Friday, December 11, 2015

1996... వేదికపై నా ప్రమాణ స్వీకారానికి వచ్చిన ప్రముఖులతో కరచాలనం చేయడానికి వెళ్ళాను.ముందుగా పి వి నరసిమ్హారావుగారి దగ్గరకు వెళ్ళి చేయి అందించాను.వారూ చేతులు కలిపారు...ఐతే ఎవరికీ తెలియని విచిత్రం ఒకటి జరిగింది అక్కడ.

మా ఇద్దరి చేతులు కలిసినప్పుడి ఒక "చీటీ" ఒకటి పి వి నరసిమ్హారావుగారు నా చేతిలోకి పంపారు.అంతే చాకచక్యంగా అది నా జేబులోకి వెళ్ళిపోయింది.
తరువాత అది తెరిచి చూశాను "ఆయుధం సిధ్ధంగా ఉంది.ఎప్పుడయినా పరీక్షించుకోవచ్చు".అని ఉంది.

.............. అటల్ బిహారీ వాజపయి గారు స్వర్గీయ పివి నరసిమ్హారావుగారు చనిపోయాకా సంస్మరణ సభలో "భారత దేశ అణుబాంబు సామర్ధ్యం" వెనుక ఉన్న అసలు వ్యక్తి గురించి చెప్పిన సత్యం.అందరూ అనుకున్నట్టు అణు సామర్ధ్యం క్రెడిట్ పూర్తిగా భారతీయ జనతాపార్టీ ది కాదని దానివెనుక పివి ఉన్నారని . ఇది కాంగ్రెస్ కు కుడా తెలియదని ప్రపంచానికి చాటిచెప్పిన సంఘటన.

పివి నరసిమ్హారావు గారు అంటే పాములపర్తి వేంకట నరసిమ్హారావుగారు . ఈయన స్వచ్చమైన 16 అణాల తెలుగువారు.... ఇదే ఈయన ని ఏకాకిని చేసింది.
ప్రపంచం గుర్తించాకా గానీ భారతీయులు గుర్తించని జాతి వజ్రం

ఒక తత్వ వేత్త , ఒక బహుభాషాకోవిదుడూ , ఒక గొప్ప ఆర్ధిక వేత్త , మహా రాజనీతిఙ్ఞుడు ,స్వాతంత్ర్య సమరయోధుడూ అయినాకుడా ఎక్కడ ఈయన పేరు బయటికి వస్తే నెహ్రూ ప్రతిష్ఠని మించిపోతాడని భయపడి సోనియా అనుయాయులచే ఈ సూర్యుడికి "అరచేయి" అడ్డం పెట్టడం జరిగింది.

అసలు భారత ఆర్ధిక వ్యవస్థ గురించి మాట్లాడాలంటే పివి నరసిమ్హారావు ముందు , పివి నరసిమ్హారావు తరువాత అని చెప్తారు ప్రపంచ ఆర్ధిక నిపుణులు.

"రాజకీయాల్లో శాశ్వత శతృత్వం , శాస్వత మితృత్వం ఉండదు" అని ఒక సందర్భంలో ఈయన చెప్పిన సమాధానం ఇప్పటికీ పతాక శీర్షికలను అంటుతూ ఉంటుంది.

ఈయన భారతదేశానికి ఆర్ధిక సంస్కరణల పితామహుడు.

1991:- మోయలేనన్ని అప్పుల భారంతో దేశ ఖజానా దివాళా తీయడానికి సిధ్ధంగా ఉన్న సమయంలో ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన పివి ప్రపంచం నివ్వెరపోయేంత గా సంక్స్కరణలను ప్రవేశపెట్టి "పడి లేచిన కెరటం" అని ఆర్ధిక రంగంలో విమర్శకులచే ప్రశంశలు అందుకున్న మేటి నగధీరుడు.

ఈయన చేసిన సంస్కరణల కారణంగా దేశీయ బాంకులు ఆర్ధిక మంత్రిత్వ శాఖ నుండీ భారతీయ రిజర్వ్ బాంక్ నియంతృత్వంలోకి తెచ్చారు.ఇలా తేవడం వల్ల 1992 లోనే కాదు...ఈయన పోయాకా కుడా 2008 లో వచ్చిన ఆర్ధిక మాంద్యం భారతీయ బాంకులకు అంటకుండా కాపాడుకోగలిగాము.

1991 వరకూ ఫారెన్ పాలసీ అంటే అమెరికా , బ్రిటన్ వగైరా దేశాల పెత్తనానికి వంతపాడడమే..." మనం విలువనిచ్చే చోట కన్నా మనకి విలువ ఉండే చోటు మనకి శ్రేయస్కరం" అని చెప్పి "LOOK EAST POLICY" అని భారతదేశానికి పరిచయం చేసిన గొప్ప రాజనీతిఙ్ఞుడు.దీనివల్ల మన సంస్కృతికి దగ్గరగా ఉండే ఇండోనేషియా, జపాన్ , తైవాన్ , మయన్మార్ లాంటి చిన్న చిన్న దేశాలతో వాణిజ్యం అన్ని రకాలుగా లాభించి భారతదేశాన్ని నాయకదేశంగా ఆశియా ఖండంలో నిల్చునేట్టు చేసింది.

గొప్ప విద్యావేత్త ఐన పివి నరసిమ్హారావుగారు 16 భాషలలో పండితుడు.
కవి సామ్రాట్ విశ్వనాధ సత్యన్నారాయణ గారి "వేయి పడగలు" ని హిందీ లోకి అనువదించారు ఈయన.

సౌజన్యం :- Surya Prakash

No comments:

Post a Comment

Total Pageviews