Sunday, October 16, 2016

"సాగేటి నావలో" ,.............................'డా. కృష్ణ సుబ్బారావు పొన్నాడ.'



"సాగేటి నావలో" ,.............................'డా. కృష్ణ సుబ్బారావు పొన్నాడ.'
సాగేటి నావలో ,
పాడేటి యెంకితో ,
పారేటి గోదారి ,
పరవల్లు సూడాల !
గుండెల్ల దిగులంత ,
ఎగిరెల్లి పోయేను !
గువ్వొంక సూత్తంటె ,
గుబులెగిరి పోయేను !
పైటెగిరి గాలిలో ,
పరదాలు లేపంగ !
ఎదపొంగు మదిదూసి ,
సరసంగ తట్టగా ,
పడవురక గడలెగిసి ,
తైతక్క లాడురా !
సేత నున్నా తెడ్డు ,
అడ్డంటు సూడకా ,
ఒడ్డేది యంటూను ,
ఒళ్ళు కళ్ళై సాగు !
గొంతెత్తి నా ఎంకి ,
గోముగా పాడంగ ,
గోరింక బతిమాలి ,
గోదారి నడుగురా !
ఓసారి ఒడ్డుపై ,
ఒదిగి కూకుంటాము !
నావనాపీ మేము ,
నడుమాల్చి కాసేపు ,
కతలు సెప్పుకు మల్ల ,
కదిలెల్లి పోతాము !
తల్లి గోదారమ్మ ,
కరునించవమ్మ !
కరువుతీరా ఎంకి ,
ఒడిలోన తలబెట్టి ,
ఓసారి నా బామ ,
బాగోగు లింటాను !
జాబిల్లి వానలో ,
నీతిన్నె పరుపుపై ,
నా మల్లి పాటింటు ,
పరవసిత్తాను !
మల్లి మల్లీ వచ్చి ,
మనసార మొక్కుతా !
కరునించు మా తల్లి
మమతలుప్పొంగంటు ,
ఒడ్డోంక నావనీ ,
నడిపెల్లి పోతాను !
నా ఎంకి ఒడిలోన ,
పాపనై పోతాను !
నా ఎంకి పాటింటు ,
మైమరసి పోతాను !
నా ఎంకి పాటింటు ,
మైమరసి పోతాను !
నాఎంకిఒడిలోన ,
పాపనై పోతాను !
.............................డా. కృష్ణ సుబ్బారావు పొన్నాడ. 12/07/2015 .

No comments:

Post a Comment

Total Pageviews