అష్టలక్ష్మిలు
1. శ్రీమహావిష్ణువును భర్తగా చేపట్టిన లక్ష్మి ‘ఆదిలక్ష్మి’.ఈమె సకల సంపదలకు అధినాయకి.
2. సర్వ మానవాళి ఆకలి తీర్చే అమ్మ ఈ ‘ధాన్యలక్ష్మి’. ఈమె సస్యసంపదకు అధినాయకి.
3. జీవిత సమరంలోని ఆటుపోట్లను ఎదుర్కొనే ధైర్యాన్ని ప్రసాదించే లక్ష్మి ‘ధైర్యలక్ష్మి’.ఈమె ధైర్యానికి ప్రతీక.
4. రాజలాంఛనాలకు, వైభోగాలకు నిలువెత్తు నిదర్శనం ఏనుగు. గజం ఎక్కడ వుంటే అక్కడ సర్వసంపదలు వుంటాయి. గజ రూపంలో దీవించే లక్ష్మి ‘గజలక్ష్మి. ఈమె సకల ఐశ్వర్యాలకు ప్రతీక.
5. ఎన్ని సంపదలున్నా సంతానం లేకపోతే జీవితమే శూన్యం. వంశాన్నినిలిపే సంతానాన్ని అనుగ్రహించే లక్ష్మి ‘సంతానలక్ష్మి’.
7. ఎన్ని సంపదలున్నా, విద్య లేనివాడు వింతపశువే. అఙ్ఞానాంధకారాన్ని తొలగించి,ఙ్ఞానమార్గాన్ని చూపించే విద్యను ప్రసాదించే లక్ష్మి ‘విద్యాలక్ష్మి’.
8. ‘ధనం మూలమిదం సర్వం’ అన్నది నానుడి. ధనం లేకపోతే జీవితమే సున్నా. అట్టి ధనాన్ని అనుగ్రహించే లక్ష్మి ‘ధనలక్ష్మి’.
ఆ అష్టలక్ష్మీ దేవిల అనుగ్రహం మన అందరిపైనా ఎల్లవేళలా ఉండాలని
కోరుకొంటున్నాను.
No comments:
Post a Comment