వేప' పేటెంట్ యుద్దంలో అమెరికా పై గెలిచిన 'వందనా శివ'
దెబ్బ తగిలితే పసుపు రాస్తే అది నేరమట. కురుపులు, ఆటలమ్మ వస్తే వేపాకులు వాడినా కూడా బహుళజాతి కంపెనీలు మన పై నేరాలు మోపి, కేసులు పెడతాయట. ఎందుకంటే వాటిని వాడే విజ్ఞానం వారే కనుగొన్నారట. దీనిని వారే పేటెంటు చేసుకున్నారట.
గత దశాబ్దమంతా,(1995 – 2005) భారతీయ స్వచ్ఛంద సంస్థలు, భారతీయ ప్రభుత్వం, మేధావి వర్గం, అమెరికా పేటెంట్ సంస్థలతో, బహుళజాతి సంస్థలతో విజ్ఞానయుద్ధాలు చేసారు. చివరికి వేప, పసుపు వాడే విజ్ఞానం అనూచానంగా భారతదేశమంతటా ఉందని, ఆయుర్వేద గ్రంథాల నిండా వీటిని ఔషధాలుగా పేర్కొనబడినట్లు వారికి నిరూపించడానికి తలప్రాణం తోకకొచ్చింది.
వేప పసుపే కాదు. నిమ్మ, జామ, ఉసిరి మొదలైన ఎన్నో మన ఆయుర్వేద ఔషధాలన్నిటికీ ఇదే పరిస్థితి. చివరికి బాసుమతి బియ్యం కూడా పేటెంట్ చేసుకొని ఉన్నారు. ఒకప్పుడు వేప పసుపు మనం వాడితే మూఢనమ్మకమని వెక్కిరించిన పాశ్చాత్యులు, వాటిలోని ఔషధీయ విలువలను నేడు తెలుసుకొని, వాటిని తామే కనుగొన్నట్లు పేటెంట్ తీసుకుని ప్రచారం చేయడమే కాకుండా, మనల్ని వాడకుండా నియంత్రించడం చాలా హాస్యాస్పదంగానూ, దురాగతంగానూ ఉన్నది. ఇంతటి రభసలో ఉన్న వేప గురించి కొన్ని విషయాలు....
1) గ్రామాల్లో నేటికీ ప్రతి ఇంటి ముంగిటా వేపచెట్టు నాటుకుంటారు. గొడ్లను కట్టేస్తారు.
2) వేసవి కాలంలో వేపచెట్టు నీడనే పడుకుంటారు.
3) వేప పుల్లలతో పళ్లు తోముకోవడం నేటికీ 60 శాతం మందికి పైగా ప్రజలు పాటిస్తున్న విషయం విదితమే.
4) వేపాకులను నూరి, ఆ పసరును ఒంటికి రుద్దుకుని స్నానం చేస్తారు. వేప గింజల నుంచి నూనెలు సబ్బులు తయారు చేయడం కూడా దాదాపుగా నాలుగైదు వందల సంవత్సరాల నుండి మనకు తెలిసిన విషయమే.
5) వేపతైలాన్ని 100శాతం ఫలవంతమైన గర్భనిరోధక పూతగా స్త్రీలు వాడేవారు.
6) సన్యాసులు తమ తమ కామ ప్రవృత్తులను తగ్గించుకోవడానికి కూడా ఔషధంగా వాడతారు.
7) వేపనూనె దీపారాధనకు ఎంతో శ్రేష్ఠమైనది.
8) ఉపవన వినోదిని అనే సంస్కృత గ్రంథంలో వేపను వ్యవసాయంలో ఎలా వాడాలో వివరించి ఉన్నారు. వేపను ఒక క్రిమిసంహారక మందుగా తెలిపి అది సంహరించే దాదాపు 200కాటకాల పేర్లను కూడా తెలిపి ఉన్నారు.
9) వేప చెట్టులోని ఏ భాగమైనా ప్రకృతి సిద్ధ ఎరువుగా భూసారాన్ని పెంచుతుంది.
10) సుశ్రుత, చరక సంహితలలో వేపయొక్క ఔషధీయ గుణాలను స్పష్టంగా పేర్కొని ఉన్నారు.
11) వేపను మనం చాలా ఏళ్లుగా వాడుతున్నప్పటికీ, 1995లో "ది యూరోపియన్ పేటెంట్ ఆఫీసు(మ్యూనిచ్), అమెరికా ప్రభుత్వరంగ సంస్థ అయిన డిపార్టుమెంట్ ఆఫ్ అగ్రికల్చర్ W.R.GRACE అనే బహుళజాతి సంస్థకి వేపలో ఉండే ఔషధ గుణాలకి పేటెంట్లు మంజూరు చేసినది.
12) ఈ పేటెంటు భారతీయుల అభ్యంతరం, కోర్టు కేసుల ద్వారా2000లో రద్దు చేయబడినది. ఈ విజ్ఞాన యుద్ధంలో ప్రముఖ పాత్ర పోషించినది వందనా శివ అనే పర్యావరణ పరిరక్షకురాలు.
13) 2001లో ఆ పేటెంట్ రద్దు పై బహుళజాతి సంస్థలు తిరిగి అప్పీలు చేసుకున్నారు.
ఈ సాంప్రదాయక విజ్ఞానం ఇదివరకే భారతదేశంలో ఎందరో ఉపయోగించినట్లు నిర్ధారించబడింది,
వేప పైన ఆ సంస్థలకి ఇతర దేశాలకి ఇచ్చిన పేటెంటు రద్దు చేయబడినది.
చివరికి భారతదేశం సొంతం చేసుకోంది......

No comments:
Post a Comment