Sunday, October 29, 2017

దక్షిణామూర్తి స్తోత్రం స్తవరాజమ్

దక్షిణామూర్తి స్తోత్రం స్తవరాజమ్
ఉపాసకానాం యదుపాసనీయముపాత్తవాసం వటశాఖిమూలే |
తద్ధామ దాక్షిణ్యజుషా స్వమూర్త్యా జాగర్తు చిత్తే మమ బోధరూపమ్ || ౧ ||
ఉపాసనా మార్గమునందున్న వారికి సేవింపదగినదై వటవృక్ష మూలమున నివసించు నే తేజస్సు గలదో, దాక్షిణ్యముతో నొప్పు రూపము గల యా తేజస్సు జ్ఞానరూపమై నా మనస్సునందు నిలిచియున్నది.
అద్రాక్షమక్షీణదయానిధానమాచార్యమాద్యం వటమూలభాగే |
మౌనేన మందస్మితభూషితేన మహర్షిలోకస్య తమో నుదంతమ్ || ౨ ||
విద్రావితాశేషతమోగణేన ముద్రావిశేషేణ ముహుర్మునీనామ్ |
నిరస్య మాయాం దయయా విధత్తే దేవో మహాంస్తత్త్వమసీతి బోధమ్ || ౩ ||
అపారకారుణ్యసుధాతరంగైరపాంగపాతైరవలోకయంతమ్ |
కఠోరసంసారనిదాఘతప్తాన్మునీనహం నౌమి గురుం గురూణామ్ || ౪ ||
మమాద్యదేవో వటమూలవాసీ కృపావిశేషాత్కృతసన్నిధానః |
ఓంకారరూపాముపదిశ్య విద్యామావిద్యకధ్వాంతమపాకరోతు || ౫ ||
కలాభిరిందోరివ కల్పితాంగం ముక్తాకలాపైరివ బద్ధమూర్తిమ్ |
ఆలోకయే దేశికమప్రమేయమనాద్యవిద్యాతిమిరప్రభాతమ్ || ౬ ||
స్వదక్షజానుస్థితవామపాదం పాదోదరాలంకృతయోగపట్టమ్ |
అపస్మృతేరాహితపాదమంగే ప్రణౌమి దేవం ప్రణిధానవంతమ్ || ౭ ||
తత్త్వార్థమంతేవసతామృషీణాం యువాపి యః సన్నుపదేష్టుమీష్టే |
ప్రణౌమి తం ప్రాక్తనపుణ్యజాలైరాచార్యమాశ్చర్యగుణాధివాసమ్ || ౮ ||
ఏకేన ముద్రాం పరశుం కరేణ కరేణ చాన్యేన మృగం దధానః |
స్వజానువిన్యస్తకరః పురస్తాదాచార్యచూడామణిరావిరస్తు || ౯ ||
ఆలేపవంతం మదనాంగభూత్యా శార్దూలకృత్త్యా పరిధానవంతమ్ |
ఆలోకయే కంచన దేశికేంద్రమజ్ఞానవారాకరబాడబాగ్నిమ్ || ౧౦ ||
చారుస్థితం సోమకలావతంసం వీణాధరం వ్యక్తజటాకలాపమ్ |
ఉపాసతే కేచన యోగినస్త్వాముపాత్తనాదానుభవప్రమోదమ్ || ౧౧ ||
ఉపాసతే యం మునయః శుకాద్యా నిరాశిషో నిర్మమతాధివాసాః |
తం దక్షిణామూర్తితనుం మహేశముపాస్మహే మోహమహార్తిశాంత్యై || ౧౨ ||
కాంత్యా నిందితకుందకందలవపుర్న్యగ్రోధమూలే వస-
న్కారుణ్యామృతవారిభిర్మునిజనం సంభావయన్వీక్షితైః |
మోహధ్వాంతవిభేదనం విరచయన్బోధేన తత్తాదృశా
దేవస్తత్త్వమసీతి బోధయతు మాం ముద్రావతా పాణినా || ౧౩ ||
అగౌరగాత్రైరలలాటనేత్రైరశాంతవేషైరభుజంగభూషైః |
అబోధముద్రైరనపాస్తనిద్రైరపూర్ణకామైరమరైరలం నః || ౧౪ ||
దైవతాని కతి సంతి చావనౌ నైవ తాని మనసో మతాని మే |
దీక్షితం జడధియామనుగ్రహే దక్షిణాభిముఖమేవ దైవతమ్ || ౧౫ ||
ముదితాయ ముగ్ధశశినావతంసినే భసితావలేపరమణీయమూర్తయే |
జగదింద్రజాలరచనాపటీయసే మహసే నమోzస్తు వటమూలవాసినే || ౧౬ ||
వ్యాలంబినీభిః పరితో జటాభిః కలావశేషేణ కలాధరేణ |
పశ్యల్లలాటేన ముఖేందునా చ ప్రకాశసే చేతసి నిర్మలానామ్ || ౧౭ ||
ఉపాసకానాం త్వముమాసహాయః పూర్ణేందుభావం ప్రకటీకరోషి |
యదద్య తే దర్శనమాత్రతో మే ద్రవత్యహో మానసచంద్రకాంతః || ౧౮ ||
యస్తే ప్రసన్నామనుసందధానో మూర్తిం ముదా ముగ్ధశశాంకమౌళేః |
ఐశ్వర్యమాయుర్లభతే చ విద్యామంతే చ వేదాంతమహారహస్యమ్ || ౧౯ |

కార్తిక పురాణము - పదకొండవ అధ్యాయము

కార్తిక పురాణము - పదకొండవ అధ్యాయము
రాజోత్తమా! తిరిగి చెప్పెదను వినుము. కార్తీకమాసమందు అవిసె పువ్వుతో హరిని పూజించిన వాని పాపములు నశించును. చాంద్రాయణవ్రత ఫలము పొందును. కార్తీకమాసమందు గరికతోను, కుశలతోను హరిని పూజించువాడు పాపవిముక్తుడై వైకుంఠమును జేరును. కార్తీకమాసమందు చిత్రరంగులతో గూడిన వస్త్రములను హరికి సమర్పించినవాడు మోక్షమునొందును. కార్తీకమాసమందు స్నానమాచరించి హరిసన్నిధిలో దీపమాలలనుంచువాడును, పురాణమును జెప్పువాడును, పురాణమును వినువాడును పాపములన్నియును నశింపజేసుకొని పరమపదమును బొందుదురు. ఈవిషయమై యొక పూర్వకథగలదు. అది విన్నమాత్రముననే పాపములు పోవును. ఆయురారోగ్యములనిచ్చును. బహు ఆశ్చర్యకరముగా నుండును. దానిని చెప్పెద వినుము. కళింగదేశమందు మందరుడను నొక బ్రాహ్మణుడు గలడు. అతడు స్నాన సంధ్యావందనాదులను విడిచి పెట్టినవాడై ఇతరులకు కూలి చేయుచుండెడివాడు. అతనికి మంచిగుణములు గలిగి సుశీలయను పేరుగల భార్యయుండెను. ఆమె పతివ్రతయు, సమస్త సాముద్రిక లక్షణములతో గూడినదై ఆడవారిలో శ్రేష్ఠురాలైయుండెను. ఓరాజా! ఆసుశీల భర్త దుర్గుణ పూర్ణుడైనను అతనియందు ద్వేషమునుంచక సేవించుచుండెను. తరువాత వాడు వేరైన జీవనోపాయము తెలియక కూలిజీవనము కష్టమని తలచి కత్తిని ధరించి అడవిలో మార్గము కనిపెట్టుకొని యుండి దారి నడుచువారిని కొట్టి వారి ధనములనపహరించుచు కొంతకాలమును గడిపెను. అట్లు చౌర్యమువలన సంపాదించిన వస్తువులను ఇతర దేశములకు పోయి అమ్ముకొని ఆధనముతో కుటుంబమును పోషించుచుండెను. ఒకప్పుడు ఆ బ్రాహ్మణుడు చౌర్యముకొరకు మార్గమును కనిపెట్టియుండి మార్గానవచ్చునొక బ్రాహ్మణుని పట్టుకొని మర్రిచెట్టుకు కట్టి అతని సొమ్మంతయును హరించెను. ఇంతలోనే క్రూరుడైన కిరాతుడొకడు వచ్చి ఆ యిద్దరు బ్రాహ్మణులను చంపి ఆధనమంతయు తాను హరించెను. తరువాత గుహలోనున్న పెద్దపులి కిరాత మనుష్యగంథమును ఆఘ్రాణించి వచ్చి వానిని కొట్టెను. కిరాతుడును కత్తితో పులిని కొట్టెను. ఇట్లు ఇద్దరును పరస్పర ప్రహారములచేత ఒక్కమారే చనిపోయిరి. ఇట్లు ఇద్దరు బ్రాహ్మణులు, పులి, కిరాతుడు నలుగురు ఒక చోట మృతినొంది యమలోకమునకు బోయి కాలసూత్ర నరకమందు యాతన బడిరి. యమభటులు వారినందరిని పురుగులతోను, అమేధ్యముతోను కూడినటువంటి భయంకరమైన చీకటిలో సలసలకాగుచున్న రక్తమందు బడవైచిరి. జనకమహారాజా! ఆబ్రాహ్మణుని భార్య సమస్త ధర్మములను ఆచారవంతురాలై హరిభక్తియుతయై సజ్జన సహవాసమును జేయుచు నిరంతరము భర్తను ధ్యానించుచుండెను. ఓరాజా! ఇట్లుండగా దైవవశముచేత ఒక యతీశ్వరుడు హరినామముచేయుచు నాట్యముచేయుచు పులకాంకితశరీరుడై హరినామామృతమును పానముచేయుచు సమస్త వస్తువులందు హరిని దర్శించుచు ఆనంద భాష్పయుతుడై ఆమె యింటికి వచ్చెను. ఆమెయు ఆయతిని జూచి భిక్షమిడి అయ్యా యతిపుంగవా! మీరు మాయింటికి వచ్చుటచేత నేను తరించితిని. మీవంటివారి దర్శనము దుర్లభము. మాయింటివద్ద నా భర్తలేడు. నేనొక్కదాననే పతిధ్యానమును చేయుచున్నదానను. ఆమె యిట్లుచెప్పగా విని యతీశ్వరుడు ప్రియభాషిణియు శ్యామయునయిన ఆమెతో ఇట్లనియెను. అమ్మాయీ! ఈరోజు కార్తీక పూర్ణిమ మహాపర్వము. ఈదిన సాయంకాలము హరిసన్నిధిలో మీయింటిలో పురాణ పఠనము జరుపవలెను, ఆపురాణమునకు దీపముకావలెను. నూనె తెచ్చెదను. గనుక వత్తి నీవు చేసిఇమ్ము. శ్యామయనగా యౌవనవతియని అర్థము. యతీశ్వరుడిట్లు చెప్పగా ఆచిన్నది విని సంతోషముతో గోమయముతెచ్చి ఆయిల్లు చక్కగా అలికినదై అందు అయిదురంగులతో ముగ్గులను బెట్టి పిమ్మట దూదిని పరిశుద్ధము చేసినదై ఆదూదిచే రెండు వత్తులను జేసి నూనెతో యతీశ్వరుని వద్ద వెలిగించి స్వామికి సమర్పించెను. ఆచిన్నది దీపపాత్రను, వత్తిని తాను యిచ్చినందుకు యతీశ్వరుడు చాలా సంతోషించి దీపమును వెలిగించెను. యతియు ఆదీపమునందు హరిని బూజించి మనశ్శుద్ధి కొరకై పురాణపఠనమారంభించెను. ఆమెయు ప్రతియింటికిబోయి పురాణశ్రవణమునకు రండని చాలామందిని పిలుచుకుని వచ్చి వారితో సహా ఏకాగ్రమనస్సుతో పురాణమును వినెను. తరువాత యతీశ్వరుడు యధేచ్ఛగా పోయెను. కొంతకాలమునకు హరిధ్యానము చేత జ్ఞానమును సంపాదించుకొని ఆమె మృతినొందెను. అంతలో శంఖచక్రాంకితులును, చతుర్బాహులును, పద్మాక్షులును, పీతాంబరధారులునునైన విష్ణుదూతలు దేవతల తోటలోనున్న పుష్పములతోను, ముత్యాలతోను, పగడములతోను, రచించిన మాలికలతోను, వస్త్రములతోను, ఆభరణములతోను అలంకరించబడిన విమానమును దీసికొని క్వచ్చి సూర్యుడువలె ప్రకాశించెడి ఆవిమానమందు ఆమెను ఎక్కించి జయజయధ్వనులతో కరతాళములు చేయుచు చాలామంది వెంటరాగా వైకుంఠలోకమునకు చేరెను. ఆమె వైకుంఠమునకుబోవుచు మధ్యమార్గమందు నరకమును జూచి అచ్చట తనపి నరకమునందు ఉండుటకు ఆశ్చర్యమొంది విష్ణుదూతలతోనిట్లు పలికెను. ఓ విష్ణుదూతలారా! నిమిషమాత్రము ఉండండి. ఈనరకకూపమునందు నా భర్త ముగ్గురితో పడియుండుటకు కారణమేమి? ఈవిషయమును నాకు జెప్పుడు. వీడు నీభర్త, వీడు కూలిచేసియు, దొంగతనమును జేసియు పరధనాపహరణము జేసినాడు. వేదోక్తమయిన ఆచారమును వదలి దుర్మార్గమందు చేరినాడు. అందువల్ల వీడు నరకమందున్నాడు. ఈరెండవ బ్రాహ్మణుడు మిత్రద్రోహి, మహాపాతకుడు, ఇతడు బాల్యము నుండి మిత్రుడైయున్న వాి నొకనిని చంపి వానిధనము అపహరించి ఇతరదేశమునకు బోవుచున్నంతలో నీభర్తచేత హతుడాయెను. అట్టి పాపాత్ముడు గనుక ఇతడు నరకమందు బడియున్నాడు. ఈమూడవవాడు కిరాతుడు. వీడు నీభర్తను యీబ్రాహ్మణుని యిద్దరిని చంపినాడు. అందుచేత వీడు నరకమందుండెను. ఈనాల్గవవాడు, పులి, కిరాతులు పరస్పర ఘాతములచేత మృతినొందిరి. ఈపులి పూర్వమందు ద్రావిడ బ్రాహ్మణుడు. ఇతడు ద్వాదశినాడు భక్ష్యాభక్ష్య విచారణ చేయక నూనెతో చేసిన వంటకములను భుజించినాడు. అందుచేత వీడు నరకమందున్నాడు. ఇట్లు నలుగురు నరకమందు యాతనలనొందుచున్నారు. ద్వాదశినాడు నేయి వాడవలెను. నూనె వాడకూడదు. విష్ణుదూతలిట్లు చెప్పగా విని ఆమె అయ్యలారా, ఏపుణ్యము చేత వీరు నరకమునుండి ముక్తులగుదురని యడిగెను. ఆమాటవిని దూతలిట్లనిరి. అమ్మా! కార్తీకమాసమందు నీచేత చేయబడిన పుణ్యమందు పురాణశ్రవణఫలమును నీభర్తకిమ్ము. దానితో వాడు విముక్తుడగును. ఆపురాణశ్రవణార్థమై దీపమునకు నీవు సమర్పించిన వర్తి పుణ్యమును ఈ కిరాతవ్యాఘ్రములకు సమానముగానిమ్ము. దానివలన వారు ముక్తులగుదురు. పురాణశ్రవణార్థమై నీవు ప్రతిగృహమునకు బోయి ప్రజలను బిలిచిన పుణ్యమును ఈకృతఘ్నునకిమ్ము. దానితో వాడు ముక్తుడగును. ఇట్లు ఆయా పుణ్యదానములచేత వారు వారు ముక్తులగుదురు. విష్ణుదాతలమాటలు విని ఆశ్చర్యమొంది బ్రాహ్మణస్త్రీ ఆయా పుణ్యములను వారివారికిచ్చెను. దానిచేత వారు నరకమునుంి విడుదలయై దివ్యమానములనెక్కి ఆస్త్రీని కొనియాడుచు మహాజ్ఞానులు పొందెడి ముక్తిపదమును గూర్చి వెళ్ళిరి. కాబట్టి కార్తీకమాసమందు పురాణశ్రవణమును జేయువాడు హరిలోకమందుండును. ఈచరిత్రను వినువారు మనోవాక్కాయములచేత సంపాదించబడిన పాపమును నశింపజేికొని మోక్షమును బొందుదురు.
ఇతి శ్రీస్కాందపురాణే కార్తీకమహాత్మ్యే ఏకాదశోధ్యాస్సమాప్తః

కార్తిక పురాణము - పదవ అధ్యాయము.

కార్తిక పురాణము - పదవ అధ్యాయము
జనకుడు తిరిగి ఇట్లు అడిగెను. ఓ మునీశ్వరా! ఈ అజామిళుడు పూర్వజన్మమందెవ్వడు? ఏమిపాపమును జేసెను? విష్ణుదూతలు చెప్పినమాటలను విని యమభటులు ఎందుకు యూరకుండిరి? యముని వద్దకుపోయి యమునితో ఏమని చెప్పిరి? వశిష్ఠుడు ఇట్లు చెప్పెను. యమదూతలు విష్ణుదూతలమాటలు విని శీఘ్రముగా యమునివద్దకుబోయి సర్వవృత్తాంతమును జెప్పిరి. అయ్యా! పాపాత్ముడును, దురాచారుడును, నిందితకర్మలను ఆచరించువాడునునగు అజామిళునికి తోడితెచ్చుటకు పోయినంతలో విష్ణుదూతలు వచ్చి మమ్ములను ధిక్కరించి అతనిని విడిపించిరి. మేము వారిని ధిక్కరించుటకు అశక్తులమై వచ్చితిమి అని చెప్పిరి. ఆమాటను విని కోపించి యముడు జ్ఞానదృష్టితో చూచి యిట్లనియె. ఈఅజామిళుడు దుర్మార్గుడైనను అంత్యకాలమందు హరినామము చేయుటచేత పాపములు నశించి వైకుంఠప్రియుడాయెను. అందువలన అతనిని విష్ణుదూతలు స్వీకరించిరి. దుష్టాత్ములై మహిమను తెలిసికొనక హరినామస్మరణ చేసినను జ్పాపములు నశించును. తెలియక తాకినను అగ్ని కాల్చునుగదా! భక్తితో నారాయణ స్మరణనుజేయువాడుజ్ జీవన్ముక్తుడై అంతమందు మోక్షమునొందును. యముడిట్లు విచారించి యూరకుండెను. అజామిళుడు పూర్వ జన్మమున సౌరాష్ట్రదేశమందు బ్రాహ్మణుడై శివార్చకుడుగా ఉండి శివద్రవ్యమును హరించుచు స్నానసంధ్యలను విడిచి అన్యమానసుడై శివుని పూజించుచు శివునకభిముఖముగా కాళ్ళు చాపుకుని శయనించుచు ఆయుధపాణియై స్నేహితులతో గూడి నానాలంకార శోభితుడై స్వేచ్ఛావిహారముల తిరుగుచు బహుభాషియై మంచి యౌవనముతో నుండెను. ఆయూరిలోనొక బ్రాహ్మణుడుండెను. అతనికొక రూపవతియు యౌవనవతియగు భార్యగలదు. ఆబ్రాహ్మణుడు దరిద్రపీడితుడై అన్నముకొరకై పట్టణములు, గ్రామములు పల్లెలు తిరుగుచు యాచించుచుండెడివాడు. ఒకానొకప్పుడు బ్రాహ్మణుడు సంపాదించిన ధ్యాన్యాదికమును శిరస్సుననుంచుకొని ఆకలితో యింటికివచ్చి భార్యతో ఓసీ! నాకుఆకలి కలుగుచున్నది. త్వరగా వంటచేయుము. ముందు మంచినీళ్ళిమ్ము త్రాగి శాంతించెదను. భర్త యిట్లెన్ని మారులడిగినను భార్య అతని మాటను లెక్కచేయక పనులు చేయుచు జారుని మనస్సులో ధ్యానించుచు యూరకుండెను. అంత భర్త కోపించి దండముతో భార్యనుగొట్టెను. భార్య భర్తను పిడికిలితో గుద్దెను. తరువాత భర్త ఆ గృహమును విడిచి గ్రామాంతరముబోయి అచ్చట భిక్షమెత్తుకొని జీవించుచు భార్యసంగతిని గూర్చి చింతించుచుండెను. భార్యయు సుఖముగానుండి రాత్రి భుజించి మంచి చీరెధరించి తాంబూలము స్వీకరించి యొక చాకలివాని ఇంటికిపోయెను. సుందరుడయిన చాకలివానిని జూచి రాత్రి నాతో సంభోగించుమనెను. ఆమాటవిని వాడు నీవు బ్రాహ్మణ స్త్రీవి. అర్థరాత్రివేళ మాయింటికి రావచ్చునా? మీరు గొప్పకులమునందు బుట్టినవారు. మేము నిందుతులము. కాబట్టి యిట్టి సంపర్కము మీకు తగునా? ఈప్రకారముగా వారిరువురును వివాదపడుచు చాకలివాడు రోకలితో ఆమెను కొట్టెను. ఆమెయు వానిని కొట్టి వానిని విడిచ రాజమార్గమున బోవుచుండగా పైనజెప్పిన శివార్చకుని జూచెను. అంతలో ఆస్త్రీ వానిని పట్టుకుని రతికేళికి రమ్మనమని పిలుచుకొనిపోయి వానితో భోగించి రాత్రియంతయు వానితో కాలక్షేపము చేసి తెల్లవారగానే పశ్చాత్తాపమునుబొంది భర్తవద్దకు బోయి ఆయనను బ్రతిమాలి ఆయనతో గూడా గృహమందు సౌఖ్యముగా నుండెను. తరువాత కొంతకాలమునకు శివార్చకుడు మృతినొంది యమలోకమందు క్రమముగా రౌరవాది నరక దుఃఖములననుభవించి తిరిగి భూమియందు సత్వనిష్ఠుని కొడుకు అజామిళుడై జన్మించెను. ఇతనికి కార్తీకపున్నమినాడు శివదర్శనము లభించినది. అంత్యకాలమందు హరినామస్మరణ గలిగినది. ఆ హేతువులచేత సప్తజన్మార్జిత పాపములు నశించి మోక్షమును బొందెను. ఆ బ్రాహ్మణియు కొంతకాలమునకు మృతినొంది నరకములందనే యాతనలనొంది తిరిగి భూమియందు కన్యాకుబ్జమందు చండాలునకు పుత్రికగా జన్మించెను. చండాలుడు ఈమె పుట్టిన సమయము మంచిదాయని యొక బ్రాహ్మణునియడిగెను. అతడు ఈమె తండ్రిగండాన పుట్టినదని చెప్పెను. ఆమాటవిని చండాలుడు ఆశిశువును దీసుకొనిపోయి అరణ్యమందుంచెను. అంతలో ఒక బ్రాహ్మణుడు జూచి రోదనము చేయుచున్న ఆ శిశువును దీసికొనిపోయి తన ఇంటిలో దాసీగానున్నయొక స్త్రీకి నప్పగించెను. ఆదాసీది ఈమెను పెంచెనది. తరువాత ఈమెను అజామిళుడు దగ్గరకు తీసెను. తరువాత కథ పూర్వోక్తమే. రాజోత్తమా! ఇది నీవడిగిన ప్రశ్నకు సమాధానము. అజామిళుని పూర్వ వృత్తాంతము. పాపములకు ప్రాయశ్చిత్తములు చేయుట కష్టము. హరినామకీర్తనము చేసిన ప్రాయశ్చిత్తములతో పనిలేదు. అదిగాని యెడల ధర్మశాస్త్రోక్త ప్రాయశ్చిత్తములు చేయవలెనని భావము. ఎవ్వనియొక్క నాలుక హరినామ కీర్తనము చేయదో, మనస్సు హరి పాదపద్మమును స్మరించదో చెవులు హరిచరిత్రములను వినదో వాని పాపములు యెట్లు నశించును? ఇతర చింతను మాని హరిని స్మరించువారు ముక్తినొందెదరు. ఇందుకు సందియములేదు. కార్తీకధర్మమునకు పాపములను నశింపజేయి సామర్ధ్యమున్నది. కాబట్టి కార్తీక మాసమందు ధర్మమాచరించనివాడు నరమునొందును. ఇది నిశ్చయము. పాపములను నశింపజేయి ఈకథను విన్నవారు సమస్త పాపములను నశింపజేసి మోక్షమొందుదురు. ఈకథను వినిపించువారు పాపవిముక్తులై వైకుంఠమందు విష్ణువుతో గూడి సుఖించును.
ఇతి శ్రీస్కాందపురాణే కార్తీకమహాత్మ్యే దశమోధ్యాయస్సమాప్తః

కార్తీక పురాణం - 9 వ అధ్యాయం


విష్ణుదూతలడిగిరి. ఓ యమదూతలారా! మీ ప్రభువు మీతో చెప్పిన మాటలేమిటి? మీయమదండనకు ఎవ్వడు తగినవాడు? పుణ్యమనగా ఏమి? ఈవిషయముల్లన్నిటిని మాకు జెప్పుడు. ఇట్లని విష్ణుదూతలడుగగా యమదూతలు ఇట్లు పల్కిరి. ఓ విష్ణుదూతలారా! సావధానముగా వినుడు. సూర్యుడు, చంద్రుడు, అగ్ని, వాయువు, ఆకాశము, గోవులు, సంధ్యలు, పగలు, దిక్కులు, కాలము ఇవి మనుష్యుని పుణ్యపాపములను గురించి సాక్షులు. మేము వీరి సాక్ష్యముతో విచారించి పాపములను జేసిన వానిని దండింతుము. వేదమార్గమును వదలి ఇచ్ఛానుసారముగా తిరుగుచు వేదశాస్త్రములను దూషించుచు సాధు బహిష్కృతుడైన వానిని మేము దండింతుము. బ్రాహ్మణుని, గురువును, రోగిని పాదములచేత తన్నువాడును, తల్లిదండ్రులతో కలహించువాడును అయిన వారిని మేము దండింతుము. నిత్యము అబద్ధమాడుచు జంతువులను జంపుచు కులాచారములను వదిలినవారిని మేము దండింతుము. ఇచ్చిన సొమ్మును తిరిగి తీసుకున్నవానిని, డాంబికుని, దయాశాంతులు లేనివానిని, పాపకర్మలందాసక్తులైన వారిని మేము దండింతుము. పరుని భార్యతో క్రీడించువానిని, ద్రవ్యమును గ్రహించి సాక్ష్యములను జెప్పువానిని మేము దండింతుము. నేను దాతనని చెప్పుకొనువానిని, మిత్రద్రోహిని, ఉపకారమును మరచిన వానిని అపకారమును జేయువానిని మేము దండింతుము. వివాహమును చెరుచువానిని, ఇతరుల సంపత్తులను జూచి అసూయపడువానిని మేము దండింతుము. పరుల సంతానమును జూచి దుఃఖించువానిని కన్యాశుల్కముల చేత జీవించువానిని, వడ్డీతో జీవించువానిని మేము దండింతుము. చెరువును, నూతిని, చిన్న కాలువలను నిర్మించు వ్యాపారమును మార్పించు వానిని, నిర్మితములయిన వాటిని చెరుచు వానిని మేము దండింతుము. మోహముచేత మాతాపితరుల శ్రాద్ధమును విడచినవానిని, నిత్యకర్మను వదలిన వానిని మేము దండింతుము. పరపాకపరిత్యాగిని, పరపాకరతుని, పితృశేషాన్నమును భుజించువానిని మేము దండింతుము. పరపా పరిత్యాగియనగా తానువండిన అన్నములో ఇతరులకు యెంతమాత్రమును బెట్టకతానే అంతయు భుజించువాడు. పితృశేషాన్నభోక్తయనగా శ్రాద్ధభోక్తలు భుజింిన తరువాత మిగిలిన అన్నమును భుజించువాడు. ఇతరుడు దానము చేయుసమయాన ఇవ్వవద్దు అని పలుకువానిని, యాచించిన బ్రాహ్మణునకివ్వనివానిని, తన్ను శరణుజొచ్చినవానిని చంపువానిని మేము దండింతుము. స్నానమును సంధ్యావందనమును విడుచువానిని, నిత్యము బ్రాహ్మణనిందకుని బ్రాహ్మణహంతకుని, అశ్వహంతకుని, గోహంతకుని, మేము దండింతుము. ఈమొదలయిన పాతకములను జేయు మానవులు యమలోకమందుండు మాచేత యాతనలను పొందుదురు. ఈఅజామిళుడు బ్రాహ్మణుని వంశమందు జన్మించి దాసీ సంగలోలుడై పుట్టినది మొదలు చచ్చువరకు పాపములను చేసినాడు. ఇతనిచే చేయబడిన పాపములకు మితిలేదు. ఇట్టి విప్రాధముడు మీ విష్ణులోకమునకు ఎట్లు అర్హుడగును. ఈప్రకారముగా పలికిన యమదూతలమాటలు విని విష్ణుదూతలు చిరునగవుతో వికసించిన ముఖపద్మములు గలవారై మేఘ సమాన గంభీరధ్వనితో నిట్లనిరి. ఏమియాశ్చర్యము. మీరింత మూఢులు, ధర్ మర్యాదను మేము చెప్పెదము. సావధానముగా వినుడు. దుస్సంగమును విడుచువాడు, సత్సంగము ఆశ్రయించువాడు, నిత్యము బ్రహ్మ చింతనమును జే్యువాడు యమదండార్హుడుగాడు. స్నాన సంధ్యావందనములాచరించువాడును, జపహోమాదులాచరించువాడును, సర్వభూతములందు దయావంతుడును యమలోకమును పొందడు. సత్యవంతుడై అసూయా దోషరహితుడై జపాగ్ని హోత్రములను జేయుచు కర్మల ఫలములను బ్రహ్మయందుంచినవాడు యమదండార్హుడుగాడు. కర్తృభోక్తృత్వాదులను సగుణపరమేశ్వరునియందు స్థాపించి ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలను ఆచరించుటయే తాత్పర్యముగా కలవాడు యమమందిరానికి వెళ్ళడు. అన్నదానమాచరించువాడును, జలదాతయు, గోదానకర్తయు, వృషోత్సర్గకర్తయు యమలోకమును పొందడు. వృషోత్సర్గము=ఆబోతును అచ్చుపోసి వదలుట. విద్యను గోరినవారికి విద్యాదానమాచరించువాడును, పరోపకారమందాసక్తి గలవాడును యమలోకమును పొందడు. హరిని బూజించువాడును, హరినామమును జపించువాడును, వివాహములను ఉపనయనములను జేయువాడును, యమలోకమును పొందడు. మార్గమధ్యమందు మండపములు కట్టించువాడును, క్రీడాస్థానములను గట్టించువాడును, దిక్కులేని శవమునకు మంత్ర సంస్కారమును జేయించువాడును యమోకమును పొందడు. నిత్యము సాలగ్రామార్చనమాచరించి ఆతీర్థమును పానముజేసి దానికి వందనమాచరించువాడు యమలోకమును పొందడు. తులసీ కాష్ఠమాలికను మెడయందు ధరించి హరిని పూజించువాడును సాలగ్రామమును పూజించువాడును యమలోకమును పొందడు. భాగవతమును వ్రాసి గృహమందు పూజించుచున్నను, గృహమందుంచుకొన్నను యమలోకమును పొందడు. సూర్యుడు మేషతులా మకర సంక్రాంతులయందుండగా ప్రాతస్స్నానమాచరించు వారు యమలోకమును పొందరు. రుద్రాక్షమాలికను ధరించి జపదాన హోమాదులను ఆచరించువాడు యమలోకమును పొందడు. నిత్యము అచ్యుత, గోవింద, అనంత, కృష్ణ, నారాయణ, ఓరామయని హరినామ సంకీర్తన ఆచరించువాడు యమలోకమును పొందడు. కాశియందు మణికర్ణికాఘట్టమందు హరిస్మరణ చేయుచు మృతినొందినయెడల వాడు సర్వపాపములు చేసినవాడయినను యమలోకమును పొందడు. దొంగ, కల్లుత్రాగువాడు, మిత్రహంతకుడు, బ్రాహ్మణహంత, గురుభార్యరతుడు, స్త్రీహత్య, రాజహత్య, గురుహత్య, గోహత్య, చేసిన పాపాత్ములు మరణకాలమందు హరిని స్మరించిన యెడల పాపవిముక్తులగుదురు.
మహిమను తెలుసుకొనిగాని, తెలియకగాని, మరణకాలమున హరినామ సంకీర్తన గావించిన వారు పాపాత్ములయినను ముక్తులగుదురు. పడినప్పుడును, తొట్రుపాటు బొందినప్పుడును, కొట్టబడినప్పుడును, జ్వరాదులచేత పీడింపబడినప్పుడును, సప్తవ్యసనములచే పీడింపబడునప్పుడును, వశముకానప్పుడును హరి హరీయని అన్నయెడల యమయాతన పొందడు. అనేక జన్మలలో సంపాదింపబడి ప్రాయశ్చిత్తములు లేక కొండలవలె పెరిగియున్న పాపములన్నియు భూమియందుగాని, స్వర్గమందుగాని హరినామసంకీర్తనము చేత నశించును. మరణావస్థలో ఉన్నవాడు హరినామస్మరణమును జేసినయెడల వాని పాపములన్నియు అగ్నిలోనుంచిన దూదివలె నశించును. విష్ణుదూతలిట్లు యమదూతలతో పలికి అజామిళుని యమదూతలవలన విడిపించిరి. తరువాత అజామిళుడు విష్ణుదూతలకు నమస్కారము చేసి మీ దర్శనము వలన నేను తరించితిననెను. తరువాత విష్ణుదూతలు వైకుంఠమునకుబోయిరి. తరువాత అజామిళుడు యమదూత విష్ణుదూతల సంవాదమును విని ఆశ్చర్యపడి అయ్యో ఎంతకష్టమాయెను. ఆత్మహితము చేసికొనలేకపోతినిగా ఛీ ఛీ నాబ్రతుకు సజ్జననిందితమాయెనుగదా, పతివ్రతయైన భార్యను వదలివేసి కల్లుద్రాగెడి ఈదాసీభార్యను స్వీక



రించితినిగదా, వృద్ధులు నాకంటే వేరే దిక్కులేని వారును పుణ్యాత్ములయిన మాతాపితరులను నీచుడనై విడిచితిని గదా అయ్యో యెంత కష్టము,ధర్మమును చెరుచువారు కాముకులు నిరంతరమనుభవించెడి నరకమందిప్పుడు నేను నిశ్చయముగా పడెడివాడను. ఇదియేమి ఆశ్చర్యము. ఇది స్వప్నమా. ఆనల్లకత్తులను ధరించిన యమభటులెట్లు పోయిరి? నేను పూర్వజన్మమందు పుణ్యమాచరించినవాడను. ఇది నిజము. అట్లుగానిచో దాసీపతియైన నాకు మరణకాలమందు హరిస్మృతి యెట్లుగలుగును> నా జిహ్వహరినామమును యెట్లు గ్రహించును? పాపాత్ముడైన నేనెక్కడ, అంత్యకాలమందీ స్మృతియెక్కడ? సిగ్గువిడిచి బ్రాహ్మణులనుజంపు నేనెక్కడ, మంగళకరమయిన నారాయణనామమెక్కడ? అజామిళుడిట్లు విచారించి నిశ్చలమైన భక్తినిబొంది జితేంద్రియుడై కొంతకాలముండి సాయుజ్యముక్తిని పొందెను. కాబట్టి నారాయణ నామకీర్తన గావించువాడు సమస్తపాపవిముక్తుడై వైకుంఠలోకము పొందుదురు. ఇందుకు సందియము లేదు.
ఇతి శ్రీ స్కాందపురాణే కార్తీకమహాత్మ్యే నవమోధ్యాయస్సమాప్తః

జనభాషలో తీర్పులే న్యాయం! Enadu Editorial

జనభాషలో తీర్పులే న్యాయం!
న్యాయం చెయ్యడమే కాదు, చేస్తున్నట్లూ కనిపించాలన్నది సమున్నత న్యాయసూత్రం. కాలానుగుణ సంస్కరణలకు నోచక, కొందరు న్యాయమూర్తులే లోగడ చెప్పినట్లు ఇంకా ఎడ్లబండి కాలంలోనే ఉన్న న్యాయపాలికలో- కక్షిదారులకు అర్థంకాని భాషలో సాగే వాదోపవాద విన్యాసాలు న్యాయార్థుల్ని ఏ దరికి చేరుస్తున్నాయన్నది అగమ్యగోచరం! సర్వోన్నత, ఉన్నత న్యాయస్థానాల్లో పెండింగ్‌ కేసుల కొండలు కొద్దిగా కరుగుతుంటే, దిగువకోర్టుల్లో వాటి తాకిడి పెరుగుతోందని సర్కారీ లెక్కలు చాటుతున్నాయి. ఈ నేపథ్యంలో కేరళ హైకోర్టు వజ్రోత్సవాల ముగింపు కార్యక్రమంలో భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ‘సుప్రీం’ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రాలు వెలువరించిన సూచనలు, హితోక్తులు ఎంతో విలువైనవి. ప్రజలకోసం న్యాయస్థానాలున్నాయిగాని, కోర్టులకోసం ప్రజలు కాదన్నదే న్యాయపాలిక సేవాగుణ మౌలిక లక్షణం కావాలని భారత ప్రధాన న్యాయమూర్తి ఉద్బోధించారు. అందుకు అనుగుణంగా- కక్షిదారులకు తెలిసిన, అర్థమయ్యే భాషలోనే హైకోర్టుల తీర్పులు ఉండాల్సిన అవసరాన్ని ప్రథమ పౌరుడు రామ్‌నాథ్‌ కోవింద్‌ నొక్కి చెప్పారు! దేశవ్యాప్తంగా 24 ఉన్నత న్యాయస్థానాలున్నాయి. వాటిలో న్యాయ విచారణ ప్రక్రియ కక్షిదారులకు అవగతం కాని ఆంగ్లభాషలోనే సాగుతుండటంపట్ల దశాబ్దాలుగా వాద వివాదాలు రేగుతున్నాయి. పూర్వాశ్రమంలో న్యాయవాదిగా ఆ సమస్య లోతుపాతులు తెలిసిన కోవింద్‌- కనీసం తీర్పుల సారం కక్షిదారులకు అవగాహనకు వచ్చేలా వారి వారి భాషల్లో ఆయా న్యాయ నిర్ణయాల అనువాద ధ్రువీకృత ప్రతుల్ని అందించే యంత్రాంగం ఏర్పాటు కావాలని సూచిస్తున్నారు! అంతవరకు అది బాగానే ఉన్నా- ఆయా రాష్ట్రాల పరిధిలోని దిగువ కోర్టుల్లో స్థానిక భాషల్లో న్యాయ విచారణ ప్రక్రియ ఇంకా అమలుకాకపోవడం ఏమిటి? తాము వెళ్లబోసుకొనే గోడు ధర్మపీఠాల దృష్టికి సజావుగా చేరుతోందో లేదో తెలియక, విచారణ ప్రక్రియలో, తీర్పుల్లో ఆంగ్ల భాష అర్థంకాక కక్షిదారులు పడే వేదనకు దశాబ్దాలుగా పరిష్కారం ఏదీ?
సామాన్యుడు సైతం తన కేసును తానే వాదించుకొని సరైన పరిష్కారం పొందగల న్యాయవ్యవస్థ ఉండాలని పూజ్య బాపూజీ ఆకాంక్షించారు. వివాద పరిష్కారంకోసం బక్క రైతు బస్తీకి వెళ్ళి కొన్ని వారాల పాటు బస చేయాల్సిన పరిస్థితి రాకూడదని గాంధీజీ అభిలషించినా- పలుపు కోసం కోర్టుకెక్కి బర్రెను అమ్ముకొనే దుస్థితి దాపురించిందిప్పుడు! తమ తరఫున నల్లకోటు వకీళ్లు తమకే మాత్రం తెలియని భాషలో ఏం వాదిస్తున్నారో గుడ్లప్పగించి చూడటమేగాని, తమ గుండె ఘోష వాళ్ల గళాల్లో పలుకుతున్నదీ లేనిదీ తెలుసుకోగల అవకాశం కోట్లాది కక్షిదారులకు లేదు. రాజ్యాంగంలోని 348 అధికరణ సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో ఆంగ్ల భాషే చెల్లుబాటు కావాలని తీర్మానించింది. ఆయా హైకోర్టుల్లో ప్రాంతీయ భాషల వినియోగానికి రాష్ట్ర ప్రభుత్వాలనుంచి వచ్చే వినతుల్ని ఆమోదించరాదని సర్వోన్నత న్యాయపాలిక 1997, 1999, 2012లో గట్టిగా నిర్ణయించింది. కోర్టుల తీర్పుల్ని హిందీతోపాటు రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యులులో పొందుపరచిన భాషల్లో తర్జుమా చేసి అందుబాటులో ఉంచాలన్న ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని 2015 డిసెంబరులో సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. కోర్టుల భాష ఆంగ్లమేనంటూ ‘సుప్రీం’ గట్టిగా స్పష్టీకరించిన నేపథ్యంలో- రాష్ట్రపతి తాజా సూచనకు ఏ పాటి మన్నన దక్కుతుందో చూడాలి. అంతకు మించి, దిగువ కోర్టుల్లో ఆంగ్లభాష వినియోగాన్ని కక్షిదారులపట్ల క్రూర పరిహాసంగానే సంభావించాలి! సూటిగా సరళంగా స్పష్టంగా ఉండాల్సిన తీర్పులు ఆంగ్ల భాషా పటాటోప ప్రదర్శనగా నివ్వెరపరుస్తున్నాయంటూ మొన్న మే నెలలో వెలుగు చూసిన వార్తాకథనాలు- నాణేనికి ఒక పార్శ్వం. జిల్లా, సబార్డినేట్‌ కోర్టుల్లో పోగుపడిన రెండుకోట్ల 68 లక్షల కేసుల్లో స్థానిక భాషల్లో విచారణ జరిగినప్పుడే కక్షిదారులకు దక్కుతుంది- పారదర్శక న్యాయం!
‘అసలు న్యాయస్థానాల్లో వాదనలు, ఇతర కార్యకలాపాలు ఆంగ్లంలో కొనసాగడం ఏమిటి? ఇంకా ఎంతకాలం ఈ దారుణం?’- రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ జీఎస్‌ సింఘ్వి 2006లో వ్యక్తీకరించిన ధర్మాగ్రహమది! జిల్లా సెషన్స్‌ కోర్టు, అంతకు దిగువనున్న న్యాయాలయాల్లో స్థానిక భాషలోనే తీర్పులు వెలువడాలంటూ రాష్ట్ర ప్రభుత్వం 1974లోనే ఉత్తర్వులు జారీ చేసింది. ఆదేశాల జారీతోనే తన బాధ్యత తీరిపోయిందని భావించిన ప్రభుత్వ నిష్క్రియాపరత్వానికి నిదర్శనగా, న్యాయాలయాల్లో ఆశ్రితులకు అర్థంకాని ఆంగ్లమే నేటికీ రాజ్యమేలుతోంది. తెలుగు గడ్డపై తెలుగులో న్యాయపాలనకు కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తామని, న్యాయ పదకోశాలు, న్యాయ శాస్త్ర గ్రంథాలు, చట్టాలను అనువదించడం వంటి చర్యలు తీసుకోవాల్సి ఉందని 2013 ఫిబ్రవరిలో ప్రధాన న్యాయమూర్తిగా పినాక చంద్రఘోష్‌ ప్రకటించారు. దాదాపు అదే సమయంలో- స్థానిక న్యాయస్థానాల్లో తెలుగు వెలుగులీనేలా చేయడానికి కొన్ని సాంకేతిక ఇబ్బందులున్నాయన్న జస్టిస్‌ ఎన్‌.వి.రమణ- తెలుగులో న్యాయ పదకోశం సరిగా అందుబాటులో లేకపోవడం వాటిలో ఒకటంటూ రాష్ట్ర న్యాయ అకాడమీ అధ్యక్షులుగా తనవంతు ప్రయత్నం చేశారు. రాజస్థాన్‌, ఉత్తర్‌ ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, హరియాణాల్లో సామాన్య జన భాషలోనే తీర్పులుంటాయంటున్నప్పుడు ఆ విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలూ వెనుకబడటం ఏమిటి? న్యాయపాలన క్రతువు తేట తెనుగులో సాగితే పారదర్శకత ఇనుమడించి కేసుల సత్వర పరిష్కారమూ సాధ్యపడుతుంది. మాతృభాషకు మంగళారతులు పడతామంటున్న ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలూ దిగువ కోర్టుల్లో తెలుగు వెలుగుకు దివిటీలు పట్టే కార్యాచరణను సత్వరం పట్టాలకెక్కించాలి!
జిల్లా వార్తలు

సోమరితనం మనిషిని మరింత చెడ్డ వ్యక్తిగా మారుస్తుంది... జీవితంలొ గొప్ప వ్యక్తి గా ఎదగడానికి కృషి చేయాలి

ఒక బిచ్చగాడు పొద్దున్నే రోడ్డు పైన కూర్చుని భగవంతుడిని పెద్ద పెద్ద కేకలు పెడుతూ  తిడుతున్నాడు. 

ఆ దారినే ఆ దేశపు  రాజుగారు గుఱ్ఱం మీద వెళుతు
ఈ కేకలన్నీ విన్నాడు..

       " ఏమైంది నీకు ! ఇంత పొద్దున్నే భగవంతుడిని తిడుతున్నావు ! అన్నాడు.

      " మీకెమిటి ! మహారాజులు ! మిమ్మల్ని భగవంతుడు ఒక రాజు గారి కుమారుడిగా పుట్టించాడు ! మీరు చక్కగా మహారాజు అయిపోయారు....

నా ఖర్మ ఇలా ఉంది..ఒక రూపాయి కూడా లేని
దరిద్రుడిగా పుట్టించాడు.. చూడండి..
దేవుడికి ఎంత పక్షపాతమో! అన్నాడు..

     మహారాజు చిరునవ్వు నవ్వాడు,
 " అయితే భగవంతుడు నీకేమి ఇవ్వలేదు !!
చిల్లిగవ్వ కూడా ఇవ్వ లేదు అంతేగా ! "" అన్నాడు.

      " నిజం చెప్పారు మా రాజా ! " అన్నాడు బిచ్చగాడు.

   " సరే అయితే  ! నీకు పది వేల వరహాలు ఇస్తాను .
నీ అరచేయి కోసి ఇస్తావా ! అన్నాడు రాజుగారు.

    " భలేవారే ! అర చేయి లేక పోతే ఎలా ! " అన్నాడు ఆ బిచ్చగాడు.

" సరే ! నీ కుడి కాలు మోకాలి వరకు  కోసుకుంటాను... ఒక లక్ష వరహాలు ఇస్తాను..ఇస్తావా ! " అన్నాడు రాజుగారు.

  " ఎంత మాట ! ఆ గాయం మానడానికి ఎంత కాలం పడుతుందో ఏమిటో ! ఇవ్వను ! "అన్నాడు బిచ్చగాడు.

  " అన్నింటినీ కాదంటున్నావు.......
ఆఖరిగా అడుగుతున్నా...... పది లక్ష ల వరహాలు ఇస్తాను...   నీ నాలుక కోసి ఇస్తావా! అన్నాడు రాజుగారు.

     " అమ్మో! మీరు నా జీవితాన్ని ఆడిగేస్తున్నారు.
ఇవి లేకపోతే నేను ఎలా జీవించను ?? అన్నాడు బిచ్చగాడు.

 " ఓహో ! అయితే నువ్వు పేదవాడివి  కాదన్నమాట !!

 నీ దగ్గర పదివేల కన్నా విలువైన అరచేయి,
లక్ష రూపాయిల కన్నా విలువైన కాళ్ళు,
పది లక్షల కన్నా విలువైన నాలుక ......
ఇంకా ఎంతో విలువైన శరీర అవయవాలు
ఉన్నాయి కదా  ......??

మరి ఇంత విలువైన శరీరాన్ని
నీకు ఉచితంగా ఇచ్చిన  భగవంతుడికి
పొద్దున్నే నమస్కారం పెట్టకుండా నిందిస్తావా !!

ఈ శరీరాన్ని ఉపయోగించి 
లోకానికి సేవ చేసి పొట్ట పోసుకో !
అందరూ అదే చేస్తున్నారు...ఫో ఇక్కడనుండి.!
అన్నాడు రాజుగారు.

సోమరితనం మనిషిని మరింత నాశనం చేస్తుంది.

 ఎదుటి వారిని చూసి ఏడవడం కాదు.
ఆ విధంగా పైకి ఎదగడానికి కష్ట పడి పని చేయాలి. అటువంటి ఆలోచన మనసులో బలంగా ఉండాలి.

 మంచి ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి.
అంతే తప్ప కస్టపడడానికి సిగ్గు పడితే
జీవితం నాశనం అవుతుంది.

సోమరితనం
మనిషిని మరింత చెడ్డ వ్యక్తిగా మారుస్తుంది...  జీవితంలొ గొప్ప వ్యక్తి గా ఎదగడానికి కృషి చేయాలి

గోమాత జననం

గోమాత జననం
ఆవు పుట్టుక గురించి శతపథ బ్రాహ్మణంలో ఉంది. దక్ష ప్రజాపతి ప్రాణి సృష్టి చేసిన పిమ్మట కొంచెము అమృతమును త్రాగారు. త్రాగిన తరువాత వారు ప్రసన్నమయ్యారు. ఆ సమయములో వారి శ్వాస ద్వారా సుగంధము వెలువడి అంతటా ప్రసరించినది. ఆ శ్వాస నుండి ఒక్క ఆవు జన్మించినది. సుగంధము ద్వారా జన్మించుట వలన దక్షప్రజాపతి దానికి ‘సురభి’అని పేరు పెట్టారు. సురభి నుండి అనేక ఆవులు జన్మించాయి. అందుకనే సురభిని గోవంశమునకు మాతగా, జననిగా పరిగణిస్తారు.
ఋగ్వేదంలో వేదంలో 4వ కాండలో 12వ సూక్తం గోసూక్తంగా గోమాత యొక్క మహత్యం వివరించబడింది. శ్రీసూక్తం, పురుష సూక్తం, మన్యు సూక్తం లాంటి పవిత్ర సూక్తాలతోపాటు గోసూక్తం కూడా చెప్పబడింది. గోవు రుద్రులకు తల్లిగా, వసువులకు పుత్రికగా, ఆదిత్యులకు సోదరిగా, నెయ్యి రూపాన అమృతంగా చెప్పబడింది.
ఋగ్వేదంలో ఆవును ‘‘అఘణ్య’’ అన్నారు.
సముద్ర మధనము నుండి దేవతల కార్యసిద్ధికై, సాక్షాత్తు సురభి బయల్వెడలినది. సంతోషముగా ఉన్నది, కపిల వర్ణముగలది, పొదుగు బరువు చేత నెమ్మది, నెమ్మదిగా అలలపై నడుస్తూ వచ్చుచున్న కామధేనువును చూచిన దేవతలంతా గొప్పకాంతిగల ఆ ఆవుపై పుష్పములు కురిపించిరి. అపుడు అనేక విధములు వాధ్యములు, తూర్యములు మ్రోగింపబడినవి. లోకములో గోసంతతి వ్యాపించడానికి ఆమెయే ఆధారం. ఆ సురభి రోమకూపాలనుంచి కొన్ని లక్షల సంఖ్యలో గోవులు పుట్టాయి. వాటి మగ సంతతి వృషభాలు.
.‘‘గావః విశ్వస్య మాతరః గవా మాంగేషు తిష్ఠంతి భువనాని చతుర్దశ’’
ఆవు విశ్వజనులందరికీ తల్లి వంటిది. గోవు నందు చతుర్దశ భువనాలున్నాయని వేదం చెబుతుంది. అంటే గోవు పృథ్వీ రూపమని అర్థం.
క్షీర సాగరమధన సమయంలో నంది, శుభద్ర, సురభి, సుశీల, బహుళ అనే అయిదు గోవులు ఉద్భవించాయని భవిష్యపురాణం తెలియజేస్తుంది. వీటినే కామధేనువులు అంటారు.
వంద గోవుల చేత కూడివున్న ఆ ధేనువు, సురభిని నీటి మధ్య నుండి తీసుకొని వచ్చిరి. ఆ గోవులు దట్టమైన నీలిరంగులోనూ, నలుపు రంగులోనూ, ధూమ్రవర్ణములోను, బభ్రు వర్ణములోను, శ్యామ వర్ణములోనూ, ఎరుపు రంగు, పింగళ (చిత్ర) వర్ణములోనూ ఉండినవి. - స్కాంద పురాణము.
గోశబ్దము స్వర్గమునకు, బాణమునకు, పశువునకు, వాక్కునకును, వజ్రాయుధమునకును, దిక్కునకును, నేత్రమునకును, కిరణమునకును, భూమికిని, నీళ్ళకును పేరు.
‘‘ధేనునా మస్మి కామధుక్’’ అని గీతలో శ్రీకృష్ణుడు నేనే గోవునని చెప్పుకున్నాడు. గోవు లక్ష్మీ స్వరూపం. దీనికి ఒక పురాణ గాధ ఉంది. దేవతలందరూ వచ్చి గోవుతో తల్లీ మేమందరం నీ శరీరంలో నివసించడానికి కొంచెం భాగం ఇవ్వమని ప్రార్థిస్తే గోవు దేవతలందరికి భాగం ఇవ్వడం జరిగింది.
సురభి ఒక్కసారి తపస్సునారంభించనది. బ్రహ్మ దేవుడు ఆ తపస్సునకు మెచ్చి సంతుష్టుడయ్యారు. సురభికి అమరత్వమును ప్రసాదించారు. త్రిలోకముల కన్నా పైన ఉండే స్వర్గమును వరముగా ఇచ్చారు. దీనిని స్వర్గ గోలోకమనే పేరుతొ పిలుస్తారు. గోలోకములో సురభి నిత్యమూ నివసిస్తుంది, ఈమె కన్యలు, సుకన్యలు భూలోకములో నివసిస్తారు. ఈ గోలోకమునకు అధిపతి గోవిందుడు అనగా శ్రీ కృష్ణుడు. శ్రీకృష్ణ పరమాత్ముడు ‘గోప్రేమికుడు’ అని అంతటా ప్రాచుర్యమైనదే!
స్పర్శ మాత్రము చేత గోవులు సర్వ పాపముల నుండి మానవులను విముక్తులను చేస్తాయి. ప్రతి దినమూ స్నానం చేసి గోవును స్పృశించినవాడు సర్వపాపాల నుండి విముక్తుడౌతాడు.
గోమయములో లక్ష్మీ దేవి, గోమూత్రములో గంగాదేవి నివాసముంటారు. గోమూత్రము, గోమయాలతో నేల పరిశుద్ధము, పరిపుష్ఠము అవుతుంది. గోమయమును అగ్నితో శుద్ధి చేసిన యెడల ఆ భస్మమే విభూతి యగును.
ప్రతిదినము ఆవులకు నీరు త్రాగించి గడ్డిని మేతగా తినిపించేవారికి అశ్వమేధ యజ్ఞం చేసినంత చేసిన పుణ్యం వస్తుంది.
‘‘ఒక గోవు తన జీవితకాలంలో సగటున 25వేల మందికి ఆకలి తీరుస్తుందని చెబుతూ గోవును వధిస్తే ఆ రాజ్యంలో అరాచకం పెరిగి ప్రజలు నశిస్తారని చెప్పారు. మనం తల్లిగా భావించే ఈ గోవుతో రోజు కొన్ని క్షణాలు వాటికి మేత పెట్టడం, వాటితోపాటు కొంత సమయం గడపటంవల్ల, మన శరీరంలో వున్న అనారోగ్యాన్ని, ఆ గోవు ముక్కులోవున్న ఒక గ్రంథి ద్వారా గ్రహిస్తుంది, తరువాత మేతకు వెళ్ళినప్పుడు మన రోగ నివారణకు కావలసిన మూలికలను, గడ్డిని తిని, అందుకు తగిన విధంగా పాలు ఇస్తుంది, ఆ పాలు తాగడంవల్ల మన వ్యాధి నయం అవుతుంది. గోమాత - కీర్తనం శ్రవణం దానం, ధర్మం, గోరక్షణం, గోరక్షణ ప్రోత్సాహం, గోరక్షణ ప్రోత్సాహక ప్రేరణం… అన్నీ పుణ్యప్రదమైనవే..

గోమాత పాదాలకు శతకోటి వందనాలు

సాతవాహనుల కాలం నుంచి కాకతీయుల కాలం దాకా తెలంగాణా చరిత్ర by Vadrevu Chinaveerabhadrudu

సాతవాహనుల కాలం నుంచి కాకతీయుల కాలం దాకా తెలంగాణా చరిత్ర మీద రెండు రోజుల సెమినార్ నిర్వహిస్తున్నాం, మీరు కూడా మాట్లాడాలి' అని ప్రొ.అరుణకుమారిగారూ, మిత్రుడు మల్లెగోడ గంగాప్రసాద్ అడిగారు.నేను చరిత్రకారుణ్ణీ, పరిశోధకుణ్ణీ కాకపోయినా చరిత్ర విద్యార్థిని. ఈ వంకనైనా ఒకసారి ప్రాచీన తెలంగాణా చరిత్రలోకి తొంగిచూద్దామని సరేనన్నాను.
నిన్న మధ్యాహ్నం ప్రసిద్ధ చరిత్రకారుడు డా.కె.శ్రీనివాసులు అధ్యక్షతవహించిన సెషన్లో మరో ఇద్దరు వక్తలతో పాటు నేను కూడా ప్రసంగించాను. 'ప్రాచీన తెలంగాణా జీవన తాత్త్వికత' అన్న అంశం మీద.
సాధారణంగా తెలంగాణా చరిత్ర గురించి మాట్లాడేవాళ్ళు కాకతీయుల కాలం నుంచే మాట్లాడటం మొదలుపెడతారు. క్రీ.శ.4 వ శతాబ్దం నుంచి క్రీ.శ 10 వ శతాబ్ది మధ్యకాలందాకా తెలంగాణా లేదా మధ్యదక్కను ప్రాంత చరిత్రని నిర్మించడానికి ఈ మధ్యకాలందాకా చెప్పుకోదగ్గ ప్రయత్నం జరగలేదు. చివరికి తెలంగాణా ప్రభుత్వ పోర్టల్లో కూడా 'దీన్ని ప్రధానస్రవంతి ఆంధ్ర చరిత్రకారులు అంధయుగంగా పేర్కొన్నారు..కానీ మరింత సవిస్తరంగా పరిశోధన జరగాలి' అని రాసుకున్నారు.
ఈ లోటును పూరించే దిశగా ఇటీవలి కాలంలో జరిగిన గొప్ప ప్రయత్నం ఆంధ్ర ప్రదేశ్ చరిత్రకాంగ్రెస్ వారు వెలువరించిన 'ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర-సంస్కృతి' సంపుటాలు. అందులో ముఖ్యంగా మూడవసంపుటం (2009), నాలుగవ సంపుటం (2012). ఈ సంపుటాల్లో క్రీ.శ.624 నుంచి 1324 దాకా ఏడు శతాబ్దాల కాలపు చరిత్రను విశ్వసనీయంగా నిర్మించే ప్రయత్నం చేసారు. ఇందుకు ఆచార్య వకుళాభరణం రామకృష్ణ గారికి తెలుగువాళ్ళు శాశ్వతంగా ఋణపడి ఉంటారు.
అయితే, ఈ సంపుటాల్లో వ్యాసాల్లో తెలంగాణా చరిత్రను ప్రధానంగా శాసనాల ఆధారంగా నిర్మించడానికి ప్రయత్నించారు. సాహిత్య ఆధారాల్ని స్పృశించనే లేదు. ఆ పని డా.కప్పగంతుల కమలగారు చేసారు. Life in Ancient India as depicted in Prakrit Literature (1984) అనే మేలిమి పరిశోధనలో ఆమె నాలుగు ప్రాకృత సాహిత్యకృతులు ఆధారంగా ప్రాచీన దక్కను జీవితాన్ని ఊహించే ప్రయత్నం చేసారు. అవి హాలుడి 'గాథాసప్తశతి', జయవల్లభుడి 'వజ్జాలగ్గం', ప్రవరసేనుడి 'సేతుబంధం', వాక్పతిరాజు రాసిన 'గౌడవహొ'.
చరిత్ర కాంగ్రెస్ వారి సంపుటాల్నీ, కమలగారి పరిశోధననీ కలిపి చదివిన తరువాత నాకు అర్థమయిందేమంటే, క్రీ.శ 4-10 శతాబ్దాల మధ్యకాలంలోనే తెలంగాణా ప్రాంతపు స్వభావం విస్పష్టంగా రూపొందిందని. దాంతోపాటు,ఆ స్వభావం తదనంతరకాలంలో మొత్తం దక్కన్ సామాజిక-రాజకీయ స్వభావాన్నే నిర్ధారితం చేసిందని.
నేను నా ప్రసంగంలో ఆ విషయాన్నే స్థూలంగా వివరించేను. ఆ స్వభావానికి మూడు లక్షణాలున్నాయని ప్రతిపాదించేను.
మొదటిది, ప్రాచీన తెలంగాణా కాకతీయుల కాలందాకా కూడా ఒక political nucleus కోసం వెతుక్కుంటూ ఉన్నదని. అటువంటి ప్రయత్నం వేములవాడ చాళుక్యుల కాలంలో జరగకపోలేదు. కాని, వాళ్ళు రాష్ట్రకూటుల సామంతులుగా కన్నడ సంస్కృతిని, కన్నడ సాహిత్యాన్ని నిర్మిచడం మీదనే దృష్టిపెట్టారు. అందువల్ల క్రీ.శ పదవశతాబ్దందాకా కూడా తెలంగాణా శాతవాహన, కాదంబ,వాతాపి, కల్యాణి చాళుక్య, రాష్ట్రకూట రాజ్యాలకు సరిహద్దు భూమిగా మాత్రమే ఉంటూ వచ్చింది. అంతేకాక, ఏ ముహూర్తాన రెండవ పులకేశి వేంగిలో తన ప్రతినిధిని నియమించాడో అప్పణ్ణుంచీ సుమారు ఆరు శతాబ్దాల పాటు, చోళ-చాళుక్య యుద్ధాలకు తెలంగాణా అతలాకుతలమవుతూ వచ్చింది. తమకు ఇష్టమున్నా లేకపోయినా ప్రాచీన తెలంగాణా పాలకులు ఈ నిరంతర యుద్ధాల్లోకి లాగబడుతూ వచ్చారు. అందుకనే నేను ఉత్తరభారతదేశంలో పంజాబ్ ఎటువంటి పాత్ర పోషించిందో, దక్షిణ భారతదేశ చరిత్రలో తెలంగాణా అటువంటి పాత్ర పోషించిందని అన్నాను. కాని,సరిగ్గా, ఆ నిర్విరామ యుద్ధ కార్యకలాపమే తెలంగాణాకొక నిర్దిష్ట రాజకీయ-ఆర్థిక స్వభావాన్ని సంతరింపచేసింది.
రెండవది, క్రీ.పూ 3 వ శతాబ్దినుంచి క్రీ.శ మూడవ శతాబ్దిదాకా భారతదేశ రాజకీయాలు అంతర్జాతీయ వాణిజ్యంమీదా,ముఖ్యంగా రోమ్ తో జరిగిన వ్యాపారం మీదా ఆధారపడ్డాయి. ఆ కాలంలో మతపరంగా బౌద్ధం, సామాజికంగా సార్థవాహులూ, వణిజులూ ప్రధాన పాత్ర పోషించారు. క్రీ.పూ. 3 వ శతాబ్దం అంతానికి ఆ 'గ్లోబలైజేషన్ ' శకం ముగిసిపోయాక, భారతదేశం ప్రాంతీయరాజ్యాలుగా విడిపోవడం మొదలుపెట్టాక, భూమి మీద ఆధారపడిన ఆర్థికవ్యవస్థను నిర్మించుకునే దిశగా చరిత్రనడిచింది. అందుకనే గోదావరీ-కృష్ణా మధ్య ప్రాంతం మీద పట్టుకోసం అంత సుదీర్ఘ సంగ్రామం నడిచింది. ఆర్థికవ్యవస్థ స్పష్టంగా భూమిమీదా, వ్యవసాయంమీదా ఆధారపడ్డ వేంగిసామ్రాజ్యంలో బ్రాహ్మణులూ, బ్రహ్మదేయాలూ, వర్ణవ్యవస్థా ప్రాధాన్యం పొందడంలో ఆశ్చర్యం లేదు. వ్యవసాయాన్నీ విస్తరింపచేయడానికి పెద్ద ఎత్తున బ్రాహ్మణులు అవసరమైన కాలం అది. కాని తెలంగాణాలో అంత స్పష్టంగా వ్యవసాయం మీద ఆధారపడే పరిస్థితి లేదు. మరో వైపు, బౌద్ధులు నిర్మించిన వర్తక శ్రేణుల ఆర్థికవ్యవస్థని తెలంగాణాలో జైనులు కొనసాగించారు. మరొక వైపు, నిరంతరంగా జరుగుతున్న యుద్ధాల కోసం సైనికులూ, యోద్ధలూ అవసరమైనందువల్ల గిరిజనులూ, ఇతర సంచార జాతులవారూ సామాజికంగా ముఖ్యమయ్యారు.(కాకతీయ సామ్రాజ్యాన్ని స్థాపించిన గుండయ, ప్రోలయ, బేత గిరిజనులేనని ఇప్పుడు భావిస్తున్నారు) అందువల్ల, ప్రాచీన తెలంగాణా చాతుర్వర్ణ వ్యవస్థని కాక, అష్టాదశ ప్రజలతో కూడుకున్న వ్యవస్థను నిర్మించుకుంది. అంటే vocational diversification అన్నమాట. ఈ వివిధ జీవనవృత్తులు 18 నుంచి 27 కి చివరికి కాకతీయుల కాలం నాటికి 72 దాకా విస్తరించడం మనం చూస్తాం. ఒకవైపు రాజకీయంగా ఒక కేంద్రమంటూ లేకపోవడమే కాక, ఆర్థికంగా భిన్న వృత్తులమీద ఆధారపడటంతో తెలంగాణా సమాజం లో social mobility అత్యున్నతంగా ఉండటంలో ఆశ్చర్యం లేదు.
ఇక మూడవ అంశం, పై రెండింటి ఫలితమే. అంటే, విస్పష్టమైన రాజకీయ కేంద్రమంటూ ఒకటిలేకపోవడం వల్లా, ఆర్థికవ్యవస్థ వృత్తి వైవిధ్యం మీద ఆధారపడినందువల్లా, ప్రాచీన తెలంగాణా జీవన తాత్త్వికత ప్రధానంగా ఇహలోకం మీదనే దృష్టిపెట్టింది. ఇప్పటి భాషలో చెప్పాలంటే secular అనొచ్చు. అప్పుడు కూడా దేవాలయాలూ, పూజలూ,దానాలూ ఉన్నాయి కాని, అవి ప్రధానంగా మరింత మెరుగైన ఇహలోక జీవితం గురించే తప్ప, ఈ లోకాన్ని నిరసించి పరలోకాన్ని కోరుకోవడం గురించి కాదు. ఇటువంటి విస్తృత, వైవిధ్యవంతమైన జీవనవృత్తులు ఉన్న సమాజంలో ఏ ఒక్కరి దృక్పథమో, లేదా ఏ ఒక్క మతమో ప్రధాన పాత్ర వహించే అవకాశం ఉండదు. తెలంగాణాలో మతాలు నిర్వహించిన పాత్ర ఆధ్యాత్మికం కాదు, ప్రధానంగా సామాజికం, పర్యవసానంలో రాజకీయం. అంటే, ఉదాహరణకి, సామాజిక క్షేత్రంలో కొత్తగా తలెత్తుతున్న సామాజిక శక్తుల్ని ప్రోత్సహిస్తూ ఒక మతం ప్రాబల్యం సంపాదించేది. ఆ శక్తులు ఒకసారి రాజకీయాధికారం సముపార్జించుకున్నాక, ఆ మతం సాధారణ ప్రజలకి దూరమయ్యేది. అప్పుడు, మరొక మతం సామాన్యప్రజలకి చేరువకావడానికి ప్రయత్నించేది.
తర్వాతి రోజుల్లో కాకతీయులు రాజకీయంగానూ, తాత్త్వికంగానూ కూడా వేంగీ నమూనాను అనుసరించారు. వారి నమూనాను తర్వాతి రోజుల్లో విజయనగర రాజులు అనుసరించారు. అంటే ఆర్థిక వ్యవస్థను వ్యవసాయ ప్రధానం చెయ్యడం, విస్పష్టమైన వర్ణవ్యవస్థను నిర్మించుకోవడం, సామాజిక చలనశీలతను పరిమితం చెయ్యడం. కాని, సరిగ్గా ఈ కారణాలవల్లనే ముస్లిం సైన్యాలు మధ్యయుగాల తెలంగాణాను ఆక్రమించుకోగలిగాయి.
కాని మరొకవైపు ప్రాచీన తెలంగాణా తన జీవనదృక్పథాన్ని సాహిత్యమార్గంలో తక్కిన ప్రాంతాలకు అందచేసింది. సాహిత్యంలో దేశి ప్రాధాన్యత, జనజీవన చిత్రణ ప్రాచీన తెలంగాణా అందించిన ఉపాదానాలే. చివరికి, విజయనగర దేవాలయ వాస్తులో మొదటిసారిగా కనిపించే రంగమంటపం కూడా తెలంగాణా వాస్తులక్షణమే. దేవుడి సన్నిధిలో కూడా ఇహలోక జీవితాన్ని ఉత్సవం జరుపుకోవడమే రంగమంటపం. తర్వాతి రోజుల్లో కృష్ణదేవరాయలు దేవ-మానవ కల్యాణాన్ని కావ్యంగా రాయడానికి ప్రాతిపదిక సమకూర్చింది ఆ రంగమంటపమే.
మరో మాట కూడా చెప్పి నా ప్రసంగం ముగించాను. ఏ దేశమైనా, ప్రాంతమైనా, సమాజమైనా చరిత్ర ఎందుకు తెలుసుకోవాలంటే, మనం తిరిగి తిరిగి అవే తప్పులు చెయ్యకుండా ఉండటానికి. నేను కొలనుపాక వెళ్ళినప్పుడు అక్కడ ముక్కూ చెవులూ తెగ్గొట్టిన జైన తీర్థంకర విగ్రహాలు చూసాను. ప్రాచీన తెలంగాణాను చైతన్యవంతం చేసిన ఆ జైనగురువులమీద అంత ఆగ్రహం ఎవరికొచ్చింది అని ఆరాతీస్తే అది వీరశైవుల పని అని తేలింది. ఒకప్పుడు ప్రజలకి ఎంతో సన్నిహితంగా ఉంటూ, వాళ్ళ గురించి మాట్లాడిన జైనులు నెమ్మదిగా రాజకీయాధికారాన్ని మరిగి ప్రజలకు దూరం కావడం మొదలుపెట్టగానే, ప్రజల్లోంచి పుట్టుకొచ్చిన మరో మతం వీరశైవం జైనుల ప్రజాద్రోహం మీద చూపించిన ఆగ్రహం అది. తెలంగాణా పాలకులు ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవలసిన విషయమిది.
చరిత్ర ఎందుకు చదవాలంటే, ఇందుకు.
50 comments
Comments
Palla Sreenivasulu గిరిజనులు నాగరిక రాజ్యాన్ని నిర్మించారని భావిస్తున్నారా!లేక వారి పూర్వీకులు గిరిజనులై ఉండవచ్చని భావిస్తున్నారా?
LikeShow More Reactions
Reply
2
12 hrs
Manage
Bendalam Krishna Rao Very nice info sir
LikeShow More Reactions
Reply

యోగా చెప్పే ఆరోగ్య రహస్యాలు ఆరోగ్యానికి యోగశాస్త్ర నియమాలు:

యోగా చెప్పే ఆరోగ్య రహస్యాలు

ఆరోగ్యానికి యోగశాస్త్ర నియమాలు:
🌿🌿🌿
1. ఉదయం 4.30 కి నిద్ర లేవాలి
2. లేచిన వెంటనే గ్లాస్ గోరు వెచ్చని నీరు కూర్చుని నెమ్మదిగా త్రాగాలి.
3. ఐస్ క్రీం ఎప్పుడూ తినకూడదు.
4. ఫ్రిజ్ లో తీసినవి గంట తర్వాత తినాలి
5. కూల్ డ్రింక్స్ త్రాగకూడదు.
6. వండిన ఆహారం వేడిగా 40ని.లో తినాలి
7. భోజనం తర్వాత వజ్రాసనం 5 – 10 నిమిషాలు వేయాలి
8. ఉదయంటిఫిన్ 8.30 గం లోపు తినాలి
9. ఉదయం టిఫిన్ తో పండ్లరసం త్రాగాలి
10. టిఫిన్ తిన్నాక తప్పకుండా పని చేయాలి.
11. మధ్యాహ్నం లోగా మంచినీరు 2,3 గ్లాసులు త్రాగాలి
12. మంచినీళ్ళు భోజనానికి 48 ని.ముందు త్రాగాలి
13. భోజనం క్రింద కూర్చుని తినాలి
14. ఆహారం బాగా నమిలి మ్రింగాలి
15. మధ్యాన్నం కూరల్లో వాముపొడి వాడాలి
16. మధ్యాహ్న భోజనం నిండుగా తినాలి
17. మధ్యాన భోజనం తర్వాత మజ్జిగ త్రాగాలి
18. మధ్యాహ్న భోజనం తర్వాత విశ్రాంతి
19. రాత్రి భోజనం సూర్యాస్తమయం లోపు చేయాలి
20. రాత్రి పూట చాలా తక్కువగా, తినాలి
21. రాత్రి భోజనంతర్వాత 1కి.మీ నడవాలి
22. రాత్రి భోజనంతర్వాత గంటకు పాలు త్రాగాలి.
23. రాత్రిపూట లస్సీ, మజ్జిగ త్రాగకూడదు
24. రాత్రి పుల్లటి పండ్లు తినకూడదు.
25. రాత్రి 9 – 10 గం.పడుకోవాలి
26. పంచదార, మైదా,గుండఉప్పు తక్కువ వాడాలి.
27. రాత్రి పూట సలాడ్ తినకూడదు.
28. విదేశీ ఆహారంను ఎప్పుడూ కొనరాదు
29. టీ,కాఫీ ఎప్పుడు త్రాగకూడదు.
30. పాలలో పసుపు వేసి మరిగించి త్రాగితే
క్యాన్సర్ రాదు
31.ఆయుర్వేద వైద్యం ఆరోగ్యంకు మంచిది
32. అక్టోబరు నుంచి మార్చ్ ( చలికాలంలో) వెండి, బంగారు పాత్రలోని నీరు త్రాగాలి
33. జూన్ నుంచి సెప్ట్ంబర్ (వర్షాకాలంలో) లో రాగి పాత్రలో నీరు త్రాగాలి
34. మార్చ్ నుంచి జూన్ (ఎండాకాలంలో) మట్టి పాత్రలో నీరు ఎప్పుడు త్రాగాలి.
🍎🍎🍎🍎🍎🍎

ఇది "బ్రాహ్మణ" అపరాధమే.

నూటికి నూరుశాతం ఇది "బ్రాహ్మణ" అపరాధమే..

ఎవడిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచక..
ఎవరిచేత దేన్ని "అభ్యసింప చెయ్యాలో తెలియక..
వొళ్ళు మరిచిన ఈ జాతి తనకుతానుగా చేసుకున్న
మహాపరాధమిది..  నేటి అన్యమతస్థుల పాలిటి ఊతమది..

ఎవడు చెయ్యమన్నాడు వేదానికి అనువాదాలు..
ఎవడు నేర్పమన్నాడు శూద్రవర్ణంవారికి షడాంగాలు..
ఎవడు బోధించమన్నాడు అర్హతలేనివారికి సంస్కృతాన్ని..

ఎదుటివాడి అర్హతను సమర్థతను గమనింపక..
బ్రహ్మాస్త్రమునో అల్పునికందిస్తే తత్పర్యావసానం..??
వేదాల్లో అదుంది గీతలో ఇదుందీ అంటూ అక్షరాలా
నేడు మనం అనుభవిస్తున్నదే ఐలయ్యవంటి హీనులచేత..

కుక్కను నిల్పవలిసింది పాదరక్షలుంచే గేటుదగ్గరే కానీ..
రత్నఖచిత వైడూర్యాలతో విలసిల్లే సింహాసనంపైన కాదు..

నిజాన్ని నిర్భయంగా నిష్కర్షగా చెప్పవలిసొస్తే..

తరాలు మారినా యుగాలు మారినా..

బ్రహ్మవంశీయులు బ్రహ్మవంశీయులే
అల్పసంస్కారులు అల్పసంస్కారులే..

దాశరథి రంగాచార్య: మహోన్నతమైన వేదవాజ్మయాన్ని పామర భాషలోకి అనువదించిన అత్యంత సహృదయత
కల్గిన వేదకోవిదులలో సంఘవాదులలో అగ్రగణ్యులు..

బహుశా వారి సంకల్పం పవిత్రమైనదే కావొచ్చు..
కానీ ప్రయోజనం మాత్రం అర్ధరహితం.. భస్మాసురహస్తం..

ఏ భాషలో విలసిల్లవలసింది ఆ భాషలో విలసిల్లితేనే
దానికి గౌరవం తప్పా హద్దుదాటితే అది ప్రళయమే
ప్రాణసంకటమే.. ఈసత్యాన్ని అత్యంత ముందస్తుగా
నిష్కర్షగా గ్రహించగలిగిన పరిపూర్ణ ప్రజ్ఞావంతులు
గనుకనే వేదద్రష్టలైన మన ఋషివరేణ్యులు ఈ వేదాన్ని
వేదవాజ్మయాన్నీ కేవలం శృతివరకే పరిమితమొనర్చింది..

అంతేకానీ.. శునకానికి మేకప్ వేస్తాం పందికి
పన్నీరు రాస్తాం అనేది ఏమీ తెలియని మూర్ఖత్వమే కానీ
విజ్ఞతా కాదు అంతకుమించిన లోకకళ్యాణమూ కానేరదు..

ఫ్రెడరిక్ మాక్స్ ముల్లర్ అనే ఒక పాశ్చాత్య దౌర్భాగ్యుడివల్ల
ఈ వేద వాజ్మయం ఏనాడో అపహాస్యం పాలయ్యింది.

ఒక రకంగా దానికి కూడా కారణమైనది తుచ్ఛమైన
డబ్బుకమ్ముడుపోయి ఒకవిదేశీయ కుక్కకు వేదాన్ని
అందులోని మర్మాలను బోధించి నాశనమొనర్చింది
కూడా ఇటువంటి కుహానా మేధావులే.. సంఘవాదులే..

అసలెవరిచ్చారు ఈ కుహానా మేధావులందరికీ
ఎవడికంటే వాడికి వేదాన్నీ వేదవాజ్మయాన్నీ బోధించే అర్హత...

మాక్స్ ముల్లర్ లాంటి నీచాత్ముల గురించి పక్కన పెడితే..

నిజానికి పూజ్యులు సద్బ్రాహ్మణ సదాచార వంశీయులు
వేదమూర్తులైన శ్రీమాన్ దాశరథి రంగాచార్య గారివంటి
ఎందరో సజ్జనులీ వేదవాజ్మయాన్ని సర్వజనావళికీ
అందేలా నిర్విరామ నిష్కల్మష కృషివొనరించినా..

తుదకు ఐలయ్యవంటి వక్రభాష్యకులవల్ల అట్టి పవిత్రకృషి
సమస్తం బూడిదలో పోసిన పన్నీరుగానే  మిగిలిపొయ్యింది..

అనుష్టానం, ఆచారం, సత్ప్రవర్తన, సత్యసంధతా, గురుశుశ్రూష
ఇవేమీ లేకుండానే ఒక శూద్రుని నోటిగుండా వేదోచ్చారణమా?

అత్యంత సూటిగా పచ్చిగా చెప్పవలసివస్తే..

నీ కన్నతల్లినే వ్యభిచారవృత్తికి ప్రోత్సహించట మెంతటి నీచమో
అర్హతలేనివాడికి వేదాన్ని బోధించటంకూడా అంతటి హేయమే..

Yes.. నిజమింతటి కర్ణకఠోరంగా నిష్కర్షగానే భాసిల్లుతుంది..

అరిపాదాలకు అరిచేతులకు పారాణిపెట్టి పచ్చకర్పూరపు
తాంబూలాన్ని పెదవులకందిస్తూ ఆ సన్నని చిరుసిగ్గుల మునకల్లో ఒకొక్క ముద్దూ ఒదుపుగా ఇవ్వటానికి,
మృదుభాషణ మొనర్చటానికీ ఇదేమీ శృంగారంకాదు.. శాస్త్రం!

అట్టి గంభీరమైన శాస్త్రకోవిదులు వేదవిదులూ
ఇకనైనా తమ ప్రవర్తనను అతి చొరవలను విరమించుకోకుంటే..
రాబొయ్యే తరాల్లో మరింతగా నిర్వీర్యం కాకమానదీ ఆర్షధర్మం.

బ్రహ్మవంశాన జన్మనొందిన ప్రతీ విప్రోత్తముడు శాస్త్రానుసారియై క్రమశిక్షణావంతుడై ఐకమత్యంతో
వర్ధిలినంతకాలం ఏ దౌర్భాగ్యుడూ ఈ సంస్కృతిని
చెణకలేడు కనీసం కన్నెత్తి సైతం చూడలేడు విమర్శనాత్ముడై..

అలా కానినాడు..
బ్రహ్మవంశీయులంతా ఒక్కటై ఉండలేనినాడు..
ఏ చెట్టూ లేని చోట ఆముదం చెట్టే మహావృక్షమైనట్లు..

ఇక, శూద్రుడు చెప్పిందే కవిత.. వాడు చెప్పిందే శాస్త్రం, వాడు పల్కిందే వేదం వాడు వ్రాసిందే కావ్యం పురస్కారాలతో సహా.

నిజానికి కొంతమంది కుహానా బ్రాహ్మణులిచ్చిన
అలుసువల్లనే ఈ వైపరీత్యమంతా.. ఏం కాదంటారా?
అలా కాదనే ధైర్యముందా మీలో ఏ ఒక్కరికైనా.. కనీసం
ఎవరినెక్కడుంచాలో అక్కడుంచగల్గుతున్నారా మీరు?

నాలుగు చిల్లర డబ్బులుకోసం కక్కుర్తిపడి..
ప్రతీ అడ్డమైన వాడికీ పూర్ణకుంభాలుపట్టి..
వెధవ సంభావనలకోసం వంగివంగి దణ్ణాలు పెట్టి..
సింహతలాటల మోజుతో శాస్త్రాన్ని సైతం అవమానమొనర్చి..

ఓయ్ పంతులు, ఓయ్ అయ్యోరు..  ఓయ్ బాపనాయనా అంటూ ఒకపక్క బలిసిన సమాజం..మరోపక్క కొంతమంది
సినిమా వెధవలు సెటైరికల్ గా మాట్లాడుతున్నా ఎక్కడ
మా వ్యక్తిగత లాభాలు పరిచయాలు ప్రయోజనాలు
దెబ్బతింటాయో అన్న ముండమోపి లౌక్యంతోమీకుమీరే సమర్దించుకోని బ్రతికే ఆ నీచబ్రతుకూ ఒకబ్రతుకేనా..??

దేనికిరా మీరీ దేశానికి దౌర్భాగ్యం కాక..

ఎవరికి పట్టాలి పూర్ణకుంభం..
ఒక పీఠాధిపతికి, ఒక వేదపండితునికి, ఒక మహాకవికి,
సజ్జనునికి, పురాణ ప్రవచన కర్తకి, సత్యసంధత కల్గిన రాజాధికారికి..ఈ దేశాన్ని సంరక్షించే ఒక జవానుకి
శాస్త్రవేత్తకి.. నాట్య విశారదులకు.. పుంభావ సరస్వతులకు..

కానీ.. జరుగుతున్నదేమిటి.. ఇటువంటి కనీస అర్హతలను
స్వచ్ఛతను ఏనాడైనా మీరు ఆత్మపూర్వకంగా గమనించి,
నిష్కర్షగా పరిశీలించుకోనే పడుతున్నారా? పూర్ణకుంభం..

అదేంలేదు..
మన పై వారు, దేవాలయ పెద్దలు, అధికారులు..
ఏ కుక్కను తీసుకొచ్చి పూర్ణకుంభ మర్యాదను జరిపించమన్నా నోరు మెదపకుండా జరుపుతూనేవున్నాం వెధవల్లా..

కాబట్టే.. బ్రాహ్మణుడన్నా, శాస్త్రమన్నా, వేదమన్నా..
నేడింతటి చులకనాయుతమైన దయనీయ పరిస్థితి, అమర్యాద.

శ్రీ కంచి పరమాచార్య పెద్ద జీయర్ స్వామివంటి వారి
చిత్రాలను కనీసం ఫేస్ బుక్ లో చూసినా అప్రయత్నంగానే
మా కాళ్ళు చేతులు వణికి కరములు నమస్కార భంగిమలోకి
మారిపోతాయి.. కనుకొలుకులూ హృదయం ఆర్థతతో నిండి..

కారణం: ఎవరిని ఏ మేరకు గౌరవించాలో ఆ మేరకు గౌరవిస్తూనే వేదానికి, శాస్త్రానికి, విప్రోత్తములకి,
సన్యాసాశ్రమ ధర్మానికి, వారిచ్చిన మర్యాద ధర్మాచరణ..

కానీ ఈ రోజుల్లో.. తుదకో ముండమోపి ఫ్యాన్ ఇచ్చి
దాని రెక్కలపై తాటికాయంత పేరు వేయించుకున్నవాడే మహాదాత.. వాడొక ధర్మకర్త వాడొక ట్రస్టు మెంబర్..

ఈ మాత్రం గోచి గుడ్డకే మీరు చేసే మర్యాదలు
పట్టే పూర్ణకుంభాలు.. చేసే హడావుడి నభూతో నభవిష్యతి..

తుదకు మీలోని వేద ధర్మానికి వంశ వైభవానికి
మీ నిత్యానుష్టానానికి ప్రతీకగా మీ వక్షస్థలముపై విరాజిల్లే
గాయత్రికి యజ్ఞోపవీతానికి సైతం తగు మర్యాద నివ్వకుండా

వాడి దగ్గర నాలుగు చిల్లరడబ్బులుంటే చాలు..
వాడో చిన్నపాటి రాజకీయవేత్తో వ్యాపారవేత్తో అయితే చాలు..

వాడిదే కులము ఏ జాతీ ఏ మతము
కనీసం వాడి సంస్కారమెటువంటిదియన్న విచక్షణకూడా లేక

అటువంటి నీచులపట్ల మీరు ప్రవర్తించే ప్రవర్తన
బోధించే శాస్త్రాలు, శాస్త్రమర్మాలు, చేసే మర్యాద..
అర్హతలేనివాడిపట్ల కనబర్చే మీ ధనప్రేమ ఈ జాతి
నాశనానికే తప్ప.. లోక కళ్యాణము కాదు కానేరదు కూడా..

ఎవడేమనుకున్నా గింజుకొని చచ్చినా
నిజాన్ని నిర్భయంగా నిష్కర్షగా చెప్పవలిసొస్తే..

శాస్త్రవిజ్ఞానం వేదవైభవం వేదవ్యాఖ్యానం
నూటికి నూరుశాతం కేవలం.. సద్బ్రాహ్మణులకే,
తప్ప అన్యులకది, దుర్లభం అసాధ్యం కూడా..

శాస్త్రాన్ని అసలెవరికి..
నేర్పించాలి.. నేర్పించ కూడదు..

నిర్మొహమాటంగా.. నిష్కర్షగా.. అత్యంత సూటిగా.
విశదీకరిస్తున్నాం ఇందులోని మర్మామర్మాలని..

దీనికి నువ్వు కులం అనే రంగు అద్దినా..
మతం అనే పేరుతో మసిపూసినా I don't care..

కారణం: బ్రాహ్మణత్వం అనేది కేవలం దివ్యత్వమే తప్ప
కులం కాదు కానేరదు. హిందూ అనేది ఓ మహోన్నతమైన జీవనధర్మమే తప్ప మతచాందసము కాదు కాబోదూ కూడా..

కానీ ప్రస్తుత రోజుల్లో.. ప్రతీ అడ్డమైన వాడు.. జాతిహీనుడు..
మహోన్నత సనాతన సాంప్రదాయాన్ని విమర్శించేవాడే..
పరమ పవిత్రమైన బ్రాహ్మణత్వాన్ని తూలనాడేవాడే..

అందుకే.. ఎవడిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి..
ఎంతమటికీ బోధించాలో అంతమటికే వ్యక్తపరచాలి..

ఇక సూటిగా విషయంలోకి వస్తే..

శాస్త్రము, అస్త్రము, కన్యా, రాజ్యము, ఐశ్వర్యము..
ఎట్టి పరిస్థితులలోనూ అపాత్రాదానం చెయ్యకూడని..
అత్యంత ముఖ్యమైన అయిదు ప్రధానాంశాలివి..

శాస్త్రము..
ఉపనయనాది సంస్కారాలను గావించుకున్న వాడై..
గురు శుశ్రూషను త్రికరణ శుద్ధిగా నిర్వహించు వాడై..
వేదమును వేదధర్మమును సర్వత్రా అంగీకరించిన వాడై..
ఉపనయనమనే అర్హత లేకున్నా కనీసం సుశ్రోత్రియుడైన ఒక సద్గురువుని సేవించి సర్వే సర్వదా వారికి ప్రణమిల్లి..
ఒక వేద మంత్రమును కానీ.. ఒక ధ్యాన మార్గమును కానీ..
ఒక అనుష్టానమును కానీ.. గావించి.. సత్యం శాంతి దయా ప్రేమా ఓరిమి వినయం అగ్రహానుగ్రహ సామర్థ్యం అనే దివ్య గుణాలతో.. శాస్త్రమునందు, ధర్మమునందు, సద్గురుని యందు.. సర్వే సర్వత్రా భక్తితత్పరుడై.. శరణాగత హృదయుడై.. తగు పరీక్షలలో ఉత్తీర్ణుడై విలసిల్లే వాడికి తప్పా.. నాలుగు చిల్లర డబ్బులకోసం, అత్యంత
స్వల్పమైన కొన్ని ప్రాపంచిక అవసరతల కోసం..
ఎవడికంటే వాడికి.. అడ్డమైన ప్రతీ ఒక్కడికీ..

ఋగ్, యజుర్, సామ, అధర్వణములనబడే చతుర్వేదాలను.. షట్ శాస్త్రములు (శిక్ష, ఛందస్సు, వ్యాకరణం, నిరుక్తి, కల్పం, జ్యోతిష్యం ) మొదలగు వేదాంతర్గతమైన శాస్త్రాలను.. ఒక్కనాటికీ నేర్పించ కూడదు.. అసలా అర్హతే నీకు లేదు.. శాసన పూర్వకంగా..

ఇక నెస్ట్..

అస్త్రము..
బ్రాహ్మణుడికి.. క్షత్రియునికి.. సద్గురువునికి.. పరమాత్మకు.. సైనికునికి.. సర్వే సర్వత్రా ఈ అయిదు గురికే అస్త్రాన్ని పట్టుకునే సంధించే పరిపూర్ణమైన అర్హత..

అందునా.. బుద్దికుశలత.. ఏకాగ్రతా.. గురి..
భుజబలము, ఆత్మబలము, సాధనాబలము, యుద్దనీతి.. అనే ఈ సప్త గుణాలతో.. ప్రయోగము ఉపసంహరణము అనే రెండిటినందూ.. అత్యంత నిష్ణాతులైన వారికే తప్పా..
అన్యులకసలే మాత్రం బోధించకూడని విద్య అస్త్రవిద్య..

కన్య..

పరమాత్మ, విప్రోత్తముడు, సద్గురువు, కవీ, రాజు..
ఈ అయిదుగురి విషయంలో తప్పా...

మరేఒక్కరి విషయంలోనూ.. నీకంటే ఉన్నతులతోనూ.. నీకంటే తక్కువ వారితోనూ.. అసలేమాత్రం ఒక్కనాటికీ వియ్యమంద కూడదు.. వర్ణ సంకరమైన వివాహాన్ని ఒక్కనాటికీ జరిపించ కూడదు.. సంకల్పించ కూడదు..

అన్నిటా నీ బిడ్డలకు..
సమతుల్యమైన వారితోనే తప్పా.. మరే ఒక్కనాటికీ కించిత్ సైతం అందుకు భిన్నంగా వ్యవహరించ కూడదు..

ఒకవేళ అనుకోని పరిస్థితులలో.. సందిగ్ధంలో..

దీనిని అతిక్రమించి.. నీ బిడ్డలే వారికి వారిగా.. నిర్ణయం తీసుకుంటే.. అది కేవలం వారి కర్మా విజ్ఞతా మాత్రమేనని
భావించి సర్వదా ప్రేమ పూర్వకంగా నచ్చచెప్పుటయే తప్పా అసలేమాత్రం వారిని దండించి నిర్బంధించ కూడదు.. వారిపై మానసిక వొత్తిడులను ఆంక్షలను విధించకూడదు, తుదకు వారి ప్రాణానికే ముప్పు కలిగేలా..

రాజ్యము..

కురూపికి..
బుద్ది మాంద్యము కలవానికి..
అంగ వైకల్యములు కలవానికి..
నిరక్ష్యరాస్యునికి.. శాస్త్ర రహితునికి.. క్రూరునికి..
యుద్దవిద్యలయందు.. రాజనీతియందు, ధర్మాధర్మ..
విచక్షణా జ్ఞానములేని వారికి.. ప్రజాబలము లేని వానికి..
పౌరుష హీనునికి.. అతి సాత్వికునికి.. చంచలునికి..
అసలేమాత్రమూ రాజ్యాధికారము లేదు.. ఉండబోదూ
కూడా.. అటువంటి రాజు సర్వదా లోక కంటకుడే..

ఐశ్వర్యము..

వాడు కన్నకొడుకైనా సరే కట్టుకున్న భార్యైనా సరే..
దేన్ని ఎంతమటికీ ఇవ్వాలో అంతమటికే అందివ్వాలి..

వినియోగ సామర్థ్యం లేని వాడికి, దుస్వభావికి.. సోమరిపోతుకి.. వ్యసన పరుడికి.. లోభికి గుణహీనునికి..
అసాంఘిక విద్యలయందు వ్యామోహం గలవానికి..
వ్యక్తిగత భద్రతయందు.. కార్యనిర్వహణ యందు..
అసలేమాత్రం పరిణితి లేని వాడికి.. ఒక్కనాటికీ
ఐశ్వర్యాన్ని అందివ్వకూడదూ.. శృతిమించిన రీతిలో
వాడిని సంరక్షించ కూడదు కూడా.. సర్వే సర్వత్రా..

అందుకే.. అవతలి వాడేమనుకున్నా..
మరెన్ని వక్రభాష్యాలు పల్కినా..

శాస్త్రాన్ని..
అస్త్రాన్ని..
స్త్రీని..
రాజ్యాన్ని..
ఐశ్వర్యాన్ని..

సర్వే సర్వత్రా సమర్థుడైన వానికే తప్పా..
జాతి హీనునికి.. గుణ హీనునికి.. అసమర్ధునికి..

ఒక్కనాటికీ అందివ్వ కూడదు.. శృతిమించిన స్థాయిలో
అణుప్రమాణ సైతం విశధీకరించ కూడదు కూడా..

ఇదే శాస్త్రం.. ఇదే ధర్మం.. ఇదే శాసనం..
అర్హత లేని దానం సర్వదా "విషాదమే దుఃఖ భూయిష్టమే..

విప్రోత్తములు.. శాస్త్రవేత్తలు.. సద్గురువులు..
సర్వే సర్వత్రా అట్టి పరిపూర్ణ విజ్ఞులై వర్ధిల్లాలని ఆశిస్తూ..

వందే గురుపరంపరాం..

చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు
ఆంగీరస భారహస్పత్య భారద్వాజస త్రయాఋషేయ
ప్రవరాన్విత భారద్వాజస గోత్రః ఆపస్తంభ సూత్రః కృష్ణ
యజుశ్శాఖాధ్యాయీ శ్రీ గౌతమ్ చంద్ర నందకిషోర శర్మ
నామధేయస్య అహంభో అభివాదయే..

గీర్దేవీ దయారవింద బహుముఖ నందన శ్రీ ఆచార్య
గౌతమ్ మనోహ్య కృతమిదం సర్వం శ్రీశారదాంకితం.

దేవీ ఇంద్రాయణీ మానసం మాధుర్య రస శోభితం
సతతం శ్రీవైష్ణవ వందితం శివకేశవ ప్రణమామ్యహమ్.

సర్వేజనా సుఖినో భవంతు..
లోకా సమస్తా సుఖినో భవంతు..

స్వస్తి..

Saturday, October 28, 2017

తెలుగదేలయన్న ? ....Mr Vasireddy Amarnadh Slate Schools

తెలుగదేలయన్న ? ....
" నా బుజ్జి కన్నా ! బంగారు కొండా .. నీకు లాల పోస్తాను .. అయ్యాక వెండి గిన్నెలో చందమామ రావే అంటూ గోరు ముద్దలు తినిపిస్తాను .. అయ్యాక ఇద్దరం కలిసి బజ్జున్దాము . అప్పుడు నీకు కాశీ మజిలీ కథ లు చెపుతాను . సరేనా ... నా చిట్టి తండ్రికి బుగ్గన చుక్క పెట్టాలి .. ఈ రోజు నా దిష్టి తగిలేట్టు వుంది "
అర్థం చెడకుండా దీన్ని ప్రపంచం లోని ఏ ఇతర భాష లో కైనా అనువదించండి చూద్దాం !
కావడం లేదా ? పోనీ దీన్ని ట్రై చెయ్యండి .
" నాకు కడుపు కోత మిగిలిచ్చి వెళ్ళిపోయావు కదరా నా తండ్రీ!.. ఏదో బిడ్డ బాగుపడుతాడు.... మంచి కొలువు సాధిస్తాడు . కడుపులో చల్ల కదలకుండా బతుకుతాడు ....అని నిన్ను ఆ కార్పొరేట్ హాస్టల్ వేయించాను . ఆ నరరూప రాక్షసులు బిడ్డ ఉసురు పోసుకొంటారు అని నేనేమైనా కలకన్నానా ? గర్భశోకం పగవాడికి కూడా వద్దు తండ్రీ !.......... "
కావడం లేదా ?
మీరు ఎంతగా ప్రయత్నించినా కుదరదు .
ఒక భాష స్థానిక భౌగోళిక చారిత్రక పరిస్థితుల నుంచి పుడుతుంది . ఆ స్థానిక సంస్కృతీ కి చెందిన వ్యక్తుల మనోభావాలను వ్యక్తీకరిస్తుంది . ప్రపంచం లో ఒక్కో సంస్కృతీ సమూహానిది ఒక్కో అనుభం .. అలాంటి అనుభవం మరో సమాజం లో వుండే అవకాశం లేదు . కాబట్టి మరో భాషలో ఈ భాషా పదాలకు పర్యాయ పదాలు వుండవు .
ఎస్కిమో భాషలో మంచు కు అరవై పదాలు వున్నాయి . ఒక్కో రకం మంచు ను వారు ఒక్కో లా పిలుస్తారు . ఉదాహరణకు" అపుట్ "అంటే నేల పై ఉన్న మంచు . "పుకాక" అంటే గడ్డలుగా మారిన మంచు. "నిలక్" అంటే మంచి నీటిని తయారు చేసుకోవడానికి అనువైన మంచు . తెలుగు లో అనువాదం చేస్తే ఎలా ఉంటుంది ? ఇది మంచా ? { అపుట్ } . కాదు ఇది మంచు { నిలక్ } . పిచ్చిగా వుంది కదా ? వారిది మంచు ప్రాంతం . కాబట్టి అన్ని రకాల మంచులు . మనకి ఒకటి లేదా రెండు రకాలు అంటే . వారి అవసరాలు వేరు . అవసరాల కొద్దీ భాష.
భాష ఒక తరంనుండి మరో తరానికి సంస్కృతీ ని అందించే డిఎన్ఏ . సంస్కృతీ అంటే అనేక తరాల సంచిత విజ్ఞానం . అంటే ఒక తరం వారు తమ బాషా ద్వారా, తాము తమ జీవితకాలం లో నేర్చుకొన్న దాన్ని అలాగే తమ పూర్వీకులు తమకు నేర్పిన దాన్ని కింది తరాల వారికి అందిస్తారు . భాష ను మరచిపోతే ఇక ఆ సంస్కృతీ అంతరించినట్టే . సంస్కృతి అంతరించడం అంటే మన పూర్వీకుల ఎన్నో వేల సంవత్సరాలుగా తమ అనుభవంనుండి మనకు అందించిన పాటలను మరచిపోవడమే .
తెలుగేల యన్న .. తెలుగు మన మాతృ భాష . ఈ ప్రాంతం లో పుట్టి పెరిగిన మన జాతి సంపద . వారసత్వం . సంచిత విజ్ఞానం . అనుభవాల హారం. మనం తెలుగు మరచిపోతే మన సంస్కృతీ తో , పూర్వీకుల సంచిత అనుభవం తో సంబంధం తెగగొట్టుకొన్నట్టే . అంటే మన అసిత్వాన్ని పోగొట్టుకొన్నట్టే . అప్పుడు ఎండిన పండుటాకుల గాలి ఎటు వీస్తే అటు యెగిరి పోతాం . మాతృ భాష ను మాట్లాడితే మన వేళ్ళు బలం గా ఉన్నట్టు . అప్పుడు ఎంత ఎత్తుకైనా ఎదగ వచ్చు . ఎన్ని దిక్కులైన విస్తరించి వచ్చు .
మాతృ భాష తల్లి పాల వంటిది . ఇంగ్లీష్ భాష డబ్బా పాలు . మీ పిల్లకు తల్లి పాలు దూరం చేస్తారా ? ఉపాధి కోసం ఇంగ్లీష్ నేర్చుకోవలసిందే. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర లేదు . కానీ ఇంగ్లీష్ భాష మోజులో పడి పిల్లల్ని మాతృ భాష కు దూరం చెయ్యకండి . పిల్లలు రెండు మూడు భాష లు చాల సులభం గా నేర్చుకొంటారు . పెద్దయ్యాక కొత్త భాష నేర్చుకోవడం చాల కష్టం . అదే పదేళ్ల లోపు పిల్లలు రెండు మూడు భాష లు చాల సులభం గా నేర్చుకొంటారు . ఒకే భాష నేర్చుకొన్న పిల్లలకన్నా రెండు మూడు భాష లు నేర్చుకొంటున్న పిల్ల మనోవికాసం బాగా జరుగుతుంది . చురుకైన బుద్ధి, గ్రహణ శక్తి కలిగి వుంటారు . వయసయ్యాక అల్జీమార్ వ్యాధి వచ్చే అవకాశం తగ్గి పోతుంది .
చదువు ఆంగ్ల మాద్యం అంటే అది తెలుగు కు వ్యతిరేకంకాదు అని గ్రహించండి . ఏ
మాధ్యమం చదువు అనేది పెద్ద సమస్య కాదు . మాతృ భాష లో మాట్లాడాలి
ఆంగ్ల మాధ్యమం లో చదివే పిల్లలు ఆంగ్లాన్ని స్కూల్ లో నేర్చుకొంటారు . మీరు వారితో ఇంట్లో తెలుగు లోనే మాట్లాడండి . రెండు భాష లు వారు చక్కగా నేర్చుకొంటారు . వినడం , మాట్లాడడం , చదవడం , రాయడం .. ఈ నాలుగు ప్రక్రియల ద్వారా ఒక భాష ను నేర్చుకోవచ్చు . ఇది పీరామిడికల్ గా ఉంటుంది . మన స్కూల్స్ లో దీన్ని తలకిందులు చేసి.... అంటే ముందుగా రాయడం తో ఇంగ్లీష్ భాష నేర్పుతారు . అందుకే పిల్లలు సరిగా ఇంగ్లీష్ నేర్చుకోరు. అదేంటి అంటే" మీరు ఇంట్లో కూడా ఇంగ్లీష్ లో మాట్లాడితేనే పిల్లకు ఇంగ్లీష్ వస్తుంది "అంటారు . అలాంటి మూర్ఖ గురువులకు చెప్పండి .. తల్లి పిల్లలకు భాష నేర్పించినట్టే అంటే పిల్లలతో చిన్న చిన్న మాటలతో మాట్లాడడం .. వారు దాన్ని తిరిగి చెప్పేలా చెయ్యడం .. బాషా బోధనా ఇలా జరగాలి అని . భాషా బోధనలో తల్లి కి మించి న గురువు లేదు . అందుకే మాతృ భాషా అన్నారు . తల్లి తండ్రీ గురువు అన్నారు .
పరాయి భాషా పై మోజు తో మీ పిల్లల్ని ఈ రోజు తెలుగు కు దూరం చేస్తే వారికి కన్న ప్రేమ దూరం అయినట్టే .. వారు రేపు మిమ్మల్ని వృద్దాశ్రమాల్లో దించేస్తారు . పిల్లి మియ్యావ్ అంటుంది . కుక్క భౌ భౌ అంటుంది . ఇంగ్లీష్ వాడు ఇంగ్లీష్ లో తాను మాట్లాడడం కాదు . ప్రపంచానికి తన భాషా ను నేర్పాడు . తమిళులు ఆరు తరాలు దాటినా మలేషియా సింగపూర్ దక్షిణాఫ్రికా లాంటి దేశాల్లో ఇంకా స్వచ్ఛమైన తమిళాన్ని మాట్లాడుతున్నారు .
తెలుగు వారికి మాత్రం తెలుగు లో మాట్లాడడం నామోషీ . వెనకపాటు తనానికి చిహ్నం . పోనీ ఇంగ్లీష్ లో నైనా చక్కగా మాట్లాడుతారా అంటే అది ఉండదు . మొత్తం సంకర భాష. ఒక్క భాష లో కూడా సరిగ్గా మాట్లాడలేని దౌర్భాగ్య స్థితి లో ఎవరైనా వున్నారా అంటే అది తెలుగు వారే ! అంతేలే .. సొంత భాష పై మక్కువ లేని వారికి ఇతరత్రా భాష లు నేర్చుకొనే అవకాశం ఎక్కడ ఉంటుంది .
తెలుగు భాష ను కాపాడండి అనే దిక్కుమాలిన స్లోగన్ నేను ఇవ్వను . కాపాడు కోవలసింది మన అస్తిత్వం . మన సంస్కృతీ . మన మనుగడ . మనల్ని మనం కాపాడు కోవాలి అంటే మన భాష ను మనం మరవొద్దు . భాష ను మనం కాపాడ్డం కాదు .. భాష మనల్ని కాపాడుతుంది . తెలుగు కు మన పిల్లలు దూరం అయితే ప్రపంచం లోని అత్యుత్తమ లైఫ్ స్కిల్స్ పాఠాలైన వేమన సుమతి పద్యాలకు , త్యాగయ్య రామదాసు అన్నమయ్య పలుకులకు వారు దూరం అయినట్టే .
త్యాగయ్య .. నాకు సంగీతం రాక పోయినా నేను గురువుగా భావిస్తాను . విగ్రహం తిరుపతి లో ని స్కూల్ లో ఏర్పాటు చేశాను . తిరువయ్యుర్ లో జరిగే ఆయన ఆరాధనత్సవాలకు వెళ్లడం అంటే మహాబాగ్యంగా భావిస్తాను . అయిన పుట్టింది పెరిగింది తమిళనాడు లో. రాసింది తెలుగు లో . తమిళులకు భాష అభిమానం ఎక్కువ . అలాంటి తమిళుల చేతనే తెలుగు పాటల్ని లక్షల సార్లు పాడించిన త్యాగయ్య సాహిత్య ప్రేరణతో , తెలంగాణ ప్రభుత్వం నిర్వహించనున్న తెలుగు మహా సభ లా సందర్భం గా నైనా ఒక్క ప్రతిన పూనండి . ఇంట్లో తెలుగు మాట్లాడుదాం . తెలుగు వారితో తెలుగులోనే మాట్లాడుదాం .
యాస లు భాష లో ఊడలు లాంటివి . ఎన్ని యాసలుంటే అంత దూరానికి ఊడల మర్రి విస్తరిస్తుంది . యాసల్ని గౌరవం చండి . భాష ను ప్రేమించండి . అప్పుడే మానవత్వం పరిమళిస్తుంది . ఎందరో మహానుభావులు .. అందరికి వందనములు

Total Pageviews