిలకలా మనకు చేరువలోనే ఉంటుంది. కొమ్మల మీదికి ఒంగి ఆకుల్ని నిమురుతుంది ఆకాశం. భూమిని అంటిపెట్టుకుని ఉన్నానన్న మెచ్చుకోలు దాని స్పర్శలో.. నిండైన చందమామ..మెరిసే నక్షత్రాలు..!! ''ప్రతి మనసుకు స్పందన ఉంది. అనుభూతులు గుణిస్తే మమత విలువ తెలిసింది

Monday, August 20, 2018

చిత్రకవితా ప్రపంచం: సరిగమల - పద్యం

చిత్రకవితా ప్రపంచం: సరిగమల - పద్యం: సరిగమల - పద్యం సాహితీమిత్రులారా! ఒకమారు పీఠాపురం రాజావారి దివాణంలో ప్రభు సమక్షంలో తుమురాడ సంగమేశ్వరశాస్త్రిగారి వీణకచ్చేరి జరిగింది....

Sunday, August 19, 2018

మంకెన పుష్పం: జంధ్యాల పూర్ణిమ/శ్రావణ పౌర్ణమి

మంకెన పుష్పం: జంధ్యాల పూర్ణిమ/శ్రావణ పౌర్ణమి: SRAVANA POORNIMA   శ్రావణ పూర్ణిమ భారతావని మొత్తం శ్రావణ మాసంలో ఎంతో పవిత్రంగా భావించే రోజు. ఏడాదికి వచ్చే ద్వాదశ పూర్ణిమల్లోనూ శ్రా...

Saturday, August 18, 2018

Gayatri Seva Samithi: నిత్య త్రికాల సంధ్యా వందనము

Gayatri Seva Samithi: నిత్య త్రికాల సంధ్యా వందనము: నిత్య త్రికాల సంధ్యా వందనము శరీర శుద్ధి:   అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాం” గతో‌உపివా | యః స్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతర శ్శుచిః...

Gayatri Seva Samithi: నూతన యజ్ఞోపవీత ధారణ విధి

Gayatri Seva Samithi: నూతన యజ్ఞోపవీత ధారణ విధి: నూతన యజ్ఞోపవీత ధారణ విధి గణేశ స్తోత్రం శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణమ్ చతుర్భుజమ్ | ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే ||...

Gayatri Seva Samithi: నిత్య దైనందిక పారాయణ శ్లోకాలు

Gayatri Seva Samithi: నిత్య దైనందిక పారాయణ శ్లోకాలు: నిత్య దైనందిక పారాయణ శ్లోకాలు ప్రభాత శ్లోకం   కరాగ్రే వసతే లక్ష్మీః కరమధ్యే సరస్వతీ | కరమూలే స్థితా గౌరీ ప్రభాతే కరదర్శనమ్ || ప్రభాత భ...

పితృదేవతల కోసం మొక్కలు నాటండి. (పద్మపురాణం.)

పితృదేవతల కోసం మొక్కలు నాటండి.
ఇదేంటి ఇలా అంటున్నాడు అనుకోకండి. మనం ఒకసారి పద్మపురాణంలోకి చూస్తే అందులో వేదవ్యాస మహర్షి ఇలా అంటారు. ఎవరైతే మొక్కలు నాటి, వాటిని పెంచి పోషించినవారికి అవి సంతానంతో సమానం. వీరు నాటిన మొక్కల మీద వర్షం కురిసినప్పుడు, ఆ ఆకుల మీద నుంచి జాలువారిని ప్రతి నీటి బిందువు ఒక తర్పణంతో సమానం. ఆ చెట్టుకు ఎన్ని వేల ఆకులు ఉంటాయో, వాటి మీద ఎన్ని వేల నీటి బిందువులు పడతాయో, ఆ వ్యక్తికి అన్నివేల తర్పణాలు విడిచిన పుణ్యం చేరుతుంది. మరణానంతరం అతడు పితృలోకంలో ఉన్నా, స్వర్గంలో ఉన్నా, ఇతరలోకాల్లో ఉన్నా, లేదా మళ్ళీ జన్మించినా, ఈ పుణ్యఫలం అతడిని చేరి అతడిని ఉద్ధరిస్తుంది. (ఒకసారి గోపురం కార్యక్రమంలో సంధ్యాలక్ష్మీగారు ఈ విషయాన్ని చెప్పారు.)
సనాతనధర్మాన్ని అనుసరించి సుఖదుఃఖలకు కారణం పుణ్యపాపాలు. ఒక వ్యక్తి సుఖంగా ఉండాలంటే, జీవితంలో అభివృద్ధి చెందాలంటే అతడు పూర్వజన్మలో పుణ్యకర్మ చేసుకుని ఉండాలి. అప్పుడు అది యోగంగా మారి సుఖాన్నిస్తుంది. లేదా కనీసం ఈ జన్మలోనైనా ప్రయత్నపూర్వకంగా పుణ్యకర్మను ఆచరించాలి. కాబట్టి పిల్లల పుట్టినరోజు నాడు వారి చేత మొక్కలు నాటించి, రోజు నీరు పోయిస్తే, ఆ పుణ్యం వారి జీవితంలో అభివృద్ధికి కారణమవుతుంది. అదే మనం చేస్తే మనకు తోడ్పడుతుంది. మన పూర్వీకులు పెద్దగా దానాలు చేయలేదు, ధర్మాన్ని అనుష్టించలేదు అనుకుంటే, వారికి ఉత్తమగతులు కలగాలని వారి పేరున ఏపుగా వృక్షాలుగా పేరిగే కొన్ని మొక్కలు నాటి వాటికి రోజు నీరు పెట్టి పోషించాలి. అప్పుడా పుణ్యం వారిని చేరి, మీరు ఉన్నా లేకున్నా, ఆ చెట్టు ఆకుల మీది నుంచి జాలువారిన ప్రతి నీటి చుక్క ఒక తర్పణమయ్యి వారికి ఆహరం అందిస్తుంది. మనం వంశం ఆశీర్వదించబడుతుంది. కాబట్టి ఈ వానాకాలం వెళ్ళిపోకముందే కొన్ని మొక్కలు నాటండి

ప్రస్తుత నిజాలు:

ప్రస్తుత నిజాలు:

1.గుడికి వెళ్లే మగవాళ్ల సంఖ్య,
జిమ్ కు వెళ్లే ఆడవాళ్ల సంఖ్య క్రమంగా పెరుగుతుంది.

2.అనాధ ఆశ్రమంలో పేదవారి చిన్నపిల్లలు ఉంటారు!
వృద్ధా ఆశ్రమంలో ధనికుల తల్లిదండ్రులు ఉంటారు!!

3.మనం సంతోషంలో ఉన్నపుడు పాటలను వినాలి!
బాధలో ఉన్నపుడు ఆపాటలను అర్ధం చేసుకోవాలి!!

4.చచ్చిపోతున్నా కూడా వైద్యం చేయనివి గవర్నమెంటు ఆసుపత్రులు!
చచ్చిపోయినాక కూడా వైద్యం చేసేవి కార్పొరేట్ ఆసుపత్రులు!!

5.లేనోడు 'నోటి'తో మాట్లాడతాడు!
ఉన్నోడు "నోటు"తో మాట్లాడతాడు!!

6.చిరునవ్వు చాలావరకు సమస్యలు పరిష్కరిస్తుంది!
మౌనం అసలు సమస్యలే రాకుండా నివారిస్తుంది!!

7.పూజలుచేసి దేవుడికోసం మనం వెతుకుతాం!
దానంచేస్తే ఆయనే మనకోసం వెతుక్కుంటూ వస్తాడు!!

8.నువ్వు అర్థం అవ్వట్లేదు అంటే...వాళ్ళకి నువ్వు అవసరం లేదు అని అర్ధం!
నీ మాటలు అర్ధం కావట్లేదు అంటే నిన్ను పరిగణలోకి తీసుకున్నదే లేదు అని అర్ధం!!

9.తినటానికి భోజనం లేని స్థాయి నుంచి,*
తినడానికి సమయమే లేని స్థాయి వరకు
ఎదగటమే "విజయం".

అంతకి ఇంతయితే ఇంతకి ఎంత?

అంతకి ఇంతయితే ఇంతకి ఎంత?🤔

ఒక మహారాజు, రోజూ తోటకూర దానం చేస్తున్నాడు,వేల ఎకరాలలో తోట కూర పండించి పంచిపెడుతున్నాడు,స్వయంగా. స్వయంగా తోటకూర కట్ట చేతికిస్తూ, అంతకి ఇంతయితే ఇంతకి ఎంతవుతుంది అని ప్రశ్న వేసేవాడు. ఎవరూ సమాధానం చెప్పేవారు కాదు. ఇలా సంవత్సరాలు గడిచిపోయాయి. ఎవరూ సమాధానం చెప్పక పోయేటప్పటికి రాజు దిగులుపడ్డాడు. రాజ కార్యాలలో కూడా ఆసక్తి తగ్గింది, కాని ఈ తోటకూర దానం మాత్రం మానలేదు. రాజు అదృష్టం కొద్దీ ఒక బ్రాహ్మడు వచ్చాడు. అతనికీ తోటకూర కట్టిస్తూ ప్రశ్న వేశాడు. దానికాయన, రాజా నీకు ఈ విషయం మీద సమాధానం చెబుతానన్నాడు…రాజుకి సంబరమయిపోయింది. ఆ రోజు కార్యక్రమం అయిపోయిన తరవాత, సభలో బ్రాహ్మణుని ప్రవేశపెడితే, సమాధానం చెప్పేడు, ఇలా. రాజా అంతకు ఇంతయితే, ఇంతకు ఇంతే అన్నాడు. దానికి రాజు నిరుత్సాహ పడ్డాడు. అదెలా చెప్పగలిగేరని ప్రశ్నించాడు. దానికి బ్రాహ్మణుడు ఇలా చెప్పేడు. రాజా నీవు పూర్వ జన్మలో ఒక పేద బ్రాహ్మణుడివిగా పుట్టేవు. నీకు ఆ జన్మలో, కొద్దిగా పెరడున్న ఇల్లు ఉండేది, యాయవారంతో బతికేవాడివి, ఉన్న పెరడులో తోటకూర సాగుచేసి అడిగినవారికి అడగనివారికి కూడా దానం చేసేవాడివి. ఆ పుణ్యం మూలంగా నువ్వీ జన్మలో మహారాజుగా పుట్టేవు. నీకు పూర్వజన్మ జ్ఞానం ఉండిపోవటం చేత, ఈ జన్మలో కూడా తోటకూర దానం చేయడం మొదలు పెట్టేవు, అప్పుడు తోటకూర దానంచేస్తే రాజునయిపుట్టేనుకదా! ఇప్పుడు కూడా తోటకూర దానంచేస్తే ఇంతకంతే మంచి జన్మ లభిస్తుందనుకున్నావు. నిజమేనా చెప్పమన్నాడు. అందుకు రాజు ఆశ్చర్యపోయి, అప్పుడు తోటకూర దానం చేస్తే రాజునయిపుట్టేను కదా, మరి ఈ జన్మలో ఇతోధికంగా తోటకూర దానం చేస్తే ఇంత కంటే మంచి జన్మ ఎందుకు రాదనుకుని తోటకూర దానం మొదలెట్టేను అన్నాడు. రాజా అప్పుడు నీవొక యాయవారం బ్రాహ్మడివి, నీతాహతుకు తగిన దానం చేసేవు, మంచి మనసుతో మరొకరికి సాయపడాలనుకున్నావు తప్పించి గొప్ప జన్మ రావాలని కోరుకోలేదు. కాని ఈ జన్మలో మహారాజువై ఉండి నీ తాహతుకు తగిన దానాలు చేసి ప్రజల మంచి చెడ్డలు చూడలేదు, ఇంతకంటె మంచి జన్మ కావాలని కోరికతో దానం చేస్తున్నావు, అందుచేత ఇంతకి ఇంతే అని జవాబు చెప్పేడు. దానికి రాజు ఆశ్చర్యపోయి, ఆయన కాళ్ళు పట్టుకుని స్వామీ! నాకు తరుణోపాయం చెప్పమన్నాడు.రాజా! ఇప్పటికైనా మించిపోయింది లేదు, నీవు నీ తాహతుకు తగిన దానం చెయ్యి. అన్ని దానాలకంటే ఆన్నదానం మంచిదే, అది ఒక పూటతో సరిపోతుంది, తృప్తినీ ఇస్తుంది, కాని రాజుగా నీవు ప్రజలు వారిమటుకు వారు సంపాదించుకునే ఏర్పాటు చూడాలి, అందుకు విద్యాదానం చేయాలి, ప్రజలకు సత్వర వైద్య సదుపాయం, సత్వర న్యాయం అందేలా చూడు. అదే నీవు చేయగల దానం, చేయవలసిన దానం అని చెప్పేడు. రాజు అప్పటినుంచి తోటకూర దానం మానేసి ప్రజల్ని బాగా పరిపాలించాడు.

ఈ కథని బట్టి మనకు తెలిసేది, తాహతుకు తగిన దానం చేయకపోవడం తప్పు, తాహతుకు మించిన దానం చేయడమూ తప్పే. ప్రాణం నిలబెట్టడానికి అన్నదానం అవసరమే కాని విద్యాదానం గొప్పది. తద్వారా మనుష్యులు వారి ఆత్మాభిమానాన్ని కోల్పోని పౌరులవుతారు, అప్పుడు వారు వారి కుటుంబానికి సమాజానికి ఉపయోగపడతారు.🙏

" ఏ ఆవ్ రా బా వా" ఇదికూడా అర్థవంతమైన పదమే!

ఒకసారి శ్రీకృష్ణ దేవరాయలు తన ఆస్థాన కవులందరికీ ఒక పరీక్ష పెట్టాడు.

    " మీరు ఐదు అక్షరాల పదం ఒకటి రూపొందించాలి. ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క భాషలో పుండాలి. ఆ ఒక్కొక్క అక్షరానికి ఆ భాషలో ఏమి అర్థమో మిగిలిన నాలుగు భాషల్లో కూడా అదే అర్థం వుండాలి.
అంతేకాక  ఆ ఐదక్షరాల పదంకూడా
అర్థవంతంగా వుండాలి.

 దీనికి సమాధానం రేపు సభాముఖంగా నాకు చెప్పండి."

 కవులలో కలకలం బయలుదేరింది.
విచిత్రమైన సమస్య అనుకుని ఎవరింటికి వారు బయల్దేరి వెళ్లారు.
మన తెనాలి రామకృష్ణ కు నిద్రపట్టడం లేదు. తన బావమరిది ఇంటికెళ్ళి అక్కడ పశువుల పాకలో మంచంవేసుకుని దీర్ఘాలోచనలో మునిగిపోయాడు‌. అర్థరాత్రి అయినది. ఆ సమయానికి పశువులశాలలో ఒక ఆవు దూడను ప్రసవించినది. వెంటనే రామ కృష్ణుడు " బావా! బావా! ఆవు ఈనింది‌" అని కేకలు వేశాడు. నిద్రమత్తులో నున్న బావమరిది ఆ మాటలు విని " ఏ ఆవ్ రా బా వా " అని అడిగాడు. రామకృష్ణకు వెంటనే ఏదో స్ఫురించింది. ఎగిరి గంతేసాడు.

   మరునాడు మహారాజు సభ తీర్చాడు.

" అందరూ సిద్ధంగావున్నారా" రాయలవారి మాట విన్న కవులు ఏమీ మాట్లాడలేదు. కాని రామకృష్ణుడు మాత్రం లేచి " నేను సిద్ధమే" అన్నాడు.

మహారాజు: ఏదీ ఆ పదం చెప్పు!

రామకృష్ణుడు: " ఎ ఆవ్ రా బా వా "

'ఏ' అనగా మరాఠీలో 'రా' అని అర్థము.

'ఆవ్ ' అనగా హిందీలో ' రా' అని అర్థము.

'రా' అనగా తెలుగులో 'రా' అనే కదా అర్థము!

'బా' అనగా కన్నడ భాషలో 'రా' అని అర్థము.

' వా' అనగా తమిళంలో  'రా' అని అర్థము.

ఈ అయిదు అక్షరాలూ అయిదు భాషలకు చెందినవి. ఈ అయిదు అక్షరములు కలిసిన పదం " ఏ ఆవ్ రా బా వా" ఇదికూడా అర్థవంతమైన పదమే!

తెనాలి రామకృష్ణుడి వివరణతో మహారాజుకు మహదానందం కలిగింది. రామకృష్ణునికి భూరి బహుమానాలు లభించాయని వేరే చెప్పాలా !

ఆవు నుంచి హెచ్ఐవి వ్యాక్సిన్?

అద్బుతం: ఆవు నుంచి హెచ్ఐవి వ్యాక్సిన్? ఎలా అంటే?

మన ఇండియా లో అవుని అందరు పవిత్రమైనదిగా, ఆరాధ్యంగా పూజిస్తారు. హిందూ విశ్వాసాల పరంగా ఎందుకు పూజిస్తారు అనే విషయం పక్కన పెడితే సైంటిఫిక్ గా కూడా ఆవు పాలు చాలా విధాలుగా మనిషి ఆరోగ్యంగా ఉండటానికి కారణం అవుతున్నట్లు తెలుస్తుంది. ఆవు నుంచి వచ్చే ఉత్పత్తులలో సర్వరోగాలు నివారించే శక్తి ఉందని ఇప్పటికే శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇప్పుడు తాజాగా హెచ్‌ఐవీని అరికట్టేందుకు శాస్త్రవేత్తలు ఆవుని ఉపయోగించుకునే పనిలో ఉన్నట్లు తెలుస్తుంది. ఆవుతో హెచ్‌ఐవీ వ్యాక్సిన్‌ తయారు చేయొచ్చని అంటున్నారు శాస్త్రవేత్తలు. హెచ్‌ఐవీ వైరస్‌ తాలూకూ ప్రొటీన్లను ఆవుల్లోకి ఎక్కించినప్పుడు వాటిల్లో తయారైన యాంటీబాడీలతో హెచ్‌ఐవీని నిరోధించొచ్చని స్క్రిప్స్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ శాస్త్రవేత్తలు ఇటీవల జరిపిన ఓ ప్రయోగం ద్వారా తెలిసింది. ఈ పరిశోధన వివరాలు అంతర్జాతీయ జర్నల్‌ నేచర్‌ తాజా సంచికలో ప్రచురితమయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి. హెచ్‌ఐవీ వైరస్‌ తరచూ తన రూపం మార్చుకుంటూ ఉంటుందన్న విషయం తెలిసిందే. వ్యాధికి తగిన మందు లభించకపోవడానికి కారణమిదే.
అయితే ఈ వ్యాధి మిగిలిన జంతువులకు సోకినా.. ఆవులకు మాత్రం సోకదు. దీనికి కారణమేమిటో తెలుసుకునేందుకు స్క్రిప్స్‌ రీసెర్చ్‌ సెంటర్‌ శాస్త్రవేత్తలు ఓ ప్రయోగం చేశారు. హెచ్‌ఐవీ వైరస్‌ ఉపరితలాన్ని పోలిన ప్రొటీన్‌ను ఆవుల్లోకి ఎక్కించారు. ఆ తర్వాత ఏడాది పాటు అప్పుడప్పుడూ ఆవుల రక్తం సేకరించి యాంటీబాడీలను వేరు చేశారు. ఈ యాంటీబాడీలు కణాల్లోకి హెచ్‌ఐవీ వైరస్‌ చేరకుండా అడ్డుకుంటున్నట్లు గుర్తించారు. అంతేకాదు.. ఈ యాంటీబాడీలు అనేక ఇతర వైరస్‌లను కూడా నిరోధిస్తున్నట్లు తెలిసింది.
నిత్యం అనేక రకాల సూక్ష్మజీవులతో ఆవుల రోగ నిరోధక వ్యవస్థ చాలా బలంగా ఉండటం వంటి కారణాల వల్ల ఈ క్షీరదాలు ఉత్పత్తి చేసే యాంటీబాడీలు చాలా పొడవుగా ఉంటాయని శాస్త్రవేత్తలు చెప్పారు. అందువల్లే ఇవి హెచ్‌ఐవీని అడ్డుకోగలుగుతున్నాయని ఇంటర్నేషనల్‌ ఎయిడ్స్‌ వ్యాక్సిన్‌ ఇనిషియేటివ్‌కు చెందిన శాస్త్రవేత్త డెవిన్‌ సోక్‌ చెబుతున్నారు. ఆవులకు ఉన్న ఈ వినూత్న లక్షణం ఆధారంగా భవిష్యత్తులో హెచ్‌ఐవీకి మాత్రమే కాకుండా.. అనేక ఇతర వైరస్‌ సంబంధిత వ్యాధులకూ మెరుగైన చికిత్స లభించవచ్చని శాస్త్రవేత్తలు. ఇప్పుడు ఈ విషయం చదివాక ఆవుని ఎందుకు పవిత్రంగా హిందువులు పూజిస్తారో అనే విషయం చాలా మందికి తెలుస్తుంది.

అమ్మ కు, నాన్నకు చేసిన సేవ ఎప్పటికీ నిరర్ధకం కాదు.

తాజా పళ్లు తీసుకుందామనుకున్న నాకు రద్దీ గా ఉన్న నాలుగు రోడ్ల కూడలిలో ఓ పళ్ళ దుకాణం కనపడింది, దుకాణం లో రకరకాల తాజా పళ్ళు ఉన్నాయి, కానీ దుకాణం యజమాని మాత్రం ఎక్కడా కనడలేదు,పళ్ళ రేటు రాసి ఉన్న కాగితం మాత్రం ఆయా పళ్ళ మీద ఉంది,  దుకాణం మధ్య లో ఓ అట్టముక్క వ్రేలాడుతూ నా దృష్టి ని ఆకర్షించింది, కుతూహలం తో దానిపై ఏమి రాయబడి ఉందోనని చూసాను, దానిమీద "అయ్యా! నా తల్లిగారికి ఆరోగ్యం సరిగ్గా లేనందున నేను ఆమె సేవ చేయుటకు సదా ఆమె దగ్గర ఉండవలసి ఉన్నది, కావున మీరు మీకు కావలసిన పళ్ళు తీసుకుని దానికి తగ్గ డబ్బు ను ఈ గళ్ళా పెట్టె లో వేయగలరు అని ఉంది..
నాకు ఆశ్చర్యం అనిపించింది, ఈకాలం లో కూడా ఇలాంటి అమాయకులు ఉంటారా? అని, దొంగలు ఆ గల్లా పెట్టె ను ఎత్తుకెళితే ఇతని పరిస్థితి ఏంటి? ఇతని అమాయకత్వానికి నాకు నవ్వు వచ్చింది, ఎలాగైనా ఇతనికి ఇలా చేయకూడదు అని గట్టిగా చెప్పాలి అని నిర్ణయించుకొని సాయంత్రం అతను డబ్బు తీసుకునుటకు దుకాణం కు వస్తాడు కదా అని నేను కూడా సాయంత్రం మళ్ళీ పళ్ళ దుకాణం కు చేరుకున్నాను, పళ్ళ దుకాణం యజమాని వచ్చి గల్లా పెట్టెను తీసుకుని  దుకాణం కట్టి వేస్తున్నాడు, నేను అతని దగ్గరికి వెళ్లి నన్ను నేను పరిచయం చేసుకుని నీవు ఎంత తెలివి తక్కువ పని చేస్తున్నావో తెలుసా? ఎవరైనా దొంగలు నీ గల్లా పెట్టె ను ఎత్తుకెళితే ఎలా? పళ్ళ ను ఊరికే తీసుకుపోతే ఎలా? అని మందలించబోయాను, అందుకు అతను చిరునవ్వుతో" అంతా దైవేచ్ఛ " అన్నాడు మళ్ళీ అతనే అయ్యా! మొదట్లో నేను నా తల్లి గారితో మీలాగే అడిగాను, నేను నీ సేవలో ఉంటే దుకాణం పరిస్థితి ఎలా? అని, అందుకు మా అమ్మ "నాయనా! నాకు రోజులు దగ్గర పడ్డాయి, గోజూ నిన్ను చూడకుండా ఉండలేను, నేను ఆ దేవున్ని ప్రార్ధిస్తాను, నీవు నేను చెప్పిన విధంగా చేయి, అని చెప్పింది, అమ్మ చెప్పినట్టుగానే ఆరోజు నుండి   ఈవిధంగా చేస్తున్నాను అన్నాడు,
మరి నీకు ఏనాడూ నష్టం రాలేదా? అని అడిగాను కుతూహలం ఆపుకోలేక..
అతను అదే చిరునవ్వుతో "నష్టమా???
ఒకసారి ఈ గల్లా పెట్టె ను చూడండి అని అతని గల్లాపెట్టె ను తెరచి చూపించాడు, ఆశ్చర్యం!
గల్లాపెట్టె నిండా డబ్బు!
దుకాణం లోని పళ్ళ విలువ కంటే పదింతలు ఎక్కువగా ఉంటుంది,
ఇవి చూడండి అని దుకాణం లో రకరకాల వస్తువులు చూపాడు..
వాటిలో చీరలు, బట్టలు,స్వెట్టర్లు,అప్పుడే వండుకుని తెచ్చిన పులావు, రకరకాల తినుబండారాలు....
అన్నింటిపైన "భయ్యా! అమ్మీజాన్ కు మా తరపున ఇవ్వండి" అని రాసిన కాగితాలు ఉన్నాయి.
అంకుల్ అమ్మను నా ఆసుపత్రి కి తీసుకురాగలరు, నేను అమ్మకు ఉచితంగా వైద్యం చేయగలను అని ఓ డాక్టర్  తన విజిటింగ్ కార్డు ను ఓ కాగితానికి కట్ఠి దుకాణం లో వ్రేలాడదీసి వెళ్ళాడు..
ఇదంతా చూసిన నాకు కళ్ళ వెంబడి నీళ్ళాగడం లేదు,
సమాజమంతా స్వార్థం తో నిండిపోయింది, మంచితనం మచ్చుకైనా కనిపించడం లేదు అన్న నా భావన పటాపంచలైనట్టయింది,
సమాజం లో మంచితనం ఇంకా బ్రతికే ఉంది, ముందు మన దృక్పథం లో మార్పు రావాలి,
తల్లికి సేవచేస్తున్నందుకు గాను సాక్షాత్తు ఆ దేవుడే స్వయంగా అతని దుకాణం కు కాపలా కాస్తున్నాడు..
ఎంతగా కోపగించుకున్నా తిరిగి మనపై కోప్పడనిది సృష్టి లో ఎవరైనా ఉన్నారంటే అదిఒక అమ్మ ఒక్కటే!
అమ్మ కు, నాన్నకు  చేసిన సేవ ఎప్పటికీ నిరర్ధకం కాదు. 🙏🙏

తెలుగువాణ్ణి తిండిలో కొట్టగలరా ?


🙏🙏💐💐🙏🙏
మినపట్టు
పెసరట్టు
రవ్వట్టు
పేపర్ దోసె
మసాల దోసె
ఉల్లి దోసె
కొబ్బరి అట్టు
గోధుమ అట్టు
అటుకుల అట్టు
సగ్గుబియ్యం అట్టు
బియ్యపు పిండి అట్లు
పుల్లట్టు
ఊతప్పం
పులి బొంగరం
ఉప్మా అట్టు
రాగి దోసె
చీజ్ పాలక్ దోసె
ఇడ్లీ
మసాల ఇడ్లీ
రవ్వ ఇడ్లీ
ఆవిరి కుడుము
సాంబారు ఇడ్లి
బొంబాయి రవ్వ ఉప్మా
గోధుమ రవ్వ ఉప్మా
సేమ్యా ఉప్మా
టమోటా బాత్
ఇడ్లీ ఉప్మా
బియ్యపు రవ్వ ఉప్మా
నూకలుప్మా
మరమరాల ఉప్మా
కొబ్బరి ఉప్మా
ఉప్పిడి పిండి
పూరి
చపాతి
వడ
సాంబారు వడ
పప్పు పొంగలి
కంచి పులిహోర
నిమ్మ పులిహోర
కొబ్బరి అన్నం
పుదీనా పులావ్
బిర్యాని
దధ్యోదనం
చక్రపొంగలి
కట్టుపొంగలి
వెజ్ ఫ్రైడ్ రైస్
జీరా రైస్
పులగం
ఉల్లిపాయ చట్నీ
ఎండుమిరపకాయ చట్నీ
కొబ్బరి చట్నీ
మినప చట్నీ
వేరుశనగపప్పు చట్నీ
శనగపప్పు చట్నీ
శనగపిండి చట్నీ (బొంబాయిచట్నీ)
శనగపప్పు పొడి
ధనియాల పొడి
కొబ్బరి పొడి
వెల్లుల్లిపాయ కారప్పొడి
కరివేపాకు పొడి
కందిపొడి
మునగాకు చట్నీ
గుమ్మడి చట్నీ
అటుకుల పులిహార
చింతపండు పులిహార
నిమ్మకాయ పులిహార
మామిడికాయ పులిహార
రవ్వ పులిహార
సేమ్యా పులిహార
ఆలు పరోట
చపాతి
పరోట
పుల్కా
పూరి
రుమాల్  రోటీ
కాలీఫ్లవర్ పరోటాలు
పాలక్ పన్నీర్
కొత్తరకం పూరీలు
ముద్దపప్పు
దోసకాయ పప్పు
బీరకాయ పప్పు
టమోటా పప్పు
మామిడి కాయ పప్పు
తోటకూర పప్పు
గుమ్మడి పప్పు
చింత చిగురు పప్పు
కంది పచ్చడి
కొబ్బరి పచ్చడి
క్యాబేజి పచ్చడి
క్యారెట్ పచ్చడి
దొండకాయ పచ్చడి
దోసకాయ పచ్చడి
బీరకాయ తొక్కు పచ్చడి
బెండకాయ పచ్చడి
మామిడికాయ పచ్చడి
వంకాయ పచ్చడి
వెలక్కాయ పచ్చడి
టమోటా పచ్చడి
మెంతికూర పచ్చడి
పొట్లకాయ పెరుగు పచ్చడి
బీరకాయ పచ్చడి
సాంబారు
సాంబారు పొడి
పులుసు (తీపి)
పొట్ల కాయ పులుసు
సొరకాయ పులుసు
మజ్జిగ పులుసు
పప్పు పులుసు
ఉల్లిపాయ పకోడి
క్యాబేజి పకోడి
గోధుమ పిండి పకోడి
పాలక్ - పకోడి (పాలకూర పకోడి)
బియ్యపు పిండి పకోడి
మసాల పకోడి
మెత్తటి పకోడి
బ్రెడ్ పకోడి
పల్లీ పకోడీలు
సేమ్యా పకోడి
కాలీఫ్లవర్‌ పకోడి
ఆలూ పకోడి
ఖాండ్వీ
అటుకుల పోణీ
అప్పడం బజ్జి
అరిటికాయ బజ్జి
ఉల్లిపాయ బజ్జి
టమటా బజ్జి
బంగాళదుంప బజ్జి
బీరకాయ బజ్జి
బ్రెడ్ బజ్జి
మిరపకాయ బజ్జి
వంకాయ బజ్జి
క్యాప్సికమ్ బజ్జి
కొర్ర బజ్జీ
గుమ్మడికాయ బజ్జీలు
దోసకాయ బజ్జి
గుంట పునుగులు
పునుగులు
మైసూర్  బోండ
సాగో బోండాస్ (సగ్గుబియ్యం పునుగులు)
మసాల గారె
నేతి గారె
పప్పు వడ
మసాల వడ
వెజిటబుల్ వడ
పెసర గారెలు
మినపచెక్క వడలు
సగ్గుబియ్యం బోండా
బఠాణీ బోండా
పచ్చి బఠానీ బోండాలు
మామిడి అల్లం పచ్చడి(అల్లంపచ్చడి)
ఉసిరి ఆవకాయ
ఉసిరికాయ పచ్చడి
కాకరకాయ పచ్చడి
కొత్తిమీర పచ్చడి
గోంగూర పచ్చడి
చింతకాయ పచ్చడి
టమోటా పచ్చడి
దబ్బకాయ ఊరగాయ
పండు మిరపకాయల పచ్చడి
మామిడికాయ ఆవకాయ
మామిడికాయ తురుంపచ్చడి
మామిడికాయ (మాగాయ)
ముక్కల పచ్చడి
మునక్కాయ ఆవకాయ
పెసర ఆవకాయ
కాలీఫ్లవర్ పచ్చడి
చిలగడదుంపల పచ్చడి
క్యాబేజీ ఊరగాయ
వంకాయ పచ్చడి
నిమ్మకాయ ఊరగాయ
వెల్లుల్లి పచ్చడి
కాజాలు
బూంది
చక్రాలు
కారప్పూస
చెగోడి
చెక్కలు
తపాళ చెక్కలు
పెసర చెక్కలు
చెక్క పకోడి
పెరుగు చక్రాలు
సగ్గుబియ్యం చక్రాలు
శనగపప్పు చక్రాలు
వాంపూస
గవ్వలు
ఆలూ చిప్స్
బనానా చిప్స్
మసాల బీన్స్
కారం చెక్కలు
అలూతో చక్రాలు
కొబ్బరి చెక్కలు
జొన్న మురుకులు
మైదా కారా (మైదాచిప్స్)
వెన్న ఉండలు
పన్నీర్ చట్ పట్
సోయా సమోస, సమోస
చిలకడ దుంప చిప్స్
కాకరకాయ చిప్స్
జంతికలు
గుమ్మడి వరుగు (చిప్స్)
అరిసెలు
బూరెలు
కొబ్బరి బూరెలు
పచ్చి బూరెలు
తైదు బూరెలు
మైదాపిండితో పాల బూరెలు
సజ్జ బూరెలు
గోధుమ బూరెలు
చలిమిడి
కొబ్బరి పూర్ణాలు
గోధుమ పిండితో పూర్ణాలు
పూతరేకులు
జొన్న బూరెలు
బూంది లడ్డు
రవ్వ లడ్డు
తొక్కుడు లడ్డు
మినప ముద్దలు
సున్నుండలు
బాదుషా
మడత కాజా
తీపి కాజాలు
మైసుర్ పాకు
జాంగ్రి
పూస మిఠాయి
కోవా
కజ్జి కాయలు
తీపి గవ్వలు
జీడిపప్పు పాకం
శనగపప్పు పాకం
వేరుశనగపప్పు ముద్దలు
మరమరాల ముద్దలు
డ్రైఫ్రూట్స్ హల్వా
నువ్వుల లడ్డు (చిమ్మిరిముద్ద)
కోవా కజ్జికాయ
మిల్క్ మైసూర్‌ పాక్
కాజు క్యారెట్
బటర్ బర్ఫీ
కిస్‌మిస్ కలాకండ్
బూంది మిఠాయి
పాపిడి
చాంద్ బిస్కట్స్
ఖర్జూరం స్వీట్
సేమ్యాతో అరిసెలు
కొబ్బరి ఖర్జూరం
బాదంపాకము
బాంబే హల్వా
వీటిల్లో మీకు ఇష్టమైనది  చేసుకొని తినండి.
చేయించుకొని తినండి.
చేసుకున్నవాళ్ళింటికెళ్ళి కూర్చోండి.
వాళ్ళు పెడితే తినండి.
లేకపోతే  అడగండి.
హోటల్లో కొనుక్కొని తినండి.
అంతే గానీ తినడం మాత్రం మానకండి.
🙏🙏🙏💐💐💐🙏🙏🙏

జ్ఞానం ( భగవద్గీత )

బీచ్ లో కూర్చున్న ఒక వ్యక్తి తో ఇంకో వ్యక్తి ఇలా అంటున్నాడు

సామాన్యుడు;;;--ఇంకా ఈరోజుల్లో భగవద్గీత  ఏంటి సర్ మనవాళ్ళు రాకెట్స్  ని ఆకాశంలోకి  పంపిస్తుంటే

చదివే వ్యక్తి ;;-  భగవద్గీత  మించిన సైన్సు ప్రపంచం లో లేదు సైన్సు కి అంతు చిక్కని చాలా విషయాలు ఇందులో ఉన్నాయి

సామాన్యుడు;;-  ఏంటి సర్ అక్కడ చాలా మంది పోలీస్ లు ఉన్నారు ఎవరు వచ్చారో బీచ్ కి

చదివే వ్యక్తి;-నా కోసమే వాళ్ళకి నేను సంపాదించే జ్ఞానం ఈ పుస్తకం లో ఉందని తెలియక నన్ను  ఆఫీస్ కి రమ్మని వచ్చారు.

సామాన్యుడు ::-ఇంతకీ మీరు ఎవరు సర్..

చదివే వ్యక్తి;;-అదే ఆ రాకెట్ లు పంపే ఇస్రో చైర్మన్ ని.

సామాన్యుడు ;;-క్షమించండి సర్ తెలిసుకోలేకపోయాను

చదివే వ్యక్తి::-నేను తెలియకపోవడం పెద్ద విషయం కాదు భగవద్గీత  ని అందులో ఉన్న విషయాన్ని మీరు తెలుసుకోక పోవడం కొంచెం బాద గా ఉంది అని అతని చేతిలో ఉన్న పుస్తకం ఇచ్చి .ఆయన బయలుదేరాడు

ఆయానే మన మొట్ట మొదటి ఇస్రో చైర్మన్ విక్రమ్ సారభాయ్

చూశారా...విచిత్రంగా లేదూ...

రామ నామ జపతె అత్రి మత గుసిఆవూ
పంక మే ఉగోహమి అహి కే ఛబి ఝావూ...
ఇది తులసీదాసు మహానుభావుడు వ్రాసిన దోహా..
విచిత్రమేమిటంటే ఈదోహాలోని పదాలు విచిత్రంగా మన దేశంలోని 29రాష్ట్రాల పేర్లను సూచిస్తాయి‌.ఎలా అంటారా ..చూడండి మీరే..
రామ:రాజస్తాన్,మహా రాష్ట్ర.

నామ:నాగాలాండ్ ,మణిపూర్

జపతె:జమ్మూ కాశ్మీర్, ప.బెంగాల్,తెలంగానా

అత్రి:అస్సామ్,త్రిపుర

మత:మధ్యప్రదేశ్, తమిళనాడు

గుసిఆవు:గుజరాత్, సిక్కిమ్,ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్

పంక:పంజాబ్,కర్ణాటక

మే:మేఘాలయ

ఉగోహమి:ఉత్తరాకాండ్,గోవా,హరియాణ,మిజోరాం

అహి:అరుణాచల్, హిమాచల్ ప్రదేశ్

కే:కేరళ

ఛబి:ఛత్తీస్ గడ్,బిహార్

ఝావు:ఝార్ఖండ్, ఉడీసా.(ఒరిస్సా)

🤔

చూశారా...విచిత్రంగా లేదూ...

Tuesday, August 14, 2018

జననీ .. జై భరత మాతా ! ................. డా .పొన్నాడ.

జై జననీ .. జై భరత మాతా ! ................. డా .పొన్నాడ.
వందన శతమిది చందన శీతల
హిమగిరి మకుట ధరీ !
పరివృతసాగర మణిమయ పూరిత 
జీవనవేదకరీ !
వికసితమనముల రసమయ గీతుల
విలసిత భావఝరీ !
కిలకిల నగవులు ఒలికెడి కళలను
నిలిపిన రాగధరీ !
అతులిత ప్రతిభను జగతికి పంచిన
సుతులకు ప్రేమమయీ !
పరిపరి విధముల పొగి డెద జననిని
పదముల కరములిడీ !
ప్రతిభను పొదిమీ ప్రగతిని గాంచే
పథమున నిలుపమనీ !
తరతమ భేదం సమయగ మనముల
శాంతిని నింప మనీ !
సమరస భావం తొణికిసలాడగ
మనసులు కలుపమనీ !
సతతము చాటెద భారత కీర్తిని
పృద్విని నలుదెసలా !
హయ గజ పద దళ ,
అతిరధ శూరుల నిలయము భారతనీ ,
జగతికి ప్రగతిని పంచిన జననికి ,
ధర్మమె శ్వాస యనీ ,
శాంతీ సహనం , సౌభ్రాతృత్వం ,
భారత ధర్మ మనీ !
సతతము చాటెద భారత కీర్తిని ,
పృధ్విని నలుదెసలా !
నిరతము తలచెద , పరవశ మనమున ,
జననీ జయ జననీ !
జననీ జయ జననీ !
'భారత మాతకు' ప్రణమిల్లుతూ _/||\_
.............................డా కృష్ణ సుబ్బారావు పొన్నాడ .

చిరు జల్లుల పందిటిలో , చిందులేల చినదానా !. గజల్ : 14 .డా. కృష్ణ సుబ్బా రావు పొన్నాడ.

చిరు జల్లుల పందిటిలో , చిందులేల చినదానా !
చిరు మువ్వల సందటితో , విందులేల చినదానా !
మరుమల్లెల వానలోన , మరులు కురిసి విరిశాయా !
మరుడి విరులు మనసు తాక , పొంగులేల చినదానా !
బావ రాక కోసమేగ , భామ వేయు చిందులన్ని !
ఆత్రమంత ఆవిరిగా , భంగిమేల చినదానా !
సంధించే చూపులందు , సరసాలను మేళవించి ,
బంధించే బాహువులలో , ఒంపనేల చినదానా !
వాన చినుకు రాకతోడ , పుడమి తల్లి పులకించీ ,
వలపునంత మొలకలేసె , కాంచవేల చినదానా !
మురిపాలను మూటకట్టి రుచి చూపుము జవరాలా !
విరితూపులు గుండెలోన , దింపనేల చినదానా !
విరజాజుల విన్యాసం , సనజాజుల సహవాసం ,
మరుమల్లెల మత్తు లేక , సరసమేల చినదానా !
'మదను'డిలకు ఏతెంచిన , సిద్దమవని పొన్నాడను !
యుద్ధానికి ఉసిగొల్పక , నాంచుడేల చినదానా !
' గజల్ : 14 ........................ డా. కృష్ణ సుబ్బా రావు పొన్నాడ.
Comments
Umadevi Prasadarao Jandhyala గజల్ నేర్చుకునే ప్రయత్నం చేద్దాం

సమరంలో ప్రాణాలకు తెగించటం తప్పదుగా

మరణాన్నే మనసారా వరించటం తప్పదుగా

దీన్ని మత్లా అంటారు . ప్రతి పదం 6 మాత్రలు 
తెగించటం వరించటం కాఫియాలంటారు
తప్పదుగా సమానంగా వచ్చినదాన్ని రదీఫ్ అంటారు. దీని తర్వాత 2 పాదాలను షేర్ అంటాం. అది చూడండి

స్వాతంత్ర్యం కావాలని ప్రతిమనసూ కలగన్నది
కలలుతీర బాధలనే భరించటం తప్పదుగా 

ఇందులో మొదటిలైను 6మాత్రలతో 4 పదాలు మనయిష్టం
రెండవ పాదం కాఫియా రదీఫ్ పాటిస్తూ వ్రాయాలి 
Prasadarao Ramayanam Vijayavenkatakrishna Subbarao Ponnada మరెవరైనా ఒక మత్లా ఒకషేర్ వ్రాయ ప్రయత్నించండి . భారతమాతకు కానుకగా .💐
Manage
Reply18hEdited
Vijayavenkatakrishna Subbarao Ponnada మంచి ఆలోచన ఉమాదేవి గారు 
Manage
Reply15h
హంస గీతి మాటల్లేవ్....👏👏👏👏👏👍👍👍👍👍👍
శుభసాయంత్రం డాక్టర్ జీ 😊
Manage
Reply15h
Satya Sai Vissa పోతన పై కరుణశ్రీ గారి పద్యం గుర్తుకువస్తుంది. మీ కుంచెతో అక్షర శర్కర పలుకులద్దిన కళాఖండాలు రుచిచూస్తే పొన్నాడవారూ ఈ పద్యం మీకు అంకితం. గొప్ప భావాన్ని వ్యక్తీకరించడానికి భాష ప్రతిభ చాలనప్పుడు ఒక ఉత్కృష్ట భావ వీచికలని ఆధారం చేసుకోవడం అనివార్యం. అందుకే ఈ పద్యం 
"ముద్దులుగార భాగవతమున్ రచియించుచు, పంచదారలో
నద్దితివేమొ గంటము మహాకవిశేఖర ! మధ్య మధ్య అ
ట్లద్దక - వట్టిగంటమున నట్టిటు గీచిన తాటియాకులో
పద్దెములందు - ఈ మధుర భావము లెచ్చటనుండి వచ్చురా ?"

Total Pageviews