చిరు జల్లుల పందిటిలో , చిందులేల చినదానా !
చిరు మువ్వల సందటితో , విందులేల చినదానా !
చిరు మువ్వల సందటితో , విందులేల చినదానా !
మరుమల్లెల వానలోన , మరులు కురిసి విరిశాయా !
మరుడి విరులు మనసు తాక , పొంగులేల చినదానా !
మరుడి విరులు మనసు తాక , పొంగులేల చినదానా !
బావ రాక కోసమేగ , భామ వేయు చిందులన్ని !
ఆత్రమంత ఆవిరిగా , భంగిమేల చినదానా !
ఆత్రమంత ఆవిరిగా , భంగిమేల చినదానా !
సంధించే చూపులందు , సరసాలను మేళవించి ,
బంధించే బాహువులలో , ఒంపనేల చినదానా !
బంధించే బాహువులలో , ఒంపనేల చినదానా !
వాన చినుకు రాకతోడ , పుడమి తల్లి పులకించీ ,
వలపునంత మొలకలేసె , కాంచవేల చినదానా !
వలపునంత మొలకలేసె , కాంచవేల చినదానా !
మురిపాలను మూటకట్టి రుచి చూపుము జవరాలా !
విరితూపులు గుండెలోన , దింపనేల చినదానా !
విరితూపులు గుండెలోన , దింపనేల చినదానా !
విరజాజుల విన్యాసం , సనజాజుల సహవాసం ,
మరుమల్లెల మత్తు లేక , సరసమేల చినదానా !
మరుమల్లెల మత్తు లేక , సరసమేల చినదానా !
'మదను'డిలకు ఏతెంచిన , సిద్దమవని పొన్నాడను !
యుద్ధానికి ఉసిగొల్పక , నాంచుడేల చినదానా !
యుద్ధానికి ఉసిగొల్పక , నాంచుడేల చినదానా !
' గజల్ : 14 ........................ డా. కృష్ణ సుబ్బా రావు పొన్నాడ.
No comments:
Post a Comment