Sunday, August 5, 2018

జె ఆర్ డి టాటా విలువ సలహా

ఏమిటో  మరి  ఈ  మతి   మరుపు !  అందుకే   నేను  ఎప్పుడోఖరీదైన  పెన్నులు వాడడం  మానేశాను .  చీప్  పెన్ను  మాత్రమె  వాడుతున్నాను .  అది  మరిచిపోయి  పారేసినా  బాధ  అనిపించదులే !  అయితే  నా  బాధ  ఈ  మతిమరుపు  గురించే ! "
.
.
.
" నేను  ఒక  సలహా   ఇవ్వనా ? " 
.
"  మతిమరుపు  పోతుందా ?" 
.
"  చెప్పలేను !  నీ  మీద  ఆధారపడి  ఉంటుంది !"
.
ఏమిటది ?
.
.
"  నువ్వు  కొనగలిగినంత  అత్యంత  ఖరీదు  అయిన  పెన్ను  కొని  వాడుతూ  ఉండు  .  అప్పుడు  కూడా   నువ్వు మరిచిపోతావా?   ,  నీ  మరుపు  పోతుందా ?   చూద్దాము "
.
..
"  తప్పకుండా   చేస్తాను "
.
.

.
.
ఆర్నెల్ల  తర్వాత   స్నేహితుడు ఫోన్  చేసి  పెన్ను  మరిచిపోతున్నావా ?   అని  అడిగాడు .
.
.
.

.
" అబ్బే ! నువ్వు  చెప్పాక 22 కేరట్ల బంగారం పెన్ను   కొన్నాను . దాని  విషయం  లో  చాలా  జాగ్రత్తగా  ఉంటున్నాను .  ఈ ఆరునెలల్లో  ఒక్క  రోజు  కూడా   నేను  దానిని  ఎక్కడా  మర్చిపోలేదు "
.
.
.
"  నువ్వు  పెన్ను  మర్చిపోకపోడానికి  కారణం నువ్వు  దానికి  ఇచ్చిన  విలువ ."
.
.
.
 మనం  దేనికి  విలువ  ఇస్తామో  దానిపట్ల  మనం   జాగ్రత్తగా  ఉంటాము .
.

వస్తువుకు  విలువ  ఇస్తే  దాన్ని  కోల్పోము
.

ఆరోగ్యానికి  విలువ  ఇస్తే  ఏమి  తినాలో  ,  ఏమి  తినకూదదో , ఎంత  తినాలో  ,  ఎప్పుడు  తినాలో  అన్నీ  జాగ్రత్తగా  ఉంటాము
.

స్నేహానికి  విలువ  ఇస్తే స్నేహితుడిని  గౌరవిస్తాము
.

డబ్బుకు  విలువ  ఇస్తే  ఆచి  తూచి   ఖర్చు  పెడతాము
.

కాలానికి  విలువ  ఇస్తే  టైం  వేస్ట్  చెయ్యము
.

బంధాలకు  విలువ  ఇస్తే  వాటిని  తెంచుకోము
.

దేనికి  ఎంత  విలువ  ఇవ్వాలో  తెలుసుకుని   వ్యవహరించడం  మనం  నేర్చుకోవలసినది
.
.
🌹ఈ  సలహా  ఇచ్చిన  వారు   జె  ఆర్ డి  టాటా

No comments:

Post a Comment

Total Pageviews