Saturday, August 18, 2018

ఆవు నుంచి హెచ్ఐవి వ్యాక్సిన్?

అద్బుతం: ఆవు నుంచి హెచ్ఐవి వ్యాక్సిన్? ఎలా అంటే?

మన ఇండియా లో అవుని అందరు పవిత్రమైనదిగా, ఆరాధ్యంగా పూజిస్తారు. హిందూ విశ్వాసాల పరంగా ఎందుకు పూజిస్తారు అనే విషయం పక్కన పెడితే సైంటిఫిక్ గా కూడా ఆవు పాలు చాలా విధాలుగా మనిషి ఆరోగ్యంగా ఉండటానికి కారణం అవుతున్నట్లు తెలుస్తుంది. ఆవు నుంచి వచ్చే ఉత్పత్తులలో సర్వరోగాలు నివారించే శక్తి ఉందని ఇప్పటికే శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇప్పుడు తాజాగా హెచ్‌ఐవీని అరికట్టేందుకు శాస్త్రవేత్తలు ఆవుని ఉపయోగించుకునే పనిలో ఉన్నట్లు తెలుస్తుంది. ఆవుతో హెచ్‌ఐవీ వ్యాక్సిన్‌ తయారు చేయొచ్చని అంటున్నారు శాస్త్రవేత్తలు. హెచ్‌ఐవీ వైరస్‌ తాలూకూ ప్రొటీన్లను ఆవుల్లోకి ఎక్కించినప్పుడు వాటిల్లో తయారైన యాంటీబాడీలతో హెచ్‌ఐవీని నిరోధించొచ్చని స్క్రిప్స్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ శాస్త్రవేత్తలు ఇటీవల జరిపిన ఓ ప్రయోగం ద్వారా తెలిసింది. ఈ పరిశోధన వివరాలు అంతర్జాతీయ జర్నల్‌ నేచర్‌ తాజా సంచికలో ప్రచురితమయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి. హెచ్‌ఐవీ వైరస్‌ తరచూ తన రూపం మార్చుకుంటూ ఉంటుందన్న విషయం తెలిసిందే. వ్యాధికి తగిన మందు లభించకపోవడానికి కారణమిదే.
అయితే ఈ వ్యాధి మిగిలిన జంతువులకు సోకినా.. ఆవులకు మాత్రం సోకదు. దీనికి కారణమేమిటో తెలుసుకునేందుకు స్క్రిప్స్‌ రీసెర్చ్‌ సెంటర్‌ శాస్త్రవేత్తలు ఓ ప్రయోగం చేశారు. హెచ్‌ఐవీ వైరస్‌ ఉపరితలాన్ని పోలిన ప్రొటీన్‌ను ఆవుల్లోకి ఎక్కించారు. ఆ తర్వాత ఏడాది పాటు అప్పుడప్పుడూ ఆవుల రక్తం సేకరించి యాంటీబాడీలను వేరు చేశారు. ఈ యాంటీబాడీలు కణాల్లోకి హెచ్‌ఐవీ వైరస్‌ చేరకుండా అడ్డుకుంటున్నట్లు గుర్తించారు. అంతేకాదు.. ఈ యాంటీబాడీలు అనేక ఇతర వైరస్‌లను కూడా నిరోధిస్తున్నట్లు తెలిసింది.
నిత్యం అనేక రకాల సూక్ష్మజీవులతో ఆవుల రోగ నిరోధక వ్యవస్థ చాలా బలంగా ఉండటం వంటి కారణాల వల్ల ఈ క్షీరదాలు ఉత్పత్తి చేసే యాంటీబాడీలు చాలా పొడవుగా ఉంటాయని శాస్త్రవేత్తలు చెప్పారు. అందువల్లే ఇవి హెచ్‌ఐవీని అడ్డుకోగలుగుతున్నాయని ఇంటర్నేషనల్‌ ఎయిడ్స్‌ వ్యాక్సిన్‌ ఇనిషియేటివ్‌కు చెందిన శాస్త్రవేత్త డెవిన్‌ సోక్‌ చెబుతున్నారు. ఆవులకు ఉన్న ఈ వినూత్న లక్షణం ఆధారంగా భవిష్యత్తులో హెచ్‌ఐవీకి మాత్రమే కాకుండా.. అనేక ఇతర వైరస్‌ సంబంధిత వ్యాధులకూ మెరుగైన చికిత్స లభించవచ్చని శాస్త్రవేత్తలు. ఇప్పుడు ఈ విషయం చదివాక ఆవుని ఎందుకు పవిత్రంగా హిందువులు పూజిస్తారో అనే విషయం చాలా మందికి తెలుస్తుంది.

No comments:

Post a Comment

Total Pageviews