Monday, November 21, 2016

పెద్దలమాట ముత్యాల మూట.



యువతీ యువకుల మనస్సులు " జోగ్ " జలపాతం లాంటివి . ఎత్తైన కొండ మీద నుంచి పెద్ద పరిమాణంలో నీళ్ళు కిందకు ఉరుకుతూ వచ్చి, గుడ్డిగా ఆ చుట్టుపక్కల ప్రవహిస్తూ పోయి చివరకు ఏ రకమైన ప్రయోజనాన్ని నేరవేర్చకుండానే సముద్రంలో తమ ఉనికిని కోల్పోవడం కనిపిస్తుంది. ఒకవేళ ఆ నీటి మీద ఓ ఆనకట్ట కట్టి నీటిని క్రమబద్దికరించిన కాలువల గుండా పోయేలా చేస్తే , పొలాలకు నీళ్ళు దక్కుతాయి. మంచి మంచి పంట పండుతుంది.
అదేవిధంగా, సంస్కరణకు నోచుకోక, స్వీయసంకల్పిత ఆలోచనలతో పయనిస్తున్న యువతీ యువకుల మానసిక శక్తులు నిష్ప్రయోజనంగా వ్యర్ధం అవుతున్నాయి.. వాటికీ క్రమశిక్షణ, నిబంధన అనే ఆనకట్ట కట్టాలి. ప్రవర్తన , నియమావళి అనే కాలువలను తవ్వాలి. మానసిక శక్తులనే ఆ నీటిని విద్య, కళలు, సాహిత్యం, వృత్తి పనులనే పొలాల మీదుగా ప్రవహింపచేయాలి. అప్పుడు సంస్కృతి అనే అద్భుతమైన పంట ఎలా పండుతుందో మనం కళ్ళారా చూడవచ్చు. 

No comments:

Post a Comment

Total Pageviews