Tuesday, October 24, 2017

నేనింత వరకూ విగ్రహరాధాన చేయని ముస్లిం ని క్రిస్టియన్ ని, అంతెందుకు ఏ ఒక నాస్తికుణ్ణి కూడా చూడలేదు. -స్వామి వివేకానంద..

నేనింత వరకూ విగ్రహరాధాన చేయని ముస్లిం ని క్రిస్టియన్ ని, అంతెందుకు ఏ ఒక నాస్తికుణ్ణి కూడా చూడలేదు.
-స్వామి వివేకానంద..

భగవంతుడు అన్నిటా వున్నానని చెప్పినప్పుడు హిందువులు విగ్రహారాధన ఎందుకు చేస్తారు?

ఒకసారి వివేకానందుడు ఇప్పుడు రాజస్తాన్ లో వున్నా అల్వార్ సంస్థానాధీశుని దగ్గరకు వెళ్ళాడు.

విగ్రహారాధానని వెక్కిరించడానికి ఆ రాజు వివేకానందునితో నాకు విగ్రహారాధన పట్ల విశ్వాసం లేదు, రాయినీ, రాప్పనీ, కర్రనీ, లోహాన్నీ ఎవరయినా ఎలా ఆరాధిస్తారు? ప్రజలు అపోహలో వున్నారు, కేవలం సమయం వృధా చేసికుంటున్నారు’ అన్నాడు.

స్వామీజీ నవ్వుతూ స్పందించారు...

రాజు సహాయకుడిని అక్కడ గోడకి వ్రేలాడుతూ వున్న రాజు చిత్ర పటాన్ని క్రిందకు దించమన్నారు.

అయోమయం లో పడిన ఆ సహాయకుడు స్వామీజీ చెప్పినట్లే చేసారు.

అప్పుడు స్వామీజీ ఆ పటం పై వుమ్మివేయమని రాజు సహాయకుడిని ఆదేశించారు.

నిర్ఘాంత పోయిన సహాయకుడు రాజు వైపూ, స్వామీజీ వైపూ చూస్తూ ఉండిపోయాడు.

స్వామీజీ మళ్ళీ, మళ్ళీ ఆదేశించారు. ప్రతీ సారీ మరింత తీవ్రంగా ఆదేశించ సాగారు.

రాజు ఆగ్రహోద్రకుడవుతున్నాడు, సహాయకుడు వణికి పోతున్నాడు.

చివరికి సహాయకుడు ‘నేను ఈ పటం పై ఎలా ఉమ్మగలను? పటం లో వున్న చిత్రం  లో మా రాజు వున్నారు అంటూ అరిచాడు.

అప్పుడు స్వామీజీ ‘రాజు నీ ఎదురుగా వ్యక్తిగతంగా కూర్చుని వున్నారు. ఆ పటం లో వున్నది ఒక కాగితం మాత్రమె. అది మాట్లాడలేదు, వినలేదు, కదలలేదు. కానీ నువ్వు ఆ పటం పై ఉమ్మి వేయనంటు న్నావు, ఎందుకంటే నువ్వు ఆ పటం లో నీ రాజు ని చూసికుంటున్నావు కాబట్టి ఉమ్మి వేయనంటు న్నావు. ఆ పటం మీద ఉమ్మితే నీ రాజు మీద ఉమ్మినట్లని నువ్వు అనుకుంటున్నావు’ అన్నారు.

స్వామీజీ ని చూసిన రాజుక సామీజీ ముందర సాష్టాంగ పడ్డాడు, స్వామీ చెప్పదలుచుకున్నది తనకి పూర్తిగా అర్ధమయిందని ఆ రాజు చెప్పాడు.

ఇదే విగ్రహారాధన యొక్క సారము.

భగవంతుడు అన్నిచోట్లా వున్నాడు. కానీ మనం ఆయనని పూజించాలనుకుంటాము, కోరికలను కోరాలను కుంటాము, నివేదన చేద్దామను కుంటాము, కధలు చెప్పాలని అనుకుంటాము, స్నానం చేయించాలని అనుకుంటాము, ఆడుకోవాలనుకుంటాము,

మనం మన జీవితాలతో ఏమి చేస్తామో అన్నీ భగవంతునితో చేయించాలని అనుకుంటాము.

ఫోటో ఐనా, విగ్రహం రూపంలో వున్న భగవంతుని ఆకారాన్ని మనం మన సహచరుడు గానూ, మార్గ దర్శకునిగానూ, స్నేహితుని గానూ, రక్షకునిగానూ, ప్రసాదించే వానిగానూ, సాటి మనిషి గానూ భావించుకుంటూ ఉంటాము.

విగ్రహము/ఫోటో మనం చూడగలిగే యదార్ధ  ప్రతినిధి.

నేను ఆ విగ్రహపు కన్నులలోనికి చూస్తున్నప్పుడు, నాకది రాయిలాగానో, లోహం లాగానో కనిపించదు. మరొక జత కన్నులు ప్రేమతో నన్ను నవ్వుతూ చూస్తున్నట్లు అనిపిస్తుంది అని చెప్పారు వివేకానంద..

విగ్రహం నిగ్రహం కొరకే.
హిందువులు విగ్రహ ఆరాధకులు అని చెప్పే క్రైస్తవులు సిలువ గుర్తు లాకెట్‌ను మెడలో ధరించడం, క్రీస్తు, మేరీమాత చిత్ర పటాలను ఇంటిలో గోడలకు తగిలించుకోవడం విగ్రహారాదన క్రిందకు రాదా ?
అలాగే ముస్లింలు 786 నంబరును తమ వాహనాలపై వ్రాయించుకోవడం, మక్కా మసీదు చిత్ర పటాలను ఇంటిలో గోడకు తగిలించుకోవడం విగ్రహారాధన క్రిందకు రాదా ? అని అంటున్న Muthenna Joola

మనకు దేని పైనైనా ఒక భావం కలగాలంటే మనం దాని గురించి అనుభూతిని అనుభవించాలి.
అంటే భౌతికమైన అనుభవం కావాలి.
చివరకు మన కంటికి కనిపించని గాలిని అర్ధం చేసుకోవాలంటే కూడా, అవగాహన కావాలి, దానికి భౌతికమైన అనుభవం కావాలి.
గాలి మనకు కనిపించకున్నా మనకు స్పర్శ ద్వారా అనుభవానికి వస్తుంది.

మనకు ఏమీ కనిపించకుండా పారదర్శకంగా ఉంటే దానిని శూన్యం అంటాము.

మనకు వస్తువు ఉండి కూడా కనిపించకుండా ఉండడానికి కారణం అంధకారమన్నా కారణం కావాలి లేదా అంధత్వం అన్నా కారణం కావాలి.

ఆస్తికులు దేవుడు ఉన్నాడనుకుంటే మనం భౌతికంగా అనుభూతిని అనుభవించాలి...
అది ఏ మతానికి సంభందించినదైనా...

వాల్ల వివరణ ప్రకారం దేవుడికి రూపం లేకపోతే...
వాళ్ళు చెప్పేవిధంగా,
దేవుడు దయామయుడు, దేవుడికి ప్రేమ కలిగింది,
దేవునికి ఆగ్రహం కలిగింది,
దేవుడు ఇలా చెప్పినాడు లేదా అలా చెప్పినాడు అంటే దేవుడిని ఎలా, ఎవరిలా ఊహించుకోవాలి!?

ఆయన సద్గుణాలను ఎలా అన్వయించుకోవాలి!?
ఎలా ఆరాధించాలి!?

ప్రకృతిమయమైన దైవాన్ని మనకు ఆధారభూతమైన మంచి గుణాలున్న మనిషిలో, పశువులో, పక్షిలో, చెట్టు చేమలలో, ధాన్యం, పుష్పం, ఫలాలలో....
నింగి, నేల, నీరు, నిప్పు, గాలి అనే పంచభూతాలలో దర్శించి, ఆరాధించడంలో తప్పు పట్టడం అనేది...
అహంకారమనే అంధత్వం!

దేని పైనైనా గురి కలిగితేనే గౌరవం ఏర్పడుతుంది...
గౌరవం ఏర్పడితేనే విశ్వాసం కలుగుతుంది...
విశ్వాసం కలిగతేనే భక్తి జనిస్తుంది...

ఆ భక్తిని ఆస్వాధించడమే భగవంతుడు...

అప్పుడు అది నిరాకారం, నిర్గుణం, నిరామయం, నిరంజనం, నిరంకశం, నిర్వికల్పం.
మల్లీ అప్పుడే సౌశీల్యుడు, సకల సౌభాగ్యవంతుడు, సౌందర్యవంతుడు, సద్గుణ సంపన్నుడు, మనోరంజనుడు, దయామయుడు, కరుణామయుడు, కల్పతరువు! ఇదే సనాతన ధర్మం

జై హింద్..!🇮🇳

No comments:

Post a Comment

Total Pageviews