" మహా " అన్న పదము ఈశ్వరునికే ఎందుకు వున్నది?
మహా + ఈశ్వరుడు = మహేశ్వరుడు.
' మహా ' అనేపదం ఎక్కడైనా వచ్చిందంటే ఆ మహా శబ్దంలేనివి కొన్ని వున్నాయని, అలాంటి కొన్నింటి కంటే గొప్పది ఈ మహాపదంలో కనిపిస్తుందని అర్ధం చేసుకోవాలి. ప్రతి బహుళ చతుర్దశి శివరాత్రి అయితే మాఘ బహుళ చతుర్ధశి మహాశివరాత్రి అయినట్లు. ఇంట్లో జరిగే బారసాల, నామకరణం పుట్టినరోజు,ఉపనయనంవంటివన్నీఉత్సవాలే.అయితేకల్యాణంమాత్రం "మహోత్సవం."
సృష్టికి ఈశ్వరుడు బ్రహ్మ. స్థితి కి ఈశ్వరుడు విష్ణువు. విఘ్నాలకి ఈశ్వరుడు వినాయకుడు.. విద్యలకి ఈశ్వరి సరస్వతి. ధనాలకి ఈశ్వరుడు కుభేరుడు. అందరు ఈశ్వరులకి ఈశ్వరుడు మహేశ్వరుడు . అంటే ఇందరిని తన వంశంలో ఉంచుకున్నవాడు మహా + ఈశ్వరుడు మహేశ్వరుడు . ఈశ్వరుడు అనగా అధికారి లేక ప్రభువు అని అర్ధం. మహేశ్వరుడు అనే మాటకి సర్వాధికారి, లేక మహాప్రభువు అని అర్ధం. ఈ మహా సృష్టికి మూలం ఆ ఈశ్వరుడు కాబట్టి మహేశ్వరుడు అయ్యాడు.
No comments:
Post a Comment