Sunday, November 20, 2016

ధనుర్మాసంలో చేమంతుల వైభవాన్నీ, శోభని దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి వర్ణన "స్వస్తి జగత్తున కగు!శ్రీ....

ధనుర్మాసంలో చేమంతుల వైభవాన్నీ, శోభని కృష్ణశాస్త్రి గారి వర్ణన 
తిరునాళ్ళ చేమంతులు
నాకనందన హరిచందనముల కన్న
కరము ప్రియముల చేమంతి విరులు హరికి;
ఆరు కాలాలు తిర్నాళ్ళ కనుచు వేచి.
పూచి యిచ్చును కైంకర్యమునకు వాని!
సురవరానీత కల్ప ప్రసూనమాల
అడుగులంబడి సాగిలబడి యొదుగును;
చేరు శ్రీవత్సకౌస్తుభ శ్రీనివాస
మేమొసంగు చేమాంతికా దామకమ్ము
హారాలై మెడజుట్టి,అంగదములై అంసాళిపై మెట్టి,లే
తోరాలై చెయిపట్టి యూగు,చనవెంతో గాని శ్రీజానితో
ధారాళమ్ములు;క్షీరసాగరసుతా ధమ్మిల్ల మాల్యమ్ములన్
హేరాళమ్ములు పీఠికాపురవనీ హేమాంత చేమంతికల్!
దేవులపల్లి కృష్ణశాస్త్రి

"స్వస్తి జగత్తున కగు!శ్రీ....

"స్వస్తి జగత్తున కగు!శ్రీ
రస్తు! సదా శాంతి ర"స్తటంచు వెలయు వి
శ్వస్తుత భారతవాణి సు
మస్తబకము వోలె లోకమస్తకము పయిన్!
దేవులపల్లి కృష్ణశాస్త్రి

------------------------



No comments:

Post a Comment

Total Pageviews