కార్పొరేట్ సంస్థ లో పిల్లల్ని చేర్పించే పేరెంట్స్ ఆలోచన విధానం , వారు అడిగే ప్రశ్న లు ఎలా ఉంటాయి . వాటికీ నా సమాధానాలు ఎలా ఉంటాయి ? ఊహాజనిత కార్పొరేట్ విద్య సంస్థ పేరెంట్ తో నా చర్చ , అందరి అవగాహన కోసం ...
1 ." మీరు లైఫ్ స్కిల్స్ తో కూడిన హోలిస్టిక్ విద్య కావాలి అంటున్నారు . అంటే ఆత్మ విశ్వాసం , బాగా మాట్లాడగలగడం మొదలైనవి . వీటి కోసం వక్తుత్వపు పోటీలు చర్చలు , స్పోర్ట్స్ లాంటి వాటిలో పాల్గొంటే చదువు దెబ్బ తింటుంది . ఆరవ తరగతి నుంచే మాథ్స్ ఫిజిక్స్ పై దృషి పెట్టి చదివి టెన్త్ కల్లా ఇంటర్ సిలబస్ పూర్తీ చేస్తేనే ఐఐటీ లో సీట్ వస్తుంది . అయినా లైఫ్ స్కిల్స్ దేమి ఉందండీ. ఐఐటీ లో చేరాక నేర్చుకొంటారు లే!"
"సరే నండీ ...మీరు కూడా నాలుగేళ్ళ పాటు కేవలం పిండి పదార్తాలు ఇచ్చే వరి అన్నం మాత్రమే తినండి . అటు పై నాలుగేళ్లు ప్రోటీన్స్ ఇచ్చే పప్పు ,కాయగూరలు ఇంకా మాంసకృత్తులు ఇచ్చే ఆహార పదార్థాలు తీసుకొందురు . బాలన్స్ అయిపోతుంది కదా ? "
2 ." ఐఐటీ లో సీట్ వస్తే ఇక లైఫ్ లో హ్యాపీ గా సెటిల్ అయ్యినట్టే !"
" ఐఐటీ లో సీట్ వస్తే జీవితం అనే సినిమా కు శుభం కార్డు పడినట్టు మీరు అనుకొంటున్నారు . కానీ నిజానికి అప్పుడే జీవితం సినిమా కు తెర లేస్తుంది . బట్టి పధ్ధతి లో ఐఐటీ సీట్ వచ్చినా అటుపై ఎందుకు కొరగాకుండా పోతారు "
3 . " అయినా అవతలి పిల్లలు పండగలు పబ్బాలు అని చూసుకోకుండా రోజుకు పదహారు గంటలు చదువుతుంటే మా పిల్లలు ఆలా చెయ్యక పొతే వెనక పడి పోరా ? "
" కండలు పెరగాలి అని ఒక వ్యక్తి స్టెరాయిడ్ ఇంజక్షన్ తీసుకొంటున్నాడు. మీరు అలాగే చేస్తారా ?"
" కండలు పెరగాలి అని ఒక వ్యక్తి స్టెరాయిడ్ ఇంజక్షన్ తీసుకొంటున్నాడు. మీరు అలాగే చేస్తారా ?"
4 ." మీరనేది ఏంటి . అసలు ఐఐటీ కి లేదా మెడిసిన్ కు పిల్లలు తయారు కావొద్దా?"
" బ్రహ్మాండం గా తయారు కావొచ్చు . వారికి దానికి తగిన ఆప్టిట్యూడ్ ఉంటే అభిరుచి ఉంటే చక్కగా పోటీ పడవొచ్చు. కానీ అది లేని పిల్లల్ని బలవంతగా ఆ దారి లోకి తోయ్యడమే తప్పు ".
5 . " అంటే మా పిల్లలకు ఐఐటీ లో సీట్ సంపాదించే సామర్త్యం లేదా ? అంటే వారు పనికి రాని వారు అనా ?
" ఎంత ట్రైనింగ్ ఇచ్చినా నెమలి గద్ద లా ఎగర లేదు . సింహం అసలు ఎగర లేదు . సింహం లాంటి మీ అబ్బాయి ని నెమలి లాంటి మీ అమ్మాయిని మీరు గద్ద ఫ్లైయింగ్ కోచింగ్ లో చేర్పించి ఎగరమని బలవంత పెడుతున్నారు .
6 . " ఐఐటీ గద్ద అయితే మరి సింహం ఏది ? ఐఏఎస్ ? ఏది గొప్ప ?
' ఏది గొప్ప కాదు . ఏది తక్కువ కాదు . దేని సామర్త్యం దానిది . అయ్యో గద్ద లా ఎగర లేక పొయ్యాను నేను .. కనీసం నా కొడుకునైనా గద్ద కోచింగ్ లో చేర్పించి ఎగిరే లా చేస్తాను అని సింహం అనుకోదు. సింహం లా కండరాలు రావాలని గద్ద అనుకోదు . వాటి వాటి అలవాట్ల తో జీవన విధానం తో అవి హ్యాపీ . అలాగే మనం కూడా . నాకు టీచింగ్ అంటే హ్యాపీ . ఎన్ని గంటలు పాఠాలు చెప్పిన బోర్ కొట్టదు. సో నాకు టీచింగ్ గొప్ప . మరొకాయనకు డాక్టర్ వృత్తి అంటే ఇష్టం . రోజంతా పేషెంట్స్ తో గడిపినా ఆయనకు సంతోషమే . ఎవరి అభిరుచి ని బట్టి వారు వృత్తి ని ఎంపిక చేసుకొంటే ఆ రంగం లో మంచి పురోగతి సాధిస్తారు .
7 . "మా వాడు కార్పొరేట్ లో చదవక పొతే అటు పై ఐఐటీ సీట్ సాధించలేక పొతే మా బంధువులు మిత్రులు ఏమను కొంటారు ? మాకు తలా తీసేసి నట్టు ఉండదా ? "
" తప్పు దారి చూపే అవతలి వారి గురించి పట్టించుకోవడం మానెయ్యండి . ఒక వేళా వాళ్లే వచ్చి కెలికితే " మేము మా ఫాల్స్ ప్రెస్టేజ్ కోసం పిల్లని రాచి రంపాన పెట్టె తల్లి తండ్రులు కాదు అని చెప్పండి . కల చక్రం గిర్రున తిరుగు తుంది . సంపూర్నత్మక విద్య నభ్యసించిన మీ అబ్బాయి / అమ్మాయి జీవితం లో మంచి స్థానాలకు ఎదుగుతారు . మంచి దారి చూపుతారు . అప్పుడు వారి ముందు బట్టి చదువుల పిల్లలు ఉద్యోగాల కోసం నిలుస్తారు . ... సో మీరు చెయ్యాల్సింది అలాంటి పేరెంట్స్ ను చూసి జాలి పడాలి . అలాంటి పిల్లల తో EMPATHIZE చెయ్యాలి . . అజ్ఞానం లో వుంటూ కన్న బిడ్డలా జీవితాల తో ఆడుకొంటున్న అలాంటి పేరెంట్స్ కళ్ళు తెరిపించాల్సింది మీరే. . సరైన దారి లో వెళుతూ సిగ్గు పడడం దేనికి . నలురికి ఆదర్శంగా నిలవాలి కానీ !
No comments:
Post a Comment