Thursday, January 18, 2018

అమ్మ

రెండస్తుల డాబాలో మిత్రుడు పైన ఉంటాడు. వాడి తమ్ముడు క్రింద పోర్షన్లో.
మాటల మధ్యలో వాడు అమ్మ సంగతి చెబుతూ అమ్మ తన దగ్గర పదిహేను రోజులు, తమ్ముడి దగ్గర పదిహేను రోజులు ఉంటుందని, అలా బాధ్యతలు పంచుకున్నామని చెప్పాడు.
మనస్సు చివుక్కుమంది. ఏ సీజన్ లోనైన ఎండిపోని ధార కన్నీరు బైటకు రాబోయింది. అప్పుడు అనుమానం వచ్చింది. ఏయే నెలల్లో ముప్పయిఒక్క రోజులుంటాయో ఆరోజుల్లో అమ్మ ఉపవాసము ఉండాల్సి వస్తుందా...
అదృష్టం నా అమ్మను నాతో పంచుకోడానికి నాకు తమ్ముడు లేడు.
నాకు అమ్మ ఒక మధుర జ్ఞాపకం.
తనకు నా ఆకలి ఎప్పుడు చెప్పాల్సిన అవసరం రాలేదు...
కొత్త బట్టలతో బైటకు వెళ్లివస్తే వెంటనే దిష్టి తీసేది...
పరీక్షలకు బయలుదేరితే తీపిపెరుగుతో ముందు నిలిచేది...
బాల్యంలో నా పిచ్చి భాషను క్షణంలో పసికట్టేది....
ఇలా ఎన్నో ఎన్నెన్నో....
పసిబిడ్డ ఒక స్థనంలో పాలు తాగుతూ, రెండో స్థనాన్ని పలుమార్లు తన్నుతూ ఉంటాడు.
తనను తన్నే వారి కడుపు నింపే ఔదార్యం భగవంతుడు ఒక్కఅమ్మకు మాత్రమే ఇచ్చాడు....
అమ్మ ఒక వేదం...
అమ్మ ఒక భక్తిభావం...
అమ్మ ఒక ప్రేమరూపం..
అమ్మ ఒక సంవేదన...
అమ్మ ఒక భావన...
అమ్మ ఒక పుస్తకం...
అమ్మ ఒక కలం...
అమ్మ ఒక కవిత...
అమ్మ ఒక జ్ఞానం...
అమ్మ ఒక గుడిలో దీపం...
అమ్మ ఒక హారతి పళ్లెం...
అమ్మ ఒక సుకుసుమం...
అమ్మ ఒక చల్లని చిరుగాలి...
అమ్మ ఒక అన్నపూర్ణ...
అమ్మ ఒక లాలిత్యం...
అమ్మ ఒక చీరకొంగు...
అమ్మ ఒక కరుణ...
అమ్మ ఒక దీవెన...
అమ్మ ఒక అక్షిత....
అమ్మ ఒక వర్షపు బిందువు...
అమ్మ ఒక మధురగేయం...
అమ్మ ఒక శ్వాస...
అమ్మ ఒక వూపిరి...
అమ్మ ఒక మురళి గానం...
అమ్మ ఒక జోలపాట...
అమ్మ ఒక పచ్చదనం...
అమ్మ ఒక కనురెప్ప...
అమ్మ ఒక దేవత...
అమ్మ ఒక పుడమి...
అమ్మ ఒక స్వచ్ఛత...
అమ్మ ఒక ప్రవచనం...
అమ్మ ఒక వెలుగు...
అమ్మ ఒక సుగుణం...
అమ్మ ఒక నమ్మకం...
అమ్మ ఒక ఆరోగ్యం...
అమ్మ ఒక భద్రత...
అమ్మ ఎన్నో ఎన్నెన్నో.......
ఇది చదివిన వారికి ఇంతమంది అమ్మలు జీవించిఉన్నారో, మరణించినారో తెలియదు. కాని ఒక్క మాట చెప్పగలను ఎవరు అమ్మ దగ్గర ఉంటారో వారు అతిసంపన్నులు. అమ్మ సేవ భాగ్యం కలిగివుంటారో ధన్యులు,అదృష్టవంతులు....
రచన...అన్నాప్రగడ వేంకట నరసింహారావు
Received message forwarded.

No comments:

Post a Comment

Total Pageviews