Wednesday, October 25, 2017

ఏకాగ్రత

ఒక అమ్మాయి గుడికి వెళ్ళి తిరిగి వచ్చింది... దర్శనం బాగా జరిగిందా తల్లీ, అని ఆమె తండ్రి ప్రశ్నించారు.....

కూతురు:  ఇక మీదట నన్ను ఎపుడూ గుడికి వెళ్ళమనకండి నాన్నాగారు... కోపంగా చెప్పింది..
తండ్రి: ఏం జరిగింది తల్లీ
కూతురు: గుడిలో ఒక్కరంటే ఒక్కరు దేవుని మీద ధ్యాసతో లేరక్కడ. అందరూ వారి మొబైల్ ఫోన్లలో మాట్లాడడం, ఫోటోలు తీయడం, భక్తికి సంభందించినది కాక వేరే విషయాలు చర్చించడం చేస్తున్నారు. కనీసం భజనలు వద్ద కూడా సరైన పద్దతులలో ఉండడం లేదు . ఎవరిలోను నాకు భక్తి కనిపించ లేదు.
తండ్రి: ( కాసేపు మౌనం పాటించి) సరే.. నువ్వు తుది నిర్ణయం తీసుకొనే ముందు నాదోక్క చిన్న కోరిక.. చేస్తావా...
కూతురు: తప్పకుండా నాన్నాగారు.. మీమాట ఎపుడూ కాదనలేదు. చెప్పండి ఏమి చేయాలో....
తండ్రి:  ఒక గాజు గ్లాసుతో నిండా నీళ్ళు తీసుకొని వెళ్ళు గుడికి.. మూడంటే మూడే ప్రదక్షిణలు చేసి రావాలి.. అయితే చిన్న గమనిక.. నీ గ్లాసు నుంచి ఒక్క చుక్క కూడా నీరు తొలకరాదు సుమీ... ఈ పని చేయగలవా.....
కూతురు:  అలాగే నాన్నాగారు. తప్పకుండా చేస్తాను మీకోసం. అని ఒక గ్లాసుతో నీరు తీసుకొని బయలు దేరింది.. ఒక మూడు గంటల తరువాత ఇంటికి గ్లాసు నీటితో తిరిగి వచ్చింది..
కూతురు: ఇదిగో నాన్నాగారు.. నే గుడికి ఈ గ్లాసు నీళ్ళతో వెళ్ళి మీరు చెప్పిన విధంగా మూడు ప్రదక్షిణలు పూర్తి చేసి వచ్చాను. ఒక్క నీటి చుక్క కూడా తొణకలేదు..
తండ్రి మూడు ప్రశ్నలు వేసారు.
1. నువ్వు ప్రదక్షిణ చేస్తున్నపుడు ఎంతమంది తమ మొబైల్ ఫోన్లో మాట్లాడుతున్నారు.?
2. ఎంత మంది అనవసర విషయాలు గుడిలో చర్చిస్తున్నారు ?
3. ఎంత మంది అసలు భక్తి అనేది లేకుండా ప్రవర్తించారు?
కూతురు: నేనేలా చెప్పగలను నాన్నాగారు.. నాదృష్టి గ్లాసు నుంచి ఒక్క చుక్క కూడా పడకుండా చూసుకోంటున్నాను కదా..
తండ్రి: ఇదే నమ్మా నే చెప్పదలచుకోన్నది. నువ్వు గుడికి వెళ్ళినపుడు నీ దృష్టి భగవంతుని విగ్రహం మీద, నీ ధ్యాస ఆయన కరుణ మీద ఉండాలి. అపుడు నువ్వు అంతఃముఖివై భగవంతుని పొందగలవు. జీవితం వృద్ది చెందడానికి ఈ విధమైన ఏకాగ్రత సాధించాలి.
కూతురు:  ధన్యురాలిని నాన్నాగారు... ఈ రోజు నాకు భగవంతుని గుడి అన్నది ఎందుకు ఏర్పచుకొన్నామో, అంతఃర్ముఖులు అవడం అంటే అనే విషయాలపై అవగాహన కలిగించారు..
 🙏🙏🙏

No comments:

Post a Comment

Total Pageviews