Sunday, October 22, 2017

"సింహం తన కొడుకును, గద్దలా ఎగరాలి అని చెప్పి కోచింగ్సంస్థ లో చేర్పించదు

"సింహం తన కొడుకును, గద్దలా ఎగరాలి అని చెప్పి కోచింగ్ సంస్థ లో చేర్పించదు. అలాగే గద్ద సింహం లా కండలు రావాలి అని అనుకోదు . దేని లైఫ్ దానిది" అని మీరు పెట్టిన పోస్ట్ బాగుంది . కానీ సింహం అడవికి రాజు కదా సర్ . అలాగే అన్ని ఫీల్డ్స్ లో కెల్లా రాజు లాంటి ఫీల్డ్ ఏది ? ... మెసెంజర్ లో ఒక మిత్రుని ప్రశ్న .
సింహం తాను అడవికి రాజు అని మనకు ఎప్పుడైనా చెప్పిందా అండీ . అది మన పైత్యం . HIERARCHY అనేది మనిషి సృష్టి . ఒకటి ఎక్కువ మరొకటి తక్కువ ..ఇవన్నీ మనిషి సృష్టించుకొన్నవి . సహజీత ప్రవర్తన కనబరిచే జంతువుల్లో ఇలాంటి నిచ్చిన శ్రేణి ఉండదు .
సింహం అంటే అన్ని జంతువులకు భయం అని కదా మనం అనుకొంటాము . నేను కెన్యా లోని మాసాయి మారా అడవులకు వెళ్ళినప్పుడు వందల కొద్దీ సింహాలను ఇంకా అనేక జంతువులను రెండు రోజులు చూసా . అడవి దున్న లు సింహాన్ని ఎత్తి అవతల పడేస్తాయి . సింహం కాచి ఉండి ఒంటరిగా దొరకిన అడవి దున్న పై మాత్రమే దాడి చేస్తుంది . అంతే కాదు . అప్పుడు నాకు సింహం పై తెగ జాలి వేసింది . పొద్దున్న లేస్తే జింక లాంటి గడ్డి మేసే జంతువులకు ఎక్కడ పడితే అక్కడ ఆహారం దొరుకుతుంది . కానీ సింహం సంగతి ఆలా కాదు . ప్రాణాలకు తెగించి గంట వేటాడితే నే ఆహారం . ఆ ప్రయత్నం లో ప్రాణం పోవచ్చు . అంతే పొద్దున్న బ్రేక్ ఫాస్ట్ అనేది సింహానికి ఒక గండం . ఒకటి రెండు రోజులు ఏదైనా జంతువును చంపి ఆహారం తినక పొతే సింహం నీరసిస్తుంది . అటు పై అది వేట లో విజయం సాధించే అవకాశం తక్కువ . అంతే ఆకలి చావు చావాలి . సో పీత కష్టాలు పీతవి .. సింహం కష్టాలు సింహానివి .
సివిల్స్ లో టాప్ RANKS సాధించిన వాళ్ళు ఐఏఎస్ అటు పై I p s ఎంచుకొంటారు . అటు పై కస్టమ్స్ ఇన్కమ్ టాక్స్ సర్వీస్ లు ఎంచుకొంటారు . నా స్టూడెంట్ ఒకరికి 120 రాంక్ వచ్చింది . సో ఐఏఎస్ రాదు . సరే IPS ఆప్షన్ ఇచ్చి ఉంటే బాగుండేది మీరు ఎందుకు ఇన్కమ్ టాక్స్ సర్వీస్ కు ప్రిఫెరెన్సు ఇచ్చారు అని అడిగా ? దానికి అతను చెప్పిన సమాధానం .. "సర్ పోలీస్ ఆఫీసర్ ఆంటే భయపడేది దొంగలు... దారి దోపిడీ గాళ్ళు.. అలాంటి వారే పోలీస్ ఆఫీసర్స్ ముందు చేతులు కట్టుకొని నిలబడతారు .. అదే ఇన్కమ్ టాక్స్ అయితే డబ్బున్న ఆసాములు చేతులు జోడించి నిలబడుతారు" అన్నాడు . అతని లాజిక్ అతనిది .
నిజమే .. ఐఏఎస్ వచ్చినా ఏదో అసంతృప్తి తో జీవితాన్ని గడిపిన వారిని చూసా .. మిఠాయిలు అమ్ముకొని పుల్ల రెడ్డి అయినా వారిని మనం అందరం చూసాం . చేతి నిండా డబ్బు వున్నా రోగాల తో మనశాంతి లేక జీవచ్ఛవాల్లా బతికే వారు ఎంతో మంది . చిన్న ఉద్యోగమో వ్యాపారమో చేసుకొన్నా హ్యాపీ గా బతికే వారు కొంత మంది .
మనం ఎంత సంతోషముగా జీవితం గడుపుతున్నాము అనేదే ముఖ్యం . సృష్టి లో మనలా మరొకరు లేరు . అలాంటప్పుడు మన జీవితాన్ని మరొకరితో పోల్చడం సరి కాదు . మనం హ్యాపీగా బతుకుతున్నామా లేదా అనేదే ముఖ్యం . అలంటి హ్యాపీ లైఫ్ కోసం వ్యక్తిని సన్నద్ధం చేసేదే విద్య . మన happiness సమాజిక వసరాలకు అనుగుణం గా ఉండాలి అని ప్రత్యేకం గా చెప్పనక్కర లేదు .

No comments:

Post a Comment

Total Pageviews