పైనాపిల్... ఎంతో మేలు!
పండ్లూ కూరగాయలు ఎంత తింటే అంత మంచిదన్నది తెలిసిందే. అయితే కొన్ని రకాల పండ్లను ఆహారంలో భాగంగా చేసుకోవడంవల్ల వూబకాయం, మధుమేహం, హృద్రోగాలు... వంటి ఆరోగ్యసమస్యల నుంచి తప్పించుకోవచ్చు. పైనాపిల్‌కు ఇది చక్కగా సరిపోతుంది అంటున్నారు ఆరోగ్యనిపుణులు. ఇందులో పొటాషియం పుష్కలంగా ఉండటంవల్ల బీపీనీ తగ్గిస్తుంది.
* ఇందులోని సి-విటమిన్ అద్భుతమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తూ క్యాన్సర్‌ను నిరోధిస్తుందట. దంతాలూ చిగుళ్లూ వంటివి బలంగా ఉండేందుకూ ఇది దోహదపడుతుంది. పైనాపిల్‌లోని బీటా-కెరోటిన్ ప్రొస్టేట్ క్యాన్సర్‌నుంచి రక్షిస్తుందని హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్‌హెల్త్ పరిశోధనల్లో తేలింది. ఇంకా ఇది ఆస్తమా నుంచీ రక్షిస్తుంది. కంటి కండరాల క్షీణతనీ తగ్గిస్తుందని తేలింది.
* క్యాన్సర్ రోగుల్లో రేడియేషన్ కారణంగా తలెత్తే దుష్ఫలితాలను ఇందులోని బ్రొమిలైన్ అనే ఎంజైమ్ సమర్థంగా నివారించగలదని అమెరికన్ క్యాన్సర్ సొసైటీ పేర్కొంటోంది. ఈ ఎంజైమ్ పుండ్లూ గాయాలు త్వరగా మానేందుకూ తోడ్పడుతుందట. కీళ్లనొప్పుల్నీ తగ్గిస్తుంది.
* ఇందులోని పీచు మధుమేహానికి మందులా పనిచేస్తుంది. జీర్ణక్రియనూ పెంపొందిస్తుంది.
* ఇందులో సమృద్ధిగా దొరికే యాంటీఆక్సిడెంట్లు సంతాన సాఫల్యానికీ తోడ్పడతాయంటున్నారు నిపుణులు.

No comments:
Post a Comment