Wednesday, November 30, 2016

మహత్తరం! మార్గశిరం(శీర్షం)!!





మహత్తరం! మార్గశిరం(శీర్షం)!!
కార్తికాన్ని సాగనంపి మార్గశిరం(శీర్షం) ప్రవేశించింది. చాంద్రమాన సంప్రదాయాన్ని అనుసరించి చంద్రుడు మృగశిర నక్షత్రంలో ఉండే నెల మార్గశీర్షం. శీర్షం అంటే అగ్రభాగం అని అర్థం. మాసాల్లోకెల్లా అగ్రగణ్యమైనది కాబట్టి మార్గశిరానికి ఈ పేరు వచ్చింది.ఇది ప్రకృతి కాంతకు సీమంతం. తుషార బిందువుల హేమంతం. శ్రీమహావిష్ణువుకు ఇష్టమైన మాసం. మార్గశిరం విశిష్టమైనదని తాను మార్గశిరమాసాన్ని అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలోని విభూతియోగంలో. 'వేదానాం సామవేదోస్మి దేవానాం వాసవః'అంటే ' ఇంద్రుడు' అని చెబుతూనే తాను ' మాసానాం మార్గశీర్షోహం' అని  వాసుదేవుని దివ్యవాక్కులను ప్రతిబింబించేలా మార్గశిరమంతా మోక్షదాయకాలైన పర్వదినాలెన్నో ఉన్నాయి.

ధనుర్మాసం ప్రశస్తిని సాక్షాత్తూ బ్రహ్మదేవుడు నారదమునికి వివరించారు. బ్రహ్మాండ పురాణం, భాగవతం, ఆదిత్య పురాణాల్లో ధనుర్మాసం ప్రస్తావన ఉంది. శ్రీవైష్ణవులకు పరమ పవిత్రమైన ఈ మాసంలో శ్రీరంగనాథుడిని ప్రసన్నం చేసుకునేందుకు గోదాదేవి పాడిన తిరుప్పావై పాశురాలకు ఎనలేని ప్రాధాన్యం ఉంది. ఇదేనెలలో శుద్ధ పౌర్ణమి రోజున శివాలయాల్లో విశేష పూజలు నిర్వహి స్తారు. వైష్ణవాలయాల్లో అందించే బాలభోగం ప్రసాదానికి ప్రాధాన్యం ఉంటుంది. 

మార్గశిర ప్రారంభంలోనే శివ పుత్రుడైన కుమారస్వామిని అర్చించే 'సుబ్రహ్మణ్య షష్టి' పర్వదినం వస్తుంది. మార్గశిర శుద్ధ షష్టిని సుబ్రహ్మణ్య షష్టిగా ఘనంగా జరుపుకుంటారు. షణ్ముఖుడైన కుమారస్వామిని ఆత్మతో కూడిన పంచభూతాలకు నిదర్శనంగా భావించి పూజించే సాంప్రదాయం తమిళనాట ఉంది. యోగసాధకులు స్కంధుని ఆరు ముఖాలను షట్చక్రాలుగా భావించి ఆరాధిస్తారు. సుబ్రహ్మణ్యరూపాన్ని బ్రహ్మజ్ఞానానికి సంకేతంగా భావించే ఆర్ష సంప్రదాయమూ దేశంలో అనూచానంగా వస్తోంది. సుబ్రహ్మణ్యుని ఆరాధన యోగబలాన్నీ, ఆరోగ్య ఫలాన్నీ ప్రసాదిస్తుంది.'మిత్రసప్తమి' గా పేర్కొనే మార్గశిర శుక్లపక్ష సప్తమి నాడు జగన్మిత్రుడు, లోకాలకు కాంతినిచ్చే సూర్యదేవుని సమస్త హిందువులూ ఆరాధిస్తారు. ఈ శుభ తిథి నాడు ప్రత్యక్ష నారాయణుడైన సూర్యభగవానుణ్ని పూజిస్తే దివ్యమైన ఆరోగ్యమూ, మహాభాగ్యమూ ఒనగూడుతాయని భ క్తుల విశ్వాసం. హైందవ సంస్కృతిలో అంతర్భాగమై దివా కరుని ఆరాధన పావనమైన రీతిలో జరిపే భాను సప్తమి, రథసప్తమి, మార్తాండ సప్తమి, అచల సప్తమి, దళ చ ట్పూజ పర్వదినాలలాగా 'మిత్రసప్తమి' కూడా అత్యంత యోగదాయకమైన పర్వదినం.

మార్గశిర శుక్లపక్ష ఏకాదశిని 'గీతాజయంతి'గా జరుపుకుంటారు. విశ్వమానవ విజ్ఞాన కోశంగా భావించే భగవద్గీతను ఈ పర్వదినాన కురుపాండవ యుద్ధ సమయాన అర్జునునికి శ్రీకృష్ణ పరమాత్మ బోధించాడు.

ఇక మహామహిమాన్వితమైన శుక్లద్వాదశీ వ్రతాన్ని మార్గశిర శుక్ల ద్వాదశి నాడు ఆచరిస్తారు. ఆ రోజున అత్యంత శ్రద్ధతో దేవదేవుడైన మహావిష్ణువుని ధ్యానిస్తూ కేశవార్చన చేస్తే ఎనిమిది పౌండరీక యజ్ఞాలు చేసిన ఘనమైన ఫలాన్ని ఈ వ్రతం ప్రసాదిస్తుందని లోక కళ్యాణ కారకుడైన నారదుడికి సనక మహర్షి తేటతెల్లం చేసినట్లు నారద మహా పురాణం చెబుతోంది.

మార్గశిర శుక్ల త్రయోదశి నాడు భక్తులు అభయదాయకుడైన హనుమంతుని సేవిస్తారు. ఆ రోజున అతి పవిత్రమైన హనుమద్‌వ్రతాన్ని ఆచరిస్తారు. శరణాగత వజప్రంజరుడైన అంజనీసుతుని ఆరాధన దుష్టపీడను భంజించి జీవితాన సుఖ సంతోషాలను పంచి రంజకం చేస్తుంది.

మార్గశిర మాసంలోనే సూర్యుడు ధనుర్రాశిలో ప్రవేశించడంతో ధనుస్సంక్రమణ పుణ్యకాలం ఆరంభమవుతుంది. అది మొదలుకుని సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించేంత వరకు ఉండే పవిత్రమైన మాసమే 'ధనుర్మాసం'. వైష్ణవ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన మాసం ధనుర్మాస పుణ్యకాలం. ధనుర్మాసమంతా వైష్ణవాలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు. తన హృదయ నందనంలో పూచిన భక్తి భావ సుమాలనే ప్రేమతో శ్రీరంగనాధునికి సమర్పించి, ఆ దేవదేవునికి సమర్పించాల్సిన మాలలను తానే ధరించి, ఆ స్వామి కృపకు పాత్రురాలై శ్రీరంగనాధుని సాయుజ్యాన్ని పొందిన ఘన చరిత గోదాదేవిది. ఈమెనే వైష్ణవ సాంప్రదాయంలో అండాళ్ అనీ, చూడి కుడుత నాంచారి అనీ వ్యవహరిస్తారు. గోదాదేవి రచించిన ' తిరుప్పావై'లోని భక్తి భావస్పోరకమైన 30 పాశురాలను ఈ మాసం రోజూలూ విష్ణాలయాలన్నింటా ఎంతో భక్తి శ్రద్ధలతో పారాయణ చేస్తారు. కలియుగ వైకుంఠమైన తిరుమల శ్రీవేంకటే శ్వర స్వామి వారి ఆలయంలో ఈ నెల రోజులూ సుప్రభాతానికి బదులుగా తిరుప్పావైని పఠిస్తారు.

సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే పుష్య శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. సూర్యుడు ధనుస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే 'మార్గళి' మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది. ఈ పర్వదినాన్నే 'ముక్కోటి ఏకాదశి' గా జరుపుకుంటారు.
ఈ పర్వదినాన దేవాదుందుభులు మోగుతుండగా శ్రీమహాలక్షీ సమేతుడైన శ్రీమహావిష్ణువు వైకుంఠం ఉత్తర ద్వారానికి జేరి ముక్కోటి దేవతలకు తన దివ్యద ర్శన భాగ్యాన్ని కలుగచేస్తాడని పురాణవచనం. దీనికి సంకేతంగానే దేశంలోని వైష్ణవాలయాలన్నింటా భక్తులు దర్శనం చేసుకునేందుకు వీలుగా ఆలయ ఉత్తర ద్వారాన్ని తెరిచి ఉంచుతారు. ఈ పవిత్ర పర్వదినాన నారాయణుని అర్చిస్తే, ఆయతో బాటు ముక్కోటి దేవతలనూ ఆరా«ధించిన ఫలం వస్తుంది కాబట్టి ఏ ఏకాదశిని ' ముక్కోటి'గా పేర్కొనడం జరిగింది. ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమమైన పవిత్రతను సంతరించుకున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశిగా పేర్కొంటారనే ఐతిహ్యమూ ఉంది. ముక్కోటి ఏకాదశి నాడే క్షీరసాగర మధనంలో హాలాహలం, అమృతం రెండూ పుట్టాయి. ఈ పవిత్రమైన రోజునే పరమశివుడు హాలాహలాన్ని మింగి లోకాలకు ఆనందాన్ని కలిగించాడు.

ఇవేగాక దత్త జయంతి, కృష్ణాంగారక చతుర్దశి వంటి మరిన్ని పర్వదినాలు కొలువై మార్గశిరానికి కమనీయతను సంతరించి పెట్టాయి. ఈ విధంగా మార్గశిరం అనుదినం ప్రత్యేకమై, పవిత్రమైన పర్వదినాలకు ఆలవాలమై విలసిల్లుతోంది. నిరతమూ ఆ భగవానుని స్మరిస్తూ, ఆయన సేవలో తరిస్తూ, సన్మార్గంలో చరిస్తూ మార్గశిరం ఇచ్చే పుణ్యఫలాన్నీ, ముక్తి బలాన్నీ సొంతం చేసుకుందాం.తెలుసుకుందాం! ఆచరిద్దాం!! తరిద్దాం!! సత్య సాయి విస్సా ఫౌండేషన్.  

Tuesday, November 29, 2016

మానవత్వం.

*మాయం కాదు మానవత్వం* ఒక మహా మనిషి వ్రాసిన స్వానుభవం షేర్ చేస్తున్న.
.
ఇంటికి వెడుతున్నా నడుచుకుంటూ
.
దారిలో ఒక కరంటు స్థంభానికి ఒక కాగితం కట్టి ఉంది . 
.
"దయచేసి చదవండి " అని రాసి ఉంది . ఖాళీ గానే ఉన్నాను కదా అని దగ్గరకు వెళ్లి చూశాను .
.
.
" ఈ రోడ్డులో నేను నిన్న ఒక 50 రూపాయల నోటు పారేసుకున్నాను . నాకు కళ్ళు సరిగా కనబడవు . మీకు దొరికితే దయచేసి ఈ ఎడ్రెస్ దగ్గరకు తెఛ్చి ఇవ్వగలరు, దయచేసి ఈ సహాయం చెయ్యండి " అని రాసి ఉంది .
.
.
నాకు ఎందుకో ఆ ఎడ్రెస్ ఉన్న చోటుకు వెళ్ళాలి అనిపించింది
.
అడ్రెస్ గుర్తుపెట్టుకున్నాను .
.
అది ఆ వీధి చివరన ఉన్న ఒక పూరి పాక . దగ్గరకు వెళ్లి పిలిస్తే పాక లో నుండి ఒక వృధ్ధురాలు వచ్చింది . ఆమె కు కళ్ళు సరిగా కనబడటం లేదు .ఆ పాకలో ఆమె ఒక్కర్తే ఉంటోంది అని అర్ధం అయ్యింది . చేతి కర్ర సహాయం తో తడుము కుంటూ బయటకు వచ్చింది
"ఏమీ లేదమ్మా ! నువ్వు పోగొట్టుకున్న 50 రూపాయల నోటు నాకు కనబడింది . అది ఇఛ్చి పోదామని వచ్చాను " అన్నాను
ఆమె ఏడుస్తోంది .
.
"బాబూ ! ఇప్పటికి ఇలా దాదాపు 50-60 మంది వఛ్చి ఒక్కొక్కరూ ఒక 50 రూపాయలు ఇస్తున్నారు . నాకు కళ్ళు కనబడవు . నాకు చదవడం రాయడం రాదు .నేను అది రాయలేదు బాబూ ! ఎవరో నాకు సహాయం చెయ్యాలి అనిపించి అలా రాశారేమో !"
" పోన్లే అమ్మా ఇదిగో ఈ యాభై నోటు తీసుకో ! "
బాబూ ! అది నేను రాయలేదు . నా ఇబ్బంది చూసి ఎవరో మహానుభావుడు ఇలా రాసిపెట్టి ఉంటాడు . వెళ్ళేటపుడు అది కాస్త చించెయ్యి బాబూ ! అంది
ఆమె ఇలాగే అందరికీ చెప్పి ఉంటుంది . ఒక్కరూ చించెయ్యలేదు . ఆమె రాయలేదు . ఎవరో ఆమెకు సహాయపడటం కోసం ఇలా రాశారు .
ఆ రోడ్డున వెడుతున్న ఎందరిలోనో కొందరు అది చూస్తారు . అలా చూసిన ఎందరిలోనో కొందరు ఆమెకు సహాయ పడాలని అనుకుంటారు . అలా అనుకున్న ఎందరిలోనో కొందరు ఆమె ఇంటికి వఛ్చి ఆమెకు సహాయ పడతారు . నేను అది చించేస్తే ఆమెకు అలాంటి సహాయం దూరం చేసిన వాడిని అవుతాను ............ ఇలా సాగుతున్నాయి నా ఆలోచనలు ..... అది చింపెయ్యనా ? ఉంచెయ్యనా ? నాకు చెప్పినట్టే ఇంతకు ముందు వాళ్లకు కూడా చెప్పి ఉంటుంది కదా ! వాళ్ళెవరూ చింపెయ్యలేదు . అంటే అందరూ ఆమెకు ఈ రకంగా సహాయం అందాలి అని కోరుకుంటున్నారు ........ మరి నేను ఎందుకు అది చింపెయ్యడం ....... ఇలా అనుకుంటూ వస్తున్నాను
ఒకాయన చేతిలో చిన్న కాగితం పట్టుకుని ఎదురుపడ్డాడు.
సర్ ! ఈ ఎడ్రెస్ చెప్పగలరా ? నాకు ఒక 50 నోటు దొరికింది . వాళ్లకి ఇచ్ఛేద్దామని ఎడ్రెస్ అడుగుతున్నాను .
ఆమె ఎడ్రెస్
నాకు అనిపించింది "మానవత్వం చచ్చిపోలేదు" .
.
అది రాసిన వారికి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకున్నాను . ఎవరికయినా సహాయం చెయ్యాలి అంటే ఎన్నో మార్గాలు . ఈ మార్గం ఎంచుకున్న వ్యక్తిని మనసులోనే అభినందించాను . . ఒంటరిగా నివసిస్తున్న ఆమెకు ఇది ఒక ఊరట కలిగిస్తుంది అనడం లో నాకు సందేహం లేదు .
అది చింపడం భావ్యం కాదు .అనిపించింది .
...వదిలేశాను.

స్కాంద మరియు పద్మ పురాణాంతర్గత సంపూర్ణ కార్తిక పురాణం 30వ రోజు పారాయణము. సత్యసాయి విస్సా ఫౌండేషన్!!














Monday, November 28, 2016

మార్గశీర్ష మాధుర్యం

కార్తీక శోభ ముగిసింది,ఇంటింటా దీపాల వెలుగులు విరజిమ్మి,..మార్గశీర్ష మాధుర్యం మొదలుకానుంది,..ధనుర్మాసపు ముగ్గులు,గోదా పాశురాలూ,,.నిజంగా ఇలాంటివి లేకపోతే చలికాలం ఎంతసేపు ముసుగు తన్నిపడుకున్నా లేవాలనిపించదు,..బధ్ధకపు ముసుగుతీయించి ప్రకృతి శోభ తిలకించమనే మనకి పర్వదినాలన్నీ చలికాలంలో వస్తాయేమో

నవంబర్ 5-6, 2016 తారీకులలో సింగపూర్ లో జరిగిన ఐదవ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు--వంగూరి చిట్టెంరాజు

సింగపూర్ లో జరిగిన ఐదవ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు
మరి కొన్ని విశేషాలు.
ఆసక్తి ఉన్న వారు వీక్షించండి. చదవండి.
1. ABN ఆంధ్ర జ్యోతి వారు హైదరాబాద్ లో ఉన్న నన్నూ, విశాఖపట్నంలో యార్లగడ్డ వారినీ, గొల్లపూడి గారినీ ఒకే వేదిక మీదకి రప్పించి...సింగపూర్ సదస్సు గురించీ, మన భాషా సాహిత్యాల గురించీ ఒక చర్చా కార్యక్రమం నిర్వహించారు. ఆ కార్యక్రమం నిన్న Telecast అయింది. ఈ టీవీ కార్యక్రమాన్ని అంధ్రజ్యోతి సంపాదకులు శ్రీ కె. శ్రీనివాస్ గారు ఏర్పాటు చేశారు. ఆయనకి ధన్యవాదాలు. కేవలం 30 నిముషాలలో అనేక విషయాలు ప్రస్తావన లోకి వచ్చాయి. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మూర్తి గారి పరిజ్ఞానానికీ, ప్రతిభకి నాకు భలే ముచ్చట వేసింది. ఆ లంకె ఈ క్రింద ఇస్తున్నాను.
వీలుంటే చూసి, నా అభిప్రాయాలలో ఏమైనా తప్పు అనుకుంటే నన్ను చివాట్లు వెయ్యండి.
ABN Chit Chat with Vanguri foundation of America Founder over World Telugu Literary Conference
2. మన సింగపూర్ మిత్రులు అసాధ్యులు. వారిలో సుధాకర్ జొన్నాదుల

ఎంతో కష్టపడి, తన విలువైన సమయాన్ని వెచ్చించి, నవంబర్ 5-6, 2016 తారీకులలో జరిగిన సుమారు ఇరవై గంటల కార్యక్రమాల వీడియోలని You Tube లోకి "ఎక్కించి"....అంతే కాదు..వాటిని నా బోటి వాడికి కూడా అర్థం అయేలా క్రోడీకరించి ఒక పట్టిక తయారు చేశాడు. ఆ పట్టిక ఇందుతో జతపరుస్తున్నాను. అందులో ఆయా కార్యక్రమాలు, ప్రసంగాలూ మనం వెతుక్కో అక్కర లేకుండా వేటికవేలా ఆయా లింకులు కూడా పొందు పరిచారు. మీరు చేయ వలసినదల్లా......మీకు ఆసక్తి ఉన్న లింకు మీద "క్లిక్కడమే"...
కార్యక్రమానంతరం "హమ్మయ్య" అయిపోయింది అని ఊపిరి పీల్చుకుని అన్నీ మర్చిపోయే ఈ రోజుల్లో ఇది సింగపూర్ వారు అందిస్తున్న మహత్తరమైన సేవ. చరిత్రని పదిలపరచడంలో వారికున్న ఆసక్తికి నిదర్శనం.....ముఖ్యంగా రవి కుామార్, రత్న కుమార్, శ్రీధర్ భరద్వాజ్, సుధాకర్ జొన్నాదుల, అనేక మంది స్వచ్చంద కార్యకర్తలకి మరొక్క సారి ధన్యవాదాలు, శుభాశీస్సులు అందజేస్తున్నాను. అందరి పేర్లూ వ్రాయలేకపోతున్నందుకు నన్ను మన్నించండి.
3. సింగపూర్ సదస్సులో పద్య నాటకాల మీద ఒక ప్రసంగం చేయడమే కాకుండా, 'మయ సభ' ఏకాపాత్రాభినయనంతో అందరినీ మెప్పించిన ఆమని కృష్ణ గారు 'తెలుగు వెలుగు' పత్రికలో ప్రచురించిన ఒక చిన్న వ్యాసం ఇందుతో జతపరిచాను. ఆసక్తి ఉన్నవారు చదవండి.















స్కాంద మరియు పద్మ పురాణాంతర్గత సంపూర్ణ కార్తిక పురాణం 29వ రోజు పారాయణము! సత్యసాయి విస్సా ఫౌండేషన్!!


 









Total Pageviews