Saturday, December 19, 2015

ప్రతిఒక్కరు తప్పక చదవండి.. భగవద్గీత.

భగవద్గీత ఎందుకు చదవాలి?
1. సకల శోకాల నుండి చింతల నుండి బయటపడడం ఎలా సాధ్యం? (భగవద్గీత 2.22)
2. శాంతికి కారణమైనటువంటి అచంచలమైన మనస్సును, విశుద్ధమైన బుద్ధిని పొందడం ఎలా? (భగవద్గీత 2. 66)
3. ఆహారాన్ని భగవంతునికి నైవేద్యంగా పెట్టిన తరువాత మాత్రమే ఎందుకు తినాలి? (భగవద్గీత 3. 13)
4. మన వృత్తులను, ఉద్యోగాలను చేసుకుంటూనే మనస్సుని నిగ్రహించుకోగలమా? (భగవద్గీత 3. 43)
5. భగవద్గీత జ్ఞానము ఎన్ని సంవత్సరాల నుండి మానవునికి లభ్యమౌతున్నది?(భగవద్గీత 4. 1)
6. జన్మరాహిత్యం పొందడానికి మార్గమేమిటి? (భగవద్గీత 4. 9)
7. ధర్మార్థకమమోక్షాలలో దేనిని కోరినా పొందడానికి ఉపాయమేమిటి? (భగవద్గీత 4. 11)
8. గుర్వాశ్రమాన్ని పొందడానికి మార్గమేమిటి?
9. పాపి అయినవాడు దుఃఖసముద్రాన్ని దాటలేడా?
10. మనిషి ఎందుకు దుఃఖాలలో చిక్కుకుపోతున్నాడు?
11. శాంతికి సూత్రమేమిటి?
12. మనస్సు ఎవరికి మిత్రుడు, ఎవరికి శత్రువు?
13. మనస్సును జయించడం ద్వారా శాంతిని పొందగలమా?
14. భగవంతునికి భక్తినికి మధ్య సన్నిహిత సంబంధం ఎలా ఏర్పడుతుంది? భగవంతుడిని చూడడం సాధ్యమేనా?
15. చంచలమైన మనస్సును నిగ్రహించడం ఎలా?
16. కొంతకాలం భక్తితో ఆరాధించి విడిచివేసిన వారి గతి ఏమిటి? ధనవంతుల ఇంటిలో లేదా భక్తుల ఇంటిలో జన్మమెలా కలుగుతుంది?
17 సంపూర్ణమైన జ్ఞానము ఏది?
18. జనన మరణ బంధం నుండి ముక్తిని పొందాలంటే ఏమిచేయాలి?
19. మాయను జయించే ఉపాయమేమిటి?
20. శ్రీకృష్ణభగవానుడు జ్యోతిస్వరూపుడా? లేక ఆకారం ఉన్నదా?
21. భూత భవిష్యత్ వర్తమానాలు తెలుసుకోవడం నాకు సాధ్యమేనా?
22. కృష్ణ భక్తులు ప్రపంచమంతటా ఎందుకు సంచరిస్తారు?
23. ముసలితనం మృత్యువు నుండి బయటపడడం ఎలా సాధ్యం?
24. కేవలం భక్తి ద్వార మనిషి సకలమార్గ ఫలాలను ఏవిధంగా పొందగలుగుతాడు?
25. పాపాలు ఎన్నిరకాలు? వాటిని నశింపజేయడం ఎలా?
26. మన నిజమైన గమ్యస్థానాన్ని చేరుకోవడం ఎలా?
27. దేహాన్ని విడిచిన తరువాత మనిషి తాను కోరుకున్న లోకాన్ని చేరగలడా?
28. మనం నైవేద్యం పెట్టిన ఆహారాన్ని భగవంతుడు స్వీకరిస్తాడా?
29. మనకి సన్నిహిత స్నేహితుడు, శ్రేయోభిలాషి ఎవరు?
30. భక్తియోగంలో ఉన్నవాడు పతనం చెందకుండా రక్షింపబడతడా?
31. భక్తిని చేయడానికి అసలైన అర్హత ఏమిటి?
32. ఈ జగత్తులో సుఖంగా ఉండగలిగే ఉపాయమేమిటి?
33. భ్రాంతిని తొలగించుకోవడం ఎలా?
34. అసంఖ్యాక లోకాలలో పరిభ్రమించే జీవులలో నిజమైన భాగ్యవంతుడు ఎవ్వడు?
35. మానవజన్మ పూర్ణత్వమేది?
36. కోటానుకోట్ల జన్మలలో హృదయంలో ప్రోగుబడిన మాలిన్యము ఏమి చేయడం ద్వారా తొలగుతుంది?
37. దేవాదిదేవుడు ఎవ్వరు?
38. శ్రీకృష్ణుడు అర్జునుడికి విశ్వరూపాన్ని ఎందుకు చూపించాడు? (భగవద్గీత 11. 1)
39. గీతాసారమేమిటి? శుద్ధభక్తి ఏమిటి?
40. దుఃఖానికి కారణం ఏమిటి?
41. దాటడానికి సఖ్యము కానట్టి త్రిగుణములను దాటడమెలా?
42. భగవంతుడిని మనం ముఖాముఖీ చూడగలమా? మాట్లాడగలమా? చెప్పేది వినగలమా?
43. జీవుడు ఒకదేహాన్ని విడిచి వెళ్ళేటప్పుడు వెంట ఏమి తీసుకువెళతాడు?
44. జీవుని స్మృతికి, విస్మృతిని, జ్ఞానమును కలిగించేది ఎవరు?
45. మనిషి భ్రాంతికి లోనుకావడానికి కారణమేమిటి?
46. కార్యసిద్ధికి అవసరమైన ఐదు అంశాలు ఏమిటి?
47. భక్తి ముక్తులలో ఏది ముందు? ఏది వెనుక?
48. జీవితాన్ని ఏ పద్దతిలో మలచుకొని సుఖశాంతులు పొందాలి?
49. భగవంతుడిని చేరుకోవడం ఎలా?
50. సంపద విజయం, అసాధారణ శక్తి, నీతి ఎవరి పక్షాన ఉంటాయి?
ఇవి కొన్ని ప్రశ్నలు మాత్రమే! ఇంకా అనేకానేక ప్రశ్నలకు సందేహాలకు సమాధానాలు అనేకం ఉన్నాయి.. ప్రతిఒక్కరు తప్పక చదవండి.. భగవద్గీత.. 

No comments:

Post a Comment

Total Pageviews