Tuesday, August 14, 2018

జననీ .. జై భరత మాతా ! ................. డా .పొన్నాడ.

జై జననీ .. జై భరత మాతా ! ................. డా .పొన్నాడ.
వందన శతమిది చందన శీతల
హిమగిరి మకుట ధరీ !
పరివృతసాగర మణిమయ పూరిత 
జీవనవేదకరీ !
వికసితమనముల రసమయ గీతుల
విలసిత భావఝరీ !
కిలకిల నగవులు ఒలికెడి కళలను
నిలిపిన రాగధరీ !
అతులిత ప్రతిభను జగతికి పంచిన
సుతులకు ప్రేమమయీ !
పరిపరి విధముల పొగి డెద జననిని
పదముల కరములిడీ !
ప్రతిభను పొదిమీ ప్రగతిని గాంచే
పథమున నిలుపమనీ !
తరతమ భేదం సమయగ మనముల
శాంతిని నింప మనీ !
సమరస భావం తొణికిసలాడగ
మనసులు కలుపమనీ !
సతతము చాటెద భారత కీర్తిని
పృద్విని నలుదెసలా !
హయ గజ పద దళ ,
అతిరధ శూరుల నిలయము భారతనీ ,
జగతికి ప్రగతిని పంచిన జననికి ,
ధర్మమె శ్వాస యనీ ,
శాంతీ సహనం , సౌభ్రాతృత్వం ,
భారత ధర్మ మనీ !
సతతము చాటెద భారత కీర్తిని ,
పృధ్విని నలుదెసలా !
నిరతము తలచెద , పరవశ మనమున ,
జననీ జయ జననీ !
జననీ జయ జననీ !
'భారత మాతకు' ప్రణమిల్లుతూ _/||\_
.............................డా కృష్ణ సుబ్బారావు పొన్నాడ .

No comments:

Post a Comment

Total Pageviews