ఎదుగుతున్న వయసులో ఎలా ఎదగాలి? ఎలా ఒదగాలి? వ్యక్తిగత, కుటుంబ, సమాజబాధ్యతలు ఏమిటి? మానవత్వం, తోటి జీవాల పట్ల దయ, ఇలా మన నైతిక విలువలు, ఘన సాంస్కృతిక వారసత్వం మాతృభాషలో పాఠ్యాంశాలుగా శతక సాహిత్యం ద్వారా పిల్లలకి వ్యక్తిత్వ వికాస శిక్షణ అందేది. కేవలం ఆ ఆ ల నాడే అమ్మ భాషను మరిపించి ఆంగ్ల భాషలో మురిపించి సంపాదన ద్యేయంగా అటు తల్లి తండ్రులు, ఇటు పిల్లలు చదువులు, కొలువులు, వస్తువుల వాడకం, ఆహారపదార్ధాలు, పానీయాలు ఒకటేమిటి అన్నిటా విదేశీ మోజులు, దేశ వేష భాషల పట్ల చులకన భావం వెరసి ఒక కొత్త జాతిని మనకు మనమే తయారు చేస్తున్నాము. బయట నుంచి పొంచివున్న తీవ్రవాదం, ఉగ్రవాదం ముప్పుకన్నా మనకి మనపే పెంచి పోషిస్తున్న భయంకరమైన ముప్పును నేటి మన నవతరంనుంచే భవిష్యత్తులో మనమే ఎదుర్కోవలసి వస్తుంది. నేటి బాలలని రేపటి బాధ్యత గల పౌరులుగా మలచడం పాలకులదీ, మీది, మాది, మనందరి బాధ్యత.
టీన్ క్రిమినల్స్ : సంవత్సరం క్రితం తమిళనాడు లో 9 వ తరగతి విద్యార్ధి తరగతి గది లోనే టీచర్ ను హత్య చేసాడు . అదే రాష్ట్రం లో జరిగిన మరో సంఘటన లో మరో విద్యార్ధి స్కూల్ బయట టీచర్ ను పొడిచి చంపేశాడు . పది రోజుల క్రితం ఢిల్లీ లో 11 వ తరగతి విద్యార్ధి టీచర్ ను స్కూల్ లోనే చంపేశాడు . నిర్భయ హంతకుల్లో ఒక మైనర్ ఉన్న సంగతి అందరికి తెలిసిందే. మూడు రోజుల క్రితం హైదరాబాద్ లో చైనా కాలేజీ లో ఇద్దరు విద్యార్థులు ఒక విద్యార్థిని తీవ్రంగా కొట్టడం తో అతను కోమా లో కి వెళ్ళిపోయాడు . ఈ రోజు పత్రికలు చూడండి . మేడ్చల్ కు చెందిన 16 ఏళ్ళ బాలుడు ఒక ఇంట్లో దొంగ తనానికి వెళ్లి అక్కడ ఉన్న 7 ఏళ్ళ లక్ష్మి ప్రసన్న అనే అమ్మాయిని లైంగికం గా హింసించి బ్లడ్ తో కోసి చంపేసి చివరకు ఏమి తెలియనట్టు ఆ అమ్మాయి అంత్య క్రియల్లో పాల్గొన్నాడు . రెండు రోజుల క్రితం తరగతి గది లో ఒక విద్యార్థిని ఇద్దరు తీవ్రంగా కొట్టిన వీడియో సోషల్ మీడియా లో చక్కర్లు కొట్టింది . పిల్లల్లో ఇంత హింస ప్రవృత్తి ఎలా పెరిగింది ? ఇందుకు కారణాలేమిటి ? నాకైతే ఈ విషయమై క్లారిటీ వుంది . మీరు చెప్పండి . గతం లో ఎప్పుడు లేని విధం గా ఇప్పుడు టీనేజ్ పిల్లల్లో ఇలా హింసాత్మక ప్రవృత్తి పెరిగి పోవడానికి కారణం ఏమిటి ?

No comments:
Post a Comment