Tuesday, January 2, 2018

"అద్దం ముక్క మెరుపు".....

"అద్దం ముక్క మెరుపు".....
ఒక రోజు ఒక అద్దం ముక్క ఒక రాయి తో ఇలా అంది: “నన్ను చూడు,
నేను ఎంత మెరుస్తున్నానో? ఆ సూర్యుడే నన్ను మెచ్చుకుని నాకీ
మెరుపునిచ్చాడు”. ఆ రాయి, “అలాగా, నా అభినందనలు” అని సమాధానమిచ్చింది
.
కొన్ని రోజుల తరువాత ఒక పిడుగు అద్దం మీద పడింది.
అద్దం పిడుగు మంటకు కాలిపోయి, దాని మొత్తం మెరుపును కోల్పోయింది.ఆ
రాయి, “నీ మెరుపు ఏమైంది?” అని అద్దాన్ని అడిగింది.
“ఒహ్, ఆ పిడుగు వచ్చి నా దెగ్గిర అరువు తీసుకుంది” అన్నదా అద్దం.
“ఒక్క సారి మన గొప్ప చాటుకున్నాక ఎన్ని అబద్ధాలాడాలో” అనుకుంది రాయి.

No comments:

Post a Comment

Total Pageviews