Sunday, October 2, 2016

శుభోదయం ఈరోజు నవరాత్రుల్లో మూడవరోజు తదియ - చంద్రఘంట రూపంలో అమ్మ మనకు దర్శనమిస్తుంది.



శుభోదయం 

ఈరోజు నవరాత్రుల్లో మూడవరోజు తదియ - చంద్రఘంట రూపంలో అమ్మ మనకు దర్శనమిస్తుంది.

పిండజ ప్రవరారూఢా- చండకోపాస్త్ర కైర్యుతా|
ప్రసాదం తనుతేమహ్యం చంద్ర ఘంటేతి విశ్రుతా||
దుర్గామాత మూడవ స్వరూపం చంద్రఘంట. ఈ తల్లి తన శిరసున అర్ధ చంద్రుడు ఘంటాకృతిలో ఉండటంవల్ల ఈ పేరు సార్థకమైనది. ఈమె తన పది చేతులలో ఖడ్గం, గద, త్రిశూలం, బాణం, ధనుస్సు, కమలం, జపమాల, కమండలం, అభయముద్ర ధరించి యుద్ధముద్రలో సర్వదా యుద్ధానికి సన్నద్ధమై ఉంటుంది. ఈమె ఘంట నుంచి వెలువడిన థ్వని భయంకరంగా ఉండికౄరులైన రాక్షసులకు భయాన్ని కలిగిస్తుంది. ఈ తల్లిని ఆశ్రయించిన సమస్త సంసారిక కష్టముల నుంచి విముక్తులు అవుతారు. ఇహలోకంలోనేకాక పరలోకంలో కూడా సద్గతి లభిస్తుంది. నైవేద్యం కొబ్బరి అన్నం.
మనఅందరిపైనా ఆ అమ్మ కరుణ కలిగి ఉండాలని కోరుకొంటున్నాను.









No comments:

Post a Comment

Total Pageviews