భాష సంస్కృతి సంప్రదాయాల పునరుజ్జీవనానికి నాంది, పునర్వికాసానికి పునాది... విస్సా ఫౌండేషన్
Wednesday, September 30, 2015
అర్ధం చేసుకుందాం! ఆచరిద్దాం!! తరిద్దాం!!2
మొన్న నిన్న గణపయ్య శ్లోకాల అర్ధాలు గ్రహించాం! ఇప్పుడు చదువుల తల్లి వంతు.
తల్లీ! నిన్ను దలంచి పుస్తకము చేతన్ బూనితిన్ నీవు నా
యుల్లంబందున నిల్చి జృంభణముగానుక్తుల్ సుశబ్దమ్ము శో
భిల్లంబల్కుము నాదు వాక్కునను సంప్రీతిన్ జగన్మోహినీ
ఫుల్లాబ్జాక్షీ! సరస్వతీ! భగవతీ! పూర్ణేందుబింబాననా!
పూర్వం గణపతి సరస్వతి శ్లోకాలు, సుమతి వేమన మొదలైన పద్యాలు చదవకుండా చదువులు ప్రారంభించేవారు కాదు. సరస్వతి అనుగ్రహం వుంటే చదువులు బాగా వస్తాయని నమ్మే వారు. మరి ఇప్పుడు ఒకటి.... ఒకటి.... రెండు... రెండు... మూడు... మూడు అంటూ పరిక్షా ఫలితాల ప్రకటనల్లో గొంతు చించుకునే ఒకటి రెండు కాలేజీల్లో చేర్పిస్తే చాలు ఎల్ కే జీ నుంచే ఐ ఐ టి కోచింగ్ ట అంటూ వేలంవెర్రిగా అక్షరాలు నేర్పించేందుకు కూడా అక్షరాలా లక్షలు పోసి చదువు 'కొంటున్నాం' ఒక్కసారి ఆలోచిద్దాం!! చదువులమ్మను మనసారా కొన్ని పద్యాలతో అయినా నిత్యం పూజిస్తే చల్లని చదువులతల్లి అనుగ్రహిస్తుంది! మనం నేర్చుకుందాం పిల్లలకి నేర్పిద్దాం!! ర్యాంకులు సాధిద్దాం!
శారదా, శారదాంబోజ వదనా, వదనాంబుజే
సర్వదా, సర్వదాస్మాకం సన్నిధి, సన్నిధిం క్రియాత్
తాత్పర్యము: ఓ శారదా దేవీ! (శారదాంభోజ వదనా) తెల్లటి కలువలాంటి ముఖంకలదాన! (వదనాంబుజే) ముఖమే పద్మముగా కలదానా; (సర్వదా) అన్నిటినీ అనగా అన్ని విద్యలనీ ఇచ్చేదానా, (సర్వదాస్మాకం సన్నిధి) ఎల్లప్పుడూ మాయొక్క సన్నిధిలో అనగా మాకు తోడుగా ఉండి, (సన్నిధిం క్రియాత్) మంచినిధిని అనగా మంచిని చేయుగాక! సత్యసాయి విస్సా ఫౌండేషన్!
తల్లీ! నిన్ను దలంచి పుస్తకము చేతన్ బూనితిన్ నీవు నా
యుల్లంబందున నిల్చి జృంభణముగానుక్తుల్ సుశబ్దమ్ము శో
భిల్లంబల్కుము నాదు వాక్కునను సంప్రీతిన్ జగన్మోహినీ
ఫుల్లాబ్జాక్షీ! సరస్వతీ! భగవతీ! పూర్ణేందుబింబాననా!
పూర్వం గణపతి సరస్వతి శ్లోకాలు, సుమతి వేమన మొదలైన పద్యాలు చదవకుండా చదువులు ప్రారంభించేవారు కాదు. సరస్వతి అనుగ్రహం వుంటే చదువులు బాగా వస్తాయని నమ్మే వారు. మరి ఇప్పుడు ఒకటి.... ఒకటి.... రెండు... రెండు... మూడు... మూడు అంటూ పరిక్షా ఫలితాల ప్రకటనల్లో గొంతు చించుకునే ఒకటి రెండు కాలేజీల్లో చేర్పిస్తే చాలు ఎల్ కే జీ నుంచే ఐ ఐ టి కోచింగ్ ట అంటూ వేలంవెర్రిగా అక్షరాలు నేర్పించేందుకు కూడా అక్షరాలా లక్షలు పోసి చదువు 'కొంటున్నాం' ఒక్కసారి ఆలోచిద్దాం!! చదువులమ్మను మనసారా కొన్ని పద్యాలతో అయినా నిత్యం పూజిస్తే చల్లని చదువులతల్లి అనుగ్రహిస్తుంది! మనం నేర్చుకుందాం పిల్లలకి నేర్పిద్దాం!! ర్యాంకులు సాధిద్దాం!
శారదా, శారదాంబోజ వదనా, వదనాంబుజే
సర్వదా, సర్వదాస్మాకం సన్నిధి, సన్నిధిం క్రియాత్
తాత్పర్యము: ఓ శారదా దేవీ! (శారదాంభోజ వదనా) తెల్లటి కలువలాంటి ముఖంకలదాన! (వదనాంబుజే) ముఖమే పద్మముగా కలదానా; (సర్వదా) అన్నిటినీ అనగా అన్ని విద్యలనీ ఇచ్చేదానా, (సర్వదాస్మాకం సన్నిధి) ఎల్లప్పుడూ మాయొక్క సన్నిధిలో అనగా మాకు తోడుగా ఉండి, (సన్నిధిం క్రియాత్) మంచినిధిని అనగా మంచిని చేయుగాక! సత్యసాయి విస్సా ఫౌండేషన్!
ఈ రోజు మరో సరస్వతి దేవి మీద పద్యం సర్వ శుక్లా సరస్వతి అని పోతనామాత్యుడు ఈ జగత్తులోని 16 తెల్లని వర్ణాలు కలిగిన వాటితో పోలుస్తూ చెప్పిన ఈ పద్యం మనసారా వల్లిస్తే...సరస్వతి దేవి మన నాలుకపైనే వసిస్తుంది! చదవండి! పిల్లలచేత చదివించండి!!
శారదనీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా
హార తుషార ఫేన రజతాచల కాశ ఫణీశ కుంద మం
దార సుధాపయోధి సితతామర సామరవాహినీ శుభా
కారత నొప్పు నిన్ను మది గానగ నెన్నడు గల్గు భారతీ!
తెల్లని వస్తువులని ఏకరువుపెట్టి, అలాంటి శుభాకారతతో వెలిగే నీ రూపాన్ని ఎప్పుడు చూస్తానో కదా అని ఆ సరస్వతిని వేడుకుంటున్నాడు. ఒక్క శరత్ జ్యోత్స్నతో తృప్తిపడలేదు పోతన మనసు! శరత్కాలపు మేఘాలు, చంద్రుడు, కర్పూరము, చందనము, హంస, మల్లెల మాల, మంచు, సముద్రపు నురుగు, హిమాలయము, ఱెల్లుగడ్డి, ఆదిశేషువు, మొల్లలు, తెల్ల మందారము, పాలసముద్రం, తెల్లతామర, ఆకాశగంగ - ఇవన్నీ గుర్తుకొచ్చాయి ఆయనకి వాటన్నిటితో పోలిస్తేనే కాని తృప్తి కలగలేదు ఆయనకి! వెయ్యిమాటలు అవసరం లేదు విన్నంతనే ఆవతలవారికి హాయి అనిపించే చల్లని మాట చాలు. ఇటువంటి హాయిని అందించే మాటల మూటల పద్యాలు మన తెలుగు సాహిత్యంలో కోకొల్లలు...వాటిని అన్నింటినీ మరల ఒకసారి గుర్తుచేసుకుందాం! మరో తరానికి అందిద్దాం!! సత్యసాయి విస్సా ఫౌండేషన్!
Tuesday, September 29, 2015
Monday, September 28, 2015
Sunday, September 27, 2015
అర్ధం చేసుకుందాం! ఆచరిద్దాం!! తరిద్దాం!!
ఓం గం గణపతయే నమః
అర్ధం చేసుకుందాం! ఆచరిద్దాం!! తరిద్దాం!!
జ్ఞానం అన్నది మహాసాగరం ...ఎంత నేర్చినా తరగని నిధి. అనాదిగా అపార జ్ఞాన సంపన్నులైన మన మహా ఋషులు, మునులు కూడా మేము జ్ఞానులము అని ఎప్పుడూ చెప్పుకోలేదు. జ్ఞాన సముపార్జనకి ఏవిధమైన అడ్డంకులు ఎవరూ ఎప్పుడూ కల్పించలేదు, కల్పించ లేరు కూడా అయినా మనం నేర్చుకోలేము, నేర్చుకోము సరికదా ఎల్లప్పుడూ జ్ఞానం ఫలానా వారు మాకు ఎవరూ బోధించడం లేదని, అందరికీ చేరనివ్వలేదని కుహనా మేధావుల విమర్శలు ఈ మధ్య తరచూ వినబడుతున్నాయి. మనకి అన్నీ తెలుసనుకుంటాము కానీ మనకు ఏమి తెలియదు. నిజానికి మొట్టమొదటగా చదివే గణపతి శ్లోకాలు 'శుక్లాం బర ధరం' అగజానన పద్మార్కం" మొదలైన శ్లోకాలే సరిగ్గా చదవడం రాదు ...నిజం సరిగ్గా చదవడం రాదు. కావాలంటే ఇప్పుడే ఒకసారి చదివి ఈ శ్లోకాల అర్ధం చదవండి. ప్రతి రోజూ అర్ధం చేసుకుందాం! ఆచరిద్దాం!! తరిద్దాం!! శీర్షికన ఇటువంటి శ్లోకాల అర్ధవివరణ మాకు పునాది వేసిన మా విస్సా ఫౌండేషన్ ద్వారా మీకు అందజేస్తాము.. శుక్లాంబర ధరం విష్ణుం శశి వర్ణం చతుర్భుజం!
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే!!
శుక్ల+అంబర+ధరం --శుభ్రమైన (తెల్లని) వస్త్రము ధరించినవాడు
విష్ణుం -- సర్వాంతర్యామి ఐనవాడు
శశి వర్ణం --చంద్రుని రంగు కలిగినవాడు
చతుర్భుజం --నాలుగు భుజములు కలిగినవాడు . పాశము, అంకుశము, మోదకము మరియు అభయ హస్తము కలిగినవాడు అన్నది స్థూలమైన అర్థము. మన ఆశా పాశమునకు అంకుశము వేస్తే ఆయనకది మోదకము. అప్పుడు ఆయన అభయహస్తము మనకు సిద్ధిస్తుంది.
ప్రసన్న వదనం : ప్రసన్నమైన నగుమోము కలిగినవాడు
సర్వ విఘ్నోపశాంతయే-- ఆటంకముల నన్నింటినీ మట్టుబెట్టుటకు (సర్వ+ విఘ్న ఉపశాంతయే)
ధ్యాయేత్ --ప్రార్థింతుము.
శుక్లాం బరధరం బరధరం అని చదువుతాము. ఎంత తప్పు!! ఎన్ని నామాలు ఎన్ని సార్లు, ఎన్నిలక్షల కోట్ల బిల్వపత్రార్చన అన్న లెక్కలు, చిత్తం శివుడి మీద దృష్టి చెప్పుల మీద అన్నట్లు కాకుండా చిత్త శుద్ధితో ఏకబిల్వం శివార్పణం అన్నట్లుగా త్రికరణ శుద్ధితో ప్రతి అక్షరం అర్ధం పరమార్ధం తెలుసుకుందాం! అలాగే మరెన్నో విషయాలు, ఆలయ సందర్శన విధులు వంటి ఎన్నో ధర్మ సందేహాలు!! ఈ శీర్షికన ప్రతి రోజూ తెలుసుకుందాం! ధర్మో రక్షతి రక్షితః !!శుభం భూయాత్!!!మణిసాయి విస్సా ఫౌండేషన్!
ఓం గం గణపతయే నమః ఓం నమ:శివాయ
అర్ధం చేసుకుందాం! ఆచరిద్దాం!! తరిద్దాం!!
గణేశ శ్లోకం:- అగజానన పద్మార్కం గజాననమహర్నిశం| అనేకదం తం భక్తానాం ఏకదం తముపాస్మహే||
అ =లేనిది,
గ=చలనము ( అంటే చలనము లేలిది=పర్వతము=హిమాలయము=దానికిరాజైన హిమవంతుని )
జ= కుమార్తె (అనగా పార్వతీదేవి)
ఆనన= ముఖమను
పద్మ= పద్మమునకు
అర్కం= సూర్యుడైనట్టి( సూర్యుని చూస్తే తామరలు అనగా పద్మములు వికసిస్తాయి. అంటే ఆ కొడుకును చూస్తే ఆ తల్లికంత ప్రేమ. ఆమె జగన్మాత కనుక మనతల్లులకి ఆదర్శం పిల్లలని చూస్తే తల్లుల ముఖం వికసిస్తుంది. మరి మనమో తల్లి తండ్రులను వృద్ధా శ్రమాల్లో చేర్పిస్తున్నాము. మాతృదేవోభవ పితృదేవోభవ అని తల్లి తండ్రులకు ప్రదక్షిణం చేసిన గణపతి కుమారస్వామికి ముల్లోకాల లోని నదుల్లో ముందుగా స్నానమాచరించి ఎదురుగా వస్తూ కనబడ్డాడు. తల్లి తండ్రులను పూజించాలని ఆ మహా గణపతి మనకి ఆదర్శంగా చేసి చూపించాడు. మనం ఆచరించాలి అప్పుడే మన పూజలు స్వీకరిస్తాడు.
గజ +అననం =ఏనుగు ముఖము కల్గిన (నిన్ను)
అహర్+నిశం = పగలూ రాత్రి అంటే రోజంతా
అనేకదం= ఎంచ వీలు లేనంత
తం =తమరి, మీయొక్క
భక్తానాం = భక్తులలో
ఎకదం= ఒకడు
తం= తమరిని
ఉపాస్మహే= ప్రార్థించుచున్నాడు
ఈ శ్లోకములో అనేకదంతం అని ఏకదంతం అని చదువరాదు. అనేకదం తంభక్తానాం అని ఎకదం తంఉపాస్మహే అని చదువవలెను. పెద్దలు ఈ విషయంలో అందరూ సరిగ్గా ఉచ్చరించేలా (పలికేలా) చూడాలి. శుభం భూయాత్!! మణిసాయి విస్సా ఫౌండేషన్.
Saturday, September 26, 2015
ఓం శ్రీ అనంత పద్మనాభ స్వామినే నమః !!
ఓం శ్రీ అనంత పద్మనాభ స్వామినే నమః !!
అనంతుడు అనేది శ్రీమహావిష్ణువుకు ఉండే పేర్లలో ఒకటి. శ్రీమహావిష్ణువును అనంతుడిగా పూజిస్తూ చేసే వ్రతమునకే ’అనంత చతుర్దశి వ్రతం’ లేదా ’ అనంత పద్మనాభ వ్రతం’ అని పేర్లు. ఈ వ్రతం గురించి శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుకు వివరించినట్లు భవిష్యోత్తర పురాణంలో చెప్పబడింది.
అనంత పద్మనాభ వ్రతాన్ని ఆచరిస్తే సకల సంపదలు చేకూరుతాయి. శ్రీకృష్ణ భగవానుడు అనంత పద్మనాభ వ్రతాన్ని ధర్మరాజుకు వినిపించినట్లు పురాణాలు చెబుతున్నాయి. భాద్రపద శుక్ల చతుర్ధశి నాడు ఈ అనంత పద్మనాభస్వామి వ్రతాన్ని చాలా మంది ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకుంటారు.
అనంతనామ ధేయాయ సర్వకార విధాయినే
సమస్త మంత్రం వాక్చాయ విశ్వైక పతయే నమః !!!
Friday, September 25, 2015
Thursday, September 24, 2015
నా మానస మందెదో తళుకు మన్నది పుష్పవిలాప కావ్యమై
నీ పూజ కోసం పూలు కోసుకు వద్దామని ప్రొద్దుననే తోటలోనికి వెళ్ళాను ప్రభూ. ఉదయశ్రీ అరుణారుణ కాంతులలో ఉద్యానం కళకళలాడు తున్నది.
పూల బాలలు తల్లి వొడిలో అల్లారు ముద్దుగా ఆడుకుంటున్నాయి. అప్పుడు,
చివాలున కొమ్మవంచి గో రానెడు నంతలోన
విరులన్నియు జాలిగ నోళ్ళు విప్పి "మా ప్రాణము దీతువా" యనుచు బావురు మన్నవి;
క్రుంగిపోతి;
నా మానస మందెదో తళుకు మన్నది పుష్పవిలాప కావ్యమై
నే నొక పూలమొక్క కడ నిల్చి
విరులన్నియు జాలిగ నోళ్ళు విప్పి "మా ప్రాణము దీతువా" యనుచు బావురు మన్నవి;
క్రుంగిపోతి;
నా మానస మందెదో తళుకు మన్నది పుష్పవిలాప కావ్యమై
కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి మహాద్భుత సృష్టి లో పుష్పవిలాపం ఒకటి...ఘంటసాల గానమదుర్యం తో జీవం పోస్తే...కాకతాళీయంగా నేను తీసిన చిత్రాలు నాకు ఆ పద్య భావాన్ని స్పురింపచేస్తున్నాయి..మన జీవనాలు ...పుష్ప విలాపాలు లేని పుష్ప విలాసాల ఆనందమయ అందమైన ఉద్యానవనాలు కావాలని ...సత్యసాయి విస్సా.
Wednesday, September 23, 2015
శుభోదయం.../\... పూజ్యాయ రాఘవేంద్రాయ సత్య ధర్మరతాయచ | భజతాం కల్పవృక్షాయ నమతాంకామధేనవే ||
శుభోదయం.../\...
పూజ్యాయ రాఘవేంద్రాయ సత్య ధర్మరతాయచ |
భజతాం కల్పవృక్షాయ నమతాంకామధేనవే ||
శ్రీ రాఘవేంద్రా...గురు రాఘవేంద్రా
నీ దీవెనే.....చల్లనా ...
మధురం నీనామం
మధరం నీరూపం | శ్రీ రాఘవేంద్రా |
మహిలో ధర్మం ... మనుపగనెంచి
మాప్రభువైనావో.....
మమతలు తెలిసి ...మనసులు మలచి
మనుజులబ్రోచేవో..... | మహిలో |
వెలసే నీలీల
తెలిసే దేవేశా ... | శ్రీ రాఘవేంద్రా |
సతతము నిన్నే... చింతన చేసిన
అతులిత వైభవము......
పతితుల గతివై - వ్యధలకు సుధవై
బ్రతుకులు అతికేవో .... | సతతము |
వెలసే నీలీల
తెలిసే దేవేశా | శ్రీ రాఘవేంద్రా |.
Monday, September 21, 2015
శుభోదయం .../\... శ్రీహనుమాన్ జై హనుమాన్.
శుభోదయం .../\...
శ్రీహనుమాన్ జై హనుమాన్.
ఓం ఆంజనేయాయ విద్మహే
వాయుపుత్రాయ ధీమహీ
తన్నో హనుమత్ ప్రచోదయాత్ !!
మహాబలశాలి, మహారామభక్తుడు, వాయుపుత్రుడు, బుద్ధిమంతులలో శ్రేష్టుడు అయిన ఆంజనేయస్వామిని పూజించడం వల్ల ఏవిధమైన భూతప్రేతాలు, భయాలు మన దరిచేరవు.
Sunday, September 20, 2015
శివుడు అభిషేక ప్రియుడు అంటారు ఎందుకు?
విష్ణువు అలంకారప్రియుడైనట్లే శివుడు అభిషేక ప్రియుడయ్యాడు. శివుడు అభిషేకాన్ని చాలా ప్రియంగా భావిస్తాడు. కాబట్టి అభిషేకప్రియుడనబడుతున్నాడు. ఎడతెగని జలధారతో శివలింగాన్ని అభిషేకిస్తారు. శివుడు గంగాధరుడు.ఆయన శిరస్సు పై గంగ వుంటుంది. అందువల్ల శివార్చనలో అభిషేకం ముఖ్యమైనది. గంగ జలరూపమైనది. జలం పంచభూతాలలోను, శివుని అష్టమూర్తులలోను ఒకటి. " అప ఏవ ససర్జాదౌ " అన్న ప్రమాణాన్ని బట్టి బ్రహ్మ మొదట జలాగ్నే సృష్టించాడు. ప్రాణులన్నింటికీ ప్రాణాధారం నీరే.
మంత్రంపుష్పంలోని " యోపా మాయతనంవేద " ఇత్యాది మంత్రాలలో నీటి ప్రాముక్యం విశదీకరించబడివున్నది. అందుచేత శివపూజలలో జలాభిషేకానికి ఎంతో ప్రాముఖ్యం ఏర్పడింది. భగవంతున్ని 16 ఉపచారాలతో పూజిస్తారు. అందులో ఇతర ఉపచారాలకంటే జలాభిషేక రూపమైన స్నానమనే ఉపచారమే ప్రధానమైనది.
"ప్రజపాన్ శతరుద్రీయం అభిషేకం సమాచరేత్" అన్న ప్రమాణాన్ని అనుసరించి శతరుద్రీయం పటిస్తూ అభిషేకం చేయాలి." పూజాయా అభికోహోమో హోమాత్తర్పణ ముత్తమం తర్పణాచ్చ జపః శ్రేష్టో హ్యభిహేకః పరో జపాత్ " పూజకంటే హోమము, హోమము కంటే తర్పణము, తర్పణం కంటే జపమూ, జపం కంటే అభిషేకము ఉత్తరోత్తరం శ్రేష్టాలని పేర్కొనబడ్డాయి అని పెద్దలు చెపుతారు.
Saturday, September 19, 2015
ఆదివార శుభ శుభోదయం../\...
శుభోదయం.../\...
భగవంతుడు లేడని అనేవారు ఉండచ్చుగానీ, వెలుగూ వేడీ లేవనీ, వాటికి కారకుడైన సూర్యుడు లేడనీ ఎవరూ అనలేరు. జాతి, మత, దేశబేధాలు లేకుండా అన్ని విశ్వాశాలకూ, సిద్ధాంతాలకూ అతీతంగా అందరికీ, అందరి అనుభవంలోనూ ఉన్నవాడు సూర్యుడు. అందుకే ఆయన ప్రత్యక్ష దైవం, లోకసాక్షి, జీవుల చావు పుట్టుకలకు, పోషణకు, కాలనియమానికీ, ఆరోగ్యానికీ, వికాసానికీ అన్నింటికీ మూలం సూర్యుడే. సూర్యుడు లేకపోతే జగత్తు ఉండదు. ఆ స్థితిని ఊహించడానికి కూడా సాధ్యం కాదు.అటువంటి ఆ సూర్య భగవానునికి శతకోటి ప్రణామాలు తెలియచేస్తున్నాను.
మా బొజ్జగణపయ్య ఉయ్యాలలో నిద్ర
ఇష్ష్ ష్ ష్ ష్ ష్ ష్ నిశబ్ధం ...మా చిన్నాడు చి. ప్రభవ్ జో జో అని లాలీ పాట పెట్టి ఉయ్యాల ఊపితే మా బొజ్జగణపయ్య ఉయ్యాలలో ఎలా నిద్రపోతున్నాడో...ఇక మీరు కూడా టిక్ టిక్ అంటూ కంప్యూటర్ బటన్స్ నొక్కడం ఆపి పేస్ బుక్ లాగ్ అవుట్ చేసి పడుకోండి! మరల రేపు సుప్రభాతంతో 4:30 గంటలకి మనల్ని ఎలుకోడానికి మేలుకుంటాడు!...అప్పటి దాకా ....తీపి కలల శుభరాత్రి!!
Friday, September 18, 2015
Thursday, September 17, 2015
Subscribe to:
Posts (Atom)