Monday, February 29, 2016

శుభోదయం../i\..
యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థితా
నమస్తస్త్యై నమస్తస్త్యై నమస్తస్త్యై నమోనమః !!

క్షోణితలంబునన్ నుదురు సోకగ మ్రొక్కి నుతింతు సైకత 
శ్రోణికి జంచరీకచయ సుందరవేణికి రక్షితామర
శ్రేణికి దోయజాతభవ చిత్త వశీకరనైక వాణికిన్
వాణికి నక్షదామ శుక వారిజ పుస్తక రమ్య పాణికిన్.

భావం:- నెలకు నెన్నుదురు సోకునట్లు సాగిలపడి మ్రొక్కి సైకత శ్రోణి, చదువుల వాణీ, అలివేణి అయిన వాణిని సన్నుతిస్తాను. ఆ చల్లని తల్లి ఒక చేతిలో అక్షరామాలనూ, మరొక చేతిలో రాచిలుకనూ, ఇంకొక చేతిలో తామర పువ్వునూ, వేరొక చేతిలో పుస్తకాన్ని ముచ్చటగా ధరిస్తుంది. సుధలు వర్షించే తన సుందర సుకుమార సూక్తులతో అరవిందభవుని అంతరంగాన్ని ఆకర్షిస్తుంది.తన కటాక్ష వీక్షణాలతో సుర నికరాన్ని కనికరిస్తుంది.



వేప' పేటెంట్ యుద్దంలో అమెరికా పై గెలిచిన 'వందనా శివ'

దెబ్బ తగిలితే పసుపు రాస్తే అది నేరమట. కురుపులు, ఆటలమ్మ వస్తే వేపాకులు వాడినా కూడా బహుళజాతి కంపెనీలు మన పై నేరాలు మోపి, కేసులు పెడతాయట. ఎందుకంటే వాటిని వాడే విజ్ఞానం వారే కనుగొన్నారట. దీనిని వారే పేటెంటు చేసుకున్నారట.

గత దశాబ్దమంతా,(1995 – 2005) భారతీయ స్వచ్ఛంద సంస్థలు, భారతీయ ప్రభుత్వం, మేధావి వర్గం, అమెరికా పేటెంట్ సంస్థలతో, బహుళజాతి సంస్థలతో విజ్ఞానయుద్ధాలు చేసారు. చివరికి వేప, పసుపు వాడే విజ్ఞానం అనూచానంగా భారతదేశమంతటా ఉందని, ఆయుర్వేద గ్రంథాల నిండా వీటిని ఔషధాలుగా పేర్కొనబడినట్లు వారికి నిరూపించడానికి తలప్రాణం తోకకొచ్చింది.

వేప పసుపే కాదు. నిమ్మ, జామ, ఉసిరి మొదలైన ఎన్నో మన ఆయుర్వేద ఔషధాలన్నిటికీ ఇదే పరిస్థితి. చివరికి బాసుమతి బియ్యం కూడా పేటెంట్ చేసుకొని ఉన్నారు. ఒకప్పుడు వేప పసుపు మనం వాడితే మూఢనమ్మకమని వెక్కిరించిన పాశ్చాత్యులు, వాటిలోని ఔషధీయ విలువలను నేడు తెలుసుకొని, వాటిని తామే కనుగొన్నట్లు పేటెంట్  తీసుకుని ప్రచారం చేయడమే కాకుండా, మనల్ని వాడకుండా నియంత్రించడం చాలా హాస్యాస్పదంగానూ, దురాగతంగానూ ఉన్నది. ఇంతటి రభసలో ఉన్న వేప గురించి కొన్ని విషయాలు....

1) గ్రామాల్లో నేటికీ ప్రతి ఇంటి ముంగిటా వేపచెట్టు నాటుకుంటారు. గొడ్లను కట్టేస్తారు.

2) వేసవి కాలంలో వేపచెట్టు నీడనే పడుకుంటారు.

3) వేప పుల్లలతో పళ్లు తోముకోవడం నేటికీ 60 శాతం మందికి పైగా ప్రజలు పాటిస్తున్న విషయం విదితమే.

4) వేపాకులను నూరి, ఆ పసరును ఒంటికి రుద్దుకుని స్నానం చేస్తారు. వేప గింజల నుంచి నూనెలు సబ్బులు తయారు చేయడం కూడా దాదాపుగా నాలుగైదు వందల సంవత్సరాల నుండి మనకు తెలిసిన విషయమే.

5) వేపతైలాన్ని 100శాతం ఫలవంతమైన గర్భనిరోధక పూతగా స్త్రీలు వాడేవారు.

6) సన్యాసులు తమ తమ కామ ప్రవృత్తులను తగ్గించుకోవడానికి కూడా ఔషధంగా వాడతారు.

7) వేపనూనె దీపారాధనకు ఎంతో శ్రేష్ఠమైనది.

8) ఉపవన వినోదిని అనే సంస్కృత గ్రంథంలో వేపను వ్యవసాయంలో ఎలా వాడాలో వివరించి ఉన్నారు. వేపను ఒక క్రిమిసంహారక మందుగా తెలిపి అది సంహరించే దాదాపు 200కాటకాల పేర్లను కూడా తెలిపి ఉన్నారు.

9) వేప చెట్టులోని ఏ భాగమైనా ప్రకృతి సిద్ధ ఎరువుగా భూసారాన్ని పెంచుతుంది.

10) సుశ్రుత, చరక సంహితలలో వేపయొక్క ఔషధీయ గుణాలను స్పష్టంగా పేర్కొని ఉన్నారు.

11) వేపను మనం చాలా ఏళ్లుగా వాడుతున్నప్పటికీ, 1995లో "ది యూరోపియన్ పేటెంట్ ఆఫీసు(మ్యూనిచ్), అమెరికా ప్రభుత్వరంగ సంస్థ అయిన డిపార్టుమెంట్ ఆఫ్ అగ్రికల్చర్ W.R.GRACE అనే బహుళజాతి సంస్థకి వేపలో ఉండే ఔషధ గుణాలకి పేటెంట్లు మంజూరు చేసినది.

12) ఈ పేటెంటు భారతీయుల అభ్యంతరం, కోర్టు కేసుల ద్వారా2000లో రద్దు చేయబడినది. ఈ విజ్ఞాన యుద్ధంలో ప్రముఖ పాత్ర పోషించినది వందనా శివ అనే పర్యావరణ పరిరక్షకురాలు.

13) 2001లో ఆ పేటెంట్ రద్దు పై బహుళజాతి సంస్థలు తిరిగి అప్పీలు చేసుకున్నారు.

ఈ సాంప్రదాయక విజ్ఞానం ఇదివరకే భారతదేశంలో ఎందరో ఉపయోగించినట్లు నిర్ధారించబడింది,

వేప పైన ఆ సంస్థలకి ఇతర దేశాలకి ఇచ్చిన పేటెంటు రద్దు చేయబడినది.

చివరికి భారతదేశం సొంతం చేసుకోంది......
గుడికి ఎందుకు వెళ్ళాలి ?

మనలో చాలామందికి గుడికి వెళ్ళే అలవాటు ఉంటుంది. ఆడ-మగ, పెద్ద-చిన్న అనే తేడా లేకుండా మనలో చాలామంది గుళ్ళు గోపురాలను దర్శించుకుంటారు. అసలు గుడికి ఎందుకు వెళ్ళాలి అని ఎప్పుడైనా ప్రశ్నించుకున్నారా? కాసేపు కాలక్షేపం కోసం లేదా ఏమైనా దిగుళ్ళు ఉంటే మర్చిపోవడం కోసం అనుకుంటే పొరపాటు.

గుడికి వెళ్ళడం మొక్కుబడి వ్యవహారం కాదు. ఆలయాలను దర్శించుకోవడం వెనుక శాస్త్రీయ ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం. అసలు గుడి ఎప్పుడు, ఎందుకు, ఎలా ఏర్పడింది? దేవాలయాలకు ఎందుకు వెళ్ళాలి, ఈ విషయమై వేదాలు ఏం చెప్తున్నాయి మొదలైన అంశాలు తెలుసుకోవడం చాలా అవసరం.

మనదేశంలో చిన్నా పెద్దా వేలాది దేవాలయాలు ఉన్నాయి. అయితే అవన్నీ వైదిక దేవాలయాల పరిగణనలోకి రావు. నియమాలను పాటించి, నిర్దుష్టంగా నిర్మించిన ఆలయాలను మాత్రమే గురువులు పరిగణిస్తారు. అలాంటివే అత్యంత ప్రసిద్ధి చెందాయి. ఇతర దేవాలయాలు కూడా పవిత్ర ప్రదేశాలే అయినప్పటికీ కొన్ని ఆలయాలు మరింత పునీతమయ్యాయి. స్థలమహత్యాన్ని సంతరించుకున్నాయి.

భూమిలో మహత్తరమైన ఆకర్షణ శక్తి తరంగాలు ఎక్కడ ప్రసరిస్తూ ఉంటాయో అక్కడ ఆలయాన్ని నిర్మించాలి. ఇంకా అర్ధమయ్యేట్లు చెప్పాలంటే ఉత్తర దక్షిణ ధ్రువాల మధ్య ఎలా ఆకర్షణ శక్తి ఉంటుందో అలా భూమిలో పాజిటివ్ ఎనర్జీ పాసయ్యేచోట ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయి. అందుకే అలాంటి గుళ్ళలో అడుగు పెట్టగానే తనువూ, మనసూ ప్రశాంతత పొందుతాయి.

దేవాలయ గర్భగృహంలో ఉత్క్రుష్టమైన ఆకర్షణా తరంగాలు కేంద్రీకృతమైన చోట మూలవిరాట్టును నిలిపిన ప్రదేశంలో వేదమంత్రాలు రాసిన తామ్ర పత్రాన్ని (రాగి రేకు) నిక్షిప్తం చేసి ఉంచుతారు. రాగి లోహానికి భూమిలో ఉండే శక్తి తరంగాలను గ్రహించే తత్వం ఉంది. ఆవిధంగా రాగి గ్రహించిన ఆకర్షణను ఆ పరిసర ప్రాంతాలకు విడుదల చేస్తుంది. అందువల్ల రోజూ గుడికి వెళ్ళి మూల విరాట్టు ఉన్న గర్భగుడి చుట్టూ ప్రదక్షిణ చేసే అలవాటు ఉన్నవారికి ఆ తరంగాలు సోకి అవి శరీరంలోకి ప్రవహిస్తాయి. ఎప్పుడో ఒకసారి ఆలయానికి వెళ్ళేవారిలో ఆ శక్తి సోకినా గమనించదగ్గ తేడా తెలీదు. కానీ నిత్యం గుడికి వెళ్ళేవారిలో పాజిటివ్ ఎనర్జీ చేరడం స్పష్టంగా తెలుస్తుంది.

ఇకపోతే గర్భగుడి మూడువైపులా పూర్తిగా మూసి ఉండి, ఒక్కవైపు మాత్రమే తెరిచి ఉంటుంది. అందువల్ల గర్భాలయంలో, ముఖద్వారం దగ్గర పాజిటివ్ ఎనర్జీ కేంద్రీకృతమై మరీ అధికంగా ఉంటుంది. గర్భగుడిలో వెలిగించే దీపం ఉత్పత్తి చేసే శక్తి కూడా చెప్పుకోదగ్గదే.

ఆలయాల్లో గంటలు మోగిస్తారు. వేద మంత్రాలు పఠిస్తారు. భక్తి గీతాలు ఆలపిస్తారు. ఈ మధుర ధ్వనులు శక్తిని సమకూరుస్తాయి.

గుడిలో దేవుడికి సమర్పించే పుష్పాలు, కర్పూర హారతి, అగరొత్తులు, గంధం, పసుపు, కుంకుమల నుంచి వచ్చే పరిమళాలు శరీరంలో రసాయన చర్య జరపడంవల్ల శక్తి విడుదల అవుతుంది.

మూల విరాట్టును ప్రతిష్ఠించిన ప్రదేశం నుండి విడుదలయ్యే మహత్తర శక్తి తరంగాలకు గుడిగంటలు, మంత్ర ఘోష, పూల పరిమళాలు, కర్పూరం, అగరొత్తులు, గంధం, పసుపు, కుంకుమల నుండి వచ్చే అపురూపమైన సుగంధం, తీర్థ ప్రసాదాల్లో ఉండే ఔషధ గుణాలు అన్నీ కలిసి ఎనలేని మేలు జరుగుతుంది.

గుడిలో దేవుడికి కొబ్బరికాయ , అరటిపళ్ళు నైవేద్యం పెడతారు. ఈ కొబ్బరిని, అరటిపళ్ళని భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. వీటిని సేవించడం వల్ల శరీరానికి అవసరమైన అనేక ఔషధాలు అందుతాయి.

తీర్థంలో పచ్చ కర్పూరం (Cinnamomum camphora) యాలుకలు (Cardamom) సాంబ్రాణి (సంబరేను చెట్టునుండి వచ్చే ధూపద్రవ్యం లేదా సాంబ్రాణి తైలము - benzoin), తులసి పత్రాలు (holy basil), లవంగాలు (Clove) మొదలైనవి కలుపుతారు. ఆయా పదార్థాలు అన్నీ ఔషధగుణాలు కలిగినవే. అలా గుడికి వెళ్ళినవారు సేవించే తీర్థం ఎంతో మేలు చేస్తుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఆయురారోగ్యాలను ఇస్తుంది. ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండేందుకు తోడ్పడుతుంది.

ఇప్పుడు చాలామంది పాటించడంలేదు కానీ పూర్వం ఆలయానికి వెళ్ళేప్పుడు పురుషులు చొక్కా (షర్టు) లేకుండా వెళ్ళేవారు. దాంతో ఆలయ ప్రాంగణంలో ఉండే శక్తి తరంగాలు వేగంగా పురుషుల శరీరంలో ప్రవేశిస్తాయి. స్త్రీలు నిండుగా దుస్తులు వేసుకుని అనవసరమైన చూపులు తమపై పడకుండా జాగ్రత్త పడటం మన సంప్రదాయం కనుక అందుకు బదులుగా నగలు ధరించి వెళ్ళేవారు.

లోహానికి శక్తి తరంగాలను త్వరితంగా గ్రహించే శక్తి ఉంటుంది. ఆవిధంగా స్త్రీపురుషులిద్దరికీ ప్రయోజనం కలుగుతుంది.

భక్తులు గుడికి వెళ్ళి దేవుని దర్శించుకుంటున్న సమయంలో గర్భగుడిలో దీపం వెలుగుతుంటుంది. కర్పూరహారతి వెలిగిస్తారు. గంటలు మోగుతాయి.తీర్థ ప్రసాదాలు ఇస్తారు. అలా అన్ని పాజిటివ్ ఎనర్జీలూ సమీకృతమై భక్తులకు ఆనందం, ఆరోగ్యం లభిస్తాయి. మనలో దివ్య శక్తి ప్రవేశించి, తేజస్సు అనుభూతికొస్తుంది. కనుక ఆలయానికి వెళ్ళడం కాలక్షేపం కోసం కాదు, ఎన్నో శక్తి తరంగాలు ప్రవేశిస్తాయని శాస్త్రాలు నిరూపిస్తున్నాయి.
🙏 జై  శ్రీమన్నారాయణ 🙏

Sunday, February 28, 2016



శుభరాత్రి! 
సంతోషంతో సమానమైన ధనం మరొకటిలేదు 
సంతోషమే నందనవనం.. శాంతియే కామధేనువు 
సంతోషంకన్నాఉత్తమమైన సుఖం లేదు 
మానవునికి సంతోషమే శ్రేష్టమైన మూలధనం.





”ఓం భూర్బువస్సువః – తత్సవితుర్వ రేణ్యం 

భర్గోదేవస్య ధీమహి – ధీయో యోనః ప్రచోదయాత్‌!”

గాయత్రికి మూడు పేర్లు. అవి గాయత్రి, సావిత్రి, సరస్వతి. ఇంద్రియములకు నాయకత్వం వహించునది గాయత్రి,
 సత్యమును పోషించునది సావిత్రి, వాగ్ధేవతా స్వరూపిణి సరస్వతి. అనగా హృదయము, వాక్కు, క్రియ… ఈ 
త్రికరణ శుద్ధి గావింఛునదే గాయత్రి మంత్రము. సకల వేదముల సారము ఈ గాయత్రి మంత్రము. ఈమెకు 
తొమ్మిది వర్ణనలున్నాయి.
1) ఓం 2) భూః 3) భువః 4) సువః 5) తత్‌ 6) సవితుర్‌ 7) వరేణ్యం 8) భర్గో 9) దేవస్య
ప్రతిపదార్ధం :

ఓం : ప్రణవనాదం 

భూః : భూలోకం, పదార్ధముల చేరిక, దేహము, హృదయం, 
మెటీరియలైజేషన్‌

భూవః : రువర్లోకం, ప్రాణశక్తి, వైబ్రేషన్‌ 

సువః : స్వర్గలోకం, ప్రజ్ఞానము, రేడియేషన్‌ ఈ మూడు లోకములు మన 
శరీరములోనే వున్నవి. 

తత్‌ : ఆ 

సవితుర్‌ : సమస్త జగత్తును 
వరేణ్యం : వరింపదగిన 
భర్గో : అజ్ఞానాంధకారమును తొలగించునట్టి 
దేవస్య : స్వయం ప్రకాశ స్వరపమైన బ్రహ్మను 
ధీమహి : ధ్యానించుచున్నాను 
ధీయోయోనః ప్రచోదయాత్‌ : ప్రార్ధించుచున్నాను
కనుక వర్ణన, ధ్యానము, ప్రార్ధన – ఈ మూడు ఒక్క గాయత్రీ మంత్రములోనే 
లీనమై ఉన్నవి.

Saturday, February 27, 2016

తేట తేట తెనుగులా....
మన తెలుగు భాష గొప్పదనం ముందుగా అక్షరమాల అల్లికలోనే ఉంది.
పూర్వం గురువులు పిల్లలతో వర్ణమాలను వల్లె వేయించేవారు. అలా కంఠస్ధం చేయించడంవల్ల కంఠం నుంచి ముఖం వరకు వ్యాయామం తెలియకుండానే జరుగుతుంది
ఏలాఅంటే
=======
అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ౠ ఎ ఏ ఐ ఒ ఓ ఔ అం అ:
ఇలా అచ్చులను పలకడం వలన ముఖమంతా కదులుతూ వ్యాయామం జరుగుతుంది.
క ఖ గ ఘ ఙ……..కంఠ భాగం
చ ఛ జ ఝ ఞ……..కంఠంపైన నాలుక మొదటి భాగం
ట ఠ డ ఢ ణ……నాలుక మధ్యభాగం
త థ ద ధ న……నాలుక కొస భాగం
ప ఫ బ భ మ……..పెదవులకు
య ర ల వ శ ష స హ ళ క్ష ఱ……నోరంతా
ఇలా ముఖమంతా హల్లులతో వ్యాయామం జరుగుతుంది.
సుందర సుమధుర సౌమ్యమైన కమ్మని మృదుత్వంతో కూడిన తియ్యని తేనేలాంటిది మన భాష. ఆనందంగా మనసుకు హాయి గొలిపే విధంగా వినసొంపైన మాటలు మనందరి నోటంట వెలువడుతే ఎంత బాగుంటుంది.
తెలుగు భాషను అందంగా వ్రాసే వారికి చిత్రకళ సొంతమవుతుందంట ఎందుకంటే మన వర్ణమాలతో అన్ని మెలికలు అన్నాయి.
మనలోని భావాన్ని మాతృభాషలో వర్ణించినంత వివరంగా ఏ భాషలోను వ్రాయలేరు. తెలుగువారింటి ముంగిట ముగ్గును చూస్తే ఎంత ఆహ్లదభరితంగా చుడముచ్చటగా ఉంటుందో తెలుగువారి మనస్సు అంత అందంగా ఉంటుంది.
తెలుగులో మాట్లాడండి. .
తెలుగులో వ్రాయండి. . .
తెలుగు పుస్తకాలు చదవండి..చదివించండి..
తేనెలొలికే తెలుగు భాష తియ్యదనం ఆస్వాదించండి . . .
_____________________________________
ఈ పోస్ట్ నాది కాదు.
రచయిత ఎవరో తెలియదు.వారికి
నా ధన్యవాదాలు _/\_
అన్నీ మంచి అలవాట్లే… ఐనా క్యాన్సర్….?

ఏజ్ - 30 … నో సిగరెట్… నో మందు… నో గుట్కా…. అసలే చెడు అలవాట్లు లేవు…,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

పైగా రోజూ ఎక్సర్ సైజ్… అప్పుడప్పుడు యోగా… అయినా… ఏం జరిగిందో తెలుసా….?

ఏదో చిన్న సమస్యతో టెస్ట్ లు చేయించుకుంటే క్యాన్సర్ ఉందంటూ… షాకింగ్ న్యూస్….!!!!!!!

ఇదెలా..ఎలా..ఎలా..? ఆ యువకుడు తలలు బద్దలు కొట్టుకున్నా అర్థం కాలేదు…

ఇలా మన దేశంలో …. మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ఎందరో…?

ఇంతకీ అన్నీ మంచి అలవాట్లే ఉన్నా…
చిన్న ఏజ్ లోనే క్యాన్సర్ ఎందుకు వస్తోంది…?

అసలు కారణమేంటి…,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,?

మన తండ్రులు, తాతలు ఇప్పటికీ అరవైలు, ఎనభైల్లోనూ ఉల్లాసంగా ఉంటే..,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,,,,,,,,

మన తరానికే ఏంటీ మాయరోగాలు…,,,,,,,,,,,,,,,,,,,,,,?

వెరీ సింపుల్… పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునే దాకా…

మనం తినే తిండీ, తాగే నీరు, పీల్చేగాలి అన్నీ కాలుష్యమయం, రసాయనాలమయం…,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

పొద్దున్నే ప్లాస్టిక్ బ్రష్, బ్రిస్టల్స్… దాని మీద కృత్రిమ రసాయనాలు.. ఇంకా వీలైతే బొమికల పొడి, రసాయనాలు కలిపిన పేస్టులు…,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

ఇక అలా మొదలైతే.. ప్లాస్టిక్ ప్లేట్లలో వేడి వేడి టిఫిన్లు,,,,,,,,,,,,,

తాగే నీళ్ల బాటిల్ నుంచి నిల్వ ఉంచే ప్రతి ఆహార పదార్థాలు ప్లాస్టిక్…,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

అలా 24 గంటలూ.. 365 రోజులు ప్లాస్టిక్ జీవితం గడుపుతున్నాం…

బై వన్ …గెట్ వన్ లాగా… ఒక దరిద్రానికి … మరో దౌర్భాగ్యం ఫ్రీ అన్నట్టు…,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

పాలు, పండ్లు, కూరగాయలు వీటిల్లో రసాయనాలు… పురుగుల మందులు ఎక్స్ ట్రా…,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

ఇలా కూడా క్యాన్సర్ కారకాలు సరిపోవు అనుకునేవాళ్లు,,,,,,,,,,,

పిజ్జాలు, బర్గర్లు, కూల్ డ్రింక్ లు… ఇప్పుడు చెప్పండి… 30 ఏళ్లకే క్యాన్సర్ ఎందుకు రాకూడదో….,,,,,,,,,,,,,,,,,?

- మరి.. అప్పటివాళ్లు ఎందుకు గట్టిగా ఉన్నారు….?

ఒక్కసారి చిన్నప్పటి రోజులు గుర్తు తెచ్చుకోండి..,,,,,,,,,,,,,,,,,,

అమ్మమ్మ ఇంట్లోనో..నానమ్మ ఇంట్లోనో మీ బాల్యం ఎలా గడిచేది…?

వేపపుల్లతో తోముకున్నాం.. లేదంటే… పళ్లపొడి చేతిలో వేసుకుని వేలితో శుభ్రంగా పళ్లుతోముకోవటం…,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

తర్వాత… సున్నిపిండితో స్నానం… ఇత్తడి కంచాల్లో భోజనం, రాగి గ్లాసులు, చెంబుల్లో నీళ్లు..,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

ఇంటి పెరట్లోనే ఉన్న గేదెల నుంచి ఆరోగ్యకరమైన పాలు… ఏ కాలుష్యం లేని వేపచెట్టు గాలి… ఇంకా ఆటలు,ఈతలు…

అప్పట్లో…,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

అసలు ప్లాస్టిక్ బకెట్ తో స్నానం చేసినట్టు గుర్తుందా…?

ఇత్తడి గంగాళాలు, నీళ్లు కాచుకోవటానికి రాగి బాయిలర్ లు…

ఇంట్లో లేదా పొలం నుంచి వచ్చిన తాజా కూరగాయలు…,,,,,,,,

బాగా ఆడిపాడి… పుష్టికరమైన ఆహారం తిని.. ఆరుబయట గాలిలో… నులకమంచం లేదా నవారు మంచం మీద నిద్ర… నో ఏసీ… నో …కూలర్…..,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

ఇలా ఒకటా రెండా… అన్నీ ఆరోగ్యకరమైన అలవాట్లే.. సో… మరి వందేళ్లు బతకమంటే ఎందుకు బతకరు మరి…!

కాబట్టి ఇప్పుడు చెప్పండి… క్యాన్సర్ మనల్ని కబళిస్తోందా…?

మనమే రెడ్ కార్పెట్ వేసి మరీ దానిని ఆహ్వానిస్తున్నామా….?
ఆధునికత మంచిదే….,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

కానీ… అది మరీ మనల్ని మనమే చంపుకునేంత గొప్పది కానంత వరకే…!

Friday, February 26, 2016

                          అష్టలక్ష్మిలు

1.    శ్రీమహావిష్ణువును భర్తగా చేపట్టిన లక్ష్మి ‘ఆదిలక్ష్మి’.ఈమె సకల సంపదలకు అధినాయకి.

2.    సర్వ మానవాళి ఆకలి తీర్చే అమ్మ ఈ ‘ధాన్యలక్ష్మి’. ఈమె సస్యసంపదకు అధినాయకి.

3.    జీవిత సమరంలోని ఆటుపోట్లను ఎదుర్కొనే ధైర్యాన్ని ప్రసాదించే లక్ష్మి ‘ధైర్యలక్ష్మి’.ఈమె ధైర్యానికి ప్రతీక.

4.    రాజలాంఛనాలకు, వైభోగాలకు నిలువెత్తు నిదర్శనం ఏనుగు. గజం ఎక్కడ వుంటే అక్కడ సర్వసంపదలు             వుంటాయి. గజ రూపంలో దీవించే లక్ష్మి ‘గజలక్ష్మి. ఈమె సకల ఐశ్వర్యాలకు ప్రతీక.

5.    ఎన్ని సంపదలున్నా సంతానం లేకపోతే జీవితమే శూన్యం. వంశాన్నినిలిపే సంతానాన్ని అనుగ్రహించే లక్ష్మి          ‘సంతానలక్ష్మి’.

6.    జీవనగమనంలో ఎదురయ్యే సమస్యలతో చేసే పోరాటంలో విజయమే ప్రధాన గమ్యం. అట్టి అంతిమ                      విజయాన్ని అమిత  ప్రేమతో అందించే లక్ష్మి ‘విజయలక్ష్మి’.


7.    ఎన్ని సంపదలున్నా, విద్య లేనివాడు వింతపశువే. అఙ్ఞానాంధకారాన్ని తొలగించి,ఙ్ఞానమార్గాన్ని చూపించే           విద్యను ప్రసాదించే లక్ష్మి ‘విద్యాలక్ష్మి’.

8.    ‘ధనం మూలమిదం సర్వం’ అన్నది నానుడి. ధనం లేకపోతే జీవితమే సున్నా. అట్టి ధనాన్ని అనుగ్రహించే             లక్ష్మి ‘ధనలక్ష్మి’.

ఆ అష్టలక్ష్మీ దేవిల అనుగ్రహం మన అందరిపైనా ఎల్లవేళలా ఉండాలని 

కోరుకొంటున్నాను.  

Wednesday, February 24, 2016

   ( రవీంద్రనాధ్ ఠాగూర్ గారు రాసిన " గీతాంజలి " లోని ఓ ప్రార్ధన ఇది )

" నన్ను కష్టాలనించి రక్షించమని కాదు ,,కష్టాల్ని నిర్భయంగా ఎదుర్కొనే ధైర్యాన్నిమ్మని ప్రార్ధించనీ.
నా బాధని మానపమని కాదు,,బాధని జయించే హృదయానిమ్మని అడుగుతున్నాను..
జీవిత సమరరంగంలో సహాయంకోసం వెతుక్కోవడం కాదు,,నాస్వంత శక్తిపైన ఆధారపడేట్టు చెయ్యి...
సందేహిస్తో,,భయపడుతో,,నాకు మోక్షమిమ్మని నీ కాళ్ళపై పడడంకాదు,,నా ముక్తిని సహనంతో సాధించుకోగలననే విశ్వాసాన్నిమ్మని అర్ధించనీ నిన్ను....
నీ కరుణని విజయంలో మాత్రమే చూసే పిరికివాడిని కానీకు,,అపజయంలోనైనా నీచేతిపట్టుని తెలుసుకోగలిగేట్టు వరమియ్యి నాకు..... "
( టాగూర్ గారు రాసిన ఇలాంటి భక్తి గేయాలు కొన్ని అర్ధంచేసుకోవడం కష్టం మొదట్లో ఎవరికైనా..ఎందుకంటే ఈయన దేవుడికి ప్రత్యేకించి ఓ రూపం ఇవ్వడు..ఓ లోకాన్ని సృష్టించడు...
ఏదో ఆ భగవంతుడు తన సన్నిహిత మితృడైనట్లూ,, పూర్వకాలం నుంచీ పరిచయమైన ప్రియుడైనట్లూ ఒక్కోసారి ఒక్కోలా సంభోదించి గొప్ప తత్వాన్ని ,,సౌందర్యాన్నీ ,,సత్యాన్ని విశదీకరిస్తూ రాశారు ఆ కవితలన్నీ...
ఈ ప్రయత్నం అర్ధంచేసుకోవడం కాస్త క్లిష్టతరమే..కానీ ఒకసారి మీరు ఈ విధానాన్ని అర్ధంచేసుకుని చదవడం మొదలెడితేమాత్రం గొప్ప ఆంతరంగిక శాంతిని పొందుతున్నట్లూ,, జీవితంలో నూతన కాంతిద్వారాలేవో తెరుస్తున్నట్లూ,, ఇలా మీ అనుభూతికి తగ్గట్లు గొప్ప అనిర్వచనీయమైన భావనలు కలుగుతాయి మీలో..
ఇవన్నీ ఇలా నేను చెప్తే అర్ధంకావేమోలెండి.. మీకు మీరే ఓసారి " గీతాంజలి " చదివి చెప్పండి ఎలా ఉందో...!!!
నా ఉద్దేశంలో " ఈ పుస్తకానికి నోబెల్ బహుమతి లభించింది " అని అనడంకూడా చాలా చిన్న విషయమే అని అనిపిస్తుంది..
మరి మీకు?

Saturday, February 20, 2016

రేపు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ శుభసందర్భంలో, అంతర్జాతీయ తెలుగు బంధువులందరికీ శుభాకాంక్షలు!...

రేపు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ శుభసందర్భంలో, అంతర్జాతీయ తెలుగు బంధువులందరికీ శుభాకాంక్షలు!.... బహుభాషాతనాన్ని, భాషా-సాంస్కృతిక భిన్నత్వాన్ని గుర్తించేందుకు, అవగాహన పొందేందుకు ఈ రోజును జరుపుకుంటారు. ఐక్య రాజ్య సమితి సాంస్కృతిక విషయాల సంస్థ యునెస్కో ఈ రోజును 17 నవంబర్ 1999న తొలిసారి ప్రకటించింది. ఐక్య రాజ్య సమితి జెనరల్ అసెంబ్లీ కూడా ఈ విషయాన్ని ధృవీకరించి, 2008 ని అంతర్జాతీయ భాష సంవత్సరంగా ప్రకటించింది.
1947లో...భారత్ విభజన సమయంలో బెంగాల్ ప్రాంతంలోని పశ్చిమభాగం భారతదేశంలోన
ి తూర్పుప్రాంతం పాకిస్థాన్లోకి వెళ్లిపోయాయి. తూర్పు పాకిస్థాన్గా గుర్తించిన ఆ ప్రాంతానికీ పాకిస్థాన్కీ మధ్య ఆనాటి నుంచే ఆర్థిక, సాంస్కృతిక, భాషాపరమైన సంఘర్షణ ఉండేది. ఉర్దూను పాక్ అధికార భాషగా గుర్తించడంతో , బెంగాలీ మాట్లాడే తూర్పు పాకిస్థాన్లో ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమం వెుదలైంది. ప్రభుత్వం హింసామార్గాల్లో ఆ ఉద్యమాన్ని అణిచే ప్రయత్నం చేసింది. ఢాకా విశ్వవిద్యాలయానికి చెందిన నలుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. అయినా ఉద్యమం ఆగలేదు. మరింతతీవ్రరూపం దాల్చింది. 1956 ఫిబ్రవరి 29న పాక్ సర్కారు బెంగాలీని కూడా మరో అధికార భాషగా గుర్తించింది. ఆతర్వాత జరిగిన విముక్తి పోరాటంలో ఆ ప్రాంతం బంగ్లాదేశ్గా అవతరించింది. మాతృభాష కోసం నలుగురు యువకులు ప్రాణాలర్పించిన ఫిబ్రవరి 21వ తేదీని ఐక్యరాజ్యసమితి సాంస్కృతిక విభాగమైన యునెస్కో 'అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం'గా ప్రకటించింది. ఈ సందర్భంలో తెలుగు వెలుగు అనే స్వీయకవిత మీ అందరికోసం ఈ లింక్ నొక్కి చూడండి. ఆనందించండి. సత్యసాయి విస్సా ఫౌండేషన్. 
https://www.youtube.com/watch?v=oygIK_wqjuU&list=PLkR7dgb_wqABKR9MeOS6QJaYYwHoDP5ixhttps://www.youtube.com/watch?v=oygIK_wqjuU&list=PLkR7dgb_wqABKR9MeOS6QJaYYwHoDP5ix

Monday, February 15, 2016


ఎన్ని సార్లు చదివినా కంటతడి పెట్టించేదే ఈ క్రింది విషయం. చదవండి, ఇంకొకరికి పంపండి ఈ భరత మాత ముద్దు బిడ్డల విషయం. వారిని గౌరవించడమంటే మనల్ని మనం గౌరవించకోవటమే.
నా సీట్ లో కూర్చున్నాను విశాఖపట్నం లో . ఆరేడు గంటల ప్రయాణం . మంచి పుస్తకం చదువుకోవడం , ఒక గంట నిద్ర పోవడం... ఇవీ నా ప్రయాణం లో నేను చేయ్యాలనుకున్నవి .
సరిగ్గా టెక్ ఆఫ్ కి ముందు నా చుట్టూ ఉన్న అన్ని సీట్ల లోనూ సైనికులు కొందరు వచ్చి ఆక్రమించుకున్నారు . అన్నీ నిండి పోయాయి . కాలక్షేపంగా ఉంటుంది అని పక్కన కూర్చున్న అతడిని అడిగాను . " ఎక్కడకి వెడుతున్నారు ?" అని
" ఢిల్లీ సర్ ! అక్కడ రెండు వారాలు శిక్షణ తర్వాత ఆపరేషన్ కి పంపిస్తారు " అన్నాడు అతను .
ఒక గంట గడిచింది . అనౌన్సమెంట్ వినబడింది . కావలసిన వారు డబ్బులు చెల్లించి లంచ్ చేయవచ్చు అని . సరే ఇంకా చాలా టైం గడపాలి అని లంచ్ చేస్తే ఓ పని అయిపోతుంది కదా అని అనిపించింది . నేను పర్సు తీసుకుని లంచ్ బుక్ చేద్దామనుకుంటూ అనుకుంటుండగా మాటలు వినిపించాయి
" మనం కూడా లంచ్ చేద్దామా ?" అడిగాడు ఆ సైనికులలో ఒకరు
" వద్దు ! వీళ్ళ లంచ్ ఖరీదు ఎక్కువ . సరుకు తక్కువ . విమానం దిగాక తిందాం లే ! "
" సరే ! "
నేను ఫ్లైట్ అటెండెంట్ దగ్గరకి వెళ్ళాను . ఆమెతో " వాళ్ళందరికీ కూడా లంచ్ ఇవ్వండి . " అని డబ్బులు మొత్తం పది లంచ్ లకి ఇచ్చాను .
" ఆమె కళ్ళల్లో నీరు " నా తమ్ముడు కార్గిల్ లో ఉన్నాడు సర్ ! వాడికి మీరు భోజనం పెట్టినట్టు అనిపిస్తోంది సర్ ! " అంటూ నాచేతులు రెండూ పట్టుకుంది .
నేను నా సీట్ లోకి వచ్చి కూర్చున్నాను .
అరగంటలో అందరికీ లంచ్ బాక్స్ లు ఇచ్చేసింది
నేను భోజనం ముగించి విమానం వెనక్కి రెస్ట్ రూం కి వెడుతున్నాను .
వెనుక సీట్ లో నుండి ఒక ముసలాయన వచ్చాడు .
నేను అంతా గమనించాను . మీకు అభినందనలు .
అందులో నాకూ భాగస్వామ్యం ఇవ్వండి అంటూ చేతిలో చేయి కలిపారు
ఆ చేతిలో 500 రూపాయలు నా చేతికి తగిలాయి . మీ ఆనందం లో నా వంతు అన్నారాయన .
నేను వెనుకకు వచ్చేశాను . .నా సీట్ లో కూర్చున్నాను . ఒక అరగంట గడిచింది. విమానం పైలట్ సీట్ నెంబర్లు వెతుక్కుంటూ నా దగ్గరకి వచ్చాడు . నావేపు చూసి చిరునవ్వు నవ్వాడు .
" మీకు షేక్ హ్యాండ్ ఇద్దామనుకుంటున్నాను అన్నాడు ."
నేను సీట్ బెల్ట్ విప్పి లేచి నిలబడ్డాను . అతడు షేక్ హేండ్ ఇస్తూ " నేను గతం లో యుధ్ధవిమాన పిలట్ గా పనిచేశాను . అపుడు ఎవరో ఒకాయన మీలాగే నాకు భోజనం కొని పెట్టారు . అది మీలోని ప్రేమకు చిహ్నం . నేను దానిని మరువలేను " అన్నాడు
విమానం లోని పాసింజర్లు చప్పట్లు కొట్టారు . నాకు కొంచెం సిగ్గు గా అనిపించింది . నేను చేసినది ఒక మంచి పని అని చేశాను అంతే కానీ నేను పొగడ్త కోసం చెయ్యలేదు .
నేను లేచి కొంచెం ముందు సీట్ల వైపు వెళ్లాను . ఒక 18 సంవత్సరాల కుర్రాడు నా ముందు చెయ్యి చాపాడు . షేక్ హేండ్ ఇస్తూ ఒక నోటు పెట్టాడు .
ప్రయాణం ముగిసింది .
నేను దిగడం కోసం డోర్ దగ్గర నిలబడ్డాను . ఒకాయన మాట్లాడకుండా నా జేబులో ఏదో పెట్టి వెళ్లి పోయాడు . ఇంకో నోటు.
నేను దిగి బయటకు వెల్లేలోగా నాతో పాటు దిగిన సైనికులు అందరూ ఒక చోట కలుసుకుంటున్నారు. నేను గబగబా వాళ్ళ దగ్గరకి వెళ్లాను నాకు విమానం లోపల తోటి పాసింజర్లు ఇచ్చిన నోట్లు జేబులో నుండి తీసి వాళ్ళకు ఇస్తూ " మీరు మీ ట్రైనింగ్ చోటుకి వెళ్ళే లోపులో ఈ డబ్బు మీకు సాండ్ విచ్ తినడానికి పనికి వస్తాయి . మీరు మాకిచ్చే రక్షణ తో పోలిస్తే ఏమి ఇచ్చినా తక్కువే ! మీరు ఈ దేశానికి చేస్తున్న పనికి మీకు ధన్య వాదాలు . భగవంతుడు మిమ్మల్ని , మీ కుటుంబాలనూ ప్రేమతో చూడు గాక ! " అన్నాను . నా కళ్ళలో చిరు తడి .
ఆ పది మంది సైనికులు విమానం లోని అందరు ప్రయాణికుల ప్రేమను వాళ్ళతో తీసుకు వెడుతున్నారు . నేను నా కారు ఎక్కుతూ తమ జీవితాలను ఈ దేశం కోసం ఇచ్చేయ్యబోతున్న వారిని దీర్ఘాయువులుగా చూడు స్వామీ ! అని దేవుడిని కోరుకున్నాను.
ఒక సైనికుడు అంటే
తన జీవితాన్ని ఇండియా కు చెల్లించబడే బ్లాంక్ చెక్కు లాంటి వాడు .
" బ్రతికినంత కాలమూ, జీవితాన్ని చెల్లించే ఖాళీ చెక్కు "
వారి గొప్పతనాన్ని తెలియని ఎందఱో ఉన్నారు ఇంకా !
మన కోసం ప్రాణాలను పణంగా పెట్టిన మన సైనికులను ప్రేమించుదాం
-ఙై హింద్

Sunday, February 14, 2016

             రథ సప్తమి శుభాకాంక్షలు బంధుమిత్రులందరికీ!! 


తిథులలో సప్తమి తిథికి సూర్య నారాయణ మూర్తి యాజమాన్యాన్ని కలిగి ఉన్నాడు. ఏడవ తిథి సప్తమి. అలాగే సప్తమి తర్వాత వచ్చే తిథి అష్టమి. అష్టమి మొదలుగా చంద్రునకు రిఫ అనే దోషము కూడా ఆపాదింప బడుతుంది. సప్తమి తిథి పూర్తి కావడంతో వచ్చే గుణగణాదులు పూర్తిగా మారిపోతాయి అష్టమి తిథితో. అందుకే ఈ సప్తమి తిథికి శరీరానికి ప్రాతినిధ్యం వహించేటటువంటి, తను భావ కారకుడైనటువంటి, పిత్రుభావ కారకుడైనటువంటి సూర్య నారాయణ మూర్తి యాజమాన్యాన్ని కలిగి ఉన్నాడు. అటువంటి ఈ సూర్య నారాయణ మూర్తి పుట్టినటువంటి రోజు మాఘ శుద్ధ సప్తమి. దీనికి సూర్యసప్తమి అని పేరు. అలాంటప్పుడు రథసప్తమి అన్న పేరు ఎలా వచ్చింది? మిగతా ఏ పండుగలకూ లేని ప్రత్యేకత రథసప్తమికి ఎలా ఏర్పడింది? అంటే సూర్య నారాయణ మూర్తి ప్రత్యేకంగా ఆయన రథం చెప్పుకోదగ్గది. ఆయన రథానికి ఒకటే చక్రం ఉంటుందిట. ఒక చక్రం ఉండే రథం ప్రపంచంలో ఉంటుందా? రెండు చక్రాలు కావాలి కదా మనం వెళ్ళాలి అంటే. సూర్యుని రథం మటుకు ఒకే చక్రం. నిర్ణీతమైన ప్రమాణంలో ప్రపంచంలో ఏం జరిగినా క్రమం తప్పకుండా ప్రయాణించేటటువంటి వాడు సూర్య నారాయణుడు. కనుక ఆ సప్తమి రథసప్తమి, సూర్య సప్తమి. "మన్మథ నామ సంవత్సరే ఉత్తరాయనే శిశిర ఋతౌ మాఘమాసే శుక్లపక్షే సప్తమ్యాం కృత్తికా నక్షత్రే కళింగ దేశాధిపతిం " అంటూ సూర్య నారాయణ మూర్తి వృత్తాంతం అంతా కూడా నవగ్రహార్చన చేసే సమయంలో చెప్తూ ఉంటారు. ఆ స్వామి కృత్తికా నక్షత్రంలో జన్మించాడు అని వర్ణిస్తాయి సాంప్రదాయ గ్రంథాలన్నీ కూడా. దక్షిణాయనం పూర్తీ అయిపోయి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైన సంక్రాంతి పిమ్మట వచ్చే సప్తమి తిథికి రథసప్తమి అని గుర్తించాలి. ఇకనుంచి సంపూర్ణమైన కాంతి కిరణాలు మనపైన ప్రసరిస్తాయి ఉత్తరాభిముఖంగా. కనుక ఈ తిథి నాడు సూర్య రథాన్ని ప్రతిబింబించే విధంగా వాకిళ్ళలో సూర్య రథం ముగ్గు వేయడం, అలాగే సూర్య నారాయణ మూర్తిని సోత్రం చేయడం, చేయాలి. ఇంతటి ప్రాముఖ్య కలిగిన రోజు రథసప్తమి రోజు. సూర్య నారాయణ మూర్తిని ఆరాధన చేస్తే ఆరోగ్యం చేకూరుతుంది. ఇదే "సూర్య సప్తమి"అని కూడా పిలువబడుతుంది.ఈ రోజున అరుణోదయకాలంలో  జిల్లేడు ఆకును అందులో రేగికాయలను ఉంచుకొని తలపై పెట్టుకొని  

సప్త సప్త మహాసప్త రథసప్తేన సప్తతే 
సప్తజన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి!!

అను శ్లోకం చదువుకునిస్నానం చేస్తే ఏడు విధాలైన శాపాలు నశిస్తాయట.  నమస్కారం ప్రియ:సూర్య: అన్న ఆర్య వాక్య ప్రకారం కేవలం నమస్కారం చేతనే సూర్యుడు సంతృపి చెందుతాడని తెలుస్తుంది.ఈ రోజున చిక్కుడుకాయలతో రథం చేసి కొత్త బియ్యంతో పాయసాన్ని వండి చిక్కుడు అకులలో పెట్టి సూర్యునికి నివేదన చేయడం ఆచారం. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అన్న వాక్యం ప్రకారం ఆరోగ్యం కొరకు ఆదిత్య హృదయం పారాయణ చెయ్యాలి. రథసప్తమి నాటి స్నానం సప్త సప్త మహాసప్త ద్వీపా వసుంధరా! కోటి జన్మార్జితంపాపిం వినశ్యతితత్క్షణాత్ అన్నట్లుగా పాప విముక్తి కలిగిస్తుందట. 

Thursday, February 11, 2016

చంద్ర వర్ణన :
చంద్రుని గురించి, దమయంతికి ఇంకా ఇలా చెప్తున్నాడు నలుడు.
"జ్యోత్స్న నాగఁ దమిస్ర నా నుభయభార్య
లుడుపతికి; నందు నొకతె తె, ల్పోర్తు నలుపు;
తాను వారికి మెచ్చుగాఁ దాల్పఁబోలుఁ
తెలుపు నలుపును నగు మేను నెలత! యితడు".
(శృంగారనైషధము - శ్రీనాథుడు)
అర్థములు: జ్యోత్స్న = వెన్నెల; నాగ = అనియు; తమిస్ర = చీకటి; నా = అనియు; ఉభయభార్యలు = ఇద్దరు పత్నులు; ఉడుపతి = తారాపతియైన చంద్రుడు (ఉడు అనగా నక్షత్రము); ఒకతె = ఒకరు; ఓర్తు = ఒకరు; వారికి మెచ్చుగా = వారికి నచ్చినట్టుగా; మేను = శరీరము; నెలత = స్త్రీ.
భావము: "దేవీ! ఈ సుధాకరునికి ఇద్దరు సతులు ఉన్నారు. వారు జ్యోత్స్న మరియు తమిస్ర. అందులో జ్యోత్స్న (వెన్నెల) తెల్లగాను, తమిస్ర (చీకటి) నల్లగాను ఉంటారు. అందుచేత, వారికి ఇష్టమైనరీతిలో ఉండుటకై, ఈ మాయలమారి జాబిల్లి కొన్నాళ్ళు తెల్లగాను, కొన్నాళ్ళు నల్లగాను తన దేహవర్ణమును మారుస్తూ ఉంటాడు." ఇదీ నలుని వివరణ....... సహృదయపాఠకులు ఈపాటికి కనిపెట్టేవుంటారు - అవే శుక్లపక్షము మరియు కృష్ణపక్షము అని.
కవిసార్వభౌముల కమనీయ కల్పనకు అడ్డేమున్నది!....
తల్లి తండ్రులకు ఒక గమనిక, ఒక విన్నపం.
పిల్లలను మంచి వ్యక్తిత్వం ఉన్న పిల్లలుగా పౌరులుగా తీర్చిదిద్దాలి అనుకుంటే, అది మీ చేతులలోనే ఉంది.
1. రోజులో ఒక పది నిముషాలు పిల్లలు ( వారు ఎ వయసు వారైనా ) చెప్పే మాటలను శ్రద్ధగా, సంతోషంగా , ఆసక్తిగా విని, వారితో పదినిముషాలు గడపడం అలవాటు చేసుకోండి.
2. ఆ పదినిముషాలు టీవీ, ఇంటర్నెట్, ఆండ్రాయిడ్ ఫోన్, ఇంకా ఇతరత్రా వ్యాపకాలు లేకుండా చూసుకోండి.
3. అలాగే సాధ్యమైనంత వరకు, రోజులో ఉదయం అల్పాహారం కానీ, రాత్రి భోజనం కానీ కుటుంబ సభ్యులు కలిసి చేసేందుకు ప్రాధాన్యత ఇవ్వండి. ఆ టైం లో కూడా వీలైనంత వరకు, జోక్స్, సరదా కబుర్లతో గడపండి.
4. అలాగే, పిల్లల ఎదురుగా ఎవరినీ విమర్శించడం అలవాటు చేసుకోకండి. పిల్లల ఎదురుగా పోట్లడుకోకండి. అలాగే, ఒకరి పుట్టింటి వారిని ఒకరు పిల్లల ఎదురుగా విమర్శించకండి.
5.వారానికి ఒకసారి అయినా, పిల్లలతో కాస్సేపు ఆడుకోండి.
6. వీలైనంత వరకు మీరు టెక్నాలజీ ని పిల్లల ఎదురుగా సాధ్యమైనంత తక్కువగా ఉపయోగించండి.
7. పిల్లల స్నేహితుల మీద, వారి తో కలిసి తిరిగే సమయం మీద ఒక కన్నేసి ఉంచండి.
8. పిల్లల స్నేహితులు ఇంటికి వచ్చినపుడు, వారి వారి ప్రత్యెక గదులలో కాకుండా ఇంటిలో కామన్ హాల్ లో కూర్చొని, మాట్లాడుకోమని చెప్పండి.
9. మీరు వారి మాట వింటారు అనే నమ్మకాన్ని, పిల్లలలో కలుగ చేయండి. మీ పిల్లలు చెడిపోతే అది మీ బాధ్యతే.
10. పిల్లలు పార్టీలకు, గెట్ టుగెదర్ లకు వెళ్ళేటప్పుడు, తిరిగి ఇంటికి రావలసిన సమయాన్ని మీరు నిర్ణయించండి.
11. పిల్లల ముఖ్యమైన స్నేహితుల, ప్రొఫెసర్ ల ఫోన్ నంబర్లు మీ దగ్గర ఉంచుకోండి.
12. ఒకవేళ పిల్లలు పరీక్షలలో విఫలం అయినా, వారిని ఇతరులతో పోల్చితిట్టకండి. అది వారి మనసు మీద ఎంతో ప్రభావం చూపుతుంది.
13. మేము మిమ్మల్ని నమ్ముతున్నాము అనే నమ్మకాన్ని వారిలో కలిగించండి.
14. ఇంట్లో పెద్దవాళ్ళు ( నానమ్మలు, తాతయ్యలు ) ఉంటె వారితో కొంతసేపు గడపడం అలవాటు చేయండి.
15. వారి పట్లమీరు గౌరవం చూపిస్తే, పిల్లలు కూడా వారిని గౌరవిస్తారు.
ప్రతి తల్లితండ్రులు ఈ సూచనలు పాటిస్తే, పిల్లలు కొంతవరకు ప్రక్కదారులు పట్టకుండా ఉంటారు.

పెద్దలమాట చద్దిమూట!!

వయసు త్వరగా ఎదగడం మన చేతుల్లో ఉండదు.
జీవితంలో పైకి ఎదగడం మన చేతల్లో ఉంది!!!



Tuesday, February 9, 2016

పెరుగు తింటే ఆరోగ్యం.. ! కానీ పెరుగు తినడంపై చాలా అపోహలున్నాయి. కాస్త జ్వరం, దగ్గు, జలుబు, గాయాలు

 తగిలినప్పుడు పెరుగు తినకూడదు అని చెబుతుంటారు. కానీ పెరుగులో అమోఘమైన ఆరోగ్య ప్రయోజనాలు 

ఉన్నప్పుడు.. అనారోగ్యంతో ఉన్నప్పుడు పెరుగు ఎందుకు తినకూడదు అంటారు ? అంతేకాదు.. రాత్రిపూట 

పెరుగు తినవచ్చా ? తినకూడదా ? అనేది మరో పెద్ద డైలమా ? కొంతమంది రాత్రిపూట పెరుగు తినవచ్చు అంటే.. 

మరికొందరు అస్సలు రాత్రి పూట డిన్నర్ లో పెరుగు చేర్చుకోనేకూడదు అంటారు ? అసలు ఏది వాస్తవం ?? 

పెరుగులో అనేక ఆరోగ్యప్రయోజనాల

ు దాగున్నాయి. కాబట్టి పాలు అంటే ఇష్టపడని వాళ్లు కనీసం పెరుగైనా డైట్ లో చేర్చుకోవాలని నిపుణులు 

సూచిస్తూ ఉంటారు. ఎందుకంటే.. ఇందులో మంచి బ్యాక్టీరియా ఉంటుంది. ఇది పొట్ట ఆరోగ్యానికి మంచిది. 

ప్రస్తుతమున్న ఆహారపు అలవాట్లు, ట్రెండ్స్ కారణంగా.. మంచి బ్యాక్టీరియాని కోల్పోతున్నాం. కాబట్టి ఇది 

పుష్కలంగా లభించే.. పెరుగుని డైట్ లో చేర్చుకోవడం వల్ల జీర్ణక్రియ సమస్యలు తొలగిపోతాయి. కాబట్టి డైట్ లో 

కంపల్సరీ పెరుగు చేర్చుకోవాలి. అయితే రాత్రి పూట కూడా పెరుగు నిరభ్యంతరంగా తినవచ్చు. అయితే జలుబు, 

దగ్గుతో బాధపడేవాళ్లు తరచుగా జలుబు చేసే అలర్జీ ఉన్నవాళ్లు మాత్రం పెరుగు రాత్రిపూట తీసుకోకపోవడం 

మంచిదని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఎందుకంటే.. పెరుగు కఫంకి కారణమవుతుందని ఆయుర్వేదం 

రాత్రిపూట పెరుగు తీసుకోకపోవడం మంచిదని సూచిస్తుంది. అయితే ఇది అందరూ పాటించాల్సిన అవసరం లేదు. 

ఎవరైతే ఎక్కువగా జలుబు, దగ్గుతో బాధపడతారో వాళ్లు మాత్రమే కర్డ్ కి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. 

ఇంకా నచ్చితే మజ్జిగ తీసుకున్నా మంచిదని సూచిస్తున్నారు.
శ్రీ నాధుడు ... అరవ బొజనం !

ఒకసారి శ్రీనాథుడు.పేద కోమటి వేమారెడ్డి పంపితే కాంచీపురం వెళ్ళాడట .
అక్కడ ఎవరింట్లోనో భోజనం చేశాడు.వారి భోజనాన్ని యిలా వర్ణిస్తున్నాడు.
తొలుతనే వడ్డింత్రు దొడ్డ మిరియపు చారు 
చెవులలో పొగ వెళ్లి చిమ్మిరేగ
బలుతెరంగుల తోడ పచ్చళ్ళు
చవి గొన్న బ్రహ్మ రంధ్రము దాక బారు నావ
యవిసాకు వేచిన నార్నెల్లు ససిలేదు
పరిమళ మెంచిన బండ్లు సొగచు
వేపాకు నెండించి వేసిన పొళ్ళను
గంచాన గాంచిన గ్రక్కు వచ్చు
నరవ వారి యింట విందెల్ల నాగడంబు
చెప్పవత్తురు తమతీరు సిగ్గులేక
చూడవలయు ద్రావిడుల కీడు మేళ్ళు
.
అప్పటికి మిరపకాయలు లేవు కారాలన్ని టికీ మిరియాలనే వాడేవారు.
ఆంధ్రులకు పప్పు ముఖ్యం వారికి చారు ముఖ్యం.
అలవాటు లేని చారు మొదటనే వడ్డించే సరికి
ఆ కారం ఆయన నసాళానికి అంటిందట.
యవిసాకు ఆర్నెల్ల కిందట వేయించి పెట్టినది
దాని వాసన తలుచుకుంటేనే పండ్లు పులిసి పోతాయి.
వివిధ రకాల పచ్చళ్ళు,
వేపాకు వేయించి చేసిన పొడి వేశారట.
అవన్నీ తినలేక ఈ పద్యం చెప్పాడట.
ఆయనకు అందర్నీ విమర్శించడం అలవాటే కదా!
యిప్పుదేవరూ అంత కారాలు తినడం లేదు.
యిది శ్రీనాథుని కాలం లోని సంగతి. . .

"అన్నవరం దేవుడు"
శ్రీ సత్యనారాయణ స్వామివారు, అనంత లక్ష్మీ సత్యవతి అమ్మవారితో కలసి కోలుతీరిన ప్రదేశం.పిలిస్తే పలికే దైవంగా పేరుపొందిన శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయాన్ని రత్నగిరి అనే కొండపై అన్నవరంలో నిర్మించారు. అన్నవరం ఒక సుప్రసిద్ద పుణ్యక్షేత్రం. శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామి వారి దివ్యక్షేత్రం. కొత్తగా పెళ్ళయిన జంటలు తప్పక సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం హిందూ ఆచారం. ఇళ్ళలో వ్రతం చేసుకోవడం సంగతి అలా ఉంచి అన్నవరం సత్యనారాయణ స్వామి వారి దేవాలయంలో వ్రతం చేసుకోవడం మరీ శ్రేష్టమని భావిస్తారు. కొందరు అలా చేసుకోవాలని మొక్కుకుంటారు కూడా.ఇక్కడ సామూహికంగా వందలాది దంపతులు కూర్చుని ఒకేసారి సత్యనారాయణస్వామి వ్రతాన్ని కనుల పండుగ గా చేసికొంటూ ఉండటం ఒక ప్రత్యేకత.అన్నవరం సత్యనారాయణ స్వామి దేవాలయంలో ప్రవేశించగానే ప్రశాంతత చేకూరుతుంది అనేది భక్తుల అనుభవం. ఆలయ ముఖద్వారం, స్వామివారి విగ్రహం, గాలి గోపురం దేనికదే మహా సుందరంగా ఉంటుంది. ''హరిహర హిరణ్యగర్భ త్రిమూర్త్యాత్మక స్వరూప'' అంటూ రాసిన శ్లోకాన్ని భక్తులందరూ తప్పక పఠిస్తారు
అన్నవరం సత్యనారాయణ స్వామి దేవాలయాన్ని దర్శించుకున్న వారి కోరికలు, వెంటనే నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తారు.
ఇతిహాసాల ప్రకారం అడిగిన (అనిన) (వరం)వరాలను తీర్చే దేవుడు కాబట్టి ( అనిన+ వరం = అన్నవరం) "అన్నవరం దేవుడు" అంటారు.



Monday, February 8, 2016

లక్ష్మీదేవి పాదాలను పూజించకూడదా?
లక్ష్మీదేవి పాదాలను పూజించకూడదు అనేది ఒక మూఢనమ్మకంగా ఏర్పడిందే కానీ ప్రామాణిక గ్రంథాలలో యే దేవతామూర్తిని యేవిధంగా అర్చించాలి అనే విశేషాంశాన్ని పరిశీలిస్తే మటుకు పాదాలనే పూజించాలి అంటాయి ఆ గ్రంథాలన్నీ కూడా. విశేషించి పాదాలే పూజచేయడం శ్రీమన్నారాయణ మూర్తిని అర్చించే సమయంలో మనం గమనిస్తూంటాం. అన్నమాచార్యులవారు బ్రహ్మకడిగిన పాదము అని చెప్పారు కదా! అలాగే బలిచక్రవర్తి కూడా వామనుని పాదాలను జలముతో తన భార్యయైన వింధ్యావళి నీళ్ళు పోస్తుండగా కడిగి ఆ స్వామి అడిగిన మూడు అడుగుల నేలను దానం ఇవ్వగా ఆస్వామి పాదాలతో పృథివ్యాపస్తేజోవాయురాకాశములు అయిన పంచభూతాత్మకమైన ప్రపంచాన్నంతటినీ కూడా ఈపాదంతో ఆక్రమించాడు. మరొక పాదంతో విశాల ఆకాశమంతా తానుగా దర్శింపజేసి ఆ మూడవపాదాన్ని బలిచక్రవర్తి శిరస్సున ఉంచాడు. కాబట్టి మనము భగవంతుని పాదములను ఆశ్రయించాలి. "భగవంతు వలగొను పదములు పదములు" అంటారు పోతనామాత్యులు. కనుక శ్రీమన్నారాయణుని ఆశ్రయించే సమయంలో పాదములను ఆశ్రయించాలి. అమ్మవారికి మాత్రం పాదములకు పూజించరాదు అనే ఒక కొత్తగా కనుక్కున్నారు. నిజానికి పరమేశ్వరి - పరమేశ్వరుడు, లక్ష్మీదేవి - శ్రీమన్నారాయణుడు, అంతా ఒక్కటే. కాబట్టి ఎటువంటి అనుమానమూ లేకుండా అమ్మవారి పాదములు అర్చించవచ్చును. కొల్హాపురంలో అమ్మవారి పాదాలు బంగారు తాపడంతో చేయబడి ఉంటాయి. బాసరకు వెళ్ళినా మరింకే అమ్మవారి క్షేత్రానికి వెళ్ళినా నమస్కరిస్తే ఆ సమయంలో అర్చకుడు శఠారిని మన శిరస్సుపైన ఉంచుతాడు. మనం తలవంచి నమస్కారం చేస్తాం. ఆ శఠారి (శఠం అంటే మనలో ఉండే మొండితనం - దానిని తొలగించేవి పరమాత్ముని యొక్క పాదములు. దానిమీద పరమాత్మ పాదములే ఉంటాయి. లక్ష్మీదేవి సన్నిధానంలోకి వెళ్ళి ఆ అమ్మవారికి నమస్కరించిన తరువాత అర్చకులు మనశిరస్సుపై ఉంచే శఠారి పైన అమ్మవారి పాదాలే ఉంటాయి. ఇది గమనించాలి. పాదపూజ అని చెప్తాం. పరమాత్మను మనం అర్చించే సమయంలో ఆ పరమాత్మ విశాల విశ్వమంతా కూడా వ్యాపించి ఉంటాడు. ఆయనను మనం దర్శించగలిగే స్థితి ఎక్కడ? అంటే పాదములను దర్శిస్తే చాలు పరమాత్మను దర్శించినట్లే. ఇటువంటి భావంతో అయ్యవారికైనా, అమ్మవారికైనా సర్వాంములు నమస్కరించవలసిందే. లక్ష్మీ అష్టోత్తర శతనామావళి ఒక్కసారి పరిశీలించినా చంచలాయై నమః - పాదౌపూజయామి, ఇలా సర్వాంగాలనూ పూజ చేస్తాం కదా! మరి పాదాలు పూజ చేయకుండా ఎలా? మొట్టమొదటి నామమే చంచలాయై నమః - పాదౌపూజయామి. కాబట్టి తప్పకుండా లక్ష్మీదేవి పాదములను తప్పకుండా పూజించవచ్చు.అని పెద్దలు చెపుతారు.
[  జీవితం లో కొన్ని అక్షర సత్యాలు ]

⛔ TEMPLE కు
 6 అక్షరాలు MASJID మరియు CHURCH కు
కూడా 6 అక్షరాలు.

⛔ GEETA కు 5 అక్షరాలు   QURANమరియు BIBLE కు కూడా 5అక్షరాలు.

⛔ LIFE మరియు DEAD కు 4అక్షరాలు.

⛔ HATE మరియు
 LOVE కు 4అక్షరాలు.


⛔NEGATIVE మరియు POSITIVE కు 8 అక్షరాలు.

⛔FAILURE మరియు SUCCESS కు 7అక్షరాలు.

⛔ BELOW మరియు  ABOVE కు 5అక్షరాలు.

⛔ CRY మరియు  JOY కు 3 అక్షరాలు.

⛔ ANGER మరియు HAPPY కు 5 అక్షరాలు.

⛔ RIGHT మరియు WRONG కు 5 అక్షరాలు.

⛔ RICH మరియు POOR కు 4 అక్షరాలు.

⛔. FAIL మరియు Pass కు 4 అక్షరాలు.

పైవన్ని  ఒకదానికొకటి వ్యతిరేక పదాలు. అయినప్పటికి అక్షరాల లో మాత్రం సమానమే అనే భావన కల్గజేశాయి కదా.
అలాగే మనం కూడా కులానికి, మతానికి, ప్రాంతానికి వేరైనా మనుషులు గా మరియు భారతీయులుగా మనమంతా ఒకటే అని చాటి చెబుదాం
💪జై భారత్ 💪💪జై హింద్💪

మనిషి గొప్పదనం.


మాఘ మాస విశిష్టత.
"మాఘ మాసం" ఎంతో విశిష్టమైనది. ఈ మాసంలో వచ్చే ముఖ్యమైన తిథి "శుక్ల పక్ష చవితి" దీనిని "తిల చతుర్థి"అంటారు. దీన్నే "కుంద చతుర్థి" అని కూడా అంటారు. నువ్వులను తింటారు. నువ్వులతో లడ్లు చేసి పంచి పెడతారు. ఈ రోజున "డుంఢిరాజును" ఉద్దేశించి, నక్త వ్రతము పూజ చేస్తారు! డుంఢిని ఈ విధంగా పూజించడం వలన దేవతల చేత సైతం పూజలందుకుంటారని కాశీ ఖండములో తెలియజేశారు."కుంద చతుర్థి" నాడు కుంద పుష్పాలతో పరమేశ్వరుని అర్పించి రాత్రి జాగారణ చేసినవారు, సకలైశ్వర్యాలను పొందుతారని కాలదర్శనంలో చెప్పబడింది. అయితే సాయంకాలం చతుర్థి ఉంటే ఉత్తమం అని ఈ సందర్భంలో తెలుసుకోవాలి. మాఘమాసంలో ప్రాత:కాలంలో చేసే స్నాన,జప,తపములు చాలా ఉత్తమమైనవి. ఈ మాసంలో స్నానం చేసేటప్పుడు
"దు:ఖ దారిద్ర్య నాశాయ, శ్రీ విష్ణోతోషణాయచ! ప్రాత:స్నానం కరోమ్య, మాఘ పాప వినాశనం!"
అని చేసిన తరువాత
"సవిత్రేప్రసవిత్రేచ! పరంధామజలేమమ! త్వత్తేజసా పరిబ్రష్టం,పాపం యాతు సస్రదా!"
అని చదవాలి. సూర్య భగవానునికి ఆర్గ్యమివ్వాలి.
ఈ మాసాన్ని కుంభమాసం అని కూడా అంటారు.కొంతమంది ఈ నెల్లాళ్ళు ముల్లంగి దుంపను తినరు.ఈ మాసంలో నవ్వులను, పంచదారను కలిపి కలిపి తినాలట. నువ్వులను దానమివ్వాలట. రాగి పాత్రలో గోధుమ రంగుగా ఉన్న నువ్వులను పాత్రతో సహా దానమిస్తే మంచిది.ఈ నెలలో మరణించిన వారికి అమృతత్వం సిద్దిస్తుందట. "మాఘశుద్ద పంచమి"ని శ్రీ పంచమి అంటారు.ఈ పంచమి నాడే "సరస్వతీదేవి" జన్మించిందట. ఈనాడు "రతీ మన్మధులను మల్లెపూలతో పూజిస్తారు.ఉత్తర భారతంలో విష్ణుమూర్తిని, సరస్వతీదేవిని కూడా పూజిస్తారు. బ్రహ్మదేవుడు సృష్టి చేయగా చరాచర ప్రపంచం శ్మశాన నిశ్శబ్ధతతో ఉందట. అవేదనతో తన కమండలంలోని నీటిని ప్రపంచంపై చిలకరించగా చెట్లపై ఆ నీటి బిందువులు పడి ఒక శక్తి ఉద్భవించిందట. రెండు చేతులతో వీణను వాయిస్తూ మరో రెండు చేతులతో పుస్తకాన్ని మాలను ధరించి సమగ్ర రూపిణిగా దర్శనమిచ్చిందట. ఆ వగీశ్వరి వీణావాదనం ద్వారా ప్రపంచంలోని స్తబ్థతను ఉదాసీనతను తొలగించి విద్యాబుద్దులకు అదిష్టాత్రి అయింది ఆ దేవి.
అప్పటి నుండి శ్రీ పంచమి రోజును సరస్వతిని పూజించడం జరుగుతుంది. ఇక మాఘశుద్ద సప్తమి ఇదే "సూర్య సప్తమి"అని కూడా పిలువబడుతుంది.ఇదే రథసప్తమి సుర్య గ్రహణదినం వలె ఇది పరమపవిత్రమైనది.ఈ రోజున అరుణోదయకాలంలో ఏడు జిల్లేడు ఆకులను అందులో రేగికాయలను ఉంచుకొని తలాపై పెట్టుకొని స్నానం చేస్తే ఏడు విధాలైన శాపాలు నశిస్తాయట. స్నానికి ముందు చెరకుగడతో నీటిని కదిలిస్తారు. నమస్కారం ప్రియ:సూర్య: అన్న ఆర్య వాక్య ప్రకారం కేవలం నమస్కారం చేతనే సూర్యుడు సంతృపి చెందుతాడని తెలుస్తుంది.ఈ రోజున చిక్కుడుకాయలతో రథం చేసి కొత్త బియ్యంతో పాయసాన్ని వండి చిక్కుడు అకులలో పెట్టి సూర్యునికి నివేదన చేయడం ఆచారం.
సూర్యుడు తనను పూజించిన సత్రాజిత్తుకి ఈ రోజునే "శమంతకమణి" ప్రసాదించాడు. హనుమంతునికి వ్యాకరణ శాస్త్రాన్ని యజవాల్క్యునికి యజుర్వేదాన్ని బోధించాడు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అన్న వాక్యం ప్రకారం ఆరోగ్యం కొరకు ఆదిత్య హృదయం పారాయణ చెయ్యాలి. రథసప్తమి నాటి స్నానం సప్త సప్త మహాసప్త ద్వీపా వసుంధరా! కోటి జన్మార్జితంపాపిం వినశ్యతితత్క్షణాత్ అన్నట్లుగా పాప విముక్తి కలిగిస్తుందట. భీష్మాష్టమి "మాఘమానస్యచాష్టమ్యాం శుక్ల పక్షేచ పార్థివ!ప్రాజాపత్యేచ నక్షత్రే మధ్య:ప్రాప్తే దివాకరే!" శోభకృత నామ సంవత్సరంలో మాఘమాసంలో శుక్లపక్షంలో రోహిణి నక్షత్రం ఉన్న అష్టమి తిథినాడు మధ్యాహ్నం సూర్యుడు నడినెత్తిన ప్రకాశిస్తూ ఉండగా అభిజిత్ లగ్నంలో భీష్మ పితామహుడు ధ్యాన స్థితుడై ప్రాణాలను విడిచిపెట్టాడట. స్వచ్చంద మరణం ఆయనకి వరం. ఆయనకు తర్పణలు విడిచి పెట్టడం నెలగంటు పెట్టినప్పటినుంచీ పెట్టిన గొబ్బెమ్మలను ఎండబెట్టి దాచి ఆ పిడకలతో పాయసాన్ని వండి నివేదన చేయడం ముఖ్యం. అష్టమినాడే దైవ సాయుజ్యం పొందినా శ్రీ కృష్ణుని సమక్షంలోనే విష్ణుసహస్రనామాలతో ఆయనను కీర్తిస్తూ మోక్షం పొందాడు. కాబట్టి ఏకాదశిని ఆయన పేరుతో ఏర్పాటు చేశారు. భీష్మ ఏకాదశి నాడు విశేష పూజలు చేయడం ఆనవాయితీ. ఇక మాఘమాసంలో వచ్చే ప్రతి ఆదివారాలు మహిమాన్వితాలే.ఈ విధంగా మాఘమాసమంతా "శివరాత్రి"వరకూ అన్నీ పర్వదినాలే.
                                                               "జగ్గన్నతోట" ప్రభల తీర్థం 


కోనసిమ అంటేనే అందం.అది వేదసీమా అని పెద్దల ఉవాచ.శ్రీశైల పర్వతసానువుల తరువాత తొందరగా

 మనోలయమయ్యే ప్రదేశాలు కోనసీమ దైవ క్షేత్రాలు.అటువంటి కోనసీమలో పుట్టడం నిజంగా  అదృష్టం.


కోనసీమ నడుమ తరతరాలనుండీ జరుగుతున్న "జగ్గన్నతోట" ప్రభల తీర్థం వైభవాన్ని ఇంతింతా అని 


చెప్పరానిది.మకర సంక్రమణ ఉత్తరాయణ మహా పుణ్య కాలం లో సంక్రాంతి కనుమ నాడు కోనసీమలోని 

"మొసలిపల్లి శివారు జగ్గన్నతోట" లో జరిగే ఏకాదశ రుద్రుల సమాగమము అత్యంత 

ప్రాచీనమైన,చారిత్రాత్మకమైన,అతిపురాతనమైన,పవిత్రమైన సమాగమము.ప్రాచీన కాలంలో మొట్టమొదటి గా ఈ 

తోటలోనే ఈ పదకొండు గ్రామాల రుద్రులు సమావేశమయ్యారని ప్రతీతి.ఈ తోటలో ఏ విధమైన గుడి గానీ, గోపురం 

గానీ వుండవు.ఇది పూర్తిగా కొబ్బరి తోట.ఈ ఏకాదశ రుద్రులు సంవత్సరానికి ఒకసారి ఇక్కడ సమావేశం అవ్వడం 

తో ఈ తోట విశేష ప్రాధాన్యత సంతరించుకుంది.


ఇది ఏకాదశ రుద్రుల కొలువు.హిందూ ధర్మ శాస్త్రాల ప్రకారము ఏకాదశ రుద్రులు ఒక్కచోట కొలువు తీరేది ప్రపంచం 

మొత్తం మీదా,ఈ భూమండలం మొత్తానికీ ఒక్క చోటే అదీ వేదసీమ అయినటువంటి కోనసీమలోనే.

లోక కల్యాణార్ధం ఈ పదకొండు గ్రామాల శివుళ్ళు సమావేశం అయ్యి లోక విషయాలు చర్చిస్తారని ప్రతీతి.సుమారు 

400 సంవత్సరాల క్రితం నుండీ ఈ సంప్రదాయం వుందనీ తీవ్రమైన పరిస్థితులు వచ్చిన 17 వ శతాబ్ధములో ఈ 11 

గ్రామాల రుద్రులు ఈ తోటలోనే సమావేశం అయ్యి లోక రక్షణ గావించారనీ ప్రతీతి.అప్పటి నుండీ క్రమం తప్పకుండా 

ప్రతీ సంవత్సరమూ కనుమ రోజు ఎన్ని అవాంతరాలు ఎదురైనా , భూమి తల్లక్రిందులైనా ఈ రుద్రులను ఒక్కచొట 

చేర్చుతారు ఈ గ్రామస్తులు.సంస్థానదీశులైన శ్రీ రాజా వత్సవాయి జగన్నాధ మహారాజు కు చెందిన ఈ తోట జగ్గన్న 

తోట అనే పేరుతో స్థిరపడింది.

ఈ ఏకాదశ రుద్రులు కొలువైన గ్రామాలు ఆ రుద్రుల పేర్లు వరుసగా

1-వ్యాఘ్రేశ్వరం-శ్రీ వ్యాఘ్రేశ్వర స్వామి(బాలాత్రిపురసుందరీ)

2-పుల్లేటికుర్రు-అభినవ వ్యాఘ్రేశ్వర స్వామి(బాలా త్రిపుర సుందరి)


3-మొసలపల్లి-మధుమానంత భోగేశ్వర స్వామి


4-గంగలకుర్రు-చెన్నమల్లేశ్వరుడు


5-గంగలకుర్రు(అగ్రహారం)-వీరేశ్వరుడు


6-పెదపూడి-మేనకేశ్వరుడు

7-ఇరుసుమండ-ఆనంద రామేశ్వరుడు


8-వక్కలంక-విశ్వేశ్వరుడు


9-నేదునూరు--చెన్న మల్లేశ్వరుడు


10-ముక్కామల-రాఘవేశ్వరుడు


11-పాలగుమ్మి-చెన్న మల్లేశ్వరుడు.


ఇవీ గ్రామాలు ఆ గ్రామాల రుద్రుల నామాలు.ఈ స్వామి వారలను "ప్రభలపై" అలంకరించి మేళ తాళాలతో,మంగళ 


వాయిద్యాలతో,భాజా బజంత్రీలతో "శరభా శరభా" హర హర మహాదేవ" అంటూ ఆయా గ్రామాల నుంచి వీరిని 

మోస్తూ ఈ తోటకు తీసుకువస్తారు. ఈ తోట మొసలపల్లి గ్రామములో వుంది కనుక దీనికి ఆతిధ్యము మొసలపల్లి 

కి చెందిన మధుమానంత భొగేశ్వరుడు మిగతా గ్రామ రుద్రులకు ఆతిధ్యము ఇస్తారు. ఈ రుద్రుడు అన్ని ప్రభల 

కన్నా ముందే తోటకు చేరుకుని అందరు రుద్రులూ తిరిగి వెళ్లిన తరువాత వెళ్లడం ఆనవాయితీ.ఈ ఏకాదశ 

రుద్రులకు అద్యక్షత వహించేది వ్యాఘ్రేశ్వారానికి చెందిన రుద్రుడు

"శ్రీ వ్యాఘ్రేశ్వరుడు".ఈ వ్యాఘ్రేశ్వరుడు కి చెందిన ప్రభ తోటలోకి రాగానే మిగతా రుద్ర ప్రభలన్నింటినీ మర్యాదా 

పుర:స్సరంగా ఒక్కసారి లేపి మళ్ళి కిందకు దించుతారు. ఈ 11 శివుళ్ళకు వ్యాఘ్రేశ్వరుడు అధిష్టానము.

ఇక్కడ మరో విశిష్టత ఏమిటీ అంటే గంగలకుర్రు మరియూ గంగలకుర్రు(అగ్రహారం) రుద్ర ప్రభలు ఈ తోట కి 

రావాలంటే మధ్యలో కాలువ(కౌశిక) దాటాలి.ఆ ప్రభలు ఆ కాలువలోంచి ఏ మాత్రం తొట్రూ లేకుండా "హరా హరా" 

అంటూ తీసుకువచ్చే ఆ గ్రామస్తుల ధైర్యం చూడడానికి రెండు కళ్ళు చాలవు. ఎందుకంటే కాలువలో 

మామూలుగానే నడువలేము. అలాంటిది ఒక 30 మంది మోస్తే కానీ లేవని ప్రభ ఆ కాలువలోంచి తోటలోకి 

తీసుకువచ్చే సన్నివేశం చూసేవారికి ఒల్లు గగుర్పొడుస్తుంది.ఇక ఆ కాలువలోకి వచ్చే ముందు ఒక వరి చేనుని ఆ 

ప్రభలు దాటవలిసి వస్తుంది. ఆ చేను ని తొక్కుతూ పంటను తొక్కుతూ వచ్చినా రైతులు భాదపడక సాక్షాత్తూ ఆ 

పరమేశ్వరుడు తమ చేల గుండా వెళ్ళడం పూర్వజన్మ సుకృతం గా భావిస్తారు. అలా ఏక కాలం లో ఏకాదశ 

రుద్రుల(11)దర్శనం చేస్తుంటే కళ్ళు ఆనందాశ్రువులు రాలుస్తాయి.

నమస్తే అస్తు భగవన్


విశ్వేశ్వరాయ


మహాదేవాయ


త్ర్యంబకాయ 


త్రిపురాంతకాయ


త్రికాగ్నికాలాయ


కాలాగ్నిరుద్రాయ


నీలకంఠాయ


మృత్యుంజయాయ


సర్వేశ్వ’రాయ


సదాశివాయ


శ్రీమన్-మహాదేవాయ నమః’ అంటూ రుద్రం లో ఏకాదశ రుద్రుల గురించి ప్రస్తావన ఉంటుంది.


ఆ ఏకాదశ రుద్రులు ఏకకాలం లో సమాగం అయ్యే సన్నివేశం చూస్తే మనసు పులకిస్తుంది
ఈ తీర్థము ను దర్శించడానికి ప్రపంచవ్యాప్తం గా స్థిరపడిన కోనసీమ ప్రజలే కాక,దేశ విదేశీయిలు వచ్చి దర్శించి తరిస్తారు.


           ఈ సారి మీరూ దర్శించి తరించవలిసినది ప్రార్ధన.



Sunday, February 7, 2016

సిద్దార్ధ  ట్రైన్ లో  వస్తూ ఉంటే ఒక పాత నలిగిపోయిన పర్సు
కనిపించింది . దానిని పైకి తీశాడు . అందులో
కొద్దిపాటి చిల్లర నోట్లు , ఒక కృష్ణుడి ఫోటో తప్ప
ఏమీ లేవు . ఎవరిదో తెలిపే ఆనమాళ్ళు ఏమీ లేవు .
ఎలా తిరిగి ఇవ్వడం ?
.
" ఈ పర్స్ ఎవరిదండీ ? " అంటూ అడిగారు
.
అందరూ పర్స్ కేసీ చూశారు . తమ జేబులు
తడుముకున్నారు . ఒక  పక్క
కూర్చున్న ఒక వృద్ధుడు నెమ్మదిగా వచ్చి అది
తన పర్స్ అని చెప్పాడు .
.
" మీ పర్సు అని నమ్మకం ఏమిటీ ?
ఆనమాలు ఏమిటీ ? "
.
" అందులో కృష్ణుడి ఫోటో ఉంటుందండీ "
అన్నాడాయన
.
" అదే ఆనమాలు చెబితే ఎలాగండీ ? ఇంకా ఏదైనా
చెప్పండి. మీ ఫోటో పెట్టుకోవచ్చు కదా ! "
.
అప్పుడు ఆ వృద్ధుడు చెప్పిన సమాధానం మన
అందరికీ ఒక పాఠమే !
.
.
" బాబూ ! అది నాకు చిన్నప్పుడు మా నాన్న ఇచ్చిన
పర్సు . అప్పుడు నాకు మా అమ్మా నాన్న అంటే
చాలా ఇష్టం . అందుకని నేను వాళ్ళ ఫోటో అందులో
పెట్టుకున్నాను . కాలం గడిచే కొద్దీ నేను చాలా
అందంగా ఉన్నాను అని నాకు అభిప్రాయం కలిగింది
. అందుకని నేను అప్పుడు నా పర్సు లో నా ఫోటో
పెట్టుకున్నాను . "
.
నాకో ఉద్యోగం వచ్చి పెళ్లి అయ్యింది . నా భార్య
చాలా అందగత్తె . నాకు ఆమె అంటే చాలా ప్రేమ
అపుడు ఆమె ఫోటో నా పర్సులో పెట్టుకునే వాడిని .
.
ఇంకో రెండు సంవత్సరాలకి నాకు కొడుకు
పుట్టాడు . వాడంటే నాకు చాలా ఇష్టం . వాడి కోసం
ఆఫీసు వదల గానే ఇంటికి వచ్చి వాడితోనే లోకం
అన్నట్టుగా గడిపేవాడిని . వాడిని భుజాల మీద మోస్తూ
రోజంతా గడిపేవాడిని . వాడిని నా పక్కనే
పడుకోబెట్టుకునే వాడిని . వాడే నా లోకం . అపుడు
నా పర్సులో వాడి ఫోటో పెట్టుకునే వాడిని . వాడు
ఇపుడు అమెరికాలో ఉన్నాడు . నా భార్య మూడు
సంవత్సరాల క్రితం చనిపోయింది . ఇపుడు
నన్ను నేను చూసుకోడానికి భయం వేస్తోంది .
అందుకని నాకు తోడు గా కృష్ణుడిని
పెట్టుకున్నాను . ఆయనే నాకు ఇపుడు తోడు .
నా సంతోషానికి ఆయన సంతోషిస్తాడు . నా విచారానికి
ఓదారుస్తాడు . నాతో ఎప్పుడూ ఉండే ఆయనను
ఎప్పుడో నా పర్సులో పెట్టుకోవలసిన ఆయనను
నేను చాలా ఆలస్యంగా గుర్తించాను . ఇపుడు
నేను ఆయనతో గడుపుతున్నాను . "
.
.
సిద్దార్ధ మాట్లాడకుండా పర్సు ఆయనకు
ఇచ్చేశాడు .
.
.
పక్క స్టేషన్ లో రైలు ఆగింది . సిద్ధార్ధ రైలు దిగి
బుక్ స్టాల్ కి వెళ్ళాడు .
.
" దేవుడి ఫోటోలు ఏమి ఉన్నాయి పర్సు లో
పెట్టుకోడానికి " అని షాపు వాడిని అడిగాడు.

../I\..

Total Pageviews