Monday, October 3, 2016

శత చండీయాగం


వేదకాలం నుంచి మహర్షులు అనేక యజ్ఞయాగాదులను లోకకల్యాణం కోసం నిర్వహించేవారు. ఇందుకు ఆయా కాలాల్లోని రాజులు, చక్రవర్తులు సహాయసహకారాలను అందించేవారు. కాలంమారినా యజ్ఞయాగాదులు జరుగుతూనే ఉన్నాయి.
యాగాలవల్ల ఏమి ఉపయోగం? అనే నాలాంటి అజ్ఞానుల ప్రశ్నలకి గతంలో జరిగినప్పుడు మహా మహా సోమయాజులు, యాజ్నీకులు చెప్పిన విషయాలు ఒకసారి మననం చేసుకుందాం! 
శత చండీయాగం మనిషిలో మార్పు వస్తుంది. ఆధ్యాత్మికాన్ని అనుసరించాలంటే ముందుగా సమాజం వక్రమార్గాన్ని విడనాడాలి.. అందుకు తమలో దాగి ఉన్న నకారాత్మక విషయాలు తొలగాలి.. సమయం దొరికినప్పుడల్లా దైవ నామస్మరణ చేయాలి.. అప్పుడే మానవుడు దుష్టశక్తులపై పరిపూర్ణ విజయాన్ని సాధిస్తాడు.. కానీ నేటి జనజీవన స్రవంతిలో ప్రజలు ఆధ్యాత్మికతకు స్వల్పంగా చోటిస్తున్నారు.. ఫలితంగా ఒత్తిళ్లు, శాంతి లేకపోవడం, వివిధ రుగ్మతలకు గురై అనారోగ్య జీవితాన్ని పొందుతున్నారు.. ఎంతో విశిష్టమైన శత చండీయాగం నిర్వహణతో జనహితంతోపాటు విశ్వశాంతి లభిస్తుందని ఎన్నోసార్లు శాస్త్రీయంగా రుజువైందని వేద పండితులు అభిప్రాయపడ్డారు. ఎక్కడ హోమం జరిగినా తప్పకుండా పాల్గొనాలని, హోమంలో కూర్చుంటే ఎంతో మేలు జరుగుతుందన్నారు. దుష్టశక్తిపై విజయం - వాతావరణంలో మార్పు వస్తుంది. వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి. ఈ యాగం చేసినా.. పాల్గొన్నా ఎంతో మేలు కలుగుతుందని మార్కండేయ పురాణంలో స్పష్టంగా ఉంది. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యంపై మానవుడు గెలుస్తాడు. శాక్తేయమ విధానంలో అమర్చిన 108 హోమగుండాలతో పరిసర ప్రాంతంలో ఒక బలమైన శక్తి ఏర్పడుతుంది. వీక్షిస్తున్న భక్తులతోపాటు యాగంలో కూర్చున్నవారిలో సకారాత్మక ఆలోచనలు పెరుగుతాయి. ఆధ్యాత్మికతను పెంపొందిస్తుంది, శత చండీయాగంతో ఆధ్యాత్మికాన్ని పెంపొందించుకోగలుగుతాం. యజ్జం ద్వారా సన్మార్గం వైపు పయనిస్తారు. కామం, క్రోధం, లోభం నశిస్తాయి. యజ్ఞం, దానం, తపస్సు అలవరుస్తాయని భగవద్గీత 18వ అధ్యాయంలో వివరణ ఉంది. సన్మార్గంలో నడిపిస్తుంది. ''సర్వాబాధావినిర్ముక్తో ధనధాన్యసుతాన్వితః మనుష్యో మత్ప్రసాదేన భవిష్యతి న సంశయః'' అంటే ఈ కలి యుగంలో మానవుడు సర్వబాధలతో కలిగి ఉంటాడని దీనర్థం. శత చండీయాగం నిర్వహణతో బాధలన్నింటి నుంచి విముక్తి పొందవచ్చు. సమాజాన్ని సన్మార్గంలో నడిపించే శక్తి ఈ యాగానికుంది. ఇది ఎన్నోసార్లు శాస్త్రీయంగా నిరూపణయింది. అన్ని పనులతోపాటు కాస్త ఆధ్యాత్మికానికి సమయాన్ని కేటాయిస్తే విజయం చేకూరుతుంది. ఈ యాగాల గురించి మరిన్ని విశేషాలతో మరిన్ని పోస్ట్ లు త్వరలో రాయడం జరుగుతుంది. .... సత్యసాయి విస్సా ఫౌండేషన్.

No comments:

Post a Comment

Total Pageviews