యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థితా
నమస్తస్త్యై నమస్తస్త్యై నమస్తస్త్యై నమోనమః !!
క్షోణితలంబునన్ నుదురు సోకగ మ్రొక్కి నుతింతు సైకత
శ్రోణికి జంచరీకచయ సుందరవేణికి రక్షితామర
శ్రేణికి దోయజాతభవ చిత్త వశీకరనైక వాణికిన్
వాణికి నక్షదామ శుక వారిజ పుస్తక రమ్య పాణికిన్.
భావం:- నెలకు నెన్నుదురు సోకునట్లు సాగిలపడి మ్రొక్కి సైకత శ్రోణి, చదువుల వాణీ, అలివేణి అయిన వాణిని సన్నుతిస్తాను. ఆ చల్లని తల్లి ఒక చేతిలో అక్షరామాలనూ, మరొక చేతిలో రాచిలుకనూ, ఇంకొక చేతిలో తామర పువ్వునూ, వేరొక చేతిలో పుస్తకాన్ని ముచ్చటగా ధరిస్తుంది. సుధలు వర్షించే తన సుందర సుకుమార సూక్తులతో అరవిందభవుని అంతరంగాన్ని ఆకర్షిస్తుంది.తన కటాక్ష వీక్షణాలతో సుర నికరాన్ని కనికరిస్తుంది.
No comments:
Post a Comment