Thursday, August 31, 2017

పాలు-కర్మ-సంబంధం-ఆకలి

పాలు-కర్మ-సంబంధం-ఆకలి

పాలను ఆశించి గోవును పోషిస్తాము ,
గోవు నుంచి మనకు పాలు వస్తాయి
అంతే కాదుః పేడ కూడా వస్తుంది ,
పాలు ఇంట్లోకి తెచ్చుకుంటాం ,
పేడని .ఇంటికి దూరంగా విసిరేస్తాం ,

ఆవు నుండి పాలు మాత్రమే రావాలి –
పేడ రాకూడదు అంటే వీలు కాదు ,
కర్మలు కూడా ఇలాగే ఉంటాయి …
ఏ కర్మ చేసినా అది పూర్ణంగా అర్థవంతంగా
ఉంటుందని చెప్పలేము ,
కొంత అభ్యంతరంగా కూడా ఉంటుంది .
సంబంధాలు కూడా ఇలాగే ఉంటాయి .
ఏ. సంబంధం లేకుండా ఎవరితోను సంబంధం
లేకుండా జీవించడం సాధ్యపడదు .
కాని సంబంధాలలో కేవలం సంతోషమే
ఉంటుందని చెప్పలేము ,
విషాదం కూడా కలిసే ఉంటుంది ,
మనం ఎవరితో కలిసి జీవింజీవించినా . వారు –
తల్లిదండ్రులు కావచ్చు , అన్నదమ్ములు
కావచ్చు , భార్యాభర్తలు కావచ్చు
స్నేహితులు కావచ్చు , బంధువులు కావచ్చు ,
వారిలో అన్నీ మనకు నచ్చిన గుణాలే
ఉంటాయని చెప్పలేము .
మనకు నచ్చనివి , వారు మెచ్చేవి కూడా
ఉంటాయి …. అలాంటివి ప్రేమకి సౌఖ్యానికి
ప్రతిబంధకాలే కావచ్చు , కాని అవి లేకుండా
సంబంధాలు లేవు గులాబీలమధ్యా ముళ్ళు
తప్పనట్లు సంబంధాలలో ఈ విధమైన
సంఘర్షణలు తప్పవు ..

భోజనం చేయాలి ఆకును పడేయాలి .
కాని. ఆకు లేకుంటే వడ్డించటమే జరగదు —
ఆకలి తీరదు , ఆకలి అన్నంతోనే తీరుతుంది
అన్నం ఆరగించినంత. వరకు ఆకును
ఆదరిస్తూనే పోవాలి ,పడేసేదే కదా అనుకోవచ్చు , కడుపులో
అన్నం పడే ఆకు మన ముందే ఉండాలి ,…
ఈ. ప్రపంచంలో ఏది అవసరం లేని క్షణం
ఒకటి రావచ్చు కాని అవసరాలలో
ఆవశ్యంగా తొంగిచూసే అనవసరాలనుకూడా
పెద్ద మమనసుతో అంగీకరించేతత్వం
పెంచుకుంటేనే అభివృద్ధిని సాధించటం
మనిషికి సాధ్యపడుతుంది......


Wednesday, August 30, 2017

కధ

పూర్వం ఇద్దరు రాజులు రధాలపై పొరుగు రాజ్యం వెళ్తూ ఇరుకైన ఒక వంతెన మీద ఎదురయ్యారు..
ఒక రాజు రధం వెనక్కి వెళ్తేనే గానీ రెండో రధం ముందుకు వెళ్ళే వీలు లేదు..
రధసారధులిద్దరూ నీ రధం వెనక్కి తీసుకెళ్ళంటే నీదే తీసుకెళ్ళమని వాదించుకోడం‌మొదలెట్టారు. ఇద్దరు రాజులూ ఏం జరుగుతుందా అని చూస్తున్నారు..
చివరికీ ఇద్దరు సారధులూ ఒక ఒప్పందానికి వచ్చారు..
వాళ్ళు తమ రాజుల గొప్పదనం చెప్పేట్టు.. ఏ రాజు గొప్పవాడో ఆరాజుకు రెండో రాజు ముందు దారి ఇచ్చేట్టు..
సరే మొదటి రధసారధి ఇలా అన్నాడు..
మా రాజ్యంలో మా రాజుగారు రోజుకి వందమంది అభాగ్యులకి ఆకలి బాధతో ఉన్నవారికి భోజనం ఏర్పాటుచేసి గానీ వారు భుజించరు.. గుడ్డలు కూడా లేని వారికి రోజుకి ఐదారువందలమందికి వస్త్రదానం చేస్తారు.. అనాధ శరణాలయాలు..వృద్ధాశ్రమాలూ స్థాపించారు..

రెండవ సారధి తలదించుకుని కంట నీరుపెట్టుకుని తన రధం వెనక్కి తీయడానికి సిద్ధమయ్యాడు..
దానికి ఆరాజు గారిలా అడిగారు.. ఏమయ్యా మీ రాజుకి దాన గుణం‌లేదా అలా ఏమీ చెప్పకుండా రధం వెనక్కి తిప్పుకుంటున్నావు..
దానికా రెండో రధ సారధి వినయంగా ఇలా అన్నాడు..
హే రాజా మా రాజుగారు దానం చేస్తుండగా చూసే అదృష్టం మా రాజ్యం లో ఎవరికీ కలగలేదు.. మా రాజ్యం లో దానం చేద్దామ‌ంటే సామాన్యులమైన మాకే ఒక్క దీనుడూ కనబడలేదు..‌ వృద్ధాశ్రమాల్లో ఉండాల్సిన అవసరమూ ఏనాడూ ఎవరికీ కలగలేదు..‌ఇంక మారాజుగారికా అవకాశం ఎలఎలా ఉంటుంది.. దానం చేసే అవసరం అవకాశం మా రాజ్యంలో లేదు ప్రభూ అని.
వెంటనే మొదటి రధంలో రాజు రధం దిగి రెండవ రాజుకు పాదాభివందనం చేసి తనరధం వెనక్కి తీయించి దారి ఇచ్చాడు..

వేల వృద్ధాశ్రమాలూ..రాయితీలు.సంక్షేమపధకాలూ ఉచితాలూ.. అభాగ్యులకు సేవలూ దశాబ్దాలుగా అమలు చేసే పరిస్థితులున్న.. ఆశించే పౌరులున్న  ఏ దేశమూ మంచి పాలనలో ఉన్నట్టు కాదు..

Tuesday, August 29, 2017

అందరికీ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు.

అందరికీ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు.
*తెలుగు తొలిప్రొద్దు వెలుగులు లేక తెలుగు ప్రపంచంలో ప్రథమాలు.
*శాసనాలలో తొలి తెలుగు పదం - నాగబు
*తొలి పూర్తి తెలుగు శాసనం - రేనాటి చోడులది
*తొలి తెలుగు కవి - నన్నయ
*తొలి తెలుగు కావ్యం - ఆంధ్రమహాభారతం
*తొలి తెలుగు నిర్వచన కావ్యం - నిర్వచనోత్తర రామాయణము
*తొలి తెలుగు ప్రబంధము - మనుచరిత్రము
*తొలి తెలుగు నవల - రాజశేఖర చరిత్రము
*తొలి తెలుగు కవయిత్రి - తాళ్ళపాక తిమ్మక్క
*తొలి తెలుగు వ్యాకరణము -
ఆంధ్రభాషాభూషణము
*తొలి తెలుగు గణిత గ్రంథము -గణితసార సంగ్రహము
*తొలి తెలుగు ఛందశ్శాస్త్రము - కవిజనాశ్రయము
*తొలి తెలుగు శతకము - వృషాధిశతకము
*తొలి తెలుగు నాటకము - మంజరీమధుకీయము
*తొలి తెలుగు శృంగారకవయిత్రి -
ముద్దుపళని
*తొలి తెలుగు కథానిక - దిద్దుబాటు
*తొలి తెలుగు దృష్టాంతశతకము - భాస్కర శతకము
*తొలి తెలుగు రామాయణము - రంగనాథ రామాయణము
*తొలి తెలుగు ద్వ్యర్థికావ్యము - రాఘవ పాండవీయము
*తొలి తెలుగు జంటకవులు - నందిమల్లయ, ఘంట సింగన
*తొలి తెలుగు పురాణానువాదము -మార్కండేయ పురాణము
*తొలి తెలుగు ఉదాహరణకావ్యము -
బసవోదాహరణము
*తొలి తెలుగు పత్రిక - సత్యదూత
*తొలి తెలుగు నీతి శతకము - సుమతీశతకము
*తొలి తెలుగు సాంఘిక నాటకము -
నందకరాజ్యం
*తొలి తెలుగు వాగ్గేయకారుడు - అన్నమయ్య
*తొలి తెలుగు ద్విపదకవి - పాల్కురికి సోమన
*తొలి తెలుగు పద్యం (శాసనాలలో) - తరువోజ
*తొలి తెలుగు పద్యశాసనము - అద్దంకి శాసనము
*తొలి తెలుగు ధర్మశాస్త్రము -
విజ్ఙానేశ్వరీయము
*తొలి తెలుగు పరిశోధనా వాఙ్మయగ్రంథము -
సకల నీతి సమ్మతము
*తొలి తెలుగు వ్యావహారిక నాటకము -
కన్యాశుల్కం
*తొలి తెలుగు కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి -
ఆంధ్రుల సాంఘిక చరిత్ర
*తొలి తెలుగు ఖురాన్- చిలుకూరినారాయణరావు
*తొలి తెలుగు వ్యావహారికభాషా వచనగ్రంధం-
హితసూచని (1853) - స్వామినేని ముద్దునరసింహంనాయుడు (1792-1856).
*తొలి ఉరుదూ-తెలుగు నిఘంటువు -
ఐ.కొండలరావు 1938
*తెలుగు ప్రముఖులు:-
*ఢిల్లీ దర్బారు (ఫిరొజ్ షా తుగ్లక్) లో తొలి వజీరు (ప్రధానమంత్రి)-- మాలిక్ మక్బూల్ / యుగంధర్ లేక దాది (సాగి) గన్నమ నాయకుడు.
*ప్రధాన మంత్రి అయిన తొలి తెలుగువ్యక్తి-
పి.వి.నరసింహారావు
*రాష్ట్రపతి అయిన తొలి తెలుగువ్యక్తి-
వి.వి.గిరి
*అంటార్కిటికా కు వెళ్ళిన తొలి తెలుగువ్యక్తి-
దాట్ల రామదాసు
*ఒలంపిక్ క్రీడలలో పతకం సాధించిన తొలి తెలుగు వ్యక్తి- కరణం మల్లేశ్వరి.

Friday, August 25, 2017

కార్తెలపై సామెతలు*

కార్తెలపై సామెతలు*

🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺


1.అశ్వని (ఏప్రిల్ – 14) '


అశ్వని కురిస్తే అంతా నష్టం, అప్పులు ఖాయం

అశ్వని కురిస్తే ఆరు కార్తెలు విడుపు.

అశ్వని కురిస్తే అడుగు తడవదు.

2'.'భరణి' (ఏప్రిల్ – 27)


భరణిలో పుట్టిన ధరణి ఏలును భరణి కురిస్తే ధరణి పండును.

భరణి ఎండకు బండలు పగులుతాయి.

భరణిలో చల్లిన నువ్వు చేను కాయకు బరిగెడు గింజలు

భరణి కార్తెలో చల్లిన కాయకు చిప్పెడు పంట.

3.కృత్తిక (మే – 11)


కృత్తిక పునర్వసులు సత్తువ పంట.

కార్తె ముందర ఉరిమినా కార్యం ముందర పదిరినా చెడుతుంది.

4.రోహిణి (మే – 25)


రోహిణి ఎండకు రోళ్ళు పగులును

రోహిణిలో విత్తనం రోళ్ళు నిండనిపంట.

రోహిణి ఎండకు రోళ్ళో పాయసం ఉడుకును.

5.మృగశిర (జూన్ – 8)


మృగశిర కార్తెలో ముంగిళ్ళు చల్లబడును

మృగశిర కురిస్తే ముసలెద్దు రంకె వేయును.

మృగశిరకు ముల్లోకాలు చల్లబడును.

మృగశిర బిందె ఇస్తే ఇరు కార్తెలు ఇంకా ఇస్తాయి.

మృగశిరలో బెట్టిన పైరు, మీస కట్టున కొడుకు మేలు.

మృగశిరి వర్షిస్తే మఖ గర్జిస్తుంది.

మృగశిర కురిస్తే ముంగాలి పండును.

మృగశిర చిందిస్తే అయిదు కార్తెలు వర్షించును.

6.ఆరుద్ర (జూన్ – 22)


ఆరుద్ర కార్తె విత్తనానికి అన్నం పెట్టిన ఇంటికి సేగి లేదు

ఆరుద్ర కురిస్తే ఆరు కారెలు కురుస్తాయి.

ఆరుద్ర కరుణిస్తే దారిద్ర్యము లేదు.

ఆరుద్ర చిందిస్తే అరవై దినాల వరపు.

ఆరుద్ర మొదటి పాదాన ఎత్తితే ఆరంభాలు చెడు.

ఆరుద్రతో అదనుసరి.

ఆరుద్రలో అడ్డెడు చల్లితే ‘పుట్టెడు’పండుతాయి.

ఆరుద్ర వాన ఆదాయాల బాన.

ఆరుద్ర వానకు ఆముదాలు పండుతాయి.

ఆరుద్రలో వేసినా, అరటి ఆకులో పెట్టిన అన్నము ఒక్కటే.

ఆరు కార్తెలు పోతే ఆరుద్ర దిక్కు.

ఆరుద్రలో వర్షం, అమృతంతో సమానం.

ఆరుద్ర వాన అరుదు వాన

ఆరుద్ర ఉరిమితే ఆరు వానలు పడుతాయి

7.పునర్వసు (జులై – 6) :-


పునర్వసు, పుష్యాలకు పూరేడు గుత్తయినా తడవదు.

8.పుష్యమి (జులై – 20) :-


పుష్యమి కురిస్తే ఊరపిట్ట గూడ తడవదు.

పునర్వసు పుష్యమి కార్తెలు వర్షిస్తే పూరేడు పిట్ట అడుగైనా తడవదు

9.ఆశ్లేష (ఆగస్టు – 3) :-


ఆశ్లేష ఊడ్పు ఆరింతలవుతుంది

ఆశ్లేష కురిస్తే ఆరోగ్యం.

ఆశ్లేష వాన అరికాలు తేమ

ఆశ్లేషలో ముసలెద్దు గూడ రంకె వేయును.

ఆశ్లేష ముసురు – ఆగి ఆగి తుంపర కురియును.

ఆశ్లేషలో అడుగున కొక చిగురైనా అడిగినన్ని వడ్లు ఇస్తుంది.

ఆశ్లేషలో అడ్డెడు చల్లటం – పుట్టెడు ఏరుకోవటం

ఆశ్లేషలో ఊడ్చిన – అడిగినంతపంట.

ఆశ్లేష వర్షం – అందరికి లాభం.

ఆశ్లేష వాన అరికాలు తేమ

10.మఖ (ఆగస్టు – 17) :-


మఖ మానికంత చెట్టయితే – కార్తీకానికి కడవంత గుమ్మడికాయ

మఖ పుబ్బలు వరుపయితే మీ అన్న సేద్యం, నాసేద్యం మన్నే.

మఖలో విత్తనాలు చల్లితే మచ్చలు కనపడతాయి.

మఖలో పుట్టి పుబ్బలో మాడినట్లు.

మఖలో మానెడు పుబ్బలో పుట్టెడు.

మఖా పంచకం సదా వంచకం.

మఖ పుబ్బలు వొరుపైతే మహత్తరమైన కాటకం.

మఖ ఉరిమితే మదురుమీద కర్రయినా పండును.

11.పుబ్బ (ఆగస్టు – 31) :-


పుబ్బలో చల్లినా, బూడిదలో చల్లినా ఒకటే.

పుబ్బలో చల్లేది, మబ్బుతో మొరపుట్టుకునేది.

పుబ్బ ఉచ్చిచ్చి కురిసినా గుబ్బిబ్బి చెట్టు కింద నానదు

పుబ్బ కెరివితే భూతం కెరివినట్లు

పుబ్బ రేగినా బూతు రేగినా నిలవదు

పుబ్బలో చల్లే దాని కంటే దిబ్బలో చల్లేది మేలు

పుబ్బలో పుట్టెడు చల్లే కంటే మఖలో మానేడు చల్లటం మేలు

పుబ్బలో పుట్టెడు చల్లే కంటే ఆశ్లేషలో అడ్డెడు చల్లటం మేలు

పుబ్బలో పుట్టి మఖలో మాడినట్లు

12.ఉత్తర (సెప్టెంబరు – 13) :-


ఉత్తర చూసి ఎత్తరగంప – విశాఖ చూసి విడవరా కొంప.

ఉత్తర ఉరిమినా, త్రాచు తరిమినా తప్పదు.

ఉత్తర ఉరిమి తప్పినా, రాజు మాట తప్పినా, చెదపురుగుకు రెక్కలు వచ్చినా కష్టం.

ఉత్తర పదును ఉలవకు అదును.

ఉత్తరలో ఊడ్చేకంటే గట్టుమీద కూర్చోని ఏడ్చేది మేలు.

ఉత్తర హస్తలు వృష్టికి ప్రమాణం

ఉత్తర వెళ్ళాక వరి ఊడ్పులు కూడదు

13.హస్త (సెప్టెంబరు – 27) :-


హస్త ఆదివారం వస్తే చచ్చేటంత వాన హస్త కార్తెలో చల్లితే అక్షింతలకయినా కావు.

హస్తకు ఆధిపంట – చిత్తకు చివరిపంట.

హస్తకు ఆరు పాళ్ళు – చిత్తకు మూడు పాళ్ళు.

హస్తపోయిన ఆరుదినాలకు అడక్కుండా విత్తు.

హస్తలో అడ్డెడు చల్లేకంటే – చిత్తలో చిట్టెడు చల్లేది మేలు.

హస్తలో ఆకు అల్లాడితే - చిత్తులో చినుకు పడదు.

హస్తలో ఆకు అల్లాడితే చిత్తులో చినుకు పడదు.

హస్తలో చల్లితే హస్తం లోకి రావు.

హస్త కార్తెలో వానవస్తే అడుగకనే గొర్రెలు కట్టు.

హస్త ఆదివారం వచ్చింది చచ్చితిమయ్యా గొల్లబోయల్లారా మీ ఆడవారినగలమ్మి అడ్డ కొట్టాలు వేయించండి అన్నవట గొర్రెలు.


14. చిత్త (అక్టోబరు – 11) :-


చిత్త కురిస్తే చింతలు కాయును

చిత్త చినుకు తన చిత్తమున్న చోట పడును.

చిత్తి ఎండకు బట్టతల పగులును.

చిత్తలో చల్లితే చిత్తుగా పండును.

ఉలవలు, చిత్తకు చిరుపొట్ట.

చిత్త, స్వాతులు కురవకుండా ఉంటే చిగురాకుగూడ మాడిపోవును.

చిత్త నేలలో దుక్కి – పుటం పెట్టిన పుత్తడి.

చిత్త చిత్తగించి స్వాతి చల్లజేసి విశాఖ విసరకుంటే అనూరాధలో అడిగినంత పండుతాను అన్నదట వరి.

చిత్త చిత్తం వచ్చిన చోట కురుస్తుంది.

చిత్త ఎండకు పిట్ట తల పగులుతుంది.

చిత్త స్వాతుల సందు చినుకులు చాలా దట్టం.

15.స్వాతి (అక్టోబరు – 27) :-


స్వాతి కురిస్తే చట్రాయి గూడపండును.

స్వాతి కురిస్తే చల్లపిడతలోకి రావు జొన్నలు.

స్వాతి కురిస్తే భీతి కలుగును.

స్వాతి కురిస్తే మూడు కార్తెలు కురుస్తాయి.

స్వాతి కొంగ, పంటకాపు (రైతు) నీళ్ళున్నచోటే ఉంటారు.

స్వాతి కొంగల మీదికి సాళువం పోయినట్లు.

స్వాతి వానకు సముద్రాలు నిండును.

స్వాతి వాన ముత్యపు చిప్పకుగాని, నత్తగుల్లకే.

స్వాతి సముద్రాన్ని చంకన బెట్టుకొస్తుంది.

స్వాతీ! నేను జవురుకొస్తాను – విశాఖా నువ్వు విసురుకురా అన్నదట.

16.విశాఖ (నవంబరు – 16) :-


విశాఖ వర్షం – వ్యాధులకు హర్షం.

విశాఖ కురిస్తే పంటకూ విషమే.

విశాఖ వర్షం దున్నలకు మాదిగలకు ఆముదాలకు బలం

విశాఖ విసురుతుంది.

17.అనూరాధ (నవంబరు – 20) :-


అనూరాధ కార్తెలో అనాథ కర్రయినా ఈనుతుంది

అనూరాధలో కురిస్తే (తడిస్తే) మనోరోగాలు పోతాయి.

18.జేష్ట్య (డిసెంబరు – 3) :-


జ్యేష్ట చెడకురియును – మూల మురగ కురియును

19.మూల (డిసెంబరు – 16) :-


మూల కార్తెకు వరి మూలన జేరుతుంది

మూల ముంచుతుంది

మూల కురిస్తే ముంగారు పాడు

మూల పున్నమి ముందర మాదిగైనా చల్లడు

మూల మంటే నిర్మూల మంటాడు

మూలలో చల్లిన ఉలవలు మూడుకాయలు ఆరు పువ్వులుగా పండును.

మూల వర్షం ముంచితే జేష్ట వర్షం తేలుస్తుంది.

20.పూర్వాషాడ (డిసెంబరు – 29) 21.ఉత్తరాషాడ (జనవరి – 11) 22.శ్రావణం (జనవరి – 24) 23.ధనిష్ట ( ఫిబ్రవరి – 6 ) 24.శతభిషం ( ఫిబ్రవరి – 19) 25.పుర్వాబాధ్ర ( మార్చి - 4 ) 26. ఉత్తరాబాధ్ర ( మార్చి - 4 )


27.రేవతి ( మార్చి - 31 )


రేవతి వర్షం రసమయం – రమణీయం

రేవతి వర్షం అన్ని పంటలకు రేణింపే.

రేవతి వర్షం సర్వ సస్యములకు రమణీయం

Thursday, August 24, 2017

పిడుక్కీ బియ్యానికీ ఒకటే మంత్రం ..

సీతారామాభ్యామ్ నమః -
.
పిడుక్కీ బియ్యానికీ ఒకటే మంత్రం .. అనే లోకోక్తి
పై లోకోక్తి ఎలా వచ్చింది?
.
మాచిన్న తనంలో కొందరు బ్రాహ్మణులు నిత్యజీవితానికి ఆరోజుకు అవసరమైన అవసరమైన ఆహారాన్ని ధాన్యం, లేదా బియ్యమును యాచనతో సంపాదించుకునేవారు.
ఇత్తడి చెంబు శుభ్రంగా తోముకొని, సీతారామాభ్యామ్ నమః అని చెప్పుకుంటూ ఆరోజు పంచాంగ శ్రవణం చేస్తూ పిడికెడు బియ్యం తో సంతుష్టిచెంది వెళ్ళేవారు.
బిక్షం వేయగానే ఆశీర్వచన మంత్రం చదివే వారు. దీనిని యాయవార వృత్తి అనేవారు. ఇది సంస్కృత పదం.
సంస్కృత నిఘంటువు - ప్రత్యహం ధాన్య యాచనా - అని అర్థం ఇస్తుంది.
ముష్టి అంటే పిడికిలి, యాచన కాదు సవ్య ముష్టి ప్రహారంతో లంకాపురిని జయిస్తాడు .
ఒక విద్యావిహీనుడు, దరిద్రుడు అయిన బ్రాహ్మణునికి చిన్నప్పుడు తండ్రి ఉరుములతో కూడీన వర్షం వచ్చినప్పుడు ఇంద్రుని వజ్రం (పిడుగు) పాలి పడకుండా అందరికీ తెలిసిన ఈ శ్లోకం చెప్పాడు
.
“అర్జునః ఫల్గుణః పార్థః కిరీటీ శ్వేతవాహనః
భీభత్స విజయోర్జిష్ణుః సవ్యసాచీ ధనంజయః” .||
.
తరువాత కొన్ని దినాలకే తండ్రిపోవడం, దరిద్రస్థితిలో చదువులేక పోవడం జరిగింది. యాయవారంతో పొట్ట పోసుకుంటూ యాచనకు వెళ్ళీ తనకు తెలిసిన పిడుగు మంత్రం చెప్పడం మొదలు పెట్టాడు. పంచాంగం చదవడం, ఆశీర్వచనం చేయడం తెలియదు తెలిసినది ఒకే మంత్రం - పిడుక్కీ బియ్యానికి అదే!

శుభ సాయంత్రం../\..

శుభ సాయంత్రం../\..
అలవచ్చినప్పుడు తలవంచితే...
ప్రాణం నిలబడుతుంది!
గొడవైనప్పుడు ఒకఅడుగు వెనక్కి తగ్గితే...
బంధం నిలబడుతుంది!!
ఒక్కక్షణం ఓడినా.. జీవితాంతం మనిషిగా గెలుస్తాం!!!!

బట్టతలపై పద్యము.

బట్టతలపై పద్యము.

తలనూనె రాసెడు తగులాటముండదు-
క్షౌరశాలకు వెళ్ళు కర్మ లేదు/
పేలు కొంపలు గట్టు పెనుబాధ తప్పును-
చుండ్రు బాధలు తప్పి సుఖము గల్గు/
పెళ్ళాము కోపాన పెనుగులాడెడు వేళ-
జుట్టింత దొరకదు పట్టుకొనగ/
అద్దంబు దువ్వెన లవసరమే లేదు-
పర వనితలు వెంటబడుట కల్ల/

కడకు కుంకుడు, శీకాయ ఖర్చు మిగులు/ v
తలకు స్నానంబు చేయుట సులభమౌను/
ఇన్ని గణనీయ లాభంబు లెంచి చూడ/
బట్టతల గల్గు వాడె పో భాగ్యశాలి.
(Source - Facebook)                                                

షోడశ గణపతులు

విఘ్నాధిపతి అయిన వినాయకుడిని 16 రూపాల్లో తాంత్రికులు పూజిస్తుంటారు. నిజానికి వినాయకుడికి 32 రూపాలున్నాయనీ, వీటిలో 16 మాత్రం అత్యంత ప్రముఖమైనవని చెబుతారు. ఈ 16 రూపాలలో ఒక్కో రూపానిదీ ఒక్కో విశిష్టత. ఆ రూపాలేంటో, వాటి విశిష్టతలేంటో తెలుసుకుందాం.

1. బాల గణపతి
ఈ వినాయకుడి రూపానికి నాలుగు చేతులుంటాయి. కుడి వైపు చేతులలో అరటిపండు, పనసతొన, ఎడమవైపు వైపు ఉన్న చేతులతో మామిడిపండు, చెరకుగడని పట్టుకుని దర్శనమిస్తారు. బుద్ధి చురుకుగా పనిచేయాలంటే ఈ బాల గణపతిని పూజించాలి.

కరస్థ కదలీ చూత పన పేక్షుక మోదకమ్
బాలసూర్య నిభం వందే దేవం బాలగణాధిపమ్
అనే మంత్రంతో ప్రతిరోజూ సూర్యోదయ సమయాన చదవాలి.

2. తరుణ గణపతి:

ఈ వినాయకుడి రూపానికి ఎనిమిది చేతులుంటాయి కుడి వైపు చేతులతో పాశం, వెలగగుజ్జు, దంతం, చెరకు ఎడమ వైపు ఉన్న చేతులతో అంకుశం, నేరేడు పండు, వరివెన్ను పట్టుకుని అభయముద్రతో దర్శనమిస్తారు. ఈయనను... పాశాంకశాపూస కపిత్థ జంబూ స్వదంత శాలీనమపి స్వహస్త్రైః ధత్తే సదా య సతరుణాభః పాయాత్స యుష్మాం ష్తరుణో గణేశః అనే మంత్రంతో పూజించాలి.

3. భక్త గణపతి

ఈ వినాయకుడి రూపానికి నాలుగు చేతులుంటాయి కుడి వైపు చేతులలో కొబ్బరికాయ, అరటిపండు ఎడమ వైపు ఉన్న చేతులలో మామిడి పండు, బెల్లపు పరమాన్నం ఉన్న పాత్ర పట్టుకుని కనిపిస్తారు. ఈయనను...

నాలికేరామ్ర కదలీ గుడపాయాస ధారిణమ్
శరచ్చంద్రాభ్వవుషం భజే భక్త గణాధిపమ్

అనే మంత్రతో స్తుతించాలి...ఈయనను సేవిస్తే భక్తిభావం పెరుగుతుంది.

4. వీరగణపతి

ఈ వినాయకుడి రూపానికి పదహారు చేతులుంటాయి కుడి వైపు చేతులతో బాణం, బేతాలుడు, చక్రం, మంచపుకోడు, గద, పాము, శూలం, గొడ్డలిబొమ్మ ఉన్న జెండా, ఎడమవైపు ఉన్న చేతులతో శక్తి అనే ఆయుధం, విల్లు, ఖడ్గం, ముద్గరమనే ఆయుధం, అంకుశం, పాశం, కుంతమనే ఆయుధం, దంతం ధరించి దర్శనమిస్తారు. ఈయనను....

బేతాల శక్తి శర కార్ముక చక్ర ఖడ్గ
ఖట్వాంగ ముద్గర గదాంకుశ నాగపాశాన్
శూలం చ కుంత పరశుధ్వజ మాత్తదంతం
వీరం గణేశ మరుణం త్వనిశం స్మరామి
అనే మంత్రంతో కీర్తించాలి. ఈయనను పూజించిన భక్తులకు తిరుగులేని ధైర్యం ప్రసాదిస్తారు.

5. శక్తి గణపతి

ఆలింగ్య దేవీం హరితాంగయష్టిం
పరస్పరా శ్లిష్ట కటిప్రదేశమ్
సంధ్యారుణం పాశ స్ఫటీర్దధానం
భయాపహం శక్తి గణేశ మీదే
అనే మంత్రంతో ఈ గణేశుని ప్రార్థించాలి. నాలుగు చేతులున్న ఈ గణపతి అంకుశం, పాశం,
విరిగిన దంతం పట్టుకుని దర్శనమిస్తారు. ఈయన కరుణిస్తే ఏదయినా సాధించగలమనే ఆత్మస్థైర్యం పెరుగుతుంది.

6. ద్విజ గణపతి
ఈ వినాయకుడి రూపానికి నాలుగు చేతులుంటాయి కుడి వైపు చేతులతో పుస్తకం, దండం ఎడమవైపు ఉన్న చేతులతో అక్షమాల, కమండలం పట్టుకుని కనిపిస్తారు. ఈయనను...

యం పుస్తకాక్ష గుణదండ కమండలు శ్రీః
విద్యోతమాన కరభూషణ మిందువర్ణమ్
స్తంబేరమానవ చతుష్టయ శోభమానం
త్వాం ద్విజగణపతే ! సిద్ధ్విజ గణాధిపతే స ధన్యః అనే మంత్రంతో పూజించాలి. ఈ గణపతి తెలివి తేటలు ప్రసాదిస్తాడు.

7. సిద్ధి (పింగల) గణపతి

ఈ గణపతిని సేవిస్తే ప్రారంభించిన పనులలో అపజయమన్నది ఉండదు. ఈ వినాయకుడి రూపానికి నాలుగు చేతులుంటాయి కుడి వైపు చేతులతో పండిన మామిడిపండు, ఎడమవైపు ఉన్న చేతులతో పూలగుత్తి, గొడ్డలి పట్టుకుని కనిపిస్తారు. ఈయనను....

పక్వచుత ఫల పుష్పమంజరీ
ఇక్షుదండ తిలమోదకై స్సహ
ఉద్వహన్ పరశుమస్తు తే నమః
శ్రీ సమృద్ధియుత హేమం పింగల
అనే మంత్రంతో స్తుతించాలి.

8. ఉచ్ఛిష్ట గణపతి

కోరిన కోర్కెలు తీర్చే ఈ వినాయకుడి రూపానికి నాలుగు చేతులుంటాయి కుడివైపు చేతులతో నల్ల కలువ, వరివెన్ను ఎడమ వైపు ఉన్న చేతులతో దానిమ్మపండు, జపమాల పట్టుకుని కనిపిస్తారు. ఈయనను....

నీలబ్జ దాడిమీ వీణా శాలినీ గుంజాక్ష సూత్రకమ్
దధదుచ్ఛిష్ట నామాయం గణేశః పాతు మేచకః
అనే మంత్రంతో ప్రార్థించాలి.

9. విఘ్న గణపతి

గణపతి అసలు లక్షణమైన విఘ్ననాశనం ఈ రూపంలో కనిపిస్తుంది. ఈ వినాయకుడి రూపానికి పది చేతులుంటాయి కుడివైపు చేతులతో శంఖం, విల్లు, గొడ్డలి, చక్రం, పూలగుత్తి, ఎడమ వైపు ఉన్న చేతులతో చెరకు, పూలబాణం, పాశం, విరిగిన దంతం, బాణాలు పట్టుకుని కనిపిస్తారు. ఈయనను...

శంఖేక్షు చాప కుసుమేషు కుఠార పాశ
చక్ర స్వదంత సృణి మంజరికా శరౌఘై
పాణిశ్రిఅఅఅ పరిసమీహిత భూషణా శ్రీ
విఘ్నేశ్వరో విజయతే తపనీయ గౌరః అనే మంత్రంతో ప్రార్థించాలి.

10. క్షిప్త గణపతి

ఈ వినాయకుడి రూపానికి నాలుగు చేతులుంటాయి కుడి వైపు చేతులలో దంతం, రత్నాలు పొదిగిన బంగారు కుండ ఎడమ వైపు ఉన్న చేతులతో కల్పవృక్షపు తీగ, అంకుశం ధరించి కనిపిస్తారు. ఈయనను....

దంత కల్పలతా పాశ రత్న కుంభాంకుశోజ్జ్వలమ్
బంధూక కమనీయాభం ధ్యాయేత్ క్షిప్ర గణాధిపమ్
అనే మంత్రంతో స్తుతించాలి.

11. హేరంబ గణపతి

అభయ వరదహస్త పాశదంతాక్షమాల
సృణి పరశు రధానో ముద్గరం మోదకాపీ
ఫలమధిగత సింహ పంచమాతంగా వక్త్రం
గణపతి రతిగౌరః పాతు హేరంబ నామా

అనే మంత్రంతో స్తుతించవలసిన ఈ వినాయకుడి రూపానికి పది చేతులుంటాయి కుడి వైపు చేతితో అభయముద్రనిస్తూ, కత్తి, అక్షమాల, గొడ్డలి, మోదకం ధరించి, ఎడమవైపు ఉన్న చేతులతో వరద హస్త ముద్రతో విరిగిన దంతం, అంకుశం, ముద్గరం, పాశం ధరించి కనిపిస్తారు. ఈయనను సేవిస్తే ప్రయాణాలలో ఆపదలను నివారిస్తారు.

12. లక్ష్మీ గణపతి

బిభ్రాణ శ్శుకబీజపూరక మిలన్మాణిక్య కుంభాంకుశన్
పాశం కల్పలతాం చ ఖడ్గ విలసజ్జ్యోతి స్సుధా నిర్ఘరః
శ్యామేనాత్తసరోరు హేణ సహితం దేవీద్వయం చాంతికే

గౌరాంగో వరదాన హస్త సహితో లక్ష్మీ గణేశోశావ తాత్ అనే స్తోత్రంతో పూజించవలసిన ఈ వినాయకుడి రూపానికి పది చేతులుంటాయి కుడి వైపు చేతితో వరదముద్రనిస్తూ, కత్తి, చిలుక, మాణిక్యం పొదిగిన కుంభం, పాశం, ఖడ్గం ధరించి, ఎడమ వైపు ఉన్న చేతులతో అభయ హస్త ముద్రతో దానిమ్మ, అంకుశం, కల్పలత, అమృతం ధరించి కనిపిస్తారు. ఈ సేవిస్తే ఐశ్వర్యం కలుగుతుంది.

13. మహాగణపతి

ఈ వినాయకుడి రూపానికి పది చేతులుంటాయి కుడి వైపు చేతులతో మొక్కజొన్న కండె, బాణం తొడిగిన విల్లు, పద్మం, కలువ, విరిగిన దంతం ధరించి, ఎడమ వైపు ఉన్న చేతులతో గద, చక్రం, పాశం, వరికంకి, రత్నాలు పొదిగిన కలశం ధరించి కనిపిస్తారు. ఈ గణపతిని సేవిస్తే సమస్త శుభాలూ కలుగుతుంది.

హస్తీంద్రావన చంద్రచూడ మరుణచ్చాయం త్రినేత్రం రసాదాశ్యిష్టం శిరయమాస పద్మకరయా స్వాంకస్థయా సంతతమ్

బీజాపూరగదా ధనుర్విద్య శిఖయుక్ చక్త్రాబ్ద పాశోత్పల
వ్రీహ్యగ్ర స్వవిశాణ రత్న కలశాన్ హస్త్రై ర్వహంతం భజే
అనే మంత్రంతో ప్రార్థించాలి.

14. విజయ గణపతి

సమస్త విజయాలను చేకూర్చే ఈ గణపతి రూపానికి నాలుగు చేతులుంటాయి కుడి వైపు చేతులతో పాశం, విరిగిన దంతం ధరించి, ఎడమ వైపు ఉన్న చేతులతో అంకుశం, పండిన మామిడి పండు ధరించి కనిపిస్తారు. ఈ గణపతిని....
పాశాంకుశ స్వదంత్రామ ఫలావా నాఖు వాహనః
విఘ్నం నిఘ్నంతు నమః స్సర్వం రక్తవర్ణో వినాయకః అనే మంత్రంతో పూజించాలి.

15. నృత్య గణపతి

సంతృప్తిని, మనశ్శాంతినీ ఇచ్చే ఈ గణపతి కుడి చేతులలో పాశం, అప్పాలు, ఎడమ వైపు చేతులతో అంకుశం, పదునుగా ఉన్న విరిగిన దంతం ధరించి దర్శనమిస్తారు.

పాశాంకుశాపూస కుఠారదంతః చంచత్కరః క్లుప్త పరాంగులీకుమ్
పీతప్రభం కల్పతరో రథః స్థం భజామి తం నృత్త పదం గణేశమ్
అనే మంత్రంతో ఈ వినాయకుడిని స్తుతించాలి.

16. ఊర్ధ్వ గణపతి

కారాగార బాధ నుండీ తప్పించే ఈ గణపతి కుడి చేతులలో కలువ, పద్మం, విల్లు, విరిగిన దంతం, ఎడమ వైపు చేతులతో వరివెన్ను, చెరకుముక్క, బాణం, మొక్కజొన్న కండె ధరించి దర్శనమిస్తారు.

కల్హార శాలి కమలేక్షుక చాపదంతా ప్రరోహ కనకోజ్జ్వల లాలితాంగ ఆలింగ్య గణోద్యతకరో హరితాంగ యష్ట్యా దేవ్యా కరోతు శుభమూర్ధ్వ గణాధిపో మేః అనే మంత్రంతో ఈ వినాయకుడిని స్తుతించాలి.

వినాయక చవితి 21 రకాల పత్రాలు ---- వాటిలో గల మూలికలు.

వినాయక చవితి 21 రకాల పత్రాలు ---- వాటిలో గల మూలికలు.
మొన్న,నిన్న కలిపి 14 రకాల పత్రులు గురించి తెలుసుకున్నాం మరి మిగిలిన 7 రకాల పత్రుల గురించి తెలుసుకుందామా!!
15) సింధువార పత్రం : వావిలి ఆకు. ఇది తెలుపు-నలుపు అని రెండు రకాలు. రెండింటిన్లో ఏదైనా వావికి ఆకులను నీళ్ళలో వేసి మరిగించిన నీటితో బాలింతలకు స్నానం చేయిస్తే బాలింతవాతరోగం, ఒంటినొప్పులు ఉపశమిస్తాయి. ఈ ఆకులను దంచి దానిని తలమీద కట్టుకుంటే రొంప, శిరోభారం ఉపశమిస్తాయి.
16) జాజి పత్రం: జాజి పత్రానికి అనేక ఔషధ గుణాలున్నాయి. ఇది అని చోట్ల లభిస్తుంది. జాజిపూలు మంచి సువాసన కలిగి మనిషికి ఉత్తేజాన్ని, మనసుకు హాయిని కలిగిస్తాయి. ఈ సువాసన డిప్రేషన్ నుంచి బయటపడడంలో బాగా ఉపకరిస్తుంది. జాజి ఆకులు వెన్నతో నూరి ఆ మిశ్రమంతో పళ్ళుతోముకుంటే నోటి దుర్వాసన నశిస్తుంది. జాజి కాషాయన్ని రోజు తీసుకోవడం వలన క్యాన్సర్ నివారించబడుతుంది. జాజి చర్మరోగాలకు దివ్యౌషధం. కామెర్లను, కండ్లకలకను, కడుపులో నులుపురుగులను నయం చేయడంలో జాజిపూలు ఉపయోగిస్తారు. జాజిమొగ్గలతో నేత్రవ్యాధులు, చర్మరోగాలు నయం చేస్తారు.
17) గండకీపత్రం: దీనిని మనం దేవకాంచనం అని పిలుస్తాం. థైరాయిడ్ వ్యాధికి ఔషధం గండకీ పత్రం. అరణ్యాలలో లభించే ఈ గండకీ చెట్టు ఆకు మొండి, ధీర్ఘవ్యాధులకు దివౌషధంగా పనిచేస్తుంది. చర్మరోగాలను, పైత్య రోగాలను హరిస్తుంది. దగ్గు, జలుబును హరిస్తుంది.
18) శమీ పత్రం: దేని వ్యవహార నామం జమ్మి. మహాభారతంలో విరాటపర్వంలో పాండవులు దేనిమీదనే తమ ఆయుధాలను దాచిపెడతారు. జమ్మి ఆకుల పసరు తీసి దానిని పుళ్ళు ఉన్నచోట రాస్తే కుష్ఠువ్యాధి నశిస్తుంది. జమ్మిపూలను చెక్కరతో కలిపి సేవించడం వలన గర్భస్రావం జరగకుండా నిరోధించబడుతుంది. జమ్మి చెట్టు బెరడు దగ్గు, ఆస్తమా మొదలైన వ్యాధులకు ఔషధంగా పనిచేస్తుంది.
19) ఆశ్వత్థపత్రం: దీనినే రావి అనికూడా అంటారు. . తులసి లేని ఇల్లు, వేపలేని వీధి, ఒక్క రావి చెట్టు కూడా లేని ఊరు ఉండరాదన్నది మన పెద్దలమట. రావి సాక్షాత్ శ్రీ మహావిష్ణుస్వరూపం. పరమాత్మయే తనును తాను రావిచెట్టుగా చెప్పుకున్నాడు. రావిమండలను ఎండబెట్టి, ఎండిన పుల్లలను నేతితీ కలిపి కాల్చి భస్మం చేసి, ఆ భస్మాన్ని తేనేతో కలిపి సేవిస్తూ ఉంటే శ్వాసకోశవ్యాధులు నివారణ అవుతాయి. అందుకే యజ్ఞయాగాదులు, హోమాల్లో రావికొమ్మలను వాడుతారు. రావి వేర్లు దంతవ్యాధులకు మంచి ఔషధం. దీని ఆకులను హృద్రోగాలకు వాడతారు. రావి ఆకులను నూరి గాయాలపై మందుగా పెడతారు. రావి చర్మరోగాలను, ఉదరసంబంధ వ్యాధులను నయం చేస్తుంది, రక్తశుద్ధిని చేస్తుంది.
20) అర్జున పత్రం: మనం దీనినే మద్ది అంటాం. ఇది తెలుపు-ఎరుపు అని రెండు రంగులలో లభిస్తుంది. మద్ది చెట్టు హృదయ సంబంధిత జబ్బులకు మంచి ఔషధం. హృదయానికి సంబంధించిన రక్తనాళాలను గట్టిపరుస్తుంది. భారతదేశంలో నదులు, కాలువల వెంట, హిమాలయాలు, బెంగాలు, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో విరివిగా పెరుగుతుంది. ఇది శరీరానికి చలువ చేస్తుంది. కఫ, పైత్య దోషాలను హరిస్తుంది కానీ, వాతాన్ని పెంచుతుంది. పుండు నుంచి రక్తం కారుటను త్వరగా ఆపుతుంది. మద్ది బెరడును రుబ్బి, ఎముకలు విరిగినచోట పెడితే గాయం త్వరగా మానిపోతుంది. దీని బెరడును నూరి, వ్రణమున్న ప్రదేశంలో కడితే, ఎలాంటి వ్రణములైనా తగ్గిపోతాయి.
21) అర్క పత్రం: జిల్లేడు ఆకు. జిల్లేడు చెట్టు గణపతి స్వరూపం. జిల్లేడు పాలు కళ్ళలో పడడం వలన కంటికి తీవ్రమైన హాని కలుగుతుంది, కానీ జిల్లేదు ఆకులు, పూలు, వేర్లు, కొమ్మలు, పాలు అన్నీ ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి. ఆస్తమా, దగ్గు మొదలైన వ్యాదులకు జిల్లేడు పూలను వాడటం ఆయుర్వేద గ్రంధాల్లో కనిపిస్తుంది. జిల్లేడుతో చేసిన నూనె చెవుడుకు ఔషధం. జిల్లేడు రక్త శుద్ధిని చేస్తుంది.

వినాయక చవితి 21 రకాల పత్రాలు

వినాయక చవితి 21 రకాల పత్రాలు ---- వాటిలో గల మూలికలు.
నిన్న 7 రకాల పత్రులు గురించి తెలుసుకున్నాం మరి
మరికొన్ని రకాల పత్రుల గురించి తెలుసుకుందామా!!
8) తులసి: 'తులానాం నాస్తు ఇతి తులసి' - ఎంత చెప్పుకున్నా,
తరిగిపోని ఔషధ గుణములున్న మొక్క తులసి. పరమ పవిత్రమైనది, శ్రీ మహాలక్ష్మీ స్వరూపం, విష్ణు మూర్తికి ప్రీతికరమైనది. తులసి మొక్క లేని ఇల్లు ఉండరాదు అంటుంది మన సంప్రదాయం. అంత గొప్ప తులసి గురించి కొన్ని విశేషాలు చెప్పుకుందాం.
కఫ, వాత, పైత్య దోషాలనే మూడింటిని శృతిమించకుండా అదుపులో ఉంచుతుంది తులసి. కాలుష్యాన్ని తగ్గిస్తుంది, తులసి వాసనకు దోమలు దరిచేరవు. తులసి ఆకులు, వేర్లు, కొమ్మలల్లో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. చర్మరోగాలను నయం చేస్తుంది. తులసి ఆకులు నమలడం చేత పంటి చిగుళ్ళకున్న రోగాలు నయమవుతాయి. అరుగుదలను, ఆకలిని పెంచుతుంది. కఫం వలన వచ్చే దగ్గును, ఆస్తమాను తగ్గిస్తుంది. తులసిరసాన్ని తేనెలో కలిపి తీసుకోవడం వలన ఎక్కిళ్ళు తగ్గిపోతాయి. తులసి శరీరంలో ఉన్న ఆమాన్ని(టాక్సిన్స్/విషాలను) విశేషంగా తీసివేస్తుంది. ఈ మధ్య జరిగిన పరిశోధనల ప్రకారం ఒక్క తులసి చెట్టు మాత్రమే రోజుకు 22 గంటల పాటు ప్రాణవాయువు(ఆక్సిజెన్)ను విడుదల చేస్తుంది. ఇంత గొప్ప లక్షణం మరే ఇతర మొక్కకు లేదు.
కానీ పురాణ కధ ఆధారంగా గణపతిని తులసిదళాలతో ఒక్క వినాయక చవితి నాడు తప్ప ఇంకెప్పుడు ఆరాధించకూడదు.
9) చూత పత్రం : మామిడి ఆకులను చూత పత్రం అని సంస్కృత బాషలో అంటారు. మామిడి మంగళకరమైనది.
లేతమామిడి ఆకులను పెరుగులో నూరి సేవిస్తే అతిసారం తగ్గుతుంది. మామిడి జిగురులో ఉప్పు చేర్చి వేడీచేసి ఔషధంగా పూస్తే కాళ్ళపగుళ్ళు, చర్మవ్యాధులు ఉపశమిస్తాయి. చిగుళ్ళ వాపు సమస్యతో బాధపడేవారికి మామిడి లేత చిగురు మంచి ఔషధం. చెట్టు నుంచి కోసిన కొన్ని గంటల తరువాత కూడా ఆక్సిజెన్ (ప్రాణవాయువు) ను విడుదల చేయగల శక్తి మామిడి ఆకులకుంది. మామిడి దేవతావృక్షం. అందువల్ల ఇంట్లో ఏ దిక్కులో మామిడి చెట్టున్నా మంచిదే. ఆఖరికి ఈశాన్యంలో మామిడి చెట్టున్నా, అది మేలే చేస్తుంది. మామిడి చెట్టును సాధ్యమైనంతవరకు కాపాడాలని, ఇంటి ఆవరనలో పెరుగుతున్న మామిడి చెట్టును నరికేస్తే, ఆ ఇంటి సభ్యుల అభివృద్ధిని నరికేసినట్లేనని వాస్తు శాస్త్రం గట్టిగా చెప్తోంది. ఏ శుభకార్యంలోనైనా, కలశ స్థాపనకు ముందు కలశంలో 5 రకాల చిగుళ్ళను వేయాలి. అందులో మామిడి కూడా ఒకటి.
10) కరవీర పత్రం : దినినే మనం గన్నేరు అని పిలుస్తాం. గన్నేరుకు శాస్త్రంలో చాలా ప్రాముఖ్యత ఉంది. సాధారణంగా పూజకు కోసిన పువ్వులు, అవి చెట్టు నుంచి కోసే సమయంలో చెట్టు మొదట్లో క్రింద పడితే ఫర్వాలేదు కానీ, మరొకచోట(అది దేవుడుముదైనా, పూజ స్థలంలోనైనా సరే) క్రింద పడితే ఇక పూజకు పనిరావు. కానీ గన్నేరు పూలకు ఈ నిబంధన వర్తించదు. గన్నేరు పూలు మరే ఇతర ప్రదేశంలో క్రింద పడినా, నీటిని చల్లి పరమాత్మకు అర్పించవచ్చు. గన్నేరు చెట్టు తప్పకుండా ఇంట్లో ఉండాలి. గన్నేరు చెట్టు నుంచి వచ్చిన గాలి పీల్చినా చాలు, అది అనేక రోగాలను దూరం చేస్తుంది.
11) విష్ణుక్రాంత పత్రం : మనం వాడుకబాషలో అవిసె అంటాం. దీని ఆకును నిమ్మరసంతో కలిపి నూరి తామరవ్యాధి ఉన్న చోట పూస్తే తామరవ్యాధి నశిస్తుంది. ఆకును కూరగా చేసుకుని భుజిస్తే రక్తదోషాలు నివారణావుతాయి. విష్ణుక్రాంతం మేధస్సును పెంచుతుంది.
12) దాడిమీ పత్రం : అంటే దానిమ్మ. భారతదేశమంతటా పెరిగే చెట్టు ఇది. లలితా సహస్రనామాల్లో అమ్మవారికి 'దాడిమికుసమప్రభ' అనే నామం కనిపిస్తుంది. దానిమ్మ రసాన్ని శరీరం మీద రాయడం చేత అలర్జీలు, కిటకాలు కుట్టడం వలన వచ్చిన పొక్కులు మానిపోతాయి. దానిమ్మ పండు తొక్క గాయాలకు ఔషధం, వాపును అరికడుతుంది. పైత్య దోషాన్ని అధుపులో ఉంచుతుంది. దానిమ్మ పండు ఆకలిని, అరుగుదలను పెంచుతుంది. విరోచనాలను తగ్గిస్తుంది. గొంతురోగాలకు ఔషధం దానిమ్మ. దానిమ్మ పళ్ళు, పువ్వులు, ఆకులు, వేర్లు అన్ని ఔషధ గుణాలు కలిగినవై ఉంటాయి.
దానిమ్మ ఆకులను కొద్దిగా దంచి కాచి కషాయం చేసి దాన్లో తగినంత చక్కెర కలిపి సేచ్సితే ఉబ్బసం, అజీర్తి వంటి దీర్ఘకాలిక రోగాలు, దగ్గు, వడదెబ్బ, నీరసం ఉపశమిస్తాయి. దేని ఆకులకు నూనె రాసు వాపు ఉన్నచోట కడితే కల్లవాపులు తగ్గుతాయి.
13) దేవదారు : ఇది వనములలో, అరణ్యాలలో పెరిగే వృక్షం. పార్వతీ దేవికి మహాఇష్టమైనది. చల్లని ప్రదేశంలో, ముఖ్యంగా హిమాలయ పర్వతాల వద్ద పెరుగుతుంది ఈ వృక్షం. దేవదారు ఆకులను తెచ్చి ఆరబెట్టి, తరువాత ఆ ఆకులను నునెలో వేసి కాచి, చల్లార్చిన తరువాత నూనె తలకి రాసుకుంటే మెదడు కంటి సంబంధ రోగాలు దరిచేరవు. దేవదారు మాను నుంచి తీసిన నూనె చుక్కలను వేడినీళ్లలో వేసి ఆ నీటితో స్నానం చేస్తే శ్వాసకోశ వ్యాధులు నయమవుతాయి.
14) మరువక పత్రం : మనం దీన్ని వాడుక బాషలో మరువం అంటాం. ఇది అందరి ఇళ్ళలోనూ, అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నవారు కుండిల్లో కూడా పెంచుకోవచ్చు. మంచి సువాసనం కలది. మరువం వేడినీళ్లలో వేసుకుని ఆ నీటితో స్నానం చేస్తే శరీరానికున్న దుర్వాసన తొలగిపోతుంది.

Wednesday, August 23, 2017

త్వరలోనే వినాయక చవితి వచ్చేస్తోంది... మరి వినాయక చవితి విశేషాలు తెలుసుకుందామా.....గణపతి నవరాత్రులలో మనం 21 రకాలపత్రాలతో పూజిస్తాము. మనం పూజించే ఆ పత్రికి అనేక ఔషధ విలువలు ఉన్నాయి. వాటిలో కొన్నిటి గురించి చెప్పుకుందాం!!
21 రకాల పత్రాలు ---- వాటిలో గల మూలికలు

1) మాచీపత్రం : మన దేశంలో ప్రతి చోట కనిపిస్తుంది. మన ఇళ్ళ చుట్టుప్రక్కల, రోడ్ల మీద ఇది విపరీతంగా పెరుగుతుంది. కానీ ఇది గొప్ప ఆయుర్వేద మూలిక. ఇది నేత్రరోగాలకు అద్భుత నివారిణి. మాచీపత్రి ఆకుల్ని నీళ్ళలో తడిపి కళ్ళకి కట్టుకుంటే నేత్రవ్యాధులు నయమవుతాయి. ఇది చర్మరోగాలకు మంచి మందు. ఈ ఆకును పసుపు, నువ్వుల నూనెతో కలిపి నూరి ఆ ముద్దను చర్మవ్యాధి ఉన్న చోట పైపూతగా రోజు రాస్తూ ఉంటే వ్యాధి తొందర్లో నివారణ అవుతుంది. రక్తపు వాంతులకు, ముక్కు నుండి రక్తం కారుటకు మంచి విరుగుడు.
2) బృహతీ పత్రం. భారతదేశమంతటా విస్తారంగా ఎక్కడపడైతే అక్కడ పెరుగుతుంది బృహతీ పత్రం. దీనే మనం 'వాకుడాకు', 'నేలమునగాకు' అని పిలుస్తాం. ఇది కంఠరోగాలను, శరీర నొప్పులను నయం చేస్తుంది. ఎక్కిళ్ళను తగ్గిస్తుంది. కఫ, వాత దోషాలను, ఆస్తమాను, దగ్గను, సైనసైటిస్‌ను తగ్గిస్తుంది. అరుగుదలను పెంచుతుంది, గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. బృహతీపత్రం చూర్ణం దురదలకు, నొప్పులకు పనిచేస్తుంది. బృహతీ పత్రం యొక్క కషాయంతో నోటిని శుభరపరచుకుంటే నోటి దుర్వాసన తొలగిపోతుంది. రక్తశుద్ధి చేయగల శక్తి బృహతీపత్రానికి ఉంది. ఇంకా బృహతీపత్రానికి అనేకానేక ఔషధీయ గుణాలున్నాయి.
3) బిల్వపత్రం : దీనికే మారేడు అని పేరు. శివుడికి అత్యంత ప్రీతికరం. బిల్వ వృక్షం లక్ష్మీస్వరూపం. ఇది మధుమేహానికి(షుగర్‌కు) దివ్యౌషధం. ఈ వ్యాధి గలవారు రోజు రెండూ ఆకులను నిదానంగా నములుతూ ఆ రసాన్ని మింగితే వ్యాధి నుంచి ఉపశమనం లభిస్తుంది. మారేడు గుజ్జును ఎండబెట్టి పోడిచేసుకుని, రోజూ ఒక చెంచా పొడిని మజ్జిగలో వేసుకుని త్రాగితే వ్యాధి నుంచి ఉపశమనం లభిస్తుంది.
4) దూర్వాయుగ్మం(గరిక) : గణపతికి అత్యంత ఇష్టమైనవస్తువు గరిక. ఒక్క గరిక సమర్పిస్తే చాలు, మహాసంతోషపడతాడు బొజ్జగణపయ్య. తులసి తరువాత తులసి అంత పవిత్రమైనది గరిక. దూర్వాయుగ్మం అంటే రెండు కోసలు కలిగివున్న జంటగరిక. ఇది ఎక్కడపడితే అక్కడ పెరుగుతుంది. ఈ గరిక మహాఔషధమూలిక. గరికను పచ్చడి చేసుకుని తింటే మూత్రసంబంధిత వ్యాధులు నయమవుతాయి. మగవారికి సంతాన నిరోదకంగా కూడా పనిచేస్తుంది. కఫ, పైత్య దోషాలను హరిస్తుంది. చర్మ, రక్త సంబంధిత వ్యాధులను దూరం చేస్తుంది. ముక్కునుండి రక్తం కారుటను నిరోధిస్తుంది. గరికను రుబ్బి నుడిటి మీద లేపనం వేసుకోవడం ద్వారా పైత్య దోషం వలన కలిగిన తలనొప్పి తగ్గిపోతుంది. హిస్టీరియా వ్యాధికి ఔషధం గరిక.
5) దత్తూర పత్రం : దీనిని మనం ఉమ్మెత్త అని కూడా పిలుస్తాం. ఉష్ణతత్వం కలిగినది. కఫ, వాతా దోషాలను హరిస్తుంది. కానీ 'నార్కోటిక్' లక్షణాలు కలిగినది కనుక వైధ్యుని పర్యవేక్షణ తీసుకోకుండా ఉపయోగించకూడడు. మానిసక వ్యాధి నివారణకు పనిచేస్తుంది. మానసిక వ్యాధి ఉన్నవారికి గుండు చేయించి, ఈ ఉమ్మెత్త ఆకుల రసాన్ని రెండు నెలల పాటూ మర్దన చేయిస్తే స్వస్థత చేకూరుతుంది. దేని ఆకులు, వ్రేర్లు, పువ్వులు అమితమైన ఔషధ గుణములు కలిగినవే అయినా, దెని గింజలు(విత్తనాలు) మామూలుగా స్వీకరిస్తే విషంగా పనిచేస్తాయి. జ్వరాలు, అల్సర్లు, చర్మరోగాలకు, చుండ్రుకు ఉమ్మెత్త ఔషధం.
6) బదరీ పత్రం : దీనినే రేగు అని పిలుస్తాం. బదరీ వృక్షం సాక్షాత్తు శ్రీ మన్నారాయణ స్వరూపం. చిన్నపిల్లల వ్యాధుల నివారణకు పనిచేస్తుంది. 3 ఏళ్ళ పైబడి 12 ఏళ్ళలోపు వయసులో ఉన్న పిల్లల్లో సామాన్యంగా వచ్చే అన్ని రకాల సాధారణ వ్యాధులకు ఉపయోగిస్తారు. ఒకటి లేదా రెండు రేగు ఆకులను వ్యాధిగ్రస్తుల చేత వ్యాధి నివారణ అయ్యేంతవరకు తినిపించాలి, కానీ రేగు ఆకులు ఎక్కువగా తింటే కఫం వచ్చే ప్రమాదముంది.
7) అపామార్గ పత్రం: దీనికే ఉత్తరేణి అని వ్యవహారనామం. దీని కొమ్మలతో పళ్ళు తోముకుంటే దంతవ్యాధులు, ఆకులు నూరి పైపూతగా రాస్తే చర్మవ్యాధులు నివారణమవుతాయి. దీని పుల్లలు యజ్ఞయాగాదుల్లో, హోమాల్లో వినియోగించడం వలన హోమగుండం నుంచి వచ్చిన పొగను పీల్చడం చేత శ్వాసకోశ సంబంధిత వ్యాధులు తగ్గిపోతాయి. స్తూలకాయానికి, వాంతులకు, పైల్స్‌కు, ఆమం(టాక్షిన్స్) వలన వచ్చే వ్యాధులకు మంచి ఔషధం ఉత్తరేణి. ఉత్తెరేణి ఆకులను రుబ్బి గాయాలపై రాయడం వలన గాయాలు త్వరగా మానిపోతాయి. నొప్పి తగ్గిపోతుంది.
ఈరోజుకి ఈ 7 పత్రాలు తెలుసుకున్నాం కదా.. మిగతావి రేపు తెలుసుకుందాము.

Tuesday, August 22, 2017

Heralal mastaru vadrevu chinaveerabhadrudu

ఆదివారం కర్నూల్లో హీరాలాల్ మాష్టారికి కర్నూలు జిల్లా రచయితల సంఘం, సాహితీమిత్రులు, కుటుంబ సభ్యులు ఘనంగా నివాళి అర్పించారు. మద్దూరు నగర్ లో పింగళి సూరన తోట లో జరిగిన సమావేశానికి ఊహించనంతగా సాహిత్యాభిమానులు తరలివచ్చారు.
మాష్టారి పేరుమీద కుటుంబసభ్యులు ఒక స్మారకపురస్కారాన్ని ఏర్పాటు చేసారు. మొదటి పురస్కారాన్ని పుల్లా రామాంజనేయులు అనే ఉపాధ్యాయుడికి అందచేసారు. కర్నూలు జిల్లా ఆదోని డివిజనులో మద్దికెర మండలంలో పెరవలిలో జిల్లా ప్రజాపరిషద్ ఉన్నత పాఠశాలలో రామాంజనేయులు తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. తన పాఠశాల పిల్లల్ని సృజనాత్మక రచన వైపు మరల్చడానికి చేస్తున్న కృషికి లభించిన పురస్కారం అది. రామాంజనేయులు 2016 లో 'సృజన' పేరిట పెరవలి పిల్లల కథలు, 2017 లో 'జాగృతి' పేరిట పెరవలి బాలికల కథలు సంకలనం చేసి వెలువరించాడు. మాష్టారి పేరుమీద ఏర్పాటు చేసిన పురస్కారం ఆ ఉపాధ్యాయుడికి లభించడం నాకెంతో సంతోషాన్నిచ్చింది.
ఆ సభ ఎంతో కల్యాణప్రదంగానూ,ఎంతో స్ఫూర్తిమంతంగానూ సాగింది. మాష్టారి పిల్లలు విద్యారణ్య కామ్లేకర్, వివేకానంద, వైదేహి, సీతామహాలక్ష్మి, భారతి, వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంతో శ్రద్ధతో, ఇష్టంతో, గౌరవంతో ఆ సమావేశాన్ని నిర్వహించారు. కర్నూలు జిల్లా రచయితల సంఘం కార్యదర్శి గన్నమరాజు సాయిబాబా, గ్రంథాలయ ఉద్యమనేత, గాడిచెర్ల ఫౌండేషన్ అధ్యక్షులు, నా చిరకాలమిత్రులు చంద్రశేఖర కల్కూర, తెలుగు భాషా వికాస ఉద్యమం రాష్ట్రకార్యదర్శి డా.జె.ఎస్.ఆర్.కె.శర్మ, గ్రంథాలయ సంస్థ పూర్వ అధ్యక్షులు గంగాధర రెడ్డి, మరెంతమందో మాష్టారి మిత్రులు, అభిమానులు ఆ సభలో పాల్గొన్నారు.
మాష్టారిని తలుచుకుంటూ మొదటి స్మారక ప్రసంగం చేసే అదృష్టం నాకు లభించింది. ఆ ప్రసంగం రికార్డు చేసి వినిపించమని నా మిత్రులు కోరారు కాని, ఆ ప్రసంగమంతా ఆగని కన్నీటిధార మధ్య,పూడుకుపోయిన గొంతుతో సాగింది. మాష్టారి గురించి చాలా చాలా మాట్లాడాలనుకున్నాను. సాహిత్యవేత్తగా, చరిత్రకారుడిగా, ఉత్తమ ఉపాధ్యాయుడిగా, అన్నిటికన్నా ముఖ్యంగా ఆధ్యాత్మిక సాధకుడిగా, అన్వేషిగా, అద్వైతిగా ఆయన సాగించిన ప్రయాణం గురించి చెప్పాలనుకున్నాను.
కాని నన్ను వేదిక మీదకు పిలుస్తూనే నా సోదరుడు విద్యారణ్య 'ఋషిలాంటి మా నాన్న... ' అంటూనే నా హృదయంలో చెప్పలేని ఉత్తాప తరంగమొకటి ఎగిసిపడింది.
'మా నాన్న..' అనవలసింది నేను కదా.
అవును. ఆయన నాకు తల్లి, తండ్రీ కూడా. ఆయన తన పిల్లలకు పెట్టవలసిన అక్షరాల అన్నం ముద్దలు నాకే తినిపించారు. 75-78 మధ్యకాలంలో ఆయన ఏ పరిస్థితుల్లో కర్నూలు వదిలిపెట్టి తాడికొండ గురుకుల పాఠశాలలో చేరారో తెలిసిన తర్వాత, ఆ రోజుల్లో ఆయన మాకోసం తన ప్రేమసర్వస్వం, జ్ఞాన సర్వస్వం ఎట్లా ధారపోసారో కళ్ళారా చూసిన నాకు, ఆయన గురించి ఇవ్వాళ చెప్పడానికి కన్నీళ్ళు తప్ప మాటలు రావడం లేదు.
ఆయన వల్ల సాహిత్యం గురించి తెలుసుకున్నానని చాలాకాలం అనుకున్నాను. కాని, ఆ రోజుల్లో ఆయన నన్ను తల్లిలాగా కాపాడుకున్నాడని నాకు చాలా ఆలస్యంగా అర్థమయింది. నా హైస్కూలు రోజుల్లో నేను తరగతిలో అన్నింటా మొదటిస్థానంలో ఉండేవాణ్ణి. చదువులోనే కాదు, వక్తృత్వం, వ్యాసరచన, చిత్రలేఖనం, ఏకపాత్ర- ఎప్పటికప్పుడు మా స్కూలుకి ప్రైజులు తెస్తూ ఉండేవాణ్ణి. అందువల్ల నా సహాధ్యాయులు నా పట్ల చాలా అసూయగా ఉండేవారు. ముప్పై మంది ఉండే నా తరగతిలో ఏ ఒకరిద్దరో తప్ప మరెవ్వరూ నాతో మాట్లాడేవారు కారు. అక్కడితో ఆగకుండా ఎప్పుడు వీలు చిక్కితే అప్పుడు ఏ చిన్న అవకాశం దొరికినా నన్ను కొడుతూనే ఉండేవారు. నేను పొట్టిగా,అర్భకంగా ఉండేవాణ్ణి. వాళ్ళ చేతుల్లో తన్నులు తినడం తప్ప మరేమీ చెయ్యలేకపోయేవాణ్ణి. తమ అసూయ వల్ల తామట్లా చేస్తున్నామని కూడా తెలియని పసితనం వాళ్ళది. అది గ్రహించినట్టున్నారు మాష్టారు. అందుకని, స్కూలు అయిపోవడమేమిటి, నన్ను తనతో తీసుకుపోయేవారు. ఆటస్థలంలో కూడా ఆటలనెపం మీద పిల్లలు ఎక్కడ కొడతారో అని, నన్ను మా స్కూలు వెనక ఉన్న పత్తిచేలమ్మటా, పంటపొలాలమ్మటా తిప్పుతూ సుమిత్రానందన్ పంత్ గురించీ, నిరాలా గురించీ, టాగోర్ గురించీ చెప్తూండేవారు. నా దగ్గర డబ్బులుండేవి కావు. మూడునెలలకొకసారి మా నాన్నగారు పదిరూపాయలు మనియార్డరు చేసేవారు. ఆ రోజుల్లో మాష్టారు మా స్కూల్లో టక్ షాపు ఇంఛార్జి. అందుకని ఆ షాపులో నాకేమి కావాలో తీసుకొమ్మనేవారు. ఇవన్నీ గుర్తొచ్చి నేను మాట్లాడుతున్నంతసేపూ నాకు కళ్ళనీళ్ళాగలేదు...
సాహిత్యంలోనూ, చరిత్రలోనూ మాష్టారు చేసిన కృషి నిజంగా వెలుగు చూడనే లేదు. అసంఖ్యాకమైన ఆయన వ్యాసాలు, రేడియో ప్రసంగాలూ, ప్రవచనాలూ పుస్తకరూపంలో రాకపోవడం తెలుగు సాహిత్యానికి తీరే లోటు కాదు. కాని ఆధ్యాత్మిక రంగంలో ఆయన చేసిన పరిశోధన మూడునాలుగు పుస్తకాలుగా వెలువడటం ఒకింత ఊరట. 'వ్యాసమణిహారం'. 'శ్రీ ఉరుకుంద ఈరణ్ణ స్వామి చరిత్ర ' (1993), 'పరంజ్యోతి వెలుగులు-పరమాత్మ రూపాలు'(2009) తెలుగు ఆధ్యాత్మిక వాజ్మయంలో అత్యంత అపురూపమైన గ్రంథాలు.
ఉరుకుంద ఈరణ్ణ స్వామి చరిత్ర ని నేను మా మాష్టారు శరభయ్యగారికి పంపిస్తే ఆయన ఎంతో భావోద్వేగభరితంగా ఉత్తరం రాసారు. అప్పట్లో ఆయన బసవేశ్వర వచనాలను సంస్కృతంలోకి అనువదిస్తూ ఉన్నారు. తన జీవితమంతా కాళిదాసకవిత్వపు కౌగిలింతలో గడిపినందువల్ల, బసవన్నకు తాను తన మనసులో తగిన చోటు ఇవ్వలేకపోయానేమో అని ఆయనకి ఒకింత దిగులుండేదేమో. అందుకని, హీరాలాల్ మాష్టారి పుస్తకం చదవగానే, ఒకచేత క్షీరభాండంతో, మరొక చేత బెత్తంతో బసవన్న తనని చేరవచ్చినట్టుందని రాసారు.ఆయన ఇటువంటి మాట తన గురువుగా భావించే విశ్వనాథ గురించి కూడా ఎన్నడూ అనడం నేను వినలేదు. హీరాలాల్ మాష్టారి వాక్కు ఎంత పునీతమైందో ఇంతకన్నా మించిన దృష్టాంతం నాకు అవసరం లేకపోయింది.
నేను మాష్టార్ని తలచుకోగానే నా గుండె బొంగురుపోవడానికి ఆయన నా పట్ల చూపిన ప్రేమ ఒక్కటే కారణం కాదు. ఆయన నాకు అన్నిటికన్నా ముఖ్యంగా స్వాతంత్ర్య విద్య నేర్పారు. ఆ విద్యనే ఆయన జీవితమంతా అనుష్టిస్తూ వచ్చారు కాబట్టి. ఆయన చేసిన ఆధ్యాత్మిక యాత్ర మామూలు అర్థంలో వైరాగ్య యాత్ర కాదు. అది ఎప్పటికప్పుడు తనని తాను స్వతంత్రంగా నిలుపుకోవడానికి కావలసిన ఆధారం కోసం వెతుకులాట. 'నేను ఏ వర్గానికి చెందనివాడను, ఏ ఆశ్రమ వ్యవస్థలోని వాడను కాను, సర్వాంతర్యామి అయిన, సర్వవ్యాపి అయిన ఆ పరమాత్మకు దాసానుదాసుడను ' అని రాసుకోగలడం కోసం చేసిన అన్వేషణ.
బహుశా, ఆ స్వతంత్రతాస్థితిని చేరుకోగలినప్పుడే, నేను ఆయన శిష్యుణ్ణని చెప్పుకోగలుగుతాను.

ఆంధ్ర ప్రదేశ్ బ్రాహ్మణ వెల్పేర్ కార్పొరేషన్ (ప్రభుత్వ రంగ సంస్థ) అందిస్తున్న సంక్షేమ పథకాలు:

ఈ కింది సమాచారాన్ని మీకు తెల్సిన భ్రాహ్మణ బృందాల్లో, సమూహాల్లో పోస్టు చేయండి.
బ్రాహ్మణ మిత్రులందరితో ఈ సమాచారం పంచుకుందాం - అవసరం ఉన్న వారికి చెబుదాం. ఇవి ఆంధ్రప్రదేశ్ లో నివసిస్తున్న తల్లిదండ్రులకు (సంరక్షకులకు) మాత్రమే వర్తిస్తాయి.
ఆంధ్ర ప్రదేశ్ బ్రాహ్మణ వెల్పేర్ కార్పొరేషన్ (ప్రభుత్వ రంగ సంస్థ) అందిస్తున్న సంక్షేమ పథకాలు:
అన్ని పథకాలు గురించి క్లుప్తంగా తెలుసుకోవాలంటే కింది లంకె మీద క్లిక్ చేయండి https://www.andhrabrahmin.ap.gov.in/down/schemest.pdf
ఇంగ్లీషు లింక్ - https://www.andhrabrahmin.ap.gov.in/down/schemes.pdf
గాయత్రీ విద్యా ప్రశస్తి పథకం - ఎస్.ఎస్.సి, ఇంటర్మీడియెట్ (తత్సమానం), గ్రాడ్యుయేషన్, వృత్తివిద్యా కోర్సు, పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సులలో విద్యావిషయకంగా విశిష్ఠ ప్రతిభ కనబర్చినందుకు గుర్తింపు పొందిన, పేరుగాంచిన పాఠశాల, కళాశాల, సంస్థల్లో సర్వప్రథమునికి గుర్తింపు నివ్వడం - ఈ పథకం గురించి మరిన్ని వివరాలకు కింది లంకె మీద క్లిక్ చేయండి
https://www.andhrabrahmin.ap.gov.in/gayathri/gayathrit.pdf
ఇంగ్లీష్ లింక్ - https://www.andhrabrahmin.ap.gov.in/gayathri/gayathri.pdf
భారతీ విద్యా పథకం: అనాథ పిల్లలు లేదా తల్లిదండ్రుల్లో ఒకరే ఉన్న పిల్లల కోసం సహాయం. 1-5 తరగతి వరకు 5000/-, 6-10 తరగతి వరకు 10000/-, ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరానికి లేదా తత్సమానికి 12000/-, ఇంటర్మీడియేట్ రెండో సంవత్సరం లేదా తత్సమానికి 20000/-, గ్రాడ్యుయేషన్ మొదటి లేదా రెండో సంవత్సరం లేదా తత్సమానికి 15000/-, గ్రాడ్యుయేషన్ మూడో సంవత్సరానికి లేదా తత్సమానికి 25000/-, వృత్తి విద్యా కోర్సులు (చివరి సంవత్సరం మినహా), పోస్టు గ్రాడ్యుయేషన్ (చివరి సంవత్సరం మినహా) 20000/-, వృత్తి విద్యాకోర్సులు (చివరి సంవత్సరం), పోస్టు గ్రాడ్యుయేషన్(చివరి సంవత్సరం) 35000/-.
మరిన్ని వివరాలకు కింది లంకె మీద క్లిక్ చేయండి
https://www.andhrabrahmin.ap.gov.in/bharati/bharatit.pdf
ఇంగ్లీష్ లింక్ - https://www.andhrabrahmin.ap.gov.in/bharati/bharati.pdf
భారతీ దేశాంతర మాస్టర్స్ డిగ్రీ పథకం - విదేశాల్లో మాస్టర్స్ డిగ్రీ చదివేందుకు బ్రాహ్మణులను ప్రోత్సహించడం - 10,00,000/- వరకు సాయం.
మరిన్ని వివరాలకు కింది లంకె మీద క్లిక్ చేయండి .
https://www.andhrabrahmin.ap.gov.in/bharati/bs-msoet.pdf
ఇంగ్లీష్ లింక్ - https://www.andhrabrahmin.ap.gov.in/bharati/bs-msoe.pdf
వశిష్ఠ - పోటీ పరీక్షలకు శిక్షణ పథకం - బ్యాంకింగ్, రైల్వేలు, రాష్ట్ర - కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్లు, స్టాఫ్ సెలెక్షన్ కమీషన్ వగైరాలకు ఉచిత శిక్షణ. మరిన్ని వివరాలకు కింది లంకె మీద క్లిక్ చేయండి
https://www.andhrabrahmin.ap.gov.in/vasishta/vasishtat.pdf
ఇంగ్లీష్ లింక్ - https://www.andhrabrahmin.ap.gov.in/vasishta/vasishta.pdf
ద్రోణాచార్య నైపుణ్యాభివృద్ధి పథకం - బేకరీ, ఈవెంట్ మేనేజ్మెంట్, ఫాబ్రికేషన్, హాస్పిటాలిటీ, హౌస్ కీపింగ్, టైలరింగ్, సౌరఫలకాల ఏర్పాటు, బ్యాంకింగ్, ఎలక్ట్రానిక్స్, ఐ.టి. రంగం వంటి ఎన్నో రంగాల్లో ఎంపిక చేసిన క్షేత్రాల్లో ఉచిత శిక్షణ.
మరిన్ని వివరాలకు కింది లంకె మీద క్లిక్ చేయండి.https://www.andhrabrahmin.ap.gov.in/dronac…/dronacharyat.pdf
ఇంగ్లీష్ లింక్ -https://www.andhrabrahmin.ap.gov.in/dronach…/dronacharya.pdf
చాణక్య ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల పథకం - స్వయం ఉపాథి -
*చాణక్య - అంత్యోదయ * - 1.5 లక్షల వరకు ప్రాజెక్టులకు సాయం - 80 శాతం రాయితీ + బ్యాంకు ఋణం
చాణక్య - అభ్యుదయ - 1.6 నుంచి మూడు లక్షల ప్రాజెక్టులకు సాయం - 60 శాతం రాయితీ + బ్యాంకు ఋణం
చాణక్య - అభివృద్ధి - 3.1 నుంచి 10 లక్షల ప్రాజెక్టులకు సాయం - రెండు లక్షల వరకు 40 శాతం రాయితీ + బ్యాంకు ఋణం
మరిన్ని వివరాలకు కింది లంకె మీద క్లిక్ చేయండి.
https://www.andhrabrahmin.ap.gov.in/chanakya/sust.pdf
ఇంగ్లీష్ లింక్ - https://www.andhrabrahmin.ap.gov.in/chanakya/sus.pdf
చాణక్య ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల పథకం - లఘ, మధ్యతరహా పరిశ్రమలు -
చాణక్య - లఘు పరిశ్రమలు - 11 లక్షల నుంచి కోటి రూపాయల ప్రాజెక్టుల కోసం సాయం - 10 లక్షల వరకు 20 శాతం రాయితీ
చాణక్య - మధ్యతరహా పరిశ్రమలు - ఒక కోటి నుంచి 5 కోట్ల రూపాయాల ప్రాజెక్టుల కోసం సాయం - 25 లక్షల వరకు 10 శాతం రాయితీ
మరిన్ని వివరాలకు కింద లంకె మీద క్లిక్ చేయండి.
https://www.andhrabrahmin.ap.gov.in/chanakya/smet.pdf
ఇంగ్లీష్ లింక్ - https://www.andhrabrahmin.ap.gov.in/chanakya/sme.pdf
చరక ఆరోగ్య బీమా పథకం - ఎన్టీఆర్ వైద్య సేవాపథకంలో చేరని వృద్ధుల కోసం ఆరోగ్య బీమా పాలసీ.
మరిన్ని వివరాలకు కింది లంకె మీద షేర్ చేయండి.https://www.andhrabrahmin.ap.gov.in/charaka/charakat.pdf
ఇంగ్లీష్ లింక్ - https://www.andhrabrahmin.ap.gov.in/charaka/charaka.pdf
కశ్యప ఆహార మరియు ఆశ్రయ కల్పనా పథకం - అనాథ పిల్లలు, వికలాంగులు, వితంతువులు, వృద్ధులైన బ్రాహ్మణులకు ఆహారం, ఆశ్రయం ఖర్చుల నిమిత్తం ఆర్థిక సాయం - వృద్ధులకు నెలకు 3000/- చొప్పున, ఇతరులకు 1000/- చొప్పున. మరిన్ని వివరాలకు కింది లంకె మీద క్లిక్ చేయండి.
https://www.andhrabrahmin.ap.gov.in/kashyapa/kashyapat.pdf
ఇంగ్లీష్ లింక్ - https://www.andhrabrahmin.ap.gov.in/kashyapa/kashyapa.pdf
గరుడ అంత్య క్రియల సహాయ పథకం - పేదబ్రాహ్మణుల్లో ఇతరత్రా మార్గం లేని వారి అంత్రక్రియల కోసం 10000/- వరకు.
మరిన్ని వివరాల కోసం కింది లంకె మీద క్లిక్ చేయండి.
https://www.andhrabrahmin.ap.gov.in/garuda/garudat.pdf
ఇంగ్లీష్ లింక్ - https://www.andhrabrahmin.ap.gov.in/garuda/garuda.pdf
భార్గవ భాగస్వామ్య పథకం - వృద్ధాశ్రమం, పరుశురామ భవన్, విశ్వనాథ ఆరామ క్షేత్రం వంటి నిర్మాణాలకు ప్రోత్సాహం - ఏదైనా సంస్థ ప్రోది చేసుకున్న మొత్తానికి సమానమైన మొత్తం వరకు సాయం.
మరిన్ని వివరాలకు కింది లంకె మీద క్లిక్ చేయండి
https://www.andhrabrahmin.ap.gov.in/bhargava/bhargava.pdf
అనాథ విద్యార్థుల కోసం, ప్రత్యేక అవసరాలున్న పిల్లలకోసం ప్రత్యేక పథకం - ఆర్ఫన్ -
వివరాలకు కింది లంకె మీద క్లిక్ చేయండి
https://www.andhrabrahmin.ap.gov.in/vol/donee.pdf
అన్ని పథకాలకూ టోల్ ఫ్రీ సంఖ్య - 1800 102 3579
సమాచారం పంచుకోండి - సాయపడండి.
లోకా సమస్తా సుఖినో భవన్తు.

ANDHRABRAHMIN.AP.GOV.IN

Monday, August 21, 2017

అద్భుతమైనఅద్భుతమైన వాక్యాలు.


"భూమి " అనే రెండక్షరాల పైన పుట్టి
"ప్రాణం "అనే రెండక్షరాల జీవం పోసుకుని
రెండక్షరాల "అవ్వ "తాత "
"అమ్మ ""నాన్న " "అన్న ""అక్క "
అనే బాంధవ్యాల నడుమ పెరుగుతూ
రెండక్షరాల "గురు " వు దగ్గర
రెండక్షరాల "విద్య "ని నేర్చుకుని
రెండక్షరాల "డబ్బు " ని సంపాదించి
రెండక్షరాల "భార్య" "బిడ్డ" అనే
బంధాలను ఏర్పరచుకొని
రెండక్షరాల "ప్రేమ"ను పంచుతూ
రెండక్షరాల "స్నేహం" పెంపొందించుకుంటూ
రెండక్షరాల "బాధ "ని భరిస్తూ
రెండక్షరాల "కోపం "ను దూరం చేసుకుని
రెండక్షరాల "నేను "అనే అహంకారాన్ని మరచి
రెండక్షరాల "మనం "అనే మమకారాన్ని పెంచి
రెండక్షరాల "జాలి..దయ '" లను కొండంత పెంచుతూ
రెండక్షరాల "తీపి "అనుభవాలను గుర్తు చేసుకుంటూ
రెండక్షరాల "చేదు "సంఘటనలను మర్చిపోతూ
రెండక్షరాల "ముప్పు " వచ్చి
రెండక్షరాల "చావు " వచ్చే వరకు
రెండక్షరాల "ముఖం "పైన
రెండక్షరాల "నవ్వు "ఉంటే
రెండక్షరాల "స్వర్గం "మన
అరచేతిలో ఉన్నట్లే..!!
ఈ సత్యాలను తెలుసుకుని జీవించగలిగేతే
ఉన్నప్పుడైనా, పోయాకైనా మన కోసం
నలుగురుంటారు.....🙏😊

పాతికేళ్ళ క్రితం మాట.

పాతికేళ్ళ క్రితం మాట.

“మా ‘ఆమ్మ' వొస్తోందిరా! నిన్ననే అమ్మడక్కయ్యనించి ఉత్తరఁవొచ్చింది."

అమ్మ మాట వినగానే పళ్ళన్నీ ఊడిపోయి, కొంచెం వంగి నడిచే డెబ్భయ్యేళ్ళ ముసలావిడ కళ్ళముందు ప్రత్యక్షమైంది.

ఆవిడ మాఅమ్మమ్మకి తోడికోడలు. పశ్చిమగోదావరి జిల్లాలో శుద్ధపల్లెటూర్లో వుంటుంది. ఆమధ్య ఓసారి గూడెంవెళితే అమ్మతో అందిట..

“నీకొడుకు డాక్టరటగా! నేను మీయింటికొస్తాను. ఓనాల్రోలుండి అన్నీ చూబించుకెళతాను!"

“వాడింకా మూడోయేడే! నీకేఁవిటి కష్టం?" అంది అమ్మ ఆవిణ్ణి ఎలాగైనా ఆపాలని.

“తల్లో ఓరే తల్లీ! రైళ్ళెడుతున్నట్టే అనుకో!... అయినా వాడు చదివేది కేజీహెచ్చేకదా, అక్కడ చూబిస్తాళ్ళే!"

మరిక అప్పీలు చేసుకునే వీల్లేదు. ఆవిడ వచ్చేసినట్టే! అన్నట్టుగానే బొకారోలో దిగింది.

“వెధవరైలు. ప్రెతీచోటా ఆపేడఁవే! టేషనున్నా లేపోయినా!" ఒక్క సెంటెన్సులో తేల్చేసింది ఆరైలు గుణగణాల్ని!

మాకందరికీ ఆవిడ కంప్లైంట్లు వినడం ఒక వినోదకార్యక్రమమైపోయింది. తలలో హోరుకొచ్చిన తిప్పలు...తల్లో ఓరనేది.

“ఈమోకాలు నొప్పి. మళ్ళా ఇదిలేదు!" అనేది రెండోది చూపించి.

ఇంటెడు పనీ చేసేది. వద్దన్నా వినేదికాదు.
కరీంబీడీలవారి గుడ్డసంచీలో బట్టలు సర్దుకొచ్చేసింది.

సంచిలో ఎక్కడో అడుగునుంచి ఓ ఎక్స్‌-రే తీసి నాకిచ్చి చూడమని తను పక్కగదిలోకెళ్ళింది.

అది తలకి తీసింది. పుర్రెచుట్టూ తెల్లగా కిరణాల్లా వున్నాయి. అన్నయ్యేమో “అదే తల్లో ఓరు!" అని ఒకటే నవ్వు.

నా మూడోయేడు చదువుకి అంతుపట్టని రహస్యంలా వుందా ఫిల్ము. ఈలోగా ఆవిడ చక్కావచ్చింది.

“ఏఁవన్నా తెలిసిందిరా నీకూ?" అంది ఆశగా.

“ఇదేదో వుందమ్మమ్మా! తెలీట్లా!" అన్నాను పేద్ద ప్రొఫెసర్లా పైపెదవి పళ్ళతో నొక్కిపట్టి!

“అదా! అదొకమారు తేనిసీసా పగిలిపోయి దానిమీద ఒలికిపోయిందిరా! అదేఅది!" సట్టన్ కి కూడా అంతుచిక్కని రేడియలాజికల్ సీక్రెట్ అలా బయటపెట్టింది.

ఇక చూస్కోండి! దొర్లిదొర్లి నవ్వులు అందరం. నాకయితే ఆనవ్వుకి ఊపిరందలా! ఆవిడెంత సరదామనిషంటే మాతోపాటూ తనూ నవ్వేసింది. ఉడుక్కోడాల్లేవ్.

మొత్తానికి ఆవిణ్ణేసుకుని కేజీహెచ్ కెళ్ళాను. న్యూరోసర్జరీ విభాగం మూడోఅంతస్తులో వుంటుంది.

“మెట్లెక్కడం కష్టం. ఆయన కిందకొస్తే చూపించుకుందువుగాని!" అన్నాను.

“వీళ్ళని మనం పట్టుకోవాలి. వాళ్ళొస్తారని కూచోకూడదు!" అంటూ జీవితసత్యాన్ని బోధించింది. మెట్లన్నీ ఎక్కేసింది.

ఆడాక్టరు “ఎలావచ్చారమ్మా?" అనడిగాడు.

“మిమ్మల్ని చూడాలన్న ఆశే లాక్కొచ్చేసింది!" అనగానే కుర్రాడు ఫ్లాటు!

చక్కగా పరీక్షలు చేసి మందులవీ రాసిచ్చాడు. అవితీసుకుని మాయింట్లో ఓపదిహేన్రోజులుంటానని డిక్లేర్ చేసింది.

మధ్యానంపూట పడుకునేదికాదు. ఉతికినబట్టలు మడతెయ్యడమో, ఎండబెట్టిన పప్పులు, మిరపకాయలూ డబ్బాలకెత్తడమో...ఇలా ఏదోవొక పని కల్పించుకుని చేస్తుండేది.

ఒకాదివారంనాడు మిట్టమధ్యానం ఇంటిల్లిపాదీ నిద్దర్లోతున్నారు. మనం చాలా సీరియస్‌గా చదివేసుకుంటున్నాం. ఇంతలో వంటింట్లోంచి ‘సుఁయ్..'మంటూ సౌండొచ్చింది. ఏఁవిటాశబ్దమని వచ్చిచూస్తే ఆవిడ పొయ్యిదగ్గర నిలబడుంది.

“ఏంచేస్తున్నావిక్కడా?" అన్నాను సందేహంగా.

“నీకే! కొయ్యరొట్టి కాలుస్తున్నాను. పాపం పొద్దుణ్ణించీ చదూతూనేవున్నావు. ఆకలేస్తూవుంటుంది! ఆరారా ఏదోఒకటి తింటోవుండాలి!" అంది పళ్ళెంలో రొట్టెపెట్టి.

నాక్కళ్ళల్లో నీళ్ళొచ్చేసాయి. నా అహం, అహంకారం ఆరొట్టెకన్నా పూర్తిగా కాలిపోయాయి.

అదెంత కమ్మగా వుందంటే ...శెనగపప్పువల్ల అనుకుంటున్నారా? ఆవిడ ఆత్మీయతే ఆ రుచిని తెచ్చిపెట్టింది.

ఎంత నవ్వుకున్నాం? ఎంత అపహాస్యం చేసాం?

అభిమానమనేది చెప్పిచేయించుకోవడంలో వుండదు. ఇష్టపడిచేసే పనిలో కష్టముండదు.

ఇక ఆపేస్తాను. మరీ ఎక్కువ తలుచుకుంటే ‘అమృతం' తాగేటపుడు పొలమారుతుంది ఆవిడకి!

..........జగదీష్ కొచ్చెర్లకోట

శుభ సాయంత్రం

అమేరికా ను English లో America అని అంటారు.
🎈జాపాన్ ను English లో Japan అంటారు.
🎈భుతాన్ ను English లో Bhutan అంటారు.
🎈శ్రీలంకా ను English లో
Sri Lanka అంటారు.
🎈బంగ్లాదేశ్ ను English లో
Bangladesh అంటారు.
🎈నేపాల్ ను English లో Nepal అంటారు.
అంతేకాదు.
మన ప్రక్కనున్న
🎈పాకిస్తాన్ ను కూడ English లో Pakistan అని అంటారు.
👉మరి మన
🎈భారత దేశం నే ఎందుకు
English లో
🇮🇳 India అంటారు.?
అయితే....
Oxford Dictionary ప్రకారం,
🇮🇳 India ఈ వాక్కు ఎలా వంచ్చింది 99% ప్రజలకు తెలియదు....
I - Independent
N- Nation
D- Declared
I - In
A- August
👯అందుకే ఇండియా (India)
🔷ఈ విషయం భారతీయులందర్కి తెలుపండి.

పోలాల అమావాస్య

                        పోలాల అమావాస్య 
                                   లేదా  
                            పోలాంబ వ్రతం.


 శ్రావణ బహుళ అమావాస్యను 'పోలాల అమావాస్య' అంటారు. పోలాల అమావాస్యకు ఎంతో విశిష్టత వుంది. స్త్రీలు

 తమ సౌభాగ్యం కోసం, తమ పిల్లల యోగ, క్షేమాల కోసం, తమ కుటుంబంకోసం వ్రతాలు ఆచరించడం మనకు

అనాది నుంచి వస్తున్న ఆచారం. ఈ ‘పోలాల అమావాస్య వ్రతం’ ప్రత్యేకంగా సంతాన సంరక్షణ కోసం 
నిర్ధేశించబడినది. పెళ్లయి చాలాకాలమయినా సంతానం కలుగని స్త్రీలు, సంతానవతులైన స్త్రీలు ఈ వ్రతాన్ని తప్పకుండా ఆచరించాలి.ఈ వ్రతాన్ని శ్రావణ అమావాస్యనాడు చేసుకోవాలి. పూజచేసే చోట గోమయంతో అలికి,వరిపిండితోఅందమైన ముగ్గువేసి, ఒక కందమొక్కను ( కందమొక్క దొరకని పక్షంలో కందపిలక పెట్టి పూజ చేసుకుంటారు.)అక్కడ వుంచి, పసుపుకొమ్ము కట్టిన నాలుగుతోరాలను( ఆనవాయితీ ప్రకారం కొంతమందికి 4 తోరాలు వుండవు 2 తోరాలే ఉంటాయి.) అక్కడ వుంచి, ముందుగా వినాయకుని పూజించి,

 ఆతర్వాతఆకందమొక్కలోకిమంగళగౌరీదేవినిగానీ,సంతానలక్ష్మీదేవినిగానీఆవాహనచేసి,షోడశోపచారాలతోఅర్చించి, తొమ్మిది పూర్ణంబూర్లుగారెలు, తొమ్మిదిరకాల కూరగాయలతో చేసిన పులుసు   ఆమెకు నైవేద్యంగా సమర్పించాలి. ఆ తర్వాత బహుసంతానవతి అయిన పెద్దముత్తయిదువును పూజించి, కొత్తచీర, రవికల గుడ్డ పెట్టి, నైవేద్యం పెట్టని తొమ్మిది పూర్ణంబూర్లు, ఒక తోరాన్ని, ఆమెకు వాయనంగా సమర్పించి, దీవెనలు అందుకోవాలి. ఆ తర్వాత ఒక

 తోరాన్ని కందమొక్కకు కట్టి, మరొకటి తను మెడలో కట్టుకుని, మిగిలిన తోరాన్ని తన ఆఖరు సంతానం మొలలో
 కట్టాలి. అలా చేస్తే.., ఆమె సంతానం ఆయురారోగ్య, ఐశ్వర్యాలతో పది కాలాలపాటు చల్లగా ఉంటారు.  ఆడపిల్లకావాలనుకునేవాళ్ళు( ఉన్నవాళ్ళు) గారెలు,మగపిల్లవాడు కావాలనుకునేవాళ్ళు బూరెలు (ఉన్నవాళ్ళు ) అమ్మవారికి సమర్పిస్తారు. ఇక పూర్ణంబూరెలు ఎందుకు వాయనంగా ఇవ్వాలంటే..,పూర్ణంబూరె పూర్ణగర్భానికి చిహ్నం. అందులోని పూర్ణం, గర్భస్థశిశువుకు చిహ్నం. స్త్రీకి మాతృత్వం కూడా అంత మధురమైనది కనుక పూర్ణబూరెలు వాయనంగా ఇవ్వాలనే నియమాన్ని విధించారు మన పూర్వులు. ఇంకా పనసఆకులతో బుట్టలు కుట్టి ఇడ్లీ  పిండి అందు లో నింపి ఆవిరి మీద ఉడికించి అమ్మవారికి నైవేద్యం పెడతాము. వీటినే పొట్టిక్క బుట్టలు అని అంటారు.  ఇవి ఎక్కువగా గోదావరి జిల్లాలో చేస్తాము.

 కొన్ని ప్రాంతాలలో ఇదే రోజున పితృదేవతలను పూజించడం,వాళ్లకి తర్పణాలు వదలడం ... పిండ ప్రదానాలు చేయడం  చేస్తూఉంటారు.  ఆవులను ఎద్దులను పూజించడం  కుడా చేస్తారు. దానికి కారణం ఒకానొకప్పుడు నందీశ్వరుడి సేవకు మెచ్చిన పరమశివుడు, ఆవులను ... ఎద్దులను శ్రావణ బహుళ అమావాస్య రోజున పూజించినవారికి సకల శుభాలు కలుగుతాయని వరాన్ని ఇవ్వడం జరిగింది. ఈ కారణంగా గ్రామీణ ప్రాంతాలలో ఆవులను ... ఎద్దులను పూజిస్తూ వుంటారు. ఎప్పుడూ ఎంతో కష్టం చేసే ఎద్దులకు ఈ రోజున పూర్తి విశ్రాంతిని కల్పిస్తారు. 



 
                                                         కందమొక్క 
వ్రత కథ.
ఒక ఊరిలో ఏడుగురు అన్నదమ్ములుండేవారు. వారికి పెళ్లిళ్లయి భార్యలు కాపురానికి వచ్చారు. చాలామంది పిల్లలతో వారంతా సుఖంగా కాలం గడుపుతున్నారు. కొంతకాలానికి ఆ ఏడుగురు తోడికోడళ్లూ పోలాల అమావాస్య నోము నోచుకోవాలని ప్రయత్నించారు. కానీ అదేరోజు చివరి కోడలి బిడ్డ మరణించడంతో నోచుకోలేకపోయారు. ఆ విధంగా వారు ఆరేళ్లు నోము నోచుకునే ప్రయత్నాలు చేయటం, చివరి కోడలి బిడ్డ మరణించటమూ జరిగాయి. మిగిలిన ఆరుగురూ ఏడవ ఆమెను దుమ్మెత్తి పోయటం జరుగుతున్నది. అదేవిదంగా  ఏడవ ఏడాది కూడా అందరూ నోము నోచుకొనుటకు అన్ని ప్రయత్నములు చేసుకొన్నారు. పూర్వమువలె ఆఖరి ఆమె బిడ్డ మరణించేను.  అలాగే జరగటంతో చివరికి ఆమె భయపడి, తనని అందరూ తిట్టిపోయుదురని బయపడి  మరణించిన బిడ్డను  గదిలోపెట్టి తాళంవేసి, తక్కినవారితో కలసి నోము నోచుకున్నది వేడుక ముగిసి ఇంటికి తిరిగివచ్చి చివరి కోడలు, తన బిడ్డ శవాన్ని భుజాన వేసుకుని ఏడుస్తూ ఊరి చివరికి వెళ్ళి అక్కడున్న పోలేరమ్మ గుడి దగ్గర శవాన్ని పడుకోబెట్టి ఏడవసాగింది.అంతలో గ్రామ సంచారానికి బయలుదేరిన పోలేరమ్మ ఆమెను చూసి " ఎందుకేడుస్తున్నావు" అని అడిగెను. అందుకామె " అమ్మా! ఏడవక ఏమి చేయమంటావు? ఏడేళ్ళ నుంచి ఏడాది కొకరి  చొప్పున  ఈ పోలేరమ్మకు అప్పగిస్తున్నాను. ఈ  బిడ్డ నేటి ఉదయమే చనిపోయెను. కానీ ప్రతి ఏడు నా పిల్లలు చనిపోవుట.. నోము ఆగిపోవుట   నా తోడి కోడళ్ళు  నన్నుతిట్టుట జరుగుతుండడంతో ఈ ఏడు వారి నోము ఆపుట ఇష్టంలేక చచ్చిన బిడ్డను ఇంటిలో దాచి ,  వారితో కలసి నోమునోచుకొని  ఇప్పుడు శవమును తీసుకుని ఇక్కడకి వచ్చాను "  అన్నది. ఆమాటలను విని పోలేరమ్మ జాలి కలిగి ఆమెకు అక్షింతలను ఇచ్చి, వాటిని ఆమె బిడ్డలను పూడ్చిన చోట జల్లి.. పేర్లతో చచ్చినవారిని పిలువమని చెప్పి వెళ్ళిపోయెను. ఆమె అమ్మవారు చెప్పినట్లు తనపిల్లలను పాతిన గోతులు మీద అక్షతలను చల్లి , చచ్చినవారిని పేర్లతో పిలువగా ఆ పిల్లలందరూ సజీవులై బయటకి వచ్చిరి. అంట ఆమె సంతోషించి ఆ ఏడుగురు పిల్లలను వెంటపెట్టుకొని ఇంటికి వెళ్ళెను. తెల్లవారేసరికి ఆమె తోడికోడళ్ళు, ఊరిలోనివారు ఆ పిల్లలని చూసి " వీళ్ళు ఎక్కడనుండి వచ్చిరి ? " అని అడుగగా ఏడవకోడలు గతరాత్రి జరిగిన విశేషములను చెప్పెను. ఆమె చెప్పిన మాటలకు అందరూ ఎంతో ఆశ్చర్యపడి  ప్రతి సంవత్సరము " పోలాల అమావాస్య " నోమును  నోచుకొనుచు సుఖసంతోషాలతో ఉండిరి.

కథ చదివినవాళ్ళు, విన్నవాళ్ళు అమ్మవారికి ఈ క్రింది విధంగా దణ్ణం పెట్టుకుని 

"పోలేరమ్మనీ ఇల్లు పాలతోనేతితో అలుకుతానునా ఇల్లు మల,మూత్రాలతో  అలుకు", అంటారు.వినడానికి కొం వింతగావుంటుంది.కాని  అదివారి  పిల్లల మీద ప్రేమకు గుర్తుగాకనిపిస్తుంది  కథ అక్షింతలు చదివినవాళ్ళు,విన్నవాళ్లు తలపై వేసుకుంటారు.  తరువాత పూజలో పసుపు కొమ్ముకు దారం కట్టి  తోరం చేసి ఆ తోరాన్ని చేసి పూజ అయ్యాక ఆ పసుపుకోమ్మును చిన్నపిల్లలుకు కడతారు.  అది వారికి రక్షగా వుంటుంది అని భావిస్తారు. 

దీనికి ఉద్యాపన ఏమీ లేదు. ఇది అందరూ చేసుకోవచ్చు. ఈ " పోలాల అమావాస్య " నోమును నోచుకొనుట వలన సంతానంలేనివారికి సంతానం కలుగును. సంతానం ఉన్నవారికి కడుపుచలువ కలుగుతుంది.

కనుక మాతృత్త్వాన్ని కోరుకునే ప్రతి స్త్రీ ఈ వ్రతాన్ని ఆచరించి సంతాన, సౌభాగ్యాలు పొందాలి.

                     సర్వేజనా సుఖినోభవంతు!!!!

Total Pageviews