రేపు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ శుభసందర్భంలో, అంతర్జాతీయ తెలుగు బంధువులందరికీ శుభాకాంక్షలు!.... బహుభాషాతనాన్ని, భాషా-సాంస్కృతిక భిన్నత్వాన్ని గుర్తించేందుకు, అవగాహన పొందేందుకు ఈ రోజును జరుపుకుంటారు. ఐక్య రాజ్య సమితి సాంస్కృతిక విషయాల సంస్థ యునెస్కో ఈ రోజును 17 నవంబర్ 1999న తొలిసారి ప్రకటించింది. ఐక్య రాజ్య సమితి జెనరల్ అసెంబ్లీ కూడా ఈ విషయాన్ని ధృవీకరించి, 2008 ని అంతర్జాతీయ భాష సంవత్సరంగా ప్రకటించింది.
1947లో...భారత్ విభజన సమయంలో బెంగాల్ ప్రాంతంలోని పశ్చిమభాగం భారతదేశంలోని తూర్పుప్రాంతం పాకిస్థాన్లోకి వెళ్లిపోయాయి. తూర్పు పాకిస్థాన్గా గుర్తించిన ఆ ప్రాంతానికీ పాకిస్థాన్కీ మధ్య ఆనాటి నుంచే ఆర్థిక, సాంస్కృతిక, భాషాపరమైన సంఘర్షణ ఉండేది. ఉర్దూను పాక్ అధికార భాషగా గుర్తించడంతో , బెంగాలీ మాట్లాడే తూర్పు పాకిస్థాన్లో ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమం వెుదలైంది. ప్రభుత్వం హింసామార్గాల్లో ఆ ఉద్యమాన్ని అణిచే ప్రయత్నం చేసింది. ఢాకా విశ్వవిద్యాలయానికి చెందిన నలుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. అయినా ఉద్యమం ఆగలేదు. మరింతతీవ్రరూపం దాల్చింది. 1956 ఫిబ్రవరి 29న పాక్ సర్కారు బెంగాలీని కూడా మరో అధికార భాషగా గుర్తించింది. ఆతర్వాత జరిగిన విముక్తి పోరాటంలో ఆ ప్రాంతం బంగ్లాదేశ్గా అవతరించింది. మాతృభాష కోసం నలుగురు యువకులు ప్రాణాలర్పించిన ఫిబ్రవరి 21వ తేదీని ఐక్యరాజ్యసమితి సాంస్కృతిక విభాగమైన యునెస్కో 'అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం'గా ప్రకటించింది. ఈ సందర్భంలో తెలుగు వెలుగు అనే స్వీయకవిత మీ అందరికోసం ఈ లింక్ నొక్కి చూడండి. ఆనందించండి. సత్యసాయి విస్సా ఫౌండేషన్.
https://www.youtube.com/watch?v=oygIK_wqjuU&list=PLkR7dgb_wqABKR9MeOS6QJaYYwHoDP5ixhttps://www.youtube.com/watch?v=oygIK_wqjuU&list=PLkR7dgb_wqABKR9MeOS6QJaYYwHoDP5ix

No comments:
Post a Comment