Wednesday, October 11, 2017

కష్టాల్ని కూడా నేర్పండి...

కష్టాల్ని కూడా నేర్పండి...

పూర్వం కష్టం అంటే -
తినడానికి సరైన తిండి దొరక్కపోవడం...
చదివినా ఉద్యోగం రాకపోవడం...
భార్యకి భర్త పోరు, అత్త పోరు...
ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు...
ఆరుగాలం కష్టపడిన రైతుకి
పంట చేతికి అందకపోవడం...
ఇంటిల్లిపాది ఒక్కరి సంపాదనతో బ్రతకడం...
చాలీచాలని జీతాలు... ఇలా ఒక స్థాయిలో ఉండేవి...
మిగతావాటికి చాలా వరకు సర్దుకుపోయేవారు, సరిపెట్టుకునేవారు...

ఇప్పుడు కష్టం రూపురేఖలు మారిపోయాయి -
పరీక్ష తప్పినా...
అమ్మ తిట్టినా...
నాన్న కొట్టినా...
పాఠాలు నేర్పే గురువు అరిచినాఁ...
నచ్చిన చీర కొనకపోయినా... కష్టాలే..! 
ఇప్పటి వారి కష్టాలకి కారణం ఒక్కటే -
అనుకున్నది దొరకాలి - అప్పుడు కష్టం లేనట్లు...
పిన్నీసు దొరక్కపోయినా, ప్రాణం పోయినంత కష్టం వచ్చినట్లు బాధలు పడిపోతున్నారు...!

అప్పట్లో మనస్సు (will power) చాలా బలంగా ఉండేది... ఎందుకంటే, చిన్న నాటి నుండి కష్టాలు తట్టుకుని పెరిగేవారు...

ఇప్పుడు మాత్రం కష్టం అంటే ఏంటో తెలియకుండా, తల తాకట్టు పెట్టయినా, పిల్లలు కోరిందల్లా వాళ్ళ కాళ్ళ ముందు పెడుతుంటే, మానసిక బలం తగ్గిపోబట్టి... వాళ్ళకిప్పుడు ప్రతీది కష్టమే..!

కనుక, కొత్త తరం పెద్దలకి చెప్పేది ఏంటంటే... పిల్లల్ని చదివించండి... కానీ, దాంతో పాటే కష్టపడడం కూడా నేర్పండి...

మీరు ఎంత కష్ట పడ్డారో... పడుతున్నారో... తెలియజేస్తూ పెంచండి... అంతే కానీ, "మేము పడుతున్న కష్టాలు చాలు,
పిల్లలెందుకు కష్టపడాలి..?", అని అనుకోవడం చాలా పెద్ద తప్పు... పొరపాటు..!

No comments:

Post a Comment

Total Pageviews