Tuesday, November 8, 2016

అందరికీ గోపాష్టమి శుభాకాంక్షలు.

అందరికీ గోపాష్టమి 

శుభాకాంక్షలు.







 కార్తీక శుక్లపక్ష అష్టమిని గోపాష్టమి అని పిలుస్తారు. శ్రీకృష్ణుడు తన చిటికెన వేలితో గోవర్ధనగిరిని ఎత్తి నందనవనంలో గోపబాలురను రక్షించినరోజు.


 గో అంటే గోవు, గోపా అనగా గోపబాలుడు. ఎవరైతే ఈ గోపాష్టమి రోజున గోవును పూజించి, ధాన్యం లేదా పండ్లను పెట్టి భక్తి శ్రద్దలతో గోవుయొక్క పృష్ఠ భాగమునకు నమస్కరిస్తారో వారి పాపాలన్నీ పోయి విశేషమైన పుణ్యం లభిస్తుందని మనపురాణాలు చెపుతున్నాయి.

  గోవును తల్లిగా భావించడం మన హిందూ సంస్కృతి. ఇంతటి పుణ్య తిధిన ఆ గోమాతను పూజించే అదృష్టం నాకు కలిగింది. 












 అక్కడ గోపూజలతోపాటు చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో చక్కగా జరిగాయి. ఆ చిత్రాలు * గోపాష్టమి* శుభాకాంక్షలతో మీ అందరికోసం.

No comments:

Post a Comment

Total Pageviews