ఆధుక కాలంలో ఆవిర్భవించిన మహాత్ముల లో ప్రప్రథముడు మన జాతిపిత. సత్యాహింసలు అనే ఆయుధాలతో భారతీయులను స్వతంత్ర సమరయోధులుగా తయారుచేసి రవి అస్తమించ బ్రిటిష్ సామ్రాజ్యపాలనకు చరమ గీతం పాడిన మహా మనిషి. బాపూజీ చూపిన సత్యం, అహింస మార్గాలు భావితరాలకు బంగారు బాటగా నిలచాయి. సత్యాగ్రహ్నా ఆయుధంగా చేసుకొని బాపూజీ బ్రిటిష్ ప్రభుత్వాన్నీ గడగడలాడిం చడంతో భారత దేశానికి స్వాతంత్య్రం లభించింది. కాగా ప్రపంచ చరిత్రను పరిశీలిస్తే రక్తపాత రహితం గా ఒక సుదీర్ఘ పోరాటం ఫలితంగా స్వాతంత్య్రం పొందిన ఘనత కేవలం భారతదేశా కి మాత్రమే దక్కుతుంది.
‘జై జవాన్.. జై కిసాన్..’ ఎంత గొప్ప నినాదం ఇది.. దేశ సరిహద్దులను కాపాడే సైనికున్ని, అన్నం పెట్టే రైతన్నకు జై కొడుతూ ఇచ్చిన నినాదం.. ఈ నినాదం వినగానే ద్వితీయ ప్రధానమంత్రి లాల్ బహద్దూర్ శాస్త్రి గుర్తురాక మానరు..నీతి, నిజాయితి నిరాడంబరతలకు ప్రతిరూపంగా నిలిచిన మహోన్నత వ్యక్తి లాల్ బహద్దూర్ శాస్త్రి.. ఆయన దేశానికి చాలా తక్కువ కాలం ప్రధానమంత్రిగా ఉన్నారు.. కానీ ప్రజల హృదయాల్లో తనదైన చెరగని ముద్ర వేశారు.. పొట్టి వాడైనా గట్టివాడినని నిరూపించుకున్నారు.
ఆ మహనీయులకి ఘనంగా నివాళులర్పిద్దాం..
No comments:
Post a Comment