Tuesday, January 9, 2018

నాదబ్రహ్మ "కాకర్ల త్యాగరాజస్వామి"కి హృదయపూర్వక నివాళి

అన్నమయ్య సినిమాలో "ఏలే ఏలే మరదలా " పాట వింటూ  బావుంది పాటఅనుకునేవాళ్ళ లో ...సంగీత జ్ఞానం ఉన్నవాళ్ళని కాస్త కదిపి ..ఆ పాట ఏరాగం లో ఉంది అని అడిగితే....
పాట"అభేరి రాగంలో ఉంది..
అభేరి రాగం ఆరోహణ.." స గ మ ప ని స"
అవరోహణ : స ని ద ప మ గ రి స " ,తాళం ..ఆదితాళం అని ఆలవోకగా చెప్పేస్తారు ,అంతేకాదు  త్యాగరాజస్వామి ఇదే  అభేరి రాగం లో స్వరపరచిన " నగుమోమూ గనలేనీ" కీర్తనని కూడా మీ ముందు ఉంచుతారు.
ఇవాళ  కర్ణాటక సంగీతం అనగానే గుర్తొచ్చే త్యాగరాజస్వామి వర్ధంతి
మహానుభావుడు సంగీతమే ఊపిరిగా బ్రతికినవాడు..

ఏవిటయ్యా! అస్తమానూ ...రాముడు ,సీతా అంటావు అని అంటే.....సీతమ్మ మా అమ్మా శ్రీరాముడు మాకు తండ్రి అంతేనా "వాతాత్మజ సౌమిత్రి వైనతేయరిపుమర్దన ధాతా భరతాదులు సోదరులు మాకు " అని తన శైలిలో కీర్తించినవాడు.
తంజావూరు మహారాజు తన ఆస్థాన విద్వాసుడిగా రమ్మని ఆహ్వానిస్తే .. నాకే పదవులూ వద్దు ఆశ్రీరామచంద్రుడే నాకు అన్నీ అంటూ ఆయన పాదాల దగ్గర స్థానం చాలు అంటూ " బంటు రీతి కొలు వీయవయ్య రామా" అని ఆనందం గా కీర్తనని స్వరపరిచాడు త్యాగరాజు..
..
పెద్దలందరూ కూర్చొని ఒక్క కీర్తన పాడవయ్యా త్యాగయ్య అంటే "" ఎందరో మహానుభావులు" అంటూ వినయాన్ని చూపించాడు..
త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాల్లో ఆయన స్వరపరచిన "పంచరత్న" కీర్తనలని పాడి నివాళి అర్పిస్తారు శాస్త్రీయసంగీతవిద్వాంసులు

అనేకమంది దేవుళ్ళమీద 24 వేల కీర్తనలు రాస్తే మనకి అందుబాటులో ఉన్నవి మాత్రం 700..అంతేకాదు వీణ కూడా వాయించడం  త్యాగరాజు కున్న అదనపు విద్య.
ఇవాళ కర్ణాటక సంగీతం తో అనుబంధ ఏర్పరుచుకుని అదే , వృత్తిగా మలుచుకున్నవాళ్ళు రుణపడి ఉండేవ్యక్తి త్యాగరాజస్వామి..

"గగనాధిప సత్కులజ రాజ రాజేశ్వర సుగుణాకర సురసేవ్య భవ్య దాయ"కుడు శ్రీరాముడిని అమితం గా సేవించిన
 నాదబ్రహ్మ "కాకర్ల త్యాగరాజస్వామి"కి హృదయపూర్వక నివాళి

No comments:

Post a Comment

Total Pageviews