వీడలేక... వెల్లలేక... వదల్లేక... 😔😢 వీధి చివర వరకు చెయ్యి ఊపి 'టాటా చెప్పిన అమ్మ' మనసులో బాధ కొండంత అయింది..... జేబు లో డబ్బులు పెట్టి 'జాగ్రత్త రా నాన్న!!' అంటూ తిడుతూ జాగ్రత్తలు చెప్పే నాన్న నోట మాట లేదు.... సెలవులు ముగించుకుని పట్టణానికి బయలుదేరిన ఉద్యోగస్తులు, విద్యార్థులు బరువైన హ్రుధయాలతో ఏదో కోల్పోయిన బాధలో ఉన్నారు... పండుగ అయిపోయింది... సందడి ఆగిపోయింది... ఊరు మూగపోయింది... అయినా సరే మీ కోసం మీ ఊరు ఎదురు చూస్తూ ఉంటుంది. ఆ కేరింతలు మల్లి వస్తాయిలే అన్న భరోసా తో మీ కోసం వేచి చూస్తూ ఉంటుంది. ఎక్కడికెళ్లినా మన ఊరు మరువకండి. మన మూలాలు బలంగా ఉండాలి. మన ఊరు బాగుండాలి. జాగ్రత్తగా వెళ్లి రండి. ఇక్కడ మీ కోసం కొన్ని ప్రాణాలు ఎదురు చూస్తున్నాయ్....
No comments:
Post a Comment