Tuesday, January 30, 2018

Swami Vivekananda lecture at the Parliament of the World's Religions Chicago:

 On 11 September 1893, Swami Vivekananda began his very first lecture at the Parliament of the World's Religions Chicago:

Sisters and Brothers of America,

It fills my heart with joy unspeakable to rise in response to the warm and cordial welcome which you have given us. I thank you in the name of the most ancient order of monks in the world; I thank you in the name of the mother of religions; and I thank you in the name of millions and millions of Hindu people of all classes and sects.


My thanks, also, to some of the speakers on this platform who, referring to the delegates from the Orient, have told you that these men from far-off nations may well claim the honour of bearing to different lands the idea of toleration. I am proud to belong to a religion which has taught the world both tolerance and universal acceptance. We believe not only in universal toleration, but we accept all religions as true. I am proud to belong to a nation which has sheltered the persecuted and the refugees of all religions and all nations of the earth. I am proud to tell you that we have gathered in our bosom the purest remnant of the Israelites, who came to Southern India and took refuge with us in the very year in which their holy temple was shattered to pieces by Roman tyranny. I am proud to belong to the religion which has sheltered and is still fostering the remnant of the grand Zoroastrian nation. I will quote to you, brethren, a few lines from a hymn which I remember to have repeated from my earliest boyhood, which is every day repeated by millions of human beings: “As the different streams having their sources in different places all mingle their water in the sea, so, O Lord, the different paths which men take through different tendencies, various though they appear, crooked or straight, all lead to Thee.”


The present convention, which is one of the most august assemblies ever held, is in itself a vindication, a declaration to the world of the wonderful doctrine preached in the Gita: “Whosoever comes to Me, through whatsoever form, I reach him; all men are struggling through paths which in the end lead to me.” Sectarianism, bigotry, and its horrible descendant, fanaticism, have long possessed this beautiful earth. They have filled the earth with violence, drenched it often and often with human blood, destroyed civilisation and sent whole nations to despair. Had it not been for these horrible demons, human society would be far more advanced than it is now. But their time is come; and I fervently hope that the bell that tolled this morning in honour of this convention may be the death-knell of all fanaticism, of all persecutions with the sword or with the pen, and of all uncharitable feelings between persons wending their way to the same goal.

సంపూర్ణ చంద్రగ్రహణం జనవరి 31- 2018.

జనవరి 31న సంపూర్ణ చంద్రగ్రహణం: ఏ రాశులవారిపై ప్రభావం...

ఖగోళ పరంగా చంద్ర గ్రహణం అనేదిసూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళ రేఖలో ఉన్నప్పుడు చంద్ర గ్రహణం ఏర్పడుతుంది. సూర్యుడు, భూమి ఎప్పటికి ఒకే మార్గంలో ఉన్నప్పటికి చంద్రుడు ఈ మార్గానికి 5 డిగ్రీలు అటూ ఇటూగా తిరిగుతుంటాడు.

సూర్య, చంద్రుల మధ్యలో భూమి ఉన్న రోజున పూర్ణిమ అవుతుంది. అయితే సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళరేఖలో ఉండి చంద్రుడు రాహువు వద్దగాని, కేతువు వద్దగాని ఉన్నప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది.

పూర్తి చంద్రబింబం కనపడకపోతే దాన్ని సంఫూర్ణ చంద్రగ్రహణమనీ, కొంత భాగమే కనిపించకపోయేదాన్ని పాక్షిక చంద్రగ్రహణము అని అంటారు.

ఈ ప్రాంతాల్లో కనిపిస్తుంది...

చంద్ర గ్రహణం భారతదేశంతో సహ ఆసియా ఖండం, అమెరికా, యూరప్ ఈశాన్యప్రాంతం, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పసిఫిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం ప్రాంతములందు చంద్ర గ్రహణం కనబడుతుంది.


ఈ నెల 31 తేది బుధవారం రోజున పుష్యమి, ఆశ్లేష నక్షత్రాలలో కర్కాటకరాశిలో సాయంత్రం 5:18 మొదలుకొని 8:41 వరకు కర్కాటక, సింహ లగ్నాలలో రాహూగస్త సంపూర్ణ చంద్ర గ్రహణము సంభవించనున్నది.

భారత కాలమానం ప్రకారం సాయత్రం ప్రారంభం అవుతుంది.

చంద్రగ్రహణం వేళలు ఇవీ...

సాయంత్రం. 5:18 చంద్రగ్రహణ ప్రారంభ కాలం

సా. 6:22 సంపూర్ణ స్థాయిలోకి గ్రహణంరాత్రి. 7:38 గ్రహణం సంపూర్ణ స్థాయి నుండి విడుపు దశ వైపురాత్రి. 8:41 గ్రహణ అంత్యకాలము ( గ్రహణ మోక్షం )గ్రహణం ప్రారంభం నుండి వదిలే వరకు ఉన్న మొత్తం గ్రహణ సమయం 3 గంటల 23 నిమిషాలు.

సంపూర్ణ సూర్య బింబ దర్శన కాలం మొత్తం"76"నిమిషాలు.



గ్రహణ గోచారం ఇలా...

ఈ గ్రహణం కర్కాటకరాశిలో ఏర్పడటం మరియు ఆ రాశి నుండి సప్తమ దృష్టి పరంగా మకరరాశిఅవటం చేత ఈ రెండు రాశులవారు మరియు పుష్యమి, ఆశ్లేష, మఖ నక్షత్రాల వారిపై ప్రభావం ఎక్కువగా చూపుతుంది. కాబట్టి గ్రహణ శాంతిని ఆచరించాల్సి ఉంటుంది.

ఏ రాశివారిపై ఏ ప్రభావం

ధనస్సు-మేషం-కర్కాటక-సింహ రాశుల వారికి అధమ ఫలం.

వృశ్చిక-మకర-మీన-మిధున రాశుల వారికి మధ్యమ ఫలం.

కన్య-తుల-కుంభ-వృషభ రాశుల వారికి శుభ ఫలములను పొందుతారు.

గ్రహణం ఎవరికైనా గ్రహణమే కావునా ద్వాదశ రాశులవారు గ్రహణ నియమ నిబంధనలు పాటిస్తే శుభం కలుగుతుంది.

చంద్రగ్రహణ నిబంధనలు ఇవీ..

ఈ సంపూర్ణ చంద్ర గ్రహణాన్ని గర్భిణీ స్త్రీలు ప్రత్యేక్షంగా చూడ కూడదు, టివిలలో చూస్తే దోషం లేదు. ప్రశాంతగా ఉంటూ మనస్సులో భగవంతున్ని ధ్యానిస్తూ ఉంటే చాలా మంచిది.
👉 గర్భిణిలు కదలకుండా పడుకోవాలి అనే అవాస్తవాన్ని నమ్మకండి. ఇంట్లో అన్ని పనులు చేసుకోవచ్చును, ఇందులో ఎలాంటి సందేహాలు పడకూడదు
.గ్రహణ సమయంలో మల, మూత్ర విసర్జనలు చెయకూడదు అనే అపోహలు వద్దు, అది వాస్తవం కాదు యదావిధిగా మల, మూత్ర విసర్జన చేయవచ్చు. .

ఆ వేళలో ఆహార పానీయ నియమాలు

అన్ని వయస్సులవారు గ్రహణానికి మూడు గంటల ముందుగానే ఘన పదార్ధాలు, భోజనాలు పూర్తి చేసుకోవాలి. ద్రవ పదార్ధాలు గ్రహణము పట్టే సమయానికి గంటన్నర ముందు వరకు పాలు, జ్యూసులు మొదలగునవి తీసుకోవచ్చును.

గ్రహణము పూర్తి అయిన తర్వాత తలస్నానంచేసి ఫ్రెష్ గా వంట చేసుకొని తినాలి.

ఉదయం చేసిన అన్నం కూరలు మొదలగునవి తినుటకు పనికి రాదు.

కారణము ఏమనగా గ్రహణ సమయంలో నిలువఉన్న ఆహర పదార్ధాలు విష స్వభావాన్ని కలిగి ఉంటాయి.

అవి తింటే వెంటనే వాటి స్వభావాన్ని చూపకపోయినా నిధానంగా శరీరానికి హాని కలిగిస్తాయి కాబట్టి తినకూడదు అని శాస్త్రాలు, పెద్దలు చెబుతుంటారు.

శాస్త్రీయ పద్ధతి అవసరం

గ్రహణ సమయంలో శాస్త్రీయ పధ్ధతిని ఆచరించాలి అనుకునేవారు వారి శారీరక శక్తి, జిజ్ఞాస ఉన్నవారు గ్రహణము పట్టుటకు ముందు, తర్వాత పట్టు, విడుపు స్నానాలు చేసి ధ్యానం (జపాలు) భగవత్ స్మరణతో ఉండగలిగితే మాములు సమయములో చేసిన ధ్యాన ఫలితంకన్న రెట్టింపు స్తాయిలో ఫలితం లభిస్తుంది.

ముసలివారు, చిన్నపిల్లల్లు, గర్భిణిలు, అనారోగ్యంతో ఉన్నావారు చేయకూడదు. చేయనిచో ఏమో అవుతుందనే భయపడకండి.ఏమీ కాదు

తర్వాత ఇలా చేయాలి.

గ్రహణం పూర్తి అయిన తరవాత ఇంట్లో దేవున్ని శుద్ధి చేసుకోవాలి.

విగ్రహాలు, యంత్రాలు ఉన్నవారు పంచామృతంతో ప్రోక్షణ చేసుకోవాలి.

జంద్యం(గాయత్రి) వేసుకునే సాంప్రదాయం ఉన్నవారు తప్పక మార్చుకోవాలి.

ఇంటిముందు, వ్యాపార సంస్థల ముందు నరదృష్టి కొరకు కట్టిన గుమ్మడి కాయలు, కొబ్బరి కాయలను తీసివేసి వాటి స్థానంలో కొత్తవి శాస్త్రోకంగా కూశ్మాండా (గుమ్మడికాయ)పూజ విధి విధానంగా చేయించి గుమ్మంపై కట్టుకుంటే మంచి శుభఫలితాలను ఇస్తాయి.

మీ మీ శక్తి కొలది గ్రహణానంతరం గ్రహదోష నివారణ జపాలు, పూజలు చేయించుకున్న తర్వత ఆవునకు తోటకూర, బెల్లం తినిపించి గోమాతకు మూడు ప్రదక్షిణలు చేయాలి, పేదలకు ఏదేని ఆహర, వస్త్ర, వస్తు రూపంలో దానం చేయగలిగితే మీకున్న అరిష్టాలు, గ్రహబాధలు కొంతవరకు నివారణ కలిగి భగవదనుగ్రహం కలుగుతుంది.🙏🙏🙏

సాహిత్యo గొప్ప ఆదరువు.....ఆలంబన!

పూర్వం ఇద్దరు రాజులు యుద్ధానికి దిగారు. ఓడిన రాజు తన రాజ్యాన్ని వీడి, అడవుల్లోకి పారిపోయాడు. అక్కడే ఆధ్యాత్మిక చింతనతో కాలం గడుపుతున్నాడు. గెలిచిన రాజు ఆ ఉత్సాహంతో యజ్ఞం తలపెట్టాడు. అనుకోకుండా, అక్కడ యాగధేనువు మరణించింది. అది అశుభ సూచన. యజ్ఞాన్ని ఎలా పూర్తిచేయాలో తెలియక ఆ రాజు తికమక పడ్డాడు. నగర పురోహితుల్ని సంప్రతిస్తే- ఆ ధర్మసూక్ష్మం తెలిసినవాడు ఓడిపోయిన రాజేనని తేలింది. ధర్మసంకటం నుంచి గట్టెక్కించగలవాడు ఆయనేనని నిశ్చయమైంది.

గెలిచిన రాజు ఏమాత్రం సందేహించకుండా ఓడిన రాజు వద్దకు వెళ్లి, యజ్ఞాన్ని పరిపూర్తి చేయాలని అర్థించాడు. ఆయనా ఏ శషభిషలకూ తావు లేకుండా ధర్మనిర్ణయం కోసం ముందుకొచ్చాడు. శత్రువుకు సహకరించాడు.

ఆ ఇద్దరు రాజులూ ఆర్షధర్మ నిర్వహణ విషయంలో అహంకారాల్ని త్యజించారు. వారి కథే- శ్రీకృష్ణదేవరాయల ‘ఆముక్తమాల్యద’లోని ‘ఖాండిక్య కేశిధ్వజోపాఖ్యానం’ సారాంశం. సమాజం అనే ధర్మసౌధం పటిష్ఠంగా నిలిచేందుకు భారతీయ ప్రాచీన సాహిత్యం ఎంతగా తోడ్పడిందో, ఈ ఉదాహరణ చూస్తే ఇట్టే అర్థమవుతుంది. ఈ కథలో ఓడిన రాజు ఖాండిక్యుడు; గెలిచినవాడు కేశిధ్వజుడు. కథ చివర గొప్ప మలుపు ఒకటుంది.

తన యజ్ఞ సంపూర్తికి సహకరించిన ఖాండిక్యుడికి గురుదక్షిణగా ఏది కావాలన్నా ఇస్తానని కేశిధ్వజుడు ప్రకటిస్తాడు. అది సంప్రదాయం. ఓడిన రాజుకు ఓర్మి ఎంత ప్రధానమో- గెలిచిన రాజుకు సంయమనం, ధర్మ సంప్రదాయ పరిరక్షణ అంతే అవసరం. ఈ అవకాశాన్ని చేజిక్కించుకున్న ఖాండిక్యుడు తాను కోల్పోయిన రాజ్యం తిరిగి గురుదక్షిణగా కావాలన్నా ఇచ్చేయడానికి కేశిధ్వజుడు సిద్ధపడతాడు. ఇక్కడే ఓ చిత్రం చోటుచేసుకుంటుంది. రాజ్యసంపద అయాచితంగా వచ్చిపడుతున్నా ఖాండిక్యుడు కాదంటాడు! తనకు బ్రహ్మజ్ఞానాన్ని బోధించాలని, అదే కేశిధ్వజుడి నుంచి తాను కోరుకునే గురుదక్షిణ అని ప్రకటిస్తాడు.

ఖాండిక్యుడి నిర్ణయం కేశిధ్వజుణ్ని విస్మయానికి గురిచేస్తుంది. ఆయన ఆలోచన ఏమిటో తెలుసుకోవాలని అనిపిస్తుంది. అప్పుడు ఖాండిక్యుడు అంటాడు- ‘రాజ్యభోగాలు కేవలం భౌతిక సంపదలు. వాటిని కష్టంతో, శారీరక శ్రమతో సాధించుకోవాలి. అంతేగాని, అవి అయాచితంగా లభించాలని కోరుకోకూడదు. కష్టపడి సాధిస్తేనే, వాటి విలువ తెలుస్తుంది. నాకంటే బలవంతుడి చేతిలో ఓడిపోయాను. అందులో సిగ్గు పడాల్సింది ఏముంటుంది? తిరిగి పుంజుకొని ధర్మమార్గంలో, క్షాత్రంతో నా రాజ్యాన్ని నేను తిరిగి చేజిక్కించుకోవాలి. అది ఒప్పుతుంది గాని, దొడ్డిదారిన పొందితే పాపమవుతుంది’ అని బదులిస్తాడు ఖాండిక్యుడు!

ఇలాంటి కథల్ని పిల్లలకు పాఠ్యాంశాలుగా నిర్ణయిస్తే, వారి బాల్యాన్ని అవి ధార్మిక పథంలోకి నడిపిస్తాయి. వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేస్తాయి. ఉచితాల కోసం తాపత్రయపడకుండా ఆపుతాయి. ఉచితానుచిత జ్ఞానాన్ని వారికి అలవరుస్తాయి.

ఆముక్తమాల్యదలోని ఖాండిక్య కేశిధ్వజోపాఖ్యానం- ఆ కావ్యానికి గుండెకాయ వంటిదని ప్రశస్తి రావడానికి ముఖ్య కారణాలేమిటి? ఆ కథలోని ధార్మిక నేపథ్యం, ప్రబోధ గుణం. గెలుపు ఓటముల విషయంలో, కర్తవ్య నిర్వహణలో, అయాచిత అవకాశాల తిరస్కరణలో ప్రతిఫలించిన ధర్మస్వరూపమే- భారతీయతకు వన్నెలద్దుతూ వచ్చింది.

లోకంలో ఇలాంటి కథలు ఒళ్లు మరిపించడమే కాదు, కళ్లు తెరుచుకొనేలా చేస్తాయి. దీనికి మన ప్రాచీన సాహిత్యమే గొప్ప ఆదరువు, ఎంతో ఆలంబన!

అమ్మ

అమ్మ

"అమ్మ ప్రేమ" ని మించిన ప్రేమ ఈ ప్రపంచం లో ఉంది అని ఎవరైనా చెపితే అది తప్పకుంఢా ఆబద్దమే...

ఎందుకంటే...

తెలుగు భాషలో అమ్మ అనే పదం కన్నా విలువ అయినది మరొకటిలేదుకాబట్టి.

మనసు కి గాయం అయితే మనసు పలికే చిన్న మాటే "అమ్మ".
శరీరాని కి గాయం అయితే పెదవుల వెంట వచ్చే రెండు అక్షరాల పలుకే "అమ్మా".

అమ్మ గురించి ఒక కవి ఏమన్నాడో తెలుసా ?కొలిస్తే నే పలికేది ఆ దేవుడు...కాని పిలవకుండానే పలికేది "అమ్మ మనసు" మాత్రమే..

ఒక విషయం గురించి మాట్లాడమంటే 1 గంట/రోజు/నెల మట్లాడవచ్చు. కాని అమ్మ గురించి మాట్లాడమంటే జీవితాంతం మాట్లాడుతూ నే ఉండవచ్చు....అదే "అమ్మ ప్రేమ".

"ప్రాణం" అనే పదం చాలా చిన్నది "అమ్మ" అనే మాట ముందు కాదు అనగలరా ఎవరైనా?

ఈ లోకం లో నువ్వు ద్వేషించినా కూడా నిన్ను ప్రేమించే వాళ్ళు ఉన్నారు అంటే అది కేవలం అమ్మ మాత్రమే.

అమ్మ ని ప్రేమించే ప్రతి ఒక్కరి కి నా నమస్కారం../\..

శుభ సాయంత్రం ../\..30-01-2018.


ఆకర్షణ దృష్టిని ఆకట్టుకొంటే ...
మంచిగుణం ఆత్మను గెలుచుకుంటుంది.

గ్రంధాలను చదవడం వలన వచ్చిన జ్ఞానానికి
జీవితానుభవం తోడయినప్పుడే 
ఆ జ్ఞానం మరింత రాణిస్తుంది.

కోపంతో ఉన్న వానితో ప్రీతి వాక్యాలు పలుకుతూ,
కఠినాత్మునిపై కరుణ చూపుతూ, 
పిసినారికి దానమిస్తూ,
అసత్యాలాడే వానితో సత్య వాక్యాలు పలుకుతూ 
నైపుణ్యం కలవారు గెలుపును పొందుతారు.

అభిమానం సంపాదించడానికి 
ఆస్థులు..అంతస్తులు అవసరంలేదు 
మంచిపనులు చేసి మంచిపేరు తెచ్చుకుంటే 
అందరూ నీ అభిమానులే అవుతారు.

వేలాది వ్యర్ధమైన మాటలకన్నా వినగానే 
శాంతిని ప్రసాదించే సార్ధకమైన మాట ఒక్కటి చాలు!!!

Saturday, January 27, 2018

ఆరోగ్యo కాపాడుకుందాం .

మనం నిత్యం ఆహారంలో తీసుకునే కూరగాయలు, పళ్ళు, పప్పుధాన్యాలు లో ఎన్నో రోగాలను నయం చేసే శక్తి వుంది.
మనం నిత్యం ఆహారంలో తీసుకునే కూరగాయలు, పళ్ళు, పప్పుధాన్యాలు లో ఎన్నో రోగాలను నయం చేసే శక్తి వుందని మన పెద్దలు చెపుతూ వుంటారు. చిన్ననాటినుంచి పిల్లలకు అన్నిరకాలు తినే అలవాటు చేస్తే మంచిది.మన ఆహార పదార్ధాలలో ఉన్న ఉపయోగాలు ఏమిటో తెలుసుకుని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !!!
• అల్లం తింటే ఎక్కిళ్ళు తగ్గుతాయి.
• కరివేపాకు రక్తహీనతను తగ్గిస్తుంది.
• నేరేడు పండ్ల గింజల్లో ఉండే జంబోలిన్ అనే గ్లూకోసైట్, మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది.
• గుమ్మడికాయ మూత్ర సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది.
• అవకాడో ఫలాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి తరచుగా తింటే మలబద్దకం పోతుంది.
• జామపళ్ళు హార్మోన్ల హెచ్చుతగ్గులను నివారిస్తాయి.
• బ్లాక్ టీ మధుమేహాన్ని దూరంగా ఉంచుతుంది.
• సజ్జల్ని ఎక్కువగా తీసుకుంటే, పైల్స్ బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది.
• మామిడిపండుకి మూత్రపిండాల్లోని రాళ్ళను కరిగించే శక్తి ఉంది.
• దానిమ్మరసం కామెర్లకు మంచి మందుగా పనిచేస్తుంది.
• ఆవాల్ని క్రమం తప్పకుండా తీసుకుంటే ఇన్సులిన్ వృద్ది చెందుతుంది.
• అల్లం కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. మలబద్దకాన్ని కూడా వదిలిస్తుంది.
• కీరదోసలో ఉండే సిలికాన్, సల్ఫర్ లు శిరోజాలకు మేలు చేస్తాయి.
• మునగాకు గ్యాస్ట్రిక్ అల్సర్ ని దరికి చేరనివ్వదు.
• ద్రాక్షలో అధికపాళ్ళలో ఉండే బోరాన్.. ఆస్టియో పొరాసిస్ రాకుండా కాపాడుతుంది.
• బీట్ రూట్ రసం ‘లో బీపీ ‘ సమస్య నుంచి గట్టేక్కిస్తుంది.
• క్యారెట్ జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది.
• మూత్రపిండాల వ్యాధులున్న వారికి మొక్కజొన్న మంచి ఔషదం.
• ఉల్లిపాయ శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తుంది.
• అనాసపళ్ళలో బ్రోమిలిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. వాపుల్ని తగ్గిస్తుంది.
• పుచ్చకాయలో ఉండే లైకొపీన్.. గుండె, చర్మ సంబందిత వ్యాధుల నుంచి కాపాడుతుంది.
• సపోటాపళ్ళు మలబద్దకాన్ని నివారిస్తాయి.
• దాల్చిన చెక్కకు పంటి నొప్పిని తగ్గించే శక్తి ఉంది.
• ఆవాలు అజీర్తిని తగ్గిస్తాయి.
• చేపలు తింటే రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి.
• కమలాఫలాలు న్యుమోనియాకు చక్కని మందు.
• క్యారెట్లు నరాల బలహీనత నుండి కాపాడతాయి.
• యాపిల్ తింటే నిద్ర బాగా పడుతుందని పరిశోధనలో తేలింది.
• వాము దంత వ్యాధులను తగ్గిస్తుంది.
• పచ్చి జామకాయలో ఉండే టానిస్ మాలిక్, ఆక్సాలిన్ ఆమ్లాలు నోటి దుర్వాసనను పోగోడుతాయి.
• ఉలవలు ఊబకాయాన్ని తగ్గిస్తాయి.
• ఖర్జూరం మూత్ర సంబంధిత వ్యాధుల్ని తగ్గించి, మూత్రం సాఫీగా అయ్యేలా చేస్తుంది.
• ద్రాక్షలో ఉండే పైటోకెమికల్స్.. కొలెస్ట్రాల్ ని దరి చేరనివ్వవు.
• జామపళ్ళు ఎక్కువగా తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
• ప్రోస్త్రేట్ క్యాన్సర్ సోకకుండా అడ్డుకునే శక్తి టొమాటోలకు ఉంది.
• నేరేడు పళ్ళు తింటే కడుపులో పురుగులు చచ్చిపోతాయి.
• మొలల వ్యాధికి బొప్పాయి మంచి మందు.
• మునగ కాయలు ఆకలిని పెంచుతాయి.
అందరికీ ఉపయోగపడే సమాచారం కాబట్టి నచ్చితే మిగతావారికి పంచండి.

*ఆడ పిల్లను బతకనిస్తే ..... అమ్మను గౌరవించినట్లే.....*

*'ఆడ'పిల్ల*

*చాలా బాగుంది*
*ఖచ్చితంగా చదవండి*

అమ్మాయి పెళ్ళికై నిశ్చయ తాంబూలాలు పుచ్చుకున్నారు, ఆరోజున!

అది గొప్పింటి సంబంధం కావడంతో కుటుంబం ఎంతో సంతోషించింది. తండ్రి శర్మగారు ఎంతగనో ఆనందించాడు. పిల్లవాడు, అతని తల్లిదండ్రులు చాల మంచివారు. దాంతో శర్మగారికి ఎంతో భారం తగ్గినట్లనిపించింది.

పెళ్ళికిముందు ఒకరోజు పెళ్ళికూతురు తండ్రి శర్మగారు వియ్యంకుడు వాళ్ళింటికి వెళ్ళాలసివస్తుంది.

అయితే ఆరోజు శర్మగారి ఆరోగ్యం బాగాలేదు. మొదటిసారి కావడం తో కాదనలేకపోయాడు. వరునితరఫువాళ్ళు ఎంతో సాదరంగా ఇంటిలోనికి ఆహ్వానించారు.

కొద్దిసేపు వచ్చినపని విషయమై మాట్లాడుతుండగానే తేనీరు వచ్చింది. శర్మగారికి మధుమేహం ఉండడంతో చక్కెర పదార్ధాలకు దూరంగా ఉంటున్నారాయన.

అయితే మగపెళ్ళివారింటిలో శర్మగారు మొహమాటంతో ఇచ్చిన టీ కప్పును చేతిలోనికి తీసుకున్నారు తాగడానికై.

మొదటిగుటక వేస్తూనే ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు.

అందులో పంచదార లేదు సరికదా, తనకిష్టమైన యాల కులపొడి వేశారు.

మాఇంటిపధ్ధతిలోనే చేసిన టీ వీరింటిలోనూ తాగుతున్నారే అని అనుకున్నారాయన.

మధ్యాహ్నం భోజనం చేశారు, అదీ అచ్చు తమ ఇంటివంట లాగానేఉంది.

వెంటనే ఏం బయలు దేరుతారు, కొంచెంవిశ్రాంతి తీసుకోండి అంటూ పడకగదికి తీసుకెళ్ళారు.అచ్చటి దుప్పటి తను కప్పుకునే దుప్పటి లాగ పలచటిది. కునుకుతీసి లేచేటపపటికి రాగిచెంబులో నీరిచ్చారు తాగడానికి.

బయలుదేరేముందు ఇక అడగకుండా ఉండలేకపోయేరు శర్మగారు...'నేను ఏం తింటాను, ఎలా తాగుతాను, నా ఆరోగ్యానికి ఏది మంచిది..ఇవన్నీ మీకెలాతెలుసు?' అని.

అమ్మాయి అత్త గారు ఇలా అంది....'నిన్నరాత్రి మీఅమ్మాయిఫోన్ చేసి మీగురించి అన్నీ చెప్పింది. మానాన్నగారు మొహమాట పడతారు. వారిగురించి మీరే శ్రధ్ధ తీసుకోవాలనికోరింది.'

శర్మగారి కళ్ళల్లో నీరు తిరిగింది.

శర్మగారు ఇంటికి రావడంతోనే భార్యను పిలిచి ఇలా అన్నారు...'లలితా, మా అమ్మ చనిపోలేదు.'

'ఏవిటండీ మీరు మాటాడుతున్నది'

'అవును లలితా, నన్ను కంటికి రెప్పలా చూసుకొనే నా తల్లి బతికేఉంది..నాకూతురు రూపంలో' అని జరిగిందంతా పూసగుచ్చినట్లు చెప్పారు శర్మగారు కన్నీరు నిండిన కళ్ళతో.

*అమ్మాయి 'ఆడ'పిల్ల అనుకొంటాము, మన ఇల్లు వదిలి పోతుందని. తను ఎక్కడికీ పోదు,తలిదండ్రుల హృదయాలలోనే ఉంటుంది. తన మనస్సులో తనవారి జ్ఞాపకాలను నింపుకుని.*

*ఆడ పిల్లను బతకనిస్తే ..... అమ్మను గౌరవించినట్లే.....*

Thursday, January 25, 2018

చిన్నప్పుడు విన్న కథలు.. మరొక్కసారి గుర్తుచేసుకొందాం!!!

తోటకూర నాడే...

అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో ఒక పేదరాలు వుండేది. ఆమెకు ఒక్కడే కొడుకు. ఒక రోజు వాడు ఒకరితోటలో పెరిగిన తోటకూర మొక్కల్ని దొంగతనంగా పెళ్లగించుకొని వచ్చి తల్లికి ఇచ్చాడు. తల్లి కూరకు పనికివస్తుంది కదా అనుకొని సంతోషించింది. కానీ ఈ మొక్కలు ఎక్కడివి? ఎవరైనా దయతో ఇచ్చారా? లేక దొంగతనంగా తెచ్చావా అని కొడుకుని ప్రశ్నించలేదు.

అప్పటి నుంచి వాడుదొంగతనాలకుఅలవాటుపడ్డాడు.దురలవాట్లకు లోనయ్యాడు. క్రమంగా పెద్ద దొంగగా మరి దొంగతనాలు, దోపిడీలు చేసేవాడు. ఆ గొడవల్లో అనేకసార్లు దెబ్బలు తినేవాడు. ఆ దొంగతనాలు, దోపిడీలు చేసే సందర్భాలలో ఎదురు తిరిగిన కొందరిని చంపాడు. చివరికి పోలీసులకు పట్టుబడ్డాడు నేరాలు రుజువైనాయి న్యాయమూర్తి అతనికి ఉరి శిక్ష విధించాడు.

ఉరి తీసేముందు " నీ కడసారి కోర్కె కోరుకోమని " తలరి చెప్పాడు "మా అమ్మతో ఒక్కసారి మాట్లాడనివ్వండి" అన్నాడు. కొడుకు ఏం చేబుతాడోనని తల్లి ఏడుస్తూ వచ్చింది. నీకు ఒక రహస్యం చెబుతా చెవిలో అన్నాడు. ఏమి రహస్యం చేబుతాడోనని ముందుకు వంగింది.అంటే కసుక్కున ఆమె చెవి కోరికేసాడు.ఆమె అమ్మో అని ఏడుస్తుండగా....నేను తోటకూర తెచ్చిననాడే నాకు బుద్ధి చెప్పివుంటే నాకు ఈరోజు ఈగతి పట్టేది కాదుగా అని భాధగా అంటాడు దొంగ.

*********************************************************************************

* అత్యాశ పనికిరాదు *
అనగనగా ఒక ఊర్లో వెంకన్న అనే అతను చేపలు పట్టి జీవనం సాగించేవాడు. అతడు చేపలు పట్టి జీవనం సాగించలేక ఒక తపస్సు చేసాడు. అతని తపస్సుకు మత్స్య దేవత సంతోషించి " వరం కోరుకో " అంటే అతడు ఆనందంతో ఏమి అడగాలో తెలియక ఇంటికివెళ్ళి నా భార్యను అడిగివస్తాను అని ఇంటికివెళ్ళి వస్తాడు.
ఏమి కావాలి అని మత్స్యదేవత అడగగా " నా భార్యకి ఒంటినిండా నగలు, పట్టుచీరలు కావాలని అడిగింది." అని చెపుతాడు. అదివిన్న దేవత '' తధాస్తు " అని నీకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా నన్ను తలచుకో అని మాయమైపోతుంది.అయితే అంతరితో వెంకన్న భార్య తృప్తి చెందక "మన ఇల్లు మేడకావాలి, ఇంటినిండా నౌకర్లు ఉండాలి, ఏ లోటు లేకుండా కాలం గడిచిపోవాలి " అని దేవతను మల్లి అడిగిరమ్మని భర్తను పంపింది. వెంకన్న దేవతను తలచుకొంటే ప్రత్యక్షమై అతడు కోరిన వరం కుడా ఇచ్చింది.
కానీ అప్పటికీ తృప్తి చెందని వెంకన్న భార్య "ఈ దేశపు రాజు - రాణి మన ఇంట్లో ఊడిగం చెయ్యాలని దేవతను అడిగిరమ్మని మూడోసారి భర్తను దేవత వద్దకు పంపించింది. ఆ మాటలు విన్న దేవత కోపగించి " ఇలాంటి కోరిక కోరినందుకు మీ మేడ మళ్లీ గుడిసె అవుతుంది. నౌకర్లు,నగలు, చీరలు మాయమౌతాయి అన్నది.దేవత అన్నట్లే జరిగింది.
నీతి:- అత్యాశ పనికిరాదు.

శుభ సాయంత్రం!


అపజయం నుంచి గుణపాఠం
విజయం నుంచి వినయం
మనం తప్పక నేర్చుకోవాలి!!!

తల్లి తండ్రుల పుణ్య ఫలం వలన మంచి గుణాలు,
చతురత పొందుతాము.
వంశం వలన ఉదారత్వం లభిస్తుంది.
కాని స్వంత పుణ్యం వలననే అదృష్టవంతులం కాగలం.
అందుకే అందరం సత్కర్మలను చెయ్యాలి.
అంటే ఇతరులకు ప్రయోజనం కలిగించే పుణ్య కార్యాలు చెయ్యాలి.

సత్యమే తల్లి,
జ్ఞానమే తండ్రి,
ధర్మమే సోదరుడు,
దయ స్నేహితుడు,
శాంతి భార్య,
ఓర్పే పుత్రుడు.
ఈ ఆరే నిజమైన బంధువులు,దేహ బంధువులు కన్నా.

Tuesday, January 23, 2018

రథ సప్తమి

రథ సప్తమి శుభాకాంక్షలు.

రథ సప్తమి రోజు సూర్యుని అనుగ్రహం కోసం ఏమి చేయాలి? ఏం చదవాలి?
రథసప్తమి. చాలా విశిష్టమైన రోజు.సూర్యుడు మాఘ శుద్ధ సప్తమి నాడు జన్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి.ఇదేరోజున సూర్య భగవానుడు తన రథాన్ని ఉత్తరం వైపుకు మరలించినట్లు చెప్పబడింది.ఆ దేవదేవుని అనుగ్రహం మన అందరిపైనా కలగాలని కోరుకొంటూ సప్త సప్త మహాసప్త రథసప్తేన సప్తతే
సప్తజన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి!!

తిథులలో సప్తమి తిథికి సూర్య నారాయణ మూర్తి యాజమాన్యాన్ని కలిగి ఉన్నాడు. ఏడవ తిథి సప్తమి. అలాగే సప్తమి తర్వాత వచ్చే తిథి అష్టమి. అష్టమి మొదలుగా
చంద్రునకు రిఫ అనే దోషము కూడా ఆపాదింప బడుతుంది. సప్తమి తిథి పూర్తి కావడంతో వచ్చే గుణగణాదులు పూర్తిగా మారిపోతాయి అష్టమి తిథితో. అందుకే ఈ సప్తమి తిథికి శరీరానికి ప్రాతినిధ్యం వహించేటటువంటి, తను భావ కారకుడైనటువంటి, పిత్రుభావ కారకుడైనటువంటి సూర్య నారాయణ మూర్తి యాజమాన్యాన్ని కలిగి ఉన్నాడు. అటువంటి ఈ సూర్య నారాయణ మూర్తి పుట్టినటువంటి రోజు మాఘ శుద్ధ సప్తమి. దీనికి సూర్యసప్తమి అని పేరు. అలాంటప్పుడు రథసప్తమి అన్న పేరు ఎలా వచ్చింది? మిగతా ఏ పండుగలకూ లేని ప్రత్యేకత రథసప్తమికి ఎలా ఏర్పడింది? అంటే సూర్య నారాయణ మూర్తి ప్రత్యేకంగా ఆయన రథం చెప్పుకోదగ్గది. ఆయన రథానికి ఒకటే చక్రం ఉంటుందిట. ఒక చక్రం ఉండే రథం ప్రపంచంలో ఉంటుందా? రెండు చక్రాలు కావాలి కదా మనం వెళ్ళాలి అంటే. సూర్యుని రథం మటుకు ఒకే చక్రం. నిర్ణీతమైన ప్రమాణంలో ప్రపంచంలో ఏం జరిగినా క్రమం తప్పకుండా ప్రయాణించేటటువంటి వాడు సూర్య నారాయణుడు. కనుక ఆ సప్తమి రథసప్తమి, సూర్య సప్తమి.
ఆ స్వామి కృత్తికా నక్షత్రంలో జన్మించాడు అని వర్ణిస్తాయి సాంప్రదాయ గ్రంథాలన్నీ కూడా. దక్షిణాయనం పూర్తీ అయిపోయి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైన సంక్రాంతి పిమ్మట వచ్చే సప్తమి తిథికి రథసప్తమి అని గుర్తించాలి. ఇకనుంచి సంపూర్ణమైన కాంతి కిరణాలు మనపైన ప్రసరిస్తాయి ఉత్తరాభిముఖంగా. కనుక ఈ తిథి నాడు సూర్య రథాన్ని ప్రతిబింబించే విధంగా వాకిళ్ళలో సూర్య రథం ముగ్గు వేయడం, అలాగే సూర్య నారాయణ మూర్తిని సోత్రం చేయడం, చేయాలి. ఇంతటి ప్రాముఖ్య కలిగిన రోజు రథసప్తమి రోజు. సూర్య నారాయణ మూర్తిని ఆరాధన చేస్తే ఆరోగ్యం చేకూరుతుంది. ఇదే "సూర్య సప్తమి"అని కూడా పిలువబడుతుంది.ఈ రోజున అరుణోదయకాలంలో  జిల్లేడు ఆకును అందులో రేగికాయలను ఉంచుకొని తలపై పెట్టుకొని

సప్త సప్త మహాసప్త రథసప్తేన సప్తతే
సప్తజన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి!!

అను శ్లోకం చదువుకునిస్నానం చేస్తే ఏడు విధాలైన శాపాలు నశిస్తాయట.  నమస్కారం ప్రియ:సూర్య: అన్న ఆర్య వాక్య ప్రకారం కేవలం నమస్కారం చేతనే సూర్యుడు సంతృపి చెందుతాడని తెలుస్తుంది.ఈ రోజున చిక్కుడుకాయలతో రథం చేసి కొత్త బియ్యంతో పాయసాన్ని వండి చిక్కుడు అకులలో పెట్టి సూర్యునికి నివేదన చేయడం ఆచారం. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అన్న వాక్యం ప్రకారం ఆరోగ్యం కొరకు ఆదిత్య హృదయం పారాయణ చెయ్యాలి. రథసప్తమి నాటి స్నానం సప్త సప్త మహాసప్త ద్వీపా వసుంధరా! కోటి జన్మార్జితంపాపిం వినశ్యతితత్క్షణాత్ అన్నట్లుగా పాప విముక్తి కలిగిస్తుందట.
సూర్యనారాయణ మూర్తికి సంబంధించినటువంటి దండకం కానీ, స్తోత్ర పాఠాదులు కానీ, ఈరోజు మనం పారాయణ చేయాలి. అలాగే నమస్కారం చేస్తే ఆయన సంతోషిస్తాడు గనుక సూర్య నమస్కారాలు కూడా ఆచరించాలి. వేదం తెలిసినవారు కానీ, ఎవరైనా బ్రాహ్మణులు లభిస్తే అటువంటి వారిని ఇంటికి పిలిపించి వారిచేత సూర్య నమస్కారాలను ఆచరింపజేస్తే ఆరోగ్యం చేకూరుతుంది. "ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్" "నమస్కార ప్రియ భానుః" సూర్య నారాయణ మూర్తికి ప్రీతికరంగా ఆదిత్య హృదయం పారాయణ చేయాలి. శ్రీమద్రామాయణంలో 107వ సర్గలో యుద్ధకాండలో వస్తుంది. రామచంద్రమూర్తి రావణాసురుని యుద్ధరంగంలో ఎదుర్కొనడానికి పూర్వం అగస్త్యుల వారు రాముల వారికి ఈ స్తోత్రాన్ని బోధిస్తారు. ఈ స్తోత్రాన్ని ఈరోజు 12 మార్లు స్తోత్రం చేస్తే విశేషమైన ప్రయోజనం లభిస్తుంది. ఇదివరకు చేయనివారు ఈరోజు ప్రారంభం చేయాలి. అది రథసప్తమి మనకు అందించే సందేశం.



ఆ దేవదేవుని అనుగ్రహం మన అందరిపైనా కలగాలని కోరుకొంటూ రథ సప్తమి శుభాకాంక్షలు.

Sunday, January 21, 2018

ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఒక అద్భుతమైన లేఖ ఇది. తన కుమారుణ్ణి స్కూల్లో చేర్చుతూ ఒకనాటి అమెరికన్ ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్ టీచర్ కి రాసిన లేఖ.

ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఒక అద్భుతమైన లేఖ ఇది. 
తన కుమారుణ్ణి స్కూల్లో చేర్చుతూ ఒకనాటి అమెరికన్ ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్ టీచర్ కి రాసిన లేఖ.
ఇది ప్రతి తల్లికి, తండ్రికి, టీచర్ కు, విద్యార్ధికి చేరాల్సిన లేఖ.

ప్రముఖ అనువాదకురాలు శ్రీమతి శాంత సుందరిగారు లేఖను తెలుగులోకి అనువదించి మనకు అందించారు.
---------------------------------------
" మా అబ్బాయి ఇవాళే మొదటిసారి స్కూలుకి వస్తున్నాడు.కొంతకాలం అక్కడ అంతా వాడికి వింతగానూ కొత్తగానూ ఉండబోతోంది.
అందుకే వాడితో మీరు కొంచెం సున్నితంగా ప్రవర్తిస్తారని ఆశిస్తున్నాను. ఈ సాహసకృత్యం వాణ్ణి సప్తసముద్రాలూ దాటి వెళ్ళేందుకు సాయపడవచ్చు.
ఆ సాహసాల్లో యుద్ధాలూ, విషాదాలూ, దుఃఖాలూ వాడికి అనుభవంలోకి రావచ్చు.
అలాంటి జీవితంలో వాడికి నమ్మకం, ప్రేమ, ధైర్యం తోడుగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది.
అందుచేత, దయచేసి మీరు దగ్గరుండి ప్రేమతో వాడు నేర్చుకోవలసినవన్నీ నేర్పిస్తారా? వీలైతే అవన్నీ సున్నితంగా నేర్పగలరా? 
ఒక మిత్రుడుంటే ఒక శత్రువు కూడా ఉంటాడని నేర్పండి.
అందరు మనుషులూ న్యాయంగా ఉండరనీ, అందరూ సత్యసంధులు కారనీ వాడికి తెలియాలి.
ఒక దుష్టుడున్న చోట ఒక వీరుడు కూడా ఉంటాడనీ , జిత్తులమారి రాజకీయ నేత ఉండే చోటే అంకితభావంతో పనిచేసే నేత కూడా ఉంటాడనీ చెప్పండి.
అప్పనంగా దొరికిన ఒక డాలరు కన్నా సొంతంగా సంపాదించుకున్న పది సెంట్లు ఎక్కువ విలువైనవని నేర్పండి.
స్కూల్లో మోసం చేసి పాసవటం కన్నా ఫెయిలవటం ఎక్కువ గౌరవంగా ఉంటుందని నేర్పండి.
ఓడిపోయినప్పుడు చక్కగా దాన్ని అంగీకరించటం, గెలిచినప్పుడు మనస్ఫూర్తిగా ఆనందించటం,.. నేర్పండి.
అందరితో మృదువుగా ప్రవర్తించమనీ, కఠినంగా ఉన్న వాళ్ళతో కఠినంగా ఉండమనీ నేర్పండి.
అసూయకు వాణ్ణి దూరంగా ఉంచగలిగితే బావుంటుంది. చప్పుడు చెయ్యకుండా నవ్వటం నేర్పండి.
వాడు విచారంగా ఉన్నప్పుడు నవ్వటం నేర్పగలిగితే నేర్పండి.కన్నీళ్ళు కార్చటం అవమానమేమీ కాదని నేర్పండి.
ఓటమిలో కూడా కీర్తి ప్రతిష్ఠలు ఉండవచ్చనీ, గెలుపులో నిరాశ ఉండవచ్చనీ నేర్పండి. క్రూరులను ఎగతాళి చెయ్యటం నేర్పండి.
పుస్తకాలు ఎంత అద్భుతంగా ఉంటాయో నేర్పండి, కానీ అదే సమయంలో ఆకాశంలో ఎగిరే పక్షుల గూఢమైన రహస్యాల గురించి, 
ఎండలో ఝుమ్మనే తేనెటీగల గురించి, పచ్చని కొండలమీద పూసే పువ్వుల గురించి కూడా చెప్పండి
అందరూ వాడి ఆలోచనలు తప్పని అన్నప్పటికీ, వాటిని తను మట్టుకు గౌరవించటం నేర్పండి.
అందరూ మందని అనుసరిస్తున్నా, తను అలా చెయ్యకుండా ఉండే మనోబలాన్ని మా అబ్బాయికి నేర్పండి.
అందరు చెప్పేదీ వినమనీ, సత్యమనే జల్లెడతో వడబోసి మంచిని మాత్రమే గ్రహించమనీ చెప్పండి.
తన ప్రతిభనీ, మేధస్సునీ ఎక్కువ ధర చెల్లించేవారికే అమ్మమని చెప్పండి కానీ తన హృదయానికీ, ఆత్మకీ వెల నిర్ణయించద్దని నేర్పించండి.
అసహనం ప్రదర్శించే ధైర్యాన్నీ, ధైర్యంగా ఉండేందుకు ఓర్పునీ కలిగి ఉండనివ్వండి.
ఉదాత్తమైన ఆత్మవిశ్వాసం ఉండాలనీ,అప్పుడే మానవాళి మీదా దేవుడిమీదా వాడికి ఉదాత్తమైన విశ్వాసం ఏర్పడగలదనీ నేర్పించండి.
ఇదీ క్రమం టీచర్,.. మీకు వీలైనంత వరకూ ప్రయత్నించండి.వాడు మంచి పిల్లవాడు. వాడు మా అబ్బాయి

Friday, January 19, 2018

రుచించక పోయినా ఇదే యదార్థం.

 రుచించక పోయినా ఇదే యదార్థం.

*మూసిన కన్ను తెరవకపోయినా,
*తెరిచిన కన్ను మూయకపోయినా,
*శ్వాస తీసుకుని వదలకపోయినా,
*వదిలిన శ్వాస తీయకపోయినా,
*ఈ లోకంలో ఈ జన్మకు అదే చివరి చూపు.
*మనం ఎవ్వరం అయినా సరే మనల్ని ఈ ప్రపంచం నిర్థాక్ష్యిణ్యంగా మరచిపోయేలా చేస్తుంది కాలం.

*విరోధులు స్నేహితులైనా, పశ్చాతాపపడినా, మనసు మార్చుకున్నా మరల కనిపించం.
*ఫెయిర్‌ అండ్‌ లవ్‌లీలు, సున్నిపిండితో నున్నగా తీర్చిదిద్దిన ఈ దేహాన్ని నిప్పుల కొలిమిలో కాల్చక తప్పదు.

*ఈ క్షణం మాత్రమే నీది,
*మరుక్షణం ఏవరిదో?
*ఏమవుతుందో ఎవరికి తెలుసు?

*ఈ ప్రపంచాన్ని భస్మీ పటలం చేసే అణ్వాయుథాలు నీవద్ద ఉన్నా నీ ఊపిరి ఎప్పుడు ఆగుతుందో పరమాత్మకి తప్ప ఎవరికీ తెలియదు..

*ఈ ప్రపంచాన్ని శాసించేంత గొప్పవారైనా, సంపన్నులైనా బలవంతులైనా
*అవయవక్షీణం-ఆయుఃక్షీణంను తప్పించుకోజాలరు.

*ఈ సృష్టిలో మనము మొదలు కాదు. చివర కాదు.

*ఈ దేహంలో మనం అద్దెకు ఉండటానికి వచ్చాము. అద్దె ఇంటిని విడిచివెళ్లేటప్పుడు మన సామాన్లు మనం తీసుకువెళ్లినట్టు మనం చేసిన కర్మలను మనతో మోసుకువెళ్లక తప్పదు..

*చెట్టుకి, పుట్టకి, రాయికి, రప్పకి ఉన్న ఆయుర్థాయం మనకి లేదు.
*ఈ భూమ్మీద కాలమనే వాహనంలో ఒక చోట ఎక్కి మరో చోట దిగిపోతాం. *మనం సహప్రయాణికులం మాత్రమే.

*కుటుంబం, స్నేహాలు, శత్రుత్వాలు అన్నీ భ్రమ, మాయ.
*అశాశ్వతమైన వాటిని జపధ్యానములతో ఛేధిద్దాం.
అజ్ఞానం అనే చీకటిని చీల్చే ఖడ్గం ధ్యానం.

*అందుకే మనుషుల్లా జీవిద్దాం.
మనిషి ఎలా జీవించాలో చెప్పిన రామాయణ, భారత, భాగవతాదులను ఈ జీవితం ముగిసేలోపు తెలుసుకుందాం. అందులోని సంశయాలను తీర్చుకుందాం.

*దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకోవడం అంటే పదవిలో ఉండగానే సంపాదించుకోమని కాదు.

*భగవంతుడు ఈ శరీరాన్ని ఇచ్చినందుకు నాలుగు పుణ్యకర్మలు ఆచరించి ఈ జీవకోటిలో మనిషి మాత్రమే చేయగలిగే ఉత్తమ కర్మలను ఆచరించాలని పరమార్థం.

*ఓపిక ఉండగానే నిత్యం గురువుని ఆశ్రయించి ఉపదేశంపొంది ధర్మాచరణ, కర్మాచరణ చేయాలి.

  *నిరంతరం భగవత్ ధ్యానంతోఉంటూ ,సత్యమైన మార్గం ద్వారా ధనాన్ని ఆర్జించి, తోటి వారికి పంచుతూ ,నిన్ను నీవు ఉన్నతాత్మగా పెంచుకుంటూ ఉండటమే జీవనం.

జయమంత్రo

ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు లేక ఏ నిర్ణయం తీసుకోవాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నప్పుడు మనసు దుర్భలం గా ఉన్నప్పుడు ఒక్కసారి ఈ జయమంత్రాన్ని నమ్మకం తో పఠించి స్వామి కి ఒక్క కొబ్బరి కాయ పంచదార ను నివేదించి నిర్భయంగా ముందుకు వెళ్ళండి ఒక్క సారిగా మీ మనసు తేలిక పడి యధార్థమైన త్రోవ భోధ పడుతుంది... మీ మనసు తేలిక పడిన తరువాత చిన్న పిల్లల కు పానకం వడపప్పు పంచండి చాలు ఉప్పొంగిపోతారు మారుతి.. ఇది సుందరకాండ లో స్వామి హనుమ ఇక్ష్వాకు వంశాన్ని మన తండ్రి రామయ్య నూ లక్ష్మణుడు ని సుగ్రీవుడు ని కీర్తుస్తూ సీతమ్మ కి నమ్మకాన్ని కలిగించి లంకాదహనం చేసినప్పుడు ఆనందంగా తన స్వామి వైభవాన్ని కొనియాడుతూ పని పూర్తి చేసుకొచ్చిన అద్భుత మంత్రం... 

జయత్యతి బలో రామః లక్ష్మణస్య మహా బలః !
రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభి పాలితః !!

నమోస్తు రామాయ సలక్ష్మణాయ 
తథా పితుర్మే జనకస్య రాజ్ఞా: 

దాసోహం కౌసలేంద్రస్య రామస్యా క్లిష్ఠ కర్మణః !
హనుమాన్ శత్రు సైన్యానాం నిహంతా మరుతాత్మజః !!

నరావణ సహస్రం మే యుధ్ధే ప్రతిబలం భవేత్ !
శిలాభిస్తు ప్రహారతః పాదపైశ్చ సహస్రశః !!

అర్ధయిత్వాం పురీం లంకాం మభివాద్యచ మైథిలీం !
సమృధ్ధార్థ్యో గమిష్యామి మిషతాం సర్వ రాక్షసాం !!

అస్త్ర విజ్జయతాం రామో లక్ష్మణస్య మహాబల: 
రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభి పాలితః 

హనుమానాంజనాసూనుః వాయుపుత్రో మహాబలః
రామేష్ఠ ఫల్గుణః స్సఖా పింగాక్షోమిత విక్రమః
ఉదధిక్రమణశ్చైవః సీతా శోక వినాశకః
లక్ష్మణః ప్రాణదాతాశ్చ దశగ్రీవశ్చ దర్పః 
ద్వాదశాత్మాని నామాణి కపీంద్రశ్చ మహాత్మనః
స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః
తస్యమృత్యు భయన్నాస్తి సర్వత్ర విజయీ భవేత్ 

అర్థం : మహాబల సంపన్నులైన శ్రీరామునకు జయము. మిక్కిలి పరాక్రమశాలియైన లక్ష్మణస్వామికి జయము. శ్రీరామునకు విధేయుడై, కిష్కింధకు ప్రభువైన సుగ్రీవునకు జయము. అసహాయ శూరుడు, కోసలదేశ ప్రభువైన శ్రీరామునకు నేను దాసుడను, వాయుపుత్రుడను. నా పేరు హనుమంతుడు.

శత్రుసైన్యములను రూపుమాపువాడను. వేయిమంది రావణులైనను యుద్దరంగమున నన్నెదిరించి నిలువ జాలరు. వేలకొలది శిలలతోను, వృక్షములతోను, సకల రాక్షసులను, లంకాపురిని నాశనమొనర్చెదను. రాక్షసులందరును ఏమియూ చేయలేక చూచుచుందురుగాక. నేను వచ్చిన పనిని ముగించుకొని సీతాదేవికి నమస్కరించి వెళ్ళెదను.   

ఇది పఠించిన వారికి జయం తధ్యం !!

నిత్యం పాటించ వలసిన నియమాలు

ప్రతి ఒక్క హిందువు నిత్యం పాటించ వలసిన నియమాలు

1. నిలబడి భోజనం చేయకూడదు, త్రిసంధ్యలలో నిద్రించకూడదు.
2. ఆహారం తినే ముందు దైవానికి నివేదన చేయాలి.
3. కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి రాకూడదు.
4. మూత్ర విసర్జన నిలబడి చేయకూడదు. మూత్ర విసర్జన తరువాత కాళ్ళు కడుక్కొని. పుకిలిన్చి ఇంట్లోకి రావాలి.
5. మలవిసర్జన, మూత్రవిసర్జన తరువాత కాళ్ళు చేతులు ముఖం శుబ్రంగా కడుక్కొని,
ఓం నారాయణాయ నమః,
ఓం గోవిందాయ నమః,
ఓం మాధవాయ నమః
అంటూ తలపై 3సార్లు నీళ్ళు చల్లుకొని ఇంట్లోకి రావాలి.
6. కాలకృత్యముల తరువాత స్నానం చేయకుండా వంట చేయకూడదు.
7. దైవానికి నివేదన చేయకుండా ఆహారం తీసుకోకూడదు.
8. నిలబడి భోజనం చేయకూడదు. వంటి మీద చొక్కా వేసుకుని భోజనం చేయకూడదు.
9. భుజం మీద తువాలు లేకుండా ఆహారం తీసుకోకూడదు. పూజ చేయకూడదు. కనీసం జేబు రుమాలు అయినా భుజం మీద వేసుకుని చేయాలి.
10. ఎవరైనా ఇంటికి వస్తే కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వాలి. లేదా పంపులు ఉంటాయి కదా కనీసం చూపించండి. కడుక్కొని లోపలికి వస్తారు. రాగానే నీళ్ళు తాగుతారా అని పొరపాటున కూడా అడగకూడదు. రాగానే మంచి నీళ్ళు తీసుకెళ్ళి ఇవ్వాలి.
11. ఎవరితోనైనా సరే హిత సంభాషణం మాత్రమే చేయాలి. నోరు ఉందికదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. దీనికి కూడా ఖర్చు ఏమి ఉండదు కదా!
12. భోజన సమయానికి ఎవరైనా అతిధి వస్తే భోజనం పెట్టాలి. అంతేకాని ఎంగిలి చేతితో మీరే గుమ్మం దగ్గరికి వెళ్లి ఎక్కడ లోపలికి వస్తాడేమో అని అక్కడే మాట్లాడి పంపకూడదు.
13. మనసులో ఒకమాట పైకి ఒకమాట మాట్లాడకూడదు. (భోజనం చేస్తారా అని పైకి మాట్లాడి, లోపల! భోజనాల సమయానికి వచ్చి చచ్చాడు. ఇలా మాట్లాడకూడదు.) ఏది మనసులో వుందో అదే మాట్లాడాలి.
14. నిత్య దీపారాధన చేయాలి. ఇలాంటి ఇల్లు లక్ష్మితో కళకళలాడుతుంది.
15. త్రిసంధ్యలలో నిద్రించకూడదు. ఆహారం తీసుకోకూడదు. ప్రయాణం చేయకూడదు. (ఉదయం 5:00 నుండి 5:45, మధ్యాహ్నం 12 నుండి 12:45, సాయంత్రం 5 నుండి :5:45 వరకు త్రిసంధ్యలు అంటారు)
16. ఉదయించే సూర్యుడిని దంత ధావనం (పళ్ళు తోమడం) చేయకుండా, చేస్తూ చూడకూడదు.(సూర్యోదయం కాకముందే లేచి దంతధావనం చేయాలి అని అర్ధం) తూర్పు పడమర నిలబడి పళ్ళు దంతధావనం చేయకూడదు.
17. తిట్టుకుంటూ, ఏదో ఆలోచనలు చేస్తూ వంట చేయకూడదు. మీరు చేసే ఆలోచనలు అన్ని ఆభోజనంలోకి చేరి ఇంట్లో వారిపై ప్రభావం చూపిస్తాయి.
18. తలపై చేతులు పెట్టకూడదు. తలపై మునివేళ్ళతో గోకకుడదు. రుద్దకూడదు. దీనివలన పతనావస్తకి చేరుకుంటారు.
19. ఎడమ చేతితో పొరబాటున కూడా తినకూడదు, త్రాగ కూడదు.
ఈ నియమాలను చక్కగా త్రికరణ సుద్దితో క్రమం తప్పకుండా పాటించిన వారికి మనో వాంచ నెరవేరుతుంటుంది. వారి ఇంట సిరి సంపదలకు కొరత ఉండదు.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

శుభోదయం.

ఎప్పుడూ ఎక్కువ అహాన్ని...గర్వాన్నీ
తలకెక్కించుకోకూడదు... ఎందుకంటే
పరుగుపందెంలో మొదటి బహుమతి
పొందినవారు బంగారుపతకం కోసం
తల దించవసిందే !!!

ఆశ మనిషిని బ్రతికిస్తుంది 
ఇష్టం మనిషిచేత ఏదైనా చేయిస్తుంది 
కానీ... అవసరం మనిషికి అన్నీ నేర్పిస్తుంది.

చదువుందని గర్వపడకు 
చదువులేదని భాధ పడకు 
చదువున్న లేకున్నా...
సంస్కారం ఉంటే జీవితంలో పైకొస్తాం.

మనిషిని సంస్కరించి,కుటుంబ వ్యవస్థని చక్కదిద్ది,
ఇంటిని ప్రశాంత నిలయంగా మార్చి,
తద్వారా సమాజాన్ని ఆనంద నిలయంగా 
మార్చుకొమ్మని తెలిపింది సనాతన ధర్మం.

తల్లి తండ్రుల పుణ్య ఫలం వలన 
మంచి గుణాలు,చతురత పొందుతాము.
వంశం వలన ఉదారత్వం లభిస్తుంది.
కాని స్వంత పుణ్యం వలననే అదృష్టవంతులం కాగలం.
అందుకే అందరం సత్కర్మలను చెయ్యాలి.
అంటే ఇతరులకు ప్రయోజనం కలిగించే పుణ్య కార్యాలు చెయ్యాలి.

Thursday, January 18, 2018

అమ్మ

రెండస్తుల డాబాలో మిత్రుడు పైన ఉంటాడు. వాడి తమ్ముడు క్రింద పోర్షన్లో.
మాటల మధ్యలో వాడు అమ్మ సంగతి చెబుతూ అమ్మ తన దగ్గర పదిహేను రోజులు, తమ్ముడి దగ్గర పదిహేను రోజులు ఉంటుందని, అలా బాధ్యతలు పంచుకున్నామని చెప్పాడు.
మనస్సు చివుక్కుమంది. ఏ సీజన్ లోనైన ఎండిపోని ధార కన్నీరు బైటకు రాబోయింది. అప్పుడు అనుమానం వచ్చింది. ఏయే నెలల్లో ముప్పయిఒక్క రోజులుంటాయో ఆరోజుల్లో అమ్మ ఉపవాసము ఉండాల్సి వస్తుందా...
అదృష్టం నా అమ్మను నాతో పంచుకోడానికి నాకు తమ్ముడు లేడు.
నాకు అమ్మ ఒక మధుర జ్ఞాపకం.
తనకు నా ఆకలి ఎప్పుడు చెప్పాల్సిన అవసరం రాలేదు...
కొత్త బట్టలతో బైటకు వెళ్లివస్తే వెంటనే దిష్టి తీసేది...
పరీక్షలకు బయలుదేరితే తీపిపెరుగుతో ముందు నిలిచేది...
బాల్యంలో నా పిచ్చి భాషను క్షణంలో పసికట్టేది....
ఇలా ఎన్నో ఎన్నెన్నో....
పసిబిడ్డ ఒక స్థనంలో పాలు తాగుతూ, రెండో స్థనాన్ని పలుమార్లు తన్నుతూ ఉంటాడు.
తనను తన్నే వారి కడుపు నింపే ఔదార్యం భగవంతుడు ఒక్కఅమ్మకు మాత్రమే ఇచ్చాడు....
అమ్మ ఒక వేదం...
అమ్మ ఒక భక్తిభావం...
అమ్మ ఒక ప్రేమరూపం..
అమ్మ ఒక సంవేదన...
అమ్మ ఒక భావన...
అమ్మ ఒక పుస్తకం...
అమ్మ ఒక కలం...
అమ్మ ఒక కవిత...
అమ్మ ఒక జ్ఞానం...
అమ్మ ఒక గుడిలో దీపం...
అమ్మ ఒక హారతి పళ్లెం...
అమ్మ ఒక సుకుసుమం...
అమ్మ ఒక చల్లని చిరుగాలి...
అమ్మ ఒక అన్నపూర్ణ...
అమ్మ ఒక లాలిత్యం...
అమ్మ ఒక చీరకొంగు...
అమ్మ ఒక కరుణ...
అమ్మ ఒక దీవెన...
అమ్మ ఒక అక్షిత....
అమ్మ ఒక వర్షపు బిందువు...
అమ్మ ఒక మధురగేయం...
అమ్మ ఒక శ్వాస...
అమ్మ ఒక వూపిరి...
అమ్మ ఒక మురళి గానం...
అమ్మ ఒక జోలపాట...
అమ్మ ఒక పచ్చదనం...
అమ్మ ఒక కనురెప్ప...
అమ్మ ఒక దేవత...
అమ్మ ఒక పుడమి...
అమ్మ ఒక స్వచ్ఛత...
అమ్మ ఒక ప్రవచనం...
అమ్మ ఒక వెలుగు...
అమ్మ ఒక సుగుణం...
అమ్మ ఒక నమ్మకం...
అమ్మ ఒక ఆరోగ్యం...
అమ్మ ఒక భద్రత...
అమ్మ ఎన్నో ఎన్నెన్నో.......
ఇది చదివిన వారికి ఇంతమంది అమ్మలు జీవించిఉన్నారో, మరణించినారో తెలియదు. కాని ఒక్క మాట చెప్పగలను ఎవరు అమ్మ దగ్గర ఉంటారో వారు అతిసంపన్నులు. అమ్మ సేవ భాగ్యం కలిగివుంటారో ధన్యులు,అదృష్టవంతులు....
రచన...అన్నాప్రగడ వేంకట నరసింహారావు
Received message forwarded.

వచ్చే పండుగ కోసం ఎదురుచూద్దాం

పండగలు ముగిసాయ్, వాటితో సెలవులూ ముగిసాయ్..

హృదయాలు బరువు అయ్యాయ్, జేబులు ఖాళీ అయ్యాయ్..

అత్తగారిళ్ళు బోసిపోయాయ్, స్టాండ్లు, స్టేషన్లు పోటెత్తాయ్..

రామని పసి హృదయాలు ఘోషించాయ్, మళ్ళీ ఉగాదికొద్దామని మాతృ హృదయాలు ఊరడించాయ్..

పందేల్లో గెలిచిన పుంజులు హీరోలయ్యాయ్.. ఓడిన పుంజులు కూరలయ్యాయ్..

పేకాట్లో ఓడిన డబ్బులతో ఏడుపులొచ్చాయ్.. గెలిచిన డబ్బులతో పార్టీలయ్యాయ్.. 

ఏడిస్తే క్రీడాస్ఫూర్తి లేదన్నారు.. గెలిస్తే టైం బాగుందన్నారు..

ఈ మూడు రోజుల పండుగ ఆనందం మన మనసులో పదిలం.

ఈ ఆనంద సౌరభం యేడాదంతా మనసున  నిలుపుకొని వచ్చే పండుగ కోసం ఎదురుచూద్దాం మిత్రులారా. ఏమంటారు?

Wednesday, January 17, 2018

తిరుగు ప్రయాణ భారం

వీడలేక... వెల్లలేక... వదల్లేక... 😔😢  వీధి చివర వరకు చెయ్యి ఊపి 'టాటా చెప్పిన అమ్మ' మనసులో బాధ కొండంత అయింది.....  జేబు లో డబ్బులు పెట్టి 'జాగ్రత్త రా నాన్న!!' అంటూ తిడుతూ జాగ్రత్తలు చెప్పే నాన్న నోట మాట లేదు....  సెలవులు ముగించుకుని పట్టణానికి బయలుదేరిన ఉద్యోగస్తులు, విద్యార్థులు బరువైన హ్రుధయాలతో ఏదో కోల్పోయిన బాధలో ఉన్నారు...  పండుగ అయిపోయింది...  సందడి ఆగిపోయింది... ఊరు  మూగపోయింది...  అయినా సరే మీ కోసం మీ ఊరు  ఎదురు చూస్తూ ఉంటుంది.  ఆ కేరింతలు మల్లి వస్తాయిలే అన్న భరోసా తో మీ కోసం వేచి చూస్తూ ఉంటుంది. ఎక్కడికెళ్లినా మన ఊరు మరువకండి.  మన మూలాలు బలంగా ఉండాలి.  మన ఊరు  బాగుండాలి.  జాగ్రత్తగా వెళ్లి రండి. ఇక్కడ మీ కోసం కొన్ని ప్రాణాలు ఎదురు చూస్తున్నాయ్....

Tuesday, January 16, 2018

మరువం: తోటపనితో నాలో నేను-8

మరువం: తోటపనితో నాలో నేను-8: “గులాబీల తావులీనే కులాసాల జీవితాల విలాసాలివే, వికాసాలివే” - సముద్రాల రాఘవాచార్యులు గులాబీ తో ఎవరెవరికి ఎలాటి అనుబంధమో, అదెంత మధురభావనయో ...

Monday, January 15, 2018

చిన్నప్పుడు వీట్లని మేం ముగ్గులనేవాళ్ళం. సంక్రాంతి స్పెషల్ యివి.

చిన్నప్పుడు వీట్లని మేం ముగ్గులనేవాళ్ళం. సంక్రాంతి స్పెషల్ యివి.
అక్కావాళ్ళూ, వాళ్ళ నేస్తురాళ్ళూ. ఇంకా యింటోవున్న బొట్టికాయ చెళ్ళెళ్ళూ, డిప్పకాయ వెధవలూ అక్కా మేమూనే అంటూ తయారు. పొద్దున్నే ఏ నాలుగింటికో చిన్న దీపంబుడ్డి పక్కన పెట్టుకోని ఏ పదార్చుక్కల్తోనో మొదలెడితే... యిహన్నా కొంపల్లోకి తగలడ్తారా లేదా, హవ్వ్వ... ఆ సూన్నాణమూర్తి తెల్లఘా సగవాఁకాశం నిండా వొచ్చే. ఈడొచ్చినాడపిల్లలు, మొహం కడుక్కోవాలన్న ఙానవుఁడక్కర్లా? లక్ష్వీ అమ్మవారికాగ్రహం అన్న యింగితవన్నా లేకండానూ... అని వీధిలో ఏ మామ్మో కోప్పడితేగాని ఆ రథం ముగ్గో, చక్రం ముగ్గో పూర్తయ్యేదికాదు. పైనించీ గొబ్బెమ్మలు, వాటిమీదిన్ని గుమ్మడీ, కారబ్బంతులూ, ముద్దబంతి పూలూ, గుప్పెడు పసుపూ, కుంకం... కళ్ళు చెదిరేట్టుగా అలంకారం!!
ఈమధ్యలో విరిగిన సన్నాయి డోళ్ళతో ఓ డజను గంగిరెడ్లూ, పదిమంది హరిదాసులూ, తలో దోసెడు బియ్యం.
ఇదో యిందాక భడవాకానల్లాలా... అన్తిట్టిపోసిన మామ్మే మళ్ళీ నాగౌరమ్మే, నామహలక్ష్మే.. వీధంతటికీ నీ ముగ్గేనే అందం తల్లీ.. అని మెటికలు విరిచి మరీ ఒక్కోళ్ళకూ ముద్దులు. మహరాజంటి మొగుడొస్తాడని దీవెన్ల కొసర్లు. అట్నుంచీ కాసిని, ఛీ.. పో మామ్మాలూ, సిగ్గులూ...
ఆ పైన తలంట్లూ, కొత్తబట్టలూ. ఇల్లిల్లూ ఓయబ్బ, ఒకటే కోలాహలం. సంబరం.
సాయంత్రం మరి బొమ్మలకొలువు పేరంటం కద! ఇంట్లో అన్నయ్యగాళ్ళ మీద అథార్టీ, పెత్తనం. మెట్లు తక్కువనో, ఎక్కువనో, ఎత్తనో, పైన పరచిన దుప్పట్లు మడతలనో... వాడి నడుం విరిగిందాకా గోల. ఆఁ! దేనికిరా ఆ ఇస్సూలూ.. ఇంటాడపడుచుకామాత్రం బొమ్మలకొలువు ముచ్చట తీర్చడానికే అలుపా, ఆట్ఠే ఏంజేసేవు గాడ్దెకానా.. అని అమ్మో, అత్తయ్యో, అవతలింటి పిన్నో అదిలింపు.
సాయంకాలం పేరంటం ముందు కొత్త లంగా ఓణీ, బోల్డు కొత్త గాజులు, గోరింటాకు పండిన ఎఱ్ఱటి చేతుల్తో ఇదిగోరా అన్నయ్యా అని కాసినక్షింతలు చేతికిచ్చి చటుక్కున వొంగి కాళ్ళకు దణ్ణం పెడితే, ఏవిటో.. నడుంనెప్పి మాయం. నా చెల్లెలు యిదన్న మురిపెం. లోకం దాని కాల్చెప్పుకు సరితూగదన్న గర్వం. ఎందుకో కంటో చుక్క నీళ్ళు తిరిగితే అమ్మా నాన్నా చూడకుండా తుడుచుకునే ప్రయత్నం. మొహానింతో వెఱ్ఱి నవ్వుతో యింటో దుమ్మని వూరుకోటం.
చూసికూడా అమ్మ చూణ్ణట్టూర్కోటం. చెల్లెళ్ళంటే ఎంత గారాబమో పిచ్చినాయనకని మనసులో కొండంత సంతోషం.
వొచ్చిన పేరంటాళ్ళకి రండ్రండని నవ్వుతూ ఆహ్వానం. అందరూ కలిసి ముచ్చట్లూ, మెహర్బానీలూ, పిల్ల సన్నాసులకు మరిన్ని భోగిపళ్ళూ, ఓటో నాలుగో చిల్లర పైసళ్ళూ.
వెరసో రెండు మంగళహారతులు. పండూ శనగలూ తాంబూలం వాయనం. మరి మేం వెళ్ళోస్తామంటూ మెల్లగా ఎవరిళ్ళకు వాళ్ళు తరలడం.
సంక్రాంతి. మాయింటి పండుగ. మనందరి పండుగ. ప్రతి తెలుగింట కన్నుల పండుగ.
ఈ సంతోషాన్ని తుడిచివేస్తూ ఈవాళ దీన్ని పొంగల్ అనీ, రంగోలీ అనీ, డాల్ షో అనీ జుగుప్సాకరంగా TVలో కించపరుస్తుంటే, తరతరాలకీ మీరు సర్వనాశనమైపోండని శాపం పెట్టాలన్నంత కచ్చ! ఎంత పాపిష్ఠి జన్మలైనా పండగరోజు మనమెందుకు నోరు పారేస్కోవాలని మళ్ళీ మనసుకు సర్దిచెప్పుకోవటం....

Saturday, January 13, 2018

తిరుప్పావై 28వ రోజు పాశురము


Image result for తిరుప్పావై 28వ రోజు పాశురముకఱవైగళ్ పిన్ శెన్ఱు కానమ్ శేర్-నుంద్-ణ్బోమ్
అఱివొన్ఱు మిల్లాద వాయ్-క్కులత్తు, ఉన్ఱన్నై
ప్పిఱవి పిఱన్దనై పుణ్ణియమ్ యాముడయోమ్
కుఱైవొన్ఱుమిల్లాద గోవిందా, ఉందన్నో
డుఱవేల్ నమక్కు ఇంగొరిక్క వొరియాదు
అఱియాద పిళ్ళైగళోమ్ అంబినాల్, ఉన్ఱన్నై
చ్చిఱు పేర్-అళైత్తనవుం శీఱి యరుళాదే
ఇఱైవా! నీ తారాయ్ పఱై ఏలోర్-ఎంబావాయ్
ఇన్నిరోజులు స్వామిని రకరకాల పేర్లతో పిలిచినా, నిన్న స్వామి కష్టపడి సంపాదించిన నామం "గోవిందా" అని పిలవడంచే స్వామికి సంతోషం వేసింది. వీళ్ళకు నిజంగా ప్రేమ ఉందా లేదా అని పరిశీలించి గాని అనుగ్రహించడు. భగవంతుని చేరే ఉపాయాలు కర్మ, భక్తి, జ్ఞానం ఇవన్నీ మనం సంపాదించాలి. చివరికి భగవంతుడు అనుగ్రహిస్తే తప్ప అవి మనకు లభించవు. పరమాత్మను ఏం తయారు చేయాల్సిన అవసరం లేదు. అందుకే ఆయనను సిద్దోపాయం అని అంటారు. ఇలా ఉపాయాలు రెండు రకాలు, ఒకటి మనం సాదించాల్సిన కర్మ, జ్ఞానాదులు ఇక రెండోది సిద్దమైన ఉన్న పరమాత్మ. అందుకే మనవాళ్ళు కర్మ జ్ఞానాదులపై ఆధారపడిన వాళ్ళం కాదు, నిన్నే ఉపాయంగా కోరుతున్నాం "హే గోవిందా" నిన్నే నమ్మి వచ్చాం అని చెప్పారు. అయితే సిద్దోపాయం కోరిన వారు కూడా ఆరు విషయాలు ఆవిష్కరించాల్సి ఉంటుంది.
అవి ఏమిటంటే
1. తమంతట తాము ఈ ఫలితాన్ని పొందడానికి ఆర్జించినది ఏమి లేదు అని స్పష్టం చెయ్యాలి.
2. తమలో ఆ ఫలితాన్ని పొందే యోగ్యతలేమి లేవు కనుక తమ వద్ద లోపం ఉన్నదని స్పష్టం చేయాలి.
3. ఇక మనల్ని అనుగ్రహించటానికి భగవంతునిలో సమస్త కళ్యాణ గుణ పూర్తి ఉందని అంగీకరించాలి.
4. ఆయనకీ మనకు విడదీయరాని సంబంధం ఉందని వేదం చెబుతుంది, ఈ విషయం మనకు తెలుసును అని చెప్పాలి.
5. మన దోషాలని క్షమించమని ప్రార్థించాలి.
6. వెంటనే వాడి సేవ అనే అనుగ్రహం పొందడానికి మనలోని ఆర్తిని చూపించగలగాలి.
ఈ ఆరూ లేకుంటే వాడిని చేరే యోగ్యత లేనట్లే!!
Image result for తిరుప్పావై 28వ రోజు పాశురముఏదైనా మనం ఒక వైద్యుడి వద్దకు వెళ్ళినప్పుడు మనం ఏం చేసి ఈ రోగం తెచ్చుకున్నాం, దాన్ని తగ్గించుకొనే శక్తి మనలో లేదు, దాన్ని తగ్గించగల యోగ్యుడవు నువ్వు అని చెప్పాలి, నిన్ను నమ్ముకుని వచ్చాను అని అయనతో సంబంధం గురించి చెప్పాలి, జబ్బురాకుండా మళ్ళీ ఆ తప్పులు చెయ్యనని చెప్పాలి, త్వరగా తగ్గించండి అంటూ త్వరను తెలుపాలి. అప్పుడు గాని ఆ వైద్యుడు మందు ఇవ్వడు. అదే మన స్వంత ప్రవృత్తి చూపితే అదేదో నువ్వే చూసుకో అని వదిలేస్తాడు. లోకంలో వ్యాదిని నయం చేయటానికి ఎన్నో మందులు ఉండవచ్చు, వైద్యుడు వేరే మందు వేరే. అయితే ఈ సంసారం అనే వ్యాది నివారించాలి అంటే వైద్యుడూ, మందూ అన్నీ శ్రీకృష్ణుడే. అందుకే మనవాళ్ళు శ్రీకృష్ణుడిని "వైద్యో వైద్యః" చక్కటి వైద్యుడు సుమా!! అని చెబుతారు.
అయితే మనవాళ్ళంతా నీవే మాకు మందువు అని వచ్చారు, అయితే ఇంకా వీళ్ళల్లో కర్తుత్వ భావనలు ఏమైనా ఉన్నాయా అని పరిక్షిస్తాడు. అవి ఏం లేవని తెలిస్తే వెంటనే అనుగ్రహిస్తాడు. ఈ రోజు మనవాళ్ళు మాకు కర్మ, జ్ఞానం, భక్తి ఇవన్నీ ఏమి లేవు అని చెబుతున్నారు, దీన్నే ఉపాయ నిష్కర్ష అని అంటారు. సాధనా స్వరూపాన్ని స్పష్టం చేస్తున్నారు.
మొదట మేం అంటూ ఆర్జించుకున్నవి కర్మ, జ్ఞాన, భక్తి, ప్రపత్తి ఇవన్ని ఏమి లేవు. ఇవి లభించాలి అంటే వేదాధ్యయణం చేయాలి, ఒక గురువుని ఆశ్రయించాలి, ఆ గురువు జ్ఞానంచే శీలంచే వృద్దుడై ఉండాలి. అలాంటి గురువు వెంట కదా వెళ్ళితే అవి ప్రాప్తిస్తాయి. మరి మేమో "కఱవైగళ్ పిన్ శెన్ఱు" పాలిచ్చే పశువుల వెంట నడిచే వాళ్ళం. మా గురువులు పశువులయ్యా. అవి కూడా పాలు ఇస్తేనే మేం పోషిస్తాం. లేకుంటే లేదు.
ఇది కర్మ అని కూడా భావించం, కర్మయోగానికి ఏవో కొన్ని నియమాలు ఉంటాయి. "కానమ్ శేర్-నుంద్-ణ్భోమ్" అడవుల వెంట పడి తింటూ తిరిగే వాళ్ళం. ఎలాంటి నియమాలు లేని వాళ్ళం. ఇక మెల్లగా కర్మపై పట్టు తొలగితే కదా జ్ఞానం ఏర్పడేది, ఇక జ్ఞానం లేనప్పుడు భక్తి కలిగే ప్రసక్తే లేదు. మేం "అఱివొన్ఱు మిల్లాద వాయ్-క్కులత్తు" ఎలాంటి జ్ఞానం, భక్తి లేని గొల్ల కులానికి చెందిన వారమయ్యా. మరి స్వామి ఏం లేకుంటే ఎందుకు వచ్చారు అన్నట్టుగా వీళ్ళకేసి చూసాడు. మరి ఇవన్నీ లేని మేం ఎందుకోసం వచ్చామంటే "ఉన్ఱన్నై ప్పిఱవి పిఱన్దనై పుణ్ణియమ్ యాముడయోమ్" మాకోసం మమ్మల్ని వెతుక్కుంటూ మా మద్య ఉంటూ మేం పండిచనక్కర లేని ఒక పుణ్యం మావద్ద ఉందయా, అది నువ్వు.
"కుఱైవొన్ఱుమిల్లాద గోవిందా" కళ్యాణ గుణ పూర్తి కల వాడివి, ఏలోటు లేని వాడివి. మాలోటు తీర్చగలిగే వాడివి గోవిందా. "ఉందన్నో డుఱవేల్ నమక్కు ఇంగొరిక్క వొరియాదు" నీకూ మాకూ ఒక సంబంధం ఉంది, తెంచుకున్నా తొలగేది కాదు. సూర్యుడికి కాంతికి ఉన్న సంబంధం. ఎవరు వద్దు అనుకున్నా తొలగేది కాదు. "అఱియాద పిళ్ళైగళోమ్ అంబినాల్" ఇన్నాళ్ళు తెలియక రకరకాల పేర్లతో పిలిచాం తెలియక, చిన్న పిల్లలం, పట్టించుకుంటారా. "ఉన్ఱన్నై చ్చిఱు పేర్-అళైత్తనవుం" చిన్న పేర్లు అనుకొని పిలిచాం, పొరపాటు చేసాం, నీవు సంపాదించుకున్న గొప్ప పేరు గోవిందా అది మేం ఇప్పుడు తెలుసుకున్నాం. "శీఱి యరుళాదే" కోపించక అనుగ్రహించు. "ఇఱైవా! నీ తారాయ్ పఱై" మాకందరికి స్వామివి, మాకు ఏం తెలియదని అనుగ్రహించకుండా ఉండేవు, నీవు నీవాళ్ళను అనుగ్రహిస్తే ఎవరు దూషిస్తారు. అనుగ్రహించు.

శుభ సాయంత్రం


మనం ఎప్పుడూ ఆనందంగా ఉండటం సాధ్యం కాకపోవచ్చు 
కానీ ఆ ఆనందాన్ని ఇతరులకి పంచడం సాధ్యమే కదా!!

అభిమానం సంపాదించడానికి 
ఆస్థులు..అంతస్తులు అవసరంలేదు 
మంచిపనులు చేసి మంచిపేరు తెచ్చుకుంటే 
అందరూ నీ అభిమానులే అవుతారు.

వేలాది వ్యర్ధమైన మాటలకన్నా వినగానే 
శాంతిని ప్రసాదించే సార్ధకమైన మాట ఒక్కటి చాలు!!!

శరీరానికి వ్యాయామం ఎలాంటిదో
మనస్సుకు చదువు కూడా అలాంటిదే.

అనుభవించడంకంటే అనుభవం కోసం ఎదురు చూడటంలోనే 
మనిషి జీవితం ఎక్కువకాలం గడిచిపోతుంది.

Friday, January 12, 2018

తిరుప్పావై 27వ రోజు పాశురము


కూడారై వెల్లుమ్ శీర్ గోవిందా, ఉన్ఱనై
ప్పాడి పఱైకొండు యామ్ పెరుసమ్మానమ్
నాడు పుకరం పరిశినాళ్ నన్ఱాక
శూడగమే తోళ్ వళైయే తోడే శెవి పువ్వే
పాడగమే యెన్ఱనైయ పల్కలనుమ్ యామణివోమ్
ఆడైయడుప్పోం అతన్ పిన్నే పాల్ శోఱు
మూడనెయ్ పెయ్దు మురంగైవరివార
కూడి ఇరుందు కుళిరుంద్-ఏలోర్ ఎంబావాయ్
లోకంలో విగ్రహాన్ని కొందరు ధనం క్రింద మార్చుకోవటానికి వాడుకుంటారు, దాన్ని కొందరు వస్తువుగా పెట్టి వ్యాపారం చేయాలని అనుకుంటారు, మరి కొందరు దాని నుండి రాజకీయాలు చేస్తారు. ఏఒక్కరో నూటికి “కశ్చత్ మామ్వేహి తత్వతః” రెండో అధ్యాయంలో తానే చెప్పి వాపోయినట్లుగా, ఆతత్వాన్ని వినియోగించుకొని ఆతత్వాన్ని సాక్షాత్కరించుకొని మన ఉజ్జీవనకోసం వచ్చిన రూపం ఇదీ అని విశ్వసించడం సామాన్యమైన విషయం కాదు. మనస్సు ఎంతో పరిపక్వం అయితే తప్ప లభించే స్థితి కాదు కూడా. ఆ స్థితి మనకు లభించాలి అంటే మనకు కూడా కొంత తెలుసును అనే అహంభావం తొలగాలి. నేనేదో నా ప్రయోజనం పొందాలి అనే స్థితి తొలగాలి గొల్ల పిల్లల మాదిరిగా. కృష్ణుడు చెప్పిందే తమకు జ్ఞానం తప్ప తమకంటూ ఒక జ్ఞానం లేనే లేదు. వారికి చేరాల్సిన స్థానం శ్రీకృష్ణుడే తప్ప వేరే గమ్యం కూడా తెలియదు. కనుక సాధనము, సాద్యము, జ్ఞానము, జ్ఞేయము, నడిపేది సర్వం శ్రీకృష్ణుడే అనే పరిపూర్ణ విశ్వాసం కలవారు గొల్ల పిల్లలు. అందుకే వారికి పరమాత్మ సర్వాత్మనా లొంగే ప్రవర్తించాడు, వారికి ఏ ఆటంకాలు వచ్చినా తొలగించాడు. ఇది లోకంలో ఉండే జీవుల్లలో ఎవరు తననే సర్వమూ అని భావించి, తన ఆజ్ఞని శిరోధార్యంగ స్వీకరించి ఎవరు తన మార్గంలో పయనిస్తారో అలాంటి వారి కోసం విగ్రహరూపంలో ఉండే తానే ఏమైనా చేయగలను అని నిరూపించటమే ఆండాళ్ తల్లి భగవంతుని యొక్క వాక్కుగా మనకు చూపించే సారం. తాను ఒక అర్చామూర్తిని విశ్వసించింది, ఫలితాన్ని తను పొందింది. భగవంతుణ్ణి మనం విశ్వసించాలి అంటే అది విగ్రహ రూపంలోనే, మరొక చోటికి ఎగరటానికి ప్రయత్నం చేసి కూడా వ్యర్థం. విభవానికి మనం పోలేం, లోపల ఉండే అంతర్యామిని మనం చూడలేం, పరమపదం మనకు ఊహకికూడా అందనటువంటిది, కనిపించేరూపం భగవంతుడిది అర్చారూపం మాత్రమే. విగ్రహంలో భగవంతుడు కాదు మన సాంప్రదాయం, విగ్రహమే భగవంతుడు అని మన ఆగమాలు నిరూపించే సిద్దాంతం. దాన్ని నమ్మిన ఆండాళ్ దాన్నే మనకు ఆదేశించింది, దాన్నే ఉపదేశించింది. శ్రీకృష్ణ అవతారంలో తాను మన దగ్గర ఉన్నప్పుడు సౌలభ్యాన్ని మనకు చూపించాడు, నేను నీకు కూడా ఎందుకు అందను నన్ను విశ్వసించండి అని అదే విషయాన్ని గోదాదేవి వద్ద నిరూపించినట్లే మన దగ్గర నిరూపించటానికి ఈనాడు మన వద్ద అర్చామూర్తియై ఉన్నాడు. కావల్సింది మనలో ఉండే విశ్వాసం.
శ్రీకృష్ణుడు ఒకనాడు దివ్య అనుభవం అనేది ఎట్లా ఉండాలో చూపించాలని అనుకున్నాడు. అందుకే సద్దులు ఆరగించుట అనే అద్భుతమైన లీలను తన చుట్టు ఉండే గొల్ల పిల్లలకి చూపి వాళ్ళని ఆనందంతోటి ఉన్మస్తక స్థితిలోకి తీసుకుపోయాడు. అయితే దాన్ని విశ్వసించటం చతుర్వేద అధ్యేతను నేను అనుకున్న చతుర్ముఖ బ్రహ్మ లాంటి వారికి కూడా అర్థం కాలేదు. చివరికి వారికి పాటం నేర్పి జ్ఞానోదయం కలిగించాల్సి వచ్చేంత వరకు. శ్రీకృష్ణుడు ఒకనాడు తన చుట్టూ ఉండే గొల్ల పిల్లలందరికి చెప్పాడు, రేపటి నాడు మనం అంతా వనభోజనాలతో విందు చేసుకుందాం, ఎవరెవరి ఇళ్ళలోంచి వారికి వారికి తోచినవి ఏవేవో తెచ్చుకోండి అని చెప్పాడు. అందరూ తెచ్చుకున్నారు, తాను తెచ్చుకున్నాడు. ఆందరిని చుట్టూ కూర్చోబెట్టాడు, ఒక్కొక్కరి వస్తువులని రుచిచూడటం ప్రారంభించాడు, అందంగా వారు తయారుచేసిన వైనాన్ని పొగడుతూ తాను ఆరగిస్తూ వాళ్ళకి ఆరగింపు చేస్తూ అద్భుతమైన ఆనందాన్ని వాళ్ళకి అందిస్తూ, తాను ఆనందం పొందుతున్నాడు శ్రీకృష్ణుడు. అయితే ఒక పిల్లవాడు తన ఇంటి దగ్గరి నుండి తెచ్చుకున్నవి గంజి నీళ్ళు అవడంతో, కృష్ణుడికి ఎలా ఇవ్వడం, కృష్ణుడు తన దగ్గరికి వచ్చేలోపు తాగేయ్యాలని గబగబా త్రాగటం మొదలు పెట్టాడట. అయితే కృష్ణుడు తనపై ప్రేమతో తెచ్చిన ఆ గొల్లపిల్లవాడి సంబంధం కల్గిన పదార్థం తనకు దొరకకుండా పోతుందేమోనని దిగులు చెంది, గబగబా వెళ్ళి వాడి సెలవుల నుండి కారుతున్న గంజిని తాగటం ప్రారంభించాడు. దీన్ని చూసి చతుర్ముఖ బ్రహ్మకి ఏం అర్థం కాలేదు. వేదాధ్యయణం చేసినవాడాయే నిప్పుని కూడా కడిగి తీసుకొనే ఆచారవంతుడు, తనకు ఈ విషయం నచ్చలేదు. జగత్ కారణ తత్వం ఇలా ఎంగిలి మంగళమా చేసేది అని అనుకున్నాడట బ్రహ్మ. అయితే, ఈ పిల్లవాడు ఏదో ఇంధ్రజాలం చేస్తున్నాడు, వీడికి బుద్ది చెప్పవలెనని బ్రహ్మగారు అనుకున్నారు, గోవులను గోపబాలురను దాచాడం, తరువాత బ్రహ్మ లోకంలో బ్రహ్మకు ఆదరణ లేకుండా కృష్ణుడు చెయ్యటం, ఆపై బ్రహ్మకు బుధ్ధి రావడం జరిగాయి. ఆనాడు ఆ పిల్లలకందరికి సద్దులు ఆరగించే అనుభవాన్ని కృష్ణుడు అందించాడు, మోక్షానందం ఏమిటో చూపించాడు.
అయితే మోక్షం అనగా ఏమి ?
మోక్షం అనగా ఆనందించుట, దీనిపై రక రకాల ప్రశ్నలు ఉన్నాయి. ఉపనిషత్తులు మోక్షంలో జీవుడు ఎలా ఉంటాడో అని ప్రశ్న వేస్తూ, “బ్రహ్మవిత్ ఆప్నోతి పరం” అని చెప్పాయి. ఆంటే ఆనందం అనేది తెలుసుకున్నవాడు ఒక గొప్ప స్థితిని లేక పరంను పొందును.
అయితే ఆ పరం ఎలా ఉండును ? అని త్తైత్రీయ ఉపనిషత్తు వర్ణించింది ఇలా “ఆప్నోతి” అంటే పొందటం, లేక తినటం లేక అస్నుత అని చెప్పింది. “సోహాస్నుతే సర్వాన్ కామాన్ సహ బ్రహ్మణాభి పశ్చితేభిః" . సహ - ఈ ముక్త జీవుడు అస్నుతే- ఆరగించును. దేనిని? సర్వాన్ కామాన్ - దేన్నైతే జీవుడు కోరుకుంటాడో దాన్ని. మరి జీవుడు ఏమి కోరుకుంటాడు ? భగవంతునిలోని కళ్యాణ గుణాలను కోరును. దీన్నే వేదం ఇలా చెప్పింది. "తస్మిన్ యదంతః తదుపాసితవ్యం" అంటే తస్మిన్ - ఆ పరమాత్మ యందు, అంతః - యత్ - లోపల ఏదైతే కళ్యాణ గుణ సంపద ఉన్నదో, తదుపాసితవ్యం- ఆ ధనాన్ని కోరదగును అని చెప్పింది. సర్వాన్ కామాన్ - అన్ని కళ్యాణ గుణములను మరి ఎట్లా అనుభవించును? బ్రహ్మణాభి - పరమాత్మతో, సహ-కలిసి పశ్చితేభిః- అనుభవించును. అయితే సంస్కృత వ్యాకరణంలో "తో కలసి" అని చెప్పేప్పుడు భోగ్య సహచర్యం మరియూ భోతృ సహచర్యం అని రెండు ఉంటాయి. రాజుగారితో మంత్రి కలిసి వచ్చెను అన్నప్పుడు రాజుగారికే ప్రాధాన్యత ఉంటుంది. భోతృ సహచర్యం అంటారు. అయితే భగవంతుడు తన కళ్యాణ గుణాలతో కలిసి ఎప్పటికీ ఉంటాడు, గుణాలను విడదీసి అనుభవించటం అనేది జరగదు. ఇక జీవుడు భగవంతుడిలో ఏకం అవడం అనేది జరగదు. ఉపనిషత్తులు చెబుతూ "తమః పరేదేవే ఏకీ భవతి" ఏకీ భావమే పర్యవసానం తప్ప, "ఏకం భవతి" అని చెప్పట్లేదు, ఇది గుర్తుంచుకోవాలి. "ఏకీ భవతి" అంటే ఒకటివలె అగును అని వ్యాకరణం చెబుతుంది. మరి జీవుడు పరమాత్మలో ఐక్యం కాడు, జీవుడు పరమాత్మను చేరును. చేరి ఏమగును? ఎక్కడో మూలన పడి ఉండునా, అలా పడి ఉంటే దాన్ని కైవల్యం అంటారు. మరి ఏమగును? అంటే జీవుడు పరమాత్మను ఆయన గుణములతో అనుభవించును. మరి గుణములతో అనుభవించటం అంటే ఏంటి? ఇది అర్థం అవడం కష్టం. గుణములను చూడలేం, లెక్క పెట్టలేం. బ్రహ్మం అంటే తెలియదు, గుణం అంటే తెలియదు, ఇక అనుభవించటం అంతకన్నా తెలియదు. దీన్ని అర్థం చేసుకోవడం అంత సులభం కాదు. అందుకే వేదవ్యాస భగవానుడు "శ్రీకృష్ణభగవానుడు సద్దులు ఆరగించే కార్యక్రమాన్నే మోక్ష అనుభవం అని చెప్పాడు" ఒకడు అనేకమందితో కలసి తన సంతోషాన్ని వారికి పంచుతూ వారి ఆనందాన్ని తాను పొందుతూ అన్నం తినెను. ఇదే కదా కృష్ణుడు చేసిన సద్దులు ఆరగించే లీలలో ఉన్నది.
వేదం మోక్షాన్ని అన్నం తినడం అనే దానితో పోల్చి చెబుతుంది. మోక్షంకి వెళ్ళాక "అహం అన్నం అహం అన్నం అహమన్నాదో అహమన్నాదో" అంటూ సాగుతుంది. అయితే ఉపనిషత్తులు అన్నం అంటే "అద్యతే అత్తిచ భూతాని తస్మాద్ అన్నం తదుచ్యతే ఇతి" అద్యతే - క్రమంలో తింటే తృప్తినిస్తుంది, అత్తిచ భూతాని - క్రమం తప్పి తింటే అది మనల్ని తినేస్తుంది, అంటే శరీరం పాడైపోతుంది అని అర్థం. అందుకే క్రమంలో తినే దాన్నే అన్నం అంటాం. అయితే జీవుడు మోక్షానికి వెళ్ళాక భగవాన్ అహం అన్నం - నేను నీవు అనుభవించటానికి అని అంటాడట. అయితే భగవంతుడు లేదు అహం అన్నం - నేను నీవు అనుభవించటానికి అని అంటాడట. అయితే జీవుడు అహమన్నాదో - నేను ఆ అన్నాన్ని అనుభవించే వాడిని అని అంటాడట, ఆపై భగవంతుడుకూడా అహమన్నాదో - నేను ఆ అన్నాన్ని అనుభవించే వాడిని అని అంటాడట. అయితే అనుభవం పొందేదెవడు, అనుభవించేదెవడు ఇటా అటా, ఆ ఆనంద దశ మాత్రమే పైన ఉంటుంది తప్ప ఏది ఏవరు అనేది గుర్తించ వీలు కానట్లు సామానత్వం ఏర్పడుతుంది.
అయితే జీవుడు పరమాత్మను చేరాక సర్వాత్మనా సముడగును ఆయన వంటి రూపం,గుణం,ఆనందం, అనుభవం పొందును. బ్రహ్మసూత్రాలు రచించిన వేదవ్యాసభగవానుడు రెండు విషయాలు తప్ప సముడగును అని చెప్పాడు. అది శ్రీయ పతిత్వం, జగత్ కారణత్వం. ఇది వీడు కోరడు, వాడు ఇవ్వడు. శ్రీ మనకు అమ్మ ఇక జగత్ సృష్టీ స్థితీ లయాలు పెద్ద భాద్యత వాడే ఉంచుకుంటాడు. బ్రహ్మ సూత్రాల్లో "భోగ్య మాత్ర సామ్య లింగాః"అయితే అనుభవం మాత్రం సమానం, జీవుడికీ భగవంతుడికీ తేడా ఉండదు. ఇక ఈ అనందం ఒక్కోజీవికి ఒకలా ఉండదు, అందరికీ సమానం. ఆ అనందం పరమాత్మ ఆనందంతో సమానం అని భగవద్గీతలో భగవంతుడే చెప్పాడు. వేదం అదే చెప్పింది. శ్రీకృష్ణుడు ఆనాడు గొల్ల పిల్లలతో అదే ఆనందం అనుభవించాడు, వాళ్ళకీ చూపించాడు. గోదాదేవి సద్దులు ఆరగించడం ఏం ప్రారభ్దం కనుక ఎంచక్కా మనం పరమాన్నాన్నే ఆరగిద్దాం అని చెప్పింది.

భారత జాతిని మేల్కొలిపిన ఆధ్యాత్మిక నేత..స్వామి వివేకానంద

స్వామి వివేకానంద జయంతోత్సవ శుభాకాంక్షలు.
భారత జాతిని మేల్కొలిపిన ఆధ్యాత్మిక నేత..
ఆయన జీవించింది కేవలం 39 ఏళ్లు మాత్రమే.. కానీ భారత జాతికి శాశ్వత మార్గదర్శిగా నిలిచారు.. దేశ ప్రజలకు, ముఖ్యంగా యువతలో స్పూర్తిని నింపే సందేశాన్ని ఆయన కొద్ది సంవత్సరాల జీవిత కాలంలోనే ఇచ్చారు.. అత్యంత ప్రాచీన సాంస్కృతిక ఆధ్యాత్మిక వైభవం ఉన్న భారత దేశం విశ్వగురువు అని ప్రపంచానికి చాటి చెప్పారాయన.. ఆ మహనీయుడే స్వామి వివేకానంద..
ఆంగ్ల కాలమానం ప్రకారం జనవరి 12వ తేదీ స్వామీజీ జన్మదినం.. ఈ శుభ సందర్భంలో వారి సందేశాన్ని సంక్షిప్తంగా గుర్తు చేసుకుందాం..
‘లేవండి, మేల్కొనండి, గమ్యం చేరే వరకూ విశ్రమించకండి.. లేవండి! మేల్కొనండి!.. మిమ్మల్ని మీరు మేల్కొల్పుకొని ఇతరులను మేల్కొల్పండి! ఇకపై నిద్రించకండి!.. మీరు మరణించే లోపే జీవిత పరమావిధిని సాధించండి..
లేవండి!మేల్కొనండి!.. గమ్యం చేరేవరకూ ఎక్కడా నిలవకండి.. ఎప్పటికీ జాగృతంగానే ఉండండి.. బలమే జీవితం, బలహీనతే మరణం.. ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్ప మనసున్న యువత ఈ దేశానికి కావాలి..’
‘ఆధునిక యువతపైనే నాకు విశ్వాసం ఉంది.. నేను నిర్మించిన ఆదర్శాన్ని దేశ మంతా వ్యాప్తి చేసేది యువతే.. యువత ముందు బలిష్టులు, జవ సంపన్నులు, ఆత్మ విశ్వాసుల, రుజువర్తనులు కావాలి.. ఇలాంటి వారు వంద మంది ఉన్నా చాలు,ఈ ప్రపంచాన్నే మార్చేయ వచ్చు..’
‘మీరంతా మహత్కార్యాలు సాధించడానికే జీవించామని విశ్వసించండి.. బలం, శక్తి మీలోనే ఉన్నాయని గుర్తుంచుకోండి.. ఎంతో విశ్వాసంతో లేచి నిలబడండి.. ధైర్యంగా బాధ్యతను మీ భుజ స్కంధాలపై వేసుకోండి.. భవిష్యత్తుకు మీరే బాధ్యులమని తెలుసుకోండి.. ఆరంభం అతి స్వల్పంగా ఉందని నిరాశపడకండి.. క్రమంగా ఘనమైన ఫలితాలు వస్తాయి.. సాహసంగా పని చేయండి..’
‘తమ సర్వస్వాన్ని త్యాగం చేసి, దేశం కోసం తమ జీవితాలను ఆహుతి చేసే యువత మనకు కొందరు కావాలి.. దేశ ప్రజలను ఉద్దరించే ఏకైక లక్ష్యంతో పని చేసే యవతను గుర్తించి పని చేయాలి.. త్యాగం,ఉత్సాహాలతో వారిని జాగృతం చేసి ఐక్యం చేయాలి.. మన స్థితికి మనమే బాధ్యులం.. లక్ష్యాన్ని సాధించే శక్తి, ఆపై శక్తి మనకే ఉంది..’
‘విజయాన్ని సాధించడానికి కావలసినవి మూడు. అవి.. పవిత్ర, సహనం, పట్టుదల. వీటన్నింటినీ మించి కావలసింది ప్రేమ.. మీరు నిజంగా నా బిడ్డలే అయితే దేనికీ భయపడరు.. ఎక్కడా ఆగిపోరు.. మీరు సింహాల్లా ఉండాలి.. మన భారత దేశాన్నే కాక,ప్రపంచాన్నే జాగృతం చేయాల్సి ఉంది. ఉద్యమ నిర్వహణలో అవసరమైతే అగ్నిలో దూకడానికైనా సంసిద్ధంగా ఉండాలి..’
భారత దేశం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం జాతి పునర్ నిర్మాణమే మార్గమని సూచించారు స్వామీ వివేకానంద.. ధర్మాన్ని పాటించమన్నారు.. స్వధర్మం తల్లివంటిదని, పర ధర్మం సవతి వంటిదని అన్నారు.. ఏ విధంగా చూసినా హిందుత్వమే అన్ని ధర్మాలకన్నా గొప్పదని చికాగోలో జరిగిన ప్రపంచ మతాల సదస్సులో చాటి చెప్పారు వివేకానంద.. ప్రపంచానికి భారత దేశం ఆధ్యాత్మిక నాయకత్వం వహించాలన్నారు..
నేడు వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన పుస్తకాలు మర్కెట్లో కుప్పలు తెప్పలుగా దొరుకుతున్నాయి.. కానీ స్థూలంగా పరిశీలించి చూడండి.. ఎందరు ఎన్ని విధాలుగా చెప్పినా సారాంశం ఒకటే.. కానీ వందేళ్ల క్రితమే వ్యక్తి నిర్మాణం గురుంచి స్వామీజీ చక్కని బోధనలు చేశారు.. ఆయన బోధనలు చదివితే చాలు,మరే వ్యక్తిత్వ వికాస పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదు.. యువతకు ఆశాజ్యోతి, మార్గదర్శి అయిన స్వామీ వివేకాంద జయంతిని జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటున్నారు..
స్వామీ వివేకానందను గుర్తు తెచ్చుకుందాం.. ఆయన చూపిన మార్గాన్ని అనుసరిద్దాం.. ఈ దేశాన్ని పునర్నిర్మిద్దాం.....
💪💪💪✊✊✊

స్వామి వివేకానంద జయంతోత్సవ శుభదినాన వారు చెప్పిన కొన్ని మంచిమాటలు.💐💐🙏🙏













Thursday, January 11, 2018

భాగవత చిత్రం.

 దీనిని జూమ్ చేసి మొత్తం భాగవతం అంతా ఒక చిత్రం లో చూడండి..

అగస్త్య సంహితలోని 2 శ్లోకాలు



“సంస్థాప్య మృణ్మయే పాత్రే తామ్రపత్రం సుసంస్మృతమ్I
ఛాదయే ఛ్ఛిఖిగ్రీవేన చార్థ్రాభిః కాష్ఠపాంసుభిఃII
దస్తాలోప్టో నిథాతవ్యః పారదాఛ్ఛాది దస్తతఃI
సంయోగా జ్ఞాయతే తేజో మిత్రావరుణ సజ్ఞ్గితమ్II”

దీని భావం - ఒక మట్టి కుండను తీసుకుని దానిలో రాగి పలక పెట్టాలి. తరువాత దానిలో మైలు తుత్తం వేయాలి. తర్వాత మద్యలో తడిసిన ఱంపపు పొట్టువేయాలి. పైన పాదరసము మరియు యశదము (జింక్) వేయాలి తర్వాత తీగలను కలపాలి అప్పుడు దాని నుండి మిత్రావరుణ శక్తి ఉద్భవిస్తుంది.

మరో శ్లోకం చూడండి

“అనేన జలభంగోస్తి ప్రాణోదానేషు వాయుషుI
ఏవం శతానాం కుంభానాం సంయోగ కార్యకృత్ స్మృతఃII
వాయు బంధక వస్త్రేణ నిబద్దో యానమస్తకేI
ఉదాన స్వలఘత్వే విభర్త్యాకాశయానకమ్II”

దీని భావం - ఒక వంద కుండల యెక్క శక్తిని నీటిపై ప్రయోగిస్తే, నీరు తన రూపాన్ని మార్చుకుంటుది. ప్రాణవాయువు, ఉదజని వాయువులుగా విడిపోతుంది. ఉదజని వాయువును వాయునిరోధకవస్త్రంలో బంధిచినచో అది విమాన విద్యకు ఉపకరిస్తుంది.
అగస్త్య సంహితలో 6 రకాల విద్యుత్తుల గురించి వివరించారు.

1. తడిత్ – పట్టువస్త్రాల ఘర్షణ నుండి పుట్టునది.
2. సౌదామిని – రత్నముల ఘర్షణ నుండి పుట్టునది.
3. విద్యుత్ – మేఘముల ద్వారా పుట్టునది.
4. శతకుంభి – వంద సెల్స్ లేదా కుండల నుండి పుట్టునది
5. హృదని – స్టోర్ చేయబడిన విద్యుత్తు.
6. అశని – కర్రల రాపిడి నుండి పుట్టునది.

పంచ దంపతులు.


మొదటిది:  లక్ష్మీనారాయణులు.
 విష్ణుమూర్తికి లక్ష్మీదేవి వక్షస్థలం మీద ఉంటుంది, వక్షస్థలంలోని హృదయం ఆలోచనలకు కూడలి, అక్కడే లక్ష్మి ఉంటుంది, అంటే ఏభార్య భర్తల హృదయం ఒక్కటై ఆలోచనకూడా ఆ ఇద్దరిదీ ఒకటై ఉంటుందో ఆ జంట లక్ష్మీనారాయణుల జంట

రెండవది
 గౌరీశంకరులు అర్థనారీశ్వరరూపం,
తలనుంచి కాలిబొటనవ్రేలివరకు నిట్టనిలువునా చెరిసగంగా ఉంటారు, రెండు కలిసిన ఒకే రూపంతో ఉండటం వీరి ప్రత్యేకత,ఆలోచనలకు తల,కార్యనిర్వాహణానికి కాలూ సంకేతం,
కాబట్టి భార్యను గొప్పగా చూసుకునే భర్త, బోలాబోలీగా ఉన్న భర్త ఆపదలో ఉంటే రక్షించే భార్య –ఇలా ఉన్నవారు గౌరీశంకరులజంట.

మూడవది
బ్రహ్మ సరస్వతుల జంట
బ్రహ్మ నాలుక మీద సరస్వతి ఉంటుందంటారు, నాలుకనేది మాటలకు సంకేతం, దాని అర్థం ఇద్దరి మాట ఒకటే అవుతుందని ఇలా
ఏ మాట మాట్లాడినా,
ఆ భార్య మాటే మాట్లాడే భర్త, ఆభర్త మాటే మాట్లాడే భార్య ..ఏ జంట ఇలా ఉంటారో వారు బ్రహ్మసరస్వతుల జంట.

నాల్గవది
ఛాయా సూర్యులు సూర్యుడు చండ ప్రచండంగా వెలుగు తుంటాడు,
అతడి భార్య ఛాయాదేవి అతని తీక్షణతకు తట్టుకుంటూ సాగుతుంటుంది.
తనభర్త లోకోపకారం కోసం పాటుపడేవాడు, విపరీతమైన తీక్షణత కలవాడు.అయినా తాను నీడలా పరిస్థితికి అనుగుణంగా సర్ధుకుపోతూఉంటుంది,ఛాయాదేవి.
ఏ ఇంట భర్త కఠినంగా. కోపంగా ,పట్టుదలతో ఉంటాడో.
ఏ ఇంట అతని భార్యమాత్రం నెమ్మదిగాను, శాంతంగాను, అణకువగాను ఉండి, సంసారాన్ని తీర్చిదిద్దుకొనే తత్వంతో ఉంటుందో అలాంటి జంట ఛాయా సూర్యుల జంట.

ఐదవది
రోహిణీ చంద్రులు
రోహిణీ కార్తెలో
రోళ్ళు కూడా పగులుతాయనే
సామెత ఉంది,
చంద్రుడు పరమ ఆహ్లాదాన్ని,
ఆకర్షణను కలుగజేసేవాడు, మెత్తనివాడునూ,
ఏ జంట భర్త మెత్తగా ఉండి,లోకానికంతటికీ ఆకర్షణీయుడై ఉంటాడో, భార్య మాత్రం కఠినాతి కఠినంగాను కోపంతోను పట్టుదలతోనుఉంటుందో ఆ జంట రోహిణీ చంద్రులు.

తిరుప్పావై 26వ రోజు పాశురము


Image result for తిరుప్పావై 26వ రోజు పాశురముమాలే మణివణ్ణా మార్-గరి నీరాడువాన్
మేలైయార్ శేయ్-వనగళ్ వేండువన కేట్టియేల్
ఞాలత్తై యెల్లాం నడుంగ మురల్వన
పాలన్న వణ్ణత్తు ఉన్-పాంచజన్నియమే
పోల్వన శంగంగళ్ పోయ్ ప్పాడుడైయనవే
శాలప్పెరుం పఱైయే పల్లాండిశైప్పారే
కోలవిళక్కే కొడియే వితానమే
ఆలిన్-ఇలైయాయ్ యరుళ్-ఏలోర్ ఎంబావాయ్
ఈ రోజు మనవాళ్ళంతా శ్రీ కృష్ణుడి సామర్థ్యాన్ని తెలుపుతూ వారికి కావలసిన వ్రత పరికరాలను సమకూర్చుకుంటున్నారు. తిరుప్పావైలో ఆండాళ్ తల్లి ప్రమాణాలను తెలుపుతూ వ్రతాన్ని ఆచరించింది. అందులో మొదటగా "శెయ్యాదన శెయ్యోం" మన పూర్వులు చేయనివి చెయ్యకూడదు. ఈ మధ్యకాలంలో మనం సౌకర్యాలకని తెచ్చి పెట్టుకున్నవి మన ఆరోగ్యాన్ని ఎంత పాడుచేస్తున్నాయో అనుభవిస్తున్నవారికి తెలుసు. ఇదివరకు ఇవన్నీ లేని నాడు హాయిగా బ్రతికేవారు మన పూర్వులు. సౌకర్యం కోసం భౌతికమైనవి చెయ్యవచ్చు అవి మన స్వరూపాన్ని పాడు చేయనంత వరకు, ఇది గుర్తుంచుకోవాలి. ఆత్మోజ్జీవన కోసం మాత్రం మా పూర్వులు ఆచరించనివి మేం ఆచరించం అని చెప్పింది. ఆపై "మేలైయార్ శేయ్-వనగళ్"ఏవి మన పూర్వులు ఆచరించారో మన శ్రేయస్సు కోసం అవే ఆచరించాలి. మనం చేసేప్పుడు ఎదుటివారు ఏమైనా అంటే లేదా అడ్డుపడినా వారికి ఎదురు చెప్పకుండా "నానే తాన్ ఆయిడుగ" నేనే అంగీకరిస్తా అంటూ వినయంతో లక్ష్యంవైపు చెదరని స్థితిని ఆర్జించడం. ఈ మూడు సూత్రాలతో ఆచరించింది ఆండాళ్ తల్లి. ఈ రోజు ఆండాళ్ తల్లి "మేలైయార్ శేయ్-వనగళ్" సూత్రాన్ని చెబుతుంది. పెద్దలు అన్నప్పుడు, కొన్ని అనాచారాలు కూడా ఉండి ఉండవచ్చు. అప్పుడు పెద్దల ఆచరణ ప్రమాణ యోగ్యం కాకపోవచ్చు. వేదంలో ఇవి తగును, ఇవి తగవు అనే నిర్ణయం చేయబడి ఉంది. వీటికి విరుద్ధంగా లేని ఆచరణని మనం స్వీకరించవచ్చు. ఇది ఒక నిరూపణ.
Image result for తిరుప్పావై 26వ రోజు పాశురముస్వామిలోని ప్రేమను కనిపెట్టి “మాలే మణివణ్ణా” ఓ మణి మాణిక్యమా అంటూ పిలుస్తున్నారు. అయితే తన ప్రేమను కనిపెట్టేసారు, ఇక ఎక్కడ లొంగాల్సొస్తుందేమోనని స్వామి నాకు ఈ పేరు ఏం కొత్తకాదు, మా అమ్మ యశోదమ్మ కూడా ఇలాగే పిలిచేది. అసలు మీరెందుకు వచ్చారో చెప్పండి అని అడిగాడు స్వామి. “మార్-గరి నీరాడువాన్” మార్గశీర్ష స్నానం చేయాటానికి మేం వచ్చామయా అని చెప్పారు. అయితే ఎవరు చెబితే చేస్తున్నారు అని అడిగాడు స్వామి. “మేలైయార్ శేయ్-వనగళ్ వేండువన” మా పెద్దలు ఆచరించినది కాబట్టి మేం చేస్తున్నాం. దృఢమైన ప్రమాణం పట్టుకున్నారు. అందులోనూ గోపికలు ఆచరించినది కదా, ఇక ప్రశ్నే లేదు. స్వామికి చాలా సంతోషం వేసింది తను ఆర్తితో వీళ్ళనంతా అట్టే చూస్తూ ఉండిపోయాడు. “కేట్టియేల్” వినబడుతుందా మేం అడిగినది అని అడిగారు. అయితే మీకు ఏం కావాలో ఒక్కొక్కటి చెప్పండి అని అడిగాడు స్వామి, వీళ్ళు ఒక్కొటి చెప్పడం ప్రారంభించారు. “ఞాలత్తై యెల్లాం” భూమినంతా “నడుంగ” వణికించేట్టుగా “మురల్వన” ద్వని చేసేట్టి “పాలన్న వణ్ణత్తు” పాలవలే తెల్లగా స్వచ్చమైన కాంతికల్గిన, “ఉన్-పాంచజన్నియమే పోల్వన”నీ పాంచజన్యాన్ని పోలిన “శంగంగళ్” శంఖాలు కావాలి అని అడిగారు. నీ పాంచజన్యాన్ని పోలిన అని చెబుతున్నారు ఎందుకంటే, భగవంతునికి శంఖం, చక్రం ఈ అసాదారణ ఆయుదాలు ఉంటాయికదా.
Image result for తిరుప్పావై 26వ రోజు పాశురముఈ మద్య కాలంలో ఎవరికి పడితే వారికి పెట్టేస్తున్నారు. అది చాలా తప్పు. శ్రీకృష్ణుడికి సన్నిహితుడుగా ఉండేవాడు శ్రీ మాలికుడు, అయితే శ్రీకృష్ణుడి పేరుచెప్పుకొని కొంచం అల్లరి చిల్లరగా చేసేవాడు. కొంత కాలం అయ్యాక కృష్ణా నీ వద్ద ఉన్న సుదర్శణ చక్రం కావాలయ్యా అని అడిగాడట. ఇది ఇతరులకు లొంగి ఉండదు అని చెప్పి చూసాడు, ఇక వినక పోయేసరికి ఇచ్చాడు, పాపం తనకు తెలియకుండానే తన తలను నరుక్కున్నాడు శ్రీమాలికుడు. శ్రీవెంకటాచలపతి చరిత్రలో ఒక కథ ఉంది. తిరుమల కొండపై కుమారస్వామి తపస్సుని అనుగ్రహించటానికి శ్రీనివాసుడు ప్రత్యక్షమైనప్పుడు అక్కడికి పరమశివుడు కూడా వేంచేసాడు. అయితే పరమశివుడికి శ్రీనివాసుడికి ఏర్పడ్డ మైత్రితో, పరమశివుడు అడిగాడట స్వామీ నేను ఈ కొండపై ఉంటాను అని, అయితే స్వామి ఈ ఆదిశేషుడిపై నీవు ఉండతగవు అని, ఆదిశేషుడి తోక స్థానం కపిల తీర్థం వద్దకు పంపివేసాడు. అయితే ఆ చక్రాన్ని ఒకసారి అడిగిచూసాడట, ఇది ఎవరికి పడితే వారికి ఇచ్చేదికాదు, ఎవ్వరి మాట వినవు అని చెప్పాడట. శంఖ చక్రాలు ఉండేవి కేవలం శ్రీహరికి మాత్రమే.
Image result for తిరుప్పావై 26వ రోజు పాశురముఆనాడు యుద్దరంగంలో ఊదినప్పుడు పాండవులకు ఆనందం వేసింది, కాని ధృతరాష్ట్ర సంతానానికి గుండెలు పగిలిపోయాయి, ఆ పాంచజన్యాన్ని పోలిన శంఖాలు అని అడుగుతున్నారు. సాయుజ్యాన్ని కాంక్షించినప్పుడు భగవంతుడి సాన్నిహిత్యం కావాలికదా, అందుకే మొట్ట మొదట ప్రణవార్థం ప్రకాశించవలెనని కోరుతున్నారు. శంఖాన్ని మనవాళ్ళు ఓంకారంతో పోలుస్తుంటారు. ఆ ఓంకారం ఎలా ఉంటుంది అంటే దాన్ని అనుష్టించినప్పుడు మన దైన ఈ శరీరమనే భూమి ఒక్కసారి వణుకుతుంది, ఇందులో ఉండే అపార్థములు తొలగుతాయి, జ్ఞానం ప్రకాశిస్తుంది. ఓంకారం ఏం చెబుతుందంటే అకారమైన పరమాత్మకే మకారమైన నేను చెందినవాణ్ణిగా అన్ని అవస్తలయందు వాడి సేవ చేయవలె. ఇదే శేశత్వాన్ని తెలుపుతుంది. తన పాంచజన్యాన్ని పోలిన శంఖాలు అడుగుతున్నారు, ఇది ఇవ్వడం కష్టం అని అనుకున్నాడు స్వామి, సరేలే ఇంకా ఏమేమి కావాలో ఒకేసారి చెప్పండి అని కృష్ణుడు అడిగాడు.
మాకు ఇంకా “పోయ్ ప్పాడుడైయనవే శాలప్పెరుం పఱైయే” శక్తివంతమైన చాలా పెద్ద వాయిద్యం కావాలి, ఇంకా “పల్లాండిశైప్పారే” పల్లాండు పాడేవారు కావాలి, ఇంకా “కోలవిళక్కే” ఆరని నిలువు దీపం కావాలి. గోష్టితో వెళ్ళేప్పుడు మంగళకరంగా ఒక దీపం ఉండాలి కదా అందుకు, ఇంకా మేం ఉన్నట్లు తెలిసేలా “కొడియే” ద్వజం కావాలి, ఇంకా “వితానమే” మంచు పడకుండా గొడుగు కావాలి అని అడిగారు. మీరు అడిగినవి ఒక్కోటి ఇవ్వడం కష్టం అని చెప్పేసాడు శ్రీకృష్ణుడు.
Image result for తిరుప్పావై 26వ రోజు పాశురముఎమయ్యా నీవెవరవో మాకు తెలియదని అనుకున్నావా, “ఆలిన్-ఇలైయాయ్” అన్నిలోకాలను నీ పొట్టలో పెట్టుకొని అప్పుడప్పుడే వికసించిన వటదలంపై శయనించగలిగావు, తిరిగి ఇన్ని లోకాలను బయటికి తేగలిగావు, మేం అడిగినవి ఇవ్వలేవా నీ సామర్థ్యం ఏంటో మాకు తెలుసు, నీవు అనుకుంటే జరగనిది లేదు, నీవు వద్దు అనుకుంటే జరిగేది ఏమిలేదు అంతా “యరుళ్” నీ దయ అని స్వామిని కోరారు.ఇక వీళ్ళకు ఇవ్వక తప్పదు అని ఇది వరకు ఊర్లో కోవెలలో ఉన్న శంఖాన్ని ఒకటి తెప్పించి ఇచ్చాడు, తన దగ్గర ఉన్న కొంబుబూర ఒకటి ఇచ్చాడు, స్వామి సంబంధం కలవి కాబట్టి వీళ్ళు ఆనందించారు. ఇక వాయిద్యం తను వెన్న తినేప్పుడు చేసే ఘట నృత్యం అప్పుడు వాడే వాయిద్యాన్ని ఇచ్చాడు. ఇక పల్లాండుకు, రాబోయే కాలంలో రామానుజ సంపర్కంచే ఏర్పడే భక్త గోష్టికి మంగళం పాడిన నమ్మాళ్వార్ ను పంపాడు. ఇక ఆరని దీపం అడిగారు కదా అమ్మను వీళ్ళతో పంపాడు, ఇక ద్వజానికి గుర్తుగా గరుత్మంతుడిని పంపాడు. గొడుగుగా ఆదిశేషుడు వెళ్ళాడు కనక, తాను ధరించి విడిచిన శేషవస్త్రం ఒకటి ఇచ్చాడు, స్వామి సంబంధం కలవి కాబట్టి వీళ్ళకు అదే చాలు.

Total Pageviews