స్థాయినిబట్టే అంచనాఉంటుంది
ఒకసారి ఒక ఋషి గాఢమైన సమాధిస్థితిలో ఒక త్రోవ ప్రక్కన పడివున్నాడు.
ఒక దొంగ ఆ త్రోవలో వెడుతూ, ఆ ఋషిని చూసి ఇలా ఆలోచించాడు: 'వీడు కూడా దొంగ అయివుంటాడు. నిన్న రాత్రి కొన్ని ఇళ్లలో దొంగతనాలు చేసి అలసిపోయి ఇక్కడపడి నిద్రపోతున్నాడు. ఈపాటికి పోలీసులు వీణ్ణి వెతుకుతూ ఉండి వుంటారు. వాళ్ళు వచ్చే లోపల నేను పారిపోవడం మేలు!' అలా అనుకుని ఆ దొంగ అక్కడనుంచి పారిపోయాడు.
కాసేపటి తరువాత ఒక త్రాగుబోతు అక్కడికి తూలుకుంటూ వచ్చాడు. ఋషిని చూసి,
'ఏరా! త్రాగి పడిపోయావా? నన్ను చూడరా! ఎంత త్రాగినా ఎలా నిలబడి ఉన్నానో!' అన్నాడు.
చివరిగా అక్కడికి ఇంకొక సాధువు వచ్చి ఒక గొప్ప ఋషి సమాధిస్థితిలో అక్కడ పడివున్నాడని గ్రహించాడు. ఆ ఋషి ప్రక్కనే కూర్చొని ఆయన పాదాలు వత్తడం ప్రారంభించాడు.
ప్రాపంచిక సంస్కారాలు మనిషిని నిజమైన వ్యక్తిత్వాన్ని, పవిత్రతను గుర్తించకుండా చేస్తాయి.
మనం మార్పు చెందితే ఈ ప్రపంచం మార్పు చెందుతుంది. మనం పరిశుద్ధులమైతే ఈ లోకం పరిశుద్ధమవుతుంది.

No comments:
Post a Comment