చిన్నప్పుడు వీట్లని మేం ముగ్గులనేవాళ్ళం. సంక్రాంతి స్పెషల్ యివి.
అక్కావాళ్ళూ, వాళ్ళ నేస్తురాళ్ళూ. ఇంకా యింటోవున్న బొట్టికాయ చెళ్ళెళ్ళూ, డిప్పకాయ వెధవలూ అక్కా మేమూనే అంటూ తయారు. పొద్దున్నే ఏ నాలుగింటికో చిన్న దీపంబుడ్డి పక్కన పెట్టుకోని ఏ పదార్చుక్కల్తోనో మొదలెడితే... యిహన్నా కొంపల్లోకి తగలడ్తారా లేదా, హవ్వ్వ... ఆ సూన్నాణమూర్తి తెల్లఘా సగవాఁకాశం నిండా వొచ్చే. ఈడొచ్చినాడపిల్లలు, మొహం కడుక్కోవాలన్న ఙానవుఁడక్కర్లా? లక్ష్వీ అమ్మవారికాగ్రహం అన్న యింగితవన్నా లేకండానూ... అని వీధిలో ఏ మామ్మో కోప్పడితేగాని ఆ రథం ముగ్గో, చక్రం ముగ్గో పూర్తయ్యేదికాదు. పైనించీ గొబ్బెమ్మలు, వాటిమీదిన్ని గుమ్మడీ, కారబ్బంతులూ, ముద్దబంతి పూలూ, గుప్పెడు పసుపూ, కుంకం... కళ్ళు చెదిరేట్టుగా అలంకారం!!

ఈమధ్యలో విరిగిన సన్నాయి డోళ్ళతో ఓ డజను గంగిరెడ్లూ, పదిమంది హరిదాసులూ, తలో దోసెడు బియ్యం.
ఇదో యిందాక భడవాకానల్లాలా... అన్తిట్టిపోసిన మామ్మే మళ్ళీ నాగౌరమ్మే, నామహలక్ష్మే.. వీధంతటికీ నీ ముగ్గేనే అందం తల్లీ.. అని మెటికలు విరిచి మరీ ఒక్కోళ్ళకూ ముద్దులు. మహరాజంటి మొగుడొస్తాడని దీవెన్ల కొసర్లు. అట్నుంచీ కాసిని, ఛీ.. పో మామ్మాలూ, సిగ్గులూ...
ఆ పైన తలంట్లూ, కొత్తబట్టలూ. ఇల్లిల్లూ ఓయబ్బ, ఒకటే కోలాహలం. సంబరం.
ఆ పైన తలంట్లూ, కొత్తబట్టలూ. ఇల్లిల్లూ ఓయబ్బ, ఒకటే కోలాహలం. సంబరం.
సాయంత్రం మరి బొమ్మలకొలువు పేరంటం కద! ఇంట్లో అన్నయ్యగాళ్ళ మీద అథార్టీ, పెత్తనం. మెట్లు తక్కువనో, ఎక్కువనో, ఎత్తనో, పైన పరచిన దుప్పట్లు మడతలనో... వాడి నడుం విరిగిందాకా గోల. ఆఁ! దేనికిరా ఆ ఇస్సూలూ.. ఇంటాడపడుచుకామాత్రం బొమ్మలకొలువు ముచ్చట తీర్చడానికే అలుపా, ఆట్ఠే ఏంజేసేవు గాడ్దెకానా.. అని అమ్మో, అత్తయ్యో, అవతలింటి పిన్నో అదిలింపు.
సాయంకాలం పేరంటం ముందు కొత్త లంగా ఓణీ, బోల్డు కొత్త గాజులు, గోరింటాకు పండిన ఎఱ్ఱటి చేతుల్తో ఇదిగోరా అన్నయ్యా అని కాసినక్షింతలు చేతికిచ్చి చటుక్కున వొంగి కాళ్ళకు దణ్ణం పెడితే, ఏవిటో.. నడుంనెప్పి మాయం. నా చెల్లెలు యిదన్న మురిపెం. లోకం దాని కాల్చెప్పుకు సరితూగదన్న గర్వం. ఎందుకో కంటో చుక్క నీళ్ళు తిరిగితే అమ్మా నాన్నా చూడకుండా తుడుచుకునే ప్రయత్నం. మొహానింతో వెఱ్ఱి నవ్వుతో యింటో దుమ్మని వూరుకోటం.
చూసికూడా అమ్మ చూణ్ణట్టూర్కోటం. చెల్లెళ్ళంటే ఎంత గారాబమో పిచ్చినాయనకని మనసులో కొండంత సంతోషం.
వొచ్చిన పేరంటాళ్ళకి రండ్రండని నవ్వుతూ ఆహ్వానం. అందరూ కలిసి ముచ్చట్లూ, మెహర్బానీలూ, పిల్ల సన్నాసులకు మరిన్ని భోగిపళ్ళూ, ఓటో నాలుగో చిల్లర పైసళ్ళూ.
వెరసో రెండు మంగళహారతులు. పండూ శనగలూ తాంబూలం వాయనం. మరి మేం వెళ్ళోస్తామంటూ మెల్లగా ఎవరిళ్ళకు వాళ్ళు తరలడం.
సంక్రాంతి. మాయింటి పండుగ. మనందరి పండుగ. ప్రతి తెలుగింట కన్నుల పండుగ.
ఈ సంతోషాన్ని తుడిచివేస్తూ ఈవాళ దీన్ని పొంగల్ అనీ, రంగోలీ అనీ, డాల్ షో అనీ జుగుప్సాకరంగా TVలో కించపరుస్తుంటే, తరతరాలకీ మీరు సర్వనాశనమైపోండని శాపం పెట్టాలన్నంత కచ్చ! ఎంత పాపిష్ఠి జన్మలైనా పండగరోజు మనమెందుకు నోరు పారేస్కోవాలని మళ్ళీ మనసుకు సర్దిచెప్పుకోవటం....
No comments:
Post a Comment