Thursday, November 10, 2016

మూడు సార్లు తీర్ధం ఎందుకు తీసుకోవాలి ?తీర్ధం ఎలా తీసుకోవాలి?__/\__హరి ఓం



మనం గుడిలో పూజారి తీర్ధమిచ్చినప్పుడో ,లేదా ఇళ్లలో పూజలు,వ్రతాలు చేసినప్పుడో తీర్ధం తీసుకుంటూ ఉంటాము.చాలామంది తీర్ధం తీసుకున్నాకాచేతిని తలకు రాసుకుంటారు.నిజానికి తీర్ధం ఎలా తీసుకోవాలి? తీర్ధం తీసుకునే విధానం ఇది.ముందుగా ఒక వస్త్రాన్ని నాలుగు మడతలుగా చేసి,ఎడమ చేతి మీద వేసుకోవాలి ,కుడిచేతిని దాని మీద ఉంచి ,తీర్ధాన్ని మూడు సార్లు తీసుకోవాలి.ఒక్క చుక్క కూడా కింద పడకుండా తీర్ధాన్ని తీసుకోవాలి.ఒక చుక్క కింద పడినా అంతకు ఎనిమిది రెట్లు పాపం చుట్టుకుంటుంది.తీర్ధమిచ్చే సమయంలో ముందుగా తాను తీసుకొని తరువాత ఇతరులకు ఇవ్వాలి.
తీర్ధాన్ని మూడుసార్లు తీసుకోవడానికి కారణం...
మొదటిది ఆధ్యాత్మికం, రెండవది అధిభౌతికం,మూడవది అధిదైవికం .

తీర్ధాన్ని తీసుకునే సమయంలో గుడిలో అయితే నిలబడి తీసుకోవాలి.ఇంట్లో అయితే కూర్చుని తీసుకోవాలి.తీర్ధం తీసుకున్న తరువాత చేతిని తలకు తుడుచుకోకూడదు. బట్టకు తుడుచుకోవాలి.(ఉచ్చిష్టం అంటే ఎంగిలి కనుక).

~ తీర్ధం తీసుకునేటప్పుడు కుడి చేతి చూపుడు వేలు, బొటన వేలు కలిపి అరచెయ్యి గుంటలాగా చేసి ఆ చేతి కింద వస్త్రం ఏదైనా పట్టుకుని తీసుకోవాలి.

తీర్ధాన్ని మూడు సార్లు ఎందుకు తీసుకోవాలి?
~~~~~~~~~~~~~~~~~~~~~~~

~ తీర్ధాన్ని “అకాల మృత్యు హరణం, సర్వ వ్యాధి నివారణం, సర్వపాప క్షయకరం, _________ పాదోదకం పావనం శుభం”

అని చెబుతూ మూడుసార్లు తీసుకోవాలి.(డాష్ వున్న చోట మనం ఏ దేవుని పూజా తీర్ధం సేవిస్తున్నామో ఆ దేవుని పేరు చెప్పుకోవాలి)

~ మంత్రంలో వున్నట్లే భగవంతుని పాదోదకమైన ఆ తీర్ధం

1. మొదటిసారి అకాల మృత్యువు లేకుండా చేస్తుందనీ,

2. రెండవసారి సకల రోగాలనూ నివారిస్తుందనీ,

3. మూడవసారి సకల పాపాలనూ నశింప చేస్తుందనీ

నమ్మకంతో తీసుకోవాలి.

అలాగే

i. మొదటిసారి తీసుకునే తీర్ధం శారీరిక, మానసిక శుధ్ధి కోసం,

ii . రెండవసారి తీసుకునేది న్యాయ, ధర్మ ప్రవర్తనకు,

iii . మూడవది మోక్షానికి

అనే నమ్మకంతో తీసుకోవాలి.




తీర్ధం యొక్క విశిష్టత ప్రత్యేకం గా చెప్పనవసరం లేదు ఐతే పూజ చేసే సమయం లో లేదా దేవాలయం లో దర్శనం తరువాత మూడు సార్లు తీర్ధం తీసుకొంటాము . ఇందులో అంతరార్దం చూద్దాము.
మొదటిసారి తీసుకునే తీర్ధం శారీరిక, మానసిక శుధ్ధి కోసం
రెండవసారి తీసుకునేది న్యాయ, ధర్మ ప్రవర్తనకు
మూడవది మోక్షానికి అనే నమ్మకంతో తీసుకోవాలి.
తీర్ధంలో పంచామృతాలు, తులసి దళాలు, సుగంధ ద్రవ్యాలు, మంత్ర శక్తి వుటాయి. అందుకే తీర్ధం
అత్యంత పవిత్రమైనది . ఆరోగ్యాన్నీ,ఆధ్యాత్మికతనూ మెరుగు పరుస్తుంది .

మూడు సార్లు తీసుకుంటే భోజనం చేసినంత శక్తిని భగవంతుడిస్తాడు అంటారు. తీసుకునేటప్పుడు ఆరోగ్యకరమైన భావంతో, ఈ తీర్ధం నాకు మంచి చేస్తుంది, నా ఆరోగ్యాన్నీ, నా ఆధ్యాత్మికతనూ మెరుగు పరుస్తుందనే సద్భావంతో తీసుకోవాలి
తీర్ధం అంటే తరింపచేసేది అని అర్ధం.ఆలయానికి వెళ్ళి, దైవదర్శనం, చేసుకున్నాక, పూజారులు “అకాల మృత్యు హరణం, సర్వవ్యాధి నివారణం, సమస్త పాపక్షయకరం… పాదోదకం పావనం శుభం” అంటూ తీర్ధం ఇస్తారు.
తీర్ధం సర్వరోగాలను నివారిస్తుంది, సమస్త పాపాలనూ ప్రక్షాళన చేస్తుంది. కాబట్టి దేవాలయం లో తప్పనిసరిగా తీర్ధం తీసుకోండి . భగవంతుడి కృప కు పాత్రులు అవ్వండి.... __/\__హరి ఓం 

No comments:

Post a Comment

Total Pageviews