అంతకి ఇంతయితే ఇంతకి ఎంత?🤔
ఒక మహారాజు, రోజూ తోటకూర దానం చేస్తున్నాడు,వేల ఎకరాలలో తోట కూర పండించి పంచిపెడుతున్నాడు,స్వయంగా. స్వయంగా తోటకూర కట్ట చేతికిస్తూ, అంతకి ఇంతయితే ఇంతకి ఎంతవుతుంది అని ప్రశ్న వేసేవాడు. ఎవరూ సమాధానం చెప్పేవారు కాదు. ఇలా సంవత్సరాలు గడిచిపోయాయి. ఎవరూ సమాధానం చెప్పక పోయేటప్పటికి రాజు దిగులుపడ్డాడు. రాజ కార్యాలలో కూడా ఆసక్తి తగ్గింది, కాని ఈ తోటకూర దానం మాత్రం మానలేదు. రాజు అదృష్టం కొద్దీ ఒక బ్రాహ్మడు వచ్చాడు. అతనికీ తోటకూర కట్టిస్తూ ప్రశ్న వేశాడు. దానికాయన, రాజా నీకు ఈ విషయం మీద సమాధానం చెబుతానన్నాడు…రాజుకి సంబరమయిపోయింది. ఆ రోజు కార్యక్రమం అయిపోయిన తరవాత, సభలో బ్రాహ్మణుని ప్రవేశపెడితే, సమాధానం చెప్పేడు, ఇలా. రాజా అంతకు ఇంతయితే, ఇంతకు ఇంతే అన్నాడు. దానికి రాజు నిరుత్సాహ పడ్డాడు. అదెలా చెప్పగలిగేరని ప్రశ్నించాడు. దానికి బ్రాహ్మణుడు ఇలా చెప్పేడు. రాజా నీవు పూర్వ జన్మలో ఒక పేద బ్రాహ్మణుడివిగా పుట్టేవు. నీకు ఆ జన్మలో, కొద్దిగా పెరడున్న ఇల్లు ఉండేది, యాయవారంతో బతికేవాడివి, ఉన్న పెరడులో తోటకూర సాగుచేసి అడిగినవారికి అడగనివారికి కూడా దానం చేసేవాడివి. ఆ పుణ్యం మూలంగా నువ్వీ జన్మలో మహారాజుగా పుట్టేవు. నీకు పూర్వజన్మ జ్ఞానం ఉండిపోవటం చేత, ఈ జన్మలో కూడా తోటకూర దానం చేయడం మొదలు పెట్టేవు, అప్పుడు తోటకూర దానంచేస్తే రాజునయిపుట్టేనుకదా! ఇప్పుడు కూడా తోటకూర దానంచేస్తే ఇంతకంతే మంచి జన్మ లభిస్తుందనుకున్నావు. నిజమేనా చెప్పమన్నాడు. అందుకు రాజు ఆశ్చర్యపోయి, అప్పుడు తోటకూర దానం చేస్తే రాజునయిపుట్టేను కదా, మరి ఈ జన్మలో ఇతోధికంగా తోటకూర దానం చేస్తే ఇంత కంటే మంచి జన్మ ఎందుకు రాదనుకుని తోటకూర దానం మొదలెట్టేను అన్నాడు. రాజా అప్పుడు నీవొక యాయవారం బ్రాహ్మడివి, నీతాహతుకు తగిన దానం చేసేవు, మంచి మనసుతో మరొకరికి సాయపడాలనుకున్నావు తప్పించి గొప్ప జన్మ రావాలని కోరుకోలేదు. కాని ఈ జన్మలో మహారాజువై ఉండి నీ తాహతుకు తగిన దానాలు చేసి ప్రజల మంచి చెడ్డలు చూడలేదు, ఇంతకంటె మంచి జన్మ కావాలని కోరికతో దానం చేస్తున్నావు, అందుచేత ఇంతకి ఇంతే అని జవాబు చెప్పేడు. దానికి రాజు ఆశ్చర్యపోయి, ఆయన కాళ్ళు పట్టుకుని స్వామీ! నాకు తరుణోపాయం చెప్పమన్నాడు.రాజా! ఇప్పటికైనా మించిపోయింది లేదు, నీవు నీ తాహతుకు తగిన దానం చెయ్యి. అన్ని దానాలకంటే ఆన్నదానం మంచిదే, అది ఒక పూటతో సరిపోతుంది, తృప్తినీ ఇస్తుంది, కాని రాజుగా నీవు ప్రజలు వారిమటుకు వారు సంపాదించుకునే ఏర్పాటు చూడాలి, అందుకు విద్యాదానం చేయాలి, ప్రజలకు సత్వర వైద్య సదుపాయం, సత్వర న్యాయం అందేలా చూడు. అదే నీవు చేయగల దానం, చేయవలసిన దానం అని చెప్పేడు. రాజు అప్పటినుంచి తోటకూర దానం మానేసి ప్రజల్ని బాగా పరిపాలించాడు.
ఈ కథని బట్టి మనకు తెలిసేది, తాహతుకు తగిన దానం చేయకపోవడం తప్పు, తాహతుకు మించిన దానం చేయడమూ తప్పే. ప్రాణం నిలబెట్టడానికి అన్నదానం అవసరమే కాని విద్యాదానం గొప్పది. తద్వారా మనుష్యులు వారి ఆత్మాభిమానాన్ని కోల్పోని పౌరులవుతారు, అప్పుడు వారు వారి కుటుంబానికి సమాజానికి ఉపయోగపడతారు.🙏

No comments:
Post a Comment