Monday, October 3, 2016

శుభోదయం!! ఈరోజు అమ్మవారి నాల్గవ రోజు సురా సంపూర్ణకలశం రుధిరాప్లుతమేవ చ ! దధానా హస్త పద్మాభ్యాం కూష్మాండా శుభదాస్తు మే!!




శుభోదయం!!
ఈరోజు అమ్మవారి నాల్గవ రోజు 
సురా సంపూర్ణకలశం రుధిరాప్లుతమేవ చ !
దధానా హస్త పద్మాభ్యాం కూష్మాండా శుభదాస్తు మే!! 

అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి, వేద వేదాంత వనవాసినీ అయిన శ్రీ కనకదుర్గా అవతారమునకు పూర్వం జగన్మాత శాకాంబరీ దేవిగా అవతరించిందని దేవి భాగవతం, మార్కండేయ పురాణం, దుర్గా సప్తశతి పురాణాలలో విశేషంగా చెప్పబడింది.
శాకాంబరీ అంటే వివిధ శాకములనే ( అనగా రకరకాల కూరగాయలు మరియు ఆకు కూరలు) వస్త్రాభరణాలుగా ధరించిన తల్లి అని అర్ధం.చవితి - కూష్మాండ
దుర్గామాత నాల్గవ స్వరూపం కూష్మాండం. దరహాసం చేస్తూ బ్రహ్మాండాన్ని అవలీలగా సృష్టిస్తుంది. కాబట్టి ఈ పేరు వచ్చింది. ఈమె సర్వమండలాంతర్వర్తిని. రవి మండలంలో నివశించే శక్తి సామర్థ్యాలు ఈ తల్లికే ఉన్నాయి. ఈమె ఎనిమిది భుజాలతో ఉంటుంది. తన ఏడు చేతుల్లోనూ కమండలం, ధనుస్సు, బాణం, కమలం, అమృతకలశం, చక్రం, గద ధరిస్తుంది. ఎనిమిదవ చేతిలో సర్వసిద్ధులనూ, నిధులనూ ప్రసాదించే జపమాలను ధరిస్తుంది. ఈమె సింహవాహనం అధిష్టిస్తుంది. సంస్కృతంలో కూష్మాండం అంటే గుమ్మడికాయ. ఈమెకు గుమ్మడికాయ అంటే ఎంతో ఇష్టం. ఈ దేవిని ఉపాసిస్తే మనసు అనాహతచక్రంలో స్థిరంగా ఉంటుంది. ఉపాసకులకు ఆయురారో గ్యాలను ప్రసాదించటమేగాక, వారి కష్టాలను కూడా పోగొడుతుంది. నైవేద్యంగా చిల్లులేని అల్లం గారెలను సమర్పించాలి.




No comments:

Post a Comment

Total Pageviews